
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా వస్తోన్న చిత్రం నదానియన్(Nadaaniyan). ఈ మూవీలో జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్(khushi kapoor) హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ నదానియన్ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేసింది. వచ్చేనెల మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.
కాగా.. ఈ సినిమాకు శౌనా గౌతమ్ దర్శకత్వం వహించారు. ఏ ధర్మాటిక్ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, దియా మీర్జా, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇటీవల ఖుషీ కపూర్ లవ్‌యాపా మూవీతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.
Kuch Kuch Hota Hai aisi Nadaaniyan dekh kar 🥰💕
Watch Nadaaniyan, out 7 March, only on Netflix!#NadaaniyanOnNetflix pic.twitter.com/piwn818AFx— Netflix India (@NetflixIndia) February 20, 2025
Comments
Please login to add a commentAdd a comment