ప్రజా పోరాటాల్లో ముందుంటా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా పోరాటాల్లో సామాజిక కార్యకర్తగా పనిచేస్తానని ప్రొఫెసర్ సాయిబాబా అన్నారు. మావోయిస్టు సానుభూతిపరుడన్న ఆరోపణలపై జైలుకు వెళ్లిన ఆయన.. విడుదలైన వెంటనే హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇకపై తెలంగాణలో జరిగే ప్రజా పోరాటాల్లో ముందుండి పోరాటం చేస్తానన్నారు.