Kajol Says She Has Not Undergone Any Surgery to Become Fair - Sakshi
Sakshi News home page

Kajol: తెల్లగా కనిపించేందుకు సర్జరీ? హీరోయిన్‌ ఏమందంటే..

Published Thu, Apr 13 2023 4:49 PM | Last Updated on Thu, Apr 13 2023 5:38 PM

Kajol Says She Not Undergone Any Surgery To Become Fair - Sakshi

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే అభినయం మాత్రమే కాదు, అందం కూడా ఉండాలి, ఉన్న అందాన్ని కాపాడుకోవాలి. అందుకోసం తారలు పడే తిప్పలు చెప్పనలవి కాదు. కడుపు మాడ్చుకుంటూ డైటింగ్‌లు, చెమటలు వచ్చేలా జిమ్‌లో కసరత్తులు సరేసరి.. కొందరు ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటారు. అలా బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ కూడా ఆ మధ్య సర్జరీ చేయించుకుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో కాజోల్‌ స్పందించింది.

'ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో నన్ను చాలామాటలన్నారు. నల్లగా ఉంది, బండగా ఉంది. ఎప్పుడూ కళ్లద్దాలు పెట్టుకునే ఉంటుందని విమర్శించారు. అవేమీ నేను పట్టించుకోలేదు. నా గురించి విమర్శించేవాళ్ల కంటే నేను స్మార్ట్‌, బెటర్‌ అనే అనుకున్నాను. నేను నాలా ఉండాలనే నిశ్చయించుకున్నాను. అందం కోసం, తెల్లగా మారడం కోసం ఎటువంటి సర్జరీ చేయించుకోలేదు. కేవలం ఎండకు దూరంగా ఉన్నాను. గతంలో పదేళ్లు ఎండలోనే పనిచేయాల్సి రావడంతో స్కిన్‌ ట్యాన్‌ అయి నల్లగా అయ్యాను. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఎండలోకి వెళ్లకపోవడంతో చర్మం ట్యాన్‌ అవడం లేదు. అందుకే తెల్లగా కనిపిస్తున్నాను. అంతే తప్ప తెల్లగా కనిపించేందుకు ఏ సర్జరీ చేయించుకోలేదు' అని చెప్పుకొచ్చింది కాజోల్‌. 

కాగా కాజోల్‌ 17 ఏళ్ల వయసులోనే సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. 1992లో వచ్చిన బేఖుడి చిత్రంతో ఆమె వెండితెరపై అరంగేట్రం చేసింది. బాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఆమె 'ద గుడ్‌ వైఫ్‌' వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement