aspirants
-
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. అక్రమ కట్టడాలపై బుల్డోజర్
దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందడానికి కారణమైన ని ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలో ఢిల్లీ ప్రభుత్వం బుల్డోజర్ చర్యను ప్రారంభించింది. కాలువలు, డ్రైనేజీలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసే పనులు చేపట్టారు.కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ ప్రాంతంలో డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడాలను, పాత్‌వేలను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు. డ్రైనేజీలోకి నీరు వెళ్లకుండా రహదారులపై అడ్డుగా నిర్మించిన సిమెంట్ బ్లాక్స్‌ను పొక్లెయిన్లతో సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ బుల్డోజర్ చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లో రావూస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు.#WATCH | Earth movers put into action to remove encroachment over drains in Delhi's Old Rajinder Nagar after the incident of death of 3 UPSC aspirants due to drowning in an IAS coaching institute pic.twitter.com/NR6sjw5a7b— ANI (@ANI) July 29, 2024 -
ఆస్పిరెంట్స్ 2 ఓటీటీ డేట్ వచ్చేసింది.. అప్పటినుంచే స్ట్రీమింగ్!
యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా క్లిష్టమైన విషయం. అలాంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల బాధల్ని, కష్టాల్ని కళ్లకు కట్టినట్లు వివరించిన వెబ్ సిరీస్ ఆస్పిరెంట్స్. నవీన్ కస్తూరియా, సన్నీ హిందూజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ గతంలో ఐదు ఎపిసోడ్లతో ప్రసారమవగా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్ తెరకెక్కింది. అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఆస్పిరెంట్స్ 2 సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఐఏఎస్ కోసం కష్టపడుతున్నవారితో పాటు ఆ ఉద్యోగాన్ని అందుకుని వృత్తిలో ఇబ్బందులుపడుతున్నవారి బాధల్ని కూడా చూపించారు. ఇక ఈ సీజన్లో నవీన్ కస్తూరియా, సన్నీ హిందూజ, శివంకిత్ సింగ్, అభిలాష్, నమిత దూబే ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ సీజన్ ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి! చదవండి: గౌరీ కోసం పిచ్చోడిలా తిరిగిన షారుక్.. సినిమాకు ఏమాత్రం తీసిపోని లవ్‌స్టోరీ -
హైదరాబాద్: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు, అఖిలపక్ష నేతలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదే విధంగా గన్ పార్క్ వద్దకు రాకుండా ఆంక్షలు విధించిన పోలీసులు గన్ పార్క్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో వైపున గన్‌పార్క్ వద్ద దీక్షలో పాల్గొంటామన్న కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రొ.కోదండంరాంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లను ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చదవండి: జోడు పదవుల్లో కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలకు.. బీజేపీ వ్యూహమేంటి -
గ్రూప్–4 పరీక్షకు విస్తృత ఏర్పాట్లు
సుభాష్‌నగర్: టీఎస్పీఎస్సీ ద్వారా జూలై 1న జరగనున్న గ్రూప్–4 పరీక్ష నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గ్రూప్–4 పరీక్షలను పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శా ఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వ హించారు. పరీక్ష ఏర్పాట్లు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై అదనపు కలెక్టర్ వివరించారు. జూలై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో 39,183 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వివరించారు. వీరి కోసం 125 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామ న్నారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఇప్పటికే అత్యధిక మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని, మిగతా వారు కూడా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం 15 నిమిషాలు ముందే కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. సమయం దాటితే లోనికి అనుమతి ఉండదని స్పష్టంచేశారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్టాండ్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైజనింగ్ ఆఫీసర్, ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామని చెప్పారు. అభ్యర్థులు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ మధుసూదన్‌రావు, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, డీఐఈవో రఘురాజ్, డీఈవో దుర్గాప్రసాద్, డీటీసీ వెంకటరమణ, చీఫ్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
AP Police Constable Exam: ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతి ఉండదు
ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు ఈనెల 22 ఆదివారం నిర్వహించనున్న ప్రాథమిక రాత పరీక్షలకు అన్నీ రకాల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 22,281 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, వీరిలో పురుషులు 17,833 మంది, మహిళలు 4448 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 17, మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో 21 మొత్తం 38 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను అనుమతిస్తారని, 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. హాల్ టికెట్లలో పేర్కొన్న నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచీలు, బ్లూ టూత్, కాలిక్యులేటర్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అనుమతించేది లేదన్నారు. అమలులో 144 సెక్షన్: పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 విధిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించారని, స్ట్రాంగ్ రూంలు, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారని వివరించారు. పోలీసు శాఖ అధికారులు, రీజినల్ కో ఆర్డినేటర్, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లు సమన్వయంగా విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఒంగోలులోని పరీక్ష కేంద్రాల వద్ద అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, మార్కాపురానికి అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎస్వీ శ్రీధరరావులను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టు పక్కల జిరాక్స్ షాపులను మూసి వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్: అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరడానికి మార్గమధ్యంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండుల వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని, మూడు నాలుగు కేంద్రాలకు క్లస్టర్ చేసి ఒక ఇన్స్పెక్టరును ఇన్చార్జిగా నియమించినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా జరిగేలా ఫ్లయంగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. -
పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. కీలక సూచనలివే!
సాక్షి, అమరావతి: పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ప్రిలిమినరీ పరీక్షకు సమయపాలనను కచ్చితంగా పాటించాలని పోలీసు నియామక మండలి నిర్ణయించింది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించరనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం 5.03 లక్షలమంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టుల భర్తీకి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు పోలీసు నియామక మండలి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు చేసింది. అవి.. ► అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్షకేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి. ► అభ్యర్థులను ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పరీక్షకేంద్రంలోకి అనుమతిస్తారు. ► ఉదయం 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. ► మొబైల్ ఫోన్/సెల్యూలార్ ఫోన్, ట్యాబ్/ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు/రికార్డింగ్ పరికరాలు, కాలిక్యులేటర్, లాగ్ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. వాటిని పరీక్షకేంద్రం వద్దకు తీసుకురాకూడదు. వాటిని భద్రపరిచేందుకు పరీక్షకేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. ► అభ్యర్థులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలి. ► హాల్‌టికెట్, బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ తీసుకురావాలి. -
కన్సల్టెన్సీలకు అనుమతులు ఉన్నాయా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాలకు పంపుతామంటూ కరీంనగర్లో ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలు వెలుస్తున్నాయి. తాజాగా కంబోడియాలో ఐదుగురు యువకులను సైబర్ స్కాం ముఠా చేతిలో బందీలుగా చిక్కడంతో ఈ కన్సెల్టెన్సీల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. విదేశాల్లో చదువుకోవడం, కొలువులు చేయడం కొన్నేళ్లుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా విద్యార్థులు, నిరుద్యోగులకు సాధారణ విషయం. ఇలాంటి వ్యవహారాల్లో విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. అడ్మిషన్ ఖరారయ్యాక నేరుగా వర్సిటీకి వెళ్లి చదువుకుంటారు. కానీ.. ఉపాధి చూపిస్తామని వెలిసే కన్సల్టెన్సీలకు అన్ని అనుమతులు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయా? అంటే ఈ విషయానికి సమాధానం నిర్వాహకులే చెప్పాలి. మరోవైపు ఐదుగురు యువకుల క్షేమంపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి వారిని కాంబోడియాకు పంపామని, మరోసారి రూ.3 లక్షలు చెల్లించే స్థోమత లేదని వాపోతున్నారు. వీలైనంత త్వరగా వారిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ● నగరంలో ఇష్టానుసారంగా వెలుస్తున్న కన్సల్టెన్సీలు ● నిరుద్యోగులకు ఉపాధి ఆశచూపి విమానమెక్కిస్తున్న ఏజెంట్లు ● వెళ్లినవారిలో షాబాజ్‌ఖాన్‌ది దయనీయ గాధ ● పెళ్లైన వారానికే కంబోడియాకు ప్రయాణం ● తమవారి క్షేమంపై కుటుంబసభ్యుల ఆందోళన భారతీయ నిరుద్యోగులను విదేశాలకు పంపి ఉపాధి చూపించే కన్సెల్టెన్సీలు విధిగా పాటించాల్సిన నిబంధనలను కేంద్ర విదేశాంగశాఖ తన వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొంది. 1. ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 (సెక్షన్ 10) ప్రకారం.. ఎవరైతే భారతీయులకు విదేశాల్లో ఉపాధి కల్పన చేయాలనుకునే రిక్రూటింగ్ ఏజెన్సీలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసు కోవాలి. 2. ఐదు సంవత్సరాల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోసం రూల్.నెం.7 ప్రకారం.. రూ.25 వేలు చెల్లించాలి. 3. ఈ దరఖాస్తు ఫారాలు emigrate.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. 4. ఈ క్రమంలో ప్రతీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గ్యారెంటీ కింద రూ.50 లక్షలు బ్యాంకులో జమచేయాలి. 5. రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడి వ్యక్తిగత ప్రవర్తన, ఇతర విషయాల్లో పోలీసులు విచారణ జరిపి ఉండాలి. 6. అయితే.. చేతిలో రూ.నాలుగైదు లక్షలు ఉన్న ప్రతీవారు కన్సెల్టెన్సీలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీ పెళ్లైన వారానికే విమానమెక్కిన కంబోడియాలో చిక్కుకున్న ఆరుగురిలో షాబాజ్‌ఖాన్‌ది అత్యంత దయనీయ పరిస్థితి. షాబాజ్‌కు ఇటీవలే వివాహం అయింది. తన మేనమామకు ఆరోగ్యం బాగాలేదని అతను ఉండగానే వివాహం చేసుకోవాలని.. పెద్దలు హడావిడిగా పెళ్లి చేశారు. ఆగస్టు 25 తేదీన రిసెప్షన్ జరిగింది. ఓ వైపు రిసెప్షన్ జరుగుతుండగానే.. షాబాజ్ మేనమామ మరణించారు. వారంతా ఈ బాధలో మునిగిపోయారు. వీసా వచ్చిందన్న సమాచారంతో వెంటనే నూతన వధువైన తన భార్య, కుటుంబ సభ్యులను వదిలి ఆగస్టు 31వ తేదీన కంబోడియా విమానమెక్కాల్సి వచ్చింది. తాను అక్కడ చైనా వారు చెప్పే సైబర్ నేరాలు చేయలేకపోతున్నానని.. వెంటనే ఇంటికి తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని కుటుంబీకులకు ఫోన్లో విలపిస్తూ వేడుకుంటున్నాడు. మా సోదరుడిని కాపాడండి మా సోదరుడు షాబాజ్ ఖాన్‌కు వీసా ఇప్పిస్తానని మేనాజ్ అలీ నమ్మబలికాడు. కెసీనోలో మంచి జీతం (800 డాలర్లు) వస్తుందని, ప్రతిరోజూ టిప్పులు కూడా దొరుకుతాయని ఆశపెట్టాడు. అందుకే.. మేము రూ.2 లక్షలు ఖర్చు అయినా పంపేందుకు వెనకాడలేదు. షాబాజ్‌కు ఆగస్టులో నెలలో వివాహమైంది. వీసా రావడంతో రిసెప్షన్ అయిన నాలుగైదురోజుల అనంతరం విదేశాలకు పంపాం. తీరా అక్కడికెళ్లాక మావాడిని బందించారు. రూ.3 లక్షలు లేదా 3,000 డాలర్లు ఇవ్వాలంటున్నారు. – అఫ్జల్, షాబాజ్ సోదరుడు, మానకొండూరు మా తమ్ముడిని అమ్ముకున్నరు కంబోడియా వీసా సిద్ధంగా ఉందని ఏజెంట్లు మేనాజ్ అలీ, అబ్దుల్ రహీం మా తమ్ముడు నవీద్ అబ్దుల్‌కు చెప్పారు. అందరికీ చెప్పినట్లుగా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని, రూ.2 లక్షలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్య రాదని, అన్ని బాధ్యతలు తీసుకుంటామన్నారు. తీరా ఇప్పుడు మా తమ్ముడికి ఇబ్బందులు వస్తున్నాయంటే.. తనకేం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. రూ.3 లక్షలు చెల్లిస్తే తాను విడిపిస్తానని చెబుతున్నాడు. – అబ్దుల్ ముహీద్, నవీద్ సోదరుడు, సిరిసిల్ల ముందే అంతా వివరించా కంబోడియాకు వెళ్లిన ఆరుగురి యువకుల విషయంలో నా తప్పిదమేమీ లేదు. నేను వారికి ఉద్యోగం ఎలా ఉంటుంది? అన్న విషయం స్పష్టంగా వివరించాను. కెసెనీలో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అని చెప్పాను. వారూ అంగీకరించే వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక.. వారు ఇలా ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు. – మేనాజ్ అలీ, కన్సల్టెన్సీ నిర్వాహకుడు -
కొలువు కొట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లు ముఖ్యంగా హైదరాబాద్‌లోని శిక్షణా కేంద్రాలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులతో కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రముఖ కోచింగ్ సెంటర్లయితే కిక్కిరిసి పోయాయి. కొందరు ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్, సిటీ లైబ్రరీలతో పాటు రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో సరైన బోధనా సిబ్బంది లేరని, హాస్టల్ గదుల్లో కనీస సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. అయినా సరే.. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనుండటంతో, ఎలాగైనా ఉద్యోగం సాధించి తీరాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అందరి లక్ష్యం ఒక్కటే..: గ్రూప్స్‌తో సహా దాదాపు 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభ్యర్థులు హైదరాబాద్‌లో మకాం వేశారు. కొంతమంది హాస్టళ్ళల్లో, ఇంకొంతమంది చిన్న చిన్న గదులు అద్దెకు తీసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే నగరంలో ఉండి సివిల్స్ కోసం శిక్షణ పొందుతున్న కొందరు అభ్యర్థులు పనిలో పనిగా గ్రూప్–1పై దృష్టి పెట్టారు. ఓ కోచింగ్ సెంటర్ అంచనా ప్రకారం గడచిన రెండు నెలల్లోనే దాదాపు 30 వేల మంది హైదరాబాద్‌కు కోచింగ్ కోసం వచ్చారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వెలువరిస్తే ఈ సంఖ్య రెట్టింపును మించిపోయే అవకాశముందని భావిస్తున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో శిక్షణ పొందేవారు వీరికి అదనం. ఇదే చివరి అవకాశం! ఎప్పుడో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు ఇదే చివరి అవకాశంగా భావిస్తున్నారు. చిన్నా చితక ఉద్యోగాలు చేసే వాళ్ళు వాటిని మానేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వాళ్ళయితే సమయాన్ని ఏమాత్రం వృధా చేయడం లేదని ఓ కోచింగ్ సెంటర్లో మేథ్స్ బోధిస్తున్న ఫ్యాకల్టీ మెంబర్ సత్య ప్రకాశ్ తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయని ఆశిస్తున్న కొందరు నిరుద్యోగులు తిండి, నిద్రను కూడా పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. అభ్యర్థులకు వల హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా భావిస్తున్నారు. ఊళ్ళల్లో అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసిన కోచింగ్ సెంటర్లు హంగులు, ఆర్భాటాలు, ప్రచారంతో అభ్యర్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో దాదాపు వెయ్యికి పైగా గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం కోచింగ్ ఇచ్చే సెంటర్లు ఉన్నట్టు అంచనా. ఇందులో పేరెన్నికగల సెంటర్లు దాదాపు 50 వరకూ ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా హాస్టల్, అభ్యర్థులకు నెట్ సదుపాయం అందిస్తున్నాయి. మంచి ఫ్యాకల్టీని ముందే ఏర్పాటు చేసుకున్నాయి. మిగతా కోచింగ్ సెంటర్లు ప్రత్యేకంగా ఏజెంట్లను పెట్టుకుని అభ్యర్థులకు వల వేస్తున్నాయి. అభ్యర్థిని ఎలాగైనా ఒప్పించి, ఎంతో కొంత ఫీజు ముందే చెల్లించేలా చేస్తున్నాయి. ఆ తర్వాత ఫ్యాకల్టీ, వసతులు ఎలా ఉన్నా సర్దుకుపోవడం తప్ప గత్యంతరం ఉండటం లేదు. ప్రభుత్వ ప్రకటనకు ముందు తమ కోచింగ్ సెంటర్‌కు 300 మంది మాత్రమే వచ్చే వారని, ఇప్పుడు వెయ్యి మంది వస్తున్నారని ఆశోక్‌నగర్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు తెలిపారు. అయితే కొన్ని కోచింగ్ సెంటర్లలో గది సామరŠాధ్యనికి మించి అభ్యర్థులను కూర్చోబెడుతున్నారు. గాలి వెలుతురు లేని గదుల్లో నరకం చూస్తున్నామని, అయినా కోచింగ్ కోసం తప్పడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. అదును చూసి దండుకుంటున్నారు..! గత రెండు నెలలుగా కోచింగ్ కేంద్రాల్లో ఫీజులు పెరిగిపోయాయి. గ్రూప్–1కు కోచింగ్ తీసుకునే వారికి గతంలో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ ఉండేది. ఇప్పుడు రూ. 60 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తున్నారని అభ్యర్థుల ద్వారా తెలిసింది. ఇతర గ్రూప్స్ కోచింగ్, ఉద్యోగాల శిక్షణకు రూ.40 నుంచి రూ.60 వేల వరకూ వసూలు చేస్తున్నారు. గ్రూప్–1కు ఆరు నెలలు, ఇతర పరీక్షలకు కనీసం 4 నెలలు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కేంద్రాలు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తున్నాయి. అనుభవజ్ఞులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నాయి. అభ్యర్థుల్లో లోపాలను గుర్తించి సరిదిద్దడంతో పాటు వారిలో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కొన్ని కోచింగ్ సెంటర్లలో సరైన శిక్షణ అందడం లేదు. నిర్వాహకుల బంధువులు మిత్రులతో గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేస్తున్నారని, లోపాలు సరిదిద్దే ప్రక్రియ సరిగా సాగడం లేదని అభ్యర్థులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి కోచింగ్‌కు పంపారు నేను డిగ్రీ పూర్తి చేశా. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో హైదరాబాద్ వచ్చా. ఎంక్వైరీ చేస్తే కోచింగ్ ఫీజు రూ.50 వేలు అన్నారు. హాస్టల్‌కు అదనంగా నెలకు రూ.6 వేలు. అయినా సరే వ్యవసాయం చేసే మా నాన్న అప్పు చేసి మరీ డబ్బులిచ్చారు. కోచింగ్ సెంటర్లో చేరి కష్టపడుతున్నా. అక్కడ భోజనం సరిపడక బయట తినాల్సి వస్తోంది. అదనంగా నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చవుతోంది. గ్రూప్స్ సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నా. – జునుగారి రమేష్, ముంజంపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్ డబ్బుల్లేక సొంతంగానే చదువు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. నేను ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నా. కోచింగ్ తీసుకుంటే తప్ప గ్రూప్స్‌లో పోటీ పడలేమని చాలామంది చెప్పారు. కాస్త పేరున్న కోచింగ్ సెంటర్లకు వెళ్లి అడిగితే రూ.70 వేల వరకూ అడిగారు. అప్పు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిన్న కోచింగ్ సెంటర్లలో చేరినా లాభం ఉండదని స్నేహితులు చెప్పారు. దీంతో ఓయూ హాస్టల్లోనే ఉంటూ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎక్కువ గంటలు కష్టపడుతున్నా. –మేడబోయిన మమత, ఇస్కిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా తాకిడి బాగా పెరిగింది ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటన తర్వాత కోచింగ్ తీసుకునే అభ్యర్థుల సంఖ్య రెట్టింపు అయింది. మేలో ఇది గణనీయంగా పెరిగే వీలుంది. అయితే నగరంలోని కొన్ని కోచింగ్ సెంటర్లు మాత్రమే అభ్యర్థులకు ఆశించిన విధంగా శిక్షణ ఇస్తున్నాయి. కొందరు అభ్యర్థులను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం దురదృష్టకరం. మా దగ్గరకొచ్చే అభ్యర్థులకు ప్రతిరోజూ నిర్విరామంగా శిక్షణ ఇచ్చేందుకు మంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేశాం. అభ్యర్థులకు మెరుగైన రీతిలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. – కృష్ణప్రదీప్ (నిర్వాహకుడు, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ) -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఇక్కడ అన్ని ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడును
ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగం ప్రతీ నిరుద్యోగి కల.. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల్లో కొలువులు తగ్గుతుండగా, నిరుద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు కొలువులు భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను ప్రకటించారు. త్వరలోనే భర్తీకి నోటిపికేషన్లు ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు, సర్కారు కొలువు కల నెరవేర్చుకునేందుకు ఎస్సీ, బీసీ, స్టడీ సర్కిళ్లు సన్నద్ధమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో రెండు స్టడీ సర్కిళ్లు.. సర్కారు కొలువు సాధించాలనే లక్ష్యంతో పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుపేద నిరుద్యోగులకు దారిచూపుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లు. కొందరు ప్రిపరేషన్ కోసం హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలకు తరలుతున్నారు. మరికొందరు ఇంటి వద్దే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి, ప్రైవేట్ శిక్షణను పొందలేని, సరిగ్గా పుస్తకాలు సైతం కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి స్థానికంగా ఉన్న స్టడీ సర్కిళ్లు ఆశా దీపాలుగా నిలుస్తున్నాయి. స్టడీ సర్కిళ్లలో సౌకర్యాలు... బీసీ స్టడీ సర్కిల్‌కు రూ.3.75 కోట్ల నిధులతో 2019లో అధునాతన భవనాన్ని నిర్మించారు. ఇందులో కాన్ఫరెన్స్ హాల్, డిజిటల్ లైబ్రరీ, స్టడీ హాల్, డైనింగ్ హాల్, క్లాస్ రూం, గెస్ట్రూంలు, 16 హాస్టల్ రూంలు ఉన్నాయి. ఎస్సీ స్టడీ సర్కిల్‌ను 2016 అక్టోబర్‌లో ప్రారంభించారు. ఈ రెండు కేంద్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందజేయడమే కాకుండా వారిలో వివిధ నైపుణ్యాలు అభివృద్ధి చెందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 3,176 ఉద్యోగ ఖాళీలు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లోని 3,176 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 1,193, మంచిర్యాల 1,025, నిర్మల్ 876, కొమరం భీమ్ ఆసిఫాబాద్ 825 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు తమ కొలువుల కల సాకారం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సాధించిన విజయాలు.. ఇప్పటి వరకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 2,395 మంది అభ్యర్థులకు వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ అందించారు. 220 మంది ప్రభుత్వ కొలువులు సాధించారు. వీరిలో 10 మంది రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించారు. అత్యధికంగా 60మంది పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. 35మంది ఉపాధ్యాయులుగా, 43మంది పంచాయతీ సెక్రెటరీలుగా, 20మంది గురుకుల ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జాబ్‌మేళా ద్వారా 500మంది ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు సాధించారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటివరకు 600 మందికి శిక్షణ పొందారు. 107 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 43 మంది ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు సాధించారు. డిజిటల్ శిక్షణ... స్టడీ సర్కిల్లో దాదాపుగా ప్రతీ బ్యాచ్‌లో 100మందికి శిక్షణ ఇస్తారు. ప్రభుత్వం కొలువులు భర్తీ చే యనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు పెద్దసంఖ్యలో నిరు ద్యోగులకు శిక్షణ అందజేయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు డిజిటల్ విధానంలో శిక్షణ ఇవ్వడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. యూ ట్యూబ్, టీ–శాట్ చానళ్ల ద్వారా శిక్షణ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా రోజుకు 100 పోటీ పరీక్షల ప్రశ్నలను అభ్యర్థులకు తెలియజేయనున్నారు. డిజిటల్ శిక్షణ విధానంలో 2వేల నుంచి పది వేల మందికి శిక్షణ అందించే వెసులుబాటు ఉంది. అత్యున్నత శిక్షణ ఇస్తున్నారు.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్నాను. ఉపాధ్యాయ నియామక పరీక్షకు, అదేవిధంగా గ్రూప్–1, గ్రూప్–2 నియామక పరీక్షలకు సిద్ధమవుతున్నాను. స్టడీ సర్కిల్లో ఉచిత వసతితో పాటు నిత్యం 8గంటలు శిక్షణ ఇస్తున్నారు. – రాజ్‌కుమార్, బెజ్జూర్, కుమురంభీం ఆసిఫాబాద్ ప్రణాళికాబద్ధంగా చదువుతున్న స్టడీ సర్కిల్లో చక్కని శిక్షణ ఇస్తున్నారు. కానిస్టేబు ల్, ఎస్సై ఉద్యోగాల కో సం ప్రయత్నిస్తున్నాను. రెండు ఉద్యోగాలను సాధించే దిశగా ప్రణాళి కాబద్ధంగా చదువుతున్న. మొదటిసారి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పటికీ, స్టడీ సర్కిల్లో శిక్షణ ద్వారా మార్గనిర్ధేశం చేస్తున్నారు. ఉద్యోగం సాధిస్తాననే నమ్మకంతో ఉన్న. –జే.సుప్రియ, ఆదిలాబాద్, ఎస్సీ స్టడీ సర్కిల్ త్వరలోనే తరగతులు... బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ తరగతులు ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తాం. గురుకుల, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన శిక్షణ ఇస్తాం. అన్ని వసతులతో కూడిన అధునాతన భవనంలో శిక్షణ అందిస్తాం. అభ్యర్థులను స్కీన్రింగ్ టెస్ట్ లేదా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తాం. –ప్రవీణ్ కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, ఆదిలాబాద్ లక్ష్యం చేరడానికి మార్గం.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగులకు తీపి కబురు. ఇటువంటి సమయంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎస్సీ, స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ పొంది తమ లక్ష్యం చేరడానికి మార్గం వేసుకోవాలి. ఎస్సీ, స్టడీ సర్కిల్లో నియామక ప్రకటనలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణ అందజేస్తాం. నిరుద్యోగులు తమ కొలువు కల సాధించే దిశగా కృషి చేస్తాం. –రమేశ్, ఎస్సీ స్టడీసర్కిల్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
సీట్లు పన్నెండు.. ఆశలు మెండు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి స్థానిక సంస్థల కోటాలోని 12 ఖాళీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 23న ముగియనుంది. స్థానిక సంస్థల్లో సంఖ్యాపరంగా టీఆర్ఎస్కు భారీ మెజారిటీ ఉండటంతో ఈ ఎమ్మెల్సీ పదవులన్నీ టీఆర్ఎస్ ఖాతాలోనే చేరే అవకాశముంది. నామినేషన్ల దాఖలుకు మరో రెండురోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. దీంతో ఆ పదవులు ఆశిస్తున్న పార్టీ నేతలు అధినేత దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డారు. శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ దీనిపై కీలక సమావేశం నిర్వహించారు. పూర్వపు 9 జిల్లాల పరిధిలోని 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఆయా ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు. జిల్లాల వారీగా ఈ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న నేతలు, త్వరలో పదవీ కాలపరిమితి పూర్తి చేసుకుంటున్న సిట్టింగ్ ఎమ్మెల్సీల పనితీరుపై చర్చించినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల్లో టీఆర్ఎస్ పక్షాన ఎంత మంది ఉన్నారో జిల్లాల వారీగా సమీక్షించారు. విపక్షాల పార్టీలతో పాటు మరికొందరు కూడా బరిలో దిగే అవకాశముండటంతో, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. వచ్చే నెల 10న పోలింగ్ జరగనుండటంతో అవసరమైతే ఓటర్లను క్యాంపులకు తరలించే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. సిట్టింగ్లతో పాటు భారీ సంఖ్యలో ఆశావహులు శాసనమండలిలో 40 మంది సభ్యులకు గాను ప్రస్తుతం గవర్నర్, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాల కింద మొత్తం 19 సీట్లు భర్తీ అవుతున్నాయి. గవర్నర్ కోటాలో ఇప్పటికే అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారితో పాటు ఎమ్మెల్యే కోటాలో మరో ఆరుగురు టీఆర్ఎస్ తరఫున ఎన్నికవడం ఖాయమైంది. ఇక స్థానిక సంస్థల కోటాలోని 12 స్థానాలకు మాత్రమే అవకాశం ఉండటం, ఆ పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతల సంఖ్య భారీగా ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మళ్లీ 2023 మార్చి వరకు మండలిలో ఖాళీ ఏర్పడే అవకాశం లేకపోవడంతో ఇప్పుడే పదవి దక్కించుకోవాలని నేతలు భావిస్తున్నారు. త్వరలో పదవీ కాలపరిమితి పూర్తి చేసుకుంటున్న 12 మంది మరోసారి పదవి దక్కించుకునే ప్రయత్నాల్లో ఉండగా, వీరితో పాటు మరికొందరు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జిల్లాల వారీగా రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ కేసీఆర్ కసరత్తు కొనసాగిస్తున్నారు. 12 స్థానాల్లో కనీసం నాలుగు నుంచి ఆరు చోట్ల కొత్తవారికి అవకాశం దక్కుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), శంబీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి)కి మరోమారు అవకాశం దక్కనుందని చెబుతున్నారు. మెదక్‌లో ప్రొటెమ్ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, నల్లగొండలో తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి నడుమ ప్రధానంగా పోటీ నెలకొంది. ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల్లో కొత్త పేర్లు తెరమీదకు వచ్చే అవకాశముంది. -
కాంపిటేటివ్ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు గుడ్‌న్యూస్!
దేశవ్యాప్తంగా అన్ని పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధుల కోసం IIT-IIM ALUMNI సహకారంతో 'కాల్కస్ ఇండియా' యాప్‌ను రూపొందించిన కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వారు, ఆ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా "వన్ పాస్.. ఆల్ఎగ్జాంస్" అనే పరిమిత కాలపు అఫర్ ద్వారా 'calcusindia' అనే కూపన్ ను ప్రకటించారు. ఈ కూపన్ ను తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ టి హరీష్ రావు గారు ఈ రోజు విడుదల చేశారు. ఈ ఆఫర్ వినియోగించుకోదలచిన వారు పేమెంట్ చేసేటప్పుడు 'calcusindia' అనే కూపన్ ను అప్లై చేయటం ద్వారా ఈ 99 రూపాయల ఆఫర్ ను పొందగలుగుతారు. ఈ ప్రీమియం ప్యాకేజీ ఆఫర్ తీసుకోవటం ద్వారా విద్యార్ధులు యాప్ లో ఉన్న పాఠశాల స్థాయి నుంచి సీవిల్ ఎంట్రన్స్ వరకు మొత్తం 1354 కాటగిరీల నుంచి 46000కు పైగా టెస్టులను 6 నెలల పాటు పూర్తి ఉచితంగా సాధన చేయవచ్చు. నాణ్యమైన విద్యను పేద, మద్య తరగతివర్గాల వారికి కూడా అందుబాటులో ఉండేలా ఈ ఆఫర్ ప్రకటించిన సంస్థ ఫౌండర్ వాణీకుమారిని మంత్రి హరీష్ రావు అభినందించారు. అందరికీ విద్య.. అందుబాటు ధరలో పలురకాల కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్ధులకు అన్ని రకాల పరీక్షలను అతితక్కువ ధరలో ఒకేచోట ప్రాక్టీస్ చేసుకునే సదుపాయం కల్పించాలనే సదుద్దేశ్యంతో ఈ విధమైన ఆఫర్ ప్రకటించిన భారత దేశపు ఏకైక సంస్థ కాల్కస్ఇండియా. గూగుల్ ప్లే స్టోర్ నుంచి "కాల్కస్ ఇండియా" యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్న వారు కొన్ని ఉచిత పరీక్షలను ప్రాక్టీస్ చేసి నచ్చిన వారు ప్రీమియం ప్యాకేజీకి సభ్యత్వం చేసుకోవచ్చును. మరిన్ని వివరాలకు calcusindia.com పోర్టల్ ను సందర్శించవచ్చు. -
పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్ : గురుకుల పీఈటీ మహిళా అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముట్టడించారు.. సోమవారం పెద్ద ఎత్తున మహిళలు విజిల్ సౌండ్లతో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్, నాగర్ కర్నూల్, మహాబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి ఈ ముట్టడికి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. 2018 నుంచి గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల చేయడంలేదని ఆందోళన చేస్తున్నామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసును ప్రభుత్వం కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్ 2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2018లో పరీక్ష రాశామని, ఫలితాలు ఇప్పటికీ విడుదల చేయకపోవటంతో అభ్యర్తులు నిరసనకు దిగారు. కారుణ్య మరణాలే శరణ్యం అంటూ.. ప్రగతి భవన్ వద్ద మహిళా అభ్యర్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అభ్యర్థుల ఆందోళనతో క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
సీఎం జగన్‌ను కలిసిన సివిల్స్ విజేతలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన పది మంది విజేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్‌కు ఎంపికైన పది మందిని సీఎం జగన్ అభినందించారు. వృత్తిలో రాణించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. ఏ రాష్ట్ర క్యాడర్లో పనిచేసినా మన రాష్ట్రానికి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జగన్ ఆకాంక్షించారు. -
‘వయస్సు’మీరింది!
సాక్షి, హైదరాబాద్:నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి 10 ఏళ్లు పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల అమలు గడువు ముగియడంతో లక్షలాది నిరుద్యోగులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యంతో 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితి దాటి అనర్హులుగా మారిన నిరుద్యోగులకు మరో అవకాశం కల్పించేందుకు గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు పొడిగిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 44 ఏళ్లకు వయోపరిమితి పెరగడంతో వేలాది మందికి ప్రయోజనం కలిగింది. తొలుత ఏడాది అమలు గడువుతో ఈ ఉత్తర్వులను జారీ చేయగా, నాలుగేళ్లుగా గడువును పొడిగిస్తూ వస్తున్నారు. చివరిసారి జారీ చేసిన జీవో అమలు గడువు గత జూలై 27తో ముగిసింది. మళ్లీ జీవో అమలు గడువును పొడిగిస్తూ కొత్త జీవో జారీ చేసే అంశాన్ని ప్రభుత్వం మర్చిపోయింది.దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 3,025 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు టీఎస్పీఎస్సీ నుంచి నియామక ప్రకటనలు వస్తున్నాయి.వీటితో పాటు భవిష్యత్తులో చేపట్టే ఉద్యోగ నియామకాలకు పోటీపడే అవకాశాన్ని కోల్పోయామని నిరుద్యోగులు మదనపడుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సుల మేరకు గతంలో గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు ప్రభుత్వం పెంచిందని, ఈ ఉత్తర్వుల అమలు గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
హైకోర్టు వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు సోమవారం హైకోర్టు ముందు ఆందోళనకు దిగారు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 మందికిపైగా పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమ కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని.. అర్హత కన్నా ఎక్కువ మార్కులు సాధించినా మెరిట్ లిస్ట్‌లో తమ పేరు లేదని పలువురు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
భారత ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్. గ్రీన్ కార్డు కోసం వేచి వున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఊరట నివ్వనున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన విధానంలో సరికొత్త మార్పులకు ప్రతిపాదించారు. కుటుంబ సంబంధాల ఆధారంగా గాకుండా నైపుణ్యం ఆధారంగా గ్రీన్‌కార్డు జారీలో విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ప్ర ప్రస్తుం 66శాతం కుటుంబ సంబంధాలు ద్వారా ( గ్రీన్‌కార్డు పొందిన వారు తమ కుటుంబ సభ్యులను, పెళ్లికాని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను స్పాన్సర్ చేయడం) 12 శాతం మాత్రమే నైపుణ్యం ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ట్రంప్ సర్కార్ ఈ విధానానికి స్వస్తి పలికి మెరిట్ ఆధారంగా గ్రీన్ కార్డు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు జారీ చేస్తుంది. కాగా హెచ్1బీ వీసా పొంది దశాబ్ద కాలంగా గ్రీన్‌కార్డుకోసం ఎదురు చూస్తున్న వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. -
తొలిరోజు టెట్ ప్రశాంతం
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నుంచి ఈ నెల 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు నగరంలో 11 కేంద్రాలను (షీలానగర్, చినముషిడివాడ, పెదగంట్యాడ, శొంఠ్యాం, కొమ్మాది, బక్కన్నపాలెం, గుడిలోవ, పీఎంపాలెం, గంభీరం, ఏవీఎన్ కాలేజీల్లో) ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సెషన్లో 1990 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1922 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 2840 మందికి 2742 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇలా ఉదయం పరీక్షకు 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 98 మంది వెరసి 166 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు నిబంధన విధించారు. అందుకనుగుణంగానే ఆయా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. పెందుర్తి: టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్) పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలోని ఇయాన్ డిజిటల్ జోన్–1, జోన్–2 కేంద్రంగా ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు పరీక్షకు దాదాపు గంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషాల్లో కేంద్రానికి రావడంతో ఆత్రుతగా పరుగులు తీశారు. ఆయా కేంద్రాల్లో ఈ నెల 19 వరకు జోన్–1లో 6,750 మంది, జోన్–2లో 17,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కిరెడ్డిపాలెం(గాజువాక): షీలానగర్ ఆయాన్ సెంటర్లో టెట్ ఆదివారం మధ్నాహ్నం జరిగింది. ఈ పరీక్షకు 600 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లి అలకండి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి కర్రి స్వాతి టెట్ పరీక్షకు హాజరయ్యారు. -
'ఘంటా చక్రపాణిగారు.. మమ్మల్ని పట్టించుకోండి'
-
'ఘంటా చక్రపాణిగారు.. మమ్మల్ని పట్టించుకోండి'
సాక్షి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ వెంటనే గురుకుల టీజీటీ తుది ఫలితాలను వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో టీజీటీ అభ్యర్థులు చేరి ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ వద్దే భైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా కాస్తంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురుకులాల్లోని (పీజీటీ, టీజీటీ) స్థాయిలోని పలు పోస్టులకు టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో తొలుత అభ్యర్థులను 1:2 గా ఎంపిక చేశారు. ఇందులో కొద్ది రోజుల కిందటే పీజీటీ ఫలితాలను వెల్లడించారు. కానీ, టీజీటీ ఫలితాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అయితే, ప్రస్తుతం టీజీటీ పోస్టులకు 1:2 ప్రకారం ఎంపికైన అభ్యర్థులంతా కూడా తమకు ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. మరోపక్క, వివిధ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు నిర్వహించనుంది. దీంతో టీజీటీ 1:2కు ఎంపికైన అభ్యర్థులు ఇటు గురుకులాలపై ఆశపెట్టుకోవాలా, టీఆర్టీకి చదవాలా అనే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయినప్పటికీ ఫలితాల వెల్లడి విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేస్తునే ఉన్నారు. వివిధ మార్గాల ద్వారా టీఎస్పీఎస్సీపై ఫలితాలకోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రావడంతో సోమవారం టీజీటీ 1:2 అభ్యర్థులంతా టీఎస్పీఎస్సీ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్న తమకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఉపశమనం కలిగించాలని, ఆందోళన నుంచి బయటపడేయాలని విజ్ఞప్తి చేశారు. తమ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై టీఎస్పీఎస్సీ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. -
ఐఐటీ పేద విద్యార్థులకు శుభవార్త
న్యూఢిల్లీ: లక్షల రూపాయలు కుమ్మరించి ఐఐటీ కోచింగ్ లకు వెళ్లలేని పేద విద్యార్థులకు శుభవార్త. ఐఐటీకి ప్రిపేరయ్యే వారికోసం త్వరలోనే ఒక ఆప్, పోర్టల్ ను రూపొందించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఎడ్యుకేషన్ ప్రైవేటు సొసైటీ ఫర్ ఇండియా(ఈపీఎస్ఎఫ్ఐ) కార్యక్రమంలో పాల్గొన్న ఈ సమాచారం వెల్లడించారు. ఐఐటీ ఉపాధ్యాయుల పాఠాలు, గత పరీక్ష ప్రశ్నా పత్రాలను ఈ యాప్ లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఐఐటీ ప్రవేశ పరీక్ష ప్రశ్నలను ఇంటర్ స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించినట్టు ఆమె వెల్లడించారు. వ్యాపారంగా మారిపోయిన విద్యను పేద విద్యార్థులకు అందుబాటు లోకి తేవడమే తమ శాఖ ధ్యేయమని స్పష్టం చేశారు. కోచింగ్ సంస్థలు విద్యార్థులకు కీడు చేస్తున్నాయని, వారిపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల్లో పోర్టల్, ఆప్ ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో 50 ఏళ్ల ఐఐటీ ప్రశ్నా పత్రాలను అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. వీటికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. 13 ప్రాంతీయ భాషల్లోనూ సమాచారం ఉంటుందని చెప్పారు. -
ఇంగ్లిష్ రాని ఇంజనీర్లు
-
ఇంగ్లిష్ రాని ఇంజనీర్లు
► ఆంగ్లం రాకపోవడం వల్లే 51.2 శాతం మందికి ఉద్యోగాలు రావట్లేదు ► హైదరాబాద్‌లో సగానికిపైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంగ్లిష్ రాదు ► ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ సర్వేలో వెల్లడి ► దేశంలో ఏటా ఇంజనీరింగ్ పూర్తిచేస్తున్నవారు 6 లక్షల మంది.. ► వీరిలో ప్రముఖ కంపెనీలకు తగిన విధంగా ఇంగ్లిష్ మాట్లాడగలిగేది 2.9 శాతమే ► కనీస గ్రామర్‌తో మాట్లాడేది 25 శాతం మందే ► ఇతర ప్రాంతాలతో పోల్చితే హైదరాబాద్, చెన్నై గ్రాడ్యుయేట్ల వెనుకంజ సాక్షి, హైదరాబాద్: ఏళ్లకు ఏళ్లు చదువులు.. పుస్తకాలతో కుస్తీలు.. ఇంజనీరింగ్ పట్టాలు.. కానీ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసేందుకు అవసరమైన ఇంగ్లిష్ మాత్రం రాదు. కనీసం ఎదుటివారితో వేగంగా సంభాషించేటంతటి పరిజ్ఞానమే ఉండడం లేదు. ఏటా కాలేజీల నుంచి లక్షలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నా... వారిలో ఉద్యోగాలు వస్తున్నది చాలా తక్కువ మందికే. సరిగా ఇంగ్లిష్ భాష రాకపోవడమే దీనికి కారణమని ప్రముఖ కంపెనీలకు ప్లేస్మెంట్ సర్వీసులు నిర్వహించే ఆస్పైరింగ్ మైండ్స్ తమ సర్వేలో తేల్చింది. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని.. ఇక్కడి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో సగం మందికిపైగా సరైన ఇంగ్లిష్ పరిజ్ఞానం లేదని గుర్తించింది. ఇక్కడి వారు తమ స్పోకెన్ ఇంగ్లిష్ సామర్థ్యాన్ని బాగా మెరుగుపరుచుకోవాలని సూచించింది. దేశంలో ఏటా 6 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తుండగా... అందులో 51.2 శాతం మందికి కేవలం ఇంగ్లిష్‌లో సరిగ్గా మాట్లాడటం రాకపోవడం వల్లే ఉద్యోగాలు లభించడం లేదని ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ సర్వేలో వెల్లడైంది. ప్రముఖ కంపెనీలు, పేరున్న కార్పొరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్‌లో అన్ని సామర్థ్యాలు (మాట్లాడడం, రాయడం, ప్రభావవంతమైన పదాలు వినియోగించడం, ఉచ్చారణ, స్పష్టత వంటివి) కలిగి, మాట్లాడి మెప్పించగలిగే గ్రాడ్యుయేట్లు కేవలం 2.9 శాతం మందేనని తేలింది. ఇంగ్లిష్‌లో అమ్మాయిలు బాగా రాయగలుగుతుండగా... అబ్బాయిలు బాగా మాట్లాడగలరని వెల్లడైంది. ఇక ఉద్యోగాల్లో చేరిన వారిలోనూ సందర్భానుగుణంగా స్పందించి ఇంగ్లిషులో బాగా కమ్యూనికేట్ చేయగలిగిన, వ్యాకరణానుగుణంగా ఉచ్ఛరించగలిగిన ఇంజనీర్లు 6.8 శాతమేనని సర్వే గుర్తించింది. కనీస పదాలు తెలిసిన వారు 33 శాతం ఉంటే... సాధారణ వ్యాకరణంతో వాక్య నిర్మాణం తెలిసిన వారు 25 శాతం మందేనని తేల్చింది. వివిధ మెట్రో నగరాలు, ప్రముఖ పట్టణాలతో పోల్చితే హైదరాబాద్, చెన్నై గ్రాడ్యుయేట్లు బాగా వెనుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నగరాలకు చెందిన వారు తమ స్పోకెన్ ఇంగ్లిషు సామర్థ్యాలను బాగా మెరుగు పరుచుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఇంజనీరింగ్ కోర్సులను పూర్తిచేసి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో మాట్లాడి ఈ సర్వే చేసినట్లు ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ వెల్లడించింది. ఈ సర్వే కోసం దేశవ్యాప్తంగా 500 కాలేజీలకు చెందిన 30 వేల మంది విద్యార్థులతో మాట్లాడినట్లు తెలిపింది. ఎంపిక చేసుకున్న వారిలో 51.9 శాతం మంది అబ్బాయిలు, 48.1 శాతం అమ్మాయిలు ఉన్నారని పేర్కొంది. వీరితో మాట్లాడినపుడు ఫ్లూయెన్సీ (తప్పులు లేకుండా మాట్లాడడం), యాక్టివ్ లిజనింగ్ (విని అర్థం చేసుకోవడం), పద ఉచ్ఛారణ, స్పోకెన్ ఇంగ్లిషు, వ్యాకరణం, వాక్య నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు - ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉచ్ఛారణ విషయానికి వస్తే 6.6 శాతం మంది బాగా మాట్లాడగ లిగారు, సులభంగా అర్థం చేసుకోగలిగారు. మరో 8.4 శాతం మంది బాగా మాట్లాడగలిగినా కొద్దిగా సమస్య ఎదుర్కొంటున్నారని... 30.6 శాతం మంది మేనేజ్ చేయగలిగినవారని గుర్తించారు. 47.6 శాతం మంది మాత్రం పదాలు కూడా సరిగ్గా ఉచ్ఛరించలేకపోతున్నట్లు తేలింది. మరో 6.8 శాతం మంది అయితే ఇంగ్లిషులో పెద్దగా మాట్లాడడం రావడం లేదని పేర్కొంది. - ఇక ఎదుటివారు చెబుతున్న దానిని బాగా అర్థం చేసుకోగలిగిన వారు 6.1 శాతం మాత్రమే ఉన్నారని సర్వే తేల్చింది. 18.5 శాతం మంది కొద్దిగా ఇబ్బంది పడినా.. బాగానే అర్థం చేసుకోగలిగారని, 28.7 శాతం మంది పరవాలేదని గుర్తించింది. ఇక 27.2 శాతం మంది సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని, 19.6 శాతం మంది అసలు కొంచెమైనా ఇంగ్లిషును అర్థం చేసుకోవడం లేదని వెల్లడైంది. - ఇక పలు ఉద్యోగాల్లో ఉన్నవారినీ సర్వే చేశారు. ఈ ఉద్యోగుల్లో బిజినెస్ కన్సల్టింగ్, కార్పొరేట్ సేల్స్ విభాగంలో 1 శాతం మంది, కార్పొరేట్ సర్వీసింగ్, టీచింగ్ విభాగాల నుంచి 2.9 శాతం మంది, అనలిస్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 24.9 శాతం మంది, మిగతా రంగాల ఇంజనీర్లు 22 శాతం మంది, ఐటీ ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు 49.2 శాతం మంది ఉన్నారు. వీరిలో కార్పొరేట్ సర్వీసింగ్, టీచింగ్ విభాగాల వారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మాట్లాడగలుగుతున్నారని సర్వే తేల్చింది. ఆ తరువాత పలు రంగాల ఇంజనీర్లు ఉన్నట్లు వెల్లడించింది. దక్షిణాది గ్రాడ్యుయేట్ల వెనుకంజ - దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా మాతృభాషలోనే చదువుకోవడం వల్ల ఇంగ్లిషు విషయంలో సమస్య ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వే పేర్కొంది. - పదాలను స్పష్టంగా, వేగంగా ఉచ్ఛరించే గలిగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఢిల్లీలో 59.9 శాతం మంది ఉండగా.. బెంగళూరులో 58.3 శాతం మంది, ముంబై, పుణెలో 56.2 శాతం మంది, కోల్‌కతాలో 52 శాతం మంది, హైదరాబాద్‌లో 51 శాతం మంది, చెన్నైలో 46.7 శాతం మంది ఉన్నట్లు వెల్లడైంది. - ఇంగ్లిషులో బాగా మాట్లాడగలిగే వారిలో ముంబై, పుణెకు చెందిన గ్రాడ్యుయేట్లు 60.6 శాతం మంది ఉండగా.. ఢిల్లీ వారు 57.7 శాతం, హైదరాబాద్ వారు 52.6 శాతం, చె న్నైవారు 47.3 శాతం మంది ఉన్నారు. - వ్యాకరణబద్ధంగా ఇంగ్లిషు మాట్లాడేవారు, రాయగలిగే గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఢిల్లీలో 56.4 శాతం, హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్లు 48.6 శాతం, చెన్నైలో 41.5 శాతం ఉన్నారు. - మొత్తంగా ఇంగ్లిషు సరిగా రాకపోవడం వంటి కారణాలతోనే 51.9 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు లభించడం లేదని ఆస్పైరింగ్ మైండ్స్ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై నగరాలకు చెందిన విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లిషు సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకోవాలని సూచించింది. వివిధ నగరాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఇంగ్లిషు సామర్థ్యాలు (శాతాల్లో) నగరం ఉచ్ఛారణ స్పష్టత వినడం మాట్లాడటం పద వినియోగం గ్రామర్ బెంగళూరు 58.3 55 58.1 56 58.9 54.1 చెన్నై 46.7 45.2 49.1 47.3 51.3 41.5 హైదరాబాద్ 51 50.3 53.3 52.6 54.8 48.6 కోల్‌కతా 52 49.5 54.5 53.1 55.2 49 ముంబై, పుణె 56.2 52.9 56.4 60.6 60.8 53.1 న్యూఢిల్లీ 59.9 57.6 59.8 57.7 60.9 56.4