సాక్షి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. మంచి రోజు, బలమైన ముహూర్తం చూడాలని పండితులను సంప్రదిస్తున్నారు. ఈనెల 3నుంచి నామినేషన్ల ప్రక్రియం ప్రారంభమైంది. పదోతేదీ వరకు నామినేషన్ల ప్రక్రియకు తుది గడువు ఉంది. ఇంకా ఐదురోజులు మాత్రమే నామినేషన్లకు ముహూర్తం ఉంది. ఏ రోజు, ఏసమయం బాగుందో చూసి చెప్పండి అంటూ పురోహితుల వెంట తిరుగుతూ... బీఫాంలు అందుకున్న అభ్యర్థులు తమ జాతకాలను పరిశీలించుకుంటున్నారు.
ఏ రోజు ఎలాగుందంటే..?
నామినేషన్ల దాఖలు గడువుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అభ్యర్థి జన్మనక్షత్రం ప్రకారం అనువైన తిథి, నక్షత్రం ఆధారంగా ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పురోహితులను కలుస్తున్నారు.
► 6వ తేదీ నవమి. అశ్లేష నక్షత్రం నామినేషన్ల దాఖలుకు ఇష్టపడరని పండితులు చెబుతున్నారు.
► 7న మంగళవారం కావడంతో చాలా మంది నామినేషన్ వేయరంటున్నారు.
► 8న ఏకాదశి, పుష్పనక్షత్రం కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
► 9న ఏకాదశి ఉదయం 10.30 వరకు ఉండడంతో నామినేషన్లు అధికంగా దాఖలు కావొచ్చని చెబుతున్నారు.
► 10న రాహుకాలం అధికంగా ఉండడంతో నామినేషన్లు పెద్దగా దాఖలు కాకపోవచ్చు.
ఇవి చదవండి: కడుపేద వర్గాలకు చేరువైన 'సీపీఐ..' ఇకపై ప్రశ్నార్థకమేనా!?
Comments
Please login to add a commentAdd a comment