
బాలీవుడ్‌లో ‘జబ్ వియ్ మెట్, రాక్‌స్టార్, హైవే, లవ్ ఆజ్ కల్’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఇంతియాజ్ అలీ. తాజాగా ఈ దర్శకుడు ‘ఓ సాథీ రే’ అనే వెబ్ సిరీస్‌తో అసోసియేట్ అయ్యారు. కానీ దర్శకుడిగా కాదు. రైటర్, షో రన్నర్‌గా చేస్తున్నారు. ఈ సిరీస్‌కు అరిఫ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, హ్యూమన్ ఎమోషన్స్ ప్రధానాంశాలుగా ఉన్న ఈ సిరీస్‌లో అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari), అర్జున్ రాంపాల్, అవినాష్ తివారీ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
‘‘ఈ రోజుల్లో అప్పటి వింటేజ్ లవ్ ఫీల్‌ని ఈ సిరీస్‌తో వీక్షకులు అనుభూతి చెందుతారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హీరో సిద్దార్థ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అదితిరావు ఒప్పుకున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే! ప్రస్తుతం అదితి.. ఓ సాథిరే సిరీస్‌తో పాటు హీరామండి 2 వెబ్ సిరీస్, లయనెన్స్ అనే హాలీవుడ్ సినిమా చేస్తోంది. అదితిరావు- సిద్దార్థ్ 2024లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.
చదవండి: దేవుడు చూస్తున్నాడు.. అందుకే ఆ హీరోయిన్ పత్తా లేకుండా పోయింది
Comments
Please login to add a commentAdd a comment