migration
-
తిమింగలం సుదూర ప్రయాణం
వాతావరణ మార్పుల పెను ప్రభావాలు జలచరాలపై పడతాయని చెప్పే ప్రబల నిదర్శనమొకటి తాజాగా వెలుగుచూసింది. మహాసముద్రాల ఉపరితజలాల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా చేపలు, తిమింగలం వంటి జలచరాల ఆహార లభ్యతలో మార్పులు సంభవిస్తున్నాయి. జత కట్టడానికి తోడు కోసం అలుపెరుగని అన్వేషణ కొనసాగిస్తున్నాయని తేలింది. చిన్న తిమింగలాల పెంపకానికి అనువైన వాతావరణం, పిల్లల్ని కనడానికి అనువైన సముద్రజలాల ఆవరణ కోసం ఈ భారీ జలచరం ఏకంగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించిందని పరిశోధకుల పరిశోధనలో వెల్లడైంది. సరైన ఆవాసం, ఆహారం, తోడు కోసం దక్షిణ అమెరికా ఖండం నుంచి ఆఫ్రికా ఖండం దాకా వలస యాత్ర మొదలెట్టిన తిమింగలం.. ప్రయాణంలో భాగంగా ఏకంగా రెండు మహాసముద్రాలను దాటి మూడో మహాసముద్ర జలాల్లో తచ్చాడుతోంది. తిమింగలం తిప్పల కథ క్లుప్తంగా..9 సంవత్సరాల్లో..కొలంబియా దేశం సమీపంలో పసిఫిక్ మహా సముద్ర జలాల్లోని ‘గల్ఫ్ ఆఫ్ ట్రిబుగా’లో తొలిసారిగా 2013 జూలై పదో తేదీన ఒక బృందం ఈ మెగాప్టేరా నోవాఏంగ్లీ రకం హంప్‌బ్యాక్ మగ తిమింగలాన్ని చూశారు. దీని ఫొటోలను తీసి తిమింగలం వివరాలను పొందుపరిచే happywhale. com వెబ్సైట్లో పొందుపరిచారు. నాలుగేళ్ల తర్వాత దీనిని బహియే సోలానో ప్రాంతంలో కలియతిరగడం చూశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత అంటే 2022 ఆగస్ట్ 22న ఏకంగా 13,046 కిలోమీటర్ల దూరంలోని ఆఫ్రికా ఖండంలోని హిందూ మహాసముద్ర ప్రాంతం ఝాంజిబార్ చానల్ వద్ద చూశారు. దీనికి సంబంధించిన వేలాది ఫొటోలను కృత్రిమ మేధతో సరిపోల్చి 2013లో దక్షిణ అమెరికాలో కనిపించిన తిమింగలం ఇదేనని తేల్చారు. మొదటిసారి చూసిన ప్రాంతానికి, 2022లో కనిపించిన ప్రాంతానికి మధ్య దూరం సరళరేఖా మార్గంలో చూస్తే 13వేల కి.మీ.లు ఉంటుందని, ఒక వేళ ఇది అర్ధచంద్రాకార మార్గంలో ఇక్కడికి చేరుకుని ఉంటే ఇది ఏకంగా 19,000 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటుందని లెక్కతేల్చారు. ‘‘ ఒక తిమింగలం ఇంతదూరం వలసరావడం చరిత్రలో ఇదే తొలిసారి. సరైన ఆహారం, తోడు దొరక్క సుదూరాలకు ప్రయా ణిస్తోంది’’ అని టాంజానియా సెటాసియన్స్ ప్రోగ్రామ్ శాస్త్రవేత్త డాక్టర్ ఎకటేరినా కలష్నికోవా చెప్పారు. కలష్నికోవా పరిశోధనా వివరాలు రాయల్ సొసైటీ ఆఫ్ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!
బలీన్ తిమింగలం జాతికి చెందిన ఒక మగ హంప్‌బ్యాక్ తిమింగలం వలస రికార్డు ఊహకందనిది. ఏకంగా మూడు మహా సముద్రాలు చుట్టొచ్చి.. రికార్డు క్రియేట్ చేసింది. ఈ మగ తిమింగలం దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు సుమారు 8వేల మైళ్లకు పైగా ఈది ఆశ్చర్యపరిచింది. తన సహచర తిమింగలాన్ని వెతుక్కుఉంటూ ఇంత దూరం సముద్రంలో ఈది ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ తిమింగలం కదలికను శాస్త్రవేత్తల బృందం సుమారు 2013 నుంచి 2022 వరకు ట్రాక్ చేస్తూ వచ్చారు. ఇది దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి ఆఫ్రికాలోని జాంజిబార్లోని తిమింగలలా సంతానోత్పత్తి ప్రదేశం వరకు ఈదుకుంటూ వెళ్లినట్లు తెలిపారు. తిమింగలాల జాతిలోనే అత్యంత అరుదైన జాతి ఈ హంప్‌బ్యాక్ తిమింగలం. ఈ తిమింగల వెనుక ఉన్న విలక్షణమైన మూపురం కారణంగానే వీటిని హంప్‌బ్యాక్ తిమింగలంగా అని పిలుస్తారు. ఇవి మహాసముద్రాల్లోనే ఉంటాయి. వాణిజ్యపరంగా కూడా అత్యంత ఖరీదైన తిమింగలం ఇది.అయితే వేట కారణంగా ఈ జాతి అంతరించిపోతున్నదశలో ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తల బృందం హంప్‌బ్యాక్ తిమింగలాల తీరు, వలస విధానంపై అధ్యయనం చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ మగ హంప్‌బ్యాక్ తిమింగలం కదలికలను ట్రాక్ చేస్తూ వచ్చారు పరిశోధకులు. తొలిసారిగా ఈ తిమింగలాన్ని 2013లో గుర్తించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత మళ్లీ 2022లో జాంజిబార్ తీరంలో నైరుతి హిందూ మహాసముద్రంలో గుర్తించారు.మొదట్లో అదే తిమింగలమా కాదనే అనుమానం కలిగింది. అయితే దాని దాని జననేంద్రియ ప్రాంతంలో తీసిన ఫోటోల ఆధారంగా ఆ తిమింగలమే అని నిర్థారించారు శాస్త్రవేత్తలు. ఇంతకుముందు తాము ఎన్నో విలక్షణమైన తిమింగలాల శక్తిమంతంగా ఈదడం గుర్తించామని, కానీ అవి మధ్యలోనే దారితప్పేవని అన్నారు. అయితే ఈ తిమంగలం మాత్రం ఏదో వెతుకుతూ వచ్చినట్లుగా ఇంత దూరం ప్రయాణించడమే ఆశ్చర్యం కలిగించిందన్నారు. వాస్తవానికి ఇవి చాలా శక్తిమంతంగా ఈదగలవు. కానీ ఇంతలా రికార్డు స్థాయిలో ఈదుకుంటూ వెళ్లడమే ఈ మగ హంప్బ్యాగ్ తిమింగలం ప్రత్యేకత అని చెప్పారు. అయితే కచ్చితంగా ఇలా అంత దూరం ఎందుకు ప్రయాణం చేసిందనేది చెప్పలేమన్నారు. కానీ ఇందుకు వాతావరణ మార్పు, పర్యావరణ మార్పులు పాత్ర ఉండొచ్చని అన్నారు. అలాగే ఆహార అన్వేషణ కూడా అయ్యి ఉండొచ్చన్నారు. ఒక రకంగా తమ పరిశోధన మహాసముద్రాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను హైలెట్ చేసిందని పరిశోధక బృందం తెలిపింది. ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. (చదవండి: ‘సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్'తో అంతలా బరువు తగ్గొచ్చా..!) -
దారి లేకనే దాడులు!
సాక్షి, హైదరాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను పెద్దపులుల దాడులు వణికిస్తున్నాయి. శుక్రవారం కాగజ్‌నగర్ మండలం నజ్రుల్ నగర్ గ్రామం వద్ద మోర్లె లక్ష్మి అనే యువతిపై పెద్దపులి దాడిచేసి చంపేయగా, తాజాగా మరోక్తిపై ఇవాళ దాడి చేసింది. దీంతో.. జిల్లాలో ప్రజలకు మరోసారి పులి భయం పట్టుకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న పులులు.. రిజర్వు అడవుల్లోని కోర్ ఏరియాలకు వెళ్లే దారిలో రోడ్లు, గ్రామాలు అడ్డుగా ఉండటంతోనే అవి మనుషులపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. గత నాలుగేళ్లలో ఈ ప్రాంతంలో పులుల దాడిలో నలుగురు మరణించారు.ఈ ప్రాంతం మహారాష్ట్ర– తెలంగాణ మధ్యలోని టైగర్ కారిడార్‌లో భాగంగా ఉన్నది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్‌ల నుంచి ఆవాసం, తోడు వెతుక్కుంటూ పులులు వస్తున్నాయి. దీంతో మనుషులు–పులుల మధ్య ఘర్షణ ఏర్పడుతున్నది. నవంబర్–డిసెంబర్ నెలలు పులుల సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. ఈ సమయంలో వాటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే కోపంతో దాడులకు దిగే అవకాశాలున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. పెరిగిన సంచారం ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని టైగర్ కారిడార్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో నాలుగైదు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బండికాన, ధాబా గ్రామాల శివార్లలో ఆదివారం పశువులపై ఒక పులి దాడి చేసింది. అది మంగళవారం కూడా అక్కడే సంచరించింది. ఆ తర్వాత ఎకో వంతెన సమీపంలోని ఖిండి దేవస్థానం మీదుగా వెళ్లినట్లు కొందరు గ్రామస్తులు తీసిన వీడియోల్లో వెల్లడైంది. ఈ నెల 21న ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఓ పెద్దపులి పశువులపై దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.ఈ నెల 17న నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి వచి్చన పెద్దపులి.. ఉట్నూరు మండలం చాండూరు గ్రామ శివారులో రాజుల్‌గూడ గ్రా మానికి చెందిన ఓ రైతు ఎద్దుపై దాడి చేసింది. గతంలో పెద్దపులుల సంచారం అంతగా లేని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి పరిధిలోనూ పులి కనిపించింది. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పులుల సంచారం పెరగడాన్ని పర్యావరణ ప్రేమికులు, అటవీ అధికారులు స్వాగతిస్తుండగా, ఆయా పరిసర గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లోని కోర్ ఏరియాలోకి పులులు వెళ్లలేకపోవడం సమస్యగా మారిందని అటవీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్తోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌లలో పులుల సంతతి బాగా పెరిగింది. దీంతో శాశ్వత ఆవాసానికి తగిన అటవీ ప్రాంతం, ఆహారం లభించక కొన్ని పులులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆడ పులుల తోడును వెతుక్కుంటూ మగ పులులు ఆదిలాబాద్ జిల్లాలోని పులుల కారిడార్లోకి, సమీప గ్రామాల్లోకి అడుగు పెడుతున్నాయి. దాదాపు నెలరోజుల వ్యవధిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాలు.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి.. కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో నాలుగైదు పులులు కనిపించాయి. కవ్వాల్ టైగర్ రిజర్వు అనుకూలమైనా.. కవ్వాల్ టైగర్ రిజర్వులోని కోర్ ఏరియాలో పులుల శాశ్వత ఆవాసాలకు అనుకూల పరిస్థితులున్నా.. మధ్యలో రోడ్లు, పోడు భూములు, గ్రామాలు ఉండడం వల్ల అవి అక్కడికి చేరుకోలేకపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. టైగర్ రిజర్వుల్లోని కోర్ ఏరియా, పులుల అవాస ప్రాంతాల నుంచి కొన్ని గ్రామాల తరలింపు జరగకపోవడం వల్లే ఈ సమస్య పెరిగిందనే అంటున్నారు. కవ్వాల్, అమ్రాబాద్ రిజర్వు ఫారెస్టులోని కోర్ ఏరియాలో ఉన్న పలు గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వ పరిధిలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్¯ అథారిటీ నిర్ణయించింది.ఇప్పటికే కవ్వాల్ టైగర్ రిజర్వులోని రెండు గ్రామాలను బయటకు తరలించగా, మరో రెండు గ్రామాల తరలింపునకు ప్రతిపాదించారు. కేటీఆర్‌లోని మూడు గ్రామాలను మొదటి దశలో, మరో పెద్ద గ్రామాన్ని రెండోదశలో బయటకు పంపించేందుకు ప్రతిపాదనలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ గ్రామాల తరలింపు పూర్తయితే పులుల స్థిర నివాసానికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అటవీశాఖ అంచనా వేస్తోంది. -
వలసలపై పాశ్చాత్యుల నటనలు
లాటిన్ అమెరికా, ఆసియా, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి యూరప్‌కు సాగుతున్న వలసలు అక్కడ ఒత్తిడి పెంచుతున్నాయి. ఫ్రాన్స్లోలా అల్లర్లు చెలరేగడం, పలురకాల నేరాలు జరగడం లాంటివి. వీటికి విరుగుడుగా యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులు పెంచితే, అక్కడే అభివృద్ధి జరిగి, వారు యూరప్‌కు వలస రాకుండా ఉంటారని జీ–7 సమావేశాల్లో ఇటలీ ప్రధాని మెలోని చేసిన ప్రతిపాదన వినడానికి అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి యూరోపియన్లు, అమెరికన్లు వందల ఏళ్లుగా అనుసరించిన విధానాల పర్యవసానమే ఈ వలసలు. ఇప్పుడు ప్రత్యక్ష వలస పాలన నుంచి ఉపసంహరించుకున్నా, పరోక్షంగా నియంత్రిస్తూనే ఉన్నారు. వలసలు ఆగాలన్న చిత్తశుద్ధి వారికి ఉంటే చేయవలసింది పరోక్ష దోపిడీని మానివేయటం.ప్రపంచంలోని పేద దేశాలన్నింటిని ఆరు వందల సంవత్సరాల నుంచి తమ వలసలుగా, నయా వలసలుగా మార్చుకుని అదుపులేని దోపిడీ సాగిస్తూ వస్తున్న పాశ్చాత్య దేశాలు, వారి బాగోగుల కోసం అంటూ మరొకమారు నటనలు చేస్తున్నాయి. ఇటలీలో గత వారాంతంలో జరిగిన జీ–7 సమావేశాలలో ఆ దేశపు ప్రధాని జార్జియో మెలోనీ చేసిన ప్రతిపాదనలను గమనిస్తే, ఈ విషయం స్పష్టమవుతుంది.మెలోనీ చేసిన ప్రతిపాదనలు తమకు తక్షణ సమస్యగా మారిన ఆఫ్రికన్ వలసల గురించి. ఆఫ్రికా ఖండంలోని ఉత్తర భాగాన గల అరబ్ దేశాల నుంచి, దక్షిణాన సహారా ఎడారికి దిగువన గల అనేక ఇతర దేశాల నుంచి ఇటలీతో పాటు యూరప్ అంతటికీ వలసలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. వాటిలో చట్ట ప్రకారం జరిగేవాటి కన్నా, అక్రమంగా జరిగేవి అనేక రెట్లు ఎక్కువ. వారంతా ఆఫ్రికా, యూరప్‌ల మధ్య గల మధ్యధరా సముద్రం మీదుగా చిన్న చిన్న పడవలలో రహస్యంగా ప్రయాణిస్తారు. యూరోపియన్ దేశాల గస్తీ బోట్లు పట్టుకునేది కొందరినైతే, అనేక మంది పట్టుబడకుండా యూరప్ తీరానికి చేరతారు. అక్కడి నుంచి తమ మిత్రుల ద్వారానో, లేక స్థానిక అధికారులకు, ఏజెంట్లకు డబ్బు ఇచ్చుకునో వివిధ దేశాలకు వెళ్ళిపోతారు. యథాతథంగా ఇదే తమకు సమస్య అని యూరోపియన్ ప్రభుత్వాలు భావిస్తుండగా, మధ్యధరా సముద్రంపై ప్రయాణ సమయంలో పరిస్థితులు అనుకూలించక పడవలు మునిగి ప్రతి యేటా కొన్ని వందలమంది దుర్మరణం పాలవుతుంటారు. ఈ నేపథ్యంలో, జీ–7 సమావేశాలు ముగిసిన రెండురోజులకే ‘బీబీసీ’ ప్రసారం చేసిన ఒక కథనం సంచలనంగా మారింది. మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న యూరోపియన్ దేశాలలో ఇటలీ, గ్రీస్ ముఖ్యమైనవి. వాటి మీదుగానే వలసదారులు ఇతర చోట్లకు వెళుతుంటారు. అటువంటి స్థితిలో గ్రీస్ తీరప్రాంత గస్తీ అధికారులు వలసదారులను తరచు తిరిగి సముద్రంలోకి బలవంతాన తీసుకుపోయి మునిగిపోయేటట్లు చేస్తున్నారట. గత మూడేళ్ళలో జరిగిన ఇటువంటి ఘటనలలో కొన్నింటిని ‘బీబీసీ’ బయటపెట్టింది. వలసల నివారణకు ఇటలీ ప్రధాని మెలోనీ చేసిన సూచనల ప్రకారం, యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులు పెంచాలి. ఆ విధంగా అక్కడ అభివృద్ధి జరిగితే అక్కడి ప్రజలకు ఉపాధి లభించి వారు యూరప్‌కు వలస రాకుండా ఉంటారు. ఈ విధమైన ప్రతిపాదనలు చరిత్ర తెలియని వారికీ, అమాయకులకూ అద్భుతంగా తోస్తాయి. అటువంటి పెట్టుబడులంటూ నిజంగా జరిగితే, అవి సహజంగా ప్రైవేటువి అవుతాయి. వాటి యాజమాన్యాలు తమ ‘జాబ్‌లెస్ గ్రోత్ టెక్నాలజీ’ వల్ల కొద్దిపాటి ఉపాధులు కల్పించి, వాటికి నికరమైన దీర్ఘకాలిక హామీ ఏదీ లేకుండా చేసి, తమ దృష్టినంతా అక్కడి వనరులను, మార్కెట్లను కొల్లగొట్టటంపై కేంద్రీకరిస్తాయి. ఈ తరహా విధానాల వల్ల వలసల సమస్య, ఆఫ్రికా పేదరికం సమస్య ఎంతమాత్రం పరిష్కారం కావు. యూరోపియన్లు మాత్రం తమ కొత్త పెట్టుబడులకు రాయితీలు సంపాదించి మరింత లాభపడతారు. వాస్తవానికి యూరోపియన్లు, అమెరికన్లు వందల సంవత్సరాలుగా ఈ తరహా ఆర్థిక నమూనాలను అనుసరించిన దాని పర్యవసానమే ఈవిధంగా సాగుతున్న వలసలు. ఈ విషయం ఇటలీ ప్రధాని మెలోనీకి తెలియదని భావించలేము. అసలు మొత్తం పాశ్చాత్య దేశాల చరిత్రే ప్రపంచాన్ని తమ వలసలుగా మార్చుకోవటం; అక్కడి నుంచి లక్షలాది మందిని బానిసలుగా తెచ్చి తమ వాణిజ్య పంటల ఎస్టేట్లలో, ఇతరత్రా భయంకరమైన రీతిలో చాకిరీ చేయించుకోవటం; ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా సహజ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేయటం; తమ ఉత్పత్తులను అక్కడి మార్కెట్లలో బలవంతంగా అమ్మి స్థానిక ఉత్పత్తులను ధ్వంసం చేయటం; స్థానిక పాలకులను రకరకాలుగా లొంగదీసుకుని తుదముట్టించటాలతో నిండిపోయి ఉంది. ఇది అక్కడి నిష్పాక్షికులైన చరిత్రకారులు, మేధావులు నేటికీ ధృవీకరిస్తున్న విషయం. అంతెందుకు, ప్రముఖ వలస రాజ్యాలలో ఒకటైన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు జాక్వెస్ షిరాక్ కొద్దికాలం కిత్రం యూరోపియన్ దేశాల ప్రస్తుత సిరి సంపదలకు తమ వలస దోపిడీలు ఒక ప్రధాన కారణమని అంగీకరించారు. యూరోపియన్ వలసల దశ 1940ల నుంచి 1970ల మధ్య దాదాపు ముగిసిపోయింది. వారి దోపిడీలు కూడా అంతటితో ఆగితే ఈరోజున అక్కడి ప్రజలు యూరప్‌కు గానీ, అమెరికాకు గానీ వలస వెళ్ళవలసిన అగత్యమే ఉండేది కాదు. అక్కడ గల అపారమైన సహజ వనరులు, మానవ నైపుణ్యాలతో వారు స్వయంగా అభివృద్ధి చెంది ఉండేవారు. కానీ పాశ్చాత్యులు ప్రత్యక్ష రాజకీయ వలస పాలన నుంచి ఉపసంహరించుకున్నా, స్థానిక నాయకులను, సైనికాధికారులను, సివిలియన్ అధికారులను, ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులను పరోక్షంగా నియంత్రిస్తూనే వచ్చారు. తమ పెట్టుబడులు, టెక్నాలజీలు, మార్కెటింగ్ వ్యవస్థల ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థలు వారి ఆధీనంలోనే ఉంటూ వస్తున్నాయి. ఆసియా కొంత మెరుగుపడినా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో మార్పులు స్వల్పమే. ఇది మంచి చదువులు, ఉద్యోగాల కోసం వెళుతున్న వారి గురించి అంటున్న మాట కాదు. దిగువ స్థాయి వారికి సంబంధించిన విషయం. ఈ విధంగా వలస వెళుతున్న వారి కారణంగా పాశ్చాత్య దేశాలలో సమస్యలు తలెత్తుతున్న మాట నిజమే. అట్లా వెళ్ళేవారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉండవు. వారు మురికి వాడలలో నివసిస్తుంటారు. వారి వల్ల తక్కిన సమాజంపై రకరకాల ఒత్తిడిలు ఏర్పడుతుంటాయి. ఫ్రాన్స్‌లో వలె ఒక్కోసారి తీవ్రమైన అల్లర్లు, హింస చెలరేగుతాయి. పలురకాల నేరాలు జరుగుతాయి. వారికోసం ఏ ప్రభుత్వమైనా కొన్ని సహాయ చర్చలు తీసుకున్నా అవి ఎంతమాత్రం సరిపోవు. మరొకవైపు వలసలు కొనసాగుతూనే ఉంటాయి. ఇటలీ ప్రధాని మెలోనీ మాటలను ‘చీమా, చీమా ఎందుకు కుట్టావు?’ అన్న నీతికథలో వలె శోధిస్తూపోతే, పైన చెప్పుకున్న వందల ఏళ్ళ పాశ్చాత్య వలస దోపిడీ చరిత్ర ముందుకు వస్తుంది. విచిత్రం ఏమంటే, ఇన్నిన్ని జరుగుతున్నా వారు తమ గత స్వభావాలను, విధానాలను మార్చుకోవటం లేదు. వారికి ఇప్పటికీ చిన్న చిన్న వలస భూభాగాలు, వందలాది సైనిక స్థావరాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవలి కాలానికే వస్తే, ఆఫ్రికాలోని మాజీ ఫ్రెంచి వలసలు సుమారు ఆరింటిలో, అక్కడి ఫ్రెంచ్ అనుకూల పాలకులపై తిరుగుబాట్లు జరిగాయి. కొత్తగా అధికారానికి వచ్చిన వారు అక్కడి ఫ్రెంచ్ సైనిక స్థావరాలను ఖాళీ చేయించి వెళ్ళగొట్టారు. దీనిపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నానా రభస సృష్టించి కొత్త పాలకులపై ఒత్తిడి తెచ్చారు. కానీ వారు ససేమిరా లొంగలేదు. ఇటలీ అధ్యక్షురాలు మెలోనీ నుంచి, అమెరికా అధ్యక్షుడు బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ల వరకు పాశ్చాత్య నాయకులకు ఇటువంటి వలసలను ఆపాలనే చిత్తశుద్ధి నిజంగా ఉందా? వలసలు యూరప్ అంతటా పెద్ద సమస్య అయినట్లు గత వారమే జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికలలో మితవాదుల ఓటు గణనీయంగా పెరగటం రుజువు చేసింది కూడా. వలసలు, జాతివాదమే అక్కడ ముఖ్యమైన అజెండాగా మారుతున్నాయి. అందువల్ల ఆ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చేయవలసింది ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్, ఆసియా దేశాల దోపిడీని త్వరగా మానివేయటం. అక్కడి వనరులను, మార్కెట్లను అక్కడి ప్రజల నియంత్రణకు, ఉపయోగానికి వదిలి వేయటం. వారితో అన్ని సంబంధాలను సమతులనంగా, పారదర్శకంగా, ప్రజాస్వామికంగా మార్చుకోవటం. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
World Migration Report 2024: భారత్‌కు మనవాళ్ల డబ్బేడబ్బు
ఐక్యరాజ్యసమితి: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తమ సంపాదనను పంపడంలో (రెమిటెన్స్) రికార్డు సృష్టించారు. భారత్‌కు ఈ తరహా నిధులు 2022లో 111.22 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీనితో ఇంత భారీ స్థాయిని అందుకున్న తొలి దేశంగా భారత్ రికార్డులకు ఎక్కింది. నిజానికి రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లు దాటిన తొలి దేశంగా కూడా భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ మేరకు విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... » రెమిటెన్సులకు సంబంధించి భారత్ తరువాతి నాలుగు స్థానాల్లో మెక్సికో(61 బిలియన్ డాలర్లు), చైనా (51 బిలియన్ డాలర్లు), ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్ నిలిచాయి. 2021లో చైనా స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది. » దక్షిణాసియా నుంచి చాలా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నందున ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్‌కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతోంది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు రెమిటెన్సులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 21.5 బిలియన్ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో నిలుస్తోంది. » 44.8 లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. » విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా (8,33,000) ఉంది. తరువాతి స్థానాల్లో బ్రిటన్ (దాదాపు 6,01,000), ఆస్ట్రేలియా (దాదాపు 3,78,000), జర్మనీ (3,76,000 పైగా), కెనడా (దాదాపు 3,18,000) ఉన్నాయి.భారత్ పయనమిలా... (అంకెలు బిలియన్ డాలర్లలో) 2010 53.48 2015 68.91 2020 83.15 2022 111.22 -
యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్..
స్వదేశీయులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి.. ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి "రాడికల్ యాక్షన్" ప్రకటించింది. ఇందులో భాగంగానే నైపుణ్యం కలిగిన విదేశీయుడు యూకేలో పనిచేయడానికి వీసా కావాలనుకుంటే.. కనీస వేతనాన్ని కూడా భారీగా పెంచింది. 2022లో ప్రభుత్వం జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య 745000. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికంగా కావడం గమనార్హం. పెరిగిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్యను మూడు లక్షల కంటే తక్కువకు తీసుకురావాలనుకునే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ హోమ్ మినిష్టర్ 'జేమ్స్ క్లెవెర్లీ' (James Cleverly) తెలిపారు. అంతే కాకుండా కొత్త రాకపోకలను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై ఒత్తిడి పెరగటం కూడా ఇందుకు ఒక కారణం అని తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడించాయి, దానిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ఇవన్నీ యూకే ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని.. రిషి సునాక్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ విదేశీ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌కు తీసుకుని రావడంపై కూడా నిషేధం ఉంది. అయితే రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇందులో నుంచి మినహాయింపు ఉంటుంది. విదేశీ ఉద్యోగుల జీతం కూడా 38,000 పౌండ్లకు (రూ.40,01,932) పెంచింది. గతంలో యూరోపియన్ యూనియన్ దేశాల వారు ఎక్కువగా బ్రిటన్ దేశానికీ వలసలు వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఇండియా, నైజీరియా, చైనా నుంచి బ్రిటన్ వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని సమాచారం. Immigration is too high. Today we’re taking radical action to bring it down. These steps will make sure that immigration always benefits the UK. pic.twitter.com/osz7AmcRgY — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 We've just announced the biggest ever cut in net migration. No Prime Minister has done this before in history. But the level of net migration is too high and it has to change. I am determined to do it. — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 -
గణాంకాలు చెప్పే నిజాలు!
సరైన ప్రాతిపదికలు ఎంచుకుని, శాస్త్రీయ విధానంలో నమూనాలు రూపొందించుకుని వాటి ఆధారంగా సర్వే చేయాలేగానీ గణాంకాలెప్పుడూ అబద్ధం చెప్పవు. అలాగే అవి అన్నిసార్లూ పాలకులను రంజింపజేయలేవు. అప్పుడప్పుడు మిశ్రమ ఫలితాలు కూడా తప్పకపోవచ్చు. వెల్లడైన అంశాల్లోని వాస్తవాలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన విధానాలను రూపొందించగలిగితే స్థితి గతులు మెరుగుపడతాయి. మనను చిన్నబుచ్చటానికే, ప్రతిష్ఠ దెబ్బతీసేందుకే ఇలాంటి గణాంకాలు అందిస్తున్నారని కొట్టిపారేస్తే అందువల్ల ప్రయోజనం ఉండదు. తాజాగా 2023కి సంబంధించిన అంచనాలతో ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) విడుదల చేసిన నివేదిక వెలువరించిన గణాంకాలు మనకు ఏక కాలంలో అటు సంతోషాన్నీ, ఇటు నిరాశనూ కూడా కలిగిస్తుండగా... ప్రపంచ బ్యాంకు నివేదిక ఓ విధంగా భయపెడుతోంది. ఓఈసీడీ నివేదిక ప్రకారం సంపన్న రాజ్యాలకు అంతక్రితం కన్నా 2021, 2022 సంవత్సరాల్లో వలసలు బాగా పెరిగాయి. ఇందుకు ఉక్రెయిన్ యుద్ధం చాలావరకూ దోహదపడి వుండొచ్చు. ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు యూరోప్ దేశాలకు వలసపోయారు. అలాగే 2020లో ప్రతి దేశమూ సరిహద్దులు మూసి వేయటంతో వలసలు దాదాపుగా నిలిచిపోయాయి గనుక దాంతో పోలిస్తే వలసలు పెరిగి వుండొచ్చు. అయితే స్థూలంగా చూస్తే వలసలు పెరిగాయి. అదే సమయంలో ఆ వలసల్లో మహిళల శాతం కూడా పెరిగింది. నిరుడు మన దేశంనుంచే వలసలు అధికంగా వున్నాయని నివేదిక సారాంశం. ఉన్నత విద్యకోసం వెళ్లేవారిని మినహాయించి కేవలం ఉపాధి కోసం వెళ్తున్నవారినే లెక్కేస్తే భారత్ నుంచి ఈసారి ఎక్కువమంది ఉద్యోగార్థులు వెళ్లారని ఆ నివేదిక వివరిస్తోంది. ఓఈసీడీలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు సహా 38 సంపన్న దేశాలకు సభ్యత్వం వుంది. ఈ దేశాలకు 2021–22 మధ్య పదిలక్షల మంది వివిధ దేశాల నుంచి వలస రాగా అందులో 4.07 లక్షల మంది మన పౌరులు. ఉన్నత విద్య కోసం వెళ్లేవారిలో భారత్ రెండో స్థానంలో వుంది. మన దేశం నుంచి ఈ కేటగిరీలో 4.24 లక్షలమంది వుండగా, చైనా 8.85 లక్షలతో అగ్రభాగాన వుంది. అటు ఉపాధి కోసమైనా, ఇటు విద్యార్జన కోసమైనా అత్యధికులు ఎంచుకుంటున్నది అమెరికా, ఆస్ట్రే లియా, కెనడా దేశాలేనని నివేదిక వెల్లడిస్తోంది. ఈ వలసల గణాంకాలు గమనిస్తే అంతర్జాతీయంగా వుండే తీవ్ర పోటీని తట్టుకుని మన దేశం నుంచి ఎక్కువమంది ఉపాధి అవకాశాలను గెల్చు కుంటున్నారని తెలుస్తుంది. విదేశాలకు వెళ్లినవారు తమ కుటుంబాలకు పంపే నగదు నిరుడు బాగా పెరిగింది. ఆ ఏడాది 11,100 కోట్ల డాలర్లు భారత్‌కు విదేశాల నుంచి వచ్చిందని అంచనా. ఇది దేశ జీడీపీలో 3.3 శాతం. అంతేకాదు... ప్రపంచ దేశాలన్నిటిలో చాలా అధికం. ఈ నగదులో 36 శాతం అమెరికా, బ్రిటన్, సింగపూర్ల నుంచి వచ్చిందేనని గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టే భారత్‌కూ, అభివృద్ధి చెందిన దేశాలకూ సంబంధ బాంధవ్యాలు ఎంత పెరిగాయో తెలుస్తున్నది. అటు విద్యారంగాన్ని గమనిస్తే ఉన్నత చదువుల కోసం పిల్లలను విదేశాలకు పంపే తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతున్నదని అర్థమవుతుంది. ఈ విషయంలో లింగ వివక్ష కూడా తగ్గిందని ఓఈసీడీ నివేదిక వివరిస్తోంది. విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లేవారు అంతక్రితంతో పోలిస్తే రెట్టింపు పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ఉపాధి కోసమైనా, విద్య కోసమైనా వెళ్లేవారు పెర గటం మనవాళ్ల సత్తాను చాటుతోంది. ఎందుకంటే ప్రత్యేక నైపుణ్యాలుంటే తప్ప ఇదంతా సాధ్యం కాదు. అయితే ఇదే సమయంలో మన దేశంలో అటువంటి నిపుణులకు తగిన అవకాశాలు లేవన్న చేదు వాస్తవం వెల్లడవుతోంది. తగిన ఉపాధి, మంచి వేతనాలు లభించినప్పుడు వాటిని వదులు కుని ఎవరూ అయినవారికి దూరంగా పరాయి దేశాలకు వలస వెళ్లాలనుకోరు. వెళ్తున్నారంటే అలాంటివారికి తగిన ఉపాధి అవకాశాలు చూపలేకపోతున్నామని, మెరుగైన వేతనాలు ఇవ్వలేకపోతున్నా మని అర్థం. ఆ నైపుణ్యాలను మన దేశాభివృద్ధికి వినియోగించలేకపోతున్నామని, తగిన శ్రద్ధ పెట్ట డంలేదని గుర్తించాలి. ఈ సందర్భంలో ఈమధ్యే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఇచ్చిన గణాంకాల ఆధారంగా రూపొందిన ప్రపంచ బ్యాంకు నివేదికను కూడా ప్రస్తావించుకోవాలి. నిరుడు మన ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లో నిరుద్యోగిత అధికంగా వున్నదని ఆ నివేదిక తెలిపింది. మన దేశ యువతలో నిరుద్యోగిత 23.22 శాతం వుంటే, పాకిస్తాన్ (11.3 శాతం),బంగ్లాదేశ్ (12.9 శాతం), ఆఖరికి భూటాన్ (14.4 శాతం)లతో మనకంటే దూరంగా వున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. విదేశాలకెళ్లేవారు పెరగటం గర్వపడాల్సిన విషయమేననటంలో సందేహం లేదు. ఉన్నత విద్యా రంగంలో చూస్తే మన దేశంలో చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నత శ్రేణి విద్యాసంస్థలున్నాయి. అవి కూడా వివిధ అంశాల్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా నిలబడలేకపోతున్నాయి. బోధనారంగ నిపుణులు కూడా అంతే. వారికి ఉన్నత విద్యాసంస్థల్లో అవకాశాలు లభించి తగిన వేతనాలు లభిస్తే ఇక్కడే ఉంటారు. అందువల్ల మన పిల్లల స్థితిగతులు మరింత మెరుగుపడతాయి. విదేశాల్లో విశ్వవిద్యాలయాలు ఇక్కడివారిని ఆకర్షించి భారీ మొత్తంలో వేతనాలిస్తుంటే మన సంస్థలు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఉపాధి విషయంలోనూ అంతే. తయారీ రంగ పరిశ్రమలను పెంచగలిగితే, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు మరింత మెరుగ్గా చేయూతనందించగలిగితే వలస పోయేవారి మేధస్సు పూర్తిగా ఇక్కడే వినియోగపడుతుంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమై జీవనప్రమాణాలు పెరగటానికి దోహదపడుతుంది. -
శీతాకాలం విడిది కోసం వలస వెళ్తున్న పక్షులు, వేలకిలోమీటర్ల ప్రయాణం
శీతాకాలం విడిది కోసం పక్షుల వలసలు మొదలయ్యాయి. దేశీయంగానూ ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు పక్షులు వలస వెళ్తాయి.ఎన్నో జాతుల పక్షులకు వలస వెళ్ళడం వాటి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ప్రపంచ పక్షి జాతుల్లో సుమారు 40శాతం దాకా వలస వెళ్తాయని అంచనా. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. శీతోష్ణస్థితిలో ఏర్పడిన అననుకూల పరిస్థితుల వల్ల, ఆహారం కోసం, గుడ్లను పెట్టి పొదిగి సంతానాభివృద్ధికి, వ్యాధుల నుంచి రక్షణకు పక్షులు వలస వెళ్తాయి. వలసలో భాగంగా పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.వాతావరణం అనుకూలంగా మారిన తరవాత మళ్ళీ వెనుదిరుగుతాయి. ముఖ్యంగా శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి పక్షులు భారత్‌లోకి వలస వస్తుంటాయి. అయితే శీతాకాల విడిది కోసం వలస వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న పక్షి పేరు ఓనోన్ కుకూ. ఏప్రిల్29న ఆఫ్రికాలోని కెన్యాలో ఉన్న ఈ పక్షి ఈరోజు(శనివారం)మధ్యప్రదేశ్‌కి చేరుకుంది. అరేబియా సముద్రానికి 150 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఈ పక్షి ప్రయాణం సాగింది. మరో వారం రోజుల్లో ఇది 5వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు.దీనిలాగే ఇతర పక్షులు కూడా మార్గమధ్యంలో ఆహారం, విశ్రాంతి కోసం కొంతకాలం ఆగుతాయి. He is Onon a Cuckoo. This bird was in Kenya on 29th April. Today he is in Madhya Pradesh. He has completed his crossing of the Arabian Sea to India and, for good measure, flown another 600 km inland also. It is 5000 Kms flying in a week. Feel that amazing feat. @BirdingBeijing pic.twitter.com/SGfuGO3MkS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) May 4, 2020 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చే విభిన్న రకాల విదేశీ పక్షులను చూసేందుకు, కెమెరాలతో క్లిక్ మనిపించేందుకు బర్డ్ వాచర్లు క్యూ కడుతుంటారు. అయితే ఒకప్పుడు వందల సంఖ్యలో వచ్చే విదేశీ పక్షుల రాక క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ పక్షులు ఆవాసాలుగా చేసుకునే చెరువులు ఆక్రమణలకు గురవడం, చెరువుల చుట్టూ నిర్మాణాలు పెరిగిపోతుండటంతో వాటి రాక క్రమంగా తగ్గిపోతోంది. 📢Today is the day! Let’s celebrate bird migration on #WorldMigratoryBirdDay! On their epic journeys, migratory birds help inspire many people and cultures along the way. Learn more about their migration & how you can protect them: ➡️https://t.co/SoAJkVyx3z pic.twitter.com/OIiFGSPaTp — World Migratory Bird Day (@WMBD) October 14, 2023 ప్రస్తుతం ఈ సీజన్లోనూ సిటీకి విదేశీ పక్షులు వచ్చినప్పటికీ మునుపటితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని బర్డ్వాచర్లు పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే రాను రాను ఈ సంఖ్య మరింత పడిపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇన్ని చిరుకప్పలు ఎక్కడి నుంచి
అమెరికాలోని కాలిఫోర్నియాలోగల స్టాక్టన్లో వేలకొద్దీ చిరుకప్పులు ఒక రోడ్డును దాటుతున్నాయి. ఇది చిరు కప్పల సామూహిక వలసగా కనిపించింది. ఒక మైలు పొడవునా విస్తరించిన ఈ రోడ్డు పొడవునా చిరు కప్పలు ఉండటాన్ని చూసినవారు తెగ ఆశ్చర్యపోతున్నారు. విమానాశ్రయం నుండి ఇంటికి కారులో వెళుతున్న ఈ ప్రాంతానికి చెందిన మేరీ హులెట్ రోడ్డుపై ఎదో కదులుతున్నట్లు కనిపించడంతో ముందునున్న కార్లు ఆగిపోవడాన్ని తాను గమనించానని తెలిపింది. రోడ్డుపై దృష్టి కేంద్రీకరించినప్పుడు కప్పల సైన్యం రహదారికి అడ్డుగా ఉందని గ్రహించానని ఆమె పేర్కొంది. ఇవి రహదారిని దాటడాన్ని గమనించానని ఒక వార్తా సంస్థకు ఆమె తెలిపింది. ఈ విధంగా కప్పల వలసలను చూసిన జీవశాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. సిల్వర్ అవెన్యూలో ఎస్ కర్వ్స్ అని పిలిచే ప్రాంతంలో ఈ చిరు కప్పలు కనిపించాయి. వైల్డ్‌లైఫ్ రిసోర్సెస్ సెంట్రల్ రీజియన్‌లోని ఉటా విభాగానికి చెందిన ఆక్వాటిక్స్ మేనేజర్ క్రిస్ క్రోకెట్ మాట్లాడుతూ ఈ కప్పలను గ్రేట్ బేసిన్ స్పాడెఫుట్ టోడ్స్ అని అంటారన్నారు. అవి చుట్టుపక్కల ఉన్న కొండలకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. కాగా కొన్ని కార్లు ఆ చిరు కప్పల మీదుగా వెళ్లడంతో చాలా చిరుకప్పలు చనిపోయాయి. అయితే స్థానికులు ఈ కప్పలను కాపాడేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హవ్వ.. గన్ను కొనడం ఇంత సులభమా? Witnesses describe seeing a 'biblical' mass migration of toads over a mile long pic.twitter.com/ii0HUn8DD4 — CNN (@CNN) July 24, 2023 -
అక్కడంతా మృత్యుభయం! మురికివాడలో శరణార్ధుల గోస
ఇజ్రాయెల్ ఆక్రమిత ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థుల శిబిరం 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖంగా వార్తల్లోకి వచి్చంది. జెనిన్ క్యాంప్‌లో ఉగ్రవాదులను ఎరివేయడానికి ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. లక్ష్యం నెరవేరిందని ఇజ్రాయెల్ చెబుతోంది. జెనిన్ రెఫ్యూజీ క్యాంప్‌నకు దాదాపు ఏడు దశాబ్దాల కన్నీటి చరిత్ర ఉంది. ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్‌ల మధ్య ఘర్షణలకు ఈ ప్రాంతం వేదికగా మారుతుండడంతో శరణార్థులకు కష్టాలు ఎదురవుతున్నాయి. చెల్లాచెదురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ మిలటరీ ఆపరేషన్ వల్ల గత 3 రోజుల్లో వేలాది మంది జెనిన్ క్యాంప్ విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఈ క్యాంప్ ఎందుకు ఏర్పాటయ్యిందో, ఇక్కడి పరిస్థితులేమిటో తెలుసుకుందాం.. శరణార్థుల గడ్డ.. మిలిటెంట్ల అడ్డా అమెరికాతోపాటు పశి్చమ దేశాల అండతో 1948లో యూదుల కోసం ఇజ్రాయెల్ ఆవిర్భవించింది. విస్తీర్ణంలో చిన్నదైనా తన చుట్టుపక్కల దేశాల భూభాగాలను బలప్రయోగంతో ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. ప్రాచీన కాలంలో ఆ ప్రాంతాలన్నీ యూదు రాజ్యంలో అంతర్భాగమేనని వాదించింది. అలా పొరుగు దేశమైన పాలస్తీనాపై కన్నేసింది. ఇజ్రాయెల్ సైన్యం దాడులను తట్టుకోలేక పాలస్తీనా పౌరులు సొంత ఊళ్లు వదిలేసి శరణార్థులుగా మారి వలసబాట పట్టారు. అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం 1950వ దశకంలో పాలస్తీనా శరణార్థుల కోసం వెస్ట్‌బ్యాంక్‌లో పలు శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి జెనిన్ రెఫ్యూజీ క్యాంప్. నిజానికి ఇదొక మురికివాడ అని చెప్పొచ్చు. పేదరికానికి, ఆకలి చావులకు మారుపేరు. పాలస్తీనా మిలిటెంట్లు తమ కార్యకలాపాల కోసం జెనిన్‌ను అడ్డాగా మార్చుకున్నారు. తరచుగా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతున్నారు. మిలిటెంట్ల చర్య స్వాతంత్య్రం కోసం జరుగుతున్న సాయుధ తిరుగుబాటు అని పాలస్తీనా సానుభూతిపరులు చెబుతుండగా, అది ముమ్మాటికీ ఉగ్రవాదమేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. పాలస్తీనియన్ మిలిటెంట్ కమాండ్ సెంటర్లు జెనిన్లో ఉన్నాయని అంటోంది. వేలాది మందికి ఆవాసం జెనిన్ క్యాంప్ పాలస్తీనా శరణార్థులతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం 18,000 మంది నివసిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అసలైన లెక్క ఎంతన్నది తెలియదు. ఐక్యరాజ్యసమితి పాలస్తీనియన్ రెఫ్యూజీ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం 14,000 మంది ఉంటున్నారు. 2020 నాటి పాలస్తీనా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం 12,000 మంది శరణార్థులు నివసిస్తున్నారు. యుద్ధానికి దారితీసిన ఆత్మాహుతి దాడి జెనిన్ క్యాంప్‌లో 2002లో జరిగిన ఘర్షణలో 50 మందికిపైగా పాలస్తీనా జాతీయులు, 23 మంది ఇజ్రాయెల్ సైనికులు బలయ్యారు. యూదు సెలవు దినం సందర్భంగా మతపరమైన వేడుక కోసం గుమికూడిన యూదు జాతీయులపై మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది యూదు జాతీయులు మరణించారు. దాంతో మిలిటెంట్ల భరతం పట్టడానికి ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్‌బ్యాంక్‌పై విరుచుకుపడింది. పాలస్తీనాలోకి సైతం సైన్యం అడుగుపెట్టింది. రమల్లా నగరంలో అప్పటి పాలస్తీనా అధినేత యాసర్ ఆరాఫత్ ఇంటిని చుట్టుముట్టింది. ఇజ్రాయెల్ సైనికులు, పాలస్తీనా మిలిటెంట్ల నడుమ కొన్ని రోజులపాటు హోరాహోరీగా యుద్ధంకొనసాగింది. ఇరువైపులా ప్రాణనష్టంతో యుద్ధం ముగిసింది. జెనిన్ క్యాంప్ అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా మారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. దీనివెనుక పలు కారణాలు కనిపిస్తున్నారు. మిలిటెంట్ల దుశ్చర్యపై ఆగ్రహావేశాలు రెండు వారాల క్రితం జెనిన్ క్యాంప్‌లో మిలిటెంట్లు రెచి్చపోయారు. జెనిన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్ ప్రయోగించారు. దీంతో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఏడుగురు ఇజ్రాయెల్ జవాన్లు గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిలిటెంట్ల దుశ్చర్యంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ చేతగానితనంలోనే ఉగ్రవాదులు రెచి్చపోతున్నారంటూ ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూపై ఒత్తిడి పెరిగింది. దానికితోడు వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ సెటిలర్స్‌లో ఎక్కువమంది నెతన్యాహూ మద్దతుదారులే ఉన్నారు. మిలిటెంట్లను కఠినంగా అణచివేయాలంటూ వారు సైతం ఒత్తిడి తెచ్చారు. దాంతో జెనిన్ క్యాంప్‌లో సైనిక ఆపరేషన్‌కు నెతన్యాహూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఈ నెల 3వ తేదీన ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. జెనిన్లో శరణార్థుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ముష్కరుల స్థావరాలుగా భావిస్తున్న ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేసింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకేనా? ఇటీవలి కాలంలో బెంజమిన్ నెతన్యాహూ రాజకీయంగా కొంత బలహీనపడ్డారు. ఆయన తీసుకొచ్చిన వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణ బిల్లుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెస్ట్‌బ్యాంక్‌లో జెనిన్తోపాటు ఇతర ప్రాంతాల్లో సాయుధ ముఠాలు బలం పుంజుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఆయనకు ఏర్పడిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అందుకే జెనిన్ క్యాంప్‌లో సైనిక ఆపరేషన్‌కు ఆదేశాలు ఇచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -సాక్షి, నేషనల్ డెస్క్ -
విదేశాలకు వలసల్లో మనమే టాప్.. దేశాన్ని వీడిన 1.80 కోట్ల మంది..
సాక్షి, అమరావతి: మెరుగైన జీవనం కోసం వలస వెళ్లడం మానవ చరిత్రలో సహజ ప్రక్రియ. ఆధునికకాలంలో విదేశాలకు వలస వెళ్లడం మరింత పెరుగుతోంది. విదేశాలకు వలసబాటపడుతున్న వారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం అత్యధికంగా భారతీయులు విదేశాలకు వెళుతున్నారని ఐక్య రాజ్యసమితి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్(యూఎన్ డీఈఎస్ఏ) ‘ఇంటర్నేషనల్ మైగ్రేషన్’ పేరిట ఇటీవల విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌లో జన్మించి 2020 నాటికి విదేశాల్లో స్థిరపడినవారు 1.80కోట్లమంది ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు వలసల వివరాలను వెల్లడించిన ఈ నివేదికలో భారతీయులకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. 2020నాటికి 1.80కోట్లమంది వలస... జన్మించిన దేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో ఉన్నవారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటిస్థానంలో ఉన్నారు. ఈ విధంగా 2020నాటికి 1.80కోట్లమంది భారతీయులు విదేశాల్లో స్థిరపడ్డారు. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ 2020లో 7.20లక్షలమంది, 2021లో 8.30లక్షలమంది భారతీయులు విదేశాలకు వలస వెళ్లారు. 2020లో జూలై నాటికే 13లక్షలమంది విదేశాలకు వలస వెళ్లడం గమనార్హం. విదేశాలకు వలస వెళుతున్నవారిలో భారతీయుల తర్వాత మెక్సికన్లు (1.10కోట్ల మంది), రష్యన్లు(1.10కోట్లమంది), చైనీయులు (కోటిమంది), సిరియన్లు (80లక్షల మంది) వరుస స్థానాల్లో ఉన్నారు. యూఏఈ, అమెరికా, సౌదీ వైపే మొగ్గు.. భారతీయులు అత్యధికంగా వలస వెళుతున్న దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మొదటిస్థానంలో ఉంది. 2020నాటికి యూఏఈలో 35లక్షలమంది భారతీయులు ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న అమెరికాలో 27లక్షలమంది, మూడో స్థానంలో నిలిచిన సౌదీ అరేబియాలో 25లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్ దేశాలు ఉన్నాయి. వలస వెళుతున్న భారతీయుల్లో 15శాతం మంది గమ్యస్థానం ఇమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వైర్డ్ (ఈసీఆర్) దేశాలే. అన్‌స్కిల్డ్ కార్మికులు ఎక్కువగా ఉపాధి కోసం ఈ 18 ఈసీఆర్ దేశాలకు వెళుతున్నారు. ఆ జాబితాలో బహ్రెయిన్, ఖతర్, ఒమన్, ఇండొనేషియా, సౌదీ అరేబియా, ఇరాక్, సుడాన్, జోర్డాన్, దక్షిణ సుడాన్, కువైట్, సిరియా, లెబనాన్, థాయిలాండ్, లిబియా, యూఏఈ, మలేషియా, యెమెన్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. విద్యార్థులూ ఎక్కువే... ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే ఉంది. కరోనా వ్యాప్తికి ముందు 2019లో 5.9లక్షలమంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. కరోనా ప్రభావంతో 2020లో 2.6లక్షలమంది మాత్రమే విదేశాలకు వెళ్లగా... 2021లో 4.4లక్షలమంది విదేశాల్లోని విద్యాసంస్థల్లో చేరారు. 2022లో విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022 జూన్ నాటికే 2.50లక్షలమంది విదేశాలకు వెళ్లారు. ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు వెళుతున్న దేశాల్లో కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో శాశ్వతంగా స్థిరపడేందుకు భారతీయులు గణనీయంగా మన దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. చదవండి: మే 15 నుంచి ఏపీ ఈఏపీసెట్.. షెడ్యూల్ విడుదల -
భార్య కళ్లేదుటే ఘోరం..చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ..
సాక్షి, రాజేంద్రనగర్: ‘మరో నెల రోజుల్లో ఇంటికి వస్తా. అక్కడే ఏదో ఒక పని చేసి బతుకుదాం.. పిల్లాపాపలతో అందరం హాయిగా ఉందాం’ అని చెప్పిన భర్త.. తన కళ్ల ముందే అసువులు బాయడంతో ఆ ఇల్లాలు విలపించిన తీరు అందరి గుండెలను కదిలించింది. ఒంటి నిండా తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న భర్తను కాపాడాలని కనిపించిన వారి కాళ్లా వేళ్లా పడింది. కానీ.. కట్టుకున్న వాడి ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఈ హృదయ విదారక ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లా సేడం మండలానికి రతన్ (35), మంజూల (32) భార్యభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. స్థానికంగా పనులు లేకపోవడంతో.. ఏడాది క్రితం బతుకుదెరువు కోసం రతన్ నగరానికి వలస వచ్చాడు. పాండురంగానగర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ స్థానికంగా కూలీ పని చేస్తున్నాడు. ప్రతి నెలా సొంతూరికి వెళ్లి భార్యకు డబ్బులు ఇచ్చి వచ్చేవాడు. కూలీ పనులు దొరక్కపోవడంతో రెండు నెలలుగా గ్రామానికి వెళ్లడం లేదు. దీంతో ఆయన భార్య మంజుల మూడు రోజుల క్రితం భర్త వద్దకు వచ్చింది. రెండు రోజులు భర్తతో ఉండి అప్పటి వరకు జమ చేసిన డబ్బులు తీసుకుని సోమవారం ఉదయం స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైంది. మరో నెల రోజులు ఇక్కడే పని చేసి వచి్చన డబ్బుతో తానే వస్తానని భార్యకు చెప్పాడు. ఇక్కడ అంతగా పని దొరకడం లేదని గ్రామానికి వచ్చి పని చేసుకుని మీతోనే ఉంటానన్నాడు. దూసుకు వచ్చి మృత్యువు.. సోమవారం ఉదయం భార్యభర్తలు ఇదే విషయం మాట్లాడుకుని హైదర్‌గూడలోని బస్టాప్ వద్దకు చేరుకున్నారు. బస్టాప్ వద్ద ఉదయం 6 గంటలకు నిలుచుని ఉన్నారు. ఇదే సమయంలో ఆరాంఘర్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న టస్కర్ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ వేగంగా దూసుకువచ్చింది. బస్టాప్‌లో నిలుచున్న దంపతులిద్దరినీ ఢీకొట్టింది. టస్కర్ చక్రాల కింద నలిగిన రతన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి వరకు తనతో నెల రోజుల్లో గ్రామానికి వస్తానన్న భర్త తన కళ్లెదుటే తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఆమె కన్నీరుమున్నీరుగా రోదించింది. భర్త బతికే ఉన్నాడనుకుని కాపాడండంటూ అక్కడ ఉన్నవారిని ప్రాధేయపడింది. ఆమె అభ్యర్థనలు అతడి ప్రాణాలను కాపాడలేకపోయాయి. ప్రమాదానికి కారకుడైన టస్కర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది. (చదవండి: చిన్నపాటి గొడవ..పూలు కట్ చేసే బ్లేడ్‌తో యువకుడిని..) -
అన్‌స్టాపబుల్ జర్నీ.. ప్రపంచ రికార్డు నెలకొల్పింది!
హోబార్ట్(టాస్మానియా): రాత్రిపగలు తేడా లేకుండా ఏకధాటిగా పదకొండు రోజుల ప్రయాణం. ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు. ఆకలి దప్పిక తీర్చుకోలేదు. పదకొండు వేల కిలోమీటర్లు వలస ప్రయాణంతో సరికొత్త రికార్డుతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది ఓ గాడ్విట్ పక్షి. గాట్‌విట్(లిమోసా లప్పినోకా).. నెమలి తరహాలో ఉండే ఓ పక్షి. దానికి 234684 అనే నెంబర్‌తో 5జీ శాటిలైట్ ట్యాగ్‌ను పక్షి కింది భాగంలో బిగించారు. అమెరికా రాష్ట్రమైన అలస్కా నుంచి వలస మొదలుపెట్టి ఆస్ట్రేలియా రాష్ట్రమైన టాస్మానియాకు చేరుకుని ప్రయాణం పూర్తి చేసుకుంది ఈ పక్షి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అది ఎక్కడ ఆగలేదు. ఆహారం, నీటిని తీసుకోలేదు. తద్వారా అధికారికంగా అత్యధిక దూరం వలస ప్రయాణం చేసిన పక్షిగా రికార్డులు బద్ధలు కొట్టింది. అక్టోబర్ 13వ తేదీన దాని ప్రయాణం మొదలైంది. మొత్తం పదకొండు రోజులపాటు ఎక్కడా వాలకుండా ముందుకెళ్లింది అది. ఈ పక్షి ప్రయాణించిన దూరం.. ఈ భూమి పూర్తి చుట్టుకొలతలో మూడో వంతు!. లండన్ నుంచి న్యూయార్క్ మధ్య రెండున్నర సార్లు ప్రయాణిస్తే ఎంత దూరమో అంత!. గతంలో 217 మైళ్ల దూరం ఇదే గాడ్విట్ సంతతికి చెందిన పక్షి విరామం లేకుండా ప్రయాణించింది. ఈ రాత్రిపగలు సుదీర్ఘ ప్రయాణంలో.. ఆ పక్షి బరువు సగం తగ్గిందని టాస్మానియాకు చెందిన వన్యప్రాణి నిపుణులు ఎరిక్ వోఎహ్లెర్ చెప్తున్నారు. చిన్న తోక, పొడుగు ముక్కు, సన్నకాళ్లతో ఉండే గాడ్విట్ పక్షి.. 90 డిగ్రీల యూటర్న్ తీసుకుని నేల మీద వాలే ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంది. అయితే.. రిస్క్‌తో కూడుకున్న జీవితం వీటిది. లోతైన నీటిపై గనుక అవి వాలితే.. ప్రాణాలు కోల్పోతాయి. వాటి కాళ్ల కింద భాగం నీటి తేలేందుకు అనుగణంగా ఉండదు. తద్వారా అవి నీళ్లలో పడితే మళ్లీ పైకి ఎగరలేవు. సుదీర్ఘ దూరం ప్రయాణించిన 234684 గాడ్విట్ పక్షి సముద్రాలు దాటుకుంటూ రిస్క్‌తో కూడిన ప్రయాణమే చేసిందని ఎరిక్ వివరిస్తున్నారు. -
నిజామాబాద్ ఫస్ట్.. హైదరాబాద్ సెకండ్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. వలస వెళ్లిన వారిలో అత్యధికులు నిజామాబాద్ జిల్లా వారు కాగా... హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. కేంద్రం అధీనంలోని విదేశాంగశాఖ ఇటీవల వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2021లో రాష్ట్రం నుంచి మొత్తం 4,375 మంది గల్ఫ్ దేశాల బాట పట్టారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికే ఈ సంఖ్య 8,547కు చేరింది. ప్రభావం చూపని ఆ వృత్తులు.. హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు తూర్పు మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి యువకులు ఖతర్, యూఏఈ, సౌదీ, ఒమన్, కువైట్, బర్హేన్‌లకు వలస వెళ్లడం ఏళ్లుగా సాగుతోంది. ఇలా అత్యధికులు అసంఘటిత రంగ కార్మికులుగానే వెళ్తున్నారు. ఆయా దేశాలకు వెళ్లిన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంటుంది. ఇటీవల కాలంలో వివిధ రకాలైన డెలివరీ యాప్‌లకు డెలివరీ బాయ్స్‌గా, బైక్ ట్యాక్సీలు నిర్వహిస్తున్న వాళ్లు కూడా నగరంలో ఉంటూనే ఈ మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. దీని ప్రభావంతో వలసల సంఖ్య నానాటికీ తగ్గాల్సి ఉంది. అయినప్పటికీ వలస వెళ్లే వారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరగడం గమనార్హం. గతేడాది ఖతర్‌కే అత్యధికులు.. ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌నకు ఖతర్ ఆతిథ్యమిచ్చింది. దీనికోసం దాదాపు రెండు మూడేళ్లుగా అక్కడ భారీ ఫుట్‌బాల్ స్టేడియాలు, క్రీడాకారులకు అవసరమైన బస కోసం ప్రాంగణాలు తదితరాలను నిర్మించారు. వీటిలో పని చేయడానికి అక్కడి వారితో పాటు పెద్ద ఎత్తున వలస కూలీలు అవసరమయ్యారు. ఈ కారణంగానే ఆయా కాంట్రాక్టర్లు దళారుల సాయంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మందిని ఆకర్షించారు. గతేడాది రాష్ట్రం నుంచి ఖతర్‌కు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నాటికే ఆయా నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో ఆ దేశానికి వెళ్లే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. గణనీయంగా పెరిగిన పుష్పింగ్.. ఆయా దేశాలకు అసంఘటిత, సెమీ స్కిల్డ్ లేబర్‌గా వెళ్లే వారు విమానాశ్రయంతో కచ్చితంగా తమ పాస్‌పోర్టు, వీసాలపై ఇమ్మిగ్రేషన్ స్టాంప్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ స్టాంప్ రిక్వైర్డ్గా (ఈసీఆర్) దీనికి అనేక నిబంధనలు ఉంటాయి. దీంతో అనేక మంది వలసదారులు ఇమ్మిగ్రేషన్ స్టాంప్ నాట్ రిక్వైర్డ్ (ఈసీఎన్ఆర్) విధానంలో దేశం దాటాలని భావిస్తుంటారు. ఇలాంటి వారికి సహకరించడానికి విమానాశ్రయం కేంద్రంగా కొందరు పని చేస్తుంటారు. విజిట్, టూరిస్ట్ వీసాలపై వెళ్తున్న వీరిని తనిఖీలు దాటించి విమానం ఎక్కించడాన్నే ‘పుష్పింగ్’ అని పిలుస్తుంటారు. ప్రతి నిత్యం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అనేక మంది ఈ విధానంలో బయటకు వెళ్లిపోతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అక్రమంగా వెళ్లి అష్టకష్టాలు.. సాధారణంగా విదేశాల్లో పని చేయడానికి వెళ్లే వాళ్లు వర్క్ పర్మిట్ తీసుకుని వెళ్లాలి. ఇలా చేస్తే వారికి ఉద్యోగ, వ్యక్తిగత భద్రతతో పాటు ఇతరు సదుపాయాలు లభిస్తాయి. అయితే పుష్ఫింగ్ ద్వారా దేశం దానికి అక్రమ వలసదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్లు గల్ఫ్ దేశాల్లో చిక్కుక్కుపోయి ఇబ్బందులు ఎదుర్కోవడం, కొన్నిసార్లు డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) ప్రక్రియను ఎదుర్కోవాల్సి వస్తోంది. కొందరు అక్రమ వలసదారులు ఆ దేశాల్లోని జైళ్లలోనూ మగ్గుతున్నారు. అక్కడ ఉండగా ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబీకులు, బంధువులకు కడసారి చూపులు దక్కడమూ గగనంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: ముంబై, బెంగళూరులను మించిపోయిన రంగారెడ్డి జిల్లా) -
అలుపెరుగని బాటసారి.. 11 రోజులు నాన్–స్టాప్ జర్నీ.. ప్రపంచ రికార్డు
సిడ్నీ: పొడవైన ముక్కు, పొడవైన కాళ్లతో చూడగానే ఆకట్టుకొనే గాడ్విట్ పక్షి ఒకటి (శాస్త్రీయ నామం లిమోసా ల్యాపోనికా) అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది. అమెరికాలోని అలాస్కా నుంచి ఆస్ట్రేలియాకు చెందిన ఈశాన్య టాస్మానియా ద్వీపంలోని అన్సాన్స్ బే వరకూ 11 రోజుల్లో 8,425 మైళ్లు (13,558.72 కిలోమీటర్లు) ప్రయాణించింది. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా ప్రయాణం సాగించడం గమనార్హం. కేవలం ఐదు నెలల వయసున్న ఈ మగ పక్షి (234684) ఈ నెల 13వ తేదీన అలాస్కా నుంచి బయలుదేరింది. ఓషియానియా, వనౌతు, న్యూ కాలెడోనియా తదితర ద్వీపాల గగనతలం నుంచి ప్రయాణం సాగించింది. ఈ నెల 24వ తేదీన అన్సాన్స్ బే ప్రాంతంలో కాలుమోపింది. సరిగ్గా చెప్పాలంటే 11 రోజుల ఒక గంట సమయంలో అలుపెరుగని తన ప్రయాణాన్ని పూర్తిచేసింది. ఈ పక్షికి సైంటిస్టులు 234684 అనే ఒక నంబర్ ఇచ్చారు. అలాస్కాలో పలు గాడ్విట్ పక్షులకు 5జీ శాటిలైట్ ట్యాగ్లు అమర్చి గాల్లోకి వదిలారు. వాటి గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మిగతా పక్షులకంటే 234684 నంబర్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించినట్లు తేల్చారు. నాన్–స్టాప్‌గా గాల్లో దూసుకెళ్తూ 11 రోజుల ఒక గంటలో టాస్మానియాకు చేరుకుందని న్యూజిలాండ్‌లోని పుకొరోకొరో మిరండా షోర్బర్డ్ సెంటర్ ప్రకటించింది. నీటిపై వాలితే మృత్యువాతే గాడ్విట్ పక్షులు వలసలకు పెట్టింది పేరు. ప్రతిఏటా వేసవిలో టాస్మానియాకు చేరుకుంటాయి. అక్కడ సంతతిని వృద్ధి చేసుకొని యూరప్ దేశాలకు తిరిగి వస్తుంటాయి. 2021లో 4బీబీఆర్‌డబ్ల్యూ అనే గాడ్విట్ మగ పక్షి 8,108 మైళ్లు(13,050 కిలోమీటర్లు) నాన్–స్టాప్‌గా ప్రయాణించింది. ఇప్పటిదాకా ఇదే రికార్డు. ఈ రికార్డును 234684 పక్షి బద్దలుకొట్టింది. ఇది 11 రోజుల ప్రయాణంలో సగంబరువును కోల్పోయి ఉంటుందని టాస్మానియాలోని పక్షి శాస్త్రవేత్త ఎరిక్ వోహ్లర్ చెప్పారు. ఈ రకం పక్షులు నీటిపై వాలలేవని, ఒకవేళ వాలితే చనిపోతాయని తెలిపారు. ఎందుకంటే వాటి కాలి వేళ్లను కలుపుతూ చర్మం ఉండదని వెల్లడించారు. గాట్‌విట్ జాతి పిట్టల్లో ప్రధానంగా నాలుగు రకాలు ఉంటాయి. అవి బార్–టెయిల్డ్ గాడ్విట్, బ్లాక్–టెయిల్డ్ గాడ్విట్, హడ్సోనియన్ గాడ్విట్, మార్బ్ల్డ్ గాడ్విట్. పొడవైన ముక్కును సముద్ర తీరాల్లోని ఇసుకలోకి దూర్చి అక్కడున్న పురుగులు, కీటకాలను తింటాయి. -
ఫజుల్లాబాద్‌కు విదేశీ పక్షులు.. ప్రాణంగా చూసుకుంటాం..
రంపచోడవరం: విదేశీ పక్షుల రాకతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామం సందడిగా మారింది. సుమారు వెయ్యికి పైగా సైబీరియా పక్షులు గ్రామానికి తరలివచ్చాయి. గ్రామంలోని చెట్లను ఆవాసంగా మార్చుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగమనంతో ఇవి ఏటా ఇక్కడికి చేరుకుంటాయి. మధ్య ఆసియాలోని సైబీరియా కన్నా ఈ ప్రాంతంలో వేడి వాతావరణం ఉండటం వీటి సంతానోత్పత్తికి అనుకూలం. అందువల్ల ఏటా జూలై, ఆగస్టులో వచ్చి కార్తీక మాసం చివరి వరకు ఇక్కడే ఉంటాయి. సంతానోత్పత్తి అనంతరం పిల్లలతో ఇక్కడి నుంచి వెళ్లిపోతాయని గ్రామస్తులు తెలిపారు. ఒంటరిగా ఈ ప్రాంతానికి వచ్చే విదేశీ పక్షులు ఇక్కడ సుమారు ఐదు నెలలపాటు ఉంటాయి. వీటిని అతిథులు మాదిరిగా గ్రామస్తులు చూసుకుంటారు. తమ తాతల కాలం నుంచి ఈ పక్షులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో గ్రామంలోని పక్షులకు ఎవరైనా హాని తలపెడితే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏటా గ్రామానికి వస్తుండటంతో వాటికి ఎటువంటి హాని జరగకుండా ప్రాణంగా చూసుకుంటున్నారు. ఐదు నెలలపాటు గ్రామంలో చింతచెట్లపైనే ఉంటున్నాయి. గతంలో ఏటా రెండు వేలకు పైగా పక్షులు వచ్చేవి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు వెయ్యికి తగ్గిపోయిందని గ్రామస్తులు తెలిపారు. జూలై నెలలో వచ్చి చెట్లపై గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలను చేసి నవంబరు నెలాఖరులోపు వెళ్లిపోతాయి. ఫజుల్లాబాద్ గ్రామానికి చుట్టుపక్కల పంటపొలాలు, చెరువులు ఉన్నందున ఆహారం లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కోతుల బెడద ఎక్కువైంది. పక్షలు గూళ్లను పాడు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రాణంగా చూసుకుంటున్నాం గ్రామంలో ఉండే కొంగలకు ఎవరు హాని తలపెట్టారు. మొదట్లో వాటిని పట్టుకునేందుకు వేటగాళ్లు ప్రయత్నించారు. గ్రామస్తులంతా అడ్డుకున్నారు. అప్పటినుంచి ఎవరూ హాని తలపెట్టరు. వాటిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాం. ఈ పక్షులను తిలకించేందుకు పర్యాటకులు వస్తుంటారు. – ధర్మరాజు, ఫజుల్లాబాద్, దేవీపట్నం మండలం -
Amarnath Vasireddy: యంత్రాన్ని ప్రేమించు... మనిషిని ద్వేషించు! కోపం వస్తోందా?
వచ్చేసింది.. కృత్రిమ మేధ , మరమనుషుల ఉపయోగం , డిజిటలైజేషన్, ఆటోమేషన్ యుగం! రానున్న 15 ఏళ్ళల్లో భారీగా తగ్గిపోనున్న ఉద్యోగాలు/ వృత్తులు.. డ్రైవర్ , వ్యవసాయదారుడు , ప్రింటర్, పబ్లిషర్ , క్యాషియర్, ట్రావెల్ ఏజెంట్ , వైటర్స్ , డిస్పాచ్ క్లర్క్, ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగాలు, మిలిటరీ పైలట్, సోల్జర్.. టెలిమార్కెటర్, అకౌంటెంట్, టాక్స్ సలహాదారుడు , స్పోర్ట్స్ రిఫరీ / అంపైర్ , చేనేత కార్మికుడు, పెయింటర్, ప్లంబర్, స్టాక్ ట్రేడర్, నిర్మాణ కార్మికుడు.. భయమేస్తోందా? చర్చించండి . తప్పులేదు . తప్పదు. చిన్న చితకా వ్యాపారాలు అంతరించిపోతాయి. బహుళ జాతి సంస్థలు మరింత బలపడతాయి. ►ఒక పక్క కోట్ల ఆస్తులు కలిగిన వారు, మరో పక్క బతుకు తెరువు కోసం కష్టపడేవారు . ►ధనికులు మరింత ధనికులు అవుతారు, మధ్య తరగతి బీదరికంలోకి నెట్టబడతారు. సుమారుగా ఎనభై శాతం కష్టపడతారు. ►ధనికుల ఇళ్లల్లో వంటపనికి, ఇంటిపనికి రోబోలు, ఫ్రెండ్స్‌గా లివ్ ఇన్ పార్టనర్లుగా రోబోలు వస్తారు. ►ప్రతి ఆఫీస్‌లో మనుష్యుల కంటే రోబోలు, లేదా యంత్రాలు కనిపిస్తాయి. ►ఉద్యోగాలు తక్కువ; ధనిక బీద తారతమ్యం.. దీనితో తారా స్థాయిలో సామాజిక అసమానతలు, సామాజిక వైరుధ్యాలు, విద్వేషాలు. ►బాగా డెవలప్ అయ్యామనుకుంటున్న ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో జాతి విద్వేషం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ► ప్రతి దేశం రక్షిత విధానాలను అనుసరిస్తుంది. వలసలను తగ్గిస్తుంది లేదా పూర్తిగా అనుమతించదు ఈ మెసేజ్ చదివితే నా పై కోపం వస్తోందా ? ఇది నిజం కాకూడదు అనిపిస్తోందా? సాంకేతికత జ్యామితీయ నిష్పత్తి వేగంతో దాన్ని ఆపలేము. ఆపాల్సిన అవసరం లేదు. సాంకేతికతను మానవ కల్యాణానికి వాడాలి. కానీ అది కొన్ని బహుళ జాతీయ కంపెనీల చేతిలో బందీ. వారి అధిపత్యానికి తిరుగు లేదు. సామాజిక శాస్త్రాలను చదవని సాధారణ ప్రజానీకానికి ఇది అవగాహన అయ్యే అవకాశం లేదు . అయినా కన్ఫ్యూజ్ చేస్తారు. ఆటలు సాగనివ్వరు . నిరాశావాదం అనిపిస్తోందా ? నిజం నిష్టూరంగానే ఉంటుంది . మెసేజ్ సేవ్ చేసుకొని ఒక నాలుగేళ్ళ తరువాత చెక్ చేసుకోండి. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు -
పెళ్లి కోసం పట్నాలకు వలసలు
సాక్షి, అమరావతి: పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు ఎవరన్నా వలస పోతున్నారంటే.. ఉద్యోగం, ఉపాధి పనుల కోసమో.. అదీ కాకుంటే పిల్లల ఉన్నత చదువుల కోసమో అని అందరూ అనుకుంటుంటారు. కానీ.. అది వాస్తవం కాదట. 2020 జూలై నుంచి 2021 జూన్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న వలసలపై కేంద్రం నిర్వహించిన పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కేంద్రం ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలో నూటికి 47.5 శాతం మంది పెళ్లిళ్ల కారణంగానే పట్టణాలకు వలస వెళ్లినట్టు తేలింది. అంటే దాదాపు మొత్తం వలసల్లో సగం మంది వలసలకు ఇదే కారణమని స్పష్టమైంది. ఉపాధి.. ఉద్యోగాల కోసం వెళ్లేది 10.8 శాతమే ► ‘ఉపాధి హామీ పథకం–గ్రామాల్లో వలసలు’ అనే అంశంపై రెండు రోజుల క్రితం లోక్‌సభలో చర్చకు రాగా.. కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే వివరాలను అధికారికంగా వెల్లడించింది. ► 2020–21 మధ్య పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు వలస వెళ్లిన వారు 47.5 శాతం కాగా.. వారిలో మహిళల సంఖ్య అధికంగా ఉందని పేర్కొంది. ► ఉద్యోగ, ఉపాధి మార్గాల కోసం పట్నం వెళ్లిన వారి సంఖ్య కేవలం 10.8 శాతమే అని తెలిపింది. ► పిల్లల చదువుల నిమిత్తం పట్టణాలకు వలస వెళ్తున్న వారు 2.4 శాతం మంది ఉన్నట్టు పేర్కొంది. ► సంపాదించే కుటుంబ యజమాని స్థల మార్పిడి కారణంగా 20 శాతం మంది పట్టణాలకు చేరుకున్నారని వెల్లడించింది. ► 2020 మార్చిలో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అదే ఏడాది జూలై నాటికి లాక్డౌన్ నిబంధనలను చాలావరకు కేంద్రం సడలించింది. ఆ తరువాత చోటుచేసుకున్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకే కేంద్రం ఈ సర్వే చేయించింది. ► అప్పట్లో పట్నాల నుంచి పల్లెటూరు వెళ్లిన వారి సంఖ్యతో పాటు పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వారి వివరాలను కూడా ఈ సర్వే ద్వారా కేంద్రం గుర్తించింది. ► మొత్తం 122 కోట్ల దేశ జనాభాలో 0.7 శాతం మంది అంటే 85 లక్షల మంది సర్వే జరిగిన ఆ ఏడాది కాలంలో తాత్కాలికంగా వలస బాట పట్టారని తేల్చింది. పట్నం బాట పట్టడానికి కారణాలు.. వలస వెళ్లిన వారి శాతం -
పోయిన వారందరూ తిరిగి రావలసిందే.. నాన్న చెప్పింది నిజమే అన్పిస్తోంది!
న్యూయార్క్ నగరం. అమెరికాలో జనాభా పరంగా నెంబర్ వన్ సిటీ. నెంబర్ టు లాస్ ఏంజెల్స్ నాగరానికంటే రెట్టింపు జనాభా! నాలుగు వందల సంవత్సరాల చరిత్ర. ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంది. కానీ.. కరోనా పాండెమిక్ సమయంలో... అంతకు మించి ఇప్పుడు..... వేలాది మంది నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారు. కారణాలు 1. నెలసరి ఆదాయం అద్దెకు సరిపోతుంది.. లేదా సరిపోదు. ఆకాశాన్నంటే రియల్ ఎస్టేట్.. అద్దెలు అతి భారీ స్థాయిలో. నెలకు మూడున్నర వేల డాలర్లు. అంటే సుమారుగా రెండు లక్షల ఎనభై వేలు. విల్లాకు కాదండీ... సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దె. సంపాదనంతా అద్దెకు పోతుంది. ఇక బతికేదెట్టా? 2 . తీవ్ర స్థాయిలో ఆర్థిక అసమానతలు . ప్రపంచ కుబేరులు ఇక్కడే . అతి తక్కువ ఆదాయం ఉన్న వారు , నిరుద్యోగులు భారీ సంఖ్యలో .. క్రైమ్ రేట్ భయపెట్టేలా. ౩. ట్రాఫిక్ జామ్స్ , కాలుష్యం 4. కారు ఎక్కడైనా పార్క్ చేయాలంటే గంటకు కనీసం 50 డాలర్లు, కొన్ని సార్లు వందకు పైగా...! పెరుగుట విరుగుట కొరకే.. నగరీకరణ ఒక స్థాయికి మించితే ఏమి జరుగుతుందో న్యూయార్క్ ఒక ఉదాహరణ. టోక్యో మరో రకం.. పెద్ద సంఖ్యలో న్యూ యార్క్ నగరాన్ని వదిలి పెట్టి వెళుతున్న ప్రజలు .. గ్రామాలకు , చిన్న నగరాలకు వలస . మన దేశంలో కూడా ముంబై, ఢిల్లీ , కోల్‌కతా , ఒక విధంగా బెంగళూరు ఇదే స్థితికి చేరుకున్నాయనిపిస్తుంది. మా అమ్మ నాన్న టీచర్ లు . చుట్టుపక్కల చాలా మంది బెంగళూరులో ప్లాట్స్ కొనుక్కొని వలస వెళ్లిపోయారు. మా నాన్న మా సొంత ఊళ్ళో పొలం కొన్నాడు . ‘‘అందరూ నగరాలకు వెళుతుంటే ఇదేంటి నువ్వు గ్రామం లో పొలం కొంటున్నావు?" అని అడిగా. "పోయినవారందరూ తిరిగి రావలసిందే" అన్నాడు . అయన మాటలు ఇన్నాళ్లు వాస్తవం దాల్చలేదు కానీ .. ఇప్పుడు నెమ్మదిగా ట్రెండ్..... రివర్స్ మైగ్రేషన్ అనిపిస్తోంది. - అమర్నాద్ వాసిరెడ్డి, ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
కోటీశ్వరుల వలస.. మళ్లీ మొదలైంది.. వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?
ఉద్యోగం కోసం ఉపాధి కోసం వలస వెళ్లడం మనకు తెలుసు.. మరి ఇక్కడ కోటీశ్వరులే వలస వెళ్లిపోతున్నారు. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో వివిధ దేశాలకు చెందిన కోటీశ్వరులు మళ్లీ వలసల బాటపడుతున్నారని ప్రముఖ పెట్టుబడుల కన్సల్టెన్సీ సంస్థ హెన్లే అండ్ పార్ట్నర్స్ తెలిపింది. ఈ ఏడాది 88 వేల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (కనీసం రూ.8 కోట్ల చరాస్తులు కలిగిన వ్యక్తులు) స్వదేశాలను వీడొచ్చని హెన్లే గ్లోబల్ సిటిజన్స్ నివేదిక అంచనా వేసింది. ఇంతకీ వీరందరూ తమ స్వదేశాలను ఎందుకు వీడుతున్నారు? వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఓసారి చూద్దామా.. వలస వెళ్లిన సంపన్నుల సంఖ్య రష్యాకు కోటీశ్వరుల బైబై ఈసారి అత్యధికంగా కోటీశ్వరులు వీడుతున్న దేశాల జాబితాలో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం తాలూకు దుష్ప్రభావాల బారి నుంచి బయటపడేందుకు రష్యాతోపాటు ఉక్రెయిన్‌లోని సంపన్నులు తమ దేశాలను వీడుతున్నారని హెన్లే విశ్లేషించింది. ఈ ఏడాది చివరికల్లా రష్యా నుంచి ఏకంగా 15 వేల మంది, ఉక్రెయిన్ నుంచి 2,800 మంది విదేశాలకు తరలిపోవచ్చని పేర్కొంది. ఇటు భారత్ నుంచి కూడా 8 వేల మంది విదేశాలకు వెళ్లిపోవచ్చని అంచనా వేసింది. మిలియనీర్ల స్వర్గధామం యూఏఈ అత్యధిక మంది కోటీశ్వరులు స్థిరపడేందుకు ఎంపిక చేసుకునే దేశాల జాబితాలో యూఏఈ తొలిస్థానంలో ఉంది. ఈ ఏడాది చివరికల్లా 4 వేల మంది తమ గమ్యస్థానంగా యూఏఈని ఎంపిక చేసుకోవచ్చని హెన్లే పేర్కొంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించేందుకు యూఏఈ అనుసరిస్తున్న వలస విధానాలు ఇందుకు కొంత కారణం కావొచ్చని వివరించింది. వలసలు ఎందుకు? నిర్ణీత మొత్తంలో పెట్టుబడులు పెడితే విదేశీ పౌరసత్వం లభిస్తుందనో లేదా శాశ్వత నివాస హక్కు పొందవచ్చనో నచ్చిన దేశానికి కోటీశ్వరులు క్యూ కడుతున్నారు. అలాగే తమ కుటుంబాలకు మెరుగైన భద్రత, రక్షణ కోరుకునే వారు, కాలుష్యరహిత పర్యావరణంలో జీవించాలనుకునే వారు, ప్రభుత్వాల అణచివేత ధోరణులు లేదా అవినీతి ప్రభుత్వాల బారి నుంచి బయటపడాలనుకునే వ్యక్తులు, ఉన్నతవిద్య, ప్రపంచస్థాయి వైద్యం పొందాలనుకొనే మిలియనీర్లు కూడా సాధారణంగా వలసల వైపు మొగ్గు చూపుతుంటారని హెన్లే అండ్ పార్ట్నర్స్ విశ్లేషించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?
సాక్షి, హైదరాబాద్: సుదూర ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు ఏటా వలస వచ్చే రాజహంసలు.. బాతులు.. కొంగలు.. గోరింకలు.. డేగలు తదితర పక్షుల జాడ క్రమంగా కనుమరుగు కానుందా? జీవో 111 ఎత్తివేతతో సుందర జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, కాంక్రీట్ మహారణ్యం పెరిగి.. శబ్ద, వాయు కాలుష్యం, పక్షుల సహజ ఆవాసాలైన జలాశయాలను కాలుష్య కాసారంగా మార్చేయనుందా? ఈ ప్రశ్నలకు పర్యావరణ వేత్తలు, పక్షి ప్రేమికులు అవుననే సమాధానమిస్తున్నారు. ► సైబీరియా.. యూరప్.. ఆఫ్రికా.. మయన్మార్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి జంట జలాశయాలకు ఏటా అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వేలాదిగా విభిన్న రకాల పక్షి ప్రజాతులు తరలివస్తాయి. హిమాయత్‌సాగర్‌కు సుమారు 200 వరకు గుజరాత్ నుంచి రాజహంసలు వలస రావడం పరిపాటే. మొత్తంగా ఈ జలాశయానికి 52 రకాలు, ఉస్మాన్‌సాగర్‌కు 92 రకాల పక్షి జాతులు వలస వస్తాయి. ► జలాశయాల చుట్టూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడిన పక్షంలో వలస పక్షులకు సమీప భవిష్యత్‌లో గడ్డు పరిస్థితులు తప్పవని పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులకూ ఇక్కట్లేనని చెబుతున్నారు. సుమారు పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వలసవచ్చే బార్‌హెడ్‌గూస్ (బాతు) జాడ కూడా కనిపించదని స్పష్టం చేస్తున్నారు. ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చే పైడ్ క్రస్టెడ్ కకూ అనే పక్షి రాక ఉండదని చెబుతున్నారు. వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే: గుజరాత్ రాజహంసలు (గ్రేటర్ ఫ్లెమింగోలు), పిన్‌టెయిల్డ్ డక్(బాతు), షౌలర్,గార్గినే టేల్, హ్యారియర్స్ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్‌లింక్స్, భార్మెడోగూస్ బాతు, పైడ్ క్రస్టడ్ కకూ వీటిలో ప్రధానంగా కొంగలు, బాతులు, డేగలు, గుడ్లగూబలు, నీటికోళ్లు తదితర జాతులున్నాయి. (క్లిక్: ఈ పిల్లిని ఎలా రక్షిస్తారు? పోలీసు ఫేస్బుక్లో పోస్టు చేస్తూ..) నగరీకరణ, కాలుష్యం పెరిగితే కష్టమే జంటజలాశయాల చుట్టూ సమీప భవిష్యత్‌లో పట్టణీకరణ ప్రభావం, శబ్ద, వాయు కాలుష్యాలకు అవకాశం ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చే పక్షిజాతుల జాడ కనిపించదు. జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. – డాక్టర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం -
వాతావరణ మార్పులతో వలసల ముప్పు
మానవుని జీవనం దినదినం సంక్షోభంవైపు ప్రయాణిస్తోంది. చేజేతులా మనిషి పేరాశతోప్రకృతిని ధ్వంసం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అనేక రూపాల్లో కాలుష్యం మనిషి బతుకుపై దాడి చేస్తూ ఉండటంతో పుట్టిన నేలను వదిలి జానెడు పొట్టను నింపుకోవడం కోసం దూరదేశాలకు జనం వలసపోతున్నారు. ఇది ఏదో ఒక దేశానికి పరిమితమైన అంశం కాదు. కాకపోతే ఈ వలసలు ఎక్కువగా ఆఫ్రికా నుండే ఉండటం కనిపిస్తోంది. ఆఫ్రికాలోని 54 దేశాల నుండి ఐరోపా దేశాలకు వలసలు ఇటీవల కాలంలో వెల్లువెత్తాయి. సముద్రాల మీదుగా సాధారణ పడవల్లో ప్రయాణిస్తూ... ప్రమాదాలకు లోనై ప్రతి ఏటా వందలు, వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వేలాది మంది కాందిశీకులు ఒక్కసారిగా అక్రమంగా ప్రవేశించడం వల్ల ఆయా దేశాలలో సంక్షోభ పరిస్థితులు తలెత్తి ప్రభుత్వాల బడ్జెట్లు తారుమారవుతున్నాయి. (చదవండి: మన రాజ్యాంగానికి కొత్త ప్రమాదం) మొజాంబిక్, అంగోలా, ఛాద్, టాంజానియా, కెన్యా, ఇథియోపియా దేశాలలో మంచినీటి కొరత, వ్యవ సాయం కుంటుపడిపోవటం, భూములు కుంగిపోవటం లాంటి సమస్యలు ఎక్కువగా వలసలకు దారి తీస్తున్నాయి. ఈ దేశాలకు ఛాద్ సరస్సు ప్రధాన నీటి వనరు. అదిప్పుడు 90 శాతం కుంచించుకుపోయింది. 26 వేల చదరపు కిలోమీటర్ల నుండి 15 వేల చదరపు కిలోమీటర్లకు కుంచించుకు పోయింది. ఫలితంగా దాదాపు కోటి 25 లక్షల మందికి నీరు లభించడం లేదు. ఇక తుపానులు, కరవులు, భూసారం కోల్పోటం, కార్చిచ్చు, భారీ మట్టిపెళ్లలు విరిగిపడటం, సముద్రాల నీటి మట్టాలు పెరగడం, భూతాపం మిక్కుటం కావడం లాంటివి వలసలు తప్ప మరో మార్గం లేకుండా చేస్తున్నాయి. ఏడాదికి రెండు కోట్ల మంది 2008–2016 మధ్య వలస వెళ్లారని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. 2050 నాటికి 120 కోట్లమంది వలస వెళతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. సబ్‌సహారా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియాల నుండే 4 కోట్ల మందికి పైగా వలస వెళ్లే పరిస్థితులున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇవిగాకుండా ఆయా దేశాల్లో యుద్ధాలు వలసలకు దారి తీస్తున్నాయి. అలాగే అనేక దేశాల్లో అంతర్గత వలసలూ పెరిగిపోవటం గమనార్హం. అంతర్గత ఘర్షణలతో ఒక్క మొజాంబిక్ నుండే 2020లో 6 లక్షల 70 వేలమంది వలస వెళ్లారు. (చదవండి: అందరికీ అభివృద్ధి ఫలాలు) 2021లో ప్రపంచంలో వాతావరణ విపత్తులను ఎదుర్కొన్న దేశాలలో భారత్ ఏడవ స్థానంలో నిలిచింది. 2008 –2018 మధ్య కాలంలో 253 మిలియన్ల వలసలు జరిగాయి. యుద్ధాల వల్ల జరిగిన వలసల కంటే, వాతావరణ విపత్తుల వల్ల పదిరెట్లు ఎక్కువగా జరిగాయి. దక్షిణాసియాలో 2018లో మొత్తం 3 లక్షల 30 వేలు వలస లుండగా అందులో భారత్ నుంచే 2 లక్షల 70 వేలు ఉన్నాయి. తీవ్రమైన రిస్క్ ఉన్న 33 దేశాల్లో వంద కోట్లమంది పిల్లలు నివసిస్తున్నారు. ప్రపంచ భూతాపం పెరగడం వల్ల సముద్ర నీటిమట్టాలు పెరుగుతున్నాయి. చిన్న, చిన్న దీవులలో వరదలూ వలసలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో... 1951 శరణార్థుల (కాందిశీకులు) అంత ర్జాతీయ సదస్సు తీర్మానం ప్రకారం వలసల నివారణకు, శరణార్థుల భద్రతకు ఆయా దేశాలు తక్షణం తగిన చట్టాలు రూపొందించి అమలు చేయాల్సిఉంది. (చదవండి: బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా?!) – టి. సమత -
ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఒక వైపు కాంగ్రెస్ అభ్యర్థులు ఆయా స్థానాల నుంచి నామినేషన్లు దాఖలు చేస్తున్న తరుణంలో.. మరోవైపు రాజీనామాల పర్వం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తుంది. తాజాగా, ఖిల్లా రాయ్‌పూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జస్బిర్ సింగ్ ఖాన్గుర కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బాయ్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తన రాజీనామా సమర్పించారు. తన లేఖలో కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను.. 20 ఏళ్లపాటు కాంగ్రెస్‌కు సేవచేసినట్లు తెలిపారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారో మాత్రం ప్రకటించలేదు. కాగా, జస్బిర్ సింగ్.. తండ్రి జగ్పాల్ కూడా కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి మంత్రుల నుంచి స్థానిక నాయకుల వరకు వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, రాహుల్‌గాంధీ పంజాబ్టూర్లో సీఎం చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపే ప్రయత్నం చేశారు. అదే వేదికలో చన్నీ, సిద్దూ.. ఇరువురు నాయకులు సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన మరొకరు వారికి.. మద్దతు పలుకుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మరికొన్ని రోజుల్లో సీఎం అభ్యర్థి ఉత్కంఠకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో ఫిబ్రవరి 20 నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మార్చి 10 న ఓట్ల లెక్కింపు జరగనుంది. Jasbir Singh Khangura, former MLA from Qila Raipur in Punjab quits Congress party. pic.twitter.com/4x5VPi4zVB — ANI (@ANI) January 30, 2022 చదవండి: గత 2 నెలలుగా బాలికను వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడు: ఏసీపీ -
వలస కుటుంబాన్ని వెంటాడుతున్న మృత్యువు
సాక్షి, అర్వపల్లి (నల్లగొండ): పొట్టకూటి కోసం రాజస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చి జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది. ఒకే ఏడాది ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోద్పూర్ ప్రాంతానికి చెందిన దేవాసి కైలాస్ అలియాస్ సురేశ్, దేవాసి చెన్నారాం అలియాస్ రమేశ్ సోదరులు. వీరు చిన్న వయసులోనే బతుకు దెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చి అర్వపల్లి మెయిన్‌రోడ్డులో రాజస్థాన్ టీస్టాల్, స్వీట్‌హౌస్ నడుపుతున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి 29న సురేశ్ బైక్‌పై నల్లగొండ జిల్లా శాలిగౌరారంనకు తన బంధువుల వద్దకు వెళ్లి టీపొడి తీసుకొని వస్తూ జాజిరెడ్డిగూడెం–మాదారం మధ్య హైవేపై రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికుల వద్ద రూ.1.20 లక్షలు చందాలు సేకరించి అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసి వచ్చారు. ఆ తర్వాత సురేశ్ సోదరుడు రమేశ్ టీస్టాల్‌ను నడిపిస్తున్నాడు. వీరిద్దరు సోదరులు కూడా సేవాతత్పరులు కావడంతో స్థానికులు వారిని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. అయితే లాక్డౌన్, ఇతర సమయాల్లో ఇద్దరు సోదరులు ఎందరో పేదలకు తమ వంతు సాయమందించారు. రాజస్థాన్‌లో మరో సోదరుడు.. కాగా, రమేశ్ 15 రోజుల క్రితం తల్లిదండ్రులను చూసేందుకు రాజస్థాన్‌లోని స్వగ్రామానికి వెళ్లాడు. అయితే పోయేటప్పుడు పెద్ద సోదరుడు మోహన్‌ను రాజస్థాన్ నుంచి ఇక్కడికి పిలిపించి టీస్టాల్ నడిపించమని చెప్పి వెళ్లాడు. అయితే ఆదివారం రాత్రి వారి స్వరాష్ట్రం రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో విషయం తెలిసి స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఏడాది తిరక్కముందే ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కాగా వీరిద్దరి ఆధార్‌కార్డులు, రేషన్ కార్డులు ఇక్కడే తీసుకున్నారు. చదవండి: రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్ -
గల్ఫ్ గోడు వినిపించేందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా గల్ఫ్ వలస కార్మిక సంఘాలు అడుగులు వేస్తున్నాయి. తమ డిమాండ్లు సాధించుకోవాలంటే తమకంటూ ప్రత్యేకంగా ఒక పార్టీ అవసరమని ఆయా సంఘాలు అంటున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నవారు సుమారు 15 లక్షల మంది ఉంటారు. వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్యతో పాటు, గతంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చి స్థానికంగానే ఉంటున్నవారిని పరిగణనలోకి తీసుకుంటే గల్ఫ్‌తో ముడిపడి ఉన్నవారి సంఖ్య కోటి ఉంటుందని అంచనా. వీరు రాష్ట్రంలోని 30 శాసనసభ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంట్ స్థానాల పరిధిలో అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువమంది సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారే. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం వారి సమస్యల పరిష్కారానికి హామీలు గుప్పిస్తున్న రాజకీయ పార్టీలు.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వీరి సమస్యలేమిటి? ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది కార్మికులు రాష్ట్రం నుంచి వలస వెళ్లి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నా.. వారి సంక్షేమాన్ని పట్టించుకునే ఓ ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏదీ లేదు. ఉపాధిపై ఆశతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకు వెళుతున్నవారు పలు సందర్భాల్లో వీసా మోసాలకు గురవుతుండటంతో పాటు, అక్కడ ఆశించిన విధంగా లేక అనేక కష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వాల తరఫున ఎలాంటి సాయం అందడం లేదు. కార్మికులు చనిపోతే ప్రభుత్వాలు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదు. మృతదేహాలు స్వదేశం చేరుకోవడం కష్టమవుతోంది. కొన్నిసార్లు అక్కడే అంత్యక్రియలు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ కార్మికుల సంక్షేమ కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని, ఎన్ఆర్ఐ పాలసీ లేదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలం నుంచి వినిపిస్తోంది. భారీగా విదేశీ మారకద్రవ్యం వస్తున్నా.. విదేశాలకు వలస వెళ్లిన వారి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ మొత్తంలో ఆదాయం లభిస్తోంది. కేవలం గల్ఫ్ వలస కార్మికుల ద్వారానే ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం మన దేశానికి చేరుతోంది. అందువల్ల గల్ఫ్ ప్రవాసీయుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత నిధులను కేటాయించాలనే డిమాండ్ ఉంది. అయితే ఏ బడ్జెట్లోనూ నిధులు కేటాయించిన సందర్భాలు లేవు. దీంతో ఎన్నో ఏళ్లుగా విసిగి వేసారిపోయిన గల్ఫ్ వలస కార్మికులందరినీ ఒక్క తాటిపై తీసుకురావడానికి కార్మిక సంఘాలు రాజకీయాల బాట పడుతున్నాయి. తమ లక్ష్యాలను చేరుకోవాలంటే తాము సభ్యులుగా ఉన్న ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం తప్పనిసరి అని ముక్త కంఠంతో చెబుతున్నాయి. హుజూరాబాద్‌తో షురూ హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ సత్తా చాటడానికి గల్ఫ్ వలస కార్మికుల సంఘాలు సిద్ధమవుతున్నాయి. ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోషియేషన్ల అధ్యక్షులు స్వదేశ్ పరికి పండ్ల, నంగి దేవేందర్‌రెడ్డిల నాయకత్వంలో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. కార్మికులను ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో ఆత్మీయ సమ్మేళనాల పేరిట సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మొదటగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు. దశల వారీగా గల్ఫ్ వలస కార్మికులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో దళిత బంధు మాదిరిగానే గల్ఫ్ బంధు ను అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ముందుకు సాగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు గల్ఫ్ వలస కార్మికుల కోసం రాజకీయ పార్టీని స్థాపించడం వల్ల మంచే జరుగుతుంది. ప్రతి ఎన్నికల్లో ఓట్ల కోసం గల్ఫ్ కార్మికులకు హామీల ఎర వేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయడం లేదు. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు రాజకీయ పార్టీ ద్వారానే గుర్తింపు గల్ఫ్ కార్మికులు ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురవుతున్నా రు. ఇప్పుడు వారి సమస్యలే ఎజెండాగా రాజకీయ పార్టీ స్థాపించడమనే ఆలోచన ఆహ్వానించదగ్గ పరిణామం. గల్ఫ్ కార్మికులకు గుర్తింపు లభించాలంటే రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. – నంగి దేవేందర్‌రెడ్డి, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మా సత్తా ఏమిటో చూపిస్తాం గల్ఫ్ కార్మికుల సత్తా ఏమిటో ప్రభుత్వాలకు తెలియజేయడానికే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాం. కార్మికుల కుటుంబాలను ఏకం చేసి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాం. మా సత్తాను చాటి చెబుతాం. – గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ జేఏసీ కన్వీనర్ -
ఏపీ: టెన్త్ పాసైన విద్యార్ధులకు ఆన్లైన్లో మైగ్రేషన్ సర్టిఫికేట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్దులకు ఆన్లైన్లో మైగ్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. ఇందుకోసం విద్యార్ధులు 80 రూపాయిలు చెల్లించి విద్యా శాఖ వెబ్సైట్ www.bse.ap.gov.in 2021 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు పేర్కొంది. కాగా, 2004 తర్వాత టెన్త్ పాసైన విద్యార్ధులు సైతం మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ తెలిపింది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకున్న విద్యార్ధులు మైగ్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి -
టెన్త్ విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2020 – 21 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలు విడుదల చేశామని, ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు పరీక్ష రుసుముతో పాటు రూ.80 చెల్లించిన విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను సంబంధిత పాఠశాల లాగిన్ లో పొందుపరిచామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ కలర్ కాపీని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేయాలన్నారు. ఈ అవకాశం సెప్టెంబర్ 5 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత విద్యార్ధులు మరోసారి రూ.80 రుసుము చెల్లించి, ఆన్లైన్లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్ పొందాలని చెప్పారు. 2021 ఏడాది మాత్రమే కాకుండా అంతకు ముందు సంవత్సరాల్లో పదో తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్థులు కూడా ఈ సంవత్సరం నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో ప్రభుత్వ పరీక్షలు సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు తేదీ నుంచి 30 రోజుల వరకు మాత్రమే వెబ్సైట్లో సర్టిఫికెట్ ఉంటుందన్నారు. దరఖాస్తుకు విధివిధానాలు త్వరలో తెలియచేస్తామని చెప్పారు. -
వారంతా వర్క్ ఫ్రం హోం.. ఎందుకంటే..!
సాక్షి, సిద్దిపేట: కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధించడంతో పట్నంవాసులు పల్లెబాట పడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుండటంతో .. రాష్ట్ర ప్రభుత్వం తొలుత నైట్ కర్ఫ్యూ, తాజాగా లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో హైదారాబాద్, ఇతర పట్టణాల్లో జీవనం ఇబ్బందిగా మారింది. ఇప్పటికే అనేక మంది ఐటీ ఉద్యోగులు పల్లెల నుంచే పనిచేస్తుండగా, ప్రస్తుతం పట్నంలో పనిచేసే దినసరి కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు పల్లెబాట పట్టారు. పల్లెల్లో పనులు పల్లెల్లో ఉపాధి హామీ పనులకు తోడు వ్యవసాయం, కూరగాయల సాగు పనులు సాగుతున్నాయి. సొంత ఊరులో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం గడపవచ్చనే నమ్మకంతో వస్తున్నారు. ఉపాధి హామీ పనులు జోరుగా జరుగుతుండటంతో జీవనోపాధికి దాన్నే ఎంచుకుంటున్నారు. కొద్దోగొప్పో భూమి ఉన్నవారు పలుగు, పార చేతపట్టి వ్యవసాయంలో చెమట చిందిస్తున్నారు. మరికొందరు స్థానికంగా లభించే పనులు వెతుక్కుంటున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది సిద్దిపేట రూరల్ మండలం లక్ష్మిదేవిపల్లి గ్రామానికి చెందిన పాతూరి శ్రీకాంత్. ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఉపాధికి గండి పడింది. దీనితో స్వగ్రామానికి చేరుకున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ కావడంతో గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం ఇంటి పట్టునే ఉంటూ కంప్యూటర్ని ఓ పట్టు పడుతున్నారు. వర్క్‌బిజీలో పడిపోయి చాలా కాలం పాటు ఊరికి, చిన్నప్పటి స్నేహితులకు దూరమైన ఐటీ ఉద్యోగులు మరోసారి గతాన్ని నెమరేసుకుంటున్నారు. పాత స్నేహితులతో కొత్త కబుర్లు పంచుకుంటున్నారు. చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్య వారికి ఇబ్బందిగా మారింది. గజ్వేల్‌లో అద్దె ఇంట్లో ఉంటూ విధులు గజ్వేల్ మండలం బెజుగామకి చెందిన నరేశ్ ఎమ్మెస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేశారు. హైదరాబాద్ అమీర్‌పేట కోచింగ్ సెంటర్లలో రాటుదేలి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం పొందాడు. ఆ వెంటనే లాక్డౌన్ రావడంతో హైదరాబాద్‌లోనే ఓ అద్దె ఇంట్లో ఉంటూ డ్యూటీ చేశాడు. కరోనా సెకండ్ వేవ్ రావడంతో స్వగ్రామమైన బెజుగామ చేరుకున్నాడు. ఇంటర్నెట్ సమస్యతో తిరిగి గజ్వేల్‌కి మకాం మార్చి విధులు నిర్వర్తిస్తున్నాడు. వాటర్ ప్లాంట్ నడుపుతూ.... దుబ్బాక పట్టణానికి చెందిన ఎల్లంగారి వినిత్‌రెడ్డి ఎమ్మెస్సీ (మ్యాథ్స్) పూర్తి చేశాడు. రెండేళ్లుగా హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ కళాశాల శ్రీ చైతన్యలో నార్సింగ్ బ్రాంచిలో హాస్టల్ సూపర్ వైజర్‌గా చేస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో 45 రోజుల క్రితం ఇంటికొచ్చాడు. దీంతో ఇక్కడ తన బంధువు వాటర్ ప్లాంట్‌ను లీజ్‌కు తీసుకొని తన తమ్ముడితో కలసి పనిచేస్తున్నాడు. ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో క్లాసులు చెబుతున్నారు. వారంతా వర్క్ ఫ్రం హోం వరంగల్ నగరానికి చెందిన రాజ్‌కుమార్, శివప్రసాద్, శరత్ ముగ్గురు అన్నదమ్ములు ఐటీ రంగంలో స్థిరపడ్డారు. ఏడాది కాలంగా వర్క్ ఫ్రం హోం నిర్వర్తిస్తున్నారు. వరంగల్ నగరంలో ఇంటర్నెట్కి ఇబ్బందులు లేకపోవడంతో ప్రత్యేకంగా నెట్ కనెక్షన్‌ను తీసుకున్నారు. ఇంటి నుంచి విధులు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా అన్నదమ్ములందరం ఒకే దగ్గర ఉండి విధులు నిర్వర్తించడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. -
వలసలు నిజం... వాదనలు అబద్ధం
మనుగడ కోసం పక్షులే వేల కిలోమీటర్లు ఎగురుతూ వెళ్లిపోతాయి. మరి మనుషులు మాత్రం ఉన్నచోటే ఎందుకుంటారు? స్వావలంబన కోసం ఉన్న ప్రాంతాన్ని వదిలి, కొండలు, కోనలు, పర్వతాలు, సముద్రాలు దాటి కొత్త ఖండాలకు వెళ్లి నివాసాలు ఏర్పరుచుకున్నారు. చారిత్రక పరిణామ క్రమంలో వలసలు అనివార్యం. ఈ క్రమంలో జాతులు సంపర్కం చెందాయి. సమాజాలు కలగలిసిపోయాయి. ఈ రోజు ఆర్య రక్తం, అనార్య రక్తం అనేది వేరుచేయగలిగేది కాదు. అయినా కొన్ని రాజకీయ శక్తులు కులాలను, మతాలను, జాతులను తమ స్వార్థం కోసం, అధికారం కోసం విడదీసే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. వాటిని తిప్పికొట్టడానికి శాస్త్రీయమైన పరిశోధనలు, ఆ పరిశోధనల ఆధారంగా రాసిన పుస్తకాలే ఆయుధాలు. ‘‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది?’’ ఈ ప్రశ్నలో సంధించిన మానవకథ- ప్రకృతి కథే! పశుపక్ష్యాదులు, శిల్పం, సాహిత్యం, శాస్త్రం, వైజ్ఞానిక శాస్త్రం, కవిత్వం, నాట్యం, అన్నీ ప్రకృతి జననంతో ముడిపడి ఉన్నవే. అవి మానవుడి ద్వారా వివిధ రూపాలలో వ్యక్తమవుతూ ఉంటాయి. విశ్రాంత సాంకేతిక నిపుణులు, భౌతికవాది, పరిణామవాద, వైజ్ఞానిక శాస్త్రాంశాల పరిశోధనలో తలమునకలుగా ఉన్న మర్ల విజయకుమార్ తాజాగా వెలువరించిన ‘భారతీయుల (చారిత్రక, సాంస్కృతిక, జన్యు) మూలాలు’ అన్న గ్రంథం (పీకాక్ క్లాసిక్స్) నేటి తరాలకు ఒక అమూల్య రచన. ‘ఓల్గా నుంచి గంగా’ నదీ తీరందాకా మధ్యాసియా ఇరానియన్ సాంస్కృతిక పూర్వ రంగం నుంచి ఆసియా ఖండంలో సాగిన మానవ వలసల గురించి అత్యంత విలువైన సమాచారంతో కూడిన వైజ్ఞానిక పరిశోధనా గ్రంథాన్ని కథల రూపంలో మహాపండితుడు, బౌద్ధ దార్శనికుడు, ముప్పయ్ భాషలు తెలిసిన విజ్ఞానవేత్త రాహుల్ సాంకృత్యా యన్ అందించారు. ఆ తర్వాత తొలి తరం సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారులలో అగ్రగణ్యులైన ప్రొఫెసర్ డీడీ కోశాంబి, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ, ఆ తరువాతి తరం చరిత్రకారులలో సుప్రసిద్ధులైన డీఎన్ ఝూ, ఇర్ఫాన్ హబీబ్‌లు కూడా దక్షిణాసియా నుంచి మన దేశం లోకి ఉధృతంగా సాగిన మానవ వలసల గురించి, విభిన్న జాతులు, తెగల గురించి విస్తారంగా ప్రస్తావించడం జరిగింది. రాహుల్జీ ఒక సందర్భంలో పేర్కొన్నట్టు ‘పక్షి సంతానం కంటే, మానవ సంతానానికి ఈ ప్రపంచంలో బతకడానికి సాధనాలు, అవకాశాలు కూడా ఎక్కు వన్న విషయాన్ని చాలామంది మరిచిపోతారు’’. సరిహద్దులు ఎరుగని జగజ్జనులు మనకు తెలుసు, ఆంధ్రలో కొల్లేరు సరస్సుకు, పులికాట్ సరస్సుకు వచ్చే పక్షులన్నీ సైబీరియా (రష్యా) నుంచి వచ్చి రుతువును బట్టి సేద తీర్చుకుంటుంటాయి. లాల్సర్ పక్షులు అలా చలికాలంలో వచ్చి వేసవి వస్తుందనగానే ఏప్రిల్‌లో హిమాలయాలవైపు వెళ్లి పోతాయి. ఇలా తమకు బొత్తిగా తెలియని దూర తీర ప్రాంతాలకు పక్షులు, వాటి పిల్లలకు ఎగిరివెళ్లి, వాలి తమ జీవనాన్ని గడుపుకోగల శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది స్వావలంబన వల్లనే అనివార్యమవుతుంది. ఇలా పశుపక్ష్యాదులే స్వావలంబన ద్వారా తమ జీవితాలకు మెరుగు పెట్టుకుంటుండగా మానవ సంతానం ఇంకెలా ఉండాలి? అని మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్ తన ‘లోక సంచారి’ గ్రంథంలో ప్రస్తావించాడు. అలాంటివే సప్తఖండాలలోనూ జరిగాయి. ఒక చోటు నుంచి, ప్రాంతం నుంచి, దేశాల నుంచి, ఖండాంతరాల నుంచి ‘సరిహద్దులు ఎరుగని జగజ్జనులు’ చారిత్రక పరిణామ క్రమంలో కొండలు, కోనలు, పర్వతాలు, సముద్రాలు దాటి తమ అవసరాల కొద్దీ కొత్త ప్రాంతాలకు వెళ్లి స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నారు. వలసలు వచ్చి స్థిరపడిన జనాల మధ్య పనిగట్టుకుని కుల, మత వివక్షలు రేపుకోవడం కన్నా భుక్తి గడుపుకోవడానికి, ఉనికిని కాపాడుకోవడానికే సమయమంతా సరిపోయింది. జనపదాల కదలికలు మారాయి, అలవాట్లకు పెట్టే పేర్లూ మారాయి. సమాజం పరిణామం చెందుతున్నకొద్దీ భక్ష్య పదార్థమైన ‘సూపా’న్ని ప్రాచీనులు మాంసానికి వాడితే, దాన్నే తరువాతి కాలాల్లో శ్రోత్రియ కుటుంబాలు ‘కందిపప్పు’ని సూపంగా చెప్పసాగాయి. నేటికి రెండులక్షల సంవత్సరాల నాటికే పాత తరాల యుగపు మాన వుడు అడవుల్లో నివసిస్తూ వేట, ఆహారసేకరణ ఆధారంగా జీవించ సాగారు. మానవ జాతికి పుట్టిల్లు తూర్పు ఆఫ్రికా అని అనేక మానవ జన్యుకణాల పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు నిరూపించారని మర్ల విజయకుమార్ పేర్కొన్నారు. మానవ నివాసానికి అనుకూలం గాని ప్రాంతాల నుంచి అను కూలమైన ప్రాంతాలకు మానవ వలసలు ఎందుకు సాగాయో సోదాహరణంగా వివరించారు. ఈ మానవ వలసల్లో భాగంగానే చరిత్రలో ఆదిమ జాతులుగా పేర్కొన్న మానవులు లక్ష ఏళ్ల నాటికే ఆఫ్రికా నుంచి వచ్చి వాతా వరణం కాస్త వేడిగా ఉన్న హిమాలయ పర్వతాలకు చేరుకున్నారు. వాతావరణం ప్రభావం రంగును, ముఖ కవలికల్ని కూడా మార్చేశాయి. సింధు అయ్యింది హిందూ... అలాగే భారతదేశంలో కొందరు మతాభిమానులు దేశ నాగరికతను మత ప్రాతిపదికపై విభజించి చూపేందుకుగాను సింధు నాగరికతను ‘హిందూ’ నాగరికతగా చిత్రించడానికి చేస్తూ వచ్చిన ప్రయత్నాన్ని ఈ గ్రంథకర్త తిప్పికొట్టారు. ఎందుకంటే భారతదేశంతో సంపర్కం కల్గిన పర్షియన్లకు చారిత్రక మొహెంజదారో–హరప్పా నాగరికతలకు ఆల వాలంగా ఉన్న సింధు నదీలోయ ప్రాంతాన్ని... ‘స’కారాన్ని అదే అక్షరంతో పలకడం రానందున, దాన్ని ‘హ’కారంగా మార్చుకుని ‘సింధు’ను ‘హిందు’గా ఉచ్చరించుతూ రావడంవల్ల ఈ గందరగోళం ఏర్పడిందని గుర్తించాలి. ఉచ్చారణలో ఒక్క ‘అక్షరం’ మార్పిడివల్ల భారతదేశంలోని ఛాందస వర్గాలు కొందరు మొత్తం దేశ ఐక్యతకు, మత సామరస్యానికి, లౌకిక వ్యవస్థకు ఎంత చేటు కల్గిస్తూ వచ్చారో చరిత్ర చెబుతోంది. వాడికి ‘స’ అక్షరం నోరు తిరగలేదు కాబట్టి మన ఛాందసులు ‘వికార’ పోకడలు ఎందుకు పోవాలి? మూలాలను నిర్ధారించే పరిశోధన జన్యు విజ్ఞాన పరిశోధనలకు చరిత్ర పఠనంలో ఎంత విలువుందో తెలుసుకోవాలంటే ఇటీవల కాలంలో వెలుగు చూసిన ఒక గొప్ప సత్య నిరూపణను పాఠకుల ప్రయోజనార్థం ఇక్కడ ఉదహరించదలిచాను. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మాజీ డైరెక్టర్ జనరల్, బౌద్ధ పరిశోధకులు ఆంజనేయ రెడ్డి కుటుంబం తాలూకు జన్యు లక్షణాల పుట్టుపూర్వాలు, వారి కుటుంబ పూర్వీకులు ఎక్కడి నుంచి తెలుగుదేశానికి ఊడిపడి స్థిరపడ్డారన్న యావత్తు తబిశీళ్లు ఒక ‘జినోగ్రాఫిక్’ ప్రాజెక్టు ద్వారా బయటపడ్డాయి. ఈ ప్రాజెక్టును ప్రపంచ ప్రఖ్యాత పత్రిక ‘నేషనల్ జాగ్రఫిక్’ (ఐబీఎం) నిర్వహించింది. ఆంజనేయరెడ్డి ‘పుట్టెంట్రుకల’ తబిశీళ్లు బయటికి లాగిన ఈ ప్రాజెక్టు ఆ కుటుంబ జన్యుకణాల పూర్వాపరాలను డీఎన్ఏ పరీక్ష ద్వారా వెల్లడించింది. అంజనేయరెడ్డి క్రోమోజోమ్ ‘వై’గా నిర్ధారణ చేసి, దాన్ని హాప్లోగ్రూప్–ఎల్గా గుర్తించింది. 60,000 సంవత్సరాల క్రితం వీరంతా ఆఫ్రికనేతరులుగా నిర్ధారించారు. ఈరోజున దక్షిణ భారతంలో నివసించే వారిలో నూటికి 50 మందికి పైగా ఈ ‘హాప్లో’ గ్రూపుకు చెందినవారేనని తేల్చారు. ఆంజనేయులు పూర్వీకులలో తొలితరం పూర్వీకుడు 50 వేల ఏళ్ల క్రితంవాడని కూడా నిర్ధారించారు. ఆ పూర్వీకుడికి సంకేతం ‘ఎం– 168’గా నిర్ణయించారు. వీరంతా ఒకప్పటి ఆఫ్రికా వాసులుగా, వీరికి సంబంధించిన నిర్దిష్టమైన గుర్తులుగా రాతి పనిముట్లను గుర్తించడం విశేషం. ఈశాన్య ఆఫ్రికాలోని రిఫ్ట్ లోయలో (ఈనాటి ఇథియో పియా/కెన్యా/టాంజానియా ప్రాంతం) 31,000 నుంచి 79,000 సంవత్సరాల క్రితం ఆంజనేయులు పూర్వీకులు ఉండి ఉండవచ్చునని నిర్ధారించారు. వేదాలలో సర్వజ్ఞానం పొందుపర్చబడి ఉందని, ఈ ‘అపార విజ్ఞానాన్ని’ పాశ్చాత్యులు దొంగలించి తమ శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకున్నారని కొందరు పండితులనుకునేవారు ప్రకటనలు చేశారు. విజయకుమార్ అన్నట్టు కుల చట్రంలో ప్రజలను బందీలు చేసి వారిని దోపిడీకి గురి చేసినందున, దానికి మతం రంగు పూసి, తమ ఆర్థిక సామాజిక దోపిడీని కొనసాగించడమే దీనికి కారణం. నేడు కల్తీలేని ఆర్యజాతిగానీ, అనార్య జాతులు గానీ లేవు. కాల క్రమంలో జాతుల మధ్యన జన్యు మిశ్రమం జరిగిపోయింది గనుక. ఆ మాటకొస్తే చరిత్ర, సంస్కృతి విషయంలో భారత ప్రజల్లో అత్యధికులు అనార్య మూలాలు కలిగినవారే సుమా! కనుకనే భావ విప్లవానికి మతం, మూఢ విశ్వాసాలు ప్రధాన అడ్డంకి అని రాహుల్జీ హెచ్చరించి ఉంటాడు. మరి ఈ అడ్డంకిని తొలగించాలంటే ఏం కావాలన్నాడు శ్రీశ్రీ? ‘‘కదిలేదీ కదిలించేదీ/మారేదీ మార్పించేదీ/పాడేదీ పాడిం చేదీ/మునుముందుకు సాగించేది/పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ...’’! ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
ఆస్ట్రేలియాకు వలసలపై కోవిడ్ ఎఫెక్ట్
మెల్బోర్న్: కోవిడ్–19 మహమ్మారి ఈ ఏడాది ఆస్ట్రేలియా వలస వెళ్లాలనుకున్న వేలాది మంది.. ముఖ్యంగా భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. ఆస్ట్రేలియాకు 2018–19 సంవత్సరంలో 2.32 లక్షల మంది వలస వెళ్లగా కోవిడ్ ఆంక్షల కారణంగా 2020–21 సంవత్సరంలో ఆ సంఖ్య కాస్తా 31 వేలకు పడిపోయిందని ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం, సరిహద్దుల మూసివేత వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వలసలపై కోవిడ్–19 తీవ్ర ప్రభావం చూపిందని ప్రభుత్వం పేర్కొంది. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం 7 లక్షల మంది భారతీయులున్నారు. నిపుణులైన భారతీయులే ఆస్ట్రేలియా ప్రధాన ఉద్యోగ వనరు. అంతేకాదు, 90 వేల మంది భారతీయులు ఆస్ట్రేలియాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు. విదేశీ ప్రయాణాలపై నిషేధం తొలగించే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. -
కాలినడకన పది లక్షల మంది కూలీలు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని వివిధ ప్రాంతాల్లో లాక్డౌన్ కారణంగా ఇరుక్కుపోయిన వలస కార్మికులను తమ స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ వేలాది మంది వలస కార్మికులు తమ ప్రాణాలకు తెగించి గమ్యస్థానాలకు వందల కిలోమీటర్లు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నారు. అలా ఎంత మంది వెనక్కి బయల్దేరారు? ఎందుకు? దేశ చారిత్రక గమనంలో అసలు వలసలు ఎందుకు చోటు చేసుకున్నాయి? భారత దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి అంతా వలసలపైనే ఆధారపడి ఉందని నిపుణలు చెప్పారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక దేశంలో అంతర్గత పారిశ్రామిక వలసలు ప్రారంభమయ్యాయి. 1960లో గ్రీన్ రెవెల్యూషన్, 1991లో స్వేచ్ఛా వాణిజ్యం కోసం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, అందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థిక జోన్లతో వలసలు ఎక్కువగా పెరిగాయి. ఎక్కువ సంపాదన కోసం వలసలు జరగలేదు. ఉన్న ప్రాంతంలో ఉపాధి అస్సలు లేకపోవడం వల్లనే నూటికి 90 శాతం వలసలు జరిగాయి. దేశంలో ఎక్కువగా తూర్పు ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాలకు వలసలు కొనసాగాయి. పారిశ్రామికాభివృద్ధికి ముందు వ్యవసాయాధార వలసలు కొనసాగాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ ఉత్తర ప్రాంతాల నుంచి పచ్చిమ ప్రాంతాలకు తొలుత వ్యవసాయాధార కార్మిక వలసలే కొనసాగాయి. ఆ తర్వాత పారిశ్రామీకరణతో ఆ వలసలు మొదలయ్యాయి. ఒడిశా నుంచి ప్లంబర్లు ఢిల్లీకి వలస పోవడం, తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా నుంచి ముంబైకి భవన నిర్మాణ కార్మికులు పట్టణీకరణ, పారిశ్రామీకరణలో భాగంగా వలసలు వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి వెశ్లిన వారిని పాలమూరు కార్మికులని వ్యవహరిస్తారు. 1980లో మహారాష్ట్రలో చెక్కర పరిశ్రమ బాగా విస్తరించి బ్రెజిల్ లాంటి విదేశాలను చక్కెరను ఎగుమతి చేయడం ప్రారంభించినప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికుల వలసలు పెరిగాయి ఆ తర్వాత 2001లో పూర్తయిన ‘ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ కారిడార్’ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. (లాక్‌డౌన్‌తో సాధించిన ఫలితాలేమిటి?) దేశంలో అభివృద్ధి చెందని ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలకే వలసలు జరిగాయని, దేశంలో అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందక పోవడమే వలసలకు ప్రధాన కారణమని అధ్యయన నిపుణలు తేల్చారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని అన్నిరకాల పరిశ్రమలు ‘చీప్ లేబర్’ కోసమే వలసలను ప్రోత్సహించాయి. ఒక్క కార్మిక రంగాన్నే తీసుకుంటే దేశంలో ఐదారు కోట్ల మంది వలసకార్మికులు ఉన్నారు. వారిలో తట్టాబుట్ట సర్దుకొని కాలి నడకన ఊళ్లకు బయల్దేరిన కార్మికులంతా దినసరి వేతనం మీద బతికే కూలీలేనని నిపుణులు చెబుతున్నారు. రైలు చార్జీలు భరించే స్థోమత లేకనే వారు కాళ్లను నమ్ముకున్నారు. అలాంటి దాదాపు పది లక్షల మంది కార్మికులు తినడానికి తిండి, ఉండడానికి గూడు కరువై సొంతూళ్లకు బయల్దేరారు. వారిలో ఎక్కువ మంది దళిత వర్గాల వారే ఉన్నట్లు పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. (కార్మికులు లేక ‘పరిశ్రమల లాక్డౌన్’) -
భారత్ ఆది నుంచి వలసల దేశమే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత ఆర్థిక, సామాజిక పరిణామక్రమం వలసలపైనే ఆధారపడి ఉంది’ క్లాడ్ మార్కోవిట్స్, జాక్వెచ్, సంజయ్ సుబ్రమణియం సంయుక్తంగా ఎడిట్ చేసిన ‘సొసైటీ అండ్ సర్కులేషన్ మొబైల్ పీపీల్ అండ్ ఇటినరెంట్ కల్చర్స్ ఇన్ సౌత్ ఆసియా 1750–1950’లో పేర్కొన్నారు. భారత్‌లో ఒకప్పుడు ఎక్కువగా రైతులు, పశువులు, గొర్రెల కాపరులు వలసలుపోగా, ఆ తర్వాత చేనేత, విశ్వకర్మలు, వడ్రంగి తదితర వృత్తి కళాకారులు వలసలు పోయారు. పట్టణాల పారిశ్రామీకరణ కారణంగా ప్రధానంగా కార్మికులు వలసలుపోగా, నేడు అన్ని రంగాలకు చెందిన కూలీలు, కార్మికుల నుంచి ఐటీ నిపుణుల వరకు అందరు వలసలు పోతున్నారు. ఈ వలసలు భారత్‌లో స్వాతంత్య్రానికి ముందు తర్వాత కూడా కొనసాగాయి. కరవు, కాటకాలు, తుపానులు సంభవించినప్పుడే కాకుండా ప్లేగ్ లాంటి అంటురోగాలు వ్యాపించినప్పుడు మతోన్మాద అల్లర్లు చెలరేగినప్పుడు కూడా వలసలు జరిగాయి. ఒకప్పుడు పలు వలసలు ప్రాణాంతకంగా మారిన విషాద ఉదంతాలే కాగా, నేడు ‘ఘర్‌వాపసీ’ పేరిట కార్మికులు వెనక్కి తిరిగిపోతున్న వలసలే విషాదాంతాలు అవుతున్నాయి. (లాక్‌డౌన్‌తో సాధించిన ఫలితాలేమిటి?) 1782 నుంచి 1787 మధ్య కరవు కాటకాటకాలు తాండవించడంతో రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు కొనసాగాయి. ఆ తర్వాత సింధ్, మాల్వా, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు రైతులు, పశువుల కాపర్ల వలసలు ఎక్కువగా జరిగాయి. 1891–92 సంవత్సరంలో కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు 46 శాతం రైతులు, పశువులు ఆ ప్రాంతాలకు వలసలు పోయారు. 1899–1900 సంవత్సరంలో కరవు పరిస్థితుల ఏర్పడినప్పుడు మాల్వా, గుజరాత్, సింధ్, దక్షిణ పంజాబ్‌తోపాటు సెంట్రల్ ప్రావిన్స్‌కు 12 శాతం ప్రజలు, 20 శాతం పశువులు వలసలు పోయాయి. వలసపోయిన ప్రజలు వెనక్కి వచ్చినప్పుడు వారి ఇళ్లు, భూములు అన్యాక్రాంతం అయ్యేవి. వాటికోసం పోరాడితే కొందరికి న్యాయం జరిగేది. కొందరికి జరిగేది కాదు. భారత్, పాకిస్థాన్ రెండు దేశాలుగా విడిపోయినప్పుడు, ఆ తర్వాత జరిగిన మతోన్మాద అల్లర్ల సందర్భంగా కూడా వలసలు కొనసాగాయి. -
రహస్యంగా ‘శ్రామిక్’ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికుల తరలింపు వ్యవహారాన్ని ప్రభుత్వం రహస్యంగా నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు తమను స్వస్థలాలకు పంపాలని కొద్ది రోజులుగా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 4 రోజు ల క్రితం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 1,225 మంది కార్మికులతో తొలి రైలు లింగంపల్లి స్టేషన్ నుంచి నడిచింది. సోమవారం తెల్లవారుజామున మూ డున్నరకు ఘట్కేసర్ స్టేషన్ నుం చి 1,248 మందితో బిహార్‌లోని ఖగారియాకు రెండో రైలు పయనమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్మికులను 55 ఆర్టీసీ బస్సుల్లో సోమవారం అర్ధరాత్రి 12 నుంచి ఘట్కేసర్ తరలించారు. ప్రతి ప్రయాణికు డూ మాస్క్‌లు ధరించేలా చర్య లు తీసుకున్నారు. అధికారులే వారికి భోజనం, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ రైళ్లో చార్జీలపై కేంద్రం కొంత రాయితీ ఇవ్వగా.. మిగిలిన చార్జీల ను రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఇక రోజూ 45–48 వేల మందిని తరలించేలా సర్కారు ఏర్పాట్లు చే స్తోంది. బుధవారం ఉదయం నడిచే శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో తరలించేందుకు మంగళవారం సాయంత్రానికి ఆర్టీసీ 1,300 బస్సులను సిద్ధం చేసింది. ఈ రైళ్లలో వెళ్లే వలస కూలీల చార్జీల కింద ప్రభుత్వం రూ.4 కోట్లను అడ్వాన్సుగా చెల్లించింది. అంతా గోప్యమే..: నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగులు, వ్యా పారులు వీరిలో ఉన్నారు. వీరంతా దాదాపు ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఇలాంటి వారికి స్వస్థలాలకు వెళ్లే అవకాశం లేదు. కేవలం వలస కూలీలు, విద్యార్థులు, లాక్డౌన్ వేళ చిక్కుపడిపోయిన పర్యాటకులకే అనుమతి ఉంది. ఇలాంటి వారు దాదాపు ఏడెనిమిది లక్షల మంది ఉన్నారు. ఇందులో 99 శాతం మంది వలస కార్మికులే. వీరిలో సింహభాగం స్వస్థలాలకు వెళ్లాలని సిద్ధపడ్డారు. కానీ, ఉద్యోగ, వ్యాపార పనుల్లో ఉన్నవారిలో కూడా కొందరు స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్నారు. కానీ వారిని ప్రభుత్వం అ నుమతించటం లేదు. వలస కార్మికుల తరలింపు వేళ వారు కూడా తమకు అవకాశం కల్పించాలంటూ పె ద్దసంఖ్యలో పోలీసుస్టేషన్ల కు వచ్చి దరఖాస్తు చేసుకుంటున్నారు. దీన్ని నివా రించేందుకు శ్రామిక్ రైళ్లను నడిపే విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. కార్మికులు ఏ ప్రాంతానికి వెళ్లాలో, ఎంతమంది ఉంటారో ముందే నిర్ణయించి రాత్రి పొద్దుపోయాక, రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు రైల్వే నోడ ల్ అధికారికి చెబుతున్నారు. దీంతో సదరు స్టేషన్లో అప్పటికప్పుడు రైలును సిద్ధం చేసి ఉంచుతున్నారు. ఫలితంగా వలస కార్మికుల తరలింపు కార్యక్రమం అవాంతరాలు లేకుండా సాఫీగా సాగుతోంది. వలసకూలీలతో బయల్దేరుతున్న శ్రామిక్ రైలు -
వలసలతో హైదరాబాద్ దేశంలోనే నంబర్‌వన్
సాక్షి, హైదరాబాద్: ‘గంగా జమునా తహజీబ్’ నానుడితో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మిశ్రమ సంస్కృతికి ప్రతిరూపంగా నిలుస్తోన్న భాగ్యనగరం వేతన జీవులు, వలస కూలీల పాలిట కల్పవృక్షంగా మారుతోంది. జనగణన శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2001–11 మధ్య కాలంలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన వారి సంఖ్య 39 శాతంగా నమోదైంది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే వలసల విషయంలో రాజధాని అగ్రభాగాన నిలిచింది. 2021 జనాభా లెక్కల్లో నగరంలో 40 శాతానికిపైగా వలసలు నమోదవుతాయని నిపుణుల అంచనా. కాగా, దేశ రాజధాని ఢిల్లీ.. వలసల్లో పెరుగుదల ఒక్క శాతానికే పరిమితమై 6వ స్థానం దక్కించుకుంది. హైదరా‘బాద్షా’.. ఐటీ, ఫార్మా, బల్క్‌డ్రగ్, నిర్మాణ రంగం, హెల్త్‌కేర్, విద్యా రంగాలకు కొంగు బంగారమై నిలుస్తోన్న హైదరాబాద్ నగరానికి ఏటేటా వలసలు పెరుగుతున్నాయి. వివిధ రకాల వృత్తి, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూలీలు, విద్యా వంతులు నగరానికి భారీగా వలస వస్తున్నారు. వీరందరికీ వారి అనుభవం, అర్హతలను బట్టి ఉపాధి అవకాశాలు లభ్యమవుతున్నాయి. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైల్లో రోజువారీ కనీస జీవన వ్యయం అనూహ్యంగా పెరగడం, మరోవైపు హైదరాబాద్‌లో కనీస జీవన వ్యయం వాటి కంటే సగానికి పరిమితం కావడంతో వలసలు వెల్లువెత్తుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వలసలకు కారణాలివే.. ► నగరంలోని ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల మిశ్రమ సంస్కృతి వేర్వేరు ప్రాంతాల ప్రజలను ఆకర్షిస్తుండటం. ► అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులు, దినసరి కూలీలకు అందుబాటులో కనీస జీవన వ్యయం. ► నగరంలో శరవేగంగా పురోగమిస్తున్న నిర్మాణ రంగం, బల్క్‌డ్రగ్, ఫార్మా, ఐటీ రంగాల్లో వేలాది మందికి ఉపాధి లభిస్తుండటం. ► ఉత్తరాది రాష్ట్రాల వారికి నగరంలో భాషాపరమైన ఇబ్బందులు లేకపోవడం. ► అందరికీ అందుబాటులో ఇంటిఅద్దెలు, రవాణా ఖర్చులు. -
ఉపాధి కల్పిస్తాం.. వలస వెళ్లొద్దు
సాక్షి, పెద్దేముల్: చెంచు కుటుంబాలు వలస వెళొద్దని గ్రామంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అన్నారు. గురువారం పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ గ్రామంలో కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కోటయ్య, పీఓ ఐటీడీఏ (శ్రీశైలం), పీఓ డాక్టర్ వెంకటయ్యతో పాటు పలు శాఖల అధికారులతో కలెక్టర్ పర్యటించారు. ఇటీవల గ్రామంలో నుంచి చెంచు కుటుంబాలు కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు బతుకు దెరువుకోసం వెళ్లారు. శివ అనే నాలుగు సంవత్సరాల బాబు చదువుకోవడం లేదని బీజాపూర్ జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చింది. దీంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆయా కుటుంబాలను గ్రామానికి తీసుకువచ్చారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆయేషా గ్రామంలోని చెంచు కుటుంబాలను కలిశారు. చైతన్యనగర్ గ్రామంలో చెంచుకుటుంబాలు ఎన్ని ఉన్నాయనే విషయమై ఆర్డీఓ వేణుమాధవరావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. గ్రామంలో బడి బయట ఉన్న పిల్లల వివరాలను సేకరించి పిల్లలు బడికి రాకపోవడానికి గల కారణాలను ఆరాతీశారు. అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. స్థానికంగానే ఉపాధి కల్పిస్తాం.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలోనుంచి చెంచు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లవద్దని కోరారు. తల్లిదండ్రులు గ్రామంలోనుంచి ఉపాధి కోసం వలస వెళితే పిల్లల చదువులు సాగవని అన్నారు. గ్రామంలో వ్యవసాయానికి పనికిరాకుండా ఉన్న భూములను ప్రభుత్వం చదును చేస్తుందని అన్నారు. బడీడు పిల్లలకు ఎలాంటి పనులు చెప్పరాదని అన్నారు. పిల్లలను చదివిస్తేనే కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారుతాయని అన్నారు. గ్రామం లోని కుటుంబాలకు ఉపాధిహమీ పథకం ద్వారా 180 రోజుల పాటు పనిదినాలు కల్పిస్తామని అన్నారు. గతంలో గ్రామానికి అధిక సంఖ్యలో నిధులు మంజూరయ్యాయని అయితే గ్రామ ప్రజల్లో చైతన్యం లేకపోవడంతో గ్రామాభివృద్ధి జరగడం లేదన్నారు. మహిళలకు, రైతులకు రుణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. గ్రామంలో 20 కుటుంబాలకు భూములను పంపిణీ చేసి పాసుబుక్‌లను సైతం జారీచేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ చైతన్యనగర్‌లో చైతన్యం మాత్రం రావడం లేదన్నారు. గ్రామంలో నుంచి ప్రజలు వలసలు వెళ్లడం తగ్గించుకుంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. చెంచు కుటుంబాలకు గిరివికాసం పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించనుందన్నారు. బాండేడ్ లేబర్ యాక్టు ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పిల్లల చదువుల కోసం గ్రామంలో ఎన్సీఎల్పీ కేంద్రం నిర్వహించి విద్యార్థులు చదువుకునేలా చేస్తామని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. గ్రామంలో చెంచు కుటుంబాలకు విద్యుత్ సరఫరా 100 యూనిట్లలోపు వినియోగిస్తే ఉచితంగా విద్యుత్ సరఫరా ఉంటుందని బిల్లులు చెల్లించాల్సిన పనిలేదని తెలిపారు. కార్మిక శాఖ అధికారులు త్వరలో గ్రామానికి వచ్చి లేబర్ కార్డులను జారీచేస్తారని ఈ కార్డులు పొందినవారికి పిల్లల పెళ్లిళ్లకు రూ.30 వేలు, కాన్పుల సమయంలో మరో రూ.30 వేల చొప్పున అందించడం జరుగుతుందని, ప్రమాదాలు సంభవిస్తే రూ.లక్ష అందుతోందని తెలిపారు. అనంతరం గ్రామస్తులు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరా>రు. గ్రామంలోనే ఉపాధి పొందేందుకు గేదెలు, ఆవులు అందించాలి. స్వయం ఉపాధి కోసం రుణాలను అందించాలని కలెక్టర్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమశాఖ అధికారి విజయలక్ష్మి ఆర్డీఓ వేణుమాధవరావు, ఎన్సీఎల్పీ ప్రాజెక్టు అధికారి హ్మన్మంత్‌రావు, రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రత్నమ్మ,సర్పంచ్ లలిత, పలు శాఖల అధికారులు, గ్రామస్తులు ఉన్నారు. -
మేఘాల పల్లకిలోనా దిగివచ్చింది ఈ దేవకన్య
సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం) : నేస్తాలు వచ్చేశాయి. మేఘాల పల్లకిపై ఉద్దానం వాకిటకు సంతానోత్పత్తి కోసం వేంచేశాయి. ఆడబిడ్డ పురుటి కోసం ఇంటికి వచ్చినంత సంబరంగా స్థానికులు ఈ పక్షి నేస్తాలను ఆహ్వానిస్తున్నారు. రెక్కల చప్పుడుతో చినుకులను వెంట తీసుకువచ్చే విహంగాల సంరక్షణ తమ బాధ్యతని చెబుతుంటారు. ఎక్కడో సుదూర తీరాన ఉన్న సైబీరియా నుంచి ఎగురుకుంటూ ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి వరకు ప్రయాణం చేసిన విహంగాలకు ఇక్కడ రెక్కలు విరిగిన వృక్షాలే స్వాగతమిచ్చాయి. గత ఏడాది వరకు తమ చేతులారా ఆహ్వానించిన వృక్ష రాజాలు నేడు మోడువారిన కాండాలనే పక్షి నేస్తాలకు ఆవాసాలుగా మలచనున్నాయి. పక్షుల సందడితో తేలుకుంచి పులకించిపోతోంది. కొమ్మకొమ్మకు పురిటి కేంద్రాలు చెట్లపై కొమ్మలు, రెమ్మలు ఉంటే తప్ప గూడు ఏర్పాటు చేసుకోలేని ఈ పక్షులు గుడ్లు పెట్టేందుకు చెట్లనే ఆశ్రయిస్తుంటాయి. ఒక్కో పక్షి రెండు నుంచి ఆరు గుడ్లు వరకు పెడుతుంది. సుమారు 27 నుంచి 30 రోజుల వరకు తల్లి పక్షి గుడ్లను పొదుగుతుంది. పొదిగిన రోజు నుంచి 36 రోజుల పాటు ఆహారాన్ని తీసుకువచ్చి అందించి సంరక్షిస్తాయి. పిల్ల పక్షులు ఎగిరేంత వరకు తల్లి పక్షి లేదా మగ పక్షి గూళ్లో వీటికి కాపలాగా ఉంటాయి. ఆడపడుచుల్లా విదేశీ పక్షులు శతాబ్దాల నుంచి వలస వచ్చే విదేశీ విహం గాలపై ఈ గ్రామస్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు హద్దుల్లేవు. నిజానికి వాటిని పురుడు పోసుకునేందుకు వచ్చిన ఆడపడుచుల్లా భావిస్తారు. వాటితో విడదీయరాని అనుబంధం ఈ గ్రామస్తులతో పెనవేసుకుంది. రావాల్సిన సమయంలో పక్షులు గ్రామాని కి చేరకపోతే ఇక్కడ ప్రజలు ఆందోళన పడతారు. ఏటా జూన్ మాసంలో ఈ పక్షుల రాకతోనే నైరుతి పవనాలు ఆరంభమవుతాయని గ్రామస్తుల నమ్మ కం. వీటి రాకతోను తమ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయ ని గ్రామంలో ఉండే వృద్ధులు చెబుతుంటారు. తాము కూర్చున్న చోట, పక్కలో పక్షులు వాలుతాయే తప్ప ఎవ్వరికీ ఎలాంటి హాని చేయవని, వీటిని వేటగాళ్ల బారి నుంచి గ్రామస్తులమే రక్షిస్తుం టామని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా పక్షులకు హాని తలపెట్టాలని చూస్తే గ్రామ కట్టుబాటు ప్రకారం ఆ వ్యక్తికి గుండు గీయించి ఊరేగిస్తామని హెచ్చరిస్తారు. పక్షుల ప్రత్యేకతలు ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్ నెలలో సైబీరియా నుంచి వస్తున్న ఈ పక్షుల అసలు పేరు ఓపెన్ బిల్ స్టార్క్స్ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు) అంటారు. వీటి శాస్తీయ నామం ‘అనస్థోమస్’. ఈ పక్షులు తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. వీటి జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. దవడల మధ్యన (ముక్కు మధ్యలో) ఖాళీ ఉండటం వల్ల వీటిని ఓపెన్ బిల్ స్టార్క్స్ అని అంటారు. పగలంతా తంపర భూముల్లో, వరి చేలల్లో తారుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా ఈసుకుంటాయి. ఆరు నెలలు పాటు త మ పిల్లలతో గడిపిన పక్షులు పక్షి పిల్లలు ఎగిరేంత బలం రాగానే డిసెంబర్, జనవరి నెలల్లో తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి. సంరక్షణ గాలికి పక్షులను సంరక్షించాల్సిన అటవీ, పర్యావరణ శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో గాయాలపాలైన పక్షులకు ప్రథమ చికిత్స అందించిన అధికారులు అనంతరం వాటిని సంరక్షించాలన్న సంగతిని మరిచారు. గ్రామంలో చెట్లు పెంచా ల్సిన అటవీశాఖ సిబ్బంది జాడే లేకుండా పోయింది. ప్రత్యమ్నయంగా పక్షులు గూళ్లు పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఇనుప టవర్ పంజరాలు అక్కరకు రాకుండా పోయాయి. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ మూడేళ్ల కిందట పర్యాటక శాఖ అధికారులతో పర్యటించి రూ.25లక్షలతో సుమారు ఎకరా దేవదాయ భూమిలో పర్యాటక కేంద్రాన్ని నిర్మిస్తానంటూ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. విహంగాలకు విడిది లేదు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న విహంగాలకు తేలు కుంచిలో విడిది లేని పరిస్థితి నెలకొంది. వరుస తిత్లీ, పైలాన్ తుఫాన్ తీవ్రతకు చెట్లు నేలకొరిగాయి. అంతే కాకుండా గత తిత్లీ తుఫాన్‌కు వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో ఏడాదికి వీటి సంఖ్య 30–40 శాతం తగ్గుముఖం పట్టా యి. ప్రస్తుతం పక్షులు గూళ్లు పెట్టేందుకు నానాపాట్లు పడుతున్నాయి. చెట్లనే ఆవాసాలుగా ఏర్పాటు చేసుకునే ఈ పక్షులు ఉండేందుకు చెట్లు లేక గడ్డికుప్పలు, ఇళ్లపై, పంట పొలాల చాటున గూళ్లు పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నాయి. రాత్రి సమయాల్లో విష పురుగుల బారిన పడి పక్షులు మృతి చెందుతున్నాయని స్థానికులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. -
2 లక్షల ఏళ్ల క్రితమే యూరప్‌కు మానవులు
న్యూఢిల్లీ : ఆధునిక మానవులు (నాగరికత నేర్చుకున్న) ఆఫ్రికా నుంచే యూరప్‌కు వలస వచ్చారని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. రొమానియాలోని ఓ గుహలో దొరికిన 1,50,000 ఏళ్ల నాటి ఆధునిక మానవుడి పుర్రె ఆధారంగా 1,70,000 ఏళ్ల క్రితమే ఆఫ్రికా నుంచి మానవులు యూరప్‌కు వలసవచ్చారని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ రెండు లక్షల ఏళ్ల క్రితమే మానవులు ఆఫ్రికా నుంచి యూరప్‌కు వలసవచ్చారని గ్రీసులోని ఓ గుహలో దొరికిన ఆధునిక ఆది మానవుడి పుర్రె ఆధారంగా శాస్త్రవేత్తలు కొత్త అభిప్రాయానికి వచ్చారు. తాజాగా దొరికిన పుర్రె 2,10,000 ఏళ్ల నాటిదని ఎపిడిమా 2 ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. ఎపిడిమా 1, ఎపిడిమా 2 అనే రెండు విధాల సీటీ స్కాన్ ద్వారా పుర్రెల కాలాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. ఆఫ్రికా నుంచి ఆగ్నేయ యూరప్ గుండా మానవులు వలస వచ్చారని, వారంతా ఒకేసారి ఓ వెల్లువలా కాకుండా అప్పుడప్పుడు గుంపులు, గుంపులుగా వచ్చి ఉంటారని ఈ పుర్రెపై అధ్యయనం జరిపిన బ్రిటన్‌లోని మ్యాన్చెస్టర్ యూనివర్శిటీ, జర్మనీలోని టూబింగన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. యూరప్‌కు వలస రాకముందు ఆదిమానవులు (నియాండర్తల్స్) ఐదు లక్షల సంవత్సరాలకు ముందే ఆఫ్రికాలో నివసించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధునిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 5.50 కోట్ల సంవత్సరాల క్రితమే ఆదిమానవుడికి ప్రాథమిక కోతి రూపమైన ‘గిమాన్’లు ఉండేవి. 1.50 కోట్ల సంవత్సరాల నాటికి గిమాన్ నుంచి హోమినిడాగా పిలిచే తోకలేని నల్ల కోతులు వచ్చాయి. వాటిన ఉంచి 70 లక్షల ఏళ్ల క్రితం గెరిల్లా కోతులు వచ్చాయి, 55 లక్షల ఏళ్ల క్రితం గెరిల్లాలకు కాస్త మానవ రూపం వచ్చింది. 40 లక్షల సంవత్సరాల క్రితం ఆ గెరిల్లాకు మరికాస్త మానవ రూపం వచ్చింది. ఇక 39 లక్షల ఏళ్ల నుంచి 29 లక్షల ఏళ్ల మధ్య ఆస్ట్రోలోపితికస్ జాతి మానవులు, 27 లక్షల ఏళ్ల క్రితం పరంత్రోప్ ఆది మానవులు నివసించారు. 26 లక్షల ఏళ్ల క్రితం గొడ్డలి ఆయుధాన్ని ఆది మానవుడు కనుగొన్నారు. పద్దెనిమిది లక్షల ఏళ్ల క్రితం మానవుడికి ఆధునిక చేయి వచ్చింది. ఎనిమిది లక్షల ఏళ్ల క్రితం ఆది మానవుడి మెదడు పరిణామం పెరిగింది. నిప్పును నియంత్రించడం, మట్టి పాత్రలు తయారు చేయడం నేర్చుకున్నారు. మూడు లక్షల నుంచి రెండు లక్షల మధ్య ఆఫ్రికా నుంచి మానవులు యూరప్‌కు వలస వచ్చారు. -
వలస ఓటర్లేరి?
సాక్షి,అడ్డాకుల: ఊర్లలో వరుసగా ఎన్నికలు...నాలుగు నెలల వ్యవధిలో మూడు ఎన్నికలు. నాలుగు నెలలుగా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఊర్లలో ఉండే ఓటర్లు ముందు జరిగిన రెండు ఎన్నికల్లో అంతా ఓట్లేశారు. పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లు రెండు ఎన్నికల్లో ఓట్లు వేయడానికి కొంత ఉత్సాహం కనబర్చడంతో జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. కానీ గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఓట్లు వేయడానికి ఓటర్లు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. వరుస ఎన్నికలకు తోడు వేసవికాలం ఎండలు తోడు కావడం లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపింది. వలస ఓటర్లే కాకుండా గ్రామాల్లో ఉన్న ఓటర్లు కూడా ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాలను వెళ్లకపోవడంతో ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. పోలింగ్ శాతం తగ్గడంతో ఏ పార్టీకి లాభం కలుగుతుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుందన్న దానిపై నేతలు లెక్కలేస్తున్నారు. తగ్గిన పోలింగ్ శాతం.. 2018 డిసెంబర్ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 84.6శాతం పోలింగ్ నమోదైంది. అదే 2014 శాసనసభ ఎన్నికల్లో 71.67శాతం జరిగింది. ఇదిలా ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 65.95శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 18శాతం తక్కువ పోలింగ్ జరిగింది. దేవరకద్ర మండలంలో 65.98శాతం, అడ్డాకుల 59.67 శాతం, కొత్తకోట 64.02శాతం, మూసాపేట 63. 23శాతం, మదనాపురంలో 67.04శాతం, భూ త్పూర్ 69.5శాతం, చిన్నచింతకుంట మండలం లో 69.14శాతం పోలింగ్ నమోదైంది. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా అడ్డాకుల మండలంలో అత్యల్పంగా 59.67శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. నియోజకవర్గ వ్యాప్తంగా 71,572 మంది పురుషులు, 71,728 మంది మహిళలు కలిపి మొత్తం 1,43,300 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వలస ఓటర్లు రాకపోవడంతోనేనా..! నియోజకవర్గంలోని గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువ మంది హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వారంతా ఎన్నికలప్పుడు ఊర్లకు వచ్చి ఓట్లు వేసి వెళ్తారు. మొన్న జరిగిన శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో నేతలు వలస ఓటర్లను ఊర్లకు రప్పించి ఓట్లు వేయించుకున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం వలస ఓటర్లపై నేతలు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పోలింగ్‌పై ప్రభావం పడింది. ఎండల తీవ్రత మూలంగా ఇతర గ్రామాలకు వెళ్లి ఓట్లు వేయాల్సిన చోట ఊర్లలో ఉండి కూడా చాలా మంది ఓట్లు వేయడానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
వలస జీవుల తీర్పెటో..?
సాక్షి, మహబూబ్‌నగర్: పాలమూరు.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో నెలకొన్న కరువే.వ్యవసాయ భూములున్నా సాగుకు నీరు లేక.. స్థానికంగా చేసేందుకు పని దొరక్క పొట్ట కూటి కోసం ముంబై.. పూణె.. కర్ణాటక.. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు గుర్తొస్తాయి. దశాబ్దాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంత మంది పాలకులు మారినా.. వలసజీవుల తల రాతలు మారడం లేదు. పరాయి ప్రాంతాల్లో వారు పడుతోన్న కష్టాలు గుర్తుకొస్తాయి. ‘స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశామలం చేస్తాం.. నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అంటూ ప్రతిసారీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే హామీలు గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్లీ వలస జీవులతో మన నాయకులకు పని పడింది. ఈ నెల 11 తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డ ఎంపీ అభ్యర్థులు తాజాగా వలస జీవుల ఓట్లనూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్యకర్తలు.. కుల.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు తాజాగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తోన్న వలస కూలీలు, కార్మికుల ఓట్లపై దృష్టి సారించారు. మూడున్నర లక్షలకు పైనే.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలున్నాయి. మహబూబ్‌నగర్ పరిధిలో 15,05,190మంది, నాగర్‌కర్నూల్ పరిధిలో 15,88,746మంది ఓటర్లున్నారు. రెండు సెగ్మెంట్ల నుంచి మూడున్నర లక్షలకు పైగా మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులుగా పని చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కోయిలకొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాజ్‌పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి పెద్ద మొత్తంలో ముంబయి, బెంగళూరు, పూణె నగరాల్లో ఉంటున్నారు. మక్తల్ మండలం కర్లి, గుడిగండ, మంతన్‌గోడ్, అనుగొండ, జక్లేర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎక్కువ మంది ముంబైలో ఉంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిని గుర్తించిన ఎంపీ అభ్యర్థులు, అనుచరులు వారికి ఫోన్లు చేస్తున్నారు. ఉగాది పండుగకు రాకున్నా.. పోలింగ్ రోజు కచ్చితంగా రావాలని అభ్యర్థిస్తున్నారు. ఉగాదికి తమ సొంతూర్లకు విచ్చేసిన వారి వివరాలు తీసుకుని వారిని కలుస్తున్నారు. ఎన్నికల తర్వాతే వెళ్లాలని అప్పటి వరకు ఏవైనా ఖర్చులున్నా తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందరి నోటా అదే మాటా.. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ప్రచారాన్ని వేగిరాన్ని పెంచిన ఎంపీ అభ్యర్థులందరూ ‘వలస’ ఓట్లు రాబట్టేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న అభ్యర్థులు తాము గెలిస్తే వలసలకు అడ్డుకట్ట వేసేలా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఇలాంటి హామీలే ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తుందని.. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని.. తమను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని, వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటూ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలు తెలుసని.. ఎంపీగా గెలిస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎవరూ వలస వెళ్లకుండా, వలస వెళ్లిన వారిని రప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచందర్‌రెడ్డి, మల్లురవి హామీలు ఇస్తున్నారు. వలస వెళ్లిన వారందరూ తిరిగి వచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలకు అడ్డుకట్ట వేస్తామంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో వలస జీవులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
వలసల భారతం ఏం చెబుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్ నాథ్ మాట్లాడుతూ స్థానికుల ఉద్యోగావకాశాలను ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. ఇక నుంచి స్థానికులకు 70 శాతం ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు తన ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని కూడా హామీ ఇచ్చారు. ఆయన మాటల్లో నిజమెంత ? అబద్ధం ఎంత ? అసలు వాస్తవం ఎంత ? వాస్తవానికి మధ్యప్రదేశ్‌కు వలసవస్తున్న వారి కన్నా మధ్యప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. 1991–2001 దశాబ్దంతో పోలిస్తే 2001 నుంచి 2011 దశాబ్దానికి రాష్ట్రం నుంచి వలసపోతున్న వారి సంఖ్య 461 శాతం పెరిగింది. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకన్నా వలసపోతున్న వారి సంఖ్య తక్కువే. మధ్యప్రదేశ్ నుంచి ఒక్కరు వలసపోతే బీహార్ నుంచి 3.5, ఉత్తరప్రదేశ్ నుంచి 7.6 శాతం మంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. బీహార్ నుంచి వలసపోతున్నవారి కన్నా వలసవస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ అంటే యూపీ నుంచి బీహార్ నుంచి ఆ రాష్ట్రానికి వలస పోతున్నవారి సంఖ్య మరీ తక్కువనే విషయం అర్థం అవుతోంది. యూపీ, బీహార్ నుంచి గతంలో ఎక్కువ మంది మహారాష్ట్రకు వెళ్లగా ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ పట్టణాలకు ఎక్కువగా వెళుతున్నారు. గతంతో పోలిస్తే యూపీ నుంచి వలసపోతున్న వారి సంఖ్య దశాబ్ద కాలంలో 197 శాతం పెరగ్గా, బీహార్ నుంచి 237 శాతం పెరిగింది. భారత దేశంలోని ప్రజలు ఉద్యోగావకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం కొత్త విషయం కాదు. స్వాతంత్య్రానికి ముందునుంచి ఉన్నదే. అయితే స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఎక్కడికైనా వెళ్లి స్థిర నివాసం ఏర్పరుచుకునే హక్కు ప్రతి భారతీయుడికి రాజ్యాంగ పరంగా సంక్రమించింది. ఈ వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. కొన్ని రాష్ట్రాలు కూడా విడిపోవాల్సి వచ్చింది. 1960వ దశకంలో తమిళనాడులో హిందీ భాషకు, హిందీ మాట్లాడే వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆ తర్వాత అస్సాంలో బెంగాలీ, హిందీ, నేపాలీ భాషలు మాట్లాడే వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఇక మహారాష్ట్రలో 1960 దశకం నుంచి ఇప్పటికీ ఉత్తర భారతీయులతోపాటు దక్షిణ భారతీయులు కూడా స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ మరాఠీ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. 2017లో కర్ణాటకలో కూడా హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. మొన్న అక్టోబర్ గుజరాత్లో హిందీ మాట్లాడేవారిపై దాడులు జరగ్గా వేలాది మంది గుజరాత్ నుంచి పారిపోయారు. హిందీ మాట్లాడే వారు తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ ఇతర రాష్ట్రాల వారు ఇంతవరకు ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తుండగా, తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ ఓ హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ఆరోపించడం ఇదే తొలిసారి. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన 2017 నాటికి దేశంలో వలసపోయిన వారి సంఖ్య 45.36 కోట్లు. ఈ సంఖ్య మరింత పెరిగితే చైనాలోలాగా వలసల నియంత్రనకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. -
ముల్లె సర్దిన పల్లె
ఖరీఫ్ సీజన్ ముగిసి..రబీ కూడా ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు లేవు.వస్తాయన్న ఆశా లేదు. కరువు విలయ తాండవం చేస్తోంది. కుటుంబాలు గడవడమే కష్టమైపోతోంది. ఈ తరుణంలో వలసలే దిక్కవుతున్నాయి. పొట్టకూటి కోసం పిల్లాపాపలతో సుదూర ప్రాంతాలకు పల్లె ప్రజలు పయనమవుతున్నారు. వ్యవసాయ కూలీలే కాదు..చిన్న, సన్నకారు రైతులు సైతం మూటాముల్లె సర్దుతున్నారు. కర్నూలు, ఆదోని టౌన్: ఆదోని డివిజన్..కరువుకు పెట్టింది పేరు. వరుసగా నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో ఆశించిన వర్షాలు లేవు. తుంగభద్ర దిగువ కాలువ ఉన్నా..ఎప్పుడూ వాటా నీరు రాలేదు. టీబీ డ్యాంలో గరిష్ట స్థాయి నీటి మట్టమున్నా..ఆయకట్టు తడవడం లేదు. వర్షాధారంపై ఆధారపడి సాగుచేస్తున్న పంటలు పండడం లేదు. ఈ ఏడాది జూన్‌లో మురిపించిన వర్షాలు ఆ తరువాత మొండికేశాయి. పంటల సాగు చేసిన అప్పులు భారమయ్యాయి. రబీలోనైనా పంటలు సాగు చేద్దామంటే..ఆ పరిస్థితులూ కనిపించడం లేదు. ఎండలు మండిపోతూ వేసవి తలపిస్తున్నాయి. పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చేందుకు సన్న, చిన్న కారు రైతులు బెంగళూర, ముంబయి తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. మూడు రోజులుగా ఆదోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు బెంగళూరుకు వలస వెళ్లే కూలీలతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి రోజుకు 500 కుటుంబాలకు పైగానే బెంగళూరుకు వలస వెళ్తున్నాయి. రైల్వే స్టేషన్లోనూ వందలాది కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఎలా బతకాలి? నాకున్న రెండెకరాల పొలంతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకున్నాను. వ్యవసాయ పనులు, పంటల సాగుకు దాదాపు రూ.30వేలు దాకా పెట్టుబడి పెట్టాను. కౌలు కూడా రాలేదు. ఎలా బతకాలి? భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు, వయసు మీదపడిన తల్లిదండ్రులు ఉన్నారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక బెంగళూరుకు వలస వెళ్తున్నాం. – బీరప్ప, రైతు, సుంకేసుల -
భారత్ నుంచి ఆ దేశానికే అత్యధిక వలసలు
సాక్షి, న్యూఢిల్లీ : నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలపై ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన తాజా నివేదిక పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక ప్రకారం భారత్ నుంచి అమెరికా అత్యంత రద్దీ కలిగిన అంతర్జాతీయ వలస మార్గంగా ముందువరసలో నిలిచింది. కేవలం 2010 ఒక్క ఏడాదిలోనే దాదాపు 12 లక్షల మంది నైపుణ్యం కలిగిన శ్రామికులు భారత్ నుంచి అమెరికా బాట పట్టారని వెల్లడైంది. ఇక ఫిలిప్పీన్స్ నుంచి కెనడా రూట్ తర్వాతి స్ధానంలో నిలవడం గమనార్హం. 2010లో ఫిలిప్పీన్స్ నుంచి కెనడాకు మూడు లక్షల మంది సిబ్బంది వలస బాట పట్టారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం వీసా ఆంక్షలు, వలసలపై కఠిన నిబంధనలతో భారత్ నుంచి అమెరికాకు నైపుణ్యంతో కూడిన మానవ వనరుల వలసలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. -
చరిత్ర మరవలేని వలసలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశాలు.. ఒకటి వాణిజ్యయుద్ధం, రెండు వలస విధానం. రెండింటికీ అమెరికా తీరే కారణం. మరీ ముఖ్యంగా వలసదారులపై అగ్రరాజ్యం అనుసరిస్తున్న పద్ధతి విమర్శల పాలవుతోంది. తమ దేశంలోకి అక్రమంగా వచ్చారంటూ లక్షలాది మెక్సికన్లను బలవంతంగా స్వదేశానికో, జైళ్లకో పంపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడంపై మిగిలిన దేశాలు మండిపడుతున్నాయి. జరిగిన తప్పును ఆలస్యంగా గుర్తించిన ట్రంప్.. దాన్ని సరిదిద్ధుకునేలోపే అమెరికా వ్యవహరించిన తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో చరిత్రలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న కొన్ని వలసల గురించి తెలుసుకుందాం... ప్రపంచ గతిని మార్చివేయడంలో వలసలూ కీలకపాత్ర వహించాయి. ఉపాధి, విద్య, వైద్యం, మెరుగైన అవసరాల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలివెళ్లడాన్నే వలస అంటారు. పక్షలూ జంతువులు సైతం ఆహారం కోసం వలస వెళ్లడం శతాబ్దాల నుంచి జరుగుతున్న జీవన క్రమమే. స్వచ్ఛందంగా జరిగిన వలసల సంగతి అటుంచితే.. యుద్ధం, అంతర్యుద్ధం, రాజకీయ కారణాలు, ప్రభుత్వ విధానాల వల్లనూ వలసలు చోటుచేసుకున్నాయి/ చోటుచేసుకుం టున్నాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. సిరియా అంతర్యుద్ధం సిరియాలో ఇప్పటికీ జరుగుతున్న అంతర్యుద్ధం మానవ హక్కుల హననంతోపాటు లక్షలాది సిరియన్లు ప్రాణభయంతో ఇతర దేశాలకు వలస వెళ్లడానికి కారణమవుతోంది. 2011 మార్చిలో ప్రభుత్వానికి, తిరుగుబాటు దళాలకు మధ్య మొదలైన పోరాటంలో రెండు వైపులా భారీగా ప్రాణనష్టం సంభవించింది. అంతకు రెట్టింపు సంఖ్యలో సిరియన్లు సరిహద్దు దాటి టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లండ్ తదితర యూరోప్ దేశాలకు వలస వెళ్లారు. ఈ క్రమంలో సముద్రాలు, ముళ్ల కంచెలు దాటుతూ వేలాది మంది మృత్యుపాలయ్యారు. ఇలా సముద్రం దాటుతూ మృత్యు తీరాన్ని చేరిన అలెన్ కుర్దీ అనే చిన్నపిల్లాడి ఫొటో రెండేళ్ల కిందట ప్రపంచాన్ని కన్నీరు పెట్టించింది. ఒక అంచనా ప్రకారం సిరియా అంతర్యుద్ధం కారణంగా ఇప్పటి వరకు వలస వెళ్లిన వారి సంఖ్య దాదాపు 15కోట్లు. మెక్సికన్ల వలస అమెరికాకు ఆనుకొని ఉండే మెక్సికో నుంచి అగ్రరాజ్యానికి 20వ శతాబ్దం ప్రారంభం నుంచే వలసలు మొదలయ్యాయి. స్వదేశంలో రాజకీయ అస్థిరత, సరైన ఉపాధి, మెరుగైన అవకాశాలు లేక లక్షలాది మెక్సికన్లు అమెరికా బాట పట్టారు. ఇప్పటికీ ఇలా వెళుతూనే ఉన్నారు. వీరిని అడ్డుకోవడానికి అగ్రరాజ్యం చేయని ప్రయత్నమంటూ లేదు. మెక్సికో సరిహద్దులో దాదాపు సగం మేర గోడను నిర్మించినా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు రెండున్నర కోట్ల మెక్సికన్లు అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపణ. భారతదేశ విభజన.. ఇది భారతదేశ చరిత్రలోని అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటి. రెండు శతాబ్దాలకు పైగా దేశాన్ని ఏలిన ఆంగ్లేయులు.. స్వాతంత్య్రం ఇచ్చి వెళుతూ మతం ఆధారంగా దేశం రెండు ముక్కలయ్యేందుకు కారణమయ్యారు. దీంతో దేశానికి తూర్పు, పడమర(ఇప్పటి బంగ్లాదేశ్)లో ఏర్పడిన పాకిస్థాన్‌కు ముస్లింలు, అక్కడి నుంచి హిందువులు, సిక్కులు, బౌద్ధులు తదితర మతాల వాళ్లు భారత్‌కు మారాల్సి వచ్చింది. ఈ క్రమంలో సుమారు 15 కోట్లు మంది వలస వెళ్లగా, వలసల కారణంగా చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 10లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్ ఏర్పాటు.. ఒట్టోమన్ సామ్రాజ్యంలో తిరుగుబాటు చేసిన యూదులకు ఇచ్చిన మాట ప్రకారం బ్రిటన్, అమెరికా కలసి ఐక్యరాజ్యసమితి సహకారంతో ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటుచేశాయి. పాలస్తీనాకు సమీపంలోని కొంతభాగాన్ని యూదులకు ప్రత్యేక దేశంగా గుర్తించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదుల్లో చాలా మంది తమ ఆస్తులు సైతం వదులుకొని ఇజ్రాయెల్‌కు వచ్చి స్థిరపడ్డారు. ‘అలియా’ పేరుతో సాగిన ఈ వలసల్లో ఇప్పటివరకూ దాదాపు 40లక్షల మంది యూదులు ఇజ్రాయెల్‌కు వచ్చినట్లు అంచనా. బానిసలుగా నల్లజాతీయుల తరలింపు.. చరిత్రలో అత్యంత అమానవీయకర తరలింపు ఇది. అంగోలా, కాంగో, కామెరూన్, నైజీరియా, తదితర పశ్చిమాఫ్రికా దేశాల నుంచి లక్షలాది నల్లజాతీయుల్ని బానిసలుగా కొనుక్కున్న బ్రిటన్, ఫ్రెంచ్, డచ్, అమెరికన్లు.. వారిని ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలకు తరలించారు. అక్కడి తోటలు, కర్మాగారాలు, ఇళ్లలో వెట్టిచాకిరీ చేయించుకున్నారు. 15వ–19వ శతాబ్దాల మధ్యలో ఇలా బానిసలుగా మార్చి తీసుకుపోయే వ్యాపారం జోరుగా సాగింది. ఆ తర్వాత కాలక్రమంలో ఇదే అమెరికాలో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమాలకు కారణమైంది. మరికొన్ని ముఖ్యమైన వలసలు 1. చైనాలో 1948లో ఏర్పడిన మావో జెడాంగ్ కమ్యూనిస్టు ప్రభుత్వం తమ వ్యతిరేకులందరినీ తైవాన్ పారియేలా చేసింది. దీంతో దాదాపు 20లక్షల మంది వలస వెళ్లారు. 2. అమెరికాతో యుద్ధం సమయంలో 15లక్షల మంది వియత్నాం వాసులు వివిధ దేశాలకు వలస వెళ్లారు. 3. రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీకి సహాయం చేశారని ఆరోపిస్తూ అప్పటి సోవియట్ యూనియన్ ప్రభుత్వం 1944లో తమ దేశంలోని సుమారు 7 లక్షల మంది చెచెన్యా ప్రాంత వాసులను బలవంతంగా వలస వెళ్లేలా చేసింది. 4. 1979లో ఆఫ్గనిస్థాన్‌పై రష్యా దాడి చేయడంతో సుమారు 30లక్షల మంది ఆఫ్గన్లు ఇరాన్, పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. 5. బ్రిటన్‌లో నివసించే పురిటన్లు(క్రైస్తవుల్లో ఒక వర్గం) 1620–1640 మధ్య అప్పటి బ్రిటిష్ రాజులు కింగ్ జేమ్స్–1, కింగ్ చార్లెస్–1 హయాంలో అమెరికాకు వలస వెళ్లారు. తమపై దాడి భయమే దీనికి కారణం. -
అమెరికా ఆశ్రయం కోరిన 7000 మంది భారతీయులు
సాక్షి, న్యూఢిల్లీ : గత ఏడాది 7000 మందికి పైగా భారతీయులు అమెరికాలో ఆశ్రయం కోరారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. 2017లో అమెరికాను ఆశ్రయం కోరిన వారి సంఖ్య అత్యధికంగా ఉందని ఏజెన్సీ పేర్కొంది. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.8 కోట్ల మంది వలసబాట పట్టారని ఐరాస శరణార్ధుల ఏజెన్సీ తన వార్షిక నివేదికలో తెలిపింది. వీరిలో 1.6 కోట్ల మంది కేవలం గత ఏడాదిలోనే వలసలకు లోనయ్యారని పేర్కొంది. రోజుకు 44,500 మంది ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళుతున్నారని, ప్రతి రెండు సెకన్లకూ ఓ వ్యక్తి వేరే ప్రాంతానికి వెళుతున్నారని నివేదిక వెల్లడించింది. యుద్ధాలు, హింస, ప్రాసిక్యూషన్ల కారణంగా వరుసగా ఐదో ఏడాది 2017లో అత్యధికంగా వలసలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. కాంగో సంక్షోభం, సూడాన్ యుద్ధం, రోహింగ్యా శరణార్ధుల వ్యవహారంతో వలసలు పెరిగాయని విశ్లేషించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచే వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. -
కరువు కరాళ నృత్యం
గుడ్లూరు:గుడ్లూరు మండలంలో కరువు కరాళ నత్యం చేస్తోంది. వందలాది మంది కూలీలకు పనులు కల్పిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న అన్నదాతలు ఐదేళ్ల నుంచి కరువు ధాటికి విలవిల్లాడుతున్నారు. పంటలు పండక పోవడంతో వారే కూలీలుగా మారి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. వలస పోయిన రైతులు ఒక్కొక్కరికి 5 నుంచి 10 ఎకరాల భూములు ఉన్నాయి. ఉన్న ఊరిని, నమ్ముకున్న భూమిని వదిలేసి ముఠా కూలీలుగా, హోటళ్లలో సర్వర్లుగా మారారు. కూల్‌డ్రింక్‌లు విక్రయిస్తూ భారంగా జీవనం గడుపుతున్నారు. సోమశిల కాలువ పూర్తి చేసి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు అందించి ఉంటే భూములు బీడుగా మారేవి కావు. రైతులు ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సిన అవసరం ఉండేది కాదు. వలసవెళ్లిన వందలాది రైతు కుటుంబాలు రాళ్లపాడు ప్రాజెక్టు కుడికాలువ కింద గుడ్లూరు మండలంలోని పూరేటిపల్లి, దారకానిపాడు, చెంచిరెడ్డిపాలెం, వెంకంపేట, బసిరెడ్డిపాలెం, రాళ్లపాడు, గుండ్లపాలెం, గుడ్లూరు గ్రామాల్లో 6 వేల ఎకరాల భూమి సాగయ్యేది. వరి, పత్తి పంటలను ఇక్కడి రైతులు పండిస్తారు. ఐదేళ్ల నుంచి సక్రమంగా వర్షాలు కురవకపోవడం వలన ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరకపోవడంతో పంటలు పండటం లేదు. రాళ్లపాడుకు పూర్తి స్థాయిలో నీరందించేందుకు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలుపెట్టిన సోమశిల కాలువ పనును ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఈ ఏడాది కూడా పంటలు పండకపోవడం వల్ల దారకానిపాడులో 100 కుటుంబాలు, బసిరెడ్డిపాలెంలో 120 కుటుంబాలు, వెంకంపేట, రాళ్లపాడు గ్రామాల నుంచి 70 కుటుంబాల చొప్పున రైతులు పొలాలను వదిలి బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్, విజయవాడ, ఒడిశా, నెల్లూరు, బెంగళూరు పట్టణాలకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నారు. కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం గుడ్లూరు మండలంలో ఉన్న 28 మేజర్, మైనర్ చెరువులు కింద 5 వేల ఎకరాల్లో పంటలు పండేవి. చెరువులకు కూడా చుక్క నీరు చేరకపోవడం వల్ల చెరువుల కింద ఉన్న మాగాణి భూములు కూడా బీడుగా మారాయి. పాజర్ల, స్వర్ణాజీపురం, అడవిరాజుపాలెం, చినలాటరపి, అమ్మవారిపాలెం గ్రామాల నుంచి వందల మంది ఇతర ప్రాంతాల్లో కూల్‌డ్రింక్ షాపులు ఏర్పాటు చేసుకున్నారు. మండలంలో కరువు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సోమశిల కాలువ పూర్తి అయ్యే వరకు తమ బతుకులు ఇలాగే ఉంటాయని రైతులు మనోవేదనతో చెబుతున్నారు. ఇప్పటికే ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతుండటం వల్ల గ్రామాలు నిర్మానుష్యంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ నెలాఖరుకు అన్ని గ్రామాల నుంచి పనులు కోసం వేలాది మంది వలస బాట పట్టే అవకాశం ఉంది. కొంత మంది మహిళా కూలీలు పనుల కోసం జరుగుమల్లి, టంగుటూరు, పొన్నలూరు, కొండాపురం, కందుకూరు మండలాలకు శనగ కోతలకు వెళ్తున్నారు. మండలంలో గత నాలుగు సంవత్సరాల నుంచి 4,476 హెక్టార్లలో పంటలు పండాల్సి ఉండగా కేవలం 729 హెక్టార్లలో మాత్రమే పంటలు పండుతున్నాయి. ఈ గణాంకాలే మండలంలో కరువు ఎలా తాండవం చేస్తుందో అర్థం అవుతుంది. ముఠా కూలీలుగా బతుకుతున్నారు మాకు నాలుగెకరాల పొలం ఉంది. పంటలు పండకపోవడంతో నా కొడుకు, కోడలు విజయవాడకు వలసపోయారు. ముఠా కూలీలుగా పని చేసుకుని బతుకుతున్నారు. నలుగురుకి అన్నం పెట్టిన మేము ఈ రోజు అదే అన్నం కోసం వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామంలో 120కి పైగా కుటుంబాలు పనుల కోసం వలసపోయాయి. కొంత మంది ఇళ్లకు తాళాలు వేసుకుని పోయారు. కొందరేమో వృద్ధులను ఇళ్ల వద్ద వదిలిపోయారు. – ఈశ్వరమ్మ, బసిరెడ్డిపాలెం కూల్‌డ్రింక్ షాపు పెట్టుకున్నాం రాళ్లపాడు ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో దారకానిపాడులో వంద కుటుంబాలు పనుల కోసం దూర ప్రాంతాలకు వలసపోయారు. కొంతమంది కూల్ డ్రింక్ దుకాణాలు నడుపుకుంటున్నారు. నేను కూడా 4 ఎకరాల భూమిని వదిలి వరంగల్‌లో జ్యూస్ దుకాణం నడుపుకుంటున్నా. అదే సోమశిల కాలువ పూర్తి చేసి ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కావు. ఇప్పటికైనా కాలువ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – హరిబాబు, దారకానిపాడు -
కిల.. కిల.. కిల
ఏటా పక్షులు ఓ చోటు నుంచి మరో చోటుకు వలస వెళ్తుంటాయి. అది వాటికి అవసరం.. ఆవశ్యకం. మనకు మాత్రం ఆహ్లాదం. అవి అలా గుంపులు గుంపులుగా ఆకాశంలో వెళుతూ సందడి చేస్తుంటే మనసుకు అదో ప్రశాంతత. అయితే అక్కడితోనే ఆగిపోకుండా ఓ ఫొటోగ్రాఫర్ పక్షుల వలసలో కూడా సృజనాత్మకతను వెలికి తీశాడు. జర్మనీకి చెందిన డేనియల్ బైబర్ వేలాది పక్షులు మరో పక్షి ఆకారంలోకి మారినప్పుడు ఈ అద్భుతమైన ఫొటోలను క్లిక్‌మనిపించాడు. ఈశాన్య స్పెయిన్‌లోని కోస్ట్రాబావాలో నాలుగు రోజుల పాటు కష్టపడి ఈ అద్భుతాలను ప్రపంచానికి అందించాడు. -
వలసలకు అడ్డుకట్ట వేయాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికన్లకు రక్షణ కల్పించేందుకు ఇమిగ్రేషన్ వ్యవస్థలో లోపాలను సరి చేయాలని, గొలుసుకట్టు వలసదారులకు అడ్డుకట్ట వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌ను కోరారు. సోమవారం ఐఎస్ఐఎస్ ప్రేరణతో ఓ బంగ్లాదేశ్ జాతీయుడు న్యూయార్క్ నగరంలోని ఓ రద్దీ మెట్రో స్టేషన్లో పేలుడుకు పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అనుమానితుడైన అకాయద్ ఉల్లాహ్(27) తన శరీరానికి పైప్ బాంబ్‌ను ఉంచుకుని, రెండు సబ్వే ప్లాట్‌ఫామ్స్ వద్ద దీనిని పేల్చాడు. ఈ ఘటనలో అనుమానితునితో పాటు నలుగురు గాయపడ్డారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ‘గత రెండు నెలల వ్యవధిలో న్యూయార్క్‌లో జరిగిన రెండో ఉగ్ర దాడి ఇది. అందువల్ల అమెరికన్ల రక్షణను దృష్టిలో ఉంచుకుని చట్ట సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు. అనుమానితుడు ఉల్లాహ్ ఏడేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి ఫ్యామిలీ వీసాపై అమెరికా వచ్చాడు. ముందుగా ఇమిగ్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించాల్సి ఉందని, ప్రమాదకరమైన, అర్హతలేని వారు దేశంలోకి ప్రవేశిస్తున్నారని ట్రంప్ చెప్పారు. -
మకుటంలేని మహారాజు
ముహమ్మద్ ప్రవక్త (స), ఆయన అనుచరులు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిన దగ్గరి నుండి మక్కా ఖురైషీలు ఆగ్రహంతో రగిలిపోయేవారు. చివరికి భావికార్యాచరణ గురించి సమాలోచనలు జరిపి మదీనాపై దాడికి పథకం రచించారు. మక్కాలో శతృవుల పోరుపడలేక ప్రవక్త, ఆయన అనుచరులు మదీనాకు వలస వస్తే, ఇక్కడ కూడా కొంతమంది విశ్వాసుల రూపంలో కపటులు పోగయ్యారు. అబ్దుల్లాబిన్ ఉబై వీరికి నాయకుడు. అయినా ప్రవక్త మహనీయులు ఈ దుష్టుల కుటిల పన్నాగాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. రోజురోజుకూ ఆగడాలు మితిమీరిన క్రమంలో జరిగిన కొన్ని పరిణామాల నేప«థ్యంలో ఆత్మరక్షణకోసం శతృవుతో తలపడడం అనివార్యమంది. ‘బద్ర్’ పేరుతో ప్రసిద్ధిగాంచిన ఈ సమరంలో విజయం విశ్వాసులనే వరించినప్పటికీ, ముహమ్మద్ ప్రవక్త (స) జీవితం నిరంతరం సంఘర్షణలతోనే గడిచిపోయింది. సత్యాసత్యాల పోరులో ఎన్నో త్యాగాలు చేయవలసివచ్చింది. దుష్టశక్తులతో పోరాటాలు సలుపవలసి వచ్చింది. తరువాతి పరిణామ క్రమంలో ఉహద్, కందక పోరాటాలు కూడా సంభవించాయి. ఒప్పందాలూ, ఒడంబడికలూ జరిగాయి. ఎట్టి పరిస్థితిలోనూ పోరుకంటే సంధికే అధిక ప్రాధాన్యతనిచ్చేవారు ప్రవక్త మహనీయులు. విలువల పునాదులపైనే చివరికి మక్కాను కూడా జయించారు. విజేతగా మక్కాలో అడుగు పెట్టిన ప్రవక్త మహనీయులు ఒక ప్రకటన చేశారు. కాబా గృహంలో రక్షణ పొందినవారిని మన్నించడం జరుగుతుంది. తమతమ ఇళ్ళలోనే ద్వారాలు మూసుకొని ఉన్నవారికి రక్షణ ఉంటుంది. అబూసుఫ్యాన్ ఇంట రక్షణ పొందిన వారికీ మన్నింపు ఉంటుంది. జన్మభూమిని వదిలి ఒంటరిగా, అవమానభారంతో మదీనాకు వలసవెళ్ళడానికి కారణమైన, చంపడానికి పథకాలు రచించిన శతృవులను సైతం కారుణ్యమూర్తి కనికరించారు. వారిపై ఎలాంటి పగ, ప్రతీకారమూ లేకుండా మనసారా మన్నించారు. ఈ విజయం సందర్భంగా ఆయన ఒక చారిత్రక ప్రసంగం చేశారు. దేవుని ఏకత్వాన్ని, ఆయన గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడారు. పగలు ప్రతీకారాలు, హత్యలు ప్రతిహత్యలను అంతం చేస్తున్నట్లు ప్రకటించారు. సమాజంలో మానవ హక్కుల్ని, మానవ సమానత్వాన్ని విశదీకరించారు. ఉచ్చనీచాల నిమ్నోన్నతాభేదభావాల్ని అంతమొందించారు. వడ్డీ వ్యవస్థను, జూదం, మద్యం లాంటి దురలవాట్లను నిషేధించారు. స్త్రీ పురుష హక్కుల్ని నిర్వచించారు. మానవులంతా ఒకే రాశికి చెందినవారని, ఎవరికీ ఎవరిపై ఎలాంటì æఆధిక్యమూ లేదని విడమరచి చెప్పారు. మూగజీవాల పట్ల బాధ్యతను ప్రోదిచేశారు. దైవాన్ని నమ్ముకున్నవాడు, సత్యధర్మంపై స్థిరంగా ఉన్నవాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడని భరోసా ఇచ్చారు. ఆయన ఏనాడూ మానవీయ విలువలను, ఆదర్శాలను విడనాడలేదు. రణరంగానికి సైతం మానవత్వం నేర్పి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రేమ, దయ, జాలి, కరుణ, సహనం, త్యాగం, పరోపకారం, న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఆ మహనీయుని సుగుణాలలో కొన్ని. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అడిగిన వారందరికీ పనులు కల్పిస్తాం
– వేసవిలో ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు – పనుల కోసం 0866–2432064 ఫోన్ చేయవచ్చు.. – డ్వామా పీడీ పుల్లా రెడ్డి వెల్లడి కర్నూలు (అగ్రికల్చర్) : వలసలను నివారించేందుకు అడిగి ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పుల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వలసలు వెళ్లే గ్రామాన్ని సందర్శించి అందుకు గల కారణాలను తెలుసుకొని పనులు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని 36 కరువు మండలాల్లో ఇప్పటికే 100 రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు అదనంగా 50 రోజులు పనిదినాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ప్రత్యేక వేసవి అలవెన్సులు ఇస్తున్నామని, ఉపాధి పనులు సంబంధిత గ్రామానికి 5కి.మీల దూరంలోనే పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ఐదు కిలో మీటర్లు దాటి పనులు కల్పిస్తే 10 శాతం రవాణా భత్యాన్ని అందజేస్తామని తెలిపారు. పనులు కావాలనుకునే వారు 0866–2432064కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. -
కరువు.. దరువు
కనికరం లేని సర్కారు – కరువు మండలాల్లో చర్యలు శూన్యం – పనుల్లేక వలస పోతున్న గ్రామీణ ప్రజలు – మేత లేక కబేళాలకు తరలుతున్న పశువులు – సాంకేతిక కారణాలతో రైతులకు అందని ఇన్పుట్ సబ్సిడీ – తాగునీటికి అల్లాడుతున్న పల్లెలు – నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం హాలహర్వి మండలంలోని చాకిబండ గ్రామంలో శిరుగాపురం పంప్‌హౌస్ నుంచి రోజు విడిచి రోజు నీరు సరఫరా కావాల్సి ఉండగా.. పది నుంచి 20 రోజులకోసారి సరఫరా జరుగుతోంది. స్థానికంగా ఒక్కో బిందె నీరు రూ.20లకు విక్రయిస్తుండటంతో గ్రామస్తులు గొంతెండుతోంది. విధిలేని పరిస్థితుల్లో నాలుగు కిలోమీటర్ల దూరంలోని బేవినహాలు వక్రేణి నుంచి ట్రాక్టర్, ఎద్దుల బండిపై అతి కష్టంపై నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 36 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించినా.. చేపట్టిన చర్యలు నామమాత్రమే. మేత లేక పశువులను కబేళాలకు తరలిస్తుండగా.. సామాన్య, మధ్య తరగతి రైతులు పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. అనేక మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇప్పటికే దాదాపు 140 గ్రామాల్లోని ప్రజలు చుక్కనీటి కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ప్రస్తుత వేసవిలో ఈ గ్రామాలకు ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీటిని అందించేందుకు రూ.10.62 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే గత ఏడాదికి సంబంధించిన నిధులే ఇప్పటికీ అందని పరిస్థితుల్లో ఈ వేసవిలో చేపట్టే కార్యక్రమాలకు నిధులు విడుదల అవుతాయా? లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరుకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో చేపట్టిన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ కనీసం 20 శాతం పనులు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. అలాగే ఫిబ్రవరి నెల నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేస్తున్న పనులకు కూడా కూలీలకు వేతనాలు అందని పరిస్థితి. దాదాపు రూ.10కోట్ల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉండటం.. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉపాధి పనులకు వెళ్లేందుకు కూలీలు జంకుతున్నారు. కరువు మండలాల్లో చర్యలు శూన్యం జిల్లాలోని 36 కరువు మండలాల్లో పశువులకు మేత, నీరు, నీటి తొట్ల నిర్మాణాలు, ఇతరత్రా పనులు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం రూ.16.20 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం కేవలం రూ.6 కోట్లను మాత్రమే విడుదల చేసింది. ఈ అరకొర నిధులతో పలు ప్రాంతాల్లో గడ్డి విత్తనాలు, పశుగ్రాసం, మొలకగడ్డి పెంచుకునేందుకు చర్యలు చేపట్టారు. మెజారిటీ గ్రామాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆయా గ్రామాల్లోని రైతులు పశువులను కబేళాలకు తరలించి వలసలు వెళ్తున్నారు. రైతులకు అందని ఇన్పుట్ సబ్సిడీ 2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 40 మండలాలకు చెందిన రైతులకు రూ.275 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదలైనా, పలు సాంకేతిక కారణాలతో 20 శాతం మినహా మిగిలిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందని పరిస్థితి నెలకొంది. అలాగే 2014 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా జిల్లాలోని పత్తికొండ, దేవనకొండ, మద్దికెర, తుగ్గలి, ఆలూరు మండలాల్లోని రైతులకు రూ.77 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందాల్సి ఉంది. తాగునీటికి కటకట వేసవి ప్రారంభంలోనే జిల్లాలో తాగునీటికి సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే దాదాపు 140 గ్రామాలు తీవ్ర దాహార్తిని ఎదుర్కొంటున్నాయి. మున్సిపల్ ప్రాంతాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో సైతం వారానికి ఒకటి లేక రెండు సార్లు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది 100 మజరా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, 40 మజరా గ్రామాలకు హైరింగ్ ద్వారా నీటిని అందించాలని, 846 బోర్లలో ఫ్లషింగ్, 1151 బోర్లలో డీపెనింగ్ చేయాలని.. ఇందుకు రూ.10.62 కోట్లు అవసరమవుతాయని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.2.78 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. చతికిల పడిన ఎన్టీఆర్ గృహ నిర్మాణం జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం చతికిల పడింది. ఈ నెలాఖరు నాటికి జిల్లాకు మంజూరైన గృహాలన్నీ పూర్తి చేయాలనే లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. జిల్లాకు జీఓలు 103, 114 ప్రకారం 14,850 గృహాలు కేటాయించగా.. 13,534 గృహాలు మంజూరయ్యాయి. అయితే క్షేత్ర స్థాయి సిబ్బంది లేకపోవడం, గృహ నిర్మాణ లబ్ధిదారుల వాటా ఉన్న కారణంగా గృహ నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి. అలాగే జీఓ నెంబర్ 104 ప్రకారం 4,246 గృహాలు కేటాయించగా.. 3,437 మందిని అర్హులుగా తేల్చారు. అయితే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ వివిధ కారణాల వల్ల ఈ పథకం పనులు చురుగ్గా సాగడం లేదు. -
వలస బాటలో మృత్యుఒడి
ఆదోని రూరల్: సంతెకొడ్లూరు గ్రామానికి చెందిన ఓ బాలుడు వలస బాటలో మృత్యుఒడి చేరాడు. గ్రామానికి చెందిన వెంకప్ప, లక్ష్మి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తెకు వివాహమైంది. గ్రామంలో ఉపాధి పనులు లేక గుంటూరు మిరప కోతకు వలస వెళ్లారు. ఇటీవలె తమ గ్రామంలో హోలీ వేడుకల సందర్భంగా గ్రామానికి వచ్చి నాలుగు రోజుల క్రితం తిరిగి వెళ్లారు. ఇద్దరు కుమారులను కూడా వెంట తీసుకెళ్లారు. ఆదివారం మిరపతోటలో పని చేస్తుండగా పెద్ద కుమారుడు వెంకటేష్ (14)పాము కాటుకు గురై మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియలు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
.. మీ రాక సంతోషం సుమండి..!
-
కడమకుంట్లలో విషాదం
కడమకుంట్ల(తుగ్గలి) : బతుకుదెరువు కోసం గుంటూరుకు వెళ్లి పాముకాటుకు గురై మృతి చెందిన రుఖియా(21) మృతదేహం బధవారం ఉదయం స్వగ్రామం కడమకుంట్లకు చేరుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామస్తులు మృతదేహాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలు వారిని కలచివేశాయి. గ్రామ సర్పంచ్ సునీత, సింగిల్‌విండో డైరెక్టర్ అమరనాథరెడ్డి, మాజీ ఎంపీపీ లింగమ్మ, ఎంపీటీసీ సభ్యుడు రామాంజనేయులు, మాజీ సర్పంచ్‌లు నారాయణ, పక్కీరప్ప రుఖియా మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
పాము కాటుతో వలస కూలీ మృతి
కడమకుంట్ల (తుగ్గలి) : బతుకుదెరువు కోసం వలస వెళ్లిన ఓ మహిళా కూలీ పాముకాటుకు గురై మృతి చెందింది. మృతురాలు బావ ఎస్.బాషా తెలిపిన వివరాల మేరకు.. తుగ్గలి మండలం కడమకుంట్ల గ్రామానికి చెందిన రుఖియా (21) తన భర్త నబీరసూల్, రెండేళ్ల కూతురు పర్వీన్‌తో కలిసి ఈనెల 2వ తేదీన గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో మిరప కాయలు తెంచేందుకు వలస వెళ్లారు. అదే రోజు సాయంత్రం పనిలో నిమగ్నమై ఉండగా రుఖియా పాము కాటుకు గురైంది. గమనించిన తోటి కూలీలు చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. కోమాలో ఉన్న రుఖియా అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం సాయంత్రం మృతి చెందింది. -
ఊరెళ్లిపోతోంది!
ఉపాధి లేక వలసబాట పట్టిన 200 కుటుంబాలు నిర్మానుష్యంగా మారిన మీరాపురం గ్రామం బనగానపల్లె: స్థానికంగా పనులు లేక వసల బాట పడుతున్నారు పల్లెజనం. కరువుకు తోడు గత రెండు సంవత్సరాలుగా మైనింగ్ పనులు లేకపోవడంతో మండలంలోని మీరాపురం గ్రామానికి చెందిన సుమారు 200 కుటుంబాలు పిల్లాపాపలతో శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లాకు బయలుదేరారు. గ్రామం పుట్టినప్పటి చూస్తే అన్ని కుటుంబాలు ఒకేసారి వలస వెళ్లడం మొదటిసారి కావడంతో ఊరు నిర్మానుష్యంగా మారింది. ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో గ్రామం ఖాళీ అయినట్టు కనిపించింది. మైనింగ్ కార్మికులు, వ్యవసాయకూలీలు, రైతులు మూల్లెమూట తలపై పెట్టుకుని వెళ్లేటప్పుడు పలువురి హృదయాలను కలచివేసింది. ప్రభుత్వం స్థానికంగా ఉపాధి కల్పించకపోవడమే వలసకు కారణమని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఉపాధికి నాడు పుట్టినిళ్లు: గ్రామ సమీపంలోని 150 ఎకరాల మైనింగ్ ప్రాంతం స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉపా«ధి కల్పించేది. సుమారు 1000–1500 కూలీలకు ఇక్కడ రోజు ఉపాధి పనులు లభించేవి. రెండు సంవత్సరాల క్రితం ఎద్దుల బిలుకు మైనింగ్ ప్రాంతాన్ని స్థానిక సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం లీజుకు తీసుకొని చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. దీంతో నాటి నుంచి కార్మికులకు ఉపాధి కరువైంది. ఇక్కడే ఉపాధి పనులు కల్పించాలని మైనింగ్ కార్మికులు గత రెండు సంవత్సరాలుగా ఆందోళనలు చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ సమీపంలోని అటవీ శాఖకు చెందిన భూమిలో మైనింగ్ పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే, అటవీశాఖ భూమిలో మైనింగ్ పనులు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆశాఖ అధికారుల అడ్డుకోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తర్వాత వారి గోడు ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు వలసబాట పట్టారు. -
'కాకతీయ’తో వలసలు వెనక్కు!
మంత్రి హరీశ్‌కు అధికారుల వివరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువులన్నీ కళకళలాడుతుండటంతో గ్రామాల నుంచి వలస వెళ్లిన రైతు కూలీలు, వివిధ వృత్తుల వారు తిరిగి గ్రామాలకు వస్తున్నారని నీటి పారుదల శాఖ అధికారులు మంత్రి హరీశ్ రావుకు వివరించారు. సోమవారం మిషన్ కాకతీయ 1, 2, 3వ విడత పనుల పురో గతిని సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరీశ్ సమీక్షించారు. ఈ సంద ర్భంగా జిల్లాల అధికారుల నుంచి పనుల తీరుపై ప్రజా స్పందనను అడిగి తెలుసు కున్నారు. కొన్ని చెరువుల్లో వేసిన చేప పిల్లలు ఇప్పటికే 500 గ్రాములకు పైగా పెరిగాయని పేర్కొన్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన హరీశ్.. నీరు అత్యంత విలువైన సహజ సంపదగా రైతుల్లో అవగాహన తీసుకు రావాలని సూచించారు. మూడో విడత పనులపై అసంతృప్తి.. మిషన్ కాకతీయ మూడో విడతలో చేపట్టే పనుల కోసం ఇప్పటివరకు 20 శాతం కూడా ప్రతిపాదనలు పంపకపోవడంపై హరీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 10 లోపు ప్రతిపాదనలు పంపించిన జిల్లాల ఇరిగేషన్ అధికారులకు చార్జ్ మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. పనిచేసిన కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులలో జాప్యాన్ని సహించబోనన్నారు. బిల్లుల చెల్లింపులపై ఫిర్యాదులు వస్తున్నా యని.. ఇంజనీర్లు తమ ధోరణి మార్చుకోవా లని హెచ్చరించారు. పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, ఆ పనులను ఇతర కాంట్రాక్టర్లతో పూర్తి చేయాలని ఆదేశించారు. -
పల్లె పొమ్మంటోంది..!
– పట్టించుకోని ప్రభుత్వం కోసిగి : పుట్టిన ఊరులో బతుకు భారమైంది. పొట్టకూటి కోసం పల్లెలను వదిలి ప్రజలు.. పట్టణాలకు వలస వెళ్తున్నారు. బడులు మాన్పించి చిన్నారులను సైతం తమ వెంట తీసుకెళ్తున్నారు. బుధవారం కోసిగిలోని 3, 4వ వార్డు ప్రజలు.. చింతకుంట, కామన్‌దొడ్డి, కౌతాళం మండలంలోని తిప్పలదొడ్డి గ్రామల వాసులు.. వందలాది మంది రైళ్లలోనూ, లారీలలో గుంటూరు పట్టణానికి తరలి వెళ్లిపోయారు. కోసిగి మండలంలోని 26 గ్రామాల్లో 69,500 జనాభా ఉంది. ఇందులో 90 శాతం మంది ప్రజలు వ్యసాయంపై జీవనం సాగిస్తున్నారు. మూడేళ్లుగా వానలు పడక..పంటలు ఎండి పోయి రైతులకు అప్పులు మిగిలాయి. భూగర్భజలాలు సైతం అడుగంటిపోయాయి. వ్యవసాయం కలసి రాకపోవడం..పల్లెల్లో పనులు లేకపోవడంతో ఇళ్లకు తాళాలు వేసి పిల్లాపాపలతో మూటాముల్లె సర్దుకుని వలస బాట పడుతున్నారు. ప్రతి రోజూ వందలాది మంది వలసలు వెళ్తుండడంతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కరువు కనిపించలేదా? కరువు విలయ తాండవం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం, కోసిగి మండలాలను కరువుప్రాంతాలుగా ప్రకటించలేదు. పంట నష్ట పరిహారం అందక..అప్పులు తీరే మార్గం కానరాక రైతులు..పొట్ట చేతపట్టకొని ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. గిట్టుబాటు కానీ ‘ఉపాధి’ ప్రభుత్వం కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు గిట్టుబాటు కావడం లేదు. రెండున్నర నెలలుగా.. చేసిన పనులకు కూలి ఇవ్వలేదు. దీంతో ఉపాధి పనులు ఎందుకు ఉపయోగపడడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వలస నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. అప్పుల భారంతో వలస వెళ్లుతున్నాం : నరసప్ప, రైతు నాకు 3.50 ఎకరాల భూమి ఉంది. మరో 5 ఎకరాలు కౌలు తీసుకుని ఈ ఏడాది ఉల్లి, వేరుశనగ పంటలను వేశాను. వర్షాలు సకాలంలో రాకపోవడంతో పంట పూర్తి ఎండి పోయింది. పెట్టుబడి కూడా రాలేదు. మొత్తం రూ.2లక్షల అప్పు మిగిలింది. అప్పు తీర్చేందుకు కుటుంబంలో ఆరుగురం వలస వెళ్తున్నాం. కుటుంబ పోషణ భారమైంది : గోవిందమ్మ, గ్రామంలో ఎలాంటి పనులు దొరకడం లేదు. కుటుంబ పోషణ భారమైంది. ఇద్దరు చదువుకునే పిల్లలను బడి మానిపించి మా వెంట గుంటూరు తీసుకెళ్లుతున్నాం. ప్రభుత్వం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేదు. బడి మానుకున్నాను : రత్నమ్మ, విద్యార్థిని కోసిగి చాకలిగేరి ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాను. మా ఇంట్లో వాళ్లంతా గుంటూరుకు వెళ్తున్నారు. నేనొక్కదాన్ని ఉండలేక బడిమాని మా అమ్మానాన్న వెంట పనులకు వెళ్లుతున్నాను. -
‘బాతు’ కహాని!
వలస బాతుల దీనగాథ ఇది..చిత్తూరు చిల్లా నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి ఇవి మహానంది మండలం తమ్మడపల్లెకు వచ్చాయి. కోతకోసిన వరిపొలాల్లో వడ్ల గింజలు ఏరుకుతింటున్నాయి. స్థానిక చెరువులో సందడి చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం నంద్యాల–మహానంది రహదారిలో గుంపులు గుంపులుగా తిరుగుతూ కనువిందు చేస్తున్నాయి. ప్రతి రోజూ బాతులకు దాణా ఇచ్చేందుకు వెయ్యి రూపాయల వరకు ఖర్చు వస్తుందని, కరువు కాలంలో అంత ఆర్థిక స్థోమత లేక తాము ఇక్కడికి వచ్చినట్లు పెంపకందారులు తెలిపారు. మూడు నెలల వరకు ఇక్కడే ఉంటామని, ఇందు కోసం తాత్కాలిక గుడారాలను సైతం వేసుకున్నట్లు వీరు చెప్పారు. - మహానంది -
వసల నేతలు తగ్గి మసలుకోవాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆళ్లగడ్డ: కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారు అనిగిమణిగి ఉండాల్సిందేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్టీలో చేరిన నేతలు నాలుగడుగులు వెనక్కి తగ్గి మసలుకోవాలన్నారు. పార్టీ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేయాలి తప్ప భంగం కలిగించేలా వ్యవహరించకూడదన్నారు. పార్టీలో సమస్యలను పరిష్కరించడంతన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఇరిగెల నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చాంద్‌బాషా పాల్గొన్నారు. -
పదవులు పొందిన వారు పార్టీ వ్యయం భరించాలి
- కార్యకర్తల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు - సమావేశంలో వలస నేతలకు అవమానం - వేదికపై సీట్లు లేక అరగంట పాటు నిలబడిన భూమా, అఖిలప్రియ - వేదికపై నుంచి వెళ్లిపోతుండగా అచ్చెన్న జోక్యం కర్నూలు: టీడీపీ తరఫున ఉన్నత పదవులు పొందిన వారు పార్టీ వ్యయాన్ని కూడా భరించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం స్థానిక కోల్స్ కళాశాలలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అధ్యక్షతన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీజీ వెంకటేష్ నయా పైసా ఖర్చు లేకుండా టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారని.. జిల్లా పార్టీ నిర్వహణ వ్యయాన్ని మోయాల్సి ఉంటుందన్నారు. పాత కొత్త కలయికలతో ముందుకు వెళ్దామని, ఆర్థికంగా, కుల పరంగా ఉన్న వారిని పార్టీలో చేర్చుకొని మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం కోసం తుంగభద్ర నదిపై చెక్‌డ్యామ్ నిర్మాణానికి అనుమతించాలని కోరారు. సుంకేసుల బ్యారేజి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు ప్రత్యేకంగా పైపులైను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. నగర జనాభా పెరిగినందున రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మంజూరు చేయాలని, కర్నూలు చుట్టూ రింగురోడ్డు ఏర్పాటుకు అనుమతించి సర్వేకు ఆదేశించాలని సీఎంకు విన్నవించారు. అయితే చంద్రబాబు తన ప్రసంగంలో ఎక్కడా టీజీ, ఎస్వీ విన్నపాలను ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు ప్రసంగించారు. వలస నేతలకు అవమానం తెలుగుదేశం పార్టీలో చేరిన వలస నేతలకు సమావేశంలో అవమానం జరిగింది. నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియకు సీట్లు లేక సుమారు అరగంట పాటు వేదికపై నిలబడాల్సి వచ్చింది. చంద్రబాబు రాకకు ముందే ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలంతా ముందు వరుసలో కూర్చున్నారు. సమావేశం ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ వేదికపైకి చేరుకున్నారు. అప్పటికే ముందు వరుసలో ఉన్న సీట్లు అన్నీ భర్తీ అయ్యాయి. ఎవరూ సీట్లు ఖాళీ చేయకపోవడంతో వెనుక వరుసలో కూర్చోవడానికి ఇష్టం లేక తండ్రి, కూతురు వేదిక దిగి వెళ్లి పోతుండగా, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు కలుగజేసుకొని వెనక్కు పిలుచుకొని వచ్చారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జి బీటీ నాయుడు సీట్లను ఖాళీచేయించి అక్కడ కూర్చోబెట్టారు. పక్కనున్న సీట్లలో మణిగాంధీ, బీటీ నాయుడులను సర్దుబాటు చేశారు. సమావేశం ముగింపు సందర్భంగా టీడీపీ తరఫున శాసన మండలి ఎన్నికల బరిలో ఉన్న బచ్చల పుల్లయ్య, కేజే రెడ్డిలను చంద్రబాబు కార్యకర్తలకు పరిచయం చేసి ఎలాగైనా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు తిప్పేస్వామి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, శిల్పా మోహన్‌రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, లబ్బి వెంకటస్వామి, నియోజకవర్గ ఇన్చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి, శివానందరెడ్డి, కేఈ ప్రతాప్, కేఈ శ్యామ్‌బాబు, తిక్కారెడ్డి, వీరభద్రగౌడ్, ఆకెపోగు ప్రభాకర్, పార్టీ నాయకులు మసాల పద్మజ, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వలసబాటలో మృత్యుఒడి
- వనపర్తి వద్ద ఆటో బోల్తా - పెద్దమర్రివీడుకు చెందిన వ్యక్తి, చిన్నారి మృతి గోనెగండ్ల: పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిన రెండు కుటంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. సొంతూరులో పనులు లేక పిల్లాపాలతో వలస వెళ్తుండగా చోటు చేసుకన్న ప్రమాదంలో ఓ వ్యక్తి, చిన్నారి మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పెద్దమరివీడు గ్రామం నుంచి బుధవారం సాయంత్రం 18 మంది మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి ఆటోలో వలస వెళ్లారు. మార్గమధ్యంలో కొత్తకోట సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన మాదన్న (45), అదే గ్రామానికి చెందిన రమాదేవి, నరసింహుడు దంపతుల కుమార్తె మమత(3) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడంతో అక్కడ పత్తి కోతలు ఉండటంతో కూలీ గిట్టుబాటు అవుతుందని వలస వెళ్తుండగా ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. -
బతుకు భారం.. పండుగకు దూరం
నర్వ: బుక్కెడు బువ్వ కోసం తండ్లాడుతున్న పాలమూరు పల్లె వలసకడుతోంది.. పొట్ట చేతబట్టుకుని కూలి పనుల కోసం వెళ్లేందుకు సిద్ధమవుతోంది.. కన్నవారిని వదిలేసి, పిల్లాపాపలను విడిచేసి, ఉన్న ఊరి నుంచి పట్నాల దారి పడుతోంది.. భారమైన బతుకును ఈడ్చేందుకు 9 నెలల ‘కూలీ’వాసానికి వెళుతోంది.. ఏటా జరిగేతంతే అయినా ఈసారి దసరా పండుగకూ దూరమవుతోంది. కరువు పీడిత మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఏటా వేలాది మంది ఉపాధి కోసం వలస వెళుతుంటారు. ఏటా వర్షాకాలం ముగిశాక దాదాపుగా అక్టోబర్-నవంబర్ మధ్య సమయంలో దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు, ప్రాజెక్టుల ప్రాంతాలకు వలస వెళతారు. అక్కడ రోజు కూలీలుగా పనిచేస్తుంటారు. దేశంలో ఎక్కడ భారీ ప్రాజెక్టులు, పరిశ్రమలు, జాతీయ రహదారులు, భారీ భవనాలు నిర్మిస్తున్నా.. అక్కడ కనిపించేది ‘పాలమూరు లేబరే’. ఇలా సంవత్సరంలో తొమ్మిది నెలల పాటు స్వగ్రామాలకు, తల్లిదండ్రులు, పిల్లలకు దూరంగా బతుకు వెళ్లదీస్తారు. గుంపు మేస్త్రీలు ఈ కూలీలను తీసుకెళ్లి.. పనులు పూర్తయ్యాక తిరిగి తీసుకొస్తారు. వర్షాకాలం ప్రారంభంలో తిరిగి స్వగ్రామాలకు చేరుకునే వారిలో చాలా మంది.. ఉన్న కాసింత భూమిని సాగు చేసుకుని, పైరు కొంత ఎదిగాక తిరిగి వలస బాట పడతారు. ఇప్పుడా కూలీలంతా మరో వలసకు సిద్ధమవుతున్నారు. దసరా ముందు పనులకు తీసుకెళ్లేందుకు గుంపు మేస్త్రీలు వారికి అడ్వాన్సుగా సొమ్ము చెల్లిస్తున్నారు. వేలాది కుటుంబాలు.. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 20వేలకు పైగా కుటుంబాలు వలసల మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. నారాయణపేట, కొడంగల్, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కూలీలు ముంబై, పుణే, షోలాపూర్, నాసిక్, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు అధికంగా వలస వెళ్తుంటారు. అక్కడ మట్టి పనులు, కూలి పనులు చేస్తారు. పాలమూరు జిల్లాలోని వలస ప్రభావిత ప్రాంతాల్లో నర్వ మండలం ప్రధానమైనది. నర్వ మండల పరిధిలో 33 గ్రామాలున్నాయి. ఇక్కడ సాగునీటి సౌకర్యం లేక.. వ్యవసాయ భూములన్నీ బీళ్లు పడిపోయాయి. దీంతో ఆయా గ్రామాల రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం, పిల్లల చదువులు, భవిష్యత్ కోసం వలసల మార్గం పట్టారు. వలస పోతేనే పొట్టనిండేది ‘‘పద్దెనిమిదేళ్ల వయసు నుంచే మట్టిపనుల కోసం వలస వెళ్లాను. ఇప్పటికి నాలుగు సార్లు భార్యాపిల్లలతో కలిసి వలస వెళ్లినా.. చేసిన అప్పులు తీర డం లేదు. ఉన్న పూరిగుడిసె కూడా కూలిపోయేలా ఉండడంతో మేస్త్రీ వద్ద అప్పుచేసి మరమ్మతు చేయించుకున్నాం..’’ - వెంకటేష్, రాంపురం, నర్వ మండలం, మహబూబ్‌నగర్‌జిల్లా అడ్వాన్సులిచ్చి తీసుకెళ్లినా.. గుంపు మేస్త్రీలు తమ పని గుంపుల (బృందాల) కోసం కూలీలను సమీకరిస్తున్నారు. పనుల కోసం వచ్చే ప్రతి జంట (భార్య, భర్త)కు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్సుగా ఇచ్చి, అప్పు పత్రాలు రాయించుకుంటారు. ఇలా సమీకరించిన కూలీలను గుంపులుగా పనులకు తీసుకువెళతారు. దాదాపు తొమ్మిది నెలల పాటు పనులు చేయించుకుని తిరిగి స్వగ్రామాలకు తీసుకువస్తారు. వచ్చాక జంటలకు రావాల్సిన కూలి సొమ్మును లెక్కించి అప్పగిస్తారు. అయితే కూలీలు తొలుత తీసుకున్న అడ్వాన్సు డబ్బులు తీరకపోగా.. ఒక్కో జంటకు ముప్పై, నలభై వేల వరకూ అప్పులే మిగులుతుండడం గమనార్హం. 15 ఏళ్లుగా వలస బతుకే.. ‘‘మా ముగ్గురు పిల్లలను చదివించాలన్న ఉద్దేశంతో వలస వెళుతున్నాం. పిల్లలను మా అత్త, మేనమామల ఊరిలో ఉంచి చదివిస్తున్నాం. 15 ఏళ్లుగా నా భార్య, నేను వలస వెళ్తున్నా బతుకులు మారడం లేదు.. మా బతుకులు ఇలా ఉన్నాయి. పిల్లలనైనా చదివిద్దామన్న ఆశతో వలస వెళుతున్నాం..’’ - సవరన్న, రాంపురం, నర్వ మండలం -
వలసలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
– ఎమ్మెల్సీ గేయానంద్ ఆరోపణ – సీమ ప్రగతికోసం ఐక్య ఉద్యమాలకు పిలుపు కర్నూలు(హాస్పిటల్): విద్యతోపాటు ఇతర అన్ని రంగాల్లో పూర్తి వెనుకబాటుతో ఉన్న జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలు, బెంగళూరు సహా దూర ప్రాంతాలకు వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పైగా కోసిగి నుంచి బెంగళూరుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును తిప్పుతూ వలసలను మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివద్ధి వేదిక ఆధ్వర్యంలో సీమ సమగ్రాభివద్ధి కోసం గత నెల 24న హాలహర్వి మండలం గూళ్యం నుంచి ప్రారంభమైన జీపు జాతా మంగళవారం కర్నూలులో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక సి.క్యాంపు టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ గేయానంద్ మాట్లాడారు. రాయలసీమలో అత్యధిక నీటి వనరులున్న కర్నూలు జిల్లాలో కూడా జనం తాగునీటికి సైతం అల్లాడుతుండడం దురదష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లతోపాటు పాఠశాలలనూ ప్రభుత్వం మూసివేస్తోందని, పిల్లలంతా బడిమానేసి పనికి వెళ్తున్నారన్నారు. కన్నడ, ఉర్దూ మీడియం పిల్లలు పాఠ్యపుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి విద్య కోస ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా 2వేల మంది ఉపాధ్యాయులను నియమించాలన్నారు. నిరుద్యోగులకు రూ.2వేల భతి ఇవ్వాలని కోరారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి, అందులో ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలన్నారు. రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చెన్నయ్య ప్రసంగించారు. ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షులు డాక్టర్ బి. శంకరశర్మ, రాయలసీమ అభివద్ధి వేదిక అనంతపురం జిల్లా కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, వివిధ సంఘాల నాయకులు పెద్దస్వామి, నరసింహ, కవి అజీజ్, మహేశ్వరరావు, బాషా, సునయ కుమార్, రామశేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
పల్లె బాట పడుతున్న చైనా యువకులు
బీజింగ్: ప్రపంచంలో పల్లెలు పట్నాలకు వలసపోతుంటే చైనా యువకులు ఉపాధి అవకాశాల కోసం పల్లెలకు బాట పట్టారు. పల్లెల్లో తాము బతకడంతోపాటు పల్లెవాసులకు తమ బాటలో బతుకుతెరువు చూపిస్తున్నారు. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. వారిలో చెన్ జీన్ అనే 26 ఏళ్ల యువకుడు ఒకరు. పేదరికం ఎక్కువగా ఉన్న నింగ్జియా హుయి రాష్ట్రంలోని ఓ కుగ్రామానికి వెళ్లిన చెన్ అక్కడ స్థానికంగా దొరికే జాతికి చెందిన 200 తేనె టీగలను సేకరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి చెన్ తేనెటీగలను పెంపకాన్ని ప్రారంభించారు. వాటి నుంచి ఆయన ఇప్పటికే రెండు టన్నుల స్వచ్ఛమైన తేనెను సేకరించారు. దాన్ని మార్కెట్‌గా సరఫరా చేయడం ద్వారా 45 వేల డాలర్లు వస్తుందని ఆశిస్తున్నారు. కాలుష్య రహిత గ్రామం అవడం వల్ల, స్థానిక జాతికి చెందిన తేనెటీగలు అవడం వల్ల తన తేనె తియ్యగా, స్వచ్ఛంగా ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు తాను ఓ కంపెనీని, బ్రాండ్‌ను రిజిస్టర్ చేయించాలనుకుంటున్నానని చెప్పారు. ఇప్పుడు గ్రామానికి చెందిన పలువురు యువకులు తాను చూపిన మార్గంలోనే నడుస్తున్నారని చెన్ వివరించారు. తేనెటీగలు పెంచేందుకు పెద్ద పెట్టుబడులు అవసరం లేదని, అయినా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచే ప్రాజెక్టులకు ప్రభుత్వం రుణాలు కూడా ఇస్తోందని చెప్పారు. తాను తేనెతో వైన్ కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నానని చెన్ తెలిపారు. 2020 నాటికి ఐదున్నర కోట్ల మంది గ్రామీణ ప్రజలకు వార్షికాదాయం 430 అమెరికా డాలర్లకు పెంచాలన్నది తన లక్ష్యమని చెన్ తెలిపారు. పల్లెల నుంచి పట్నాలకు ప్రజల వలసలను అరికట్టడమే కాకుండా పల్లెల స్వయం సమృద్ధికి చైనా ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటోంది. పల్లెల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో రైతులు శిక్షణ ఇచ్చేందుకు అధికారులను పల్లెలకు పంపిస్తోంది. కొత్తకొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా గ్రామీణ యువకులకు శిక్షణ ఇచ్చేందుకు యూనివర్శిటీ విద్యార్థుల సేవలను చైనా ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఈ విషయంలో విద్యార్థులకు బీజింగ్ రెన్మిన్ యూనివర్శిటీ ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు వేసవి సెలవుల్లో పల్లెలకు వెళ్లి అక్కడి యువకులకు అవసరమైన రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. కొత్త కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు మెళకువలను నేర్పుతున్నారు. -
ఉపాధి లేక.. గల్ఫ్ బాట!
కరువు దెబ్బకు గల్ఫ్ పయనం ఒట్టి చేతులతో ఇంటిముఖం ఏజెంట్ల మోసం అప్పులు కుప్పలు వీర్నపల్లివాసుల వెతలు ఉన్న ఊళ్లోనే ఉపాధికోసం నిరీక్షణ జిల్లా అంతటా ఇదే పరిస్థితి కరువు ఉరిమింది. ఉన్న ఉళ్లో ఉపాధి కరువైంది. బతుకుదెరువుకు చేసిన అప్పు వడ్డీలతో కలిపి కుప్పయింది. అప్పు తీర్చే మార్గం లేక గల్ఫ్ దేశాలకు వెళితే రాత్రింబవళ్లు పని చేయించుకున్న యాజమాన్యం జీతమడిగే సరికి కొంతమేర విదిల్చింది. ఆ జీతం తిండికే సరిపోని పరిస్థితి. ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడితే... అంతే సంగతులు. ఇట్లయితే అప్పు తీరేదెలా? ఇల్లు గడిచేదెలా? అని బెంగపట్టుకుంది. ఇక లాభం లేదనుకుని యాజమాన్యాన్ని ఎదిరించి స్వదేశానికి తిరిగొస్తుంటే పాస్‌పోర్టు లాక్కుని జైళ్లో వేయించింది. నాలుగు నెలలు జైళ్లో గడిపి ఎలాగోలా ఇంటికి చేరుకుంటే... ఊళ్లో పరిస్థితి మళ్లీ భయపెడుతోంది. ఎటు చూసినా కరువే... ఏ పనీ లేదు. ఇంటిని ఎట్లా నెట్టుకురావాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రధానమంత్రి సంసద్ గ్రామీణ యోజన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లిలో యువకుల దుస్థితి ఇది. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వీర్నపల్లిలో జనాభా 3684 మంది. 99 శాతం ప్రజలు దళిత, గిరిజన, వెనుకబడిన సామాజికవర్గాలవారే. 8 తండాలున్న ఈ పంచాయతీలో 42 శాతం ఎస్టీ, 22 శాతం ఎస్సీ, 35 శాతం బీసీ జనాభా ఉన్నారు. మిగిలిన ఒకే ఒక్క శాతం జనాభాలో ఒక వెలమ, 10 వైశ్య సామాజిక కుటుంబాలు నివసిస్తున్నాయి. పురుష, మహిళా నిష్పత్తిలో మహిళలే అధికంగా ఉన్న పల్లె ఇది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామమిదే. గతంలో పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసుల బూట్ల చప్పుళ్లు, నక్సలైట్ల తూటాల పహారాలో నలిగిన గ్రామమిది. గత పదేళ్లలో పోలీసులు, నక్సల్స్ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పల్లె కావడంతో... వీర్నపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎంపీ వినోద్‌కుమార్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఏడాదిన్నరలో ఈ గ్రామంలో చాలా మార్పులే వచ్చాయి. వయోజన విద్య కార్యక్రమంగా పకడ్బందీగా అమలు చేయడంతో నూరు శాతం అక్షరాస్యత సాధించారు. గ్రామీణ బ్యాంకు ఏర్పాటైంది. ఒకప్పుడు ఇంటింటికీ గుడుంబా తయారు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి చాలా మేరకు మారింది. కానీ, చేయడానికి పనుల్లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బతుకుదెరువుకు వెళ్లి... మోసపోయి ఇల్లు చేరి.. బతుకుదెరువు కోసం ఈ ఊరి నుంచి 1200 మందికిపైగా గల్ఫ్ దేశాలకు వెళ్లారు. లక్షలకు లక్షలు సంపాదించవచ్చన్న ఏజెంట్లు మాటలు నమ్మి చేతిలో డబ్బుల్లేకపోయినా ఇల్లు, పొలం కుదవపెట్టి అప్పు చేసి మరీ వెళ్లినవాళ్లే ఎక్కువ. తీరా అక్కడికి వెళ్లాక పెద్ద జీతం సంగతి దేవుడెరుగు... బతుకే నరకంగా మారడంతో... ఉండలేక ఒట్టి చేతులతో తిరిగొస్తున్నారు. ఇలా 225 మందికిపైగా యువకులు తిరిగి వీర్నపల్లి రావడం గమనార్హం. ‘సార్... రోజూ 8 గంటలు పని. నెలకు లక్ష రూపాయల దాకా సంపాదించవచ్చని ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి అక్కడికి వెళ్తే తెలిసింది... దూరపు కొండలు నునుపు అని’ అంటూ వాపోయాడు వీర్నపల్లికి చెందిన మల్లారపు రవి. ఇదే గ్రామానికి చెందిన రాజంది సైతం ఇదే పరిస్థితి. ‘అప్పు చేసి దుబయ్ పోతే వాళ్లిచ్చే జీతం తిండికే సరిపోలేదు. జ్వరమొస్తే ఆసుపత్రిలో కూడా చూపించలేదు. ఫోర్‌మెన్ ఉద్యోగమని తీసుకెళ్లి అడ్డాకూలీ పని చేయించిండ్రు. రోజుకు 12 గంటలు పనిచేయించుకున్నరు. కోపమొచ్చి వద్దామంటే పాస్‌పోర్టు గుంజుకుని జైల్లో పెట్టించిండ్రు’ అని అని జి.రాములు వాపోయాడు. దుబయ్ వెళ్లిన వాళ్లలో నూటికి 80 శాతం మంది దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారని వారు చెబుతున్నారు. ఆ బాధలు పడలేక తిరిగొచ్చిన వాళ్లు కొందరైతే... ఉన్న ఊరుకొచ్చినా ఉపయోగం లేదనే భావనతో అక్కడే బతుకీడస్తున్న వారు మరికొందరున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీర్నపల్లి నుంచి వెళ్లిన 50 మంది యువకుల్లో ఏడాది తిరగకముందే అందులో 10 మంది తమవల్ల కాదు ఆ బతుకు అంటూ తిరిగొచ్చారు. ఉన్న ఊళ్లోనే శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తే భార్యాపిల్లలతో హాయిగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడే బతుకుతామంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కోరుట్ల, జగిత్యాల, వేములవాడలోనూ ఇదే పరిస్థితి! కరువు దెబ్బకు జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ఊరు విడిచి దుబయ్ వలస వెళ్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సగటున ఊరికి పది మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన వారే. కొందరు యువకులు ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయి రాగా... మరికొందరు ఎంత కష్టమైనా, నష్టమైనా కూలీనాలీ చేసుకుంటూ విదేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ఆయా యువకుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి శిక్షణ ఇస్తే జిల్లాలోనే ఉపాధి పొందుతూ కుటుంబంతో హాయిగా ఉంటామని చెబుతున్నారు. నరకం చూసిన.. సార్.. ఇంట్ల ఎల్లక 2 లక్షలు అప్పు చేసిన. దుబాయ్ పోతే అప్పు తీర్చి డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ ఏజెంట్ చెబితే మరో లక్ష అప్పు చేసి గత జూన్‌లో దుబాయ్ పోయిన. అక్కడి కరెన్సీ ప్రకారం నెలకు రూ.1200 దిర్హమ్స్(రూ.21,600) జీతం ఇస్తామని ఆశపెడితే పోయిన. తీరా ఆడికిపోతే నెలకు 600 దిర్హమ్స్ ఇచ్చిండ్రు. 8 గంటలకు బదులు రోజు 12 గంటల పనిచేయించుకున్నరు. పని ఒత్తిడికి ఆరోగ్యం కరాాబైంది. వచ్చిన డబ్బులు తిండికి, నా మందులకే సరిపోయినయ్. ఆడ ఉన్నన్ని రోజులు నరకం చూసిన. ఎలాగోలా ఇక్కడికి వచ్చి ఉపాధి కూలీకి పోతున్న. అప్పులెట్లా తీర్చుడో అర్థమైతలేదు. మాలోంటోళ్లకు ప్రభుత్వం ఏదైనా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తే సర్కారు రుణం తీర్చుకుంటం. - నర్మెట శంకర్, వీర్నపల్లి మోసపోయిన.. మా ఊరినుంచి దుబాయ్ పోయినోళ్లంతా నానా కష్టాలు పడుతుండ్రు. ఈడ ఏజెంట్లు చెప్పేదొకటి, ఆడ జరిగేదొకటి. ఫోర్‌మెన్ ఉద్యోముంది... నెలకు 2 వేల దిర్హమ్స్ జీతం (రూ.36 వేలు) ఇస్తారని ఏజెంట్లు ఆశపెడితే నిజమేనని నమ్మి లక్ష రూపాయలు అప్పు చేసి దుబాయ్ పోయిన తీరా ఆడికిపోతే లేబర్ కూలీకి పెట్టిండ్రు. అందులో సగం జీతం కూడా సరిగా ఇయ్యలేదు. ఆ జీతం అక్కడ తిండికి కూడా సరిపోలేదు. మోసపోయిన. ఇక లాభం లేదని ఇంటికి పోదామనుకుంటే నా పాస్‌పోర్టు తీసుకుని నన్ను జైల్లో పెట్టించిండ్రు. మూడు నెలలు జైల్లోనే ఉండి ఎట్లాగోలా మా ఊరికొచ్చిన. ఉప్పరి పనిజేసి బతుకీడుస్తున్న. మాలాంటోళ్లకు ఏదన్నా దారి చూపాలె. - జి.రాములు, వీర్నపల్లి -
వలసలను సీరియస్ గా తీసుకోవాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వలసపోవడంపై టీపీసీసీ, సీఎల్పీ సీరియస్‌గా తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారో, వారికి ఎదురవుతున్న ఇబ్బందులేమిటనే అంశాలపై పార్టీ సీనియర్లతో చర్చించాలన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ దృష్టి సారించాలని కోరారు. -
పల్లె పొమ్మంది!
పొట్టచేతబట్టుకొని పట్నం బాట పడుతున్న పల్లెవాసులు ► ఉన్న ఊళ్లో పనులు కరువై వలస వెళ్తున్న జనం ► అడ్డాపై కూలీలుగా రైతుల దైన్యం ► రెండేళ్ల నుంచి వర్షాల్లేక చతికిలపడిన వ్యవసాయం ► జిల్లా కేంద్రాలు, హైదరాబాద్, ముంబై నగరాలకు పెరుగుతున్న వలసలు... అక్కడా పనులు దొరక్క అవస్థలు ► అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు పయనమవుతున్న యువత పది మంది కూలీలతో నాలుగెకరాల సొంత భూమిలో పనులు చేయించు కుంటూ ఊళ్లో గౌరవంగా బతికిన ఓ రైతు ఇప్పుడు తానే కూలీగా మారిపో యాడు! ఆత్మాభిమానాన్ని చంపుకొని అడ్డాపై నిలబడి కూలికోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు!! కాలే కడుపుకు ఇన్నాళ్లూ నాలుగు ముద్దలందించిన ఉపాధి పని కరువవడంతో భార్యాపిల్లల్ని వదిలేసి బతుకు బండిని లాగేందుకు బొంబాయి బస్సెక్కాడు ఓ భర్త!! ఉన్న ఊళ్లో పనిలేక పొట్ట చేతబట్టుకొని ఎడారి దేశానికి పయనమైన చెట్టంత కొడుకును చూస్తూ కళ్లలో నీళ్లు నింపుకున్నారు ఓ ముదుసలి తల్లిదండ్రులు!!! సాక్షి నెట్వర్క్ ...తెలంగాణ పల్లె మళ్లీ వలసబాట పట్టింది. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో పల్లెలు అల్లాడుతున్నాయి. ఉపాధి కరువై పొట్ట చేతబట్టుకొని పట్టణాలు, నగరాలకు జనం వలస వెళ్తున్నారు. అక్కడ కూడా పని దొరకకుంటే పక్క రాష్ట్రాలకు పయనమవుతున్నారు. యువకులు, మధ్య వయసువారు వలసలు వెళ్లడంతో చాలా గ్రామాలు, తండాల్లోమహిళలు, పిల్లలు, వృద్ధులే కనిపిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న వారిలో కొందరు పిల్లల్ని కూడా వెంట తీసుకువెళ్తుండడంతో వారి చదువు మధ్యలోనే ఆగిపోతోంది. వరుసగా రెండేళ్లపాటు వర్షాల్లేక సాగు చతికిల పడడం, కాస్తోకూస్తో పొట్ట నింపుతున్న ఉపాధి పనులు అరకొరగా సాగుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ వలసలు కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి ఎక్కువగా మహారాష్ట్రలోని నగరాలకు వెళ్తున్నారు. పల్లెల నుంచి జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌కు వలస వెళ్తున్నవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ కూడా పనులు అంతంతే దొరకడంతో పస్తులు తప్పడం లేదు. బతుకుదెరువు కోసం పట్నంబాట.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూరు(యు), జైనూరు, కెరిమెరి మండలాల్లో కుటుంబాలకు కుటుంబాలే ముంబై, హైదరాబాద్ నగరాలకు వలస వెళ్తున్నాయి. అక్కడ నిర్మాణ రంగంలో కూలీ పనులకు వెళ్తూ పొట్టబోసుకుంటున్నారు. ఒకప్పుడు రైతులుగా ఇతరులకు పని కల్పించిన వారే ఇప్పుడు కూలీలుగా మారుతున్నారు. జిల్లాలోని బెజ్జూరు. కౌటాల, దహెగాం, కాగజ్‌నగర్ మండలాల ప్రజలు మిరప పంట ఏరేందుకు ఖమ్మం జిల్లాకు వలసలు వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల నుంచి ఎక్కువగా గిరిజనులు ముంబై వెళ్తున్నారు. పరిగి నియోజకవర్గం కుల్కచర్ల నుంచి ముంబైకి ప్రతీరోజు ఏకంగా ఒక బస్సు నడుపుతున్నారంటే పరిస్థితిని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎనిమిది నెలలపాటు వారు ముంబైలోనే కూలీలుగా పనిచేస్తూ.. ఇంటికి కొంత మొత్తాన్ని పంపిస్తున్నారు. కరువు దెబ్బకు పాడి కూడా కుదేలైంది. దుర్భిక్ష పరిస్థితుల కారణంగా రైతులు పశువులను కూడా తెగనమ్ముకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో చాలామంది రైతులు అడ్డాకూలీలుగా మారారు. కూలీ కోసం రోజూ కరీంనగర్ జిల్లా కేంద్రానికి వస్తున్నా.. వారిలో అందరికి పని దొరకడం లేదు. పనిలేని రోజు బస్సు చార్జీలు అదనంగా నెత్తినపడుతున్నాయి. కరీంనగర్ నగరంలో గతంలో కూలీల అడ్డాపై 1,500 మంది ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 2,500కి పెరిగిపోయింది. దీనితో కూలీకి కూడా తీవ్ర పోటీ తప్పడం లేదు. 2,500 మంది కూలీల్లో ఐదారు వందల మంది కూలీ దొరక్క నిరాశతో వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పాలమూరులో 20 వేల కుటుంబాలు.. మహబూబ్‌నగర్ జిల్లాలో కూలీలు వలసబాట పడుతున్నారు. జిల్లాలో దాదాపు 20వేలకు పైగా కుటుంబాలు వలసలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. నారాయణపేట డివిజన్లోని నారాయణపేట, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాల్లోని కూలీలు ముంబై, పూణె, షోలాపూర్, హైదరాబాద్ తదితర నగరాలకు వలసలు వెళ్తున్నారు. ఊళ్లోనే వ్యవసాయం చేసుకుంటున్నవారు కాలం కలిసిరాక అప్పులపాలవుతున్నారు. మెతుకుసీమలో బతుకు కరువు మెతుకుసీమగా పేరొందిన మెదక్ జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, దుబ్బాక, ఆందోల్, సీఎం సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి కూడా పెద్దసంఖ్యలో వలస వెళ్తున్నారు. కరువుతో సాగుకే కాదు తాగునీటికీ కష్టంగా మారింది. అటు గ్రాసం, ఇటు నీళ్లు దొరక్క పశువులు సైతం విలవిల్లాడుతున్నాయి. అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు.. యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు అందిన కాడికి అప్పులు చేస్తూ.. ఏజెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. గ ల్ఫ్లో పని చే యడానికి అవసరమైన వీసాలు లేకుండా కేవలం విజిటింగ్ వీసాపైనే ఏజెంట్లు వారిని అక్కడకు పంపించి చేతులు దులుపుకొంటున్నారు. ఇలాంటి మోసాలు కోకొల్లలుగా బయటపడుతున్నా... అమాయక ప్రజలు వారినే నమ్ముకొని నిండా మునుగుతున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల నుంచి గల్ఫ్‌కు వలసలు పెరిగాయి. ఊళ్లకు ఊళ్లే ఖాళీ.. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో 60 శాతం ఊళ్లు దాదాపు ఖాళీ అయ్యాయి. పోలేపల్లి, దాసర్లపల్లి, ముర్పునూతల, తెల్దేవర్పల్లి, పలుగుతండా వెంకటనాయక్ తండాల్లోని ప్రజలు వలసల బాటపట్టారు. చాలా ఇళ్లకు తాళాలే కనిపిస్తున్నాయి. చందంపేట మండలం నుంచి గుంటూరు జిల్లా గురజాల, కారంపూడి, చిలుకలూరిపేటకు మిర్చి కోసేందుకు వెళ్లారు. మరికొందరు హైదరాబాద్‌లో ఆటో రిక్షా నడుపుకునేందుకు వెళ్లగా.. ఇంకొందరు ఫ్రూట్ మార్కెట్లో హమాలీలుగా పనుల కోసం వెళ్లారు. దేవరకొండ, ఆలేరు, మిర్యాలగూడ, తుంగతుర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో ఎక్కువగా వలసలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, జుక్కల్, మద్నూరు, గాంధారి, తాడ్వాయి మండలాల నుంచి మహారాష్ట్ర, హైదరాబాద్‌లకు రైతులు, కూలీలు వలస వెళ్తున్నారు. మహారాష్ట్రకు వెళ్తున్నవారు అక్కడ భూస్వాముల పొలాల వద్ద పంటల కాపలాదారులుగా పని చేస్తున్నారు. గోసగోస అయితంది.. మాకు రెండెకరాల భూమి ఉంది. నీళ్లు లేక బీడు పడింది. ఊళ్లె కైకిలి(కూలీ) పని కూడా దొరుకుత లేదు. ఉపాధి పని కూడా నడుస్తులేదు. గోసగోస అయితంది. పిలగాండ్ల చదువుకు, తిండికి తిప్పలైతంది. కరీంనగర్‌కు కూలీ పనికి వస్తున్న. నాలాంటోళ్లు చానా మంది వస్తున్నరు. మంది బాగా అయ్యేసరికి ఇక్కడ కూడా పని సరిగా దొరుకుతలేదు. - బానోతు తస్లీ, మల్చేరుతండా, హుస్నాబాద్ మండలం, కరీంనగర్ కూలీగా మారిన రైతు నాకున్న రెండెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు చేసేటోన్ని. మూడేండ్ల నుంచి వానలు లేవు. బావిలో నీళ్లు పడలేదు. నాలుగు గజాల బండ కొట్టిచ్చిన. అయినా చుక్క నీళ్లు రాలే. లక్ష రూపాయలు ఖర్చయింది. పంట పండే పరిస్థితి లేదు. భార్యాపిల్లలను ఊళ్లో వదిలి కరీంనగర్లో కూలీ కోసం వచ్చి ఉంటున్న. నెలకు 20 రోజుల పని కూడా దొరుకుతలేదు. - పింకాసి బాలయ్య, వంతడుపుల, ఇల్లంతకుంట మండలం, కరీంనగర్ కొడుకులు పట్నం పోయిండ్రు ఎవసాయం ఎండి పోయింది. బోర్లు వట్టిపోయాయి. ఊర్లో ఉపాధి లేక నా కొడుకు భార్యాపిల్లల్ని వదిలి పట్నం పోరుుండు. ముసలి తనంలో తోడుగా ఉంటాడనుకుంటే కాలం పగబట్టింది. - కొయ్యడ ఆగయ్య, రామచంద్రాపూర్, బచ్చన్నపేట మండలం, వరంగల్ అప్పు తెగేదెప్పుడు..? ఇంటికి వచ్చేదెప్పుడు? ఈ కూలీ దంపతుల పేరు ఎదునూరి దేవయ్య, కనుకవ్వ. ఊరు కరీంనగర్ జిల్లా ముస్తాబాద్. వీరికి రెండెకరాల భూమి ఉంది. వర్షాల్లేక బావి ఎండిపోయింది. పిల్లలు అనూష, ప్రశాంత్ చదువులు, కుటుంబ పోషణకు రూ.4 లక్షల అప్పు చేయాల్సి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ రెండు నెలలుగా ఉపాధి పనులకు వెళ్తున్నారు. రోజుకు రూ.120 వస్తోంది. ఇది ఏ మూలకు సరిపోవడం లేదు. కుటుంబం గడిచేందుకు మస్కటే శరణ్యమనుకున్నాడు. రూ.70 వేలు అప్పు చేసి ఏజెంట్ చేతిలో పెట్టాడు. అక్కడ ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీ పనికోసం వీసా వచ్చింది. ఈ నెల 13న మస్కట్‌కు వెళ్లేందుకు విమానం ఎక్కబోతున్నాడు. అక్కడ రూ.15 వేలు జీతం వస్తుందని, రూ.5 వేలు తిండికి, ఉండడానికి సరిపోయినా.. నెలకు రూ.10 వేలు పంపిస్తే భార్యాపిల్లలు బతుకుతారని దీనంగా చెబుతున్నాడు. రూ.4 లక్షల అప్పు తీర్చడానికి ఎన్నేళ్లు పడుతుందో.. కాలమే సమాధానం చెప్పాలి! ఉపాధి కూలీకి పైసలేవీ? ఉపాధి హామీ పనులు ఆశించిన మేరకు సాగడం లేదు. రెండునెలలుగా పనిచేసినా కూలీలకు వేతనాలు అందడం లేదు. దీంతో చాలామంది కూలీలు పనికి వెళ్లడం మానేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకానికి రూ.500 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర సర్కారు రూ.100 కోట్లే విడుదల చేసింది. మిగతా రూ.400 కోట్లు ఇతర అవసరాలకు వినియోగించింది. దీంతో కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు అందడం లేదు. -
ఊరు పొమ్మంది.. పట్నం రమ్మంది
♦ ఉపాధికరువై వలసబాట పడుతున్న పల్లెజనం ♦ ఖాళీ అవుతున్న గిరిజన తండాలు యాలాలకు చెందిన గొల్ల శ్రీను కౌలు రైతు. ఏడాది నుంచి తీవ్ర వర్షాభావంతో పంటలు పండలేదు. గ్రామంలో ఉపాధి కరువైంది.. వారం క్రితం కుమారుడు ఈశ్వర్, కూతురు మల్లికను వికారాబాద్‌లోని అత్తగారింట్లో వదిలి పెట్టి వచ్చాడు. భార్య కేశమ్మతో కలిసి దినసరి కూలీ పనుల కోసం హైదరాబాద్‌కు పయణమయ్యాడు. ఉన్న ఊర్లో ఉపాధి కరువై, భార్యాబిడ్డలను పోషించుకోలేని స్థితిలో అన్నదాతలు ఉపాధి వెతుక్కుంటూ వెళ్తున్నారు. తీవ్ర వర్షాభావం అప్పుల ఊబిలోకి నెట్టడంతో కన్న పేగులకు పట్టెడన్నం పెట్టలేక కడుపుచేత పట్టుకుని పట్నానికి పయనమవుతున్నారు. జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వరుసగా మూడు నాలుగేళ్లుగా కరువు రావడంతో రైతులకు, వ్యవసాయ కూలీలకు గ్రామాల్లో ఉపాధి కరువైంది. దీంతో ముంబై, పూణేలకు వలస వెళ్తున్నారు. తాండూరు డిపో నుంచి రోజూ ముంబైకి ఓ బస్సు వెళ్తుండగా, మరో రెండు ఇతర డిపోల బస్సులు గండేడ్ మీదుగా కిక్కిరిసి వెళ్తున్నాయంటే వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గిరిజన తండాల నుంచి జనం ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్తున్నారు. గండేడ్: వ్యవసాయ భూములు ఎడారిగా మారడంతో, ఉపాధికరువై కుటుంబాలను సాకేందు కు బతుకుదెరువు కోసం పట్టణాలకు బయలుదేరుతున్నారు పల్లెవాసులు, గిరిజనులు. మండల పరిధిలో 80 శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సాగునీరు లేక భూములు బీళ్లుబారిపోయాయి. గ్రామాల్లో ఉపాధిదొరక్క పిల్లాపాపలతో పట్టణాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో సుమారు 25శాతం మంది వలసలబాట పట్టారు. మండలం నుంచి రోజుకు మూడు ఆర్టీసీ బస్సులు పుణేకు, ముంబైకి వెళతాయి. వాటిలో ప్రతిరోజు 150 మందికి పైగా మండల ప్రాంతం నుంచి పనులు వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఖాళీ అవుతున్న తండాలు.. మండలవ్యాప్తంగా 45 గిరిజన తండాలు ఉన్నాయి. వాటిలో 20వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఉపాధి దొరక్క పిల్లాపాపలను, వృద్ధులను వదిలి పుణే, ముంబై వలస వెళ్లారు. ఇప్పటికే తాండాల్లో సగానికి పైగా వలసబాటపట్టారు. ఏ తండాలో చూసినా ఇళ్లకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి. కుల్కచర్ల: ప్రభుత్వం వలసల నివారణ కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం సైతం కూలీలకు భరోసా ఇవ్వలేకపోతోంది. ఉన్నఊరు, కన్నవారు, కనిపెంచిన పిల్లలను వదిలి తప్పనిసరి పరిస్థితుల్లో పుణే, ముంబై తదితర పట్టణాలకు వలస పోతున్నారు. మండలంలో 29 పంచాయతీలు, 10 అనుబంధ గ్రామాలు, 102 వరకు తండాలు ఉన్నాయి. 81 వేల వరకు జనాభా ఉంది. ఇందులో ప్ర స్తుతం 50 శాతం మంది వలసబాట పట్టారు. తండాల్లో ఎక్కడ చూసినా వృద్ధులు, వారి దగ్గర చిన్న పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. మండల కేంద్రం నుంచి నిత్యం ముంబైకి బస్సు వెళ్తుంది. ఈ బస్సు చాలకపోవడంతో నిత్యం ప్రైవేటు జీపులను ఆశ్రయిస్తున్నారు. చేనేతకు చేయూత కరువై.. యాలాల: మండలంలో మొత్తం 24 పంచాయతీలుండగా, 13 గిరిజన తండాలున్నాయి. మండల కేంద్రంతో పాటు అనుబంధ గ్రామమైన గోవిందరావుపేట చేనేత కార్మికులకు పెట్టింది పేరు. అప్పట్లో చేనేత పనులతో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ ఊరు ప్రస్తుతం వలసబాట పట్టింది. చేనేత పనులకు ఆదరణ తగ్గిపోవడంతో ఇక్కడి చేనేత కార్మికులు వలసదారులుగా మారారు. కొందరు తమ కుటుంబాలతో సహా నగరాలకు వలస వెళ్లగా, వృద్ధులు బీడి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలామంది చేనేతలతో పాటు ఆటోడ్రైవర్లు, వ్యవసాయంపై ఆధారపడిన వారు నగరాలకు వలసబాట పట్టారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, పుణే, ముంబై, షోలాపూర్, బీవండి తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఉపాధి కోసం వలస వెళ్లిన వారిలో భవన నిర్మాణ కూలీలుగా, దినసరి కూలీ పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. గిరిజన తండాల్లో మహారాష్ట్ర పాంతానికి వలస వెళ్లినవారు అధికంగా ఉన్నారు. నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచింది. వర్షాలు ముఖం చాటేయడంతో కరువు ముంచుకొచ్చింది. పుట్టిపెరిగిన ఊళ్లో ఉపాధి కరువైంది. చేసేదిలేక పల్లెజనం పట్నం బాట పడుతున్నారు. విధిలేక బతుకుదెరువుకోసం పిల్లాపాపలను తీసుకొని.. ఇళ్లకు తాళాలు వేసి భారమైన హృదయం తో గ్రామాలను వీడుతున్నారు. మరికొందరు పెద్దవాళ్లను ఇళ్లవద్దే వదిలి వలసపోతున్నారు. నిత్యం వందలాదిమంది పుణే, ముంబై తదితర ప్రాంతాలకు పయనమవుతున్నారు. చేసేందుకు పనిలేక .. మాది పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడ్డ కుటుంబం. పనిలేకపోవడంతో నా ఇద్దరు కొడుకులు, కోడళ్లంతా పుణేకు వలసవెళ్లారు. వారి పిల్లలను, నన్ను ఇంటిదగ్గరే వదిలి వెళ్లిపోయారు. పిల్లలను చూసుకుంటూ ఇంటివద్దే కాలం గడుపుతున్నాను. మా తండాలో 70శాతం మంది వలస వెళ్లిపోయారు. - ధర్మిబాయి, పంచలింగాల్ తండా కుటుంబం గడవదు.. ఉన్న బోరుబావులు ఎండిపోయాయి. వ్యవసాయం చేయలేక పిల్లలతో కలిసి ముంబైకి వెళ్తున్నాను. చుట్టు పక్కల తండాల్లో ఉన్న మా బంధువులంతా పుణే, ముంబై వెళ్లిపోయారు. ప్రభుత్వం ఆదుకోవడం లేదు. నేనూ వెళ్లకుంటే నా కుటుంబం గడిచేలా లేదు. అందుకే పని వెతుక్కుంటూ వెళ్తున్నా. - కె.తులసీరాం, కోల్‌బాయి తండా పరీక్షల తర్వాత నేనూ వెళ్తా.. ఇంటి దగ్గర నేను, మా అవ్వ మాత్రమే ఉంటున్నాం, మా అ మ్మానాన్నలు పుణేలో ఉంటున్నారు. అక్కడ భవన నిర్మాణ పనుల్లో కూలీ పనులు చేస్తున్నారు. నేను పదోతరగతి చదువుతున్నాను. పరీక్షలు అయిన తరువాత నేను కూడా పోవాలె. - అనిల్, బింద్యం గడ్డ తండా 8 నెలలు అక్కడే ఉంటాం. రెండేళ్లుగా వర్షాలు లేక పంటలు పండలేదు. ఇక్కడ ఏ పనీలేదు. ఉపా ది పని చేస్తే ఇప్పటివరకు కూలీ రాలేదు. ఇక్కడే ఉంటే కుటుంబం గడవడం కష్టం. వర్షాకాలం ఇక్కడ ఉండి మిగతా 8 నెలలు పుణేకు పోయి పనులు చేసుకుంటాం. - హన్మయ్యనాయక్, నేరేర్లకుండ తండా మొత్తం ఖాళీ.. మా తండాలో మొత్తం 250 మంది ఉంటారు. ఇందులో 200 మంది పుణేకు వలస పోయారు. ప్రస్తుతం వృద్ధులు, పిల్లలు కలిపి 50 మంది వరకు మాత్రమే ఉన్నాం. ఈ సంవత్సరం పూర్తిగా పంటలు లేవు. చాలా తండాల్లో ఇదే పరిస్థితి. - రాజేందర్, టేకులతండా -
సుస్వరాలు పలికిన రూతు జీవితం
అనామకురాలైన మోయాబీయురాలు రూతు. బెత్లెహేముకు చెందిన సనాతన యూదుడు ఎలీమెలెకు అతని భార్య నయోమి తమ ఇద్దరు కుమారులతో సహా మోయాబు దేశానికి వలస వెళ్లారు. మోయాబు విగ్రహారాధికులుండే అన్యుల దేశమైనా తమ కుమారులిద్దరికీ మోయాబు అమ్మాయిలనే వివాహం చేశారు. ఇద్దరు కోడళ్లలో రూతు చిన్నది. అక్కడున్న పదేళ్లలో కోడళ్లిద్దరూ విధవరాళ్లుగా మిగిలారు. ఇక చేసేదేమీ లేక నయోమి తిరిగి బెత్లెహేము వెళ్లిపోవాలని నిర్ణయించుకొని మోయాబు స్త్రీలకు తన యూదుల దేశంలో భవిష్యత్తు, సరైన ఆదరణ ఉండదని, అందువల్ల కావాలంటే వాళ్లిద్దరూ మోయాబులోనే ఉండిపోయి పునర్వివాహం చేసుకొని భవిష్యత్తును పునర్ నిర్మించుకోవచ్చునని సలహా ఇచ్చింది. పెద్ద కోడలు అందుకు ఒప్పుకుంది కాని రూతు ససేమిరా అంది. ‘నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు’ అని ప్రకటించింది. పట్టుబట్టి అత్తతో సహా బెత్లెహేముకొచ్చింది (రూతు 1:16). అలా అనామకురాలుగా, అన్యస్త్రీగా, నిరుపేదగా బెత్లెహేముకొచ్చిన రూతు తన సౌశీల్యం, భక్తి, సత్ప్రవర్తనతో అనతికాలంలోనే అందరి మన్ననలు పొందింది. బోయజు అనే యూదు వంశీయుడైన భూస్వామి ఆమెను కోరి పెళ్లి చేసుకోగా పుట్టిన ఓబెదు ఆ తర్వాత దావీదు చక్రవర్తికి తాత అయ్యాడు. చివరకు ఆ వంశంలోనే యేసుక్రీస్తు జన్మించగా ఆ రాజవంశం కాస్తా రక్షకుని వంశమయింది. అలా అన్యురాలైన రూతును దేవుడు రాజవంశంలో, రక్షకుని వంశంలో భాగం చేశాడు (మత్తయి 1:5 ; లూకా 3:32). నిరుపేదగా, అన్యస్త్రీగా రూతు దేవుని ద్వారా పొందిన ఆశీర్వాదాలు అపారం. దేవుడు మట్టి పాత్రల్లో తన మహదైశ్వర్యాన్ని సత్క్రైస్తవులమని చెప్పుకునే మనం రూతు కన్నా ఎక్కువగా ఆశీర్వదింపబడాలి కదా? కాని అలా జరగడం లేదు. పగలూ రాత్రి ప్రయాసపడి బోలెడు వ్యవసాయం చేస్తున్నా పిడికెడు గింజలు కూడా పండించలేకపోతున్న ఆత్మీయ దుస్థితి మనది. అన్యురాలైనా రూతుకున్న సౌశీల్యం, సత్ప్రవర్తన, భక్తి, కష్టపడేతత్వం, దేవుని పట్ల నిబద్ధత మనలో కొరవడటమే దానిక్కారణం. ‘నీ దేవుడే నా దేవుడు’ అన్న రూతు కృత నిశ్చయం వెనుక, ఆమెలో దేవుని పట్ల తిరుగులేని విశ్వాసముంది. రూతు నిజానికి ఆ దేవుని ముందు ఎరుగదు. అయినా తన అత్తమామల్లో, భర్తలో ఆ దేవున్ని, ఆయన శక్తిని చూసి విశ్వాసి అయింది. తల్లిదండ్రులు తాత అవ్వల వంటి కుటుంబ పెద్దల్లో దేవుడుంటే, వారిలో ఆయన శక్తి ప్రత్యక్షత ఉంటే, దాంతో తరువాతి తరాల వాళ్లు తప్పక ప్రభావితమవుతారు. దేవునికి దూరంగా నామమాత్రపు క్రైస్తవులుగా బతికే తల్లిదండ్రుల పిల్లల ఆత్మీయ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మన జీవితాలను దేవుడు మార్చిన రుజువులు లోకానికి, మన పిల్లలకు కూడా చాలా స్పష్టంగా కనిపించాలి. ప్రార్థన, బైబిలు పఠన మన ఆత్మీయ జీవితాల్లో అంతర్భాగం కావాలి. అయితే బైబిలు మన జ్ఞానం పెంచడానికి కాదు, మనల్ని మార్చడానికి ఉద్దేశించబడింది. ఆధునిక జీవనశైలిలో బోలెడు స్వేచ్ఛ, డబ్బు, విలాసాలు, వినోదావకాశాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. కాని దేవునితో ప్రతినిత్యం నిర్దిష్టమైన, నాణ్యమైన ప్రార్థన, వాక్యధ్యాన సమయం గడిపే క్రమశిక్షణ కొరవడింది. ఆత్మీయానందమంతా కారిపోయి చెప్పుకోలేని లోటుపాట్లతో జీవితం తల్లడిల్లుతోంది. తీగలు వేలాడే వయోలిన్ సుస్వరాలనెలా పలుకుతుంది? ఆ తీగల్ని ‘క్రమశిక్షణ’తో బిగిస్తేనే కదా వయోలిన్‌కు సాఫల్యం, సుస్వరాల చైతన్యం! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
పోలింగ్‌కు వలస దెబ్బ!
♦ 51 వేల మంది ఓటుకు దూరం ♦ కొందరిది భుక్తి బాట ♦ మరికొందరిది భక్తి యాత్ర ♦ అయోమయంలో అభ్యర్థులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పోలింగ్ కేంద్రాలు..ఈవీఎంలు.. ఇంక్ ప్యాడ్లు.. గులాబీ పూలు.. మజ్జిగ ప్యాకెట్ల.. పోలీ సు పహారా.. వెరసి ఉప ఎన్నికకు సర్వం సిద్ధమయ్యాయి. ఎన్నికల సిబ్బంది, సామగ్రితో శుక్రవారం సాయంత్రానికే గమ్య స్థానాలకు చేరుకున్నారు. ఇక ఓట్ల పండుగే..! తెర వెనుక: పొట్ట చేత పట్టుకొని వలస పోయిన కూలీలు ఇంకా గూటికి చేరలేదు.. మరో వైపు పక్కరాష్ట్రంలో పండరీ దేవుని జాతరంటూ భక్త జనం వరుస కట్టారు... ఇంకోవైపు ‘క్షుద్ర శక్తుల’భయం చూపి నిరక్షరాస్య ఓటరును ఇంట్లోనే బంధించే ప్రయత్నమేదో జరుగుతోంది. ఓట్ల పండగ రానే వచ్చింది, కానీ ఎన్నో అడ్డంకులు. ప్రతిదీ సగటు ఓటరును ఓటుకు దూరం చేసేదే. ఇన్ని ఒడిదుడుకుల నడుమ నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ శాతం భారీగా తగ్గే ప్రమాదం ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో 2.5 లక్షల మంది ఓటర్లు ఉండగా 1.58 లక్షల ఓట్లు అంటే 79.64 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆధార్‌కార్డు అనుసంధానం లేకపోవడంతో ఈ ఏడాది ఎన్నికల కమిషన్ సుమారు 17.5 వేల ఓట్లను తొలగించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 95,772 మంది పురుషులు, 93,040 మంది స్త్రీ కలిపి మొత్తం 1,88,839 ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎన్నికల అధికారులు 1.37 లక్షల మంది ఓటర్లను మాత్రమే గుర్తించి వారికి ఓటరు స్లిప్పులు అందించారు. మిగిలిన 51 వేల మంది ఓటర్ల ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో ఓటరు స్లిప్పులను అందించలేకపోయారు. వీరంతా వలస కూలీలని, ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబాలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ రోజు వరకు వీరిలో కనీసం కొందరైనా తిరిగి వస్తారనే ఆశతో ఎన్నికల అధికారులు ఓటరు స్లిప్పులను ఆయా గ్రామాల వీఆర్వోల దగ్గర అందుబాటులో ఉంచారు. వలస కూలీలను ఓటింగ్ రోజున సొంత ఊర్లకు తీసుకుని రావడానికి ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కొక్క గ్రామం నుంచి ఎంత మంది వలస వెళ్లారో గుర్తించి వారిని పోలింగ్ కేంద్రం పద్దకు పట్టుకొచ్చి, ఓటు వేయించి తిరిగి మళ్లీ వాళ్లను పంపించే బాధ్యతను ఆయా గ్రామాల్లోని పెద్ద మనుషులకు, కుల పెద్దలకు అప్పగిస్తున్నారు. ఇదే బాధ్యతను కాంగ్రెస్‌పార్టీ నేతలు గుంపు మేస్త్రీలకు అప్పగించారు. కూలీలను తీసుకువెళ్లేది గుంపు మేస్త్రీలు కనుక, వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో సులువుగా గుర్తిస్తారని కాంగ్రెస్ పార్టీ ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయే వేచి చూడాలి. దేవుని భక్తి..‘క్షుద్ర శక్తుల’ శాసనం.. పోలింగ్ స్లిప్పులు తీసుకున్న వారిలో కూడా దాదాపు 20 నుంచి 25 శాతం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. నియోజకవర్గం నుంచి దాదాపు 15 వేల మంది భక్తులు పండరీపురం విఠలేశ్వర స్వామి జాతరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ మాసం ఏకాదశి (ఈనెల 3న) రోజున మొదలైన పండరీ భక్తుల ప్రయాణం, త్రయోదశి (ఈ నెల 6న) వరకు కొనసాగింది. ప్రతి పల్లెనుంచి పదుల సంఖ్యలో భక్తులు పండరి వెళ్లారు. మనూరు, కంగ్టి, నారాయణఖేడ్ మండలాల్లో పండరీ దేవుని ప్రభావం ఎక్కువగా ఉంది. వీళ్లంతా పోలింగ్‌కు దూరం అయినట్టే. ఇదిలా ఉంటే.. గ్రామీణ ప్రాంతంలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. నిరక్షరాస్యత ఓటర్లు క్షుద్ర శక్తుల భయంతో వణికిపోతున్నారు. ప్రధానంగా కల్హేర్, కంగ్టి, మనూరు ప్రాంతంలో ఈ ‘శక్తుల’ప్రభావం తీవ్రంగా ఉంది. సగటు ఓటరును ఇంట్లోనే బంధీగా చేయడానికి ఓ వర్గం పని గట్టుకొని క్షుద్ర విద్య అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు జనం హడలిపోతున్నారు. పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల చుట్టూ మంత్రించిన ఆవాలు చల్లితే మరికొన్ని గ్రామాల్లో ఎన్నికల కేంద్రం తలుపుల వద్ద పసుపు కుంకుమ పెట్టి వెళ్లిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. భయం.. భయం.. మంత్రగాళ్లు మనుసులో ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలని శాసిస్తాడో... అదే పార్టీకి గుర్తుకు ఓటు వేయాలని, లేదంటే క్షుద్ర శక్తులు బలి తీసుకుంటాయని ప్రచారం జరుగుతోందని గ్రామస్తులు అంటున్నారు. కల్హెర్ మండలంలోని రాపర్తి, మీర్ఖాన్పేట, అలీఖాన్‌పల్లి గ్రామాల్లో ని ప్రజలను ‘సాక్షి’ ప్రతినిధి పలకరించినప్పుడు జనం క్షుద్ర శక్తుల పట్ల తీవ్రమైన భయాందోళన వ్యక్తం చేశారు. ఓ పేరు మోసిన మంత్రగానితో ఆవాలు మంత్రించి, క్షుద్ర శక్తులను పోలింగ్ తలుపుల వద్ద కాపలా పెట్టారని జనం చెప్తున్నారు. ఓ పార్టీకి ఓటు వేయాలని మంత్రగాడు శాసించాడో జనం చెప్తున్నారు కానీ.. మీకు ఏ వ్యక్తి చెప్పాడని అడిగితే మాత్రం బదులు రావడం లేదు. ఎవరో చెప్పుకొంటుంటే విన్నామని మాత్రమే అంటున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి ఇలా వ్యాపిస్తోంది. ఈ భయంతో ఓటర్లు ఓటు వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇంట్లోనే ఉండిపోవాలనే యోచనలో చాలామంది ఉన్నారు. -
టీఆర్ఎస్లోకి జోరుగా వలసలు
సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు జోరుగా సాగుతున్నాయి. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్‌తో పాటు కొలను శ్రీనివాస్‌రెడ్డి, బండి రమేష్, శంకర్ యాదవ్, అశోక్ గౌడ్, విమల్ కుమార్, నార్నే శ్రీనివాస్‌రావు, రాఘవరావు తదితరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమైందని వారు పేర్కొన్నారు. టీఆర్ఎస్లోకి నైషధం టీడీపీకి రాజీనామా చేసిన ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన నైషధం సత్యనారాయణ మూర్తి శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హోమ్‌మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసిన అనంతరం.. తన అనుచరులతో కలసి టీఆర్ఎస్లో చేరారు. గత కొద్ది రోజులుగా ఆయన టీడీపీ తీరుపై నిరసన ప్రదర్శనలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
బతుకు బాట.. వలస పాట
పొట్ట చేతబట్టి గిరిజనులు ఉపాధి బాటపట్టారు. గ్రామాలు, తండాల్లో పనులు లేకపోవడంతో వలస పోతున్నారు. మనూరు మండలం డోవూరు తండా, శేరి తండాకు చెందిన ఐదుగురు కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెంది మూడు రోజులే అయినా.. ఆయా ప్రాంతాల నుంచి వలసలు ఆగ కపోవడం అక్కడి దుర్భిక్ష పరిస్థితికి అద్దం పడుతోంది. - నారాయణఖేడ్ వలస గిరిజన కూలీల సమస్యలు పరిష్కరించాలి సంగారెడ్డి క్రైం: జిల్లాలోని మూడు చక్కెర కర్మాగారాల్లో పనిచేసేందుకు వలస వస్తున్న గిరిజన కూలీల సమస్యలు పరిష్కరించాలని బంజారా సేవాలాల్ యువజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రమేశ్ చౌహాన్, రాథోడ్వ్రీందర్ నాయక్ కలెక్టర్ రోనాల్డ్రాస్కు శుక్రవారం వినతిపత్రం అందించారు. గిరిజనులు తాత్కాలిక గుడిసెలు వేసుకోవడం, కిరోసిన్ దీపాలు పెట్టుకోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా వారు వివరించా రు. ఎడ్లబండ్లపై వస్తున్నవారు రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. వలస కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
వలస బాటలో రైతు కుటుంబాలు
ఎమ్మిగనూరు (కర్నూలు) : వర్షాభావ పరిస్థితులతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజికవర్గంలో రెండు రోజులుగా రైతుల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా మంగళవారం నందవరం మండలం సోమలగూడూరు నుంచి 100 రైతు కుటుంబాలు వలస దారి ఎంచుకుని బళ్లారి వెళ్లాయి. అలాగే మంతలం మాచాపురం గ్రామం నుంచి 40 కుటుంబాలు వలస బాట పట్టాయి. ఉపాధి హామీ పథకం కడుపు నింపకపోవడంతో ఈ కుటుంబాలు వలస బాట ఎంచుకున్నాయి. -
ఈ పల్లె... పక్షుల స్వర్గం!
ఒక ఉదయాన... కిటికీ నుంచి తొంగి చూస్తున్నప్పుడు... చెట్టు కొమ్మ మీద పిట్ట పాట వినక ఎన్ని రోజులవుతుందో! ఒక సాయంత్రాన... ఆకాశ దేశాన బారులు బారులుగా ప్రయాణించే పక్షుల గుంపును చూసి ఎన్ని రోజులవుతుందో! మాయమైపోతుంది. మనిషిలోని మనిషి మాత్రమే కాదు... పక్షుల జాడ కూడా! అందుకే ఆ పక్షులను తన గుండెల్లో పెట్టుకోవాలనుకుంది కొక్కరేబేలూర్. కర్ణాటక రాష్ట్రంలోని మద్దూరు తాలూకాలో ఉన్న ఈ చిన్న ఊళ్లోకి అడుగుపెడితే... చెట్లకు వేలాడే పక్షిగూళ్లు స్వాగతతోరణాల్లాగ కనిపిస్తాయి. పక్షులను ప్రేమించమని మౌనంగా చెబుతాయి. ప్రతి చెట్టుకూ పక్షి గూళ్లు వేలాడుతూ కనిపిస్తాయి. ఇక మే నెలలోనైతే చిట్టి చిట్టి పక్షి పిల్లలతో వాతావరణం అల్లరి అల్లరిగా ఉంటుంది. పక్షులను పక్షుల్లా కాకుండా తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. పక్షులు కూడా గ్రామస్థులకు బాగా అలవాటుపడిపోయాయి. వాటికి ఎంత దగ్గరికి వెళ్లినా, భయంతో పారిపోకుండా కళ్లలో కళ్లు పెట్టి ప్రేమగా చూస్తాయి. ఆ గ్రామానికి వచ్చే ప్రధాన పక్షుల్లో పెలికాన్, బ్లాక్ ఐబిస్, గ్రే హెరాన్, ఇండియన్ పాండ్ హెరాన్ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. సెప్టెంబర్‌లో గ్రామంలోకి ప్రవేశించే పక్షులు మే తరువాత వేరే చోటుకి వలస వెళతాయి. ఎక్కడెక్కడి నుంచో తమ గ్రామానికి వలస వచ్చే ఈ పక్షులను కేవలం అతిథులుగా మాత్రమే కాకుండా తమ అదృష్టంగా కూడా భావిస్తారు ఆ గ్రామస్థులు. చెట్ల మీద నివాసముండే పక్షులు అప్పుడప్పుడూ దగ్గరలోని పంటపొలాలపై వాలి తమ ఆకలిని తీర్చుకుంటాయి. దీనివల్ల నష్టం వాటిల్లినా... వాటిని తరిమికొట్టడం, హింసాత్మక చర్యలకు దిగడంలాంటివేమీ చేయరు గ్రామస్థులు. పక్షులపై వారి ప్రేమను ప్రభుత్వం సైతం అర్థం చేసుకుంది. అందుకే పక్షుల కారణంగా పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తుంది. ‘‘ఈ పక్షులను చూస్తుంటే సొంత బిడ్డల్ని చూసినట్లుగా అనిపిస్తుంది’’ అంటుంది గ్రామానికి చెందిన ఒక గృహిణి. కొందరైతే చనిపోయిన తమ ఆత్మీయులను ఈ పక్షుల్లో చూసుకుంటా మని చెబుతున్నారు. ‘‘మీది ఏ ఊరు? అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే, మా ఊరు పేరు చెబితే రాష్ట్రంలో గుర్తు పట్టనివారు ఉండరు. పైగా మా ఊరి ఔన్నత్యం గురించి పొగుడుతుంటారు కూడా’’ అంటాడు గ్రామానికి చెందిన కుమార్ అనే విద్యార్థి. ‘‘ఆడపిల్ల ప్రసవానికి పుట్టింటికి వెళ్లినట్లు ఈ పక్షులు మా ఊరికి వస్తాయి’’ అని గర్వంగా చెబుతాడు యోగేశ్ అనే యువకుడు. కొక్కరేబేలూర్ చేస్తున్న పుణ్యం ఊరకే పోలేదు. రాష్ట్రంలో ఎన్నో గ్రామాలకు ఈ గ్రామం ‘రోల్ మోడల్’గా మారింది. ప్రభుత్వం కూడా పక్షుల సంక్షేమానికి ప్రత్యేకంగా గ్రాంటు విడుదల చేస్తోంది. పక్షులను వాటి మానాన వాటిని వదిలేయడం కాకుండా వాటి ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తుంటారు గ్రామస్థులు. ఏదైనా పక్షి అనారోగ్యంతో కనిపించినా, గాయపడినా తక్షణ వైద్య సహాయం అందిస్తారు. కొందరైతే చేపపిల్లలను ప్రేమగా పక్షుల నోటికి అందిస్తారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ ఊరు దాటిన తరువాత ఒక్క చెట్టు మీద కూడా పక్షుల గూళ్లు కనిపించవు. దీన్ని బట్టి పక్షులకు, ఆ ఊరికి ఉన్న అనుబంధం ఏపాటిదో అర్థమవుతుంది. ‘‘పక్షులు ఈ ఊరికి ఎప్పటి నుంచి రావడం మొదలైంది? ఈ ఊరికే ఎందుకు రావడం మొదలైంది?’’లాంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలేవీ దొరకక పోవచ్చు. కాని వాటి గురించి అందరూ చెప్పే సమాధానం ఒక్కటే- ‘‘పక్షులు కొలువైన చోట ఊరికి మంచి జరుగుతుంది’’ అని! -
వలసలపై నిప్పులు!
యూరప్‌ను ఆవరించిన మంచుతెరలు క్రమేపీ మాయమవుతుండగా మధ్యధరా సముద్రానికి ఆవలి తీరంలోని ఆఫ్రికా ఖండవాసులకు ఆశలు మోసులెత్తుతాయి. ముంచుకొచ్చే మత్యువునుంచీ.... ఆకలి, అనారోగ్యం, అస్థిరతలనుంచి దూరంగా పారిపోవడానికి వారికి అదే అదును. పర్యవసానంగా ఏటా ఏప్రిల్ తర్వాత ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలనుంచి యూరప్‌కు వేల సంఖ్యలో జనం వలసబాట పడతారు. ఈ క్రమంలో వారు ఎక్కివచ్చే పడవలు ప్రమాదాల్లో చిక్కుకుని వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతారు. ఇకపై ఇలాంటి అక్రమ వలసలను అరికట్టడానికి కఠిన చర్యలకు ఉపక్రమించాలని యూరప్ యూనియన్ (ఈయూ)తీసుకున్న తాజా నిర్ణయం అందరినీ ఆందోళనపరుస్తున్నది. ఇందులో భాగంగా వలసలు అధికంగా ఉండే లిబియా తీరంలోని పడవలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేయాలన్నది ఆ నిర్ణయం సారాంశం. ఇందుకు సంబంధించి భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా ఈయూ దేశాలు సిద్ధపడుతున్నాయి. యూరప్‌కు అక్రమ వలసలను అరికట్టడంపై గత కొన్ని వారాలుగా ఈ దేశాల మధ్య ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. గత నెలలో 900 మందితో బయల్దేరిన ఒక పడవ మార్గమధ్యంలో మునిగి అధిక సంఖ్యలో జనం మరణించిన ఉదంతం చోటుచేసుకున్నాక వలసలపై ఆ దేశాలు ప్రధానంగా దష్టి కేంద్రీకరించాయి. ఆ తర్వాత సైతం మరో మూడు ప్రమాదాలు జరిగి వందమంది వరకూ మరణించారు. ఇటలీ తీరప్రాంత నావికాదళం అక్రమంగా వస్తున్న 4,800మందిని గత నెలాఖరున అదుపులోకి తీసుకుంది. ఇంచుమించు అదే సమయంలో లిబియాలో బయల్దేరిన పడవను అడ్డగించి మరో 2,000మందిని అరెస్టుచేశారు. ఒక పెను సంక్షోభం ఇప్పుడు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టింది. వనరులున్నా వాటిని సక్రమంగా వినియోగించుకోలేని నిస్సహాయత, అక్కడి దేశాల్లో నెలకొన్న రాజకీయ అస్థిరత ఉగ్రవాదానికీ, నేరస్త ముఠాలకూ చోటిస్తున్నాయి. దిక్కూమొక్కూ లేని జనం ప్రాణాలు దక్కించుకోవడానికీ, అయినవారిని కాపాడుకోవడానికీ, కడుపుకింత తిండి సంపాదించుకోవడానికీ వలసబాట పడుతున్నారు. ఇందుకోసం జీవితాంతం కూడబెట్టుకున్న సొమ్మును స్మగ్లర్ల చేతుల్లో పోసి కనీస సౌకర్యాలు కూడా లేని పడవలపై పిల్లాపాపలతో యూరప్ దేశాలకు వెళ్తున్నారు. ఈ ప్రయాణం ప్రాణాంతకమైనదని, పడవలో జనం ఎక్కువై ఊపిరాడకపోయినా...రాకాసి అలల తాకిడికి అసలు పడవే మునిగిపోయినా చావు తథ్యమని వారికి తెలుసు. అయినా అనుక్షణమూ చస్తూ బతికేకన్నా ఏదో ఒకటి తేల్చిపారేసే ఈ ప్రయాణమే మెరుగని వారు భావిస్తారు. సిరియాలో అంతర్యుద్ధం, ఎరిత్రియాలో బలవంతంగా సైన్యంలో చేర్చుకోవడం, లిబియాలో, నైజీరియాలో, గాంబియాలో నేరస్త ముఠాలు చెలరేగిపోవడంవంటివన్నీ ఈ వలసలకు ప్రధాన కారణాలవుతున్నాయి. అయితే ఈ దేశాలన్నిటా ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన బాధ్యత పాశ్చాత్య దేశాలదే. తమ చర్యలు ఎలాంటి పర్యవసానాలకు దారితీయగలవన్న అంచనా లేకుండా...వెనకా ముందూ ఆలోచించకుండా ఆ దేశాలన్నీ వ్యవహరించడంవల్ల ఆఫ్రికా దేశాలకు ఈ సంక్షోభం వచ్చిపడింది. నాలుగేళ్ల క్రితం లిబియాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను సాకుగా తీసుకుని అమెరికా, పాశ్చాత్య దేశాలు సైనిక దాడులకు దిగి ఆనాడు దేశాన్ని పాలిస్తున్న గడాఫీని అంతమొందించాయి. అప్పట్లో ఉగ్రవాద ముఠాలకు ఆ దేశాలు సరఫరాచేసిన ఆయుధాలే ఇప్పుడు ప్రజలపై పెత్తనం చేస్తున్నాయి. నైజీరియాలో, సోమాలియాలో, పాలస్థీనాలో ఇలాంటి పరిస్థితులే అక్కడి ప్రజలను వలసబాట పట్టిస్తున్నాయి. నిరుడు ఇటలీకి వలసవచ్చిన పౌరుల సంఖ్య 1,70,000 అని గణాంకాలు చెబుతున్నాయి. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 300 శాతం ఎక్కువ. వాస్తవానికి ఆఫ్రికా దేశాలనుంచి అక్రమ వలసలు యూరప్‌కు కొత్తగాదు. ఇవి భారీయెత్తున ఉండకపోవడంవల్లా, తమకు కూడా మానవ వనరుల అవసరం ఉండటంవల్లా యూరప్ దేశాలు వీటిని పట్టించుకునేవి కాదు. అయితే ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని ఉపాధి అవకాశాలు క్రమేపీ తగ్గడం మొదలెట్టాక వలసల కట్టడికి నడుం బిగించాయి. అదే సమయంలో అమెరికాతోపాటు పలు సైనిక చర్యల్లో పాలుపంచుకుని ఆ వలసలు మరింతగా పెరిగేందుకు పరోక్షంగా దోహదపడ్డాయి. పర్యవసానంగానే ఇప్పుడా దేశాలు వలసలతో ఇబ్బందిపడుతున్నాయి. వీటిపై యూరప్ దేశాల్లో పెరిగిన వ్యతిరేకత అక్కడ మితవాద పార్టీల పుట్టుకకూ, విస్తతికీ దోహదపడ్డాయి. మొన్నటికి మొన్న బ్రిటన్ ఎన్నికల్లో వలసలు ఏ స్థాయిలో చర్చకొచ్చాయో అందరూ చూశారు. మిగిలిన దేశాల్లో సైతం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇప్పటికే వలసలు వచ్చినవారిని యూరప్‌లోని దేశాలు వాటి వాటి ఆర్థిక స్థితిగతులు, జనాభా, నిరుద్యోగితవంటివి ఆధారం చేసుకుని పంచుకోవాలన్న ప్రతిపాదన రూపుదిద్దుకుంటున్నా దాన్ని బ్రిటన్, హంగేరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాము సహకరించబోమని చెబుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండ్ తదితరులు మనుషులను తరలిస్తున్న స్మగ్లర్లు ఉగ్రవాదులతో సమానమని తిట్టిపోశారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పడవలపై బాంబులేయాలనుకోవడం ఆ హెచ్చరికలకు కొనసాగింపే. అయితే, ఈ చర్యలు ఖాళీ పడవలకే పరిమితమవుతాయని చెప్పడానికి లేదు. బాంబు దాడులకు వెళ్లిన విమానాలు పొరపాటున జనంతో నిండిన పడవలపై నిప్పుల వాన కురిపించవన్న గ్యారంటీ లేదు. కనుక ఈ ఆలోచనకు యూరప్ దేశాలు స్వస్తి పలకాలి. అందుకు బదులుగా ఆఫ్రికా దేశాల సంక్షోభం తమ పాపఫలమే గనుక అక్కడ సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో సాగే చర్యల్లో ఆ దేశాలు పాలుపంచుకోవాలి. మానవతా దక్పథంతో ఆలోచించాలి. -
వలస బాటలో పల్లె జనం
‘ఉపాధి’ లేక పయనం వర్షాభావం, ‘ఉపాధి’ లేకపోవడమే కారణం పనిలేక.. పొట్ట కూటి కోసం పల్లె జనం పట్నం బాట పడుతున్నారు.. పదుల సంఖ్యలో ఊళ్లు.. వందల సంఖ్యలో కుటుంబాలు వలస వెళ్తున్నా యి.. ఫలితంగా పల్లెలు బోసిపోతున్నారుు.. ఏ ఇంటిని చూసినా తాళాలు దర్శనమిస్తున్నారుు.. కులవృత్తులు లేక చిరు వ్యాపారం చిన్నబోతోంది..పల్లెల్లో వృద్ధులు, చిన్నారులు మినహా ఎవరూ కనిపించడం లేదు..! దీనికి ప్రధాన కారణం.. ‘ఉపాధి’ లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు.. జిల్లాలో వలస వెళ్లిన పల్లెలపై కథనాలు.. తాళం వేసి ఉన్న ఈ ఇల్లు పాలకుర్తి మండల కేంద్రంలో గీత కార్మిక కుటుంబానిది. కమ్మగాని సోమ రాములు తన భార్య, పిల్లలతో ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ కల్లు దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం వరకు గీత వృత్తి చేస్తూ నెలకు రూ.5వేలు సంపాదించి కుటుంబాన్ని పోషించే వాడు. కొంత కాలంగా గీత వృత్తిపై ఉపాధి సన్నగిల్లింది. దీంతో సోమ రాములు వలస వెళ్లాడు. బ్రాందీ, గుడుంబా విక్రయాలు ఎక్కువ కావడంతో కల్లుకు గిరాకీ తగ్గి వలస వెళ్లాడని పక్కవారు తెలిపారు. సంవత్సరంలో ముఖ్యమైన పండుగల సమయంలో పాలకుర్తికి వస్తుంటాడు. ఈయనకు వ్యవసాయ భూములు, ఇతర ఆస్తులు ఏమీ లేవు. కాలం కాలేదు.. కరువొచ్చింది.. చేసేందుకు చేతినిండా పనిలేదు.. పూట గడవడం.. పిల్లలను సాకడం భారమైంది.. బతుకుబండి నడిపించాలి.. దూరమైనా పని దొరికినకాడికే పోవాలంటూ పల్లె జనం పట్నంబాట పట్టారు.. వలసలు నివారించేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టినా పనులు పూర్తిగా సాగడం లేదు.. ఇటు వర్షాలు లేక పంటలు పండలేదు.. సాగు భూములు బీళ్లుగా మారాయి.. గ్రామాల్లో చేయడానికి పనులు లేక రైతులు, గిరిజనులు, కూలీలు నగరాలకు బెలైల్లారు.. తాపీమేస్త్రీలు.. వంటమనుషులు, గుమస్తాలుగా చేరుతున్నారు.. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లడంతో పల్లెలు, తండాలు బోసిపోతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి... కాజీపేట రూరల్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఆదివాసీలు బతుకు దెరువు కోసం కాజీపేటకు వలస వచ్చారు. కుటుంబ సభ్యులంతా వంట సామగ్రితో సహా గురువారం నాగ్‌పూర్ ప్యాసింజర్‌కు దిగారు. జంక్షన్ ముందు మూటలతో గుంపులు గుంపులుగా సేద తీరుతున్నారు. ‘సాక్షి’ వారిని పలకరించగా.. తాము నాగ్‌పూర్(చంద్రాపూర్) వద్ద తాప్సి ఆదివాసీలతండాకు చెందిన వారమని తెలిపారు. పని కోసం ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళతామన్నారు. కాజీపేట జంక్షన్ నుంచి రైళ్లో డోర్నకల్‌కు వెళుతున్నట్లు వారు వివరించారు. మిర్చి ఏరేందుకు వచ్చాం మిర్చి ఏరడానికి నాగ్‌పూర్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ పని అయిపోయక వేరే పనికి వెళతాం. రెండు నెలలపాటు తాము ఇక్కడ దొరికిన పనులు చేసుకుంటూ ఉంటాం. తర్వాత తమ తండాకు వెళతాం. కొన్ని రోజులు ఉండి మళ్లీ పనికోసం వెతుకుతాం. - గౌటం రాజేంద్ర, ఆదివాసీ మహబూబాబాద్ : మండలంలో ఉపాధి పనులు లేకపోవడంతో దాదాపు 50 కుటుంబాలు వలసబాట పట్టాయి. అమనగల్ గ్రామంలో 10 కుటుంబాలు, కస్నాతండాలో 30, గుండ్రాళ్లగడ్డతండాలో 10 కుటుంబాలు వలస వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కస్నాతండాలో... తండాకు చెందిన బానోత్ కిషన్, అనిత దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. తండాలో కిషన్‌కు 30 గుంటల భూమి ఉంది. దానిని సాగు చేస్తూ ఖాళీగా ఉన్నసమయంలో కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరువు వల్ల పంటలు పండక కుటుంబ పోషణ కష్టమైంది. దీంతో ఆ దంపతులు ఏడేళ్ల కుమారుడు చరణ్, మూడేళ్ల కుమార్తె స్వప్నను ఇంటి వద్దే వదిలి పట్నంబాట పట్టారు. హైదరాబాద్ వెళ్లి కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను ఇంటికి పంపిస్తున్నారు. పిల్లల ఆలనా పాలన కిషన్ తల్లిదండ్రులు బీల్యా, కేలి చూసుకుంటున్నారు. చరణ్‌ను మానుకోటలోని ప్రభుత్వ హాస్టల్లో చదివిస్తుండగా.. కుమార్తె మాత్రం ఇంటి వద్దే ఉంటుంది. అదే తండాలో... తండాకు చెందిన లూనావత్ మంగ్యా, బుజ్జికి 2 ఎకరాల భూమి ఉంది. కరువు మూలంగా పంటలు పండక హైదరాబాద్ వెళ్లిపోయారు. వారితోపాటు వారి ఇద్దరు కొడుకులు, కోడళ్లు కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. నెలకోసారి తండాకు వచ్చి భూమి, ఇల్లు చూసుకొని వెళుతున్నట్లు తండావాసులు తెలిపారు. కురవిలో 20... కురవి : మండల కేంద్రం శివారులోని తులిస్యాతండా, కీమ్యాతండాకు చెందిన సుమారు 20 కుటుంబాలకు చెందిన కూలీలు వలసబాట పట్టారు. ఉపాధిహామీ పథకంలో పనులు లేకపోవడంతో హైదరాబాద్, కరీంనగర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో పనులు చేసుకుని బతికేందుకు ఇళ్లకు తాళాలు వేసుకుని తమ పిల్లాపాపలతో కలిసి వలస వెళ్లిపోయారు. కీమ్యాతండాకు చెందిన బోడ భద్రి, బోడ నరేష్, బోడ కిషన్, బోడ సీతారాం, బానోత్ వీరన్న, బానోత్ పరమేశ్, తేజావత్ శారద కుటుంబాలతోపాటు మరికొన్ని కుటుంబాలు సైతం వలస వెళ్లాయి. కురవి శివారు తండాలే కాకుండా మండలంలోని మరిన్ని గ్రామాల శివారు తండాల ప్రజలు పనులు లేకపోవడం వల్ల బతుకుదెరువు కోసం వలస వెళ్లిపోయారు. ఏజెన్సీ జనం... ములుగు/మంగపేట : నియోజకవర్గంలోని ములుగు, మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో పనులు లేక ప్రజలు వలస వెళుతున్నారు. హైదరాబాద్, గుంటూరు, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా, కంపెనీల్లో కూలీలుగా, హాస్టళ్లలో వంట పనికి చేరుతున్నారు. వలసలతో ములుగు మండలం పత్తిపల్లి శివారు కొడిశలకుంట పూర్తిగా ఖాళీ అయింది. ఊరి జనాభా 120 ఉంటే.. ప్రస్తుతం 60 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్ పరిశ్రమ మూతపడడంతో పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వందలాది మంది కార్మికులు, వ్యాపారులు ఉపాధి లేక వలస పోతున్నారు. ప్రతి వ్యక్తికీ వంద రోజుల పని కల్పించాలి. మార్చి 31 వరకు 75 శాతం పని దినాలు కల్పించకపోతే చర్యలు తప్పవు. - కలెక్టర్ -
ఏదీ పని?
చేయడానికి పనుల్లేక పిల్లలను ముసలోళ్లకు అప్పగించి, ఉన్న ఊరిని వదిలేసి గుంపులు గుంపులుగా బీద జనం నగరాలకు వలసపోతున్న దృశ్యాలు జిల్లాలో నిత్యకృత్యమయ్యూరుు.. అడిగిన వారందరికీ పని చూపిస్తామని గొప్పలు చెబుతున్న అధికారులు చేతల వరకు వచ్చే సరికి చేతులెత్తేశారు.. ఇదేంటని ప్రశ్నించి న్యాయం చేయూల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారు. అనంతపురం సెంట్రల్ : మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కరువు జిల్లా అనంత వాసులకు అక్కరకు రాకుండా పోతోంది. కరువు పరిస్థితుల దెబ్బకు తట్టుకోలేక వలసబాట పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 43 వేల కుటుంబాలు పెద్ద నగరాలకు వలసపోయాయని సమాచారం. లక్షలాది మంది సొంత ఊళ్లలోనే ఉంటూ పొట్ట చేతపట్టుకొని వివిధ పనుల కోసం రోజూ పట్టణాలకు వస్తున్నారు. వలస నివారణే లక్ష్యంగా జిల్లా నుంచి పురుడుపోసుకున్న ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. జిల్లాలో 7.61 లక్షల కుటుంబాలు (జాబ్ కార్డు పొందిన వారు) ఈ పథకంపై ఆధారపడ్డాయి. ఇందులో 18,20,780 మంది కూలీలు ఉన్నారు. జాబ్ కార్డు పొందిన వారిలో 4.50 లక్షల మంది కూలీలు నిత్యం పనులకు వస్తున్న వారిలో ఉన్నారు. అయితే వీరందరికీ పనులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1006 పంచాయతీలుండగా కేవలం 582 పంచాయతీల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. అదికూడా అరకొరగానే జరుగుతుండడంతో గ్రామంలోని కూలీలందరూ ఉపాధి పనులకు పోవడానికి ఆస్కారం లేకుండాపోతోంది. 4.50 లక్షలకు పైగా కూలీలు ఉన్న జిల్లాలో కేవలం 28,714 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తుండడం అధికారుల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పథకంపై అపోహలను సృష్టించింది. వేతనాల పంపిణీ బాధ్యతల నుంచి ఫినో ఏజెన్సీ తప్పుకోవడంతో దాదాపు రూ.12 కోట్ల మేర బిల్లులు పేరుకుపోయాయి. అనంతరం పోస్టాఫీసుకు బాధ్యతలు అప్పజెప్పడానికి సెప్టెంబర్ నుంచి జనవరి వర కు సమయం తీసుకోవడంతో ఉపాధి కల్పనపై దెబ్బపడింది. జిల్లా వ్యాప్తంగా 1006 పంచాయతీలకు గాను 582 పంచాయతీల్లో కేవలం 28,714 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే స్థానికంగా పనులు కల్పించడంలో డ్వామా సిబ్బంది ఏమేరకు శ్రద్ద వహిస్తున్నారో అర్థమవుతోంది. ప్రస్తుతం బకాయి వేతనాల పంపిణీ ప్రక్రియ సాగుతోంది. ఫినో ఏజెన్సీ వైపు నిలిచిపోయిన రూ. 2.06 కోట్లు ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. దీనికి తోడు 100 రోజులు మాత్రమే పని అనే నిబంధన కూలీల పట్ల శాపంగా మారింది. ఖరీఫ్ పంట కోతల అనంతరం మళ్లీ ఖరీఫ్ పంటలు సాగయ్యేంత వరకూ వ్యవసాయ ఆధారిత కూలీలకు పనులుండవు. ఈ సమయంలో ఉపాధి పనులే శరణ్యం. దాదాపు అరునెలల పాటు కూలీలకు ఉపాధి తప్పనిసరి కాగా మూడు నెలలు మాత్రమే పనులు కల్పిస్తామనే నిబంధన పెద్ద గుదిబండగా మారింది. ఈ విషయంపై ఇటీవల జెడ్పీ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేసి పంపినా ప్రభుత్వంలో చలనం రాలేదు. వీటన్నింటికి తోడు దినసరి కూలీ ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. మొన్నటి వర కు రూ.149 వేతనం ఉండేది. ఈ నెల నుంచి రూ.20 పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే కూలీలకు కొండగుట్టల్లో పనులు చూపిస్తుండడంతో రూ.100 నుంచి రూ.120 మద్య కూలీ పడుతోంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఈ కూలీ కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని కూలీలు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పనులు కల్పించండి మహాప్రభో అని వేడుకుంటున్నా ఉపాధి చూపించే నాథుడు కరవయ్యాడు. దీంతో గత్యంతరం లేక పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వలస పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో ‘ఉపాధి’ పరిస్థితి ఇదీ.. నియోజకవర్గం మొత్తం కూలీలు హాజరవుతున్న కూలీలు ధర్మవరం 33889 2312 గుంతకల్లు 24712 1927 హిందూపురం 10014 785 కదిరి 31058 3079 కళ్యాణదుర్గం 43680 4113 మడకశిర 22115 1505 పెనుకొండ 26905 1192 పుట్టపర్తి 37197 2443 రాప్తాడు 40569 1768 రాయదుర్గం 34592 2531 శింగనమల 48790 3340 తాడిపత్రి 26358 2185 ఉరవకొండ 42238 1383 అనంతపురం 4524 151 పని కల్పించలేదని ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు : ఎ. నాగభూషణం, ప్రాజెక్టు డైరక్టర్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ కూలీలందరికీ పనులు కల్పించాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అవగాహన కోసం చైతన్య రథాలను ఏర్పాటు చేశాం. ఎంతమందికైనా పనులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కనిష్ట స్థాయికి పడిపోయిన కూలీల సంఖ్యను పెంచుతూ వస్తున్నాం. నల్లరేగడి భూముల్లో ఇంకా వ్యవసాయ పనులు ఉండడం ద్వారా ఎక్కువ మంది రావడం లేదు. ఈ నెలాఖరు నుంచి కూలీల సంఖ్యను రెట్టింపు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గ్రామంలో పని అడుగుతున్నా కల్పించడం లేదని కూలీలు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓలపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
‘కూలి’న బతుకులు..
పొట్టచేత పట్టుకొని వలసబాట పట్టారు.. రాష్ట్ర కాని రాష్ట్రం అయినా.. కడుపునింపుకుందామని కర్ణాటకకు వెళ్లారు. ఉర్సులో ఒకరు టిఫిన్ సెంటర్ పెట్టారు. మరొకరు స్వీట్‌హౌస్‌లో పనిచేస్తున్నారు. ఎంతోకొంత సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉందామనుకున్న వారి జీవితాలు శిథిలాల్లో కలిసిపోయాయి. వాటర్‌ట్యాంకు కుప్పకూలి వారి ప్రాణాలు హరించింది. టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న మహిళ గర్భవతి కావడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. మాగనూర్/గట్టు: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వారివి. చిరువ్యాపారంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఓ మహిళ, యజమాని వద్ద జీతం కుదిరి అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉంటున్న మరో యువకుడు శనివారం కర్ణాటకలోని యాపల్‌దిన్నె జంగిల్‌సాబ్ ఉర్సు ఉత్సవాల్లో వాటర్ ట్యాంకు కూలి దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురిలో జిల్లావాసులు ఇద్దరు ఉన్నారు. యాపల్‌దిన్నె గ్రామంలో ఏటా జరిగే జంగిల్‌సాబ్ ఉర్సు ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో చిరువ్యాపారులు దుకాణాలను ఏర్పాటుచేసి పిల్లల ఆట వస్తువులు, తినుబండారాలు, గాజులు తదితర వాటిని విక్రయిస్తూ పొట్టపోసుకుంటారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఉసేన్(23) స్థానికంగా మిఠాయి దుకాణంలో జీతం కుదిరాడు. మరో మహిళ షాజాహాన్(25) అక్కడే జాతరలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. ఇదిలాఉండగా, శనివారం ఉదయం కొందరు నీళ్లు తీసుకురావడానికి, మరికొందరు స్నానాలు చేసేందుకు సమీపంలో ఉన్న వాటర్‌ట్యాంక్ వద్దకు వెళ్లారు. ఇంతలో ట్యాంకు ఢమాల్.. అని పె...ద్దశబ్దం చేస్తూ కూలిపోడంతో అక్కడే ఉన్న ఉసేన్, షాజాహాన్తో పాటు మరో ముగ్గురు వీరేష్(25), దుర్గప్ప(55), జోమెల్(40) శిథిలాల కిందపడి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అమ్మానాన్నకు తోడుగా.. గట్టు మండలకేంద్రానికి చెందిన తెలుగు ఊసేన్ది నిరుపేద కుటుంబం. తండ్రి డబ్బా మల్లయ్య తన కొడుకును గ్రామానికి చెందిన మిఠాయి దుకాణం యజమానురాలు రమాదేవి వద్ద జీతం కుదిర్చి తన భార్యతో కలిసి గార్లపాడుకు వలసవెళ్లారు. ఉదయం స్నానం చేసి తాగునీళ్లు తీసుకురావడానికి వెళ్లిన తెలుగు ఊసేన్ వాటర్‌ట్యాంకు కూలడంతో మృత్యువాతపడ్డారు. తోటి మిఠాయి దుకాణం వారు మృతదేహాన్ని గట్టుకు తీసుకొచ్చి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భర్త, పిల్లల పోషణ కోసం.. మరో మృతురాలు గద్వాల మండలం జమ్మీచెడు గ్రామానికి చెందిన షాజహాన్ నిండు గర్భిణి. తన భర్త యూసుఫ్ చేయి విరగడంతో అన్నీ తానై టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. చాలాఏళ్ల క్రితం ఎమ్మిగనూరుకు వలస వెళ్లారు. అక్కడి నుంచి జాతరలు, ఉర్సులకు వెళ్తూ అక్కడే టిఫిన్ సెంటర్‌ను నిర్వహించేవారు. ఈ క్రమంలోనే యాపల్‌దిన్నె ఉర్సుకు వెళ్లారు. ముగ్గురు పిల్లలు షబానా, షాన్వాజ్, ఖలీల్ పోషణ బాధ్యతలను తన భుజాలపైనే వేసుకుంది. స్థానిక జంగిల్‌సాబ్ ఉర్సు ఉత్సవాల్లో టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తున్న షాజహాన్ తాగునీళ్లు తీసుకొచ్చేందుకు సమీపంలో ఉన్న వాటర్‌ట్యాంకు వద్దకు వెళ్లింది. ట్యాంకు కూలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదానికి కారణాలివే.. యాపల్దిన్నెలో ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంక్ ను ఇటీవలే నిర్మించి.. క్యూరింగ్ సరిగాచేయలేదు. సిమెంట్ తక్కువగా, ఇసుక ఎక్కువగా వేసి నిర్మించడంతో నీటి సామర్థ్యాన్ని తట్టుకోలేకపోయింది. ఈ ట్యాంకు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3.20లక్షలు మంజూరుచేయగా, అందులో కాంట్రాక్టర్ కక్కుర్తిపడి కేవలం రూ.90 వేలల్లోనే ట్యాంకును నిర్మించినట్లు స్థానికులు చెప్పారు. వారం రోజుల క్రితం నిర్మించిన ట్యాంకు నీళ్లు నింపకుండానే కూలిపోయిందని వాపోయారు. సమీక్షించిన కలెక్టర్ శనివారం జిల్లాకేంద్రంలో జరుగుతున్న విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ యాపల్‌దిన్నె ఘటనను ప్రస్తావిస్తూ మృతుల్లో జిల్లావాసులు ఉన్నందున సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి బృందాన్ని పంపించాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శినిని కోరారు. స్పందించిన ఆమె అప్పటికే గద్వాల ఆర్డీఓ అబ్దుల్హామీద్ను సంఘటనస్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఆయన రాయిచూర్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాలను వారి స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేశారు. అలాగే గట్టు మండల కోఆప్షన్ సభ్యుడు మన్నెసాబ్, ఎస్ఎంసీ చైర్మన్ తిమ్మయ్య, టీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి యాపల్దిన్నెకు వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొన్నారు. -
పాఠాలు నేర్వలే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల ధరలు ఆకాశన్నంటుతుండడం.. శివార్లలో వలసలు పెరిగిపోవడంతో ఆక్రమణకు గురవుతున్న సర్కారు స్థలాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం 2008లో 166 జీఓను జారీ చేసింది. చాలా ఏళ్ల తర్వాత క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించడంతో 90,677 దరఖాస్తులొచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు 79,549 దరఖాస్తులు తిరస్కరించగా, 7,683 దరఖాస్తులకు మాత్రమే జిల్లాస్థాయి కమిటీ ఆమోదముద్ర వేసింది. 80 గజాలవే ఎక్కువ.. క్రమబద్ధీకరించిన వాటిలో అధికం 80 చదరపు గజాల్లోపు స్థలాలే. ఈ కేటగిరీలో 32,927 దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చిన జిల్లాస్థాయి కమిటీ 3,811 అర్జీలను ఓకే చే యడం ద్వారా 53.05 ఎకరాలను క్రమబద్ధీకరించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఉచితంగా ఇళ్లపట్టాలివ్వాలని నిర్ణయించడంతో ఖజానాకు నయాపైసా సమకూరలేదు. ఇక 81-250 గజాలకు సంబంధించి 3,872 దరఖాస్తులకు ఆమోదముద్ర వేసిన యంత్రాంగం 110.12 ఎకరాలకు యాజమాన్య హక్కులు కల్పించింది. 251 నుంచి 500 చ.గజాల వరకు వచ్చినవాటిలో 1,064 దరఖాస్తులకు సీసీఎల్ఏ మోక్షం కలిగించింది. తద్వారా 72.18 ఎకరాలను క్రమబద్ధీకరించింది. ఆపై విస్తీర్ణం కలిగిన చాలావాటిని ప్రభుత్వం తిరస్కరించగా, 351 దరఖాస్తులు ఇప్పటికీ పరిశీలనలో ఉన్నాయి. లోపాల పుట్ట! కమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన 58,59 జీఓలు తప్పుల తడకగా ఉన్నాయి. మరి ముఖ్యంగా కనీస ధరల వర్తింపులో మార్కెట్ ధరలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా 2014 బేసిక్ వాల్యూ మేరకు స్థలాలను క్రమబద్ధీకరించాలనే నిర్ణయం దరఖాస్తుదారులకు ఆశనిపాతంగా పరిణమించింది. శివార్లలో ఇప్పటికే కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్లో కంటే రిజిస్ట్రేషన్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు మాదాపూర్ ప్రాంతంలో ప్రస్తుతం కనీస ధర రూ.20వేలు పలుకుతుండగా, ఈ విలువను చెల్లించి స్థలాలను క్రమబద్ధీకరించాలనడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నవారికీ, ఇటీవల ఆక్రమించిన వారిని ఒకే గాటిన కట్టడాన్ని అధికారవర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణలోనూ ప్రభుత్వం మెలిక పెట్టింది. నిర్మాణాలుంటేనే స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని నిబంధన విధించింది. రెండు తప్పులు చేసిన వారిపట్ల కరుణ చూపి.. తెలిసో తెలియకో స్థలం కొన్నపాపానికి తమను శిక్షించడమేమిటనే వాదన వినిపిస్తోంది. సేల్‌డీడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నప్పటికీ, నిర్మాణం లేదనే సాకుతో తమను విస్మరించడంపై అభ్యంతరం చెబుతున్నారు. క్రమబద్ధీకరించే స్థలంపై పరిమితి విధించకపోవడంతో భారీ విస్తీర్ణంలోని సినిమా థియేటర్లు, ఫంక్షన్‌హాళ్లు కూడా ఈ ముసుగులో రెగ్యులరైజ్ అవుతాయనే ప్రచారమూ జరుగుతోంది. క్రమబద్ధీకరణ అధికారం ఆర్డీఓలకు కట్టబెట్టడాన్ని రెవెన్యూ వర్గాలే వ్యతిరేకిస్తున్నాయి. గతంలో 80 గజాల్లోపు జాగాల క్రమబద్ధీకరణలో నామమాత్రపు ఫీజును వసూలు చేయడం ద్వారా స్థలంపై హక్కులను కల్పించారు. తాజాగా స్థల విస్తీర్ణం పెంచినప్పటికీ, స్థలంపై యాజమాన్య హక్కులు లేకపోవడం పేదలను నిరాశపరుస్తోంది. -166 జీఓ కింద పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, యూఎల్సీ కింద దరఖాస్తు చేసుకున్నవాటికీ, ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించినవారికీ ఇప్పటి ధరల తరుగుదలను వర్తింపజేస్తారా? లేదా అనే అంశంపై స్పష్టీకరించలేదు. -
ఎమ్మెన్నెస్ నుంచి తగ్గని వలసలు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ నుంచి వలసల పరంపర కొనసాగతూనే ఉంది. ఈ పార్టీకి అనుబంధంగా ఉన్న ముంబై వర్సిటీలోని విద్యార్థి సేనలో అసంతృప్తులు ఎక్కువయ్యారు. అంతర్గత కలహాలు, లుకలుకలు మొదలయ్యాయి. దీంతో విద్యార్థి సేనలో చీలికలు, పార్టీ ఫిరాయింపులు ఖాయమని స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎమ్మెన్నెస్‌లో ఫిరాయింపులు మొదలయ్యాయి. వాటిని నివారించేందుకు పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టినా కొన్ని రోజుల తర్వాత దాన్ని నిలిపివేశారు. కాగా, ఇప్పటికే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పార్టీని విడిచిపెట్టారు. త్వరలో మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాజాగా ముంబై వర్సిటీకి చెందిన విద్యార్థి సేన నాయకులు సైతం వలస బాట పట్టినట్లు తెలుస్తోంది. తమను విశ్వాసంలోకి తీసుకోకుండానే రాజ్ ఠాక్రే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్థి సేన నాయకులు అంటున్నారు. యూనివర్సిటికీ కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యర్థులను ఓడించేందుకు ఎత్తుగడలు, వ్యూహాత్మకంగా పావులు కదడం లాంటి విషయాలపై రాజ్ ఠాక్రే ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, ఏ విషయంలోనూ తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఇలా అన్ని విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలూ విడిచిపెట్టి పోతుంటే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయే అవకాశముందని పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన చెందుతున్నారు.