2 లక్షల ఏళ్ల క్రితమే యూరప్‌కు మానవులు | Human Migration From Africa To Europe | Sakshi
Sakshi News home page

2 లక్షల ఏళ్ల క్రితమే యూరప్‌కు మానవులు

Published Thu, Jul 11 2019 2:49 PM | Last Updated on Thu, Jul 11 2019 4:41 PM

Human Migration From Africa To Europe - Sakshi

న్యూఢిల్లీ : ఆధునిక మానవులు (నాగరికత నేర్చుకున్న) ఆఫ్రికా నుంచే యూరప్‌కు వలస వచ్చారని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. రొమానియాలోని ఓ గుహలో దొరికిన 1,50,000 ఏళ్ల నాటి ఆధునిక మానవుడి పుర్రె ఆధారంగా 1,70,000 ఏళ్ల క్రితమే ఆఫ్రికా నుంచి మానవులు యూరప్‌కు వలసవచ్చారని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ రెండు లక్షల ఏళ్ల క్రితమే మానవులు ఆఫ్రికా నుంచి యూరప్‌కు వలసవచ్చారని గ్రీసులోని ఓ గుహలో దొరికిన ఆధునిక ఆది మానవుడి పుర్రె ఆధారంగా శాస్త్రవేత్తలు కొత్త అభిప్రాయానికి వచ్చారు. తాజాగా దొరికిన పుర్రె 2,10,000 ఏళ్ల నాటిదని ఎపిడిమా 2 ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు.

ఎపిడిమా 1, ఎపిడిమా 2 అనే రెండు విధాల సీటీ స్కాన్‌ ద్వారా పుర్రెల కాలాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. ఆఫ్రికా నుంచి ఆగ్నేయ యూరప్‌ గుండా మానవులు వలస వచ్చారని, వారంతా ఒకేసారి ఓ వెల్లువలా కాకుండా అప్పుడప్పుడు గుంపులు, గుంపులుగా వచ్చి ఉంటారని ఈ పుర్రెపై అధ్యయనం జరిపిన బ్రిటన్‌లోని మ్యాన్‌చెస్టర్‌ యూనివర్శిటీ, జర్మనీలోని టూబింగన్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. యూరప్‌కు వలస రాకముందు ఆదిమానవులు (నియాండర్‌తల్స్‌) ఐదు లక్షల సంవత్సరాలకు ముందే ఆఫ్రికాలో నివసించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
ఆధునిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 5.50 కోట్ల సంవత్సరాల క్రితమే ఆదిమానవుడికి ప్రాథమిక కోతి రూపమైన ‘గిమాన్‌’లు ఉండేవి. 1.50 కోట్ల సంవత్సరాల నాటికి గిమాన్‌ నుంచి హోమినిడాగా పిలిచే తోకలేని నల్ల కోతులు వచ్చాయి. వాటిన ఉంచి 70 లక్షల ఏళ్ల క్రితం గెరిల్లా కోతులు వచ్చాయి, 55 లక్షల ఏళ్ల క్రితం గెరిల్లాలకు కాస్త మానవ రూపం వచ్చింది. 40 లక్షల సంవత్సరాల క్రితం ఆ గెరిల్లాకు మరికాస్త మానవ రూపం వచ్చింది.

ఇక 39 లక్షల ఏళ్ల నుంచి 29 లక్షల ఏళ్ల మధ్య ఆస్ట్రోలోపితికస్‌ జాతి మానవులు, 27 లక్షల ఏళ్ల క్రితం పరంత్రోప్‌ ఆది మానవులు నివసించారు. 26 లక్షల ఏళ్ల క్రితం గొడ్డలి ఆయుధాన్ని ఆది  మానవుడు కనుగొన్నారు. పద్దెనిమిది లక్షల ఏళ్ల క్రితం మానవుడికి ఆధునిక చేయి వచ్చింది. ఎనిమిది లక్షల ఏళ్ల క్రితం ఆది మానవుడి మెదడు పరిణామం పెరిగింది. నిప్పును నియంత్రించడం, మట్టి పాత్రలు తయారు చేయడం నేర్చుకున్నారు. మూడు లక్షల నుంచి రెండు లక్షల మధ్య ఆఫ్రికా నుంచి మానవులు యూరప్‌కు వలస వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement