ఆస్పిరెంట్స్‌ 2 ఓటీటీ డేట్‌ వచ్చేసింది.. అప్పటినుంచే స్ట్రీమింగ్‌! | Aspirants 2 OTT Release Date Confirmed | Sakshi
Sakshi News home page

Aspirants 2: ఆస్పిరెంట్స్‌ మళ్లీ వచ్చేస్తున్నారు.. ఆ ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

Published Thu, Oct 19 2023 7:05 PM | Last Updated on Thu, Oct 19 2023 7:18 PM

Aspirants 2 OTT Release Date Confirmed - Sakshi

యూపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా క్లిష్టమైన విషయం. అలాంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల బాధల్ని, కష్టాల్ని కళ్లకు కట్టినట్లు వివరించిన వెబ్‌ సిరీస్‌ ఆస్పిరెంట్స్‌. నవీన్‌ కస్తూరియా, సన్నీ హిందూజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ గతంలో ఐదు ఎపిసోడ్లతో ప్రసారమవగా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్‌ తెరకెక్కింది.

అపూర్వ్‌ సింగ్‌ కర్కి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో అక్టోబర్‌ 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఆస్పిరెంట్స్‌ 2 సిరీస్‌ ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో ఐఏఎస్‌ కోసం కష్టపడుతున్నవారితో పాటు ఆ ఉద్యోగాన్ని అందుకుని వృత్తిలో ఇబ్బందులుపడుతున్నవారి బాధల్ని కూడా చూపించారు. ఇక ఈ సీజన్‌లో నవీన్‌ కస్తూరియా, సన్నీ హిందూజ, శివంకిత్‌ సింగ్‌, అభిలాష్‌, నమిత దూబే ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ సీజన్‌ ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి!

చదవండి: గౌరీ కోసం పిచ్చోడిలా తిరిగిన షారుక్‌.. సినిమాకు ఏమాత్రం తీసిపోని లవ్‌స్టోరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement