వలసలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
వలసలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
Published Tue, Sep 6 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
– ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపణ
– సీమ ప్రగతికోసం ఐక్య ఉద్యమాలకు పిలుపు
కర్నూలు(హాస్పిటల్): విద్యతోపాటు ఇతర అన్ని రంగాల్లో పూర్తి వెనుకబాటుతో ఉన్న జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలు, బెంగళూరు సహా దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పైగా కోసిగి నుంచి బెంగళూరుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును తిప్పుతూ వలసలను మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివద్ధి వేదిక ఆధ్వర్యంలో సీమ సమగ్రాభివద్ధి కోసం గత నెల 24న హాలహర్వి మండలం గూళ్యం నుంచి ప్రారంభమైన జీపు జాతా మంగళవారం కర్నూలులో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక సి.క్యాంపు టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ గేయానంద్ మాట్లాడారు. రాయలసీమలో అత్యధిక నీటి వనరులున్న కర్నూలు జిల్లాలో కూడా జనం తాగునీటికి సైతం అల్లాడుతుండడం దురదష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లతోపాటు పాఠశాలలనూ ప్రభుత్వం మూసివేస్తోందని, పిల్లలంతా బడిమానేసి పనికి వెళ్తున్నారన్నారు. కన్నడ, ఉర్దూ మీడియం పిల్లలు పాఠ్యపుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి విద్య కోస ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా 2వేల మంది ఉపాధ్యాయులను నియమించాలన్నారు. నిరుద్యోగులకు రూ.2వేల భతి ఇవ్వాలని కోరారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, అందులో ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలన్నారు. రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చెన్నయ్య ప్రసంగించారు. ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షులు డాక్టర్ బి. శంకరశర్మ, రాయలసీమ అభివద్ధి వేదిక అనంతపురం జిల్లా కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, వివిధ సంఘాల నాయకులు పెద్దస్వామి, నరసింహ, కవి అజీజ్, మహేశ్వరరావు, బాషా, సునయ కుమార్, రామశేషయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement