స్టార్ హీరో కుమారుడితో హీరోయిన్.. దివాళీ బాష్‌లో మెరిసిన ప్రేమజంట..!
బాలీవుడ్ భామ పాలక్ తివారీ ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతోంది. గతేడాది కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ అనే మూవీతో అభిమానలను అలరించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించింది. బాలీవుడ్ నటి శ్వేత తివారీ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ కొన్ని నెలలుగా ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ బీటౌన్లోనే వినిపిస్తూనే ఉన్నాయి.బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాకుడా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. గతంలో ఇబ్రహీం, పాలక్ తివారీ గోవా నుంచి తిరిగివస్తూ విమాశ్రయంలో కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఓసారి అతని ఇంటి వద్ద కూడా కనిపించింది.తాజాగా ఈ జంట ప్రముఖ డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా దీపావళి పార్టీలో మెరిశారు. వీరిద్దరు కలిసి పార్టీకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇబ్రహీం అలీ ఖాన్ తన ప్రియురాలు పాలక్ తివారీని కలిసి వెళ్లడం కనిపించింది. అయితే వీరిద్దరి డేటింగ్‌పై ఇప్పటివరకు స్పందించలేదు.కాగా.. సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన పాలక్ తివారీ మరో చిత్రంలో నటిస్తోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న రోసీ: ది సాఫ్రాన్ చిత్రంలో కనిపించనుంది. మరోవైపు కరణ్ జోహార్ రాబోయే చిత్రం 'సర్జమీన్'చిత్రం ద్వారా ఇబ్రహీం అలీ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)