
సాక్షి, హైదరాబాద్ : గురుకుల పీఈటీ మహిళా అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముట్టడించారు.. సోమవారం పెద్ద ఎత్తున మహిళలు విజిల్ సౌండ్‌లతో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్, నాగర్ కర్నూల్, మహాబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి ఈ ముట్టడికి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. 2018 నుంచి గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల చేయడంలేదని ఆందోళన చేస్తున్నామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసును ప్రభుత్వం కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్
2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2018లో పరీక్ష రాశామని, ఫలితాలు ఇప్పటికీ విడుదల చేయకపోవటంతో అభ్యర్తులు నిరసనకు దిగారు. కారుణ్య మరణాలే శరణ్యం అంటూ.. ప్రగతి భవన్ వద్ద మహిళా అభ్యర్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అభ్యర్థుల ఆందోళనతో క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment