Varmi compost
-
మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది?
హరిత విప్లవానికి పట్టుగొమ్మ వంటి పంజాబ్ రాష్ట్రంలో రైతులు పునరలోచనలో పడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అత్యధిక మోతాదులో వాడుతూ ఏడు దశాబ్దాలుగా మార్కెట్ కోసం వరి, గోధుమ వంటి పంటలు పండిస్తూ వచ్చిన రైతులు.. ఆ ఆహారం తిని తమ కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులుగా మారుతుండటాన్ని గురించారు. తమ కుటుంబం కోసమైనా రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవటమే ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గమని పంజాబ్ రైతులు ఎట్టకేలకు గ్రహిస్తున్నారు.తేజ్‌పాల్ సింగ్ 30 ఎకరాల ఆసామి. పొలం అంతా (గత సెప్టెంబర్‌లో) పచ్చని వరి పంటతో నిండి ఉంది. పటియాలా జిల్లా కక్రాల గ్రామ పొలిమేరల్లోని తన వరి పొలానికి 4 టన్నుల యూరియా వేశానని, పురుగుల మందు ఒకసారి చల్లానని చెప్పారు. ఇది మార్కెట్లో అమ్మటం కోసం అతను పండిస్తున్నాడు. ఈ పంట అమ్మటం కోసం కాదుఈ ప్రధాన పొలానికి పక్కనే అతనిదే 4 ఎకరాల పొలం మరొకటి ఉంది. అందులో కొంత మేరకు వరి పంట, దాని పక్కనే కూరగాయల తోట కూడా ఉంది. ‘ఈ 4 ఎకరాల పంట అమ్మటం కోసం కాదు, మా కుటుంబం కోసమే పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నా. పచ్చిరొట్ట ఎరువు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులు ఈ పొలంలో వాడుతున్నా. మా కుటుంబం తినగా మిగిలినవి ఏమైనా ఉంటే అమ్ముతా’ అన్నారు తేజ్‌పాల్ సింగ్.ఈ మార్పు ఎందుకొచ్చిందని అడిగితే.. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యం పాలైంది. టెస్ట్ చేయిస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. ఆ రోజుల్లో మరో దగ్గరి బంధువుకు కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది అని ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తుల్ని పరీక్ష చేయించాడు. యూరియా, పొటాష్, పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఆ ఆహారంలో ఉన్నట్లు తేలింది.మా కోసం ఆర్గానిక్ పంటలు‘అప్పుడు నేను నిర్ణయించుకున్నా. మా కుటుంబం తినేదంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చా. అప్పటి నుంచి ఈ 4 ఎకరాల్లో మా కోసం ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటున్నాం. నా భార్య దేహంలో యూరిక్ యాసిడ్ తగ్గింది. మేం తింటున్న సేంద్రియ ఆహారం రుచిగా, నాణ్యంగా ఉంది. ఈ ఆహారం అంతకు ముందు తిన్న దానికన్నా ఎంతో మేలైనదని మాకు అర్థమైంది’ అన్నారు తేజ్‌పాల్ సింగ్. ఇది ఆయన ఒక్కడి మాటే కాదు. తినే ఆహారంలో రసాయనాల అవశేషాల్లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని గట్టిగా గుర్తించిన రైతులు చాలా మందే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.చదవండి: సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?కొద్ది నెలల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. పంజాబ్‌లో 2023–24లో ఎకరానికి 103 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. దేశవ్యాప్తంగా రైతులు వాడుతున్న 58 కిలోలతో పోల్చితే ఇది దాదాపుగా రెట్టింపు. 1980–2018 మధ్యలో పంజాబ్ రైతులు వాడిన ఎన్‌పికె ఎరువులు ఏకంగా 180% పెరిగిందట.దీనికి తగ్గట్టే జబ్బులూ పెరిగాయి. ఐసిఎంఆర్ సంస్థ నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. పంజాబ్‌లో 2021లో 39,521 మంది కేన్సర్ బారిన పడితే.. అది 2024 నాటికి 42,288కి పెరిగింది. పొలాల్లో రసాయనాల వాడకం పెరగటానికి, మనుషుల్లో జబ్బులు పెరగటానికి మధ్య సంబంధం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పంజాబ్ రైతులు, వినియోగదారులూ గుర్తిస్తున్నారు. మన సంగతేంటి? -
వేసవి ఇంటిపంటలకు నారు పోసుకోవలసిందిప్పుడే!
వేసవి ఇంటి పంటల కోసం కూరగాయల నారు పోసుకోవడానికి ఇది తగిన సమయం. కొబ్బరి పొట్టు, వర్మీకంపోస్టు లేదా కంపోస్టు, మట్టి కలిపిన మిశ్రమంలో నారు పోసుకోవచ్చు. నారు పోసుకునే ట్రే లేదా మడి మరీ ఎక్కువ లోతున మట్టి మిశ్రమం వేయనవసరం లేదు. జానెడు లోతు ఉంటే సరిపోతుంది. మట్టి మిశ్రమాన్ని ట్రేలో నింపిన తర్వాత వేళ్లతో లేదా పుల్లతో సాళ్లు మాదిరిగా చేసుకోవాలి. ఆ సాళ్లలో విత్తనాలు విత్తుకున్న తర్వాత పక్కన మట్టిని కప్పి చదరంగా చేయాలి. విత్తనాలు మరీ లోతున పడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ట్రే పైన గుడ్డ కప్పాలి. తడి ఆరిపోకుండా చూసుకుంటూ.. నీటిని తేలిగ్గా చిలకరించాలి. మట్టిలో విత్తనాలు నీరు చిలకరించినప్పుడు చెదిరిపోకుండా ఉండాలంటే.. పల్చటి గుడ్డను కప్పి.. దానిపైన నీటిని చిలకరించాలి. చలి ఉధృతంగా ఉంది. కాబట్టి విత్తనం మొలక రావాలంటే కొంత వెచ్చదనం కావాలి. నారు పోసుకునే ట్రే పైన పాలిథిన్ షీట్ చుట్టినట్టయితే 5–7 రోజుల్లో మొలక రావడానికి అవకాశం ఉంటుంది. మొలక వచ్చిన తర్వాత పాలిథిన్ షీట్‌ను తీసేయవచ్చు. వేసవిలో కాపు వచ్చే అవకాశం ఉన్న ఏమేమి రకాల కూరగాయలకు ఇప్పుడు నారు పోసుకోవచ్చు? అన్నది ప్రశ్న. చలికాలంలో మాత్రమే వచ్చే నూల్‌కోల్, క్యాబేజి, కాలీఫ్లవర్ వంటì వాటిని ఇప్పుడు విత్తుకోకూడదు. వంగ (గ్రీన్ లాంగ్, పర్పుల్ లాంగ్, పర్పుల్ రౌండ్, గ్రీన్ రౌండ్), మిర్చి (ఎల్లో కాప్సికం, రెడ్ కాప్సికం, గ్రీన్ చిల్లీ, ఆర్నమెంటల్ చిల్లీ), టమాట (సాధారణ రకం, స్ట్రాబెర్రీ టమాట)తోపాటు.. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి, బ్రకోలి, క్యారట్, స్కార్లెట్ రకాలను ఇప్పుడు టెర్రస్‌పై ట్రేలలో ఇంటిపంటల సాగు కోసం విత్తుకోవచ్చు. వేసవిలో కూరగాయలను పొందాలనుకునే వారు వెంటనే విత్తుకోవాలి. – ఉషారాణి (81217 96299), వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు,రాజేంద్రనగర్, సేంద్రియ ఇంటి పంటల సాగుదారు విత్తనాలను ఇలాకప్పేయాలి, ఇలా విత్తుకోవాలి -
వీడిన ‘ఎరువులో ఎముకలు’ మిస్టరీ
తూప్రాన్: మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో ఓ వ్యక్తి అస్థిపంజరం బయటపడిన సంగతి తెలిసిందే. దీనికి కారణమైన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు మంగళవారం తన కార్యాలయంలో వెల్లడించారు. జీడిపల్లి గ్రామ సమీపంలోని తారాచంద్ ఫామ్‌హౌస్‌లో 2017డిసెంబర్25న విద్యాధర్సింగ్(54) అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా నిర్వాహకులు జాగ్రతపడ్డారు. ఈ నెల3న ఫామ్‌హౌస్‌లోని వర్మికంపోస్టు ఎరువును(పేడ) ఓ పరిశ్రమ నిర్వాహకుడికి విక్రయించడంతో అందులో మానవ అవశేషాలు బహిర్గతమయ్యాయి. దీంతో కంగుతిన్న నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. ఇందుకు గాను దర్యాప్తు కొనసాగించగా తారాచంద్ ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న రమేష్‌చంద్ర అనే వ్యక్తి 2017 డిసెంబర్25న మృతుడు విద్యాధర్సింగ్తో ఘర్షణ పడ్డారన్నారు. ఈ క్రమంలో కోపోద్రేకుడైన రమేష్‌చంద్ర కర్రతో బలంగా కొట్టడంతో విద్యాధర్సింగ్ కిందపడిపోయారన్నారు. వెంటనే అతడిని ఫామ్‌హౌస్‌లోని పశువుల పేడలో వేసి పైనుంచి మరింత పేడవేశాడు. అనంతరం ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న వారిని తనను మోసం చేసి పారిపోయినట్లుగా తెలిపి నమ్మించాడు. ఈ క్రమంలోనే అప్పట్లో జనవరి6న పోలీసులు మిస్సింగ్కేసుగా నమోదు చేసుకున్నారు. ఆదివారం మనోహరాబాద్ శివారులోని సూపర్‌సీడ్స్ కంపెనీ వారు తారాచంద్ ఫామ్‌హౌస్ నుంచి వర్మీకంపోస్టును కొనుగోలు చేశారు. పోలంలో చల్లుతున్న క్రమంలో మానవశరీర ఎముకలు, పుర్రె, దుస్తులు కనిపించాయి. సీడ్కంపెనీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ దర్యాప్తులో అదే ఫామ్‌హౌస్‌లో పనిచేస్తున్న రమేష్‌చంద్ర హత్యకు పాల్పడినట్లు గుర్తించి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ లింగేశ్వర్‌రావు, ఎస్ఐ నాగార్జునగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎరువులో మనిషి ఎముకలు
మనోహరాబాద్(తూప్రాన్): పొలంలో చల్లడానికి తీసుకువచ్చిన వర్మికం పోస్ట్ ఎరువులో మనిషి ఎముకలు, పుర్రె బయటపడిన ఘటన మండల కేంద్రం మనోహరాబాద్‌లో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూపర్ సీడ్ పరిశ్రమలో పంట చేనుకు బలం కోసం మండలంలోని జీడిపల్లి శివారులోని తారాచంద్ ఫాం నుంచి వర్మి కంపోస్ట్‌ను ఈ నెల 1న ట్రాక్టర్లలో తెప్పించి చేనులో కుప్పలు వేయించారు. ఈ కుప్పలను ఆదివారం ఉదయం చల్లుతుండగా అందులోంచి మనిషి పుర్రె, ఎముకలు బయటపడటంతో కార్మికులు బయపడి యజమాన్యానికి తెలిపారు. వారు సమాచారం ఇవ్వడంతో సీఐ లింగేశ్వరరావు, ఎస్ఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అక్కడ లభించిన ఎముకలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిండా..సిరుల బెండ
బెండసాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన మద్ది గంగిరెడ్డి. దాదాపు 18 ఏళ్లుగా ఈయన బెండ సాగు చేస్తున్నారు. దీనిబట్టి ఆ పంట ఆయనకు ఎంత సంతృప్తినిస్తుందో అర్థమవుతోంది. ఏటా మూడు ఎకరాల వరకు బెండ సాగు చేసేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఎకరం భూమిలో మాత్రమే బెండ వేశారు. బెండ సాగు గురించి రైతు గంగిరెడ్డి ఏమంటున్నారో ఆయన మాటల్లోనే... బెండ సాగు మెళకువలు.. విత్తనాలు: మే మూడోవారంలో బెండ విత్తాను. జె.కె-7315, రాశి, సఫారి రకాలు దీనిలో శ్రేష్టమైనవి. నేను ఆ రకాలనే విత్తుతుంటాను. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు వేశాను. విత్తనానికి రూ. 3,500 నుంచి రూ.5 వేల వరకు ఖర్చు వచ్చింది. ఎరువుల యాజమాన్యం: దుక్కిని నాలుగు సార్లు దున్ని ఎకరానికి రెండు క్వింటాళ్ల వర్మి కంపోస్టు వేశాను. దుక్కిలో 8 సెం.మీలకు ఒక గింజ చొప్పున నాటాను. విత్తనం వేసిన తెల్లారి కలుపు నివారణకు ఎకరానికి 500 మి.లీ పిండి మిథాలిన్ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశాను. విత్తనం నాటిన 40 రోజుల తర్వాత 20:20 కాంప్లెక్స్ ఎరువును 50 కిలోలు వేశాను. 55 రోజుల కాలంలో నీమ్ యూరియా 50 కిలోలు వేశాను. తెగుళ్లు- నివారణ: ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి కాబట్టి కాపు దశలో ఎర్రనల్లి సోకింది. దీని నివారణకు రిజెండ్ 500 మి.లీ, ఒబేరాన్ 200 మి.లీ 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశాను. మొగి పురుగు ఆశిస్తే కోరోజిన్ 60 మి.లీ, ఫ్రైడ్ 100 గ్రాములను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేశాను. పెట్టుబడుల వివరాలు: ఎకరా దుక్కి దున్నినందుకు రూ.5 వేలు, పాట్లు చేయడానికి రూ.2 వేలు, విత్తనానికి రూ.5 వేలు, కలుపు కూళ్లకు రూ.2 వేలు, కోత కూళ్లకు రూ.10 వేలు, ఎరువులకు రూ.2 వేలు, పురుగు మందులకు రూ. 5 వేలు మొత్తంగా సుమారు రూ. 30 వేల వరకు ఖర్చు వస్తుంది. దిగుబడి: విత్తిన తరువాత 55 రోజులకు పంట కోతకు వస్తుం ది. 55 రోజుల నుంచి 130 రోజుల వరకు పంట దిగుబడి ఇస్తుంది. ప్రతిరోజూ ఎకరానికి క్వింటా నుంచి క్వింటన్నర వరకు సేకరించవచ్చు. ఇలా మొత్తంగా ఎకరానికి 80 క్వింటాళ్ల నుంచి వంద క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకాయలు రూ.12 నుంచి రూ.15 వరకు ధర పలుకుతున్నాయి. ఈ దిగుబడి నుంచి దాదాపు రూ. లక్షకు పైగా ఆదాయం వస్తోంది. ’ ఇతర పంటలకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది: గంగిరెడ్డి, రైతు బెండ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర పంటల సాగుకు ఉపయోగిస్తున్నాను. ఎనిమిది ఎకరాల్లో మాగాణి, ఎకరానికి పైగా మిర్చి వేస్తాను. ఈ పంటలకు అయ్యే పెట్టుబడి, ఇద్దరు పిల్లల చదువుకు అయ్యే ఖర్చులకు బెండ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తాను. ఇతర పంటలకన్నా బెండ సాగు ఎంతో బాగా కలివస్తోంది. అందుకే 18 ఏళ్లుగా దీన్ని క్రమంతప్పకుండా సాగు చేస్తున్నాను. మా పరిసర ప్రాంత రైతులు నా వద్దకు వచ్చి సాగు వివరాలు తెలుసుకుంటున్నారు. శ్రద్ధ, ఆసక్తితోనే దిగుబడులు: గజ్వెల్లి సత్యనారాయణ, ఖమ్మం ఉద్యానవిస్తర్ణ అధికారి శ్రద్ధ, ఆసక్తి, అనుభవం, వీటికితోడు మెళకువలు తెలుసుకోవడం. యాజమాన్య పద్ధతులను ఉద్యానశాఖ ద్వారా తెలుసుకుని పాటించడం వల్లే గంగిరెడ్డి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మిగతా రైతులు కూడా ఆయనలాగే పట్టుదలతో సాగు చేయాలి.