వేంపెంట దీక్షలకు 500 రోజులు
వేంపెంట(పాములపాడు): పవర్‌ప్లాంటు నిర్మాణ పనులకు వ్యతిరేకంగా వేంపెంట గ్రామ ప్రజలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాటికి వారు చేపట్టిన నిరాహారదీక్షలు 500 రోజుకు చేరుకున్నాయి. అధికార పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి, మాజీ న్యాయశాఖా మంత్రి ఏరాసుప్రతాపరెడ్డిల కుటుంబాలకు చెందిన వారే ర్యాంక్ Sపవర్‌ప్లాంటు యజమానులు అయినందువల్లే ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు విమర్శించారు. గ్రామం మధ్యలో ఉన్న నిప్పులవాగుపై 7.5 మెగా వాల్టుల విద్యుత్ ఉత్పాదన ప్లాంటు నిర్మాణం చేపట్టనున్న విషయం విదితమే. ఈ ప్లాంటు నిర్మాణం చేపట్టడం వల్ల గ్రామానికి అనర్థాలు జరుటుతాయనే ఉద్దేశంతో గ్రామస్తులు అలుపెరుగక పోరాటం చేస్తున్నారు.