moment
-
జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకుర్ పూజలు (ఫొటోలు)
-
Ind vs SL: ప్రాక్టీస్ సెషన్లో గంభీర్ కోహ్లి.. ఫొటోలు వైరల్
-
ప్రధాని మోదీతో బుమ్రా కొడుకు..ఎంత క్యూట్‌గా ఉన్నాడో ఫోటోలు వైరల్
-
WC 2011: ఆ రోజు ధోని సిక్సర్ కొట్టగానే.. హిస్టారిక్ మూమెంట్స్! (ఫొటోలు)
-
ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..
ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటకు వచ్చారు. వీరిని బయటకు తీసుకురావడంలో ర్యాట్ మైనర్ల బృందం విజయం సాధించింది. ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులలో ఒకరైన సుబోధ్ కుమార్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ‘తాము టన్నెల్లో ఆహారం కోసం అలమటించిపోయామని, గాలి ఆడక ఇబ్బంది పడ్డామన్నారు. తరువాత అధికారులు పైపుల ద్వారా ఆహార పదార్థాలను పంపించారన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠోర శ్రమ కారణంగానే తాను బయటపడగలిగానని’ తెలిపారు. మరో కార్మికుడు విశ్వజీత్ కుమార్ వర్మ మాట్లాడుతూ ‘తాము సొరంగంలో చిక్కుకున్నామని తెలుసుకున్నామని, బయట అధికారులు తమను బయటకు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నించారు. మాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్‌తో పాటు ఆహారం అందించారు. మేము టన్నెల్లో చిక్కుకున్న మొదటి 10 నుంచి 15 గంటలు సమస్యలను ఎదుర్కొన్నాం. తరువాత ఆహారాన్ని పైపుల ద్వారా అందించారు. అనంతరం మైకు అమర్చి, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఇప్పుడు తామంతా సంతోషంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. నవంబర్ 12వ తేదీ తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో సొరంగంలో ప్రమాదం జరిగి 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత వారికి అధికారులు ఒక పైపు ద్వారా మందులు, డ్రై ఫ్రూట్స్ పంపించారు. నవంబర్ 20న ఆరు అంగుళాల పైపును సొరంగంలోనికి పంపి కిచ్డీతో పాటు అరటిపండ్లు, నారింజ, డ్రైఫ్రూట్స్, బ్రెడ్, బ్రష్‌లు, టూత్‌పేస్టులు, మందులు, అవసరమైన దుస్తులను వారికి పంపించారు. ఎట్టకేలకు 17 రోజుల అనంతరం కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇది కూడా చదవండి: సొరంగం నుంచి వచ్చిన కుమారుడుని చూడకుండానే తండ్రి మృతి -
'నామినేషన్లకు' ఎప్పుడెలా ఉందో.. కాస్త చూసి చెప్పండి! పురోహితుల వెంట..
సాక్షి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. మంచి రోజు, బలమైన ముహూర్తం చూడాలని పండితులను సంప్రదిస్తున్నారు. ఈనెల 3నుంచి నామినేషన్ల ప్రక్రియం ప్రారంభమైంది. పదోతేదీ వరకు నామినేషన్ల ప్రక్రియకు తుది గడువు ఉంది. ఇంకా ఐదురోజులు మాత్రమే నామినేషన్లకు ముహూర్తం ఉంది. ఏ రోజు, ఏసమయం బాగుందో చూసి చెప్పండి అంటూ పురోహితుల వెంట తిరుగుతూ... బీఫాంలు అందుకున్న అభ్యర్థులు తమ జాతకాలను పరిశీలించుకుంటున్నారు. ఏ రోజు ఎలాగుందంటే..? నామినేషన్ల దాఖలు గడువుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అభ్యర్థి జన్మనక్షత్రం ప్రకారం అనువైన తిథి, నక్షత్రం ఆధారంగా ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పురోహితులను కలుస్తున్నారు. ► 6వ తేదీ నవమి. అశ్లేష నక్షత్రం నామినేషన్ల దాఖలుకు ఇష్టపడరని పండితులు చెబుతున్నారు. ► 7న మంగళవారం కావడంతో చాలా మంది నామినేషన్ వేయరంటున్నారు. ► 8న ఏకాదశి, పుష్పనక్షత్రం కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ► 9న ఏకాదశి ఉదయం 10.30 వరకు ఉండడంతో నామినేషన్లు అధికంగా దాఖలు కావొచ్చని చెబుతున్నారు. ► 10న రాహుకాలం అధికంగా ఉండడంతో నామినేషన్లు పెద్దగా దాఖలు కాకపోవచ్చు. ఇవి చదవండి: కడుపేద వర్గాలకు చేరువైన 'సీపీఐ..' ఇకపై ప్రశ్నార్థకమేనా!? -
మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అంటే ఏమిటి? రిక్టర్ స్కేల్ కన్నా ఎంత ఉత్తమం?
భూకంపాల తీవ్రతను రిక్టర్ స్కేల్‌తో కొలుస్తారు. రిక్టర్ స్కేల్‌ను చార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్ 1935లో అభివృద్ధి చేశారు.అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇది భారీ భూకంపాలు సంభవించినప్పుడు దాని తీవ్రతను ఖచ్చితంగా కొలవలేదు. ఈ నేపధ్యంలోనే 1970లలో రిక్టర్ స్కేల్ స్థానంలో మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ (ఎంఎంఎస్) ఆవిష్కృతమయ్యింది. ఇది భారీ భూకంపాల తీవ్రతను మరింత విశ్వసనీయంగా అంచనా వేస్తుంది. అయితే నేటికీ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై గుర్తించినట్లు రాస్తున్నారు. అందుకే ఇప్పుడు రిక్టర్ స్కేల్, మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ మధ్యగల తేడాలను, ఉపయోగాలను తెలుసుకుందాం. 2023, ఫిబ్రవరి 8న టర్కీలోని ఆగ్నేయ ప్రాంతంలో, సిరియా సరిహద్దుకు సమీపంలో భూకంపం సంభవించినప్పుడు మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ సహాయంతో తీవత్రను కొలవగా 10కి 7.8గా నమోదయ్యింది. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అనేది భూకంపం ద్వారా విడుదలయ్యే మొత్తం శక్తిని కొలిచే సంవర్గమాన ప్రమాణం. ఇది అతిపెద్ద భూకంపాలను (అంటే 8 తీవ్రత కంటే ఎక్కువ) ఖచ్చితంగా కొలవగల ఏకైక స్కేల్. మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్‌ను 1970లలో జపనీస్ భూకంప శాస్త్రవేత్త హిరో కనమోరియాండ్, అమెరికన్ భూకంప శాస్త్రవేత్త థామస్ సి. హాంక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. మొమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ భూకంపం సంభవించిన క్షణంలో దాని తీవ్రతను అంచనావేస్తుంది. రిక్టర్ స్కేల్‌ను 1935లో చార్లెస్ ఎఫ్. రిక్టర్ అభివృద్ధి చేశారు. దీనిలో భూకంపం సంభవించిన సమయంలో విడుదలయ్యే శక్తిని కొలిచేందుకు ఉపయుక్తమవుతుంది. రిక్టర్ స్కేల్ అనేది బేస్-10 లాగరిథమిక్ స్కేల్. 5 కంటే తక్కువ తీవ్రత గల భూకంపాలను గుర్తించడంలో ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. భూకంప మూలం నుండి నిర్దిష్ట దూరంలో నమోదయిన అతిపెద్ద తరంగం వ్యాప్తిని రిక్టర్ స్కేలు గుర్తిస్తుంది. అయితే రిక్టర్ స్కేల్ భూకంప నష్టాన్ని అంచనా వేయలేదు. అందుకే ప్రస్తుతం భూకంపాలను తీవ్రతను సమగ్రంగా తెలుసుకునేందుకు మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ వినియోగిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆసియాను కుదిపేసిన 10 భారీ భూకంపాలివే.. -
అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే?
సోషల్ మీడియాలో పిడుగుపాటుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే ఒక వీడియో వైరల్‌గా మారింది. వన్యప్రాణి నిపుణుడు, జీవశాస్త్రవేత్త ఒకరు ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ సిటీలో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. ఆ భయానక క్షణం వీడియోలో నిక్షిప్తమై, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల 35 ఏళ్ల ఫారెస్ట్ గాలంటే సౌత్ ఫ్లోరిడాలో తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోను షూట్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వీడియోలోని వివరాల ప్రకారం అడవిలోని నీటిలో నిలుచుకున్న ఫారెస్ట్ గాలంటే మాట్లాడుతూ ‘మాకు అద్భుతమైన షాట్లు వస్తున్నాయి. ఇది అందమైన రోజు. ఇక్కడి నీరు నిలకడగా ఉంది. షూటింగ్ అద్భుతంగా జరుగుతోంది. ఇక షూటింగ్ చివరి దశలో ఉంది. వర్షం పడడం మొదలవుతోంది. ఇది ఫ్లోరిడా. ఇక్కడ తరచూ వర్షాలు కురుస్తుంటాయి. అన్ని వేళలా మెరుపులు, ఉరుములు కనిపిస్తాయి’ అని చెప్పాడు. ఇంతలో అతని పక్కనే పిడుగుపడింది. దీంతో అతను నీటిలోకి కొద్దిగా ఒరిగాడు. ఈ ఘటన తర్వాత అతను మాట్లాడుతూ ‘ఆ సమయంలో కాంతిని చూడలేకపోయాను. ఆకస్మిక పిడుగు దాడితో నా మైండ్ మొద్దుబారిపోయింది. విపరీతమైన వెలుగు రావడంతో నేను ఏమీ చూడలేకపోయాను. ఈ ఘటనలో నాకు, నా బృందానికి పెద్దగా గాయాలు కాలేదని, అయితే తనకు శరీరమంతా నొప్పిగా ఉందని, తన గొంతు ఎండిపోయినట్లుందని’ గాలంటే తెలిపారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి జైలు ఎందుకు మూతపడింది? How close have you come to being hit by lightning? This is insane. The host of Discovery Plus and Animal Planet, @ForrestGalante, was actually hit by lightning while recording. In the video, you can see he was discussing the importance of having a GPS device, when a huge bolt… pic.twitter.com/lseyEzgNUZ — Ed Krassenstein (@EdKrassen) October 2, 2023 -
40 మీటర్ల ఎత్తులో రోప్ ర్యాక్.. అమాంతం పడిపోయిన బాలుడు..
మెక్సికోలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. రోప్స్ ర్యాక్‌లో ఆరేళ్ల పిల్లాడు 40 మీటర్ల ఎత్తు నుంచి అమాంతం కిందపడిపోయాడు. అదృష్టవశాత్తు పిల్లాడు పడిపోయే ప్రదేశంలో చిన్న సరస్సు ఉండటంతో ప్రమాదం తప్పింది. మాంటెర్రేలోని ఫండిడోరా అమెజాన్ ఎక్స్‌పెడిషన్‌లో ఈ ఘటన జరిగింది. ఫండిడోరా అమెజాన్ ఎక్స్‌పెడిషన్‌లో కుటుంబంతో అందరూ కలిసి వచ్చారు. ఈ క్రమంలో రోప్స్ ర్యాక్ సాహస క్రీడలో పాల్గొనడానికి పిల్లలు వెళ్లారు. అందులో ఆరేళ్ల పిల్లాడు ముందుగా రోప్‌పై ప్రయాణించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి రోప్‌పై వెళ్లాడు. ఇద్దరు ఒకే చోటుకు రావడంతో పిల్లాడు ఆందోళనకు గురయ్యాడు. అయినప్పటికీ తాడును పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశాడు. అందరూ చూస్తుండగానే అబ్బాయి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అక్కడ కింద చిన్న సరస్సు ఉండటంతో ప్రమాదం తప్పిపోయింది. 🇲🇽 • A six-year-old boy falls from a height of 12 meters while on a ropes rack at Fundidora Park in Monterrey, Mexico pic.twitter.com/DAysWyikiA — Around the world (@1Around_theworl) June 26, 2023 స్వల్ప గాయాలతో బయటపడిన బాధితున్ని అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రోప్ ర్యాక్ నిర్వహణలో యాజమాన్యం సరిగా స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడు ప్రదర్శించిన ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
బికినీలో టీచర్ల రచ్చ
సోషల్ మీడియాలో హాట్‌గా ఫోటోలు పెట్టిందన్న ఒకే ఒక్క కారణం ఆ ఉపాధ్యాయురాలి పాలిట శాపంగా మారింది. పలువురు పేరెంట్స్ ఫిర్యాదు చేయటంతో ఆమె ఉద్యోగం ఊడింది. మరెక్కడా ఆమెకు పని దొరకటం లేదు. ఈ విషయం తెలిసిన తోటి ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు!! మాస్కో: 26 ఏళ్ల విక్టోరియా పోప్‌రోవా ఓమ్స్క్ పట్టణంలో 7 సిటీ స్కూల్లో హిస్టరీ టీచర్‌గా పని చేస్తుండేది. ఆ మధ్య సెలవులపై కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె.. బికినీలో ఓ ఫోటోషూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. అయితే ఆమెను ఫాలో అయ్యే వారిలో ఆమె స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఈ విషయం కొందరు పేరెంట్స్ దృష్టికి రావటంతో వారంతా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె నుంచి వివరణ కోరిన స్కూల్ మేనేజ్మెంట్.. చివరకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. విషయం తెలిసిన టీచర్ల అసోసియేషన్ మండిపడింది. టీచర్స్ ఆర్ హ్యూమన్స్ టూ(#TeachersAreHumansToo) పేరిట వినూత్నంగా నిరసనకు పిలుపునిచ్చింది. అందులో మొత్తం 11 వేల మంది టీచర్లు ఫ్లాష్‌మాబ్‌లో పాల్గొన్నారు. వారంతా బికినీలతో ఫోటోలు దిగి విక్టోరియా పోప్రోవాకు మద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జరగకపోతే ఉద్యమం మరో రూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఈ ఉద్యమం సోషల్ మీడియాను కదిలించింది. దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆమెకు మద్ధతు ప్రకటిస్తూ.. తమ ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బికినీ ఉద్యమం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. -
సాగునీటి కోసం ఉద్యమించాలి
భూత్పూర్ (దేవరకద్ర) : తెలంగాణ ప్రజలు సాగు, తాగునీటి కోసం ఉద్యమించాలని సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ అన్నారు. కృష్ణా– సావిత్రి నదుల పరిక్రమ సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తిచేసి భూత్పూర్ వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కృష్ణానది నీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల జన్మహక్కు అన్నారు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల పరిపాలన సౌలభ్యం కోసం రెండో రాజధానితోపాటు ఉప పార్లమెంట్, ఉప రాజ్యసభ, ఇతర కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరుతూ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 6 వేల కి.మీ. సైకిల్‌యాత్ర చేపట్టానన్నారు. కృష్ణానది పుష్కరాల సందర్భంగా సైకిల్‌యాత్ర ప్రారంభించానని గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషలో పరిపాలన జరగాలని, ప్రాంతీయ విభేదాలతో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, నియామకాలు, నీళ్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. తాను కర్ణాటక, మహారాష్ట్రలో సైకిల్‌యాత్ర చేపడితే సైకిల్‌పై ఉన్న తెలుగు భాషతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర భాషల్లో బోర్డు రాసే వరకు తనను ఆయా రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేపట్టనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ చేపట్టిన సంకల్పన యాత్ర యావత్ ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా జరుగుతుందని, ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటాలు చేయడం సరైందేనన్నారు. అనంతరం ఆయన శ్రీశైలానికి సైకిల్‌పై బయలుదేరి వెళ్లారు. జడ్చర్లలో ఘన స్వాగతం.. జడ్చర్ల టౌన్ : పైరుపచ్చని తెలంగాణ సాధన, తెలుగును పరిపాలన భాషగా అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు గౌరీశంకర్ చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం జడ్చర్లకు చేరుకుంది. జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద సీఐ బాలరాజు ఆయనకు స్వాగతం పలికారు. పైరు పచ్చని తెలంగాణ రాష్ట్ర సాధననే తన యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. నదుల అనుసంధానం ద్వారానే పైరుపచ్చని తెలంగాణ సాధ్యమని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అందుకోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాటుపడాలన్నారు. అలాగే హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలని, తద్వారా దక్షిణ భారతదేశానికి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, జర్నలిస్టులకు జీతభత్యాలను ప్రభుత్వాలే ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్ కార్డులను అందరికీ ఇవ్వాలని, పత్రికా రంగం విడిచిన వారికి పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. తన లక్ష్యాలు పూర్తయ్యే వరకు సైకిల్ యాత్ర కొనసాగిస్తానన్నారు. జడ్చర్ల నుంచి కర్నూలు, ఆత్మకూర్, శ్రీశైలం మీదుగా కల్వకుర్తి, హైదరాబాద్ వరకు ప్రస్తుత యాత్ర ముగిస్తానని ఆయన పేర్కొనన్నారు. -
కాపులు, పోలీసుల మధ్య తోపులాట
కంచాలతో రోడ్డేకేందుకు యత్నం జగ్గంపేట : కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద కాపులు, పోలీసుల మధ్య గురువారం తోపులాట చోటుచేసుకుంది. కంచాలతో రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించిన కాపులను పోలీసులు అడ్డుకున్నారు. గత నెల 26న ముద్రగడ చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి లేదని అడ్డు చెప్పడంతో.. పోరు సీఎం వర్సెస్ ముద్రగడగా మారింది. ఓట్ల కోసం కాపు జాతికి రిజర్వేషన్లను ఎరవేసి వారి ఓట్లతో పీఠం ఎక్కిన చంద్రబాబుకు ఆ హామీని గుర్తు చేయడం రుచించడం లేదు. జాతి కోసం కుటుంబంతో పోరుబాట సాగిస్తున్న ముద్రగడ..తనకు కంటిలో నలుసుగా మారినట్టు భావిస్తున్న సీఎం.. ఆయనను అణచివేసి ఉద్యమం నీరుగార్చేందుకు దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జగ్గంపేట పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. తనకు ఎవరూ చెప్పాల్సిన పని లేదంటూ చేసిన వ్యాఖ్య.. ముద్రగడను ఉద్దేశించి చేసిందనంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. నిరవధిక పాదయాత్ర పేరిట ముద్రగడ రోజూ బయటకురావడం, ఆయనను పోలీసులతో నిలువరించడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం రోడ్కెక్కి నిరసనలు వ్యక్తం చేస్తుంటే పరిష్కారం చేయకుండా.. ముద్రగడను టార్గెట్‌గా చేయడాన్ని కాపు వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కంచాలు మోగించి... ముద్రగడ, కాపు జేఏసీ నాయకులు, మహిళలు గురువారం కంచాలు మోగించి నిరసన వ్యక్తం చేశారు. రోజుకో రకం నిరసనలు వ్యక్తం చేస్తోన్న కాపు జేఏసీ నాయకులు నల్ల చొక్కాలను ధరించారు. కంచాలతో నిరసన సందర్భంగా ముద్రగడ ఇంటి నుంచి ఒక్కసారి గేటు వరకు పెద్ద సంఖ్యలో వచ్చి రోడుపై ధర్నాకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాటకు దారితీసింది. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు వాసురెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, గౌతు స్వామి, ఆరేటి ప్రకాష్, చక్కపల్లి సత్తిబాబు, గుండా వెంకటరమణ, తుమ్మలపల్లి రమేష్, గోపు అచ్యుతరామయ్య, తదితరులు పాల్గొని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. తమకు సంకెళ్లు వేయండి.. కాపు జాతిపై కక్ష సాధింపు ఎన్ని రోజులని నిలదీశారు. -
నేటినుంచి ‘ముస్లిం పర్సనల్‌లా జాగృతి ఉద్యమం’
రాజమహేంద్రవరం కల్చరల్: రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా జాగృతి ఉద్యమం ఆదివారం నుంచి మే 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జమాతె ఇస్లామీ హింద్ నాయకుడు మహ్మద్ రఫీద్ వెల్లడించారు. ఇటీవల తరచు ముస్లిం పర్సనల్ లా, తలాక్ వంటి విషయాల్లో రాద్ధాంతాలు చేస్తున్నారని శనివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముస్లిం మహిళల విషయంలో మొసలికన్నీరు కారుస్తోందని ఆయన విమర్శించారు. ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగించేందుకు ఈ జాగృతి ఉద్యమం నిర్వహిస్తున్నామన్నారు. మేధావులను, మానతావాదులను కలసి పర్సనల్‌లాపై అవగాహన కలిగిస్తామన్నారు. బహిరంగసభలు, కరపత్రాలు, ప్రసారమాధ్యమాల ద్వారా ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగిస్తామన్నారు. ముస్లింలు వివాహం, విడాకులు, ఆస్తిపంపకాలు, మనోవర్తి తదితర అంశాలకు ప్రాతిపదిక బ్రిటిష్ ప్రభుత్వం 1937లో చేసిన షరీయత్ అప్లికేషన్ చట్టమని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాజ్యాంగ నిర్మాతలు ఈ చట్టం విషయంలో జోక్యం చేసుకోలేదని ఆయన వివరించారు. ముస్లిం పర్సనల్ లాలోని అంశాలకు మూలం మానవనిర్మిత చట్టాలు కావని, సృష్టికర్త ఉపదేశం ప్రకారమే రూపొందించనవని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 44వ అధికరణంలో పేర్కొన్న ఉమ్మడిపౌరసత్వం గురించి పెద్దలు పదేపదే మాట్లాడుతున్నారు, కానీ రాజ్యాంగం 25,26 అధికరణాలలో ఇచ్చిన సమానత్వం గురించి, మత స్వేచ్ఛను గురించి మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అంశంతో జరిగిన విడాకులు మొత్తం విడాకులలో 0.05 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగించేందుకు మే 6వ తేదీన జిల్లా వ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో జమాతె ఇస్లామీ హింద్ జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. పర్సనల్‌లాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను, ముస్లిం పర్సనల్ లాపై సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని ముస్లిం ప్రముఖులు ఆవిష్కరించారు. ముస్లిం పర్సనల్‌లా విషయంలో ఇతరుల జోక్యాన్ని అంగీకరించబోమని విలేకరుల సమావేశంలో ముస్లిం మహిళలు తెలిపారు. జమాతె ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు ముస్తాఫా షరీఫ్, ఉద్యమ కన్వీనర్ అన్సార్ అహమ్మద్, ది యునైటెడ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాదర్‌ఖాన్, వివిధ మసీదుల అధ్యక్షులు, ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. -
క్షణ క్షణం.. భయం భయం..
=శిథిలావస్థలో తరగతి గదులు =కూల్చేయాలంటూ ఏడునెలల కిందట ఉత్తర్వులు = అయినా పట్టించుకోని అధికారులు = చాలా చోట్ల అవే గదుల్లో తరగతుల నిర్వహణ అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అనుక్షణం భయపడుతూ తరగతి గదుల్లో కూర్చోవాల్సి వస్తోంది. ఏ క్షణంలో పైపెచ్చులు మీదపడతాయో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయులు కూడా బిక్కుబిక్కుమంటూనే పాఠాలు చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో కూలడానికి సిద్ధంగా ఉన్న గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 517 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 751 తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. గదుల దుస్థితి చూసి పిల్లలను బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకూ తెలుసు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పాఠశాల్లో గుర్తించిన 751 శిథిల గదులను వెంటనే కూల్చేయాలని సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్ రాష్ట్ర అధికారులు ఎనిమిది నెలల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేయొద్దంటూ స్పష్టంగా పేర్కొన్నారు. అయితే.. ఇప్పటిదాకా 76 గదులను మాత్రమే పడగొట్టామని అధికారులు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారమే ఇంకా 675 గదులు కూల్చేయాల్సి ఉంది. దీనిపై ఎస్ఎస్ఏ అధికారులు ఎంఈఓలు, ఎంపీడీఓలకు ఉత్తర్వులిచ్చారు. అయినా వారిలో చలనం లేదు. అదనపు గదుల మంజూరులో కోత అదనపు తరగతి గదుల మంజూరులో ప్రభుత్వం ఏడాదికేడాది కోత విధిస్తోంది. 2016–17 విద్యా సంవత్సరంలో రూ.41.56 కోట్లతో 534 గదులు కావాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. 55 మాత్రమే మంజూరు చేసింది. వీటికోసం రూ.4.82 కోట్లు కేటాయించింది. అది కూడా విద్యా సంవత్సరం ముగింపు దశలో నిధులు కేటాయించడంతో ఇప్పటికి 36 గదులు నిర్మాణదశలో ఉన్నాయి. మిగిలినవి ప్రారంభం కాలేదు. ఇక 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.79.81 కోట్లతో 962 అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. దురదృష్టకరం శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదులను కూల్చేయాలని మేం స్పష్టంగా చెప్పాం. మండలాల వారీగా జాబితాలు కూడా పంపాం. ఇప్పటిదాకా 76 గదులు మాత్రమే కూల్చేశారు. ఇది దురదృష్టకరం. – విజయశేఖర్, ఎస్ఎస్ఏ ఈఈ -
బీసీల హక్కుల సాధనకై ఐక్య ఉద్యమాలు
– ప్రకాశం జెడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ నూకపాని బాలాజీ కర్నూలు(అర్బన్): పీడిత, అణగారిన, బీసీ వర్గాల హక్కుల సాధనకు దళిత బహుజనులంతా కలిసి ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక శంకరాస్ డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం ద్వితీయ ఆవిర్భావ సదస్సు నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. మద్దిలేటియాదవ్ ఆధ్వర్యంలో బోయ శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బాలాజి మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వినయ్ మాట్లాడుతూ బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు వీరశేఖర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రానున్న ఎన్నికల్లో బీసీలు పోటీ చేసి విజయం సాధించాలన్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సమాజ్‌వాది జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్ మాట్లాడుతూ పూలే ఆశయాల మేరకు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటాలు చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు, అనంతపురం, జిల్లాల అధ్యక్షులు శ్రీరాములు, రవి, ఎమ్మెల్సీ అభ్యర్థి అవ్వారు మల్లికార్జున, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి పోతన తదితరులు పాల్గొన్నారు. -
బోధనను వీడి పోరుపథంలోకి..
మళ్లీ మొదలైన కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యమం రాజమహేంద్రవరంలో దీక్షా శిబిరం ప్రారంభం -చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందన్నాడో మహానుభావుడు. తాము సముపార్జించిన జ్ఞాననిధులను అలాంటి తరగతి గదుల్లో భావిపౌరులకు బోధించే కాంట్రాక్టు అధ్యాపకులు వర్తమానంలో తాము నిశ్చింతగా జీవించలేకపోతున్నామంటూ రోడ్లెక్కాల్సి వస్తోంది. పాఠాలు చెప్పిన నోటితో నినాదాలు చేయాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఉద్యమించాల్సి వస్తోంది. ప్రతిపక్ష నాయకునిగా గతంలో చంద్రబాబునాయుడు కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తానని రాజమహేంద్రవరం దీక్షా శిబిరం వద్దకు వచ్చి హామీ ఇచ్చి ఇప్పుడు మొహం చాటేయడం పట్ల అధ్యాపకులు మండిపడుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలపై గతంలో 37 రోజులుగా తీవ్రపోరు చేసారు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం వారికి బేసిక్ పే మంజూరు చేసింది. దీంతో పాటు రెగ్యులర్ చేస్తామని చెప్పింది. అదేసమయంలో 2012 ఫిబ్రవరి 4న చంద్రబాబు రాజమహేంద్రవరంలోని దీక్షాశిబిరం వద్దకు వచ్చి తాను అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అధ్యాపకులందరినీ పర్మనెంట్ చేస్తానన్నారు. ఉద్యోగభద్రతకు ఆడబిడ్డలు రోడ్డెక్కడం దుస్థితి అని వాపోయారు. తానొస్తే ఆ పరిస్థితి ఉండదని భరోసా ఇచ్చివెళ్లారు. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం తమను పట్టించుకోవడంలేదని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 40 జూనియర్, 15 డిగ్రీ, రెండు పాలిటెక్నిక్ కళాశాలల్లో 460 మంది కాంట్రాక్టు అధ్యాపకులు గత 16 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఆరునెలలకోసారి జీతం ఇచ్చినా పంటి బిగువున పనిచేశారు. ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామనే ఆశతో జిల్లాలో పని చేస్తున్న కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెంచామని కొత్తపేటకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకుడు తనికెళ్ల శాస్త్రి ‘సాక్షి’తో అన్నారు. మంత్రివర్గం ఉపసంఘం నియమించి రెగ్యులర్ చేస్తామన్న చంద్రబాబు రెండున్నరేళ్లుగా తమతో ఆడుకున్నారని రాజవొమ్మంగి ప్రభుత్వ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుడు వాగు మాధవ్ మండిపడ్డారు. తమకు న్యాయం చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజల్లో మోసకారి సర్కారుగా ప్రచారం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆశ అడియాస కాగా.. అప్పట్లో పోరాటం చేసి కొంత ఫలితం దక్కించుకున్నా కాంట్రాక్టు అధ్యాపకులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేసుకోలేకపోయారు. నాయకుల హామీలతో కొలువులు స్థిరమవుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారికి అడియాస ఎదురయ్యేసరికి తిరిగి ఉద్యమం ప్రారంభించారు. దీనిలో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం ఇంటర్‌బోర్డు వద్ద దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం నడుస్తుందని ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ నాయకులు తెలిపారు. ఉదయం నుంచి జిల్లాలోని కాంట్రాక్టు అధ్యాపకులంతా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పి.వీరబాబు, వి.కనకరాజు, యు.లక్ష్మణరావు, అమర్‌కళ్యాణ్, వి.మాధవ్, జీఎల్ మాణిక్యం పాల్గొన్నారు. రేపు బూరుగుపూడిలో 'కడుపుకోత' సభ ఈనెల ఏడున జిల్లా పర్యటనకు వస్తున్న ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో బూరుగుపూడి వద్ద భేటీ కానున్నామని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర జేఏసీ నాయకుడు యార్లగడ్డ రాజాచౌదరి తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు బూరుగుపూడి గేట్ వద్ద జరిగే కడుపుకోత సభకు రాష్ట్రంలోని కాంట్రాక్టు అధ్యాపకులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
సీపీఎస్‌ను రద్దు చేయాలి
ఎమ్మెల్సీ రాముసూర్యారావు డిమాండ్ ఆత్రేయపురంలో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన 29న చలో ఢిల్లీ ఆత్రేయపురం : ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పిచాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాముసూర్యారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఆత్రేయపురంలో ఉపాధ్యాయ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించాయి. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 29న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2004 సంవత్సరం సెప్టెంబర్ నుంచి విధుల్లో చేరిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సీపీఎస్ ప్రవేశపెట్టడంపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఆయన కోరారు. అసెంబ్లీలో పెన్షన్ భద్రతకు అనుకూలంగా తీర్మానం చేయాలని, పార్లమెంట్లో పీఎఫ్ , ఆర్డీఏలోని అంశాన్ని మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఉపాధ్యాయులపై పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలుత యూటీఎఫ్, ఎస్టీఎఫ్ఐల ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వరదా సుబ్బారావు, ఎంపీడీవో జెఏ ఝూన్సీ, ఎంఈవో లలితాకుమారికి వినతిపత్రాలను ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందజేశారు. జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి ఎస్.జ్యోతిబసు, మండల యూటీఎఫ్ అధ్యక్షుడు బీవీ రమణ, ప్రధాన కార్యదర్శి ఎస్వీఎస్ ప్రసాద్, సహ అధ్యక్షుడు ఎన్. రంగ మహాలక్ష్మి, అసోసియేట్ అధ్యక్షుడు కేడీవీ ప్రసాదరావు, కోశాధికారి ఎం.సురేష్‌బాబు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఫణికుమార్, జి.సురేష్‌లతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీమ ప్రాజెక్టులపై చిన్నచూపు
– సిద్ధేశ్వరం తరహాలో మరో ఉద్యమానికి శ్రీకారం – రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కోవెలకుంట్ల: రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రాయలసీమ జేఏసీ కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ సోమశేఖర్ శర్మ ఆరోపించారు. గుండ్రేవుల, గురురాఘవేంద్ర, వేదవతి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కోవెలకుంట్ల జేఏసీ కో ఆర్డినేటర్ కామని వేణుగోపాల్‌రెడ్డి స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలో పట్టీసీమ ప్రాజెక్టును పూర్తి చేసిన ప్రభుత్వం మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సార్బీసీపై మాత్రం అంతులేని నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు సీమలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు లేకపోవడం విచారకరమన్నారు. తగినన్నీ రిజర్వాయర్లు లేక కేసీకి కేటాయించిన 39.9 టీఎంసీల నీటిని కూడా సీమ రైతులు వాడుకోలేకపోతున్నారన్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నా గోరుకల్లు, అవుకు, గండికోట, మైలవరం రిజర్వాయర్లను పూర్తి చేయకపోవడంతో నీరు నింపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి వేల ఎకరాల అటవీ భూములకు యుద్ధప్రాతిపదికన అనుమతులు తెచ్చిన ప్రభుత్వం అవుకు రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు అడ్డంకిగా ఉన్న అటవీశాఖ భూముల నుంచి అనుమతి లభించలేదని పెండింగ్‌లో ఉంచడం దుర్మార్గమైనచర్యగా అభివర్ణించారు. కుందూనదిపై జోళదరాశి వద్ద 0.8 టీఎంసీ, రాజోలి వద్ద 3 టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్ల ఏర్పాటుకు రూ. 533 కోట్లు నిధులు మంజూరైనా నిర్మాణాలను పట్టించుకోవడం లేదన్నారు. రాయలసీమ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ సిద్ధేశ్వరం ఉద్యమ తరహాలో మరో పెద్ద ఉద్యమానికి జేఏసీ సిద్ధమవుతోందని హెచ్చరించారు. కుందూపోరాటసమితి, రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ జేఏసీ, ఇతర రైతు సంఘాలతో రైతు చైతన్య పరిచే యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జేఏసీ బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షుడు రామచంద్రుడు పాల్గొన్నారు. -
వలసలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
– ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపణ – సీమ ప్రగతికోసం ఐక్య ఉద్యమాలకు పిలుపు కర్నూలు(హాస్పిటల్): విద్యతోపాటు ఇతర అన్ని రంగాల్లో పూర్తి వెనుకబాటుతో ఉన్న జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలు, బెంగళూరు సహా దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పైగా కోసిగి నుంచి బెంగళూరుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును తిప్పుతూ వలసలను మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివద్ధి వేదిక ఆధ్వర్యంలో సీమ సమగ్రాభివద్ధి కోసం గత నెల 24న హాలహర్వి మండలం గూళ్యం నుంచి ప్రారంభమైన జీపు జాతా మంగళవారం కర్నూలులో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక సి.క్యాంపు టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ గేయానంద్ మాట్లాడారు. రాయలసీమలో అత్యధిక నీటి వనరులున్న కర్నూలు జిల్లాలో కూడా జనం తాగునీటికి సైతం అల్లాడుతుండడం దురదష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లతోపాటు పాఠశాలలనూ ప్రభుత్వం మూసివేస్తోందని, పిల్లలంతా బడిమానేసి పనికి వెళ్తున్నారన్నారు. కన్నడ, ఉర్దూ మీడియం పిల్లలు పాఠ్యపుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి విద్య కోస ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా 2వేల మంది ఉపాధ్యాయులను నియమించాలన్నారు. నిరుద్యోగులకు రూ.2వేల భతి ఇవ్వాలని కోరారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, అందులో ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలన్నారు. రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చెన్నయ్య ప్రసంగించారు. ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షులు డాక్టర్ బి. శంకరశర్మ, రాయలసీమ అభివద్ధి వేదిక అనంతపురం జిల్లా కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, వివిధ సంఘాల నాయకులు పెద్దస్వామి, నరసింహ, కవి అజీజ్, మహేశ్వరరావు, బాషా, సునయ కుమార్, రామశేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
మతతత్వానికి వ్యతిరేకంగా మానవత ఉద్యమం
– జేఐహెచ్ సద్భావనా సదస్సులో జాతీయ కార్యదర్శి ఇక్బాల్ ముల్లా కర్నూలు (ఓల్డ్‌సిటీ): దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా మానవత ఉద్యమం నిర్వహిస్తున్నామని జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) జాతీయ కార్యదర్శి ఇక్బాల్ ముల్లా తెలిపారు. శనివారం రాత్రి స్థానిక సీక్యాంప్ సెంటర్లోని ప్రభుత్వ డ్రై వర్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో జేఐహెచ్ సద్భావన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఒకవైపు మతతత్వ వాదం పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం నీతులు చెబుతోందని, మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే దేశం అన్ని రంగాల్లో వెనుకబడి పోయే ప్రమాదం ఉందన్నారు. రాజ్యాంగంలో లేని అంశాలను మాట్లాడుతున్నా ప్రభుత్వపర చర్యలు లేవన్నారు. ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఆగస్టు 21వ తేదీ నుంచి సెప్టెంబరు 4 వరకు ‘శాంతి–మానవత’ ఉద్యమం నిర్వహిస్తున్నామని, ఈ ఉద్యమానికి అందరూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. దేశంలో శాంతిని పరిరక్షించేందుకు త్వరలో అన్ని మతాల సభ్యుల ప్రాతినిధ్యంతో పీస్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఫిక్, రాష్ట్ర కమిటీ మెంబర్ ఎస్.ఎ.అమీర్, టీటీడీ రిటైర్డు కోఆర్డినేటర్ వై.సూర్యచంద్రారెడ్డి, డాక్టర్ హరిప్రసాద్ (బమ్‌సెఫ్), జె.రఘుబాబు (జేవీవీ), ఎంబీ చర్చి సీనియర్ పాస్టర్ విజయకుమార్, ప్యాడ్స్ జిల్లా కన్వీనర్ బాలన్న, జేఐహెచ్ మీడియా ఇన్చార్జి సైఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
సీమ అభివృద్ధికి ఉద్యమిద్దాం
ఎస్టీయూ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నరసింహులు డోన్ టౌన్: రాయలసీమ అభివృద్ధికి ఉద్యమిద్దామని ఎస్టీయూ రాష్ట్రగౌరవాధ్యక్షుడు నరసింహులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎన్జీవోస్ హోంలో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన జిల్లాలోని హŸళగుంద నుంచి ప్రారంభమయ్యే జీపుజాత 30వ తేదీన డోన్ చేరుకుంటుందన్నారు. ఈ జాతాను విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులను కోరారు. విద్యా, వైద్య రంగాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. సమావేశంలో కన్వీనర్ ఎన్ఎస్బాబు కో కన్వీనర్ శివశంకర్, అఖిలపక్ష నాయకులు మాణిక్యం శెట్టి, ప్రసాద్‌రెడ్డి, రాజ్‌కుమార్, శ్రీనివాసశర్మ, మద్దయ్య, శివరామ్, ఎల్లయ్య, రామాంజనేయులు, భాస్కర్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హిజ్రాలకు సమాన హక్కులు కల్పించాలి
కర్నూలు(అర్బన్): స్రీ, పురుషలతో పాటు హిజ్రాలకు కూడా సమాన హక్కులు కల్పించాలని హిజ్రా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మాధురి ఆందోళన వ్యక్తం చేశారు. మానవులతో సమానంగా హిజ్రాలకు కనీస హక్కులు కల్పించాలన్న డిమాండ్‌పై ఇండియన్ నేషనల్ సమతా హిజ్రా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో హిజ్రాలు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 4.5 కోట్ల మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారని, వీరి కోసం రూపొందించిన రైట్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్స్–2015 బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది లోక్‌సభలో పొందలేదన్నారు. ఈ బిల్లును చట్టబద్ధం చేసి సమాజంలో అందరితో సమానమే అనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. కార్యక్రమంలో హిజ్రాల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయకుమార్, రాష్ట్ర కార్యదర్శులు స్వప్నమ్మ, దీపారెడ్డి, ఇందు, అనంతపురం జిల్లా అధ్యక్షులు మయూరి, కర్నూలు నగర నాయకులు ప్రవీణ, స్వప్న, జెస్సీ తదితరులు పాల్గొన్నారు. వీరి దీక్షకు ట్రై బల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.చంద్రప్ప, ఉపాధ్యక్షుడు రామరాజు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు పలు ప్రజాసంఘాలకు చెందిన నాయకులు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. -
విహారయాత్రలో విషాదం
ఏకేబీఆర్ మెయిన్ కెనాల్లో పడి వ్యక్తి మృతి – పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఘటన పెద్దఅడిశర్లపల్లి విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తన బంధువులతో కలిసి ఆదివారం ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు) విహారయాత్రకు వచ్చిన వ్యక్తి మెయిన్ కెనాల్లో పడి తినిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన మహమ్మద్ ఖలీల్‌ఖాన్ (41) స్థానికంగా ఉంటూ వ్యాపారం నిర్వహించేవాడు. మహమ్మద్ ఖలీల్‌ఖాన్ తన సోదరులతో కలిసి సెలవు దినం కావడంతో పీఏపల్లి మండలంలోని ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు) విహారయాత్రకు వచ్చారు. ఖలీల్‌ఖాన్ తన సోదరులతో కలిసి భోజనం చేసి స్నానం చేయడానికి ఏఎమ్మార్పీ మెయిన్ కాల్వలోకి దిగాడు. కాగా ఖలీల్‌ఖాన్ నీటిలో ఈత కొడుతూ అలిపిరి వచ్చి ఊపిరాడక మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే కాల్వలోకి దూకి బయటకు తీయగా అప్పటికే ఖలీల్‌ఖాన్ మృతిచెందాడు. సమాచారం తెలుసుకుని గుడిపల్లి ఎస్ఐ భోజ్యానాయక్, హెడ్‌కానిస్టేబుళ్లు మహమూద్, సిబ్బంది వెంకట్, జాని, హోంగార్డు సైదులుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వేంపెంట దీక్షలకు 500 రోజులు
వేంపెంట(పాములపాడు): పవర్‌ప్లాంటు నిర్మాణ పనులకు వ్యతిరేకంగా వేంపెంట గ్రామ ప్రజలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాటికి వారు చేపట్టిన నిరాహారదీక్షలు 500 రోజుకు చేరుకున్నాయి. అధికార పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రి కేఈ కష్ణమూర్తి, మాజీ న్యాయశాఖా మంత్రి ఏరాసుప్రతాపరెడ్డిల కుటుంబాలకు చెందిన వారే ర్యాంక్ Sపవర్‌ప్లాంటు యజమానులు అయినందువల్లే ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు విమర్శించారు. గ్రామం మధ్యలో ఉన్న నిప్పులవాగుపై 7.5 మెగా వాల్టుల విద్యుత్ ఉత్పాదన ప్లాంటు నిర్మాణం చేపట్టనున్న విషయం విదితమే. ఈ ప్లాంటు నిర్మాణం చేపట్టడం వల్ల గ్రామానికి అనర్థాలు జరుటుతాయనే ఉద్దేశంతో గ్రామస్తులు అలుపెరుగక పోరాటం చేస్తున్నారు. -
బాణసంచా పేలిన దృశ్యాల వీడియో..
కొల్లం: కేరళలోని కొల్లాం జిల్లా పరవూర్‌లో పుత్తింగళ్ దేవీ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 83 మందికిపైగా మృతిచెందగా, 150 మందికి పైగా తీవ్రగాయాలయినట్టు సమాచారం. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చడంతో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం జరుగుతుండగా కొంత దూరం నుంచి తీసిన వీడియోను ఏఎన్ఐ వార్త సంస్థ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది.