బ్రెయిన్ సర్జరీ కోసం వెళ్లి పుర్రెలో కొంత భాగాన్ని కోల్పోయాడు. పోనీ అక్కడితో అతడి కష్టాలు ఆగలేదు. చివరికి వైద్యులు అతడికి సింథటిక్ ఎముకను అమర్చి సర్జరీ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వకపోగా ఇన్ఫెక్షన్ సోకి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆస్పత్రి బిల్లులు కూడా తడసి మోపడయ్యాయి. వైద్యులు తప్పిదం వల్లే నాకి పరిస్థితి అని సదరు ఆస్పత్రిపై దావా వేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళ్లలేక సెప్టెంబర్ 2022లో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించాడు. దీని కారణంగా బ్రెయిన్‌లో బ్లీడ్ అవుతుంది. ఆ సమయంలో వైద్యులు ఒత్తడిని తగ్గించేందుకు 4.7 బై-6-అంగుళాల పుర్రె ముక్కని తొలగించాలని నిర్ణయించారు. పుర్రె భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలిగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా..అక్కడ ఇతర రోగుల పుర్రె భాగాలు కూడా ఉండటంతో అందులో అతడిది ఏదో గుర్తించడంలో విఫలమయ్యారు వైద్యులు.
దీంతో ఆస్పత్రి అతడికి సింథటిక్ పుర్రె భాగాన్ని కృత్రిమంగా తయారు చేసి ప్రత్యామ్నాయంగా అమర్చింది. ఇలా సింథటిక్ ఎముక కోసం సదరు రోగి నుంచి ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేసింది. అయితే ఇలా రోగికి సింథటిక్ ఎముకను పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ బారిని పడి అదనంగా మరికొన్ని సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పాలంటే సదరు రోగికి బ్రెయిన్ సర్జరీ శారీరకంగా, ఆర్థికంగా భయానక అనుభవాన్ని మిగిల్చింది.
ఈ సమస్య నుంచి బయటపడేటప్పటికీ అతడికి ఆస్పత్రి బిల్లు ఏకంగా కోటి రూపాయల పైనే ఖర్చు అయ్యింది. వైద్యుల తప్పిదం కారణంగా జరిగిన నష్టాన్ని కూడా తనపైనే రుద్ది మరీ డబ్బులు వసూలు చేశారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను శరీరంలో కొంత భాగాన్ని కోల్పోవడమే గాక, ఆర్థికంగా శారీకంగా ఇబ్బందులు పడేలా చేసినందుకు గానూ సదరు ఆస్పత్రి తనకు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ దావా వేశాడు.
(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!)
Comments
Please login to add a commentAdd a comment