powerplant
-
రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్: భట్టి విక్రమార్క
సాక్షి,పెద్దపల్లిజిల్లా: రామగుండంలో 800 మెగావాట్ల జెన్కో పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం(ఆగస్టు31) భట్టి విక్రమార్క రామగుండం ప్రాంతంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రామగుండంలో ఇప్పటికే ఉన్న పాత జెన్కో పవర్‌ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ‘భవిష్యత్తులో సింగరేణి సంస్థ, జెన్కో సహకారంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్న పాత ప్లాంటు 50 ఏళ్లుగా రాష్ట్రానికి వెలుగులు ఇచ్చింది. ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో నేను ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ ప్రభుత్వంలో ప్లాంటు ప్రారంభించి మాట నిలబెట్టుకుంటా. వీలైనంత త్వరగా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తాం’అని భట్టి తెలిపారు. -
ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి. పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ పుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దాదాపుగా రూ.1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుందని, దీని వల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మూడు ప్లాంట్లకు శంకుస్ధాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నాను. శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతాయని ఆయన అన్నారు. ‘‘నెల్లూరులో క్రిబ్కో ఆధ్వర్యంలో దాదాపుగా రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ వస్తుంది. 12 నెలల్లోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో బయో ఇథనాల్ ప్లాంట్ రెండు దశల్లో ప్లాంట్ పూర్తయితే 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని సీఎం అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొండి. ఇదే నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పతున్న బయో ఇథనాల్ ప్లాంట్ ఇది. దీనివల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.315 కోట్లతో వచ్చే ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. చదువుకున్న మన పిల్లలకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘అదే విధంగా తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ కూడా ఫ్యాక్టరీ పెడుతోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో..ఏటా 16వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధ ఏర్పాటు చేస్తుంది.రూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్థంతో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణకు వెళ్తున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన కేవలం 9 నెలల్లోనే యూనిట్‌ను ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకే.. ‘‘ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల కూడా మరో 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు.. రూ.1425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మనం చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్న మంచి ఘడియలు ఇవి’’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ చొరవతో పరిశ్రమలు: మంత్రి కాకాణి బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ శంకుస్థాపన అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురుచూస్తూ ఉన్నాము. ఈరోజు సీఎం వైఎస్ జగన్ గారి చొరవతో ఇక్కడ ఈ పరిశ్రమలకు శంకుస్థాపన చేసుకోగలిగాము. ఈ పరిశ్రమకు కావాల్సిన భూమిని సమకూర్చిన వారికి పరిహారం కూడా ఇచ్చాము. ఆ కుటుంబాలు ఆర్ధికంగా ఎదగడానికి పరిశ్రమ యాజమాన్యాలు సహకరించాలని ఈ సందర్బంగా వారిని కోరుతున్నాను. రూ. 925 కోట్లతో నిర్మించనున్న ఈ రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ పూర్తయితే స్థానికంగా ఉండే సుమారు 75 శాతం మంది యువతకు ఉపాధి కలుగుతుంది. క్రిబ్కో విశ్వ సముద్ర ప్రవేట్ లిమిటెడ్ అధ్వర్యంలో ఈ రెండు ప్లాంట్స్ ను కాలుష్యం లేకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. -
వేంపెంటవాసులపై కేసు కొట్టివేత
ఆత్మకూరురూరల్: పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో నిర్మితమవుతున్న మినీ జల విద్యుత్ కేంద్రానికి(ర్యాంక్ పవర్) వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామస్తులు , ప్రజాసంఘాల నాయకులపై నమోదైన కేసును సోమవారం స్థానిక జేఎఫ్‌ఎంసి కోర్టు కొట్టివేసింది. 2014 జూన్ 10న పాములపాడు సామాజిక న్యాయం పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై. కోటేశ్వరరరావు, డాక్టర్ నాగన్న, మరో 12 మంది గ్రామంలో విధించిన నిషే«ధాజ్ఞలు ఉల్లంఘించారన్న కారణంతో పోలీసులు ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గ్రామంలో పవర్ ప్లాంట్ నిర్మాణం మానుకోవాలని ఆ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన అన్ని రకాల అనుమతులు ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైకోటేశ్వరరావు ఆధ్వర్యంలో 2014 జూన్ 9 నగ్రామ ప్రజలు కర్నూలు కలెక్టరేట్ ముట్టడించారు. కార్యక్రమం విజయవంతం అయినందుకు ప్రజాసంఘాల నాయకులు ఆ మరుసటి రోజున గ్రామంలో కార్యక్రమ పునః సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న కారణం చూపుతూ పాములపాడు పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు. కాగా సాక్షాధారాలను పరిశీలించిన మీదట ఆత్మకూరు జూనియర్ పస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ రామకృష్ణ కేసును కొట్టి వేశారు. -
గార్గేయపురం వద్ద విద్యుత్‌ప్లాంట్
కర్నూలు (టౌన్): చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కర్నూలులో ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని గార్గేయపురం వద్ద సర్వే నంబర్ 751, 180/2 లో 6 ఎకరాల 178 సెంట్లు కేటాయిస్తు శనివారం ప్రభుత్వం జీవో 204 జారీ చేసింది. బెంగళూరుకు చెందిన నెక్సాస్ నోవోస్ ఇంపోర్టు అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్త్రెవేట్ లిమిటెడ్ అనే సంస్థకు 25 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చినట్లు ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఆర్. కరికాల్ వలవన్ పేర్కొన్నారు. చెత్త ద్వారా విద్యుత్ ప్లాంటుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబును ఆ ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేసింది. -
వేంపెంట దీక్షలకు 500 రోజులు
వేంపెంట(పాములపాడు): పవర్‌ప్లాంటు నిర్మాణ పనులకు వ్యతిరేకంగా వేంపెంట గ్రామ ప్రజలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాటికి వారు చేపట్టిన నిరాహారదీక్షలు 500 రోజుకు చేరుకున్నాయి. అధికార పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి, మాజీ న్యాయశాఖా మంత్రి ఏరాసుప్రతాపరెడ్డిల కుటుంబాలకు చెందిన వారే ర్యాంక్ Sపవర్‌ప్లాంటు యజమానులు అయినందువల్లే ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు విమర్శించారు. గ్రామం మధ్యలో ఉన్న నిప్పులవాగుపై 7.5 మెగా వాల్టుల విద్యుత్ ఉత్పాదన ప్లాంటు నిర్మాణం చేపట్టనున్న విషయం విదితమే. ఈ ప్లాంటు నిర్మాణం చేపట్టడం వల్ల గ్రామానికి అనర్థాలు జరుటుతాయనే ఉద్దేశంతో గ్రామస్తులు అలుపెరుగక పోరాటం చేస్తున్నారు. -
కాంట్రాక్టర్ ఇంటిపై ఐటీ దాడులు
పాల్వంచ: ఖమ్మం జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఇంటిపై సోమవారం ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పాల్వంచలోని కేఎస్పీ రోడ్డులో నివాసం ఉండే వెంకటేశ్వర్లు మూడు రాష్ట్రాల్లో పవర్ప్లాంట్లలో కాంట్రాక్టు పనులు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి వెంకటేశ్వర్లు ఇంటితోపాటు ఆయనకు సంబంధించిన ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. భారీగా ఆస్తులతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్
భద్రాచలం: సీతరామ కళ్యాణోత్సవంలో భాగంగా సీఎం కె.చంద్రశేఖర రావు శుక్రవారం భద్రాచలం చేరుకున్నారు. ఈరోజు రాత్రి భద్రాచలంలో బస చేయనున్న కేసీఆర్ శనివారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం మణుగూరులో విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండటం విశేషం. -
కేసీఆర్ భద్రాచలం పర్యటన నేడే
హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర రావు శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నారు. ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి భద్రాచలం దాకా రోడ్డుమార్గంలోనే ప్రయాణించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ మధ్యాహ్నం సూర్యాపేటలో భోజనవిరామం అనంతరం స్థానిక టీఆర్ఎస్ నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం ఖమ్మం జిల్లాలోని నేతలతో భేటీకానున్నారు. అదేరోజు రాత్రి భద్రాచలంలో బసచేయనున్నారు. అనంతరం కేసీఆర్ శనివారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మణుగూరులో విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండటం విశేషం.