Surgery
-
నాజూకు నడుము కోసం మరీ ఇలానా..!
వెర్రి వెయ్యి రకాలంటే ఇదేనేమో. ఇటీవల కాలంలో అందం పిచ్చి మాములుగా లేదు. అందుకోసం ప్రాణాలే సంకటంలో పడేసే పనులు చూస్తే ఏం మనుషుల్రా బాబు అనిపిస్తుంది. అచ్చం అలాంటి భయానకమైన పనే చేసేంది ఓ ట్రాన్స్ విమెన్. ఆమె చేసిన పని తెలిస్తే.. అందం కోసం మరీ ఇంతకు తెగించాలా అని చిరాకుపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..అమెరికాకు చెందిన 27 ఏళ్ల ట్రాన్స్ మహిళ(Trans Woman) ఎమిలీ జేమ్స్(Emily James) నడుము నాజూగ్గా ఉండాలని పక్కటెముకలు(Ribs) తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఏకంగా రూ. 1 లక్షలు ఖర్చు పెట్టి మరీ సర్జరీ చేయించుకుంది. దీని కారణంగా వర్ణనాతీతమైన బాధను కూడా అనుభవించింది. ఇలా ఎముకలు తొలగించుకోవడం వల్ల విపరీతమైన వాపు వచ్చి కార్సెట్(బెల్ట్)ను ధరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. అంతేగాదు తనకు ఈ ఆపరేషన్ చేసిన వైద్యులు, నర్సుల బృందానికి ధన్యవాదాలు చెప్పినట్లు తెలిపింది. అలాగే తొలగించిన పక్కటెముకలను వైద్యులు తనకే ఇచ్చేసినట్లు పేర్కొంది. పైగా వాటిని కిరీటం(crown) కింద ఎవరైన తయారు చేస్తే బాగుండనని అంటోంది. అంతేగాదు దాన్ని తన ప్రాణ స్నేహితుడికి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నట్లు కూడా చెప్పింది. తాను బార్బెక్యూలా అందంగా కనిపించాలని గత మూడు రోజుల క్రితం రెండు వైపులా పక్కటెముకలు తొలగించుకున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో నెటిజన్లు అందం కోసం మరి ఇలానా అంటూ తిట్టిపోయగా, మరికొందరూ ఆ ఎముకలను ఏం చేస్తావంటూ వెటకారంగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.గతంలో ఇలానే అందం కోసం చేయించుకున్న కాస్మెటిక్ సర్జరీల కారణంగా చాలామంది మోడల్స్, స్టార్లు అనారోగ్యం పాలవ్వడం లేదా వికటించి బాధలు పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. అయినా ఈ గ్లామర్ పిచ్చి జనాలకు తగ్గడం లేదు ఎందుకనో..?. నిజానికి ఆరోగ్యానికి మించిన అందం ఇంకేమైనా ఉందా..! అని ఆలోచించండి ప్లీజ్..!.(చదవండి: అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!) -
నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన
టెల్అవీవ్:ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(75) మూత్రనాళ ఇన్ఫెక్షన్కు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని జెరూసలెంలోని హడస్సా మెడికల్ సెంటర్ వైద్యులు వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని, నెతన్యాహుకు క్యాన్సర్ సోకలేదని తెలిపారు. నెతన్యాహు అండర్‌గ్రౌండ్ చికిత్సా కేంద్రంలో కోలుకుంటున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది.ఈ అండర్‌గ్రౌండ్ చికిత్సా కేంద్రం మిసైల్ దాడుల నుంచి నెతన్యాహుకు రక్షణ కల్పిస్తుంది. నెతన్యాహుకు సర్జరీ కారణంగా ఇజ్రాయెల్ న్యాయశాఖ మంత్రి యారివ్లెవిన్ ప్రస్తుతం దేశ తాత్కిలిక ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు.నెతన్యాహు కోలుకోవడానికి మరికొన్ని వారాలు పడుతుందని అధికారులు తెలిపారు. ఓ వైపు హమాస్‌తో కాల్పుల విరమణచర్చలు మరోవైపు యెమెన్ నుంచి హౌతి రెబెల్స్ దాడులు చేస్తున్న నేపథ్యంలో నెతన్యాహు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడం అక్కడి ప్రజల్లో కొంతమేర ఆందోళన కలిగిస్తోంది.ఇదీ చదవండి: ఇంజినీర్ సుచిర్ బాలాజీ మృతి.. మస్క్ కీలక ట్వీట్ -
అమెరికాలో శివరాజ్‌కుమార్.. క్యాన్సర్‌కు శస్త్రచికిత్స పూర్తి
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల భైరతి రంగల్ చిత్రంలో కనిపించిన ఆయన వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. ఏయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సర్జరీ కోసం యూఎస్ వెళ్తున్నట్లు ప్రకటించారు.అయితే తాజాగా ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు ఆయన కూతురు నివేదిత శివరాజ్‌కుమార్ వెల్లడించారు. దేవుని దయతో మా నాన్నకి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ట్విటర్ ద్వారా లేఖ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయన భార్య గీతా మాట్లాడిన వీడియోను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. మరికొద్ది రోజుల్లో శివ రాజ్‌కుమార్ తన అభిమానులతో మాట్లాడతారని తెలిపింది. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆయన భార్య గీతా శివరాజ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 24న యూఎస్‌లోని మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మూత్రాశయ క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.ప్రస్తుతం శివరాజ్‌కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కూతురు లేఖలో ఆయన కుమార్తె ప్రస్తావించారు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సర్జరీకి ముందు శివ రాజ్‌కుమార్‌కు ఆరోగ్యం చేకూరాలని కోరుతూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాగా.. శివ రాజ్‌కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్‌లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్సీ16లోనూ కనిపించనున్నారు. Thank You #Geethakka ❤🙏🏼 You Stood with Anna ❤❤❤ Take Rest and Get Well Soon #Shivanna ❤🥹 We Will be waiting for to welcome you on Jan 26th 😍Special thanks to doctor's🙏🏼 #DrShivarajkumar #Shivarajkumar #ShivaSainya @NimmaShivanna ❤❤❤ @ShivaSainya pic.twitter.com/isgcCcC520— ShivaSainya (@ShivaSainya) December 25, 2024 It is the prayers and love of all the fans and our loved ones that have kept us going through tough times. Thank you for your support!✨ pic.twitter.com/eaCF7lqybc— Niveditha Shivarajkumar (@NivedithaSrk) December 25, 2024 -
తెగిన చేతిని అతికించిన వైద్యులు
రోడ్డు ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన చేయి గోల్డెన్ అవర్ దాటిన తర్వాత అపోలో ఆస్పత్రికి రోగి.. 8 గంటల పాటు శ్రమించి అతికించిన వైద్య బృందం సాక్షి, హైదరాబాద్: రోడ్డుప్రమాదంలో పూర్తిగా తెగిపడిపోయిన చేయిని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్తి వైద్యులు విజయవంతంగా అతికించారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన తొలి గంట)సమయం దాటిపోయిన తర్వాత కూడా అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించటం గమనార్హం. మంచిర్యాలకు చెందిన పవన్‌కుమార్ అనే వ్యక్తి అక్టోబర్ 11న బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగి మోచేయి పై భాగంవరకు తెగి పడిపోయింది. తెగిన చేయిని ఓ కవర్లో చుట్టి అతడిని హుటాహుటిన మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి డాక్టర్లు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రిఫర్ చేశారు. పవన్‌కుమార్‌ను హైదరాబాద్‌కు తరలించే సమయానికి అప్పటికే గోల్డెన్ అవర్ కూడా దాటిపోయింది. అయినప్పటికీ 8 గంటల పాటు శ్రమించి క్లిష్టమైన మైక్రోవ్యాసు్కలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి చేయిని తిరిగి అతికించారు. సాధారణంగా వేలు కానీ, చిన్న అవయవం కానీ తెగిపడిపోతే సులువుగానే అతికించవచ్చని, పూర్తి చేయిని అతికించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స వివరాలను బుధవారం మీడియా సమావేశంలో అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ మైక్రో సర్జన్ డాక్టర్ జీఎన్ భండారి వెల్లడించారు. 26 రోజుల్లోనే పవన్ కోలుకున్నాడని తెలిపారు. అతికించిన చేయి వేళ్లు తిరిగి పనిచేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందని, ఇందుకోసం మరికొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తెగిన వెంటనే జాగ్రత్త చేయాలి తెగిపోయిన శరీర భాగాలను అతికించే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భండారి అన్నారు. తెగిపోయిన శరీర భాగాలను నీటితో కడిగి, పాలిథీన్ కవర్ లేదా అల్యూమినియం కవర్లో ఉంచాలని తెలిపారు. ఆ కవర్‌ను ఐస్ప్యాక్లో పెట్టి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. అయితే నేరుగా ఐస్‌లో ఉంచితే అవయవం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, అప్పుడు తిరిగి అతికించడం సాధ్యం కాదని వివరించారు. పుట్టుకతో లోపాలు, విరిగిపోయిన చేతులు, పక్షవాతం వంటి వ్యాధుల కారణంగా చేతులు, కాళ్లు పనిచేయకపోతే బ్రెయిన్ డెడ్ అయిన వారి భాగాలను అతికించే అవకాశం ఉందని తెలిపారు. మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ బాబు, శస్త్ర చికిత్సలో పాలుపంచుకున్న డాక్టర్ గురుప్రసాద్ (ప్లాస్టిక్ సర్జన్), డాక్టర్ వివేక్ రెడ్డి (ఆర్థోపెడిక్ సర్జన్), డాక్టర్ శరణ్య (అనస్తీషియా) తదితరులు పాల్గొన్నారు. -
బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు
హథ్రాస్(యూపీ): వాచీ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులు ఇలా ఇంట్లో కనిపించే చిన్నపాటి వస్తువులన్నీ 15 ఏళ్ల బాలుడి కడుపులో కనిపించేసరికి ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు అవాక్కయ్యారు. వెంటనే పెద్ద శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకు తీశారు. అయితే ఆ తర్వాతి రోజు బాలుడి గుండెవేగం విపరీతంగా పెరిగి, రక్తపోటు తగ్గి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాలను బాలుడి తండ్రి సంచిత్ శర్మ మీడియాతో చెబుతూ వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ పట్టణంలోని రత్నగర్భ కాలనీలో సంచిత్ కుటుంబం ఉంటోంది. అతనికి 9వ తరగతి చదివే 15 ఏళ్ల కుమారుడు ఆదిత్య శర్మ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హాథ్రాస్ ఆస్పత్రిలో చూపించారు. తర్వాత జైపూర్ ఆస్పత్రిలో చూపించారు. కొద్దిరోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంటికొచి్చనా రోగం మళ్లీ తిరగబెట్టింది. తర్వాత అలీగఢ్‌లో శ్వాససంబంధ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అక్టోబర్ 26న అలీగఢ్‌లో అ్రల్టాసౌండ్ పరీక్ష చేయగా 19 చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. నోయిడాలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నోయిడా వైద్యుల పరీక్షలో 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది. తర్వాత ఢిల్లీలోని సఫ్డర్‌జంగ్ ఆస్పత్రిలో అక్టోబర్ 27న టీనేజర్‌కు శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకుతీశారు. ఇన్ని వస్తువులు తెలీసో తెలీకో మింగినా నోటికిగానీ, గొంతుకుగానీ ఎలాంటి గాయలు లేకపోవడం చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సర్జరీ చేసిన ఒక రోజు తర్వాత టీనేజర్ మరణంపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
భారత వైద్య రంగంలో శరవేగంగా ఏఐ.. రోగాన్ని ఇట్టే తేల్చేస్తుందోయ్!
భారత వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) దూకుడు పెరుగుతోంది. 2016 నుంచి 2022 మధ్య ఏఐ హెల్త్‌కేర్ పరిశ్రమ 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదు చేసింది. 2025 నాటికి ఇది 7.8 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు, నర్సులు, సహాయ సిబ్బంది, చికిత్సలకు మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడంలో ఏఐ ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వైద్య సదుపాయాల కొరతను కోవిడ్ బట్టబయలు చేసింది. 2019–20 ఆర్థిక సర్వే ప్రకారం.. దేశంలోని ప్రతి 1,456 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి 0.6 మేర ఉన్నాయి. ఈ కొరతను అధిగమించడానికి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతోంది. – సాక్షి, అమరావతి ఔషధ పరిశోధనల్లో వేగం టీకాలు, జనరిక్ మందులు, బయోసిమిలర్స్, ఇతర ఉత్పత్తుల తయారీలో పరిశోధనలను వేగవంతంగా చేపట్టడానికి ఏఐని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌తో క్లినికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మందుల డిమాండ్ అంచనా వేయడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, రోగుల అవసరాలకు అనుగుణంగా మందులను అందించేందుకు ఏఐ కీలకంగా వ్యవహరిస్తోంది. చికిత్సల్లో కచ్చితత్వం భవిష్యత్ వైద్య రంగం అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్పైనే ఆధారపడి ఉంటుంది. చికిత్సలు, రోగనిర్ధారణ, సర్జరీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సేవల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఉదాహరణకు జాయింట్ రీప్లేస్మెంట్, ఎముకలకు సంబంధించిన ఇతర సర్జరీల్లో రోబోటిక్ సర్జరీల వినియోగంతో సర్జరీ అనంతరం రోగికి సహజ సిద్ధమైన శరీర ఆకృతి, సర్జరీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటోంది. సర్జరీల్లో కచ్చితత్వం, తక్కువ కోతలు, రక్తస్రావం లేకపోవడంతో పాటు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తక్కువ. సాధారణ చికిత్సలతో పోలిస్తే చాలా త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా వినియోగంలో ఉండటంతో చికిత్సలకు కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది. భవిష్యత్‌లో పరిజ్ఞానం వినియోగం పెరిగేకొద్దీ చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజల్లో ఈ చికిత్సలపై కొన్ని అపోహలున్నాయి. చికిత్సల్లో వాడే అధునాత వైద్య పరికరాలన్నీ వైద్యుడి నియంత్రణలోనే ఉంటాయి. వైద్యుడి దిశా నిర్దేశంలోనే రోగనిర్ధారణ, శస్త్ర చికిత్సలు జరుగుతాయి. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, గుంటూరు30 నుంచి 40 శాతం సమయం ఆదా రోగ నిర్ధారణ, సర్జరీ, ఇతర చికిత్సల కోసం ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఏఐతో రోగ నిర్ధారణలో కచ్చితత్వంతో పాటు, రోగులకు సమయం ఆదా అవుతోందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుడిని రోగి సంప్రదించడానికి ముందే ప్రామాణికమైన ప్రశ్నలకు రోగుల నుంచి సమాధానాలు రాబట్టి చాట్‌బాట్, మెటా వంటి ఏఐ సాధనాల ద్వారా విశ్లేíÙస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో రోగులకు 30–40 శాతం మేర సమయం ఆదా అవుతున్నట్టు చెబుతున్నారు. ఇక రోగుల రికార్డులు, ఎక్స్‌రే, సీటీ స్కాన్, రక్తపరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ వంటి అంశాల్లో వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఏఐ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి వైద్యులు, సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతున్నాయి. క్యాన్సర్, రెటినోపతి, ఊపిరితిత్తుల జబ్బులు, రక్తంలో ఇన్ఫెక్షన్, అరుదైన వ్యాధుల నిర్ధారణలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు ఏఐని వినియోగిస్తున్నాయి. సర్జరీల్లో రోబోలను వినియోగించడం సాధారణ విషయంగా మారింది. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాల్లోని అనేక ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. -
కన్నడ నటుడు దర్శన్‌కు సర్జరీ
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్ కోరుతూ దర్శన్ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి విచారించారు. పిటిషన్ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్‌కు సూచించారు. బళ్లారి జైలులో దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్ అవసరముందని వైద్యులు తెలిపారు. అందుచేత బెయిల్ ఇవ్వాలని దర్శన్ వకీలు కోరారు. నేర విచారణలో అనేక లోపాలు ఉన్నాయని, అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు. దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు.100 రోజులు దాటిందిదర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. ఈ క్రమంలో మరోసారి వారు బెయిల్ పిటీషన వేశారు. -
మూర్ఛకు శాశ్వత పరిష్కారం
సాక్షి, విశాఖపట్నం: వైద్య రంగాన్ని కలవరపెడుతున్న మూర్ఛ (ఎపిలెప్సీ) రోగానికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని అంతర్జాతీయ మూర్ఛరోగ నిపుణుడు, క్లీవ్‌ల్యాండ్ ఎపిలెప్సీ సెంటర్ న్యూరో డైరెక్టర్ డాక్టర్ ఇమద్ ఎం నజ్మ్ చెప్పారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (ఐయాన్‌కాన్)–2024 సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు విశాఖ వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. కొన్ని దేశాల్లో మూర్ఛ రోగానికి శస్త్రచికిత్సలు చేసినా.. ఫలితాలు మాత్రం రాబట్టుకోలేకపోతున్నామన్నారు. నాడీ సంబంధిత వ్యాధులు పరిష్కరించడంలో ఇంకా వందేళ్లు వెనకబడే ఉన్నామన్నారు. ఎపిలెప్సీపై పరిశోధనలు వేగవంతమవుతున్నాయని తెలిపారు. ఆయన ఏమన్నారంటే.. ప్రతి ఆరుగురిలో ఒకరికి నరాల సమస్యప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతుండటం కలవరపెట్టే అంశం. ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మంది మూర్ఛతో జీవిస్తున్నారు. 10 లక్షల మంది మెసియల్ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీతో బాధపడుతున్నారు. మెదడులో వైకల్యాలు అని పిలిచే మూర్ఛ రోగం వైద్య రంగంలో క్లిష్టంగా మారుతోంది.మెదడు అధ్యయనం అంటే.. అది మూర్ఛ కావచ్చు, అల్జీమర్స్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, పార్కిన్సన్ కావచ్చు. నాడీ సంబంధిత వ్యాధులు ఇటీవల ఎక్కువయ్యాయి. వయసుతో పాటు ఈ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. 75 ఏళ్లు పైబడిన ప్రతి 100 మందిలో 15 మందికి మూర్ఛ రోగం ప్రమాదకరంగా మారే అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే మూర్ఛ వంటి నాడీ సంబంధిత వ్యాధులపై పరిశోధనలు విస్తృతం చేస్తున్నాం.శస్త్ర చికిత్సల్లో మూడొంతులు విఫలం మూర్ఛకు శస్త్రచికిత్స అంటూ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు. అంటే మెదడులోని టెంపోరల్ లోబ్‌కు సంబంధించిన భాగాన్ని తొలగించడం మూర్ఛకు ఉన్న ఏకైక శస్త్రచికిత్స. ఇది అంత విజయవంతం కాదు. ఇప్పటివరకు చేసిన ఈ తరహా చికిత్సల్లో మూడొంతులు విఫలమవుతున్నాయి. మందుల ద్వారా కూడా అంత ఫలితాలు రావడం లేదు. మూర్ఛ రోగం వచ్చిన ప్రతి 100 మందిలో 90 శాతం రోగులు మందులు వాడుతున్నారు. వీరిలో కేవలం 44 శాతం మందికే ఫలితాలు దక్కుతున్నాయి.అమెరికా పరిశోధనలు సఫలీకృతంఅమెరికాలో ఎపిలెప్సీపై 2007 నుంచి పరిశోధనలు కొనసాగుతున్నాయి. 2007లో లేజర్ థెరపీకి అనుమతి లభించింది. 2013లో న్యూరో స్టిమ్యులేషన్, 2018లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్), 2019లో హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అ్రల్టాసౌండ్ ద్వారా మూర్ఛకు కారణాలపై పరిశోధనలు చేసేందుకు అనుమతి లభించింది. ఇది విజయవంతమయ్యే దిశగానే పరిశోధనలు ముందుకు సాగుతున్నాయి. అయితే.. నాడీ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించి, రోగ నిర్ధారణ చేయడంఅనేది వైద్య ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారింది. హృద్రోగాల్ని ఎలాగైతే ముందుగానే పసిగట్టే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందో.. అదేవిధంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన వైద్య పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 2050 నాటికి న్యూరో సంబంధిత వ్యాధులకు సంబంధించి సంపూర్ణ చికిత్స వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. -
ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల నుంచి రిమోట్ సర్జరీ!
వైద్యశాస్త్రం టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది. అధునాత శస్త్ర చికిత్సా విధానాలతో కొంత పుంతలు తొక్కుతుంది. ఇప్పుడు ఏకంగా మారుమూల ప్రాంతంలోని వ్యక్తులకు సైతం వైద్యం అందేలా సరికొత్త వైద్య విధానాన్ని తీసుకొచ్చింది. ఈ పురోగతి వైద్యశాస్త్రంలో సరికొత్త విజయాన్నినమోదు చేసింది. వందలు, వేలు కాదు ఏకంగా తొమ్మిది వేల కిలోమీటర్ల దూరం నుంచి విజయవంతంగా సర్జరీ చేసి సరికొత్త చికిత్స విధానానికి నాందిపలికారు. ఈ సర్జరీని టెలిఆపరేటెడ్ మాగ్నెటిక్ ఎండోస్కోపీ సర్జరీ అంటారు. స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జ్యూరిచ్, చైనీస్ యూనివర్సిటీ ఆప్ హాంకాంగ్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసన్ పరిశోధకులు సంయుక్తంగా ఈ ఎండోస్కోపీ సర్జరీని విజయవంతం చేశారు. దీన్ని రిమోట్ నియంత్రిత పరికరాన్ని ఉపయోగించి నిర్వహించారు. శస్త్ర చికిత్స టైంలో కడుపు గోడ బయాప్సీ తీసుకుని స్వైన్ మోడల్లో ఈ సర్జరీ చేశారు వైద్యులు. ఈ సర్జరీలో హాంకాంగ్‌లోని ఆపరేటింగ్ గదిలో భౌతికంగా ఉన్న ఒక వైద్యుడు, దాదాపు 9,300 కిలోమీటర్ల దూరంలోని స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న రిమోట్ స్పెషలిస్ట్లిద్దరూ పాల్గొన్నారు. ఈ ప్రక్రియలో నియంత్రించడానికి ఇద్దరు నిపుణులు అధునాత సాంకేతికతను ఉపయోగించారు. ఇక్కడ నిపుణుడు జ్యూరిచ్‌లోని ఆపరేటర్ కన్సోల్ నుంచి గేమ్ కంట్రోలర్‌ని ఉపయోగించాడరు. అయితే నిపుణులు ఈ శస్త్ర చికిత్సను మత్తులో ఉన్న పందిపై విజయవంతంగా నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలను అడ్వాన్స్డ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ విడుదల చేసింది. ఈ ఫరిశోధన సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. తదుపరి దశలో మానవ కడుపుపై ఈ టెలీ ఎండోస్కోపీని నిర్వహిస్తామని చెప్పారు. ఇక్కడ ఈ టెలి ఆపరేటెడ్ ఎండోస్కోపీ రిమోట్ సర్జికల్ ట్రైనింగ్ కేవలం శరీరాన్ని మానిటరింగ్ చేయడమే గాక మారుమూల ప్రాంతాల్లో తక్షణ రోగనిర్థారణ, శస్త్ర చికత్స సంరక్షణను అందించగలదు. ప్రత్యేకించి స్థానికంగా వైద్యనిపుణులు అందుబాటులో లేనప్పడు రిమోట్ నిపుణుడు శిక్షణ పొందిన నర్సులకు ఎలా చేయాలో సూచనలివ్వొచ్చు. ఈ ఎండోస్కోపిక్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రోగుల జీర్ణశయాంత కేన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స అందించగలుగుతామని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షానన్ మెలిస్సా చాన్ అన్నారు. బాహ్య అయస్కాంత క్షేత్రం ద్వారా నియంత్రించబడే ఈ అయస్కాంత ఎండోస్కోప్ని వీడియో గేమ్ కంట్రోలర్ సాయంతో విజయవంతంగా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు పరిశోధకులు. (చదవండి: -
ఏకంగా 6110! కడుపా? రాళ్ల గుట్టా? డాక్టర్లే ఆశ్చర్యపోయిన వైనం
రాజస్థాన్‌లోని కోటాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. 70 ఏళ్ల వ్యక్తి పిత్తాశయం (గాల్‌బ్లాడర్) నుండి ఒకటీ రెండూ కాదు ఏకంగా 6,110 రాళ్లను తొలగించడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. బుండి జిల్లా పదంపురకు చెందిన ఒక పెద్దాయన కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడేవారు. దాదాపు సంవత్సర కాలంగా చికిత్స తీసుకుంటున్నా, ఫలితంలేదు. దీంతో ఆయనకు చికిత్స చేస్తున్న వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా అతనికి నిర్వహించిన స్కానింగ్‌లో అతిపెద్ద రాళ్లను గుర్తించారు. గ్లాల్ బ్లాడర్ సైజు సాధారంగా 7x4 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ 12x4 సెం.మీకి పెరిగిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో అతనికి సర్జరీ నిర్వహించి అతని ప్రాణాలను కాపాడారు.పిత్తాశయం పూర్తిగా రాళ్లతో నిండిపోయిందని, అదే అతని అసౌకర్యానికి ప్రధాన కారణమని లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు .ఎండో-బ్యాగ్‌ని ఉపయోగించి పిత్తాశయాన్ని తొలగించి, మరిన్ని వైద్య పరీక్షల నిమిత్తం పంపించామని చెప్పారు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఆపరేషన్‌కు దాదాపు 30 -40 నిమిషాలు పట్టిందట. అంతేకాదు ఈ రాళ్లను లెక్కించేందుకు రెండున్నర గంటలు సమయం పెట్టింది. ఆపరేషన్ తర్వాత ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. పిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయి?జీర్ణక్రియకు తోడ్పడేలా కాలేయం ఉత్పత్తి చేసే ద్రవం అయిన పిత్తాన్ని తయారు చేసే పదార్థాలలో అసమతుల్యత ఉన్నప్పుడు పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. కాలేయం క్రింద ఉన్న చిన్న అవయవం పిత్తాశయంలో రాళ్లు సాధారణంగా కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ ఎక్కువైనపుడు రాళ్లు వస్తాయి. తయారవుతాయి. ఇవి ఇసుక రేణువులంత చిన్న పరిమాణం నుండి గోల్ఫ్ బాల్ అంత పెద్ద పరిమాణంలో ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా జన్యుపరమైన కారణాల వల్ల పిత్తాశయంలో చాలా రాళ్లు వస్తాయి. అతి వేగంగా బరువు తగ్గడం లేదా యో-యో డైటింగ్ కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే జీవనశైలి, ఆహార అలవాట్లు, అంటే ఫాస్ట్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ , కొలెస్ట్రాల్ కొవ్వు అధికంగా ఉండే ఆహారం ప్రధాన కారణమని డాక్టర్ జిందాల్ అభిప్రాయపడ్డారు. వీటినిసకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరమైన కేన్సర్‌కు దారి తీయవచ్చని డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు. -
యూట్యూబ్‌లో చూస్తూ సర్జరీ.. అంతా బాగుంది అని అనుకునే లోపే
దేశంలో నకిలీ డాక్టర్ల రోజురోజుకి పెరిగిపోతున్నారు. వీరి కారణంగా అమాయకులు ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. తాజాగా వాంతులు అవుతున్నాయని 15ఏళ్ల బాలుడిని ఓ ఆస్పత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు. ఫేక్ డాక్టర్ చికిత్స చేయడంతో వాంతులు తగ్గాయి. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బాలుడికి యూట్యూబ్ చూస్తూ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. పరిస్థితి విషమించడంతో అత్యసర చికిత్స కోసం సదరు డాక్టర్.. మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. అయితే మార్గం మధ్యలో బాలుడు చనిపోవడంతో డెడ్ బాడీని ఆస్పత్రి ఆవరణలో వదిలేసి పారిపోయాడు నకిలీ డాక్టర్. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం సరణ్ ప్రాంతానికి చెందిన 15ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. మా అబ్బాయికి పలు మార్లు వాంతులయ్యాయి. చికిత్స కోసం గణపతి ఆస్పత్రికి తీసుకొచ్చాం.ఆస్పత్రిలో జాయిన్ చేయించిన కొద్ది సేపటికి వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ అజిత్ కుమార్ పూరి మాత్రం బాలుడికి ఆపరేషన్ చేశారు. యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ ఆపరేషన్ చేయడంతో నా కుమారుడు మరణించాడు అని బాలుడి తండ్రి చందన్ షా గుండెలవిసేలా రోదిస్తున్నారు.మేం డాక్టర్లమా.. లేదంటే మీరు డాక్టర్లా.. గణపతి ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వాంతులు తగ్గిపోయాయి. కానీ డాక్టర్ ఓ పని మీద తండ్రిని పంపించి, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నా మనువడికి ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. అనుమతి లేకుండా ఆపరేషన్ ఎందుకు చేస్తున్నారు? అని అడిగితే. పేషెంట్ నొప్పితో బాధపడుతున్నాడు. మేం డాక్టర్లమా? మీరు డాక్టర్లా? అంటూ మండిపడ్డారు. నా మనవడి జీవితం ఇలా ముగుస్తుందనుకోలేదు అయినా, ఆపరేషన్ చేశారు. అంతా బాగానే ఉందని అనుకున్నాం. కానీ ఆపరేషన్ జరిగిన సాయంత్రం నా మనవడి శ్వాస ఆగింది. సీపీఆర్ చేసిన నకిలీ డాక్టర్ అత్యవసర చికిత్స కోసం పాట్నాకు తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందడంతో నా మనవడి మృతదేహాన్ని ఆస్పత్రి మెట్లపై వదిలి పారిపోయారు. వాడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగుస్తుందని’ నేను అనుకోలేదని బాలుడి తాత ప్రహ్లాద్ ప్రసాద్ షా విచారం వ్యక్తం చేశాడు.విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ అజిత్ కుమార్ పూరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..
అండర్-19 ప్రపంచకప్-2022 గెలిచిన భారత కెప్టెన్ యశ్ ధుల్ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది అట్టహాసంగా ఆరంభించిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌కు సారథిగా ఎంపికైన అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్సీని జాంటీ సిద్ధుకు అప్పగించిన యశ్ ధుల్.. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నాడు.బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ మ్యాచ్‌కు దూరమయ్యాడు కూడా!.. ఇప్పటివరకు డీపీఎల్‌లో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 93 పరుగులే చేయగలిగాడు యశ్ ధుల్. ఈ నేపథ్యంలో కామెంటేటర్లు, విశ్లేషకులు ఈ 21 ఏళ్ల బ్యాటర్ ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు.క్రికెటర్ గుండెలో రంధ్రం.. ఇటీవలే సర్జరీఈ క్రమంలో యశ్ ధుల్ తన అనారోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యశ్ ధుల్‌కు బాల్యం నుంచే గుండెలో రంధ్రం ఉందని.. ఇటీవలే ఇందుకు సంబంధించిన సర్జరీ ఒకటి జరిగిందని అతడి తండ్రి విజయ్ న్యూస్18తో అన్నారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందినపుడు అక్కడి నిపుణులు యశ్ ధుల్ సమస్యను గుర్తించి.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.అందుకే ఆడలేదుఈ క్రమంలో ఢిల్లీలో సర్జరీ చేయించామని.. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విజయ్ వెల్లడించారు. ఇక ఇటీవల యశ్ ధుల్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారని అతడి కోచ్ ప్రదీప్ కొచ్చర్ తెలిపారు. అయితే, ఎండ, ఆర్ద్రత ఎక్కువగా ఉన్న సమయంలో యశ్ ధుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడన్నారు. రంజీ ట్రోఫీ ఆడే క్రమంలో ఇప్పటి నుంచే ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.సానుకూల దృక్పథంతో ఉన్నాఇక ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసిన అనంతరం ధుల్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు జరిగాయి. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిస్థాయిలో రాణిస్తాననే సానుకూల దృక్పథంతో ఉన్నాను. వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడతా’’ అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల ప్రకటించిన దులిప్ ట్రోఫీ-2024 రెడ్ బాల్ టోర్నీలో యశ్ ధుల్‌కు చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్-2023లో యశ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్.. ట్వీట్ వైరల్
తెలుగు స్టార్ హీరో రవితేజ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయమై ట్విటర్లో పోస్ట్ పెట్టాడు. సర్జరీ సాఫీగా సాగిందని, విజయవంతంగా పూర్తయిందని.. దీంతో డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నాడు. అందరి ఆశీర్వాదాలు, మద్ధతుకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)రీసెంట్గా 'మిస్టర్ బచ్చన్' సినిమాతో వచ్చిన రవితేజ.. ప్రస్తుతం భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. షూటింగ్లో భాగంగా రవితేజ గాయపడగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేశారు. అయితే రవితేజ గాయపడిన ఫొటో ఇదేనంటూ ఓ ఫేక్ పిక్‌ని తెగ వైరల్ చేశారు. ఇప్పుడు డిశ్చార్జ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్) -
ముక్కలైన చేయికి పునర్జన్మ
శివమొగ్గ: రెండు ముక్కలైన చెయ్యికి శస్త్ర చికిత్స చేసి వైద్యులు మళ్లీ ఒక్కటి చేశారు. ఈ అరుదైన సంఘటన శివమొగ్గ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో జరిగింది. ఓ సామిల్లో పనిచేసే కారి్మకుడు (35) చేయి రంపంలోకి చిక్కి రెండు ముక్కలైంది. వెంటనే అక్కడున్నారు విడిపోయిన చేతిని ఐస్‌బాక్స్‌లో పెట్టుకొని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు 7 గంటల పాటు శస్త్రచికిత్స చేసిన తెగిన చేతిని ఎముకలు, మాంసంతో పాటు కలిపారు. తరువాత వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించి బాగు కావడంతో డిశ్చార్జి చేశారు. అతని చెయ్యి త్వరలోనే మామూలుగా పనిచేస్తుందని వైద్యులు తెలిపారు. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చేతన్, ఎముకల వైద్యుడు డాక్టర్ మంజునాథ్, డాక్టర్ వాదిరాజు కులకరి్ణ, మూకర్ణప్ప, సంతో‹Ù, అర్జున్ ఈ శస్త్రచికిత్స చేశారు. -
బ్రెయిన్ సర్జరీలో వైద్యుల తప్పిదం..పాపం ఆ రోగి..!
బ్రెయిన్ సర్జరీ కోసం వెళ్లి పుర్రెలో కొంత భాగాన్ని కోల్పోయాడు. పోనీ అక్కడితో అతడి కష్టాలు ఆగలేదు. చివరికి వైద్యులు అతడికి సింథటిక్ ఎముకను అమర్చి సర్జరీ చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వకపోగా ఇన్ఫెక్షన్ సోకి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆస్పత్రి బిల్లులు కూడా తడసి మోపడయ్యాయి. వైద్యులు తప్పిదం వల్లే నాకి పరిస్థితి అని సదరు ఆస్పత్రిపై దావా వేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అమెరికాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళ్లలేక సెప్టెంబర్ 2022లో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ఉన్నట్లు గుర్తించాడు. దీని కారణంగా బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. ఆ సమయంలో వైద్యులు ఒత్తడిని తగ్గించేందుకు 4.7 బై-6-అంగుళాల పుర్రె ముక్కని తొలగించాలని నిర్ణయించారు. పుర్రె భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలిగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా..అక్కడ ఇతర రోగుల పుర్రె భాగాలు కూడా ఉండటంతో అందులో అతడిది ఏదో గుర్తించడంలో విఫలమయ్యారు వైద్యులు. దీంతో ఆస్పత్రి అతడికి సింథటిక్ పుర్రె భాగాన్ని కృత్రిమంగా తయారు చేసి ప్రత్యామ్నాయంగా అమర్చింది. ఇలా సింథటిక్ ఎముక కోసం సదరు రోగి నుంచి ఏకంగా రూ. 15 లక్షలు వసూలు చేసింది. అయితే ఇలా రోగికి సింథటిక్ ఎముకను పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ బారిని పడి అదనంగా మరికొన్ని సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పాలంటే సదరు రోగికి బ్రెయిన్ సర్జరీ శారీరకంగా, ఆర్థికంగా భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఈ సమస్య నుంచి బయటపడేటప్పటికీ అతడికి ఆస్పత్రి బిల్లు ఏకంగా కోటి రూపాయల పైనే ఖర్చు అయ్యింది. వైద్యుల తప్పిదం కారణంగా జరిగిన నష్టాన్ని కూడా తనపైనే రుద్ది మరీ డబ్బులు వసూలు చేశారంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను శరీరంలో కొంత భాగాన్ని కోల్పోవడమే గాక, ఆర్థికంగా శారీకంగా ఇబ్బందులు పడేలా చేసినందుకు గానూ సదరు ఆస్పత్రి తనకు నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ దావా వేశాడు.(చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
జన్మనిచ్చింది... కాలేయం ఇచ్చింది...
నాంపల్లి: కన్నకొడుకు కాలేయ సమస్యతో మంచంపట్టడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చింది ఓ తల్లి. ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రుల వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండ వనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య(03) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయసమస్యతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడి కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కాలేయమారి్పడి బృందం, నిలోఫర్ వైద్యు లు కలిసి ఈ నెల 3న ఆదిత్యకు కాలేయమారి్పడి చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నారు. వారిని మంగళవారం ఓజీహెచ్ నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే శస్త్రచికిత్స కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించి ఉంటే రూ.30 లక్షలు అయ్యేవని, కూలిపని చేసుకుని జీవించే తమ జీవితాల్లో ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రి వైద్యులకు వెలుగులు నింపారంటూ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
గర్భశయాన్ని తొలగించారు.. తల్లిని కాలేను.. హీరోయిన్ ఎమోషనల్!
నటి రాఖీ సావంత్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే నెటిజన్స్‌కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో స్పెషల్ సాంగ్స్‌కి కేరాఫ్‌గా నిలిచింది. తనదైన అందం, అభినయంతో బాలీవుడ్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత అవకాశాలు తగ్గడంతో రాఖీ పేరు అంతా మర్చిపోయారు. దీంతో కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉండి.. హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షోతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో రాఖీ చేసిన సందడి, కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆమెకు నెట్టింట మంచి ఆదరణ లభించింది. ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అయింది. కాంట్రవర్సీ పోస్ట్‌లతో హల్చల్ చేసింది. (చదవండి: డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి)అయితే గత కొన్నాళ్లుగా మాత్రం రాఖీ కాస్త సైలెంట్ అయిపోయింది. దానికి కారణం ఆమె అనారోగ్యం బారిన పడడమే. ప్రస్తుతం ఈ బ్యూటీ దుబాయ్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. ఆ మధ్య శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ తన ఆరోగ్య విషయాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది. (చదవండి: రొమాంటిక్ ఫొటోలతో ప్రియుడ్ని పరిచయం చేసిన బ్యూటీ)‘నాకు శస్త్ర చికిత్స జరిగిన విషయం వాస్తవమే. ఓ సారి వైద్యులు చెక్ చేసి గుండె పోటు లక్షణాలు ఉన్నాయని చెప్పారు. వైద్య పరిక్షల అనంతరం నా గర్భాశయంలో 10 సెంటీ మీటర్ల కణితి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయించుకోవాలని..లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని తెలిపారు. దీంతో నేను సర్జరీ చేయించుకున్నాను. కణితితో పాటు గర్భాశయాన్ని కూడా తొలగించారు. ఇక నేను తల్లిని కాలేనని వైద్యులు చెప్పడంతో ఏడ్చేశాను. నేను తల్లి అవ్వాలంటే.. సరోగసీ ద్వారా పిల్లలను పొందాల్సిందే’ అని రాఖీ సావంత్ ఎమోషనల్ అయింది. ఇక ఆస్పత్రిలో ఉన్నప్పుడు హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడని, తన మెడికల్ బిల్లులు మొత్తం ఆయనే కట్టేశాడని చెప్పింది. -
ఆరోజు రాత్రి వరకు అబ్బాయి.. లేచిన వెంటనే అమ్మాయిగా మార్పు..!
ప్రస్తుతం టెక్నాలజీకి తగ్గ రేంజ్లో ఘరానా దోపిడీలు, హైటెక్ మోసాలు ఊహకందని విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో మరింత ఘోరం. మనుషులకు తెలియకుండా అవయవాలు దోచేసుకుని వారి జీవితాలను నరకప్రాయంగా మార్చిన ఉదంతాలు కోకొల్లలు. వైద్యో నారాయణ హరిః అన్న వాక్యం వెలవెలబోయేలా ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అలాంటి దిగ్బ్రాతికర ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..సంజ్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల ముజాహిద్‌కి ఆ రోజు రాత్రితో తాను అతడుగా ఉండటం ఆఖరు అని ఊహించలేదు. ఆ రాత్రి తన పాలిట కాళరాత్రిగా మారి జీవితాన్ని శాపంగా మారుస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిద్ర పోయేంతరకు మగవాడిగా ఉన్నవాడు కాస్త మేలుకునేటప్పటికీ 'ఆమె'గా మారిపోయాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. బాధితుడు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన బేగ్రాజ్పూర్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముజాహిద్ గత రెండేళ్లుగా ఓం ప్రకాష్ అనే వ్యక్తి చేతిలో వేధింపులకు గురవ్వుతున్నట్లు తెలిపారు. తనతో కలిసి జీవించాలని ఉందంటూ ఓం ప్రకాష్ మజిహిద్ తనతు చెప్పేవాడని మజిహిద్ పేర్కొన్నాడు. అయితే దీన్ని తన సమాజం, కుటుంబం అంగీకరించిందని ముజాహిద్ వ్యతిరేకించడంతో బెదిరింపులకు దిగేవాడని వాపోయాడు. అస్సలు తాను ఆస్పత్రికి రాలేదనని ఓం ప్రకాశ్‌నే ఇక్కడకు తీసుకొచ్చాడని చెప్పుకొచ్చాడు. పడుకుని లేచి చూచేటప్పటికీ లింగ మార్పిడి శస్త్ర జరిగిపోయిందని భోరును విలపిస్తున్నాడు ముజాహిద్. ఓం ప్రకాష్ వైద్యలతో కుమ్మకై తనకు ఈ ఆపరేషన్ చేయించినట్లు చెబుతున్నాడు. ఆ తర్వాత ఓం ప్రకాష్ తన వద్దకు వచ్చి మగవాడిని కాస్త స్త్రీగా మార్చాను. "ఇక నువ్వు నాతోనే జీవించాలి లేదంటే నీ తండ్రిని చంపి మీకున్న భూమిని కూడా లాక్కుని లక్నో పారిపోతానని బెదిరించాడని". ముజాహిద్ కన్నీటి పర్యంతమయ్యాడు. అంతేగాదు ఆస్పత్రి రికార్డులో సైతం అతడికి ఏదో వైద్య సమస్యతో అక్కడకు వచ్చినట్లు ఉండటం గమనార్హం. ఈ మేరకు బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ముజఫర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఓం ప్రకాష్‌ని అరెస్టు చేయడమే గాక ఈ కేసుతో సంబంధం ఉన్న ఆస్పత్రి సిబ్బందిని కూడా క్షణ్ణంగా విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనపై బీకేయూ కార్యకర్తల రైతు నాయకుడు శ్యామ్‌పాల్ స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాలేజ్ వద్ద నిరసనకు దిగారు. ఈ ఆస్పత్రిలో బాధితుల సమ్మతి లేకుండానే అవయవాల మార్పిడి, లింగ మార్పిడి వంటి రాకెట్లు గుట్టుచప్పుడు కాకుండా జరుగిపోతున్నాయని ఆరోపించారు. ఇలాంటి దారుణ ఘటన జరగడం బాధకరమని, వెంటనే అందుకు గల బాధ్యుల తోపాటు ఈ ఘటనలో పాల్గొన్న వారిని కూడా గట్టిగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు ఆందోళనకారులు నిరసనలను విరమింప చేయడమే కాకుండా ఈ ఘటపై సత్వరమై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (చదవండి: బీచ్‌లో సరదాగా జంట ఎంజాయ్ చేస్తుండగా..అంతలోనే..) -
విజయవంతంగా యువకుడి గుండె మార్పిడి
తిరుపతి తుడా: స్థానిక టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లో శుక్రవారం ఓ యువకుడికి వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. ఐదు గంటలు శ్రమించి వైద్యులు ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలు... కాకినాడకు చెందిన ఓ యువకుడు(24) గుండె సంబంధ సమస్యతో బాధపడుతూ రెండు నెలలుగా తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. అతని గుండె సామర్థ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు నిర్ధారించారు. అతనికి గుండె మార్పిడి అనివార్యమని గుర్తించారు. ఈ మేరకు నెల రోజుల కిందట ఆ యువకుడి వివరాలను అవయవదాన్ వెబ్సైట్లో నమోదు చేశారు. గుండె అందుబాటులోకి వచ్చే వరకు ఆ యువకుడిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు(39) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ యువకుడి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించడంతో అతని అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.ఈ మేరకు అవయవదాన్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేశారు. దీంతో శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ వైద్యులు విశాఖ వెళ్లి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను సేకరించి ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి గ్రీన్ చానల్ ద్వారా 19 నిమిషాల్లో శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు చేర్చారు. వెంటనే 2.15 గంటలకు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్సను ప్రారంభించి, సాయంత్రం 7.15 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా వైద్యులను పలువురు అభినందించారు. 15 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు గుండె మార్పిడి ఆపరేషన్లలో తిరుపతికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. మహా నగరాల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే చేస్తున్న గుండె మార్పిడి శస్త్రచికిత్సలను టీటీడీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లోనూ విజయవంతంగా చేపడుతున్నారు. ఈ ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే 2,560 మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలను చేశారు. అదేవిధంగా శుక్రవారంతో 15 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. -
టీమిండియా స్టార్ ప్లేయర్‌కు సర్జరీ.. మూడు నెలలు ఆటకు దూరం
కొంత కాలంగా గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు తన కుడికాలికి సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు ఠాకూర్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు.అయితే తన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు శార్దూల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను ఠాకూర్ షేర్ చేశాడు. నా సర్జరీ విజయవంతంగా నిర్వహించబడింది అంటూ క్యాప్షన్‌గా ఠాకూర్ ఇచ్చాడు. కాగా ఠాకూర్ కుడి కాలి పాదానికి శస్త్రచికిత్స జరగడం ఇది రెండో సారి. ఐదేళ్ల క్రితం 2019లో తొలిసారి శార్ధూల్ సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఈ గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా గాయం మళ్లీ తిరగబెట్టింది.దీంతో మరోసారి అతడు శస్త్రచికిత్స చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. శార్ధూల్ తిరిగి మళ్లీ ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న రంజీ ట్రోఫీతో పునరాగామనం చేసే ఛాన్స్ ఉంది. కాగా ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఠాకూర్ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. -
అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
హీరోయిన్ సమీరా రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఆమె సినిమాలకు సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. 2014లో అక్షయ్‌ని వివాహం చేసిన ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. అయితే ప్రస్తుతం సమీరా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటోంది. అయితే నటిగా ఉన్నప్పుడు తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. కొందరు ఏకంగా సర్జరీ చేయించుకోవాలని సలహాలిచ్చాలంటూ వెల్లడించింది. ఆ సమయంలో తాను చాలా ఒత్తిడికి గురైనట్లు పేర్కొంది.సమీరా మాట్లాడుతూ..'నా కెరీర్లో అగ్రస్థానంలో ఉన్న రోజుల్లో నాపై ఒత్తిడి చాలా ఉండేది. చాలామంది బూబ్ జాబ్ సర్జరీ(బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరు చేయించుకుంటున్నారు కదా.. మీకేమైందంటూ అడిగేవారు. సర్జరీ చేసుకోమని నాపై ఒత్తిడి తెచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు. మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు. నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. ఎందుకంటే నా విషయంలో సమస్యను నేను అంతర్గతంగానే పరిష్కరించుకోగలను' అని చెప్పింది. -
బాలీవుడ్ నటికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే?
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవలే సర్జరీ చేయించుకుంది. తన గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఇది జరిగి 10 రోజులు అవుతుండగా ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. తాజాగా రాఖీ వైద్య పరిస్థితిని తెలుపుతూ ఆమె మాజీ భర్త రితేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఆమె మళ్లీ మనలో ఒకరిగా తిరగనుంది. తను నడవగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది అని రాసుకొచ్చాడు. బాధలో ఉంటే నవ్వులాటగా ఉందా?ఈ వీడియోలో రాఖీ అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా కష్టపడుతోంది. ఆ నొప్పిని భరించలేకపోతోంది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా రాఖీ సర్జరీ చేయించుకోబోతుందన్నప్పుడు చాలామంది వెటకారంగా మాట్లాడారు. తనను దూషించారు. అలాంటివారిపై రితేశ్ తీవ్రంగా మండిపడ్డాడు. ఒకరు బాధలో ఉంటే చూసి నవ్వడానికి మనసెలా వస్తుందో.. ఈ సమయంలో కూడా తనమీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మీరసలు మనుషులు కాదుఅవతలివారి కష్టాన్ని అర్థం చేసుకోవడానికి బదులు ఎగతాళి చేస్తున్నవాళ్లు అసలు మనుషులే కాదు అని ఆగ్రహించాడు. రాఖీ పొట్టలో నుంచి తీసిన గడ్డను సైతం చూపిస్తూ.. ఇది ఎంత పెద్ద కణతో చూశారా? రాఖీకి మేమంతా ఉన్నాం అని చెప్పుకొచ్చాడు. అయితే రాఖీ రెండో మాజీ భర్త మాత్రం ఇదంతా డ్రామానే అని కొట్టిపారేశాడు. లీక్డ్ వీడియోల కేసులో నుంచి తప్పించుకోవడానికే ఆపరేషన్ అని డ్రామా ఆడుతోందని విమర్శించాడు. View this post on Instagram A post shared by Ritesh Kumar (@riteshsinghofficialbb15) చదవండి: సన్ ఫ్లవర్‌లా స్టార్ హీరోయిన్.. ఆ డ్రెస్సు ఎంతకు అమ్మిందంటే? -
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్ప్లాంటేషన్లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్‌లోని బ్రెయిన్‌బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్‌డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్బ్రిడ్జ్లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్‌ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్‌లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్‌ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!) -
స్లొవాకియా ప్రధానికి మరో శస్త్రచికిత్స
బ్రాటిస్లావా: హత్యాయత్నానికి గురైన స్లొవాకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోకు శుక్రవారం మరో శస్త్రచికిత్స జరిగింది. 59 ఏళ్ల ఫికో పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం హండ్లోవా పట్టణంలో ప్రభుత్వ సమావేశం తర్వాత బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తుండగా ఒక దుండగుడు ఫికోపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను బన్స్కా బి్రస్టికాలోని ఎఫ్.డి.రూజ్వెల్ట్ ఆసుపత్రికి తరలించారు. ఫికోకు సి.టి. స్కాన్ తీశామని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ విషమంగానే ఉందని రూజ్వెల్ట్ ఆసుపత్రి డైరెక్టర్ మిరియమ్ లపునికోవా తెలిపారు. ఫికో స్పహలోనే ఉన్నారని చెప్పారు. శరీరంలో మృత టిçష్యూను తొలగించడానికి శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించారు. -
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
పంజాబ్‌కు చెందిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అత్యవసర కంటి శస్త్రచికిత్సకోసం లండన్‌లో ఉన్నారు. రెటీనాకు రంధ్రం కారణంగా విట్రెక్టమీ సర్జరీకోసం లండన్‌కు వెళ్లినట్టు ఢిల్లీ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అసలు విట్రెక్టమీ అంటే ఏమిటి? కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందా? ఆ వివరాలు ఒకసారి చూద్దాం.రాఘవ్ చద్దాం రెటీనాలో రంధ్ర కారణంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకే అత్యవసరంగా ఆయనకు ఆపరేషన్ చేశారు. ఇది ప్రమాదకరమే అయినప్పటికీ, శస్త్రచికిత్స బాగానే జరిగిందని ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలుస్తోంది. బయటికి వెళ్లకుండా, ఎండతగలకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులుఘసూచించారనీ, పరీక్షలు, చెకప్ కోసం వారానికి రెండుసార్లు వైద్యుడిని సందర్శించాల్సిఉంటుందనీ ఈ నేపథ్యంలో డాక్టర్లు అనుమతి ఇచ్చినప్పుడే అతను ఇండియా వచ్చే అవకాశం ఉందని బంధువుల సమాచారం.విట్రెక్టమీ అంటే ఏమిటి?జాన్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం, కంటి లోపల రెటీనా వెనుక ఏర్పడిన జెల్ లాంటి పదార్థాన్ని (విట్రస్ జెల్)ని బయటకు తీసివేసేందుకు నిర్వహించే సర్జరీనే విట్రెక్టమీ అంటారు. రెటీనా వెనుక పేరుకున్న పదార్థాన్ని తొలగించి, సెలైన్ ద్రావణంతోగానీ, గ్యాస్ బబుల్‌తో గానీ ఆ ప్రదేశాన్ని భర్తీ చేస్తారు.మధుమేహం కారణంగావచ్చే డయాబెటిక్ రెటినోపతి, రెటీనా డిటాచ్మెంట్, విట్రస్ హెమరేజ్ లేదా తీవ్రమైన కంటి గాయాలు, కంటి ఇన్ఫెక్షన్లు, కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత సమస్యలు, ఇతర కంటి సమస్యల కారణంగా విట్రెక్టమీ అవసరం కావచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా, చికిత్స చేయకుండా వదిలివేసినా, అంధత్వానికి దారితీయవచ్చు.కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా కాంతిని సంగ్రహించి, మెదడుకు దృశ్య సంకేతాలను ప్రసారం చేస్తుంది. క్లియర్ విట్రస్ జెల్ కాంతిని రెటీనాకు చేరవేస్తుంది. తద్వారా మనకు దృశ్యాలు కనిపిస్తాయి. అయితే అక్కడ రక్తం గడ్డకట్టడం, గడ్డలు లాంటివి ఈ కాంతిని అడ్డు పడతాయి. ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. రెటీనాకు ప్రాప్యతను మెరుగుపరచడానికి దానిపై ఒత్తిడిని తగ్గించడానికి విట్రెక్టోమీ చేస్తారు.తద్వారా కంటిచూపు మెరుగవుతుంది. కొన్నిసందర్భాల్లో, కోల్పోయిన దృష్టిని పునరుద్ధరించడంలో సహాయ పడుతుంది.విట్రెక్టమీ: ప్రమాదమా?విట్రెక్టమీ అనేది డయాబెటిక్ ఐ డిసీజ్ (డయాబెటిక్ రెటినోపతి), రెటీనా డిటాచ్మెంట్లు, మాక్యులర్ హోల్స్, మాక్యులర్ పుకర్, విట్రస్ హెమరేజ్‌తో సహా కొన్ని వ్యాధి పరిస్థితులలో కంటి కేంద్ర కుహరం నుండి విట్రస్ను తొలగించే శస్త్రచికిత్సా ప్రక్రియ. ప్రత్యేకంగా రూపొందించిన సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించి రెటీనా సర్జన్ చేస్తారు. లోకల్ అనస్థీషియాలో నిర్వహించే డే కేర్ ప్రక్రియ. సాధారణంగా, విట్రెక్టోమీకి సుమారు రెండు గంటలు పడుతుంది, కొన్నిసార్లు,క్లిష్టమైన కేసులకు ఎక్కువ సమయం పడుతుంది. విట్రెక్టమీని ప్రస్తుతం ఆధునిక పద్దతుల్లో 23 గేజ్ ట్రోకార్- కాన్యులా సిస్టమ్ (మైక్రోఇన్సిషన్ సర్జరీ) ద్వారా కుట్లు లేకుండా, వేగంగా చేస్తున్నారు.విట్రెక్టోమీ సాధారణంగా సురక్షితమైనది.కంటిచూపును కాపాడటం కోసం చేసే సర్జరీ. కానీ ఇతర ఆపరేషన్ల మాదిరిగానే రోగి వయస్సు, ఆరోగ్యం , కంటి సమస్య తీవ్రతను బట్టి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ఇన్ఫెక్షన్ రావచ్చుఅధిక రక్తస్రావం అయ్యే ప్రమాదంకంటి లోపల ఒత్తిడి పెరగుతుంది.శస్త్రచికిత్స కారణంగా కొత్త రెటీనా డిటాచ్మెంట్ సమస్యకంటి లెన్స్ దెబ్బతినడంకంటిశుక్లం ఏర్పడే అవకాశంశస్త్రచికిత్స అనంతర కంటి కదలికలో ఇబ్బందులువక్రీభవన లోపంలో మార్పులు (అద్దాలు, లెన్స్ అవసరం)ఈ శస్త్రచికిత్స అసలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోవచ్చు కూడా. దీనికి మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. కాగా హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ చద్దా గత ఏడాది సెప్టెంబర్‌లో ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పరిణీతి తన లేటెస్ట్ మూవీ అమర్ సింగ్ చమ్కిలా ప్రమోషన్లో బిజీగా ఉంది.