వేంపెంటవాసులపై కేసు కొట్టివేత
Published Mon, Oct 24 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
ఆత్మకూరురూరల్: పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో నిర్మితమవుతున్న మినీ జల విద్యుత్ కేంద్రానికి(ర్యాంక్ పవర్) వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామస్తులు , ప్రజాసంఘాల నాయకులపై నమోదైన కేసును సోమవారం స్థానిక జేఎఫ్‌ఎంసి కోర్టు కొట్టివేసింది. 2014 జూన్ 10న పాములపాడు సామాజిక న్యాయం పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై. కోటేశ్వరరరావు, డాక్టర్ నాగన్న, మరో 12 మంది గ్రామంలో విధించిన నిషే«ధాజ్ఞలు ఉల్లంఘించారన్న కారణంతో పోలీసులు ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గ్రామంలో పవర్ ప్లాంట్ నిర్మాణం మానుకోవాలని ఆ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన అన్ని రకాల అనుమతులు ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైకోటేశ్వరరావు ఆధ్వర్యంలో 2014 జూన్ 9 నగ్రామ ప్రజలు కర్నూలు కలెక్టరేట్ ముట్టడించారు. కార్యక్రమం విజయవంతం అయినందుకు ప్రజాసంఘాల నాయకులు ఆ మరుసటి రోజున గ్రామంలో కార్యక్రమ పునః సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న కారణం చూపుతూ పాములపాడు పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు. కాగా సాక్షాధారాలను పరిశీలించిన మీదట ఆత్మకూరు జూనియర్ పస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ రామకృష్ణ కేసును కొట్టి వేశారు.
Advertisement
Advertisement