vempenta
-
సీఎం జగన్ నిర్ణయంతో వేంపెంటలో ఆనందాలు
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలోని వేంపెంట గ్రామంలో ఆనందాలు వెల్లివిరిశాయి. గ్రామస్తులను కొన్నేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్న పవర్ ప్లాంట్ ప్రాజెక్టును ఆయన రద్దు చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా వేంపెంట గ్రామప్రజలకు ‘‘అధికారంలోకి వచ్చేదాకా స్టే తెచ్చుకుందాం. అధికారంలోకి రాగానే ప్రాజెక్టును క్యాన్సెల్ చేస్తా’’ అని ఆ రోజు మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పవర్ ప్లాంట్ ప్రాజెక్టును రద్దు చేసి వేంపేట ప్రజలపై తన ప్రేమను చాటుకున్నారు. దీంతో ఎనిమిదేళ్ల పోరాటం.. ఐదేళ్ల సుదీర్ఘ రిలే నిరాహార దీక్షల తర్వాత గ్రామస్తులు విజయం సాధించినట్లైంది. -
మాటనిలబెట్టుకున్న వేళ ఊరు నిలబడ్డ వేళ
-
వేంపెంట దీక్షలకు 700రోజులు
వేంపెంట(పాములపాడు): మండలంలోని వేంపెంట గ్రామంలో పవర్‌ప్లాంటు నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం నాటికి 700రోజులకు చేరాయి. ఈ దీక్షల్లో సామ్రాజ్యమ్మ, భారతి, అన్నమ్మ, చిన్నక్క, రూతమ్మ, లచ్చమ్మ, సుశీలమ్మ, దుర్గా సుశీలమ్మ కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. బడాబాబులకు ఊడిగం చేసే ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉండవన్నారు. పవర్‌ప్లాంటు నిర్మాణం వల్ల జరిగే అనర్థాల గురించి చెబుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా నిర్మాణానికి ఎలా అనుమతులు వచ్చాయని ప్రశ్నించారు. తప్పుడు అనుమతి పత్రాలతో నిర్మాణపనులకు శ్రీకారం చుట్టిన ర్యాంక్మినీ పవర్‌ప్లాంట్ యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామానికి నష్టం కలిగించే ఈ పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒçప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. -
వేంపెంటవాసులపై కేసు కొట్టివేత
ఆత్మకూరురూరల్: పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో నిర్మితమవుతున్న మినీ జల విద్యుత్ కేంద్రానికి(ర్యాంక్ పవర్) వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామస్తులు , ప్రజాసంఘాల నాయకులపై నమోదైన కేసును సోమవారం స్థానిక జేఎఫ్‌ఎంసి కోర్టు కొట్టివేసింది. 2014 జూన్ 10న పాములపాడు సామాజిక న్యాయం పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై. కోటేశ్వరరరావు, డాక్టర్ నాగన్న, మరో 12 మంది గ్రామంలో విధించిన నిషే«ధాజ్ఞలు ఉల్లంఘించారన్న కారణంతో పోలీసులు ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గ్రామంలో పవర్ ప్లాంట్ నిర్మాణం మానుకోవాలని ఆ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన అన్ని రకాల అనుమతులు ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైకోటేశ్వరరావు ఆధ్వర్యంలో 2014 జూన్ 9 నగ్రామ ప్రజలు కర్నూలు కలెక్టరేట్ ముట్టడించారు. కార్యక్రమం విజయవంతం అయినందుకు ప్రజాసంఘాల నాయకులు ఆ మరుసటి రోజున గ్రామంలో కార్యక్రమ పునః సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న కారణం చూపుతూ పాములపాడు పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు. కాగా సాక్షాధారాలను పరిశీలించిన మీదట ఆత్మకూరు జూనియర్ పస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ రామకృష్ణ కేసును కొట్టి వేశారు. -
వేంపెంట దీక్షలకు 500 రోజులు
వేంపెంట(పాములపాడు): పవర్‌ప్లాంటు నిర్మాణ పనులకు వ్యతిరేకంగా వేంపెంట గ్రామ ప్రజలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాటికి వారు చేపట్టిన నిరాహారదీక్షలు 500 రోజుకు చేరుకున్నాయి. అధికార పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి, మాజీ న్యాయశాఖా మంత్రి ఏరాసుప్రతాపరెడ్డిల కుటుంబాలకు చెందిన వారే ర్యాంక్ Sపవర్‌ప్లాంటు యజమానులు అయినందువల్లే ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు విమర్శించారు. గ్రామం మధ్యలో ఉన్న నిప్పులవాగుపై 7.5 మెగా వాల్టుల విద్యుత్ ఉత్పాదన ప్లాంటు నిర్మాణం చేపట్టనున్న విషయం విదితమే. ఈ ప్లాంటు నిర్మాణం చేపట్టడం వల్ల గ్రామానికి అనర్థాలు జరుటుతాయనే ఉద్దేశంతో గ్రామస్తులు అలుపెరుగక పోరాటం చేస్తున్నారు.