బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీఖాన్ నటుడిగా బిగ్ స్క్రీన్‌కు పరిచయం కాబోతున్నాడు. ఎంతోమంది స్టార్ కిడ్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నడానియన్ (Nadaaniyan) అన్న టైటిల్ ఖరారు చేశారు. దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సునీల్ శెట్టి, దియా మీర్జా, జుగల్ హన్సరాజ్, మహిమా చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఓటీటీలో రిలీజ్ కానున్న ఫస్ట్ మూవీ
ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్ ఎప్పుడన్నది చెప్పకుండా త్వరలోనే అంటూ సస్పెన్స్‌లో ఉంచింది. ఈ సినిమాతో షావునా గౌతమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' సినిమాకు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.
ఇబ్రహీం..
సైఫ్ అలీఖాన్, అతడి మాజీ భార్య అమృతా సింగ్ తనయుడే ఇబ్రహీం. మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం సైఫ్.. హీరోయిన్ కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తైమూర్, జెహంగీర్ అని ఇద్దరు కుమారులు సంతానం.
చదవండి: అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్
Comments
Please login to add a commentAdd a comment