
క్రికెటర్లు కాస్త యాక్టర్లు అవుతున్నారు. గతంలో గ్రౌండ్‌లో పోర్లు, సిక్సర్ల వర్షం కురపించిన స్టార్ క్రికెటర్లు..ఇప్పుడు తమ యాక్టింగ్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడానికి రెడీ అవుతున్నారు. చేసేది చిన్నదే అయినా.. కథకు చాలా కీలకమైన పాత్రల్లో మెరవబోతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘రాబిన్‌హుడ్’ సినిమాతో వెండితెర ఆరంగ్రేటం చేశాడు. ఇక ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కూడా నటుడిగా మారినట్లు తెలుస్తోంది. ఆయన ఓ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించినట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
పోలీసు పాత్రలో గంగూలీ
జీత్, ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2). మార్చి 20 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.ఇందులో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఆయన పోలీసు డ్రెస్‌లో ఉన్న పిక్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వెబ్ సిరీస్‌లో గంగూలీ పోలీసు ఉన్నతాధికారిగా కనిపించబోతున్నారట. తెరపై కనిపించేది కాసేపే అయినా.. కథకి కీలకమైన పాత్ర అయిన ప్రచారం జరుగుతోంది.
ప్రమోషన్ కోసమేనా?
అయితే ఈ వెబ్ సిరీస్‌లో గంగూలీ నటించారనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అలా అని ఈ రూమర్‌ని ఖండించడమూ లేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత నీరజ్ పాండే ఈ గాసిప్‌పై స్పందిస్తూ..‘నేను చెప్పడం ఎందుకు..మార్చి 20న తర్వాత గంగూలీ నటించారో లేదే మీకే తెలుస్తుంది’ అని అన్నారు. దీంతో గంగూలీ నిజంగానే ఈ వెబ్ సిరీస్‌లో నటించారని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతుంటే..మరికొంత మంది ఏమో సినిమా ప్రమోషన్‌లో ఆయన పాల్గొన్నారని, అందులో భాగంగానే పోలీసు యూనిఫాంలో కనిపించారని కామెంట్ చేస్తున్నారు.
యదార్థ సంఘటనలతో ఖాకీ 2
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు కొనసాగింపుగా ఖాకీ2 వెబ్ సిరీస్ తెరకెక్కింది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని తెరకెక్కించారు. మరోవైపు గంగూలీ జీవిత చరిత్రపై ఓ సినిమా తెరకెక్కబోతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్‌రావు హీరోగా నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment