Skull
-
బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!
బ్రెయిన్ సర్జరీ కోసం వెళ్లి పుర్రెలో కొంత భాగాన్ని కోల్పోయాడు. పోనీ అక్కడితో అతడి కష్టాలు ఆగలేదు. చివరికి వైద్యులు అతడికి సింథటిక్ ఎముకను అమర్చి సర్జరీ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వకపోగా ఇన్ఫెక్షన్ సోకి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆస్పత్రి బిల్లులు కూడా తడసి మోపడయ్యాయి. వైద్యులు తప్పిదం వల్లే నాకి పరిస్థితి అని సదరు ఆస్పత్రిపై దావా వేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళ్లలేక సెప్టెంబర్ 2022లో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించాడు. దీని కారణంగా బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. ఆ సమయంలో వైద్యులు ఒత్తడిని తగ్గించేందుకు 4.7 బై-6-అంగుళాల పుర్రె ముక్కని తొలగించాలని నిర్ణయించారు. పుర్రె భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలిగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా..అక్కడ ఇతర రోగుల పుర్రె భాగాలు కూడా ఉండటంతో అందులో అతడిది ఏదో గుర్తించడంలో విఫలమయ్యారు వైద్యులు. దీంతో ఆస్పత్రి అతడికి సింథటిక్ పుర్రె భాగాన్ని కృత్రిమంగా తయారు చేసి ప్రత్యామ్నాయంగా అమర్చింది. ఇలా సింథటిక్ ఎముక కోసం సదరు రోగి నుంచి ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేసింది. అయితే ఇలా రోగికి సింథటిక్ ఎముకను పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ బారిని పడి అదనంగా మరికొన్ని సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పాలంటే సదరు రోగికి బ్రెయిన్ సర్జరీ శారీరకంగా, ఆర్థికంగా భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఈ సమస్య నుంచి బయటపడేటప్పటికీ అతడికి ఆస్పత్రి బిల్లు ఏకంగా కోటి రూపాయల పైనే ఖర్చు అయ్యింది. వైద్యుల తప్పిదం కారణంగా జరిగిన నష్టాన్ని కూడా తనపైనే రుద్ది మరీ డబ్బులు వసూలు చేశారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను శరీరంలో కొంత భాగాన్ని కోల్పోవడమే గాక, ఆర్థికంగా శారీకంగా ఇబ్బందులు పడేలా చేసినందుకు గానూ సదరు ఆస్పత్రి తనకు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ దావా వేశాడు.(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
175 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించారు!
అనుకోని ప్రమాదంలో చిద్రమైన ఓ వ్యక్తి ముఖాన్ని పునర్నిర్నించారు శాస్త్రవేత్తలు. ఏకంగా 28 గ్రాములు రాడ్ ఎడమ చెంపలోంచి తలలోకి దూసుకుపోయింది. సరిగ్గా 175 ఏళ్ల క్రితం ఓ దారుణ ప్రమాదంలో ముఖం చిద్రం అయిన వ్యక్తి ముఖాన్ని త్రీ డీ సాంకేతికతో పునర్నిర్మించారు శాస్త్రవేత్తలు. దీంతో వైద్య విధానంలో సరికొత్త విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన ఫినియాస్ గేజ్ అనే రైల్రోడ్ కార్మికుడు సెప్టెంబర్ 13, 1848లో విచిత్రమైన ప్రమాదానికి గురయ్యాడు. అతను అమెరికాలోని వెర్మోంట్లో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం కొన్ని రాళ్లను పేల్చివేయడానికి సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం బారినపడ్డాడు. అతను వదిలేసిన ఇనుపరాడ్ గన్పౌడర్కి తగిలి ఎగొరొచ్చి నేరుగా అతని ఎడమ చెంపలోకి దూసుకుపోయింది. సుమారు 3.18 సెంటీమీటర్ల వ్యాసం, 1.09 మీటర పొడవుతో సుమారు ఆరు కిలోగ్రాముల ఉన్న రాడ్ అతని బ్రెయిన్లో దూసుకోపోయింది. వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి తరలించి గేజ్ పుర్రెలోకి దిగిన రాడ్‌ని వైద్యుడు తొలగించి కుట్టు వేశారు. అయితే ఆ ప్రమాదం అతని ముఖాన్ని భయానకంగా మార్చింది. అదిగాక ఈ ప్రమాదం తర్వాత అతని యాక్టివిటీలో మార్పు వచ్చింది. చెప్పాలంటే ఓ చిన్న పిల్లవాడి మాదిరిలా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు. అలా అతను యాక్సిడెంట్ తర్వాత సుమారు 12 ఏళ్ల ఆరు నెలల ఎనిమిది రోజుల వరకు బతికాడు. సరిగ్గా మే 21, 1861న తుది శ్వాస విడిచాడు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని యథావిధిగా పునర్నిర్మించడంపై పరిశోధకులు రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఫోరెన్సిక్ నిపుణుడు సిసెరో మోరేస్ అతడి ముఖాన్ని త్రీడీ టెక్నాలజీతో పునర్నించాడు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ని యూట్యూబ్‌లో షేర్ చేశాడు. వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా సాంకేతికతను జోడించి ఇలాంటి ప్రమాదాల బారిన పడిన రోగులకు ఉపయుక్తంగా ఉండేలా సరికొత్త చికిత్స పద్ధతులను అభివృద్ధి పరిచారు. రోడ్డుప్రమాదాలు లేదా ఇతరత్ర ప్రమాదాల్లో ముఖం చిద్రమైన వాళ్లకి ఈ సాంకేతికతో కూడిన వైద్యం ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు గేజ్ ప్రమాద సమయంలో ఎలా ఉన్నాడు? ఎలా ఆ రాడ్‌ని తొలగించి పునర్నిర్మించొచ్చు వంటి వాటిని ఓ వీడియోలో విజ్యువల్స్ రూపంలో వెల్లడించారు. (చదవండి: 'బిగ్ విన్'! ఒక్క వీడియో..ప్రముఖ ఫుడ్ కంపెనీని షేక్ చేసింది! చరిత్రలో తొలిసారి..) -
Hong Kong Model Case: సూప్ కుండలో ఆమె తల..కంగుతిన్న పోలీసులు
ప్రముఖ హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తును చేస్తున్న హాంకాంగ్ పోలీసులు ఆమె ఛిద్రమైన శరీర భాగాలను నగర శివార్లలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో గుర్తించగా.. తల, మొండెం కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు ఓ కుండలోని సూప్ చూసి కంగుతిన్నారు. నిండుగా ఉన్న సూప్‌ని నిశితంగా గమనించి దగ్గరకు వెళ్లితే గాని తెలియలేదు అందులో మోడల్ తల భాగం ఉందన్న విషయం. తొలుత ఆ కుండలో క్యారట్, ముల్లంగి వంటి వాటితో సూప్ మాదిరి చక్కగా ఆకర్షణీయంగా ఉండటంతో సూప్ అనే అనుకున్నారు. ఐతే అందులో ఆ మోడల్ తల భాగాం పుర్రె మాదిరిగా చూసి.. షాక్ గురైనట్లు తెలిపారు. ముఖం మీద చర్మం, మాంసం భాగాలు ఆ సూప్‌లోనే అవశేషాలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జుట్టుతో సహా చోయి పుర్రె ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి కారులో ఉండగానే ఆమెపై దాడి చేసి ఇంటికి తీసుకువెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మోడల్ పుర్రె వెనుక ఉన్న రంధ్రాన్ని బట్టి ఆమెపై ప్రాణాంతక దాడి జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పోలీసుల దర్యాప్తులో.. చోయి మాజీ భర్త, అతని కుటుంబానికి సంబంధించి పది మిలియన్ల డాలర్లతో కూడిని విలాసవంతమైన ఆస్తుల విషయమై వివాదాలు ఉన్నట్లు తేలింది. చోయి అదృశ్యం కావడానికి ముందు రోజే చోయి భర్త అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ, సోదరుడు ఆంథోనీ క్వాంగ్, అత్తగారు జెన్నీ లీ కోర్టుకు హాజరుకాగా, వారికి బెయిల్ లభించలేదు. పైగా కోర్టు విచారణను మే 8కి వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ దారుణ హత్యకు ఆ నలుగురి పాత్ర ఉండవచ్చన్న అనుమానంతో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, అబ్బి చోయి హాంకాంగ్‌లో ప్రసిద్ధ మోడల్ మాత్రమేగాదు, పారిస్ ఫ్యాషన్ వీక్‌లో రెగ్యులర్‌గా పాల్గొంటోంది. ఆమె ఫిబ్రవరి19న చివరిసారిగా ఫ్యాషన్ మ్యాగజైన్ ఎల్ ఆఫీయల్ మోనాక్తో కలిసి ఒక ఫోటోషూట్ చేసినట్లు సమాచారం. (చదవండి: మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్‌లో కాళ్లను దాచి..) -
శ్రద్ధ వాకర్ హత్య కేసు.. పుర్రె, దవడ స్వాధీనం చేసుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ హత్యకు గురైన శ్రద్ధ వాకర్ శరీర భాగాల కోసం పోలీసులు మెహ్రౌలీ అడవిలో ఆదివారం వెతికారు. పుర్రె, దవడ భాగాలతో పాటు మరికొన్ని ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి శ్రద్ధవో కావో నిర్ధరించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మిగతా శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. అలాగే మైదాన్‌గడీ కొలనులో నీటి స్థాయి తగ్గడంతో గజ ఈతగాళ్లతో అందులో వెతికించారు పోలీసులు. శ్రద్ధ శరీర భాగాలు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రయత్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్ధవో కావో నిర్ధరించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా డీఎన్ఏ పరీక్ష కోసం ఆమె తండ్రి, తల్లి నుంచి రక్తనమూనాలు సేకరించారు. వీటి ఫలితాలు రావడానికి 15 రోజులు పడుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు శ్రద్ధవో కావో కచ్చితంగా చెప్పవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్‌ఫ్రెండ్ ఈ హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధ ఫొటోలను కూడా కాల్చివేసినట్లు పేర్కొన్నారు. మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ మెహ్రౌలీలో ఆరు నెలల క్రితం జరిగిన హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అఫ్తాబే తన ప్రేయసిని చంపేసి శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. అనంతరం వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఆ తర్వాత వాటిని అడవితో పాటు ఇతర ప్రదేశాల్లో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా 20 రోజుల పాటు శరీర భాగాలను పడేశాడు. చదవండి: నైట్ క్లబ్లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు.. -
అత్యంత అరుదైన పుర్రె.. వేలంలో ఏకంగా రూ. 162 కోట్లు
వేల సంవత్సరాల క్రితం డైనోసర్ అనే పెద్ద రాక్షస బల్లులు ఉండేవి అని కథలు కథలుగా విన్నాం. టెరన్నోసారస్ రెక్స్ అనే మరో డైనోసర్ జాతి గురించి మనం ఇంతవరకు వినలేదు కదా!. ఇది డైనోసర్‌లో అతి పెద్ధ సరీసృపం. వీటిని టీ రెక్స్‌గా వ్యవహరిస్తారు కూడా. ఇవి ఒకప్పుడూ ఉత్తర అమెరికాలో ఉండేవట. ఐతే వీటీని టెరన్నోసారస్ రెక్స్ అని ఎందుకంటారంటే..లాటిన్లో టీ రెక్స్ అంటే రాజు అని అర్థం. అతిపెద్ద థెరోపాడ్ డైనోసార్ జాతి కాబట్టి దీనిని ఆ పేరుతో వ్యవహరించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ టీ రెక్స్ పుర్రె ఒకటి తవ్వకాల్లో లభించింది. దీన్ని వేలం వేస్తే దాదాపు రూ. 162 కోట్లు వరకు పలుకుతుందంటున్నారు. వివరాల్లోకెళ్తే.....యూఎస్‌లోని దక్షిణ డకోటాలో టీ రెక్స్ డైనోసర్ పుర్రెని కనుగొన్నారు పరిశోధకలు. ఇదోక విలక్షణమైన పుర్రె అని చెబుతున్నారు. ఎలాంటి రసాయనాలతో దీన్ని సురక్షితంగా ఉంచకపోయినప్పటికీ ఇప్పటికీ ఈ శిలాజం చెక్కు చెదరకుండా ఉండటంతో పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వెలికితీసిన పుర్రె ఆకారం ఉపరితలం చాలా వరకు పాడవ్వవకుండా ఉండేటేమే కాక, అతి సున్నితమైన ఎముకలు సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. ఈ పుర్రె సుమారు 6 నుంచి 7 అడుగులతో దాదాపు 200 పౌండ్లపైన బరువు ఉండచ్చని చెబుతున్నారు. ఇది సుమారు 76 మిలియన్ల ఏళ్ల పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ టైరన్నోసారస్ తన జాతిలో మరో టైరన్నోసారస్‌తో తలపడి ఉండవచ్చని, అందువల్లే దాని పుర్రెలో రెండు పంక్చర్లు కనిపిస్తున్నాయని అన్నారు. ఇలాంటి జీవి పుర్రె తవ్వకాల్లో లభించడం అత్యంత అరుదని చెబుతున్నారు. ఐతే ఈ జీవి పుర్రె చెక్కు చెదరలేదుగానీ అస్తిపంజరం చాలావరకు కోతకు గురైందని అన్నారు. ఈ పుర్రెని మాక్సిమస్‌గా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది వేలంలో సుమారు రూ.122 కోట్లు నుంచి రూ.162 కోట్లు వరకు పలుకుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. (చదవండి: మహా సిగ్గరి కోసం అలుపెరగని ప్రయాణం.. చివరికి ఇలా ‘అద్భుతంగా’ చిక్కింది!) -
మితిమీరిన వర్క్ అవుట్...దెబ్బకు పుర్రెలో సగభాగం ఔట్!
‘అతి సర్వత్ర వర్జయేత్’ .. (ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు)అని పెద్దలు ఊరకనే అనలేదు. ఏదైన మన శరీరం తట్టుకోలేనంతగా అధికంగా ఏ పని చేసినా అది ప్రమాదమే . అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ చాలామంది అత్యుత్సహంతోనో లేక మరే ఇతర కారణాల వల్ల కొన్ని పనులు అతిగా చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన నిర్లక్యమో లేక అతని పై అధికారి నిర్లక్ష్యం కారణంగానో తెలియదు గానీ అతిగా ఆడి పెద్ద ప్రమాదాన్నే కొనితెచ్చుకున్నాడు. వివరాల్లోకెళ్లితే...యూకేలోని రీడింగ్ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల మైక్బ్రోకీ ఏప్రిల్ 2019లో కంపెనీ వార్షిక ఈవెంట్లో భాగంగా పబ్ గోల్ఫ్ గేమ్‌ని ఆడాడు. ఐతే విరామం తీసుకోకుండా గోల్ఫ్ గేమ్ అదేపనిగా ఆడాడు. దీంతో అతను కింద పడిపోయాడు. ఇక అప్పటి నుంచి బ్రోకీ కొన్నాళ్లపాటు కోమాలోనే గడిపాడు. అంతేకాదు అతను పుర్రెలో సగ భాగాన్ని కూడా తొలగించారు వైద్యులు. కోలుకోవడానికి అతనికి దాదాపు ఆరునెలలు పట్టింది. దీంతో అతను తనకు జరిగినదానికి పరిహారంగా పీడబ్ల్యూసీ కంపెనీ యజమాని సుమారు రూ.1.87 కోట్లు ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కాడు. తన మేనేజర్ సైమెన్ ఫ్రాడ్గలీ తన సహోద్యోగుల భద్రతను పట్టించుకోలేదంటూ ఆరోపణలు చేశాడు. బ్రోకీ పిటిషన్లో పబ్ గోల్ఫ్ ఈవెంట్లో తీవ్రంగా గాయపడటం అనేది ఊహజనితమైన విషయంగా ఉంటుందని పేర్కొన్నాడు. తన తలకు అయిన తీవ్ర గాయం కారణంగా ఇప్పటికి కొన్నింటిని గుర్తించుకోలేకపోతున్నానని వాపోయాడు. ఐతే లండన్ హైకోర్టు పీడబ్ల్యూసీ కంపెనీ తన మేనేజర్ నిర్లక్ష్యానికి భాద్యత వహించాలని స్పష్టం చేసింది. అలాగే కంపెనీలో ఏడేళ్లుగా కొనసాగతున్న వార్షిక ఈవెంట్‌ని కూడా నిలిపివేసింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. భాద్యతయుతమైన యజమానిగా ఉద్యోగుల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటాం గానీ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడూ కాస్త బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఇంకా నడుస్తోంది. (చదవండి: యువతి హల్చల్.. ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్‌పై దాడి!) -
5 నెలల చిన్నారికి నిమ్స్‌లో అరుదైన చికిత్స
లక్డీకాపూల్: నిమ్స్ మరో అరుదైన చికిత్స చేసి తన ప్రత్యేకతను చాటుకున్నది. 5నెలల చిన్నారి కపాళ సమస్యను నిమ్స్ వైద్యులు పరిష్కరించారు. కాకినాడకు చెందిన ఓ చిన్నారికి కపాళంలో ఎముకలు అతుక్కుపోయాయి. కపాళంలోని ఎముకలు కొంత వయస్సు వచ్చిన తర్వాత కర్సుకుపోవడం సర్వసాధారణం. కానీ, పుట్టుకతోనే రావడంతో ఆ చిన్నారి ముఖం సహజ రూపురేఖలను కోల్పోయింది. దీంతో పాప తల్లిదండ్రులు నిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యులను ఆశ్రయించారు. ఆ విభాగం అధిపతి డాక్టర్ ఎర్రం నేని వంశీకృష్ణ ప్రాథమిక వైద్యపరీక్షల ద్వారా ఆపరేషన్ అవసరాన్ని గుర్తించి, ముక్కు ద్వారా సమస్యను చక్కదిద్దారు. ఎండోస్కోపీ విధానంలో కపాళం ఎముకలో కొంత మేర తొలగించి రెండు ఎముకలను సరిచేశారు. ఈ శస్త్రచికిత్సతో చిన్నారి ముఖం మామూలుస్థితికి వచ్చిందని, ఆపరేషన్ విజయవంతం కావడంతో చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని డాక్టర్ వంశీ తెలిపారు. -
టీమిండియా మాజీ కెప్టెన్ తలలో మెటల్ ప్లేట్.. 60 ఏళ్ల తర్వాత తొలగింపు!
నారీ కాంట్రాక్టర్.. ఈ పేరు ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదు. కాలంలో కొంచెం వెనక్కి వెళితే మాత్రం నారీ కాంట్రాక్టర్ పేరు సుపరిచితమే. 1950-60ల మధ్య కాలంలో టీమిండియా క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అంతేకాదు నారీ కాంట్రాక్టర్ టీమిండియాకు కెప్టెన్‌గానూ పని చేయడం విశేషం. ఇదంతా సరే.. ఇప్పుడెందుకు ఈ క్రికెటర్ ప్రస్తావన అనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. బౌన్సర్ దాటికి నారీ కాంట్రాక్టర్ తలకు దెబ్బ తగలడంతో క్రికెట్ కెరీర్ అర్థంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత అతని తలలో ఒక మెటల్ ప్లేట్ అమర్చారు. ఇదంతా 1962 నాటి మాట.. కట్‌చేస్తే 60 ఏళ్ల తర్వాత వైద్యులు నారీ కాంట్రాక్టర్ తలలో నుంచి మెటల్ ప్లేట్‌ను విజయవంతగా తొలగించారు. ప్రస్తుతం నారీ కాంట్రాక్టర్ వయసు 80 ఏళ్లు. మెటల్ ప్లేట్ తొలగింపు తర్వాత ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు నారీ కాంట్రాక్టర్ కుమారుడు హెషెడర్ పేర్కొన్నాడు. అసలేం జరిగింది..? 1962లో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించింది. ఆ పర్యటనే నారీ కాంట్రాక్టర్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుంతుందని బహుశా ఊహించి ఉండడు. విండీస్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు బౌలర్ వేసిన బౌన్సర్ నారీ కాంట్రాక్టర్ తలకు బలంగా తగిలింది. దీంతో క్రీజులోనే నారీ కాంట్రాక్టర్ కుప్పకూలాడు. అప్పటికప్పుడు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఆ తర్వాత భారతదేశానికి పంపించారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ చండీ ఆధ్వర్యంలో నారీ కాంట్రాక్టర్ తలకు తగిలిన దెబ్బను పరిశీలించి మెటల్ ప్లేట్‌ను అమర్చారు. అప్పటినుంచి బాగానే ఉన్నప్పటికి ఇటీవలే స్కానింగ్ చేయగా.. మెటల్ ప్లేట్ వల్ల చర్మం ఉడిపోతూ వచ్చింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆపరేషన్ నిర్వహించి తలలోని మెటల్ ప్లేట్‌ను తొలగించారు. కాగా నారీ కాంట్రాక్టర్ తలకు దెబ్బ తగలడానికి ముందే ఔటయ్యే అవకాశం వచ్చింది. నారీ ఇచ్చిన క్యాచ్ విండీస్ ఫీల్డర్ జారవిడవడంతో.. బౌన్సర్ ఆడి శాశ్వతంగా క్రికెట్‌కు దూరమయ్యాడు నారీ కాంట్రాక్టర్. టీమిండియా తరపున 1955-62 మధ్య కాలంలో 31 టెస్టుల్లో 1611 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1955-62 మధ్య కొంతకాలం టీమిండియా కెప్టెన్‌గానూ పని చేశాడు. చదవండి: Deepak Hooda-Krunal Pandya: 'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి'.. కట్‌చేస్తే మ్యాచ్ గెలిచిన సంతోషం ముద్దుతో ఉక్కిరిబిక్కిరి; ట్విస్ట్ ఏంటంటే -
ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!
2,000-year-old skull of a Peruvian warrior fused together by metal: మన సైన్స్ చాలా అత్యధునికంగా అభివృధి చెందింది అని చెబుతుంటాం. పైగా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని చూసి మనకు మనమే మురిసిపోతాం. కానీ ఎలాంటి కనీస సదుపాయలు అందుబాటులో లేని పురాతన కాలంలోనే మన పూర్వీకులు అత్యధునిక టెక్నాజీని ఉపయోగించారు అనడానికి ఎన్నో విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అసలు విషయంలోకెళ్తే... 2,000 సంవత్సరాల నాటి పెరువియన్ యోధుడి పుర్రె లోహంతో కలిసి ఉంది. యూఎస్ మ్యూజియంలో ఉన్న ఈ పుర్రెని నాటి అధునాతన శస్త్రచికిత్సకు ఇది ఒక ఉదాహరణ చెబుతారు. ఆ పుర్రె యుద్ధంలో గాయపడిన పెరువియన్‌ది. పైగా ఆ వ్యక్తికి తలకు పెద్ద గాయం అయ్యిందని, అందువల్ల తలలోని ఎముకలను జాయింట్ చేయడానికి ఒక లోహపు (ఐరన్ ప్లేట్) ముక్కును ఉపయోగించి శస్త్ర చికిత్స చేశారని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు ఆ శస్త్ర చికిత్స చేయడం వల్లే ఆ మనిషి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. అయితే ఆ సమయంలో అనస్థీషియా ఇచ్చారో లేదో అనేది కచ్చితంగా చెప్పలేం అని అన్నారు. పురాతన కాలంలోనే అధునాతన శస్త్రచికిత్సలు చేయగల నైపుణ్యం కలిగి ఉన్నారని చెప్పడానికి ఈ పుర్రె ఇప్పుడు కీలకమైన సాక్ష్యంగా పేర్కొనవచ్చు అని ఆస్టియాలజీ మ్యూజియం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ శస్త్ర చికిత్సను ట్రెఫినేషన్ అని పిలుస్తారని, పైగా లోహాన్ని కరిగించి పోయేలేదని కూడా సోషల్ మీడియాలో పేర్కొంది. (చదవండి: రైలు రావడం చూసి మరీ ఆమెను పట్టాలపై తోసేశాడు.. ఆపై ఏం జరిగిందో చూడండి) -
పుర్రెల పండుగ
-
ఆస్పత్రిలో పుర్రె, ఎముకలు.. పాల్వంచలో కలకలం
సాక్షి, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో మనిషి అవశేషాలున్న డబ్బా సోమవారం కలకలం సృష్టించింది. అందులో పుర్రె, చేతి ఎముక, పళ్లు ఉన్నాయి. ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం.. పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో దుర్వాసన వస్తుండటంతో.. సిబ్బంది పరిశీలించి జనరేటర్ ఉండే ఎలక్ట్రికల్ గది నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ గదిలో మూలకు నీలం రంగు లుంగీతో కట్టిన మూట కనిపించింది. శానిటేషన్ సూపర్వైజర్ దుర్గా, వార్డు బాయ్ ఎన్సీపీ.బాబు దాన్ని విప్పి పరిశీలించగా.. అందులో బాక్స్ ఉంది. తెరిచి చూడగా.. ప్లాస్టిక్ డబ్బా, ప్లాస్టిక్ కవర్ కనిపించాయి. ప్లాస్టిక్ డబ్బాలో మనిషి మొండెం నుంచి వేరు చేసిన పుర్రె, చేతి ఎముక ఉన్నాయి. కవర్లో కళ్లు, పళ్లు ఉన్నాయి. నాలుగైదు రోజుల క్రితం మృతి చెందిన శవం అవశేషాలుగా సిబ్బంది భావిస్తున్నారు. ఈ అవశేషాల మూటను మార్చురీ గదికి తరలించారు. పోలీసులు ఆస్పత్రి సిబ్బంది సహకారంతో సీసీ పుటేజీలో నాలుగైదు రోజులుగా ఆస్పత్రికి రాకపోకలు సాగించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ ఘటనపై సిబ్బంది మాట్లాడుతూ వాటిని పోస్ట్‌మార్టం కోసం తెచ్చామని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం సిబ్బంది మాత్రం అటువంటిదేమీ లేదని పై అధికారులకు తెలిపినట్లు సమాచారం. సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావును వివరణ కోరగా.. తాను మీటింగ్ ఉండటం వల్ల ఆస్పత్రిలో లేనని, వివరాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని సిబ్బంది పరిశీలించారని, ఫిర్యాదు ఇస్తే దర్యాప్తు చేస్తామని ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. -
శత్రువులకు హెచ్చరిక.. 600 పుర్రెలతో గోడ
మెక్సికో సిటీ: సాధారణంగా రాతి గోడలు, ఇటుక గోడలు.. చివరకు కర్ర, సీసలతో నిర్మించిన గోడల గురించి విన్నాం.. చూశాం. కానీ పుర్రెలతో నిర్మించిన గోడ గురించి ఎప్పుడైనా విన్నారా... లేదు కదా. అయితే ఇది చదవండి. మెక్సికోలో 15వ శతాబ్దానికి చెందిన ఓ పురాతన గోడ బయటపడింది. దాన్ని చూసి పురాతత్వ శాస్త్రవేత్తలు షాకయ్యారు. ఎందుకుంటే ఈ గోడలో వరుసగా పుర్రెలు ఉన్నాయి. వీటిలో ఆడ, మగతో పాటు చిన్నారుల పుర్రెలను కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. దేవతా పూజ సందర్భంగా వీరందరిని బలి ఇచ్చి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. ఇక వీరిలో ఎక్కువ మంది శత్రు సైనికులు అయి ఉంటారని అంచనా వేస్తున్నారు. తల నిర్మాణం, పళ్ల సైజు ఆధారంగా ఈ పుర్రెల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ గోడ 2017లోనే బయటపడిందని.. గతంలో కొన్ని పుర్రెలని గుర్తించగా.. తాజాగా మరో 114 పుర్రెలు వెలుగులోకి వచ్చినట్లు ఆర్కియాలజిస్ట్‌లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 600 వందల పుర్రెలు బయటపడ్డాయని తెలిపారు. (మిస్టరీ: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) ఇక అజ్టెక్ సామ్రాజ్యాధిపతి తన ప్రత్యర్థులకు హెచ్చరికగా ఈ గోడ నిర్మణాన్ని చేపట్టి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్పానిష్ ఆక్రమణదారులు 1521లో అజ్టెక్ సామ్రాజ్యాన్ని కూలదోశారు. ఇక గోడ నిర్మాణంలో వెలుగు చూసిన పుర్రెల్లో ఎక్కువ భాగం శత్రు సైనికులవి కాగా.. మరి కొన్ని సాధారణ ప్రజలవి అయి ఉండవచ్చని.. వీరందరిని దేవుడికి బలి ఇచ్చి ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే వీరిలో శత్రు సైనికులు ఎవరో.. సామాన్యులు ఎవరో గుర్తించడం కష్టం అంటున్నారు. ఇక ఈ గోడని 15వ శతాబ్దం చివర్లో నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఇది ఆధునిక మెక్సికో నగరంలోని చారిత్రాత్మక జిల్లా అజ్టెక్ రాజధాని టెనోచ్టిట్లాన్ ప్రధాన ఆలయాలలో ఒకటైన టెంప్లో మేయర్ ప్రాంతంలో ఉంది. ఇక ఇది దేశంలోని ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు శాస్త్రవేత్తలు. "టెంప్లో మేయర్ అడుగడుగునా, మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది" అని కల్చరల్ మినిస్టర్ అలెజాండ్రా ఫ్రాస్టో ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి) "హ్యూయి జొంపంట్లీ, ఇటీవలి సంవత్సరాలలో మన దేశంలో అత్యంత ఆకర్షణీయమైన పురావస్తు పరిశోధనలలో ఒకటి. మీసోఅమెరికాలో వెలుగు చూసిన మానవ త్యాగం విశ్వం నిరంతర ఉనికిని నిర్ధారించే మార్గంగా భావించబడింది" అని ప్రకటనలో తెలిపారు. అందువల్ల నిపుణులు ఈ టవర్‌ను "మరణం కాకుండా జీవిత భవనం" గా భావిస్తున్నట్లు వెల్లడించారు. -
శివుడంటే ఇష్టం అందుకే పుర్రెకు పూజలు..
పాతపోస్టాఫీసు (విశాఖ): స్థానిక పాతనగరం రెల్లివీధిలోని ఓ ఇంట్లో ఆదివారం ఉదయం ఓ పుర్రె ప్రత్యక్షమై స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానికులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దిగువరెల్లివీధి రాంనాథ్ హోటల్‌కు పక్క సందులో రెండు గదుల రేకుల ఇంట్లో రావులపూడి రాజు (20) అనే యువకుడు ఒంటరిగా నివసిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి రావులపూడి శ్యాం (50) అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి చెడు వ్యసనాలకు లోనై చిల్లరదొంగతనాలకు పాల్పడడంతో పాటు గంజాయి, మత్తుమందులకు అలవాటుపడి ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పదో తరగతి వరకు చదివి మధ్యలోనే ఆపేసిన కొడుకు ప్రవర్తన నచ్చకపోవడంతో తల్లి రావులపూడి యలమాజి (48) పీఎంపాలెం, వాంబేకాలనీకి వెళ్లిపోయి అక్కడ నివసిస్తోంది. రాజు అక్క కరుణకు వివాహం కావడంతో భర్తతో నగర శివార్లలో ఉంటోంది. కుటుంబ సభ్యులు లేకపోవడంతో విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ రాజు మత్తుమందుకు బానిసగా మారాడు. అతడి ప్రవర్తనకు సంబంధించి పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్టు సమాచారం. రాజు ఆదివారం ఉదయం ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పుర్రెను తాను నివాసం ఉంటున్న ఇంటి సందులో ఉంచాడు. (సైకో యువకుడు: మనిషి పుర్రెను..) నిందితుడ్ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు సందును ఆనుకుని ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉదయం 8.30 ప్రాంతంలో సందులో ఉన్న ప్లాస్టిక్ కవర్ నుంచి దుర్వాసన రావడంతో ఇంటి నుంచి వెలుపలికి వచ్చి కవర్‌ను కదలించడంతో అందులో నుంచి పుర్రె వెలుపలికి వచ్చింది. దీంతో పెద్దగా కేకలు వేయడంతో రాజు వచ్చి పుర్రెతో సహా ప్లాస్టిక్ కవర్‌ను ఇంట్లోకి తీసుకువెళ్లిపోయాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయానికి అదే ఇంట్లో ఉన్న ఓ బాలిక (మైనర్)ను పోలీసులు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. మరికొద్ది సేపటిలో ఇంటికి చేరుకున్న రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆంధ్ర వైద్య కళాశాల అనాటమీ విభాగంలో వైద్య విద్యార్థులు పరిశోధనలు జరిపిన ఓ వ్యక్తి పుర్రెగా పోలీసులు గుర్తించారు. అనాటమీ విభాగం వద్ద పరిశోధనలు పూర్తయిన శరీరాలను వేసే ప్రదేశం నుంచి దాన్ని తీసుకువచ్చినట్టు తెలుసుకున్నారు. పుర్రె ను 14 రో జుల క్రిత మే రాజు తీసుకువ చ్చి ఇంట్లో ఉంచి పూ జలు చేస్తున్నాడు. తనకు శివుడు అత్యంత ప్రీతపాత్రమైన దేవుడని, పుర్రెను పూజిస్తే మంచి జరుగుతుందని ఎవరో చెప్పడంతో ఈ విధంగా చేస్తున్నానని, పుర్రెను కాల్చుకు తినలేదని రాజు పోలీసుల విచారణలో తెలిపాడు. రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు పుర్రెను స్వాధీనం చేసుకుని, బాలికను విడిచిపెట్టారు. వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని, ఎస్ఐ శ్రీనివాస్ బృందం దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచుతామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
సైకో యువకుడు: మనిషి పుర్రెను..
-
సైకో యువకుడు: మనిషి పుర్రెను..
సాక్షి, విశాఖపట్నం : విశాఖ రెల్లివీధిలో మనిషి పుర్రె కలకలం సృష్టించింది. ఓ పాడుబడిన ఇంటి వద్ద కాల్చిన మనిషి పుర్రె వెలుగు చూడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం రెల్లి వీధిలో ఓ పాడుబడిన ఇల్లు ఉంది. ఆ ఇంటికి దగ్గరలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. పాడుబడ్డ ఇంటి వద్ద ఆదివారం వారికి అనుమానాస్పదంగా ఓ సంచి కనిపించింది. కర్ర సహాయంతో దాంట్లో ఏం ఉందో చూసే ప్రయత్నం చేయగా.. అందులో నుంచి కాల్చి ఉన్న ఓ మనిషి పుర్రె బయటపడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన వారు కేకలు వేయగా స్థానికులు గుమిగూడారు. ( లోపల మహిళ శవం.. పైన కూరగాయలు) కాగా, పాడుబడిన ఇంట్లో రావెలపూడి రాజు(20) అనే యువకుడు ఉంటున్నాడని, ప్రతి రోజు రాత్రి అక్కడికి వస్తూ ఏం చేస్తున్నాడో తెలియడం లేదని స్థానికులు భయపడుతున్నారు. సదరు యువకుడు చెడు వ్యసనాలకు బానిసై సైకోగా మారి మనిషి పుర్రెను కాల్చుకుని తింటూ ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సదరు యువకుడు అక్కడికి రాగా.. కాలనీవాసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అతడు పారిపోయాడు. ఆ అనంతరం స్థానికుల కేకలు విని పాడుబడిన ఇంట్లో నుంచి ఓ యువతి బయటకు వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే యువకుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. -
2 లక్షల ఏళ్ల క్రితమే యూరప్‌కు మానవులు
న్యూఢిల్లీ : ఆధునిక మానవులు (నాగరికత నేర్చుకున్న) ఆఫ్రికా నుంచే యూరప్‌కు వలస వచ్చారని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. రొమానియాలోని ఓ గుహలో దొరికిన 1,50,000 ఏళ్ల నాటి ఆధునిక మానవుడి పుర్రె ఆధారంగా 1,70,000 ఏళ్ల క్రితమే ఆఫ్రికా నుంచి మానవులు యూరప్‌కు వలసవచ్చారని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కానీ రెండు లక్షల ఏళ్ల క్రితమే మానవులు ఆఫ్రికా నుంచి యూరప్‌కు వలసవచ్చారని గ్రీసులోని ఓ గుహలో దొరికిన ఆధునిక ఆది మానవుడి పుర్రె ఆధారంగా శాస్త్రవేత్తలు కొత్త అభిప్రాయానికి వచ్చారు. తాజాగా దొరికిన పుర్రె 2,10,000 ఏళ్ల నాటిదని ఎపిడిమా 2 ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. ఎపిడిమా 1, ఎపిడిమా 2 అనే రెండు విధాల సీటీ స్కాన్ ద్వారా పుర్రెల కాలాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు. ఆఫ్రికా నుంచి ఆగ్నేయ యూరప్ గుండా మానవులు వలస వచ్చారని, వారంతా ఒకేసారి ఓ వెల్లువలా కాకుండా అప్పుడప్పుడు గుంపులు, గుంపులుగా వచ్చి ఉంటారని ఈ పుర్రెపై అధ్యయనం జరిపిన బ్రిటన్‌లోని మ్యాన్చెస్టర్ యూనివర్శిటీ, జర్మనీలోని టూబింగన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. యూరప్‌కు వలస రాకముందు ఆదిమానవులు (నియాండర్తల్స్) ఐదు లక్షల సంవత్సరాలకు ముందే ఆఫ్రికాలో నివసించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధునిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 5.50 కోట్ల సంవత్సరాల క్రితమే ఆదిమానవుడికి ప్రాథమిక కోతి రూపమైన ‘గిమాన్’లు ఉండేవి. 1.50 కోట్ల సంవత్సరాల నాటికి గిమాన్ నుంచి హోమినిడాగా పిలిచే తోకలేని నల్ల కోతులు వచ్చాయి. వాటిన ఉంచి 70 లక్షల ఏళ్ల క్రితం గెరిల్లా కోతులు వచ్చాయి, 55 లక్షల ఏళ్ల క్రితం గెరిల్లాలకు కాస్త మానవ రూపం వచ్చింది. 40 లక్షల సంవత్సరాల క్రితం ఆ గెరిల్లాకు మరికాస్త మానవ రూపం వచ్చింది. ఇక 39 లక్షల ఏళ్ల నుంచి 29 లక్షల ఏళ్ల మధ్య ఆస్ట్రోలోపితికస్ జాతి మానవులు, 27 లక్షల ఏళ్ల క్రితం పరంత్రోప్ ఆది మానవులు నివసించారు. 26 లక్షల ఏళ్ల క్రితం గొడ్డలి ఆయుధాన్ని ఆది మానవుడు కనుగొన్నారు. పద్దెనిమిది లక్షల ఏళ్ల క్రితం మానవుడికి ఆధునిక చేయి వచ్చింది. ఎనిమిది లక్షల ఏళ్ల క్రితం ఆది మానవుడి మెదడు పరిణామం పెరిగింది. నిప్పును నియంత్రించడం, మట్టి పాత్రలు తయారు చేయడం నేర్చుకున్నారు. మూడు లక్షల నుంచి రెండు లక్షల మధ్య ఆఫ్రికా నుంచి మానవులు యూరప్‌కు వలస వచ్చారు. -
పుర్రె ఎముకలు పెరుగుతున్నాయి
స్మార్ట్ఫోన్లతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతేస్థాయిలో నష్టాలు ఉన్నాయని మనం తరచూ వింటుంటాం. సామాజిక సంబంధాలు తగ్గిపోతాయని.. అదేపనిగా టైప్ చేయడం వల్ల వేళ్లు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయని చెబుతుంటారు. తాజాగా స్మార్ట్‌ఫోన్ అతి వాడకం పుణ్యమా అని మన పుర్రెల్లో కొన్ని ఎముకలు అవసరానికి మించి పెరుగుతున్నాయని ఆస్ట్రేలియాలోని సన్‌షైన్ కోస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఊరట కలిగించే విషయం ఏంటంటే దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేకపోవడం. ఒకప్పుడు ఇలాంటి ఎముక పెరుగుదల అరుదుగా.. లక్షల్లో కొందరికి జరుగుతాయని భావించినా.. స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పుర్రె వెనుక భాగంలో తాకితే తెలిసేంత సైజుకు ఎముకలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము 18–30 ఏళ్ల మధ్య వయసున్న ఓ వెయ్యి మంది పుర్రెలను పరిశీలించిన తర్వాత తాము ఈ అంచనాకు వచ్చామని డాక్టర్ డేవిడ్ షహర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వైద్య వృత్తిలో 20 ఏళ్లుగా ఉన్న తాను గత పదేళ్ల నుంచి ఎముక పెరుగుదలకు సంబంధించిన కేసులను ఎక్కువగా చూస్తున్నట్లు డేవిడ్ తెలిపారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లను వాడేటప్పుడు మనం మెడను వంచి కిందకు చూస్తూ ఉండటం సమస్యకు మూలకారణమని.. సాధారణ పరిస్థితుల్లో అతితక్కువగా ఉపయోగించే కండరాలను తల వంచినప్పుడు వాడుతుండటంతో ఆ అదనపు బరువును తట్టుకునేందుకు, తల నిలకడగా ఉండేందుకు ఈ ఎముకల పెరుగుదల అవసరమవుతుందని చెప్పారు. మెడను, వెన్నును కలిపే కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకు శరీర వ్యవస్థ ఎముకలు పెరిగేలా చేస్తుందని అంచనా. అంగుళం మేర పెరుగుదల.. ఈ అధ్యయనంలో కొంతమంది యువకుల ఎముకలు ఒక అంగుళం మేర పెరిగినట్లు తెలిసింది. 1996 నాటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతేడాది నీల్సన్ సంస్థ జరిపిన ఒక సర్వే ప్రకారం భారత్‌లో మొబైల్‌ఫోన్ సగటు వినియోగం రోజుకు 90 నిమిషాలు. బాగా ఖరీదైన ఫోన్లు వాడే వారైతే 2 గంటల 10 నిమిషాలు వాడుతున్నారు. బ్రిటన్‌లో ఇది రెట్టింపు కంటే ఎక్కువ. కచ్చితంగా చెప్పాలంటే రోజుకు మూడున్నర గంటల పాటు యువత స్మార్ట్ఫోన్లను వాడుతోంది. -
పర్యాటక ప్రాంతంలో పుర్రె కలకలం
సాక్షి, విశాఖపట్నం: పర్యాటక ప్రాంతం కైలాసగిరిలో ఓ మనిషి పుర్రె లభించడం కలకలంరేపింది. పుర్రె లభ్యమయిన ప్రాంతానికి 50 అడుగుల దూరంలో కొండపై మొండెం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకున్నట్లు మొండెం లభ్యమయిన చోట ఆధారాలుదొరికాయి. ఆత్మహత్య చేసుకుని 20 రోజులు గడిచి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా పుర్రె లభ్యం కావడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. ఆరిలోవ పోలీసులు గుర్తు తెలియని మృతదేహం ఆధారాలను సేకరించే పనిలోపడ్డారు. -
వీడిన ‘ఎరువులో ఎముకలు’ మిస్టరీ
తూప్రాన్: మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో ఓ వ్యక్తి అస్థిపంజరం బయటపడిన సంగతి తెలిసిందే. దీనికి కారణమైన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు మంగళవారం తన కార్యాలయంలో వెల్లడించారు. జీడిపల్లి గ్రామ సమీపంలోని తారాచంద్ ఫామ్‌హౌస్‌లో 2017డిసెంబర్25న విద్యాధర్సింగ్(54) అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా నిర్వాహకులు జాగ్రతపడ్డారు. ఈ నెల3న ఫామ్‌హౌస్‌లోని వర్మికంపోస్టు ఎరువును(పేడ) ఓ పరిశ్రమ నిర్వాహకుడికి విక్రయించడంతో అందులో మానవ అవశేషాలు బహిర్గతమయ్యాయి. దీంతో కంగుతిన్న నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందుకు గాను దర్యాప్తు కొనసాగించగా తారాచంద్ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న రమేష్‌చంద్ర అనే వ్యక్తి 2017 డిసెంబర్25న మృతుడు విద్యాధర్సింగ్తో ఘర్షణ పడ్డారన్నారు. ఈ క్రమంలో కోపోద్రేకుడైన రమేష్‌చంద్ర కర్రతో బలంగా కొట్టడంతో విద్యాధర్సింగ్ కిందపడిపోయారన్నారు. వెంటనే అతడిని ఫామ్‌హౌస్‌లోని పశువుల పేడలో వేసి పైనుంచి మరింత పేడవేశాడు. అనంతరం ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న వారిని తనను మోసం చేసి పారిపోయినట్లుగా తెలిపి నమ్మించాడు. ఈ క్రమంలోనే అప్పట్లో జనవరి6న పోలీసులు మిస్సింగ్కేసుగా నమోదు చేసుకున్నారు. ఆదివారం మనోహరాబాద్ శివారులోని సూపర్‌సీడ్స్ కంపెనీ వారు తారాచంద్ ఫామ్‌హౌస్ నుంచి వర్మీకంపోస్టును కొనుగోలు చేశారు. పోలంలో చల్లుతున్న క్రమంలో మానవశరీర ఎముకలు, పుర్రె, దుస్తులు కనిపించాయి. సీడ్కంపెనీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ దర్యాప్తులో అదే ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న రమేష్‌చంద్ర హత్యకు పాల్పడినట్లు గుర్తించి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ లింగేశ్వర్‌రావు, ఎస్ఐ నాగార్జునగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎరువులో మనిషి ఎముకలు
మనోహరాబాద్(తూప్రాన్): పొలంలో చల్లడానికి తీసుకువచ్చిన వర్మికం పోస్ట్ ఎరువులో మనిషి ఎముకలు, పుర్రె బయటపడిన ఘటన మండల కేంద్రం మనోహరాబాద్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూపర్ సీడ్ పరిశ్రమలో పంట చేనుకు బలం కోసం మండలంలోని జీడిపల్లి శివారులోని తారాచంద్ ఫాం నుంచి వర్మి కంపోస్ట్‌ను ఈ నెల 1న ట్రాక్టర్లలో తెప్పించి చేనులో కుప్పలు వేయించారు. ఈ కుప్పలను ఆదివారం ఉదయం చల్లుతుండగా అందులోంచి మనిషి పుర్రె, ఎముకలు బయటపడటంతో కార్మికులు బయపడి యజమాన్యానికి తెలిపారు. వారు సమాచారం ఇవ్వడంతో సీఐ లింగేశ్వరరావు, ఎస్ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అక్కడ లభించిన ఎముకలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భారతీయుడి పుర్రెను భారత్‌లోనే ఖననం చేయాలి!
లండన్: ఈస్ట్ ఇండియా కంపెనీలో సైనికుడిగా విధులు నిర్వర్తించిన ఓ భారతీయుడి పుర్రెను.. అతని మాతృభూమిలోనే ఖననం చేయాలంటూ ఓ బ్రిటన్ చరిత్రకారుడు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 13తో 99 ఏళ్లు గడిచిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో మరణించిన సైనికుడి పుర్రెకు ఇండియాలో దహన సంస్కారాలు జరిపించాలని కోరుతున్నాడు డాక్టర్ కిమ్ వాగ్నర్. కిమ్ లండన్‌లోని క్వీన్ మేరీ కాలేజిలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2014లో జలియవాలా బాగ్ గురించి ఓ బుక్ రాయడానికి పరిశోధన మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఉన్న ఆయనకు ఒక స్టోర్‌రూమ్‌లో ఒక పుర్రె దొరికింది. దాని కళ్ల భాగంలో ఆ పుర్రెకు సంబంధించిన వివరాలతో కూడిన ఓ కాగితం కనిపించింది. అది తెరిచి చూడగా దానిలో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన భారతీయ సైనికుడు ఆలం బాగ్ పుర్రె అని, ఇతను 32 సంవత్సరాల వయసువాడని, 5 అడుగుల 7 అంగుళాలు ఎత్తు కలిగి ఉన్నాడు. అంతేగాక అతని కుటుంబం మొత్తాన్ని స్కాటిష్ మిషనరీలు చంపేశాయని రాసి ఉంది. ఇది చదివిన కిమ్ మరింత అధ్యయనం జరిపి వాగ్నర్ ద స్కల్ ఆఫ్ ఆలం బాగ్( ద లైఫ్ ఆండ్ డెత్ ఆఫ్ ఏ రెబల్ ఆఫ్ 1857) పేరిట పుస్తకాన్ని రాసి విడుదలచేశారు. అంతటితో ఆగకుండా ఆలం బాగ్‌ను మాతృభూమి మట్టిలోనే పూడ్చిపెట్టాలని న్యూఢిల్లీలోని బ్రిటన్ హై కమిషన్ ద్వారా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. -
జీజీహెచ్‌లో త్వరలో ‘స్కల్ బేస్ సర్జరీ’
సర్పవరం (కాకినాడసిటీ): స్కల్ (కపాలం)లో శస్త్ర చికిత్స చేయాలంటే తప్పనిసరిగా దానిని తెరచి చికిత్స చేయాల్సి వచ్చేది. ఈ స్కల్ బేస్ సర్జరీపై ఆదివారం జీజీహెచ్‌లో ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ జీఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఆ శస్త్ర చికిత్స విభాగం నిపుణుడు డాక్టర్ నారాయణ్ జానకిరామ్ హాజరై మాట్లాడుతూ కపాలం తెరవకుండా నాసికా రంధ్రం ద్వారా పైపు పంపించి కపాలం కింద శస్త్ర చికిత్స చేయడం వల్ల రోగులకు మరింత అత్యాధునిక వైద్యం అందించవచ్చని వివరించారు. ఈ అవగాహన సదస్సులో కోస్తా ఆంధ్రా జిల్లాల నుంచి ప్రముఖ ఈఎన్టీ వైద్యులు పాల్గొన్నారు. -
పూడ్చిపెట్టాక.. బిడ్డకు జన్మ ఇచ్చింది
రోమ్ : ఇటలీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఓ అధ్భుత విషయాన్ని వెలికితీశారు. చనిపోయిన తర్వాత ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఉన్న ఆనవాళ్లను గుర్తించారు. మధ్య యుగ కాలానికి చెందిన 25 ఏళ్ల యువతి గర్భంతో ఉండగానే చనిపోయింది. దీంతో ఆమెను సమాధి చేశారు. ఈ ఘటన అనంతరం తల్లి దేహం నుంచి బిడ్డ జన్మించినట్లుగా ఉన్న అవశేషాలను పురా నిపుణులు కనుగొన్నారు. మరణించిన యువతి పుర్రెకు పెద్ద రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బట్టి ఆమెకు మెదడు సంబంధిత వైద్యం జరిగినట్లు భావిస్తున్నారు. ఫెరారా, బోలోగ్నా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వరల్డ్ న్యూరో సర్జరీ అనే మ్యాగజైన్లో ఈ విషయాలను ప్రచురించారు. క్రీస్తు పూర్వం 7 లేదా 8 శతాబ్దానికి చెందిన మహిళ అత్యంత అరుదైన మెదడు సంబంధిత వ్యాధికి గురైనట్లు పేర్కొన్నారు. దాంతో 38 వారాల నిండు గర్భిణీ అయిన ఆమెకు వైద్యం చేశారని చెప్పారు. గర్భధారణ జరిగి 20 వారాల తర్వాత సంభవించే ఆ వ్యాధి కారణంగా శరీరంలో రక్తపోటు అధికం అవుతుందని వివరించారు. వ్యాధి నివారణకు మరో మార్గం లేకపోవడంతో బలవంతపు ప్రసవానికి అప్పటి వైద్యులు యత్నించగా.. సదరు మహిళ మరణించిందని వివరించారు. -
మిల్లీ మీటర్ దూరంలో బతికిపోయాడు
మేరీలాండ్ : ‘భూమి మీద నూకలు ఉన్నవాడిని చావు కూడా ఏమి చెయ్యలేదు అంటారు’, సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఆరు ఇంచుల మేకు పుర్రెలోకి దిగిన ప్రమాదంలో మిల్లీ మీటర్ దూరంలో బతికిపోయాడు ఓ 13 ఏళ్ల బాలుడు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మేరీలాండ్కు చెందిన డారియస్ ఫోర్‌మెన్ చెట్టుపై ఇళ్లు నిర్మించుకుంటుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. అయితే కింద ఉన్న ఆరు ఇంచుల కప్ బోర్డు మేకు బలంగా అతని తలలోకి దిగింది. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా కప్బోర్డు 5 ఫీట్లు ఉండటంతో అతన్ని అందులోకెక్కించేందుకు కష్టమైంది. దీంతో 5 ఇంచుల కప్ బోర్డును రెండు ఇంచులుగా కట్ చేసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎక్స్‌రే తీయగా మేకు అతని పుర్రేలోకి దిగింది. వెంటనే డాక్టర్లు బయటకు ఉన్న మేకును తొలిగించి అనంతరం శస్త్ర చికిత్స ద్వారా లోపలి మేకును తొలిగించారు. ఇది చాలా సున్నితమైన ఆపరేషన్ అని, బాలుడు అదృష్టవంతుడని, మిల్లీమీటర్ దూరంలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడని డాక్టర్లు పేర్కొన్నారు. గత శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకోగా డాక్టర్లు ఆదివారం ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక గురువారం తన పుట్టిన రోజునాడే డిశ్చార్జ్ కావడం తమ కుమారుడికి పున:జన్మ అని తల్లితండ్రులు తెలిపారు. అంతేగాకుండా 5 ఇంచుల కప్ బోర్డును 7 గంటల సేపు మోసాడని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంతో చెట్లపై ఇళ్లు నిర్మించరాదనే గుణపాఠం నేర్చుకున్నాని ఆ బాలుడు పేర్కొన్నాడు. -
తిరుమలలో పుర్రె కలకలం
సాక్షి, తిరుమల: తిరుమలలో పుర్రె కనిపించడం కలకలం రేపుతోంది. మొదటి ఘాట్ రోడ్డులోని జింకల పార్కు సమీపంలో పుర్రె, ఎముకలు భక్తుల కంటపడ్డాయి. దీంతో భక్తులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం భక్తులతో ఉండే ఘాట్ రోడ్డులో ఈ పుర్రె ఎలా వచ్చిందో అని తెలియడం లేదు. భక్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.