
జైలు నుంచే బీపీఎస్‌సీ పరీక్ష, సంకెళ్లతోనే అప్పాయ్‌మెంట్ ఆర్డర్..!
సోషల్ మీడియాలో విభిన్న వాదనలు
జైలు నుంచే బీపీఎస్సీ (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడో వ్యక్తి. సంకెళ్లున్న చేతులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా అప్పాయింట్‌మెంట్ లెటర్‌ను అందుకున్నాడు. ఈ అసాధారణమైన, దిగ్భ్రాంతికరమైన ఉదంతంతో ఎక్కడ చోటుచేసుకుంది. అసలేంటీ స్టోరీ తెలుసుకుందాం.
బిహార్‌లో గయలో సంఘటన జరిగింది. గత 18 నెలలుగా జైలులో ఉన్న విపిన్ కుమార్ ఉపాధ్యాయ పదవికి నియామక లేఖ అందుకున్నాడు. పట్నాలోని బూర్ జైలులో ఉండగానే, TRI-3 పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో ప్రభుత్వం అతన్ని ఉపాధ్యాయుడిగా నియమించింది.
గయా జిల్లాలోని మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎర్కి గ్రామానికి చెందిన విపిన్ కుమార్ గతంలో పాట్నాలోని దనాపూర్‌లోని ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో టీచర్‌గా పనిచేసేవాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం, అదే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న ఒక మైనర్ బాలిక అతనిపై పోక్సో చట్టం కింద దానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోక్సో చట్టం కింద పోలీసులు వెంటనే విపిన్‌ను అరెస్టు చేశారు అప్పటి నుండి అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
ఉన్న నిందితుడు విపిన్ కుమార్ బీపీఎస్‌సీ పరీక్ష రాసి విజయం సాధించాడు. ఒకటి నుండి ఐదు తరగతుల వరకు జనరల్ సబ్జెక్టులను బోధించేందుకు పాఠశాల ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. దీంతో చేతులకు బేడీలతోనే పోలీసు కస్టడీలో బుద్ధ గయలోని మహాబోధి సాంస్కృతిక కేంద్రంలో జరిగిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యాడు. తాత్కాలిక నియామక లేఖను అందుకున్నాడు.18 నెలల జైలు శిక్ష సమయంలో, అనేక సవాళ్లను మధ్య ఈ పరీక్షలో విజయవంతం కావడం విశేషంగా నిలిచింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన విపిన్ తన భవితవ్యం ఆందోళన వ్యక్తం చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నాడు. కోర్టు తనను దోషిగా గుర్తిస్తే, ఈ ఉద్యోగం రద్దవతుందని వాపోయాడు అయితే జైలులోని ఇతర ఖైదీలకు విద్యను అందించాల భావిస్తున్నానని, తద్వారా వారిలో విద్య వెలుగులను వ్యాప్తి చేయాలనేది తన లక్ష్యమని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త
భిన్న వాదనలు
పోక్సో నిందితుడు విపిన్ కుమార్ టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించి జాయినింగ్ లెటర్ అందుకోవడంపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. తన ఇంటికి ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలికను అత్యాచార చేశాడన్న ఆరోపణలపై జైలులో ఉన్నఅతనికి టీచర్ ఉద్యోగమా; అంటే వేధింపులకు లైసెన్స్ ఇచ్చినట్టా? అతన్ని ఎలా నమ్మాలి? అంటూ మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి శిక్షపడుతుందా? లేదంటే నిర్దోషిగా బైటపడి, తన ప్రభుత్వ ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటాడా? అనేదే సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment