
హారర్ కంటెంట్‌ను ఇష్టపడనివారు ఎవరుంటారు? ఈ మధ్య యాక్షన్, ప్రేమకథా చిత్రాలెక్కువైపోవడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓ కొత్త హారర్ సిరీస్‌ను ఓటీటీ (OTT) ప్రియుల ముందుకు తీసుకొస్తోంది. అదే ఖౌఫ్. ఈ సిరీస్ కథేంటంటే.. ఓ అమ్మాయి స్వేచ్ఛగా బతకాలని పట్టణంలోని ఓ హాస్టల్‌లోకి అడుగుపెడుతుంది.
ఏం జరిగింది?
అప్పటికే అక్కడున్నవారు వెంటనే వెళ్లిపోమని సలహా ఇస్తారు. తర్వాత వెళ్లాలనుకున్నా వెళ్లలేవని హెచ్చరిస్తారు. వారి మాటల్ని ఆ అమ్మాయి లెక్క చేయదు. ఇంతకీ తన గదిలో ఏముంది? ఆ హాస్టల్ నుంచి అమ్మాయిలు ఎందుకు బయటపడలేకపోతున్నారు? చివరకు ఏం జరిగింది? వంటి అంశాలు తెలియాలంటే ఖౌఫ్ (Khauf Web Series) చూడాల్సిందే!
ఓటీటీలో ఎప్పుడంటే?
మోనిక పన్వర్, రజత్ కపూర్, గీతాంజలి కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఖౌఫ్ సిరీస్‌ను పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ డైరెక్ట్ చేశారు. మ్యాచ్‌బాక్స్ షార్ట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సిరీస్ ఏప్రిల్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఖౌఫ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో హాస్టల్ గదిలోని అమ్మాయిలు భయంతో వణికిపోతున్నట్లుగా చూపించారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోవాలనుకున్న వారి కంఠం తెగడాన్ని చూపించారు. హారర్ కథల్ని ఇష్టపడేవారు వచ్చే శుక్రవారం ప్రైమ్‌లో ఖౌఫ్ చూసేయండి..