gunpark
-
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నాంపల్లి (హైదరాబాద్): సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం బాధాకరమని తెలంగాణ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తాజా మాజీ సర్పంచ్‌లు ముందుగా పబ్లిక్‌గార్డెన్స్‌కు చేరుకున్నా రు. అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్కుకు వచ్చారు. నిరసన సభ ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్కు వద్ద మాజీ సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడికక్కడే అరెస్టు చేసి, నాంపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సర్పంచ్‌లను మోసం చేస్తే...అధికారంలోకి రాగానే సర్పంచ్‌లను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని రెండు పర్యాయాలు కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పా రు. పార్లమెంట్ ఎన్నికలలోపు సర్పంచ్‌లకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశా రు. లేకపోతే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో వందకు పైగా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు కొలను శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయడానికి వచ్చారు. ఆయనతోపాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ అజంన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. అయితే ఎలక్షన్ కోడ్ అమలులో ఉండటంతో పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్వాదం, తోపులాట జరిగింది. సోమవారం రోజు గన్‌పార్క్‌లో నిరసన తెలిపేందుకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని రేవంత్ పోలీసులను ప్రశ్నించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనంలో తరలించారు. వీరి అరెస్ట్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. రేవంత్‌ను పోలీసులు గాంధీభవన్‌కు తరలించారు. కాగా మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళదామని సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం సవాల్ చేసిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడాని రావాలని కేసీఆర్‌కు చాలెంజ్ విసిరారు. చదవండి: రాజకీయాల్లో ‘ప్రవళిక’ కుదుపు! -
హైదరాబాద్: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు, అఖిలపక్ష నేతలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదే విధంగా గన్ పార్క్ వద్దకు రాకుండా ఆంక్షలు విధించిన పోలీసులు గన్ పార్క్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో వైపున గన్‌పార్క్ వద్ద దీక్షలో పాల్గొంటామన్న కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రొ.కోదండంరాంతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లను ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చదవండి: జోడు పదవుల్లో కిషన్ రెడ్డి.. కేంద్రమంత్రిగానే అసెంబ్లీ ఎన్నికలకు.. బీజేపీ వ్యూహమేంటి -
గన్ పార్క్ వద్ద గల్ఫ్ కార్మికుని మృతదేహానికి నివాళి
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహ్రెయిన్‌లో మరణించారు. శనివారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జేఏసీ నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద ఉంచి నివాళులు అర్పించారు. గల్ఫ్ అమరులకు నివాళులు అర్పిస్తూ అరుణోదయ సాంస్కృతిక బృందం పాటలు పాడారు. గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ బీజేపీ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన గల్ఫ్ జేఏసీ నాయకులు రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్‌తో గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ప్రవాసీ విధానం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఎనిమిది ఏళ్లలో 1,600 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారని, కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గల్ఫ్ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు -
కేసీఆర్ అహంకారానికి నాకు మధ్య పోరాటం: ఈటల
-
ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈనెల 14న బీజేపీలో చేరికకు సంబంధించి ముహూర్తం ఖరారు కావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన ఈటల.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాపత్రం సమర్పించారు. ముందుగా ఈటల రాజేందర్ శనివారం ఆయన అనుచరులతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కడతా.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమేనన్నారు. కేసీఆర్ దగ్గర రూ.వందల కోట్లు ఉన్నాయని, అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే తన అజెండా అని అన్నారు. హుజూరాబాద్‌లో గెలిచి ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఈటల తెలిపారు. తమ సహచరులను అడ్డుకున్నారు.. అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామాపత్రం సమర్పించిన అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ గేట్ వద్ద తమ సహచరులను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఏనుగు రవీందర్‌రెడ్డిని కూడా అనుమతించలేదన్నారు. కేసీఆర్ వెకిలి చేష్టలు, చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని ఈటల ధ్వజమెత్తారు. 14న బీజేపీలో చేరిక.. ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్ ఛుగ్ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం షామీర్పేటలోని ఈటల నివాసానికి వెళ్లి చర్చలు జరిపిన సంగతి తెలిసిదే. చదవండి: Huzurabad: ఈటలను దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ రోడ్‌మ్యాప్ టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంటిపై ఈడీ దాడులు -
అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
-
తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ప్రగతిభవన్ నుంచి గన్‌పార్క్‌కు చేరుకున్న ఆయన అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. (కేసీఆరే స్టార్) అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తదితరులు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం శాసనసభ వద్ద పోచారం, శాసనమండలి వద్ద గుత్తా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేశారు. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది) -
ఆర్టీసీ సమ్మె: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గన్ పార్క్ వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ అరెస్టులపై ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వస్తే అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమని, తమను అక్రమంగా అరెస్ట్ చేశారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. అరెస్టయిన జేఏసీ నేతలను వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని మహంకాళి పీఎస్‌కు తరలించగా.. జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని సైఫాబాద్ పోలీసు సేష్టన్‌కు తరలించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆర్టీసీ యూనియన్ కార్యాలయానికి రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్దకు తరలివస్తున్నఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్ పార్క్ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం తాము గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివారులర్పించడానికి వచ్చామని, దీనికి అరెస్టు చేయడమేమిటని మండిపడుతున్నారు. మరికాసేపట్లో గన్ పార్క్ వద్దకు ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల నేతలు వచ్చే అవకాశముండటంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరాహార దీక్ష చేపట్టాలనుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తలపెట్టిన ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్షను వాయిదా వేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన మొదలైంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు. టీఎస్ ఆర్టీసీలో కొత్త నియామకాల నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్ అభ్యర్థులు డిపోల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. -
గన్‌పార్క్ వద్ద ఎస్ఐ అభ్యర్ధుల ధర్నా
-
ప్రజా పోరాటాల్లో ముందుంటా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా పోరాటాల్లో సామాజిక కార్యకర్తగా పనిచేస్తానని ప్రొఫెసర్ సాయిబాబా అన్నారు. మావోయిస్టు సానుభూతిపరుడన్న ఆరోపణలపై జైలుకు వెళ్లిన ఆయన.. విడుదలైన వెంటనే హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇకపై తెలంగాణలో జరిగే ప్రజా పోరాటాల్లో ముందుండి పోరాటం చేస్తానన్నారు. -
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని టీటీడీపీ ధర్నా
హైదరాబాద్ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ తెలంగాణ టీడీపీ సోమవారం గన్‌పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ సర్కారే కారణమని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. కరెంట్ కోతలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ సర్కార్ సహకరించకపోవటం వల్లే సీసీఐ, పత్తిని కొనుగోలు చేయలేకపోతోందన్నారు. మొక్కజొన్నలను కొనుగోలు చేయటంలో మార్క్‌ఫెడ్ విఫలం అయ్యిందని ఎర్రబెల్లి విమర్శించారు. వరికి కూడా మద్దతు ధర లభించటం లేదన్నారు. మార్కెట్ యార్డ్‌లో రైతుల కష్టాలను పరిష్కరించటంలో మంత్రి హరీష్ రావు విఫలమయ్యారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎకరానికి రూ.30వేలు చొప్పున రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
తొలి సీఎం తొలి రోజు
-
కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్లో మార్పులు
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బేగం పేట నుంచి గన్‌పార్క్ వరకూ ర్యాలీగా బయల్దేరతారు. ర్యాలీ సాగేదిలా... *మధ్యాహ్నం నాలుగు గంటలకు బేగంపేట విమానాశ్రయం వద్ద ర్యాలీ ఆరంభమవుతుంది. *లైఫ్‌స్టైల్ బ్రిడ్జి, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, రవీంద్రభారతి మీదుగా గన్‌పార్కు చేరుకుంటుంది. దాదాపు ఏడు కిలోమీటర్ల పొడువున ర్యాలీ సాగుతుంది. * ర్యాలీ కొనసాగుతున్న సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి నిజాం కాలేజీ వరకు కేసీఆర్ ప్రత్యేక వాహనంపై ఆసీనులవుతారు. అక్కడి నుంచి పాదయాత్రగా గన్‌పార్కుకు చేరుకుంటారు. * ర్యాలీ మార్గమధ్యంలో తెలంగాణ బ్రాహ్మణ సంఘం తరఫున 1,000 మందితో పూర్ణకుంభ స్వాగతం పలుకుతారు. టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఐదు వేల మంది మహిళలు బోనాలతో అధినేతకు స్వాగతం చెబుతారు. * ర్యాలీకి ముందు భాగాన వందల సంఖ్యలో గుర్రాలు, ఒంటెలు నడిచేలా ఏర్పాటు చేశారు. * నాలుగైదు గంటల పాటు ర్యాలీ సాగుతుందన్న అంచనాలతో.. సామాన్య ప్రజలకు సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్టీ కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేయనున్నారు.