
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘దో పత్తి’.. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కృతి సనన్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది. అయితే, ఇప్పటి వరకు నటిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
'దో పత్తి' సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. మిస్టరీ థ్రిల్లర్ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015లో దిల్‌వాలే సినిమాలో కృతి సనన్, కాజోల్ ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'దో పత్తి' సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment