
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు, అఖిలపక్ష నేతలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదే విధంగా గన్ పార్క్ వద్దకు రాకుండా ఆంక్షలు విధించిన పోలీసులు గన్ పార్క్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మరో వైపున గన్‌పార్క్ వద్ద దీక్షలో పాల్గొంటామన్న కోదండరాం, ఆర్‌ఎస్ ప్రవీణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రొ.కోదండంరాంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లను ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
చదవండి: జోడు పదవుల్లో కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలకు.. బీజేపీ వ్యూహమేంటి
Comments
Please login to add a commentAdd a comment