నిందితుడిని అరెస్టు చేసి చూపుతున్న డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు
తూప్రాన్: మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో ఓ వ్యక్తి అస్థిపంజరం బయటపడిన సంగతి తెలిసిందే. దీనికి కారణమైన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు మంగళవారం తన కార్యాలయంలో వెల్లడించారు.
జీడిపల్లి గ్రామ సమీపంలోని తారాచంద్ ఫామ్‌హౌస్‌లో 2017డిసెంబర్25న విద్యాధర్‌సింగ్(54) అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా నిర్వాహకులు జాగ్రతపడ్డారు.
ఈ నెల3న ఫామ్‌హౌస్‌లోని వర్మికంపోస్టు ఎరువును(పేడ) ఓ పరిశ్రమ నిర్వాహకుడికి విక్రయించడంతో అందులో మానవ అవశేషాలు బహిర్గతమయ్యాయి. దీంతో కంగుతిన్న నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.
ఇందుకు గాను దర్యాప్తు కొనసాగించగా తారాచంద్ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న రమేష్‌చంద్ర అనే వ్యక్తి 2017 డిసెంబర్25న మృతుడు విద్యాధర్‌సింగ్‌తో ఘర్షణ పడ్డారన్నారు. ఈ క్రమంలో కోపోద్రేకుడైన రమేష్‌చంద్ర కర్రతో బలంగా కొట్టడంతో విద్యాధర్‌సింగ్ కిందపడిపోయారన్నారు.
వెంటనే అతడిని ఫామ్‌హౌస్‌లోని పశువుల పేడలో వేసి పైనుంచి మరింత పేడవేశాడు. అనంతరం ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న వారిని తనను మోసం చేసి పారిపోయినట్లుగా తెలిపి నమ్మించాడు. ఈ క్రమంలోనే అప్పట్లో జనవరి6న పోలీసులు మిస్సింగ్‌కేసుగా నమోదు చేసుకున్నారు.
ఆదివారం మనోహరాబాద్ శివారులోని సూపర్‌సీడ్స్ కంపెనీ వారు తారాచంద్ ఫామ్‌హౌస్ నుంచి వర్మీకంపోస్టును కొనుగోలు చేశారు. పోలంలో చల్లుతున్న క్రమంలో మానవశరీర ఎముకలు, పుర్రె, దుస్తులు కనిపించాయి.
సీడ్‌కంపెనీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ దర్యాప్తులో అదే ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న రమేష్‌చంద్ర హత్యకు పాల్పడినట్లు గుర్తించి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ లింగేశ్వర్‌రావు, ఎస్‌ఐ నాగార్జునగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment