teacher
-
పోక్సో కేసులో నిందితుడికి టీచర్ ఉద్యోగం, లైసెన్స్ ఇచ్చినట్టా..!?
జైలు నుంచే బీపీఎస్సీ (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడో వ్యక్తి. సంకెళ్లున్న చేతులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా అప్పాయింట్మెంట్ లెటర్‌ను అందుకున్నాడు. ఈ అసాధారణమైన, దిగ్భ్రాంతికరమైన ఉదంతంతో ఎక్కడ చోటుచేసుకుంది. అసలేంటీ స్టోరీ తెలుసుకుందాం.బిహార్‌లో గయలో సంఘటన జరిగింది. గత 18 నెలలుగా జైలులో ఉన్న విపిన్ కుమార్ ఉపాధ్యాయ పదవికి నియామక లేఖ అందుకున్నాడు. పట్నాలోని బూర్ జైలులో ఉండగానే, TRI-3 పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో ప్రభుత్వం అతన్ని ఉపాధ్యాయుడిగా నియమించింది. గయా జిల్లాలోని మోహన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎర్కి గ్రామానికి చెందిన విపిన్ కుమార్ గతంలో పాట్నాలోని దనాపూర్లోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో టీచర్‌గా పనిచేసేవాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం, అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న ఒక మైనర్ బాలిక అతనిపై పోక్సో చట్టం కింద దానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోక్సో చట్టం కింద పోలీసులు వెంటనే విపిన్‌ను అరెస్టు చేశారు అప్పటి నుండి అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.ఉన్న నిందితుడు విపిన్ కుమార్ బీపీఎస్సీ పరీక్ష రాసి విజయం సాధించాడు. ఒకటి నుండి ఐదు తరగతుల వరకు జనరల్ సబ్జెక్టులను బోధించేందుకు పాఠశాల ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. దీంతో చేతులకు బేడీలతోనే పోలీసు కస్టడీలో బుద్ధ గయలోని మహాబోధి సాంస్కృతిక కేంద్రంలో జరిగిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యాడు. తాత్కాలిక నియామక లేఖను అందుకున్నాడు.18 నెలల జైలు శిక్ష సమయంలో, అనేక సవాళ్లను మధ్య ఈ పరీక్షలో విజయవంతం కావడం విశేషంగా నిలిచింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన విపిన్ తన భవితవ్యం ఆందోళన వ్యక్తం చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నాడు. కోర్టు తనను దోషిగా గుర్తిస్తే, ఈ ఉద్యోగం రద్దవతుందని వాపోయాడు అయితే జైలులోని ఇతర ఖైదీలకు విద్యను అందించాల భావిస్తున్నానని, తద్వారా వారిలో విద్య వెలుగులను వ్యాప్తి చేయాలనేది తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్తభిన్న వాదనలుపోక్సో నిందితుడు విపిన్ కుమార్ టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించి జాయినింగ్ లెటర్ అందుకోవడంపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. తన ఇంటికి ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలికను అత్యాచార చేశాడన్న ఆరోపణలపై జైలులో ఉన్నఅతనికి టీచర్ ఉద్యోగమా; అంటే వేధింపులకు లైసెన్స్ ఇచ్చినట్టా? అతన్ని ఎలా నమ్మాలి? అంటూ మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి శిక్షపడుతుందా? లేదంటే నిర్దోషిగా బైటపడి, తన ప్రభుత్వ ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటాడా? అనేదే సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
నంద్యాల జిల్లాలో కీచక టీచర్
-
నంద్యాల జిల్లాలో కీచక టీచర్
సాక్షి, నంద్యాల జిల్లా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, నంద్యాల జిల్లాలో కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి కీచకుడి అవతారం ఎత్తాడు. ప్యాపిలి మండలం ఏనుగుమర్రి ఉన్నత పాఠశాలలో ఘటన జరిగింది.నీలిచిత్రాలు చూడమంటూ సోషల్ టీచర్ బొజ్జన్న ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. హెడ్మాస్టర్కు తెలిసే చేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ బొజ్జన్నపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థులకు సాష్టాంగ నమస్కారం పెట్టిన హెడ్మాస్టర్
-
యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్‌బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఉపాధ్యాయుడు(Govt School Teacher) మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైసూ్కల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్‌పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
ఈ టీచరమ్మ నిత్య విద్యార్థి
‘నేను ఇప్పటికీ విద్యార్థినే’అంటుంది విజయమ్మ. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేసిన విజయమ్మ మదిలో ‘విశ్రాంతి’ అనే ఊహ ఎప్పుడూ రాలేదు. ఆమె ఇల్లు పెద్దబడి. చిలుకలు వాలిన చెట్టులా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ‘సామాజిక సేవాకార్యక్రమాల్లోనే సంతోషం’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది. ‘నేను నిత్య విద్యార్థిని’ అని చెప్పే విజయమ్మ మాటను అక్షరాలా నిజం చేయడానికన్నట్టు ఇప్పటికే ఐదు డిగ్రీలు, 4 పీజీ కోర్సులు పూర్తి చేసి పదవ కోర్సుకు సిద్ధమవుతోంది.ఉద్యోగానికి ఉత్సాహం తోడైతే ఆ శక్తే వేరు. ఆ శక్తి విజయమ్మలో కనిపిస్తుంది. ఉద్యోగ విధులకు సామాజిక బాధ్యతను కూడా జోడించడం ఆమె ప్రత్యేకత. తాను ఉద్యోగం చేసిన ప్రతి గ్రామంలో విద్యాబోధనతోపాటు పర్యావరణ సంరక్షణ గురించి పిల్లలకు అవగాహన కలిగించేది. ఆయా గ్రామాలలో వందల మొక్కలను నాటించింది. బాలికల చదువు విషయంలో ప్రత్యేక చొరవ చూపేది. ‘ఇప్పటి నుంచే మీకంటూ ఒక కల ఉండాలి’ అని చెబుతుండేది.పేదరికాన్ని జయించి, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి గొప్పస్థానంలో నిలిచిన ఆదర్శనీయ మహిళల గురించి చెబుతూ ఉండేది. వింజమూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, నెల్లూరు రూరల్ తదితర ప్రాంతాల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించిన విజయమ్మ ఇందుకూరుపేట మండలం కొత్తూరు హైస్కూల్లో ఉపాధ్యాయినిగా ఉద్యోగ విరమణ చేసింది. రోజూ ఎంతో ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్లే విజయమ్మకు ఉద్యోగ విరమణ తరువాత స్కూలు దూరం అయింది. అయితే ఉత్సాహం దూరం కాలేదు. జనవిజ్ఞాన వేదిక ద్వారా సామాజిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోంది.మైపాడు గేటు సమీపప్రాంతంలో ఆమె ఉండే ఇల్లు పిట్టలు వాలిన చెట్టులా ఎప్పుడూ కళకళగా ఉంటుంది. విజయమ్మ పదవీ విరమణ చేసినా ఇప్పటికీ స్థానికులతో సహా ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వస్తూనే ఉంటారు. విద్యార్థుల కోసం పుస్తకాలతోపాటు డ్రాయింగ్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. విజయమ్మ ఇంట్లో ఒక మూల పుస్తకాలు చదువుకునే, ఒక మూల పెయింటింగ్ వేసే అమ్మాయిలు కనిపిస్తుంటారు. ఆమె మార్గదర్శకత్వంలో రోడ్డుకు ఇరువైపులా, రైల్వే గేట్.. మొదలైనప్రాంతాల్లో విద్యార్థులు విరివిగా మొక్కలు నాటుతున్నారు.అవయవ దానంతో పాటు శరీర దానాలు చేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ‘సింహపురి దేహ సమర్పణ’ సంస్థను విజయమ్మ ప్రారంభించింది. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి శరీరాన్ని వైద్యశాలలకు దానం చేసేలా చొరవ చూపుతుంది. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు అందజేసింది. ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే నష్టాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తోంది.పనిలోనే ఆనందంరోజూ బడికి వెళుతున్నప్పుడల్లా ఎంతో ఉత్సాహంగా ఉండేది. విద్యార్థులలో విద్యార్థిగా మారిపోయేదాన్ని. ఇప్పుడు స్కూల్‌కు వెళ్లే అవకాశం లేకపోయినా విద్యార్థులకు దూరం కాలేదు. ఇప్పటికీ ఎంతోమంది విద్యార్థులు నా దగ్గరికి వస్తుంటారు. మేమందరం కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ‘హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా ఇవన్నీ ఎందుకు?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే నాకు పనిలోనే ఆనందం దొరుకుతుంది. మనం చేయడానికి ఈ సమాజంలో ఎన్నో మంచి పనులు ఉన్నాయి. మనం అనుకున్నవాటిలో కొన్ని చేయగలిగినా ఎంతో సంతోషం, ఎంతో శక్తి వస్తుంది.– విజయమ్మ – వల్లూరు సాంబశివరావు, సాక్షి, పొగతోట, నెల్లూరు -
‘మన్‌కీ బాత్’లో తెలంగాణ టీచర్ ప్రస్తావన..కారణమిదే..
న్యూఢిల్లీ:మన్‌కీ బాత్‌లో తెలంగాణ టీచర్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆదివారం(ఫిబ్రవరి23) నిర్వహించిన మన్‌కీ బాత్‌లో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు.‘ఇటీవల కృత్రిమమేధ (ఏఐ) సదస్సులో పాల్గొనేందుకు పారిస్ వెళ్లాను. ఏఐలో భారత్ సాధించిన విజయాలను ప్రపంచం ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ స్కూల్ టీచర్ తొడసం కైలాష్ గిరిజన భాషలను కాపాడడంలో మాకు సాయం చేశారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కైలాష్ కంపోజ్ చేశారు’ అని మోదీ కొనియాడారు. ‘ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడం దేశానికే గర్వకారణం. పది సంవత్సరాల్లో దాదాపు 460 ఉపగ్రహాలను ఇస్రో లాంచ్ చేసింది.చంద్రయాన్ విజయం దేశానికి ఎంతో గర్వకారణం.అంతరిక్షం, ఏఐ ఇలా ఏ రంగమైనా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది.జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక రోజు నా సోషల్ మీడియా ఖాతాను వారికే అంకిత చేస్తా’అని మోదీ తెలిపారు. -
గిరిజన పిల్లల కోసం ఆ టీచర్ ప్రాణాలనే..!
‘ఎవరైనా సరే బతకడానికి ఉద్యోగం చేస్తారు. చావడానికి కాదు’ అని ఎంతోమంది అన్నలక్ష్మితో అనేవారు. ఇంతకీ ఆమె చేస్తున్న ఉద్యోగం ఏమిటి? కేరళలోని చిన్నార్ అభయారణ్యంలో ఉన్న మారుమూల గిరిజన గ్రామం తయ్యన్నన్‌కుడిలోని ఏకైక అంగన్వాడీలో ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.అన్నలక్ష్మి ఉద్యోగ జీవితం రిస్క్, సాహసంతో కూడుకున్నది. వారం రోజుల క్రితం అటవీమార్గంలో జనావాసాలకు వచ్చిన అడవి ఏనుగు నుంచి తృటిలో తప్పించుకుంది. కొన్ని రోజుల క్రితం అదే ఏనుగు ఒక గిరిజనుడిని తొక్కి చంపేసింది. అయినప్పటికీ అన్నలక్ష్మి ఎప్పుడూ భయపడలేదు.విద్యార్థుల దగ్గరికి వెళ్లడానికి గత పదిహేడు సంవత్సరాలుగా మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీ లేని అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తూనే ఉంది. ప్రయాణ మార్గంలో జంతువుల అడుగు జాడలు కనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అడవి ఏనుగులు వెంబడించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో పెద్ద పెద్ద రాళ్లు, చెట్ల వెనుక దాక్కొని తప్పించుకుంది.38 ఏళ్ల అన్నలక్ష్మి జీవితంలో అరణ్యం, గిరిజన తెగలు భాగం అయ్యాయి. స్థానిక ముత్తువన్ భాషను అనర్గళంగా మాట్లాడే అన్నలక్ష్మి గిరిజన ప్రజలకు ప్రియమైన ఉపాధ్యాయురాలు.‘పిల్లలు ఇంట్లో కంటే టీచర్ దగ్గర ఉండడానికే ఇష్టపడతారు’ అంటుంది ఒక గిరిజన తల్లి.‘ఉద్యోగ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లల అమాయక ముఖాలను గుర్తు తెచ్చుకుంటే ఎంతో శక్తి వస్తుంది. నా వృత్తి జీవితానికి వారే వెలుగు’ అంటుంది అన్నలక్ష్మి. (చదవండి: మూడు నెలల తరువాత.... గ్రేహౌండ్స్ దొరికిందహో!) -
రష్యా చెర నుంచి విడుదలైన అమెరికా టీచర్
వాషింగ్టన్: అన్యాయంగా రష్యా కారాగారంలో మూడేళ్లు జైలు జీవితం అనుభవించిన అమెరికాకు చెందిన ఉపాధ్యాయుడు మార్క్ ఫోగెల్ ఎట్టకేలకు ట్రంప్ ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. రష్యా నుంచి బయల్దేరిన ఫోగెల్ మంగళవారం రాత్రి అమెరికాలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వైమానిక స్థావరంలో దిగారు. తర్వాత నేరుగా అధ్యక్ష భవనంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. తన విడుదలకు అవిశ్రాంతంగా కృషిచేసినందుకు ట్రంప్‌కు ఆయన మనసారా కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో మాట్లాడి యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించిన వేళ పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ స్వయంగా రష్యాకు వెళ్లిమరీ ఉపాధ్యాయుడిని వెంట తీసుకురావడం విశేషం. తమ పౌరుని విడుదల కోసం చూపిన స్థాయిలోనే ట్రంప్ సర్కార్ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం చొరవ చూపుతుందని శ్వేతసౌధం ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్ ఇదే చొరవను కొనసాగించాలని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తంచేశాయి. ఎవరీ ఫోగెల్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన ఫోగెల్ రష్యాలోని మాస్కో సిటీలో ఆంగ్లో– అమెరికన్ పాఠశాలలో దశాబ్దకాలంపాటు టీచర్‌గా చరిత్ర పాఠ్యాంశాలను బోధించారు. ఉపాధ్యాయునిగా ఉన్న కాలంలోనే మాస్కో ఎయిర్‌పోర్ట్‌లో 2021 ఆగస్ట్‌లో ఆయనను రష్యా పోలీసులు అరెస్ట్‌చేశారు. చట్టవ్యతిరేకంగా 17 గ్రాముల గంజాయిని రష్యాకు తీసుకొస్తున్నారని ఆయనపై నేరాభియోగాలు మోపింది. 2022 జూన్‌లో ఆయనకు 14 ఏళ్ల జైలుశిక్ష వేశారు. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తీవ్రమైన వెన్ను సమస్య కారణంగా వైద్యుల సలహా మేరకే ఆయన గంజాయిని వాడుతూ, వెంట తెచ్చుకున్నారని అమెరికా పేర్కొంది. ఈయనను ‘‘పొరపాటున అరెస్ట్‌కు గురైన వ్యక్తి’గా అమెరికా అభివరి్ణంచింది. ఎలాగైనా ఆయనను విడుదలచేసి తీసుకొస్తామని నాటి బైడెన్ ప్రభుత్వం చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా అమెరికా జైళ్లో మగ్గిపోతున్న ఒక రష్యా పౌరుడిని విడుదలచేసి అందుకు ప్రతిగా టీచర్ ఫోగెల్ విడుదలను ట్రంప్ సుసాధ్యం చేశారని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ ఖైదీల పరస్పర మారి్పడి అంశంపై వైట్‌హౌస్ స్పందించలేదు. త్వరలో మరో అమెరికన్ విడుదలై స్వదేశానికి రాబోతున్నారని తెలుస్తోంది. -
సూపర్ హెల్మెటూ కాదంట పెట్టుకోకుంటే బండి స్టార్టు
-
నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/కరీంనగర్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ, కరీంనగర్, మెదక్, నిజా మాబాద్, ఆదిలాబాద్ జిల్లాల, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ల ఎన్నికకు సోమవా రం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.11న నామినేషన్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు.నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే నల్లగొండ కలెక్టరేట్ బయట 100 మీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 100 మీటర్లలోపు మూడు వాహనాలు, నామినేషన్ అభ్యరి్థతో కలిపి ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి నా మినేషన్లను నల్లగొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఎన్నికల రిటరి్నంగ్ అధికారిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవహరిస్తారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కలెక్టర్ పమేలా సత్పతి ఆర్వోగా వ్యవహరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్!
పెరవలి: ముక్కుపచ్చలారని విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు క్రూరంగా చితకబాదిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామానికి చెందిన చేబ్రోలు అనిల్‌కుమార్ కుమారుడు పెరవలి మండలం కానూరు గ్రామంలోని రమా గాయత్రి ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన సమయంలో ఏడుస్తున్న ఆ విద్యార్థి ఆటో నుంచి దిగలేదు. దీంతో ఉపాధ్యాయుడు అశోక్ వచ్చి, ఆ బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. ఇంటికి వచ్చిన తరువాత కూడా బాబు ఏడుస్తుండడంతో ఆరా తీయగా మాస్టారు కొట్టారంటూ వీపుపై ఉన్న గాయాలు చూపించాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని శుక్రవారం రాత్రి పెరవలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై న్యాయమూర్తి అనుమతి తీసుకుని, కేసు నమోదు చేయాల్సి ఉందని, అనుమతి కోసం దరఖాస్తు చేశామని ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. -
విద్యార్థినితో లెక్చరర్ ప్రేమపెళ్లి
మైసూరు: పాఠాలు నేర్పించిన గురువు ఓ విద్యార్థినితో పరారై పెళ్లి చేసుకున్న ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. తనకంటే వయస్సులో 15 ఏళ్లు పెద్దవాడైన అధ్యాపకుడిని పెళ్లి చేసుకోవడమే గాకుండా భద్రత కోరుతూ ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసింది. వివరాలు.. హుణసూరు నివాసి పూర్ణిమ (24) ఎంఏ పూర్తి చేసి బీఈడీ చదివేందుకు హుణసూరులోని మహావీర్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చేరింది. అధ్యాపకుడు యశోదకుమార్ (39)ను ఆమెకు ప్రేమ పాఠాలు బోధించాడు. విషయం పెళ్లి వరకూ వచ్చింది. పూరి్ణమ ఇంటిలో ఇందుకు అభ్యంతరం చెప్పి ఆమెను కాలేజీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కానీ మొబైల్లోనే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని నమ్మించి ఇంటి నుంచి బయటకు వచ్చిన పూరి్ణమ తిరిగి రాలేదు. అనంతరం మొబైల్లో తాను ప్రేమించిన యశోదకుమార్ను పెళ్లి చేసుకున్నట్లు మెసేజ్ పెట్టింది. వీధుల్లో ఆకు కూరలు అమ్మి రూ.2 లక్షలు అప్పు చేసి మరీ కూతురిని కాలేజీలో చేరి్పస్తే, అధ్యాపకుడు లోబర్చుకున్నాడని తల్లిదండ్రులు చింతాక్రాంతులయ్యారు. -
ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల జైలు.. ఏం నేరం చేశాడంటే..?
తిరువనంతపురం: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌కు కేరళలోని స్పెషల్ ఫాస్ట్–ట్రాక్ కోర్టు ఏకంగా 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఇటువంటి నేరానికి పాల్పడినందున జాలి చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన మనోజ్(44) తను ఉండే ఇంట్లోనే ట్యూషన్లు చెబుతుండేవాడు. అతడి వద్దకు వచ్చే 11వ తరగతి బాలికను 2019లో ఓ రోజు ప్రత్యేక క్లాసుకని పిలిపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా సెల్ఫోన్లో షూట్ చేశాడు.ఈ ఘటనతో భయపడిపోయిన బాలిక ట్యూషన్‌కు వెళ్లడం మానేసింది. మనోజ్ తన ఘనకార్యాన్ని చెప్పుకునేందుకు ఆ ఫొటోలను మరికొందరికి పంపాడు. విషయం తెలిసి బాధితురాలి కుటుంబీకులు ఫోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన మనోజ్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మనోజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సెల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికపై అత్యాచారం జరిపిన ఫొటోలు అందులో ఉన్నట్లు గుర్తించారు.అయితే, అదే సమయంలో ఆఫీసులో ఉన్నట్లు అక్కడి రిజిస్టర్‌లోని సంతకం చూపి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, మనోజ్ ఫోన్లోని కాల్ రికార్డుల ఆధారంగా అవన్నీ తప్పని తేలింది. దీంతో, ప్రత్యేక కోర్టు నిందితుడికి 111 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1.05 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనంగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ఆర్.రేఖ తీర్పు వెలువరించారు. -
సాక్షి కథనంపై కూటమి కుట్రలు పోలీసులే కిడ్నాపర్లు!
-
భూ వివాదంలో మునీర్ అనే టీచర్ ను కిడ్నాప్ చేసిన పోలీసులు
-
విద్యార్థినిని గర్భవతిని చేసిన కెమిస్ట్రీ టీచర్..
అన్నానగర్: కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం (50). ఇతనికి పైళ్లె పిల్లలు కూడా ఉన్నారు. అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ పాఠశాలలో చదువుతున్న ప్లస్–2 విద్యార్థినిని లైంగికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఈ విద్యార్థి ప్రస్తుతం చైన్నెలోని ఓ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ స్థితిలో 15వ తేదీన కడుపునొప్పి రావడంతో విద్యార్థిని చికిత్స నిమిత్తం చైన్నెలోని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అప్పుడు ఆమెకి అబ్బాయి పుట్టాడు. దీంతో విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది చూసిన ఆసుపత్రి సిబ్బంది విద్యార్థిని రక్షించి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థిని బంధువులు సెంఽబియం తోప్పు ఆల్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడు మలర్ సెల్వంను గురువారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రాక్టికల్స్‌లో మార్కులు తగ్గిస్తానని బెదిరించి గతేడాది స్కూల్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. -
కెమిస్ట్రీ పాఠాన్ని ఇలా కూడా బోధిస్తారా? ఆ టీచర్ వేరే లెవల్!
ఉపాధ్యాయుల బోధనా పద్ధతులన్నీ.. విద్యార్థులకు విపులంగా అర్థం కావాడమే ప్రధాన అంశం. అందుకోసం ఒక్కొక్క టీచర్ ఒకో పంథాలో తమ క్లాస్‌ని చెబుతుంటారు. కొందరు టీచర్లు చెప్పే బోధనా పద్ధతి విద్యార్థులకు బోరింగ్ ఫీలింగ్ కలగుకుండా ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అచ్చం అలానే ఓ ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు రసాయన శాస్త్రంలోని ఓ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థం కావాలని ఎంతలా కష్టపడ్డాడో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే.ఎలా చెప్పారంటే..ప్రముఖ ఎడ్ టెక్కి చెందిన ఒక ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కెమిస్ట్రీలోని చిరాలటీ కాన్సెప్ట్‌ని బోధిస్తున్నారు. చిరాలటీలో అణువులు ఒక చిరాల్ కేంద్రాన్ని కలిగి ఉంటాయి. అద్దంలో అతిగా ఇంపోజ్ కావు. కాకపోతే రసాయన చర్యలో ఎడమ, కుడిగా కుడి ఎడమ గానూ అద్దంలో కనిపించే చిత్రంలాగా కనిపిస్తుంది. అదే దీని ప్రత్యేకత. ఇది విద్యార్థులకు అర్థమయ్యేలా తన శరీర భంగిమలతో క్లియర్‌గా వివరించారు. చెప్పాలంటే తన బోధనలో యోగాని కూడా మిళితం చేసి చెబుతున్నట్లుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడికి తన వృత్తిపై ఉన్న అభిరుచి, నిబద్ధతలను ప్రశంసిచగా, మరికొందరు ఇంతలా కష్టపడటం ఎందుకు త్రీడీ వస్తువులతో లేదా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను ఉదాహరణగా తీసుకుని చెబితే సరి అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.Absolute cinema 🎥 pic.twitter.com/KkhZwOr9dD— Priyanka 🪷 (@Oyepriyankasun) December 14, 2024 (చదవండి: 20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!) -
AP: టీచర్ MLC ఎన్నికల పోలింగ్
-
బడి పంతులుకు బడిత పూజ
-
Vizag: అంగన్వాడీ టీచర్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: అంగన్వాడీ టీచర్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. రూ.35 వేలు ప్రాణం మీదికి తెచ్చింది. నిందితురాలు సంగీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగీత వద్ద అంగన్వాడీ టీచర్ మున్నిసా బేగం రూ.35 వేలు అప్పు తీసుకోగా.. డబ్బులు అడిగేందుకు సంగీత వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ సంగీత బెదిరింపులకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ గొడవలో పెట్రోల్ మీద పోసుకున్న అంగన్వాడీ టీచర్ అగ్గిపుల్ల గీసి అంటించుకుంది.. దీంతో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కయ్యపాలెం పరిధిలోని శ్రీనివాసనగర్‌లో యువతిపై యాసిడ్ దాడి అంటూ ప్రచారం జరగడంతో కలకలం రేగింది. యువతి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. బైక్ మీద ఆగంతకులు వచ్చారని, ఆమెపై యాసిడ్ పోశారంటూ ప్రచారం జరిగింది.ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప-2కు రాజకీయ సెగ! -
‘ఉత్తమ’ టీచర్.. చెత్త పనులు
మంచిర్యాల అర్బన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించాడు. అభంశుభం తెలి యని బాలి కల పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఈ కీచక ఉపాధ్యాయుడి ఉదంతం మంగళ వారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ఓ పాఠశాలలో ఎస్ఏ(తెలుగు) టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న టి.సత్యనారాయణ కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు ప్రధానోపా ద్యాయురాలితో పాటు డీఈవో యాదయ్యకు సమాచారం అందించారు. ఆయన మంగళవారం ఎంఈవో, సెక్టోరల్ అధికారులను విచారణకు ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో విచారణ చేప ట్టారు. సత్యనారాయణ అసభ్యకరంగా తాకుతు న్నాడని, కళ్లు మూసుకుని ధ్యానం చేయాలంటూ సెల్ఫోన్లో చిత్రీ కరించాడని బాలికలు పేర్కొన్నారు. మాటల్లో చెప్పరాని విషయా లను లిఖిత పూర్వకంగా ఇచ్చారు. విచారణ అధికారులు వెళ్లిన తర్వాత ఆ ఉపాధ్యాయుడిని బయటకు రావాలని తల్లిదండ్రులు పదేపదే పిలి చినా రాకపోవడంతో ఆగ్రహించి దేహశుద్ధి చేశారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు. కాగా, సత్యనారాయణ గతంలో ఉత్తమ టీచర్ అవార్డు కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. -
శిక్షణలో హెడ్మాస్టర్ హఠాన్మరణం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు అందిస్తున్న నాయకత్వ, నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ కార్యక్రమం (స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–ఎస్ఎల్డీపీ)లో మరో అపశృతి చోటుచేసుకుంది. మూడోదశ శిక్షణలో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ఉపా«ద్యాయులకు శిక్షణ జరుగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం నేరడి ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిరిపురపు శ్రీనివాసరావు (52) గత సోమవారం నుంచి పాల్గొంటున్నారు. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆయనను తోటి ఉపాధ్యాయులు వెంటనే సమీపంలోని గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాలకొండకు చెందిన శ్రీనివాసరావుకు భార్య, ఇద్ద రు పిల్లలు ఉన్నారు. కాగా, ఇప్పటికే ఈనెల 6న ఏలూరుజిల్లా ఆగిరిపల్లిలో శిక్షణకు హాజరైన ప్రధానోపాధ్యాయుడు వెంకట రత్నకుమార్ ఇదే తరహాలో మరణించగా.. చీరాలలో మరో ప్రధానోపాధ్యాయడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యా రు. ఇలా వరుస ఘటనలపై ఉపాధాయ్య సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.శ్రీనివాసరావు మృతికి నిరసనగా పలు జిల్లాల్లోని శిక్షణ కేంద్రాల్లో ఉపాధ్యాయులు గురువారం తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. శిక్షణ కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్లు విశాఖపట్నం జోన్–1 ఆర్జేడీ బి.విజయభాస్కర్ మరుపల్లి శిక్షణ కేంద్రానికి వచ్చి చెప్పడంతో అక్కడ ఉపాధ్యాయులు శాంతించారు. బలవంతపు శిక్షణతో వేధింపులు: వైఎస్సార్టీఏశిక్షణలో ఇద్దరు ఉపాధ్యాయులు మరణించడం బాధాకరమని వైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్‌రెడ్డి, సుధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెసిడెన్షియల్ శిక్షణను రద్దుచేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధి కారుల్లో చలనం లేదన్నారు. బలవంతపు శిక్షణతో ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. మృతుల కు టుంబంలో అర్హత గలవారికి ప్రభుత్వోద్యోగం ఇ వ్వాలని వారు డిమాండ్ చేశారు.ఇలాంటి శిక్షణలు రద్దుచేయాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీవీ ప్రసాద్, రాధాకృష్ణ, ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌రావు, ఏపీ ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, ఏపీటీఎఫ్, ఏపీ పూలే టీచర్స్ ఫెడరేషన్, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్.. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్.. ఏపీ ఉపాధ్యాయ సంఘం, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్లు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. -
ఉద్యోగ భద్రత కోసం చంటి బిడ్డలతో టీచర్ల ధర్నా
అమరావతి: ‘డీఎస్సీ నుంచి మినహాయించి.. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏడాది మూడు నెలల చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని ధర్నా చేస్తున్న ఈమె పేరు పి.పర్శిక. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూనవరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సైన్స్ టీజీటీగా పనిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో తమ పోస్టులు కూడా ఉండడంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తన ఉద్యోగం పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.దాదాపు 237 కిలోమీటర్ల దూరంలోని కూనవరం నుంచి విజయవాడకు వచ్చి తన ఉద్యోగానికి భరోసా కల్పించేలా కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేయాలని రోజుల తరబడి ధర్నా చేస్తోంది’.పర్శిక టీచర్‌తోపాటు వందలాది మంది తమ ఊరు, వాడ, గూడు వదిలి వచ్చి విజయవాడ ధర్నా చౌక్‌లో గత 13 రోజులుగా శాంతియుత నిరసన కొనసాగిస్తున్నా సర్కార్ కనికరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లోకేశ్ ఓఎస్డీ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గిరిజన గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ గురువారం నాటి కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – సాక్షి, అమరావతి -
కొట్టుకున్న ప్రిన్సిపాల్ టీచర్
-
కొందరు ఉపాధ్యాయుల వికృత చేష్టలు, బిక్కుబిక్కుమంటున్న అమ్మాయిలు
సిరిసిల్ల కల్చరల్: పాఠశాలల్లో కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. మాస్టార్లు చెప్పే పాఠాల కోసం బడులకు వస్తున్న విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. చట్టాలు ఎంత పదునుగా తయారవుతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. అయితే వారి దుశ్చర్యల గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది బాధితులు లోలోపల కుమిలి పోతున్నారు. వెలుగులోకి రానివెన్నో.. బ్యాడ్ టచ్ బారిన పడుతున్న పిల్లలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు సైతం చెప్పే స్వేచ్ఛ కొన్ని కుటుంబాల్లో లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల షీటీమ్స్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. అయినా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు రావడం తక్కువే. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి నివాసి, ప్రభుత్వ ఉపాధ్యా యుడు నామని సత్యనారాయణ అదే కాలనీకి చెందిన ఓ బాలికను జామకాయ కోసి ఇస్తానంటూ తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక చేతులు పట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన ఓ ప్రబుద్ధుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 21న జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో ఉద్యోగ విరమణకు చేరువైన కె.నరేందర్‌తోపాటు మరో టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ జెడ్పీ హైసూ్కల్లో రఘునందన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతో కేసు నమోదు చేశారు. కొద్ది వారాల క్రితం గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ అదే కళాశాల విద్యార్థిని విషయంలో అనుచితంగా వ్యవహరించాడని కేసు నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన కేసులు రాజన్నసిరిసిల్లా జిల్లాలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలపై ఇప్పటి వరకు 38 కేసులు నమోదైనట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీటిలో టీచర్లపైనే ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా వేధింపులకు గురైతే 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో). ఇది లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. లైంగికదాడి నేరాలకు పాల్పడిన నిందితులకు ఈ చట్టంతో జీవితఖైదీగా 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీసం 10 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రెండు నెలల్లోపే కేసు దర్యాప్తు జరగాలని నూతన చట్టం నిబంధన విధించింది. -
చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలి మృతి
యాలాల: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఉపాధ్యాయురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మండల పరిధిలోని బెన్నూరు ఉన్నత పాఠశాలలో దూది సవిత(47) స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ బోధిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె 20 రోజులుగా పాఠశాలకు సెలవు పెట్టి చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందారు. సవిత భర్త శివప్రసాద్ పెద్దేముల్ మండలం కందనెల్లి జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణంలో సవిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె అకాల మరణం ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని పీఆర్టీయూ యాలాల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములు అన్నారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. -
ఇంట్లో చెబితే చంపేస్తానని చిన్నారికి టీచర్ బెదిరింపులు
-
కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. నెల్లిమర్ల ఎస్ఐ బి.గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండవెలగాడ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై అదే పాఠశాలలో పనిచేస్తున్న బయాలజీ ఉపాధ్యాయుడు ఎం. వెంకటరావు అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత శనివారం విద్యార్థినీని అసభ్యంగా ప్రైవేట్ పార్ట్స్‌పై తాకాడు. దీంతో మూడు రోజులుగా బాలిక ముభావంగా ఉంటూ తిండితినడం మానేసింది.తల్లి ఏమైందంటూ బాలికను ప్రశ్నించగా, ఉపాధ్యాయుడు తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని బయటకు చెప్పింది. ఆదివారం సెలవు కావడం, సోమవారం సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు గైర్హాజరు కావడంతో తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడితో పాటు హెచ్ఎంను ప్రశ్నించారు. అనంతరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కీచక ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గణేష్, సిబ్బంది పాఠశాలకు వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఉపాధ్యాయుడు మద్యం మత్తులో ఉండడం గమనార్హం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మద్యం మత్తులో కుమార్తెపై తండ్రి లైంగిక దాడిపెద్దముడియం: కూటమి ప్రభుత్వ విచ్చలవిడి మద్యం విధానం వావివరసలను మర్చిపోయేలా చేస్తోంది. బంధాలను, అనుబంధాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మద్యం మత్తులో ఓ తండ్రి కన్న కూతురి మీదే లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె (16) పదో తరగతి వరకూ చదివి తల్లితో పాటు కూలి పనులకు వెళుతోంది. ఆమె తండ్రి హమాలీ పనికి వెళుతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్య లేకపోవడంతో కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండు రోజులుగా కూతురు అనారోగ్యంగా ఉండటంతో తల్లి ప్రశ్నించింది. దీంతో తండ్రి చేసిన అకృత్యాన్ని కూతురు బయటపెట్టింది. వెంటనే భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. బాలికలపై లైంగిక దాడి చేసిన యువకుడికి పాతికేళ్లు జైలుపోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు విశాఖ లీగల్: బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనంది మంగళవారం తీర్పు చెప్పారు. బాలికలకు నిందితుడు రూ.లక్ష చొప్పున చెల్లించాలని, ప్రభుత్వం చెరో రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు.. వివాహితుడైన అమరాపల్లి అరవింద్(25) పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర వుడా కాలనీలో నివసిస్తున్నాడు. బాధిత బాలికలు(15, 13), వారి తల్లి.. పాత పెందుర్తి దగ్గర బీసీ కాలనీలో నిందితుడి ఇంటికి సమీపంలో ఉండేవారు. నిందితుడు బాలికలతో చాలా చనువుగా మెలిగేవాడు. ఈ నేపథ్యంలో ముందుగా పెద్ద బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2019 జూలైలో తల్లికి తెలియకుండా ఇద్దరు బాలికలనూ తన కారులో ఒంగోలు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరిపైనా లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు నేరాభి యోగపత్రంలో పేర్కొ న్నారు. విషయం తెలియడంతో బాలికల తల్లి 2019 నవంబర్ 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ స్వరూపరాణి దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. -
రిపోర్టు అన్నారు...రిక్తహస్తం చూపారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. 317 జీవో వల్ల ఎదురైన సమస్యలపై తమ వాదనను సీఎస్ ముందు ఉంచారు. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ హామీ ఇచి్చనట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం భేటీ కావడం తెలిసిందే. ఆర్థిక అంశాలపై మార్చి వరకు వేచి ఉండాలని సూచించిన ఆయన.. 317 జీవో ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ దిశగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎస్ సమక్షంలో పరిశీలించాలని ఉద్యోగులకు సూచించారు.ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సీఎస్‌ను కలిశారు. అయితే మంత్రివర్గ ఉససంఘం 317 సమస్యల పరిష్కారానికి సూచించిన సాధ్యాసాధ్యాలను సీఎస్ బహిర్గతపరచలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. నివేదిక చూపిస్తామని పిలిచి సూచనలు ఇవ్వాలంటూ పంపాశారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక 317 జీవో వల్ల పలువురు ఉద్యోగులకు జరిగిన నష్టం, స్పౌజ్ కేసుల పరిష్కారం, అనారోగ్యంతో బాధపడే వారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీలు తదితర అంశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి పలువురు ఉద్యోగ నేతలు సీఎస్‌ను అడగ్గా ఆ ఫైల్ సర్క్యులేషన్లో ఉందని.. బహుశా కేబినేట్ పరిశీలనకు వెళ్లే వీలుందని ఆమె సర్దిచెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆందోళన బాట పట్టాలనుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ ప్రకటిస్తారా లేదా అనే అంశాన్ని పరిశీలించాక తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సీఎస్‌తో భేటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఏలూరు శ్రీనివాస్‌రావు, చావా రవి, వి. రవీందర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, హనుమంతరావు, కత్తి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నడ టీచర్.. ఈ ఆటోడ్రైవర్
బొమ్మనహళ్లి: బెంగళూరు కర్ణాటక రాజధాని అన్న సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ కొన్ని లక్షల మందికి కన్నడ రాదు, తెలియదు. అదే పెద్ద వింత. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఇందులో ఎక్కువ. అటువంటి వారికి కొంచైమెనా కన్నడ కస్తూరి గొప్పతనాన్ని వివరించాలని ఓ ఆటోడ్రైవర్ కంకణం కట్టుకున్నాడు. అతనే బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ అజ్మల్ సుల్తాన్. ఆటోలో కొన్ని పోస్టర్లను అతికించాడు. అందులో ఆంగ్ల, కన్నడ పదాల అర్థాలు ఉన్నాయి. ఎవరైనా సులభంగా కన్నడను తెలుసుకోవచ్చు. నమస్కార సార్– హెలో సార్, ఎల్లి ఇదిరా– వేర్ ఆర్ యూ?, ఎస్ట్ అయితు– హౌ మచ్?, యూపిఐ ఇదియా క్యాష్ నా– ఈజ్ ఇట్ యుపిఐ, ఆర్ క్యాష్? అనే చిన్న చిన్న పదాలతో పోస్టర్లు ఉన్నాయి. చాలా సరళంగా కన్నడను అర్థం చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు. కన్నడ రానివారు ఆటోలో ఎక్కినప్పుడు గమ్యం చేరేవరకు కొన్ని కన్నడ పదాలను నేర్పించే యత్నం చేస్తానని చెప్పాడు. ఆయన కృషి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఆదరణ పొందుతోంది. -
ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది
తల్లిదండ్రులు మడావి లక్ష్మణ్, కమలాబాయిలతో టీచరు ఉద్యోగం సాధించిన కుమార్తెలు కవిత, దివ్య, కళ్యాణి, టీచర్ కావడమే లక్ష్యమంటున్న చిన్నకుమార్తె కృష్ణప్రియ (కుడి చివర) ‘ఎంత మంది పిల్లలు?’ అనే ప్రశ్న వినిపించినప్పుడల్లా లక్ష్మణ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తినంత పనయ్యేది. ఎందుకంటే...‘నాకు అయిదుగురు ఆడపిల్లలు’ అనే మాట లక్షణ్ నోటినుంచి వినిపించడమే ఆలస్యం ‘అయ్యో!’ అనే అకారణ సానుభూతి వినిపించేది. ‘ఇంట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది అయిదుగురు ఆడపిల్లలంటే మాటలా! నీ కోసం చాలా కష్టాలు ఎదురుచూస్తున్నాయి’ అనేవాళ్లు. అయితే వారి పెదవి విరుపు మాటలు, వెక్కిరింపులు తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఇల్లు పిల్లలకు బడి పాఠాలు చెప్పే ఇల్లే కాదు... ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసేవారికి గుణపాఠాలూ చెబుతుంది.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు చెందిన మడావి లక్ష్మణ్ బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ఆదివాసీ తెగకు చెందిన లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తరువాత ఆర్థిక కష్టాలు తీరాయి. లక్ష్మణ్– కమలాబాయి దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.‘ఆడపిల్ల ఇంటికి అదృష్టం’ అన్నారు చుట్టాలు పక్కాలు, పెద్దలు.రెండోసారి ఆడపిల్ల పుట్టింది. వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ అన్నారు.‘ఇద్దరు పిల్లలు చాలు’ అనుకునే సమయంలో ‘లేదు... లేదు... అబ్బాయి కావాల్సిందే’ అని పట్టుబట్టారు ఇంటి పెద్దలు.మూడో సారి... అమ్మాయి. ‘ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చాలు’ అనుకునే లోపే....‘అలా ఎలా కుదురుతుంది....అబ్బాయి...’ అనే మాట మళ్లీ ముందుకు వచ్చింది.నాల్గోసారి... అమ్మాయి.‘ఇక చాలు’ అని గట్టిగా అనుకున్నా సరే... పెద్దల ఒత్తిడికి తలవొంచక తప్పలేదు.‘ఆరు నూరైనా ఈసారి కొడుకే’ అన్నారు చాలా నమ్మకంగా పెద్దలు. దేవుడికి గట్టిగా మొక్కుకున్నారు.అయిదోసారి... అమ్మాయి. ‘అయ్యయ్యో’ అనే సానుభూతులు ఆకాశాన్ని అంటాయి. అయితే లక్ష్మణ్, కమలాబాయి దంపతులు ఎప్పుడూ నిరాశపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖర్చులకు సరిపడా జీతం రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. ‘ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా సరే పిల్లలను బాగా చదివించాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు లక్ష్మణ్. పిల్లల్ని చదివించడమే కాదు ఆడపిల్లలు అనే వివక్ష ఎక్కడా ప్రదర్శించేవారు కాదు. ఆటల్లో, పాటల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే బెత్తం పట్టుకోనక్కర్లేదు. వారికి నాలుగు మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఆ మాటే వారికి తిరుగులేని తారకమంత్రం అవుతుంది.అయిదుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ‘‘అమ్మా... మీ నాయిన టీచర్. మా నాయినకు మాత్రం చదువు ఒక్క ముక్క కూడా రాదు. నాకు మాత్రం సదువుకోవాలనే బాగా ఇది ఉండే. అయితే మా కుటుంబ పరిస్థితి చూస్తే... ఇంత దీనమైన పరిస్థితుల్లో సదువు అవసరమా అనిపించేది. ఎందుకంటే సదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఏ రోజుకు ఆరోజే బువ్వకు కష్టపడే మా దగ్గర డబ్బు ఎక్కడిది! అయినా సరే సదువుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను...’ అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. వారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఫలితం వృథా పోలేదు.ఇప్పుడు...రెండో కూతురు కవిత, మూడో కూతురు దివ్య, నాల్గో కూతురు కళ్యాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్న కూతురు కృష్ణప్రియ కొద్ది మార్కుల తేడాతో టీచర్ అయ్యే చాన్స్ మిస్ అయింది. అక్కలలాగే టీచర్ కావాలని కలలు కంటున్న కృష్ణప్రియకు మరోప్రయత్నంలో తన కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అప్పుడు ఒకే ఇంట్లో నలుగురు టీచర్లు!ఇంటర్ వరకు చదివిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువులు చదవాలనుకుంటోంది. వారిలాగే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటుంది. ఇప్పుడు లక్ష్మణ్‌ను చూసి జనాలు ఏమంటున్నారు? ‘నీకేమయ్యా... ఇంటినిండా టీచర్లే!’ ‘మీది టీచర్స్ ఫ్యామిలీ’నాన్న మాటలుతల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. వారి ఆశీర్వాద బలంతోనే టీచర్ అయ్యాను. ‘చదువే మన సంపద’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయన మాటలు మనసులో నాటుకు΄ోయాయి.– కవిత, రెండో కుమార్తెనేను టీచర్... అక్కహెడ్మాస్టర్అక్క కవితకు, నాకు ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను జైనూర్ మండలం జెండాగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. మా స్కూలుకు అక్క కవితనే ప్రధానో΄ాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మేము ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం సంతోషంగా ఉంది.– దివ్య, మూడో కుమార్తెఆరోజు ఎంత సంతోషమో!మొన్నటి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో నాకు ΄ోస్టింగ్ ఇచ్చారు. మొన్ననే విధుల్లో చేరాను. టీచర్‌గా మొదటి రోజు స్కూల్‌కి వెళ్లినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘మా ముగ్గురు పిల్లలు టీచర్లే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను’ అంటున్నాడు నాన్న.– కళ్యాణి, నాలుగో కుమార్తెటీచర్ కావడమే నా లక్ష్యంఅక్క కళ్యాణితో కలిసి నేను కూడా మొన్నటి డీఎస్సీ పరీక్ష రాశాను. కొద్ది మార్కుల తేడాతో నాకు ఉద్యోగం చేజారింది. అయితే నా లక్ష్యాన్ని మాత్రం వీడను. ఎలాగైనా టీచర్ కొలువు సాధిస్తాను.– కృష్ణప్రియ, ఐదో కుమార్తె – గోడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి -
చనిపోయినా నలుగురిలో సజీవంగా నిలిచిన ఉపాధ్యాయురాలు
-
కూతురు అరెస్టైనట్లు ఫేక్ కాల్.. గుండెపోటుతో తల్లి మృతి
లక్నో: ఓ ఫేక్ కాల్ మహిళ ప్రాణాలు తీసింది. కూతురు వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయ్యిందని నకిలీ ఫోలీస్ అధికారి ఫోన్ చేయడంతో.. తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఉన్నట్టుండి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఆగ్రాలో నివాసం ఉంటున్న మహిళ మల్తీ వర్మ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సెప్టెంబర్ 30న పోలీస్ అధికారి పేరుతో ఆమెకు ఓ వాట్పాప్ కాల్ వచ్చింది. ఆమె కుమార్తె సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టు చేసినట్లు అతడు తెలిపాడు. ఆ వీడియోలు లీక్ చేయకుండా ఉండాలని వెంటనే రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు.అయితే ఆందోళన చెందిన ఆ ఉపాధ్యాయురాలు వెంటనే తన కుమారుడు దివ్యాన్షుకు ఫోన్ చేసి ఈ విషయం తెలిపింది. కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. కానీ కుమారుడు తెలివిగా వ్యవహరించి, ఆ కాల్ పాకిస్థాన్ నుంచి వచ్చిన ఫేక్ వాట్సాప్ కాల్‌గా గుర్తించాడు. అంతేగాక వెంటనే తన సోదరికి ఫోన్ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు ఆమె చెప్పింది.మరోవైపు ఈ ఘటన మహిళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా ఆందోళన చెందిన టీచర్ మల్తీ వర్మ సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ వెంటనే కుప్పకూలి గుండెపోటుతో మరణించింది. కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కీచక టీచర్ నిర్వాకం.. ట్యూషన్లోనే
సాక్షి,హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదో తరగతి విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు.హైదరాబాద్ పిలింనగర్లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ట్యూషన్ ఉపాధ్యాయుడు రాములు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడు చేసిన పనికి మనోవేదనకు గురైన విద్యార్థిని దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కీచక టీచర్ రాములుపై ఫిలింనగర్ పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. -
రూ. 5 కోట్ల అప్పు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన టీచర్
అనంతపురం ఎడ్యుకేషన్: మరో టీచరు అప్పుల బాగోతం వెలుగులోకి వచ్చింది. మొన్న రాప్తాడు జెడ్పీహెచ్ఎస్లో బయాలజీ టీచరుగా పని చేస్తున్న రమేష్ కోట్లాది రూపాయలు అప్పులు చేసి ఉడాయించారు. నిన్న అనంతపురం ఆర్‌ఎంహెచ్‌ఎస్ స్కూల్లో తెలుగు టీచరు దివాకర్‌నాయుడు చీటీలు, వడ్డీ పేరుతో రూ. 12 కోట్ల దాకా అప్పులు చేసి ఉడాయించారు. చివరకు కోర్టులో లొంగిపోవడంతో సబ్‌జైల్‌కు తరలించారు. తాజాగా రూ. 5 కోట్లకు పైగా అప్పులు చేసి అదృశ్యమైన మరో టీచరు బాగోతం వెలుగు చూసింది. విడపనకల్లు మండలం హావలిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం టీచరుగా పని చేస్తున్న కె.బద్రీనాథ్ కోట్లాది రూపాయలు అప్పులు చేశారు. బాధితుల్లో 60 మందికి పైగా విద్యాశాఖలో పని చేస్తున్న టీచర్లు, ఇతర ఉద్యోగులే ఉన్నారు. వీరి వద్దే రూ. 3.5 కోట్ల అప్పులు చేశారు. ఆయన పని చేస్తున్న పాఠశాలలోరూ. 25 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈయన దాదాపు రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నమ్మకంగా ఉండటంతో తమ పిల్లల ఉన్నత చదువుల కోసం దాచుకున్న డబ్బును బద్రీనాథ్‌కు ఇచ్చామని కొందరు చెబుతుండగా, తమ పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్మును ఇచ్చామని మరికొందరు చెబుతున్నారు. చాలామంది బాధితులు వడ్డీకి ఆశపడి ఇచ్చారు.రెండు నెలలుగా రావడం లేదు గణితం టీచరు బద్రీనాథ్ దాదాపు రెండు నెలలుగా పాఠశాలకు రావడం లేదు. ఆయన ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. వీఆర్ఎస్ తీసుకుంటాడని మరికొందరు అంటున్నారు. ఆయనైతే నేరుగా నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. – మధురవాణి, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, హావలిగి -
Heart Attack: అయ్యో పాపం ‘వెంకటస్వామి’
జగదేవ్‌పూర్(గజ్వేల్): బదిలీ అయ్యి పాఠశాలలో విద్యార్థులకు పరిచయం కాకముందే ఆ ఉపాధ్యాయుడిని విధి కాటేసింది. ఇంటి వద్ద కాలకృత్యాలకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన మండలంలోని అలిరాజ్‌పేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ధ్యాప వెంకటస్వామి(42), మంజుల (ఉపాధ్యాయురాలు), ఇద్దరు కుమార్తెలు సుష్మిత మిత్ర, అక్షర మిత్ర ఉన్నారు. వెంకటస్వామి గజ్వేల్ మోడల్ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా 11 ఏళ్లుగా పని చేస్తున్నాడు. భార్య మంజుల జగదేవ్‌పూర్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అలిరాజ్‌పేట గ్రామం నుంచి గజ్వేల్‌కు మారి నూతనంగా ఇల్లు నిర్మించుకొని గత నెల 23న గృహ ప్రవేశం చేశారు. ఈ నెల 14న ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా గజ్వేల్ నుంచి జగదేవ్‌పూర్ మోడల్ స్కూల్‌కు బదిలీ అయ్యారు. అదే రోజు సాయంత్రం పాఠశాలలో బాధ్యతలు తీసుకున్నారు. సోమవారం గజ్వేల్‌లోని కొత్త ఇంటిలో కాలకృత్యాలకు వెళ్లగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. వైద్యులు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సామాజిక కార్యక్రమాలు.. వెంకటస్వామి ఉపాధ్యాయుడికి ముందు సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. సామాజిక పాటలపై ప్రేమతో 11 పాటలను సొంత ఖర్చులు, దర్శకత్వంతో తీశారు. గ్రామానికి చెందిన పల్లెటూరి హీరో అనిల్ మొగిలితో 7 పాటలకు దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించారు. అలాగే రైతుల ఆత్మహత్యలపై పాటలకు నిర్మాత, దర్శకత్వం వహించారు. నేత్రదానం.. వెంకటస్వామి మృతి చెందిన వెంటనే లోక్ నేత్ర ట్రస్టు వారికి అతడి కళ్లను దానం చేశారు. నేత్రదానం చేసి మరొకరికి చూపు ఇవ్వడంతో గ్రామస్తులు, తోటి ఉపాధ్యాయులు ఆ కుటుంబాన్ని అభినందించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ, మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘూల నేతలు శంకర్, సత్తయ్య, ప్రవీణ్, వెంకట్ కిరణ్, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు నివాళులరి్పంచారు. -
ఉపాధ్యాయుని కీచకపర్వం!
రేణిగుంట: సభ్యసమాజం తలదించుకునేలా ఓ ఉపాధ్యాయుడు కీచక అవతారం ఎత్తిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్.మల్లవరం హైసూ్కల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఆర్.మల్లవరం హైసూ్కల్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవి ఇటీవల 10వ తరగతి విద్యార్థినులను పాఠాలు చెప్పే క్రమంలో వారి ప్రైవేటు భాగాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి టీచర్ రవితో వాగ్వాదానికి దిగారు. హెచ్ఎం వెంకటరమణ కలుగజేసుకుని ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటానని సర్దిచెప్పి పంపారు. అయితే అప్పటి నుంచి తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థినులపై టీచర్ రవి కక్ష కట్టారు. తన క్లాసుకు రావద్దంటూ విద్యార్థినులను బయటకు పంపారు. దీంతో తమ చదువులు ఏమైపోతాయోనని భయాందోళన చెందుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకుని బదిలీ చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై టీచర్ రవి మాట్లాడుతూ.. విద్యార్థినుల ఆరోపణలను ఖండించారు. హైసూ్కల్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ వారం రోజుల కిందట ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను టీచర్ రవి తాకరాని చోట తాకినట్లు ఫిర్యాదు చేశారని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవని సర్ది చెప్పి పంపించానన్నారు. -
ఆ స్కూలు మళ్లీ సైకిలెక్కింది!
వాయనాడ్ వరదలకు రెండు నెలల ముందు షాలినీ టీచర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్లి΄ోయింది. స్కూల్ పిల్లల యూనిఫామ్‌లోనే సైకిల్ మీద తిరుగుతూ పిల్లలతో ఆడినఆమె వీడియో ఇంటర్నెట్లో ఎందరికో ఇష్టం. తర్వాత వరదలు వచ్చాయి. వీడియోలో ఉన్న పిల్లలు ముగ్గురు చని΄ోయారు. ‘నేను ఎప్పటికీ ఆ స్కూల్‌కి వెళ్లలేను’ అని బాధపడింది షాలినీ టీచర్. కాని వారం క్రితం స్కూల్ తెరిచాక పిల్లలు కోరింది షాలినీ టీచర్ కావాలనే. వారి టీచర్ వారికి దొరికింది. ఇక గాయం తప్పక మానుతుంది.టీచర్ల జీవితంలో అత్యంత కఠినమైన సందర్భం ఏమిటో తెలుసా? విగత జీవులుగా ఉన్న పిల్లల ముఖాలను గుర్తు పట్టమని వారిని పిలవడం. జూలై 30 వాయనాడ్‌లోని కొండ్ర΄ాంత పల్లెలు ముండక్కై, చూరలమల వరదల్లో పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఊహించని వరద నిద్రలో ఉన్నవారిని నిద్రలోనే తీసుకెళ్లింది. ముండక్కైలో చిన్న ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ మొత్తం బురదతో నిండి΄ోయింది. దాని చుట్టూ ఉండే ఇళ్లు ధ్వంసమై΄ోయాయి. స్కూల్లోని 9 మంది విద్యార్థులు మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరణించారు. మృతదేహాల ఆచూకీ దొరికాక వారిని గుర్తించడానికి టీచర్లనే పిలిచారు. అక్కడ పని చేసిన షాలినీ టీచర్‌కు ఆ ఘటన ఎంత మనోవేదన కలిగించిందో! మిగిలిన టీచర్లు మళ్లీ ఈ స్కూల్ ముఖం చూడకూడదని ఎంతగా ఏడ్చారో!!షాలినీ టీచర్‌ది కొట్టాయం. కాని పట్నంలో ΄ాఠాలు చెప్పడం కన్నా వాయనాడ్ ్ర΄ాంతం ఆహ్లాదంగా ఉంటుంది... ప్రజలు అమాయకంగా ఉంటారని ముండక్కైలో ఎలిమెంటరీ స్కూల్లో అడిగి మరీ టీచర్‌గా చేరింది. అక్కడ పిల్లలకు ఆమె ఇష్టమైన టీచర్. వారి యూనిఫారమ్‌లాంటి చుడిదార్ వేసుకుని స్కూల్‌కు వచ్చి పిల్లల్లో కలిసి΄ోయేది. చిన్న స్కూలు... పిల్లల సంఖ్య తక్కువ కావడంతో అందరి ఇళ్లు, తల్లిదండ్రులు తెలుసు. ఒకరోజు గేమ్స్ పిరియడ్‌లో ఒక ΄ాప సైకిల్‌ను ఆసక్తిగా చూడటం గమనించింది షాలినీ టీచర్. ఆ ΄ాప స్లోచైల్డ్. తానుగా సైకిల్ తొక్కలేదు. షాలినీ టీచర్ అది గమనించి ‘సైకిల్ ఎక్కుతావా’ అని వెనుక నిలబెట్టి తాను తొక్కుతూ గ్రౌండ్లో ఒక రౌండ్ వేసింది. పిల్లలందరూ చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. ఎవరో ఇది షూట్ చేయగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. రెండేళ్లు పని చేశాక షాలినీ టీచర్‌కి జూన్ నెలలో దగ్గరలోనే ఉన్న మీనన్‌గడి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. పిల్లలు ఆమె వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని వెళ్లక తప్పలేదు. ఆ రోజు షాలినీ టీచర్ అనుకోలేదు.. వారిలో కొందరిని మళ్లెప్పుడూ చూడలేనని. వాయనాడ్ వరదలు పిల్లలకూ ఆమెకూ మధ్య శాశ్వత దూరం తెచ్చాయి. చని΄ోయిన పిల్లలను గుర్తు పట్టమని ΄ోలీసులు ఆమెను పిలిచినప్పుడు ఆమె హృదయం బద్దలైంది. వాయనాడ్ కోలుకుంది. సెప్టెంబర్ 2న ముండక్కైలోని స్కూల్‌ను రీ ఓపెన్ చేస్తూ సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి వి.శివకుట్టి హాజరయ్యారు. దారుణమైన విషాదాన్ని చవిచూసిన ఆ పిల్లల ముఖాలను చూసిన మంత్రి ‘మీకు ఏం కావాలో అడగండి చేస్తాను’ అన్నారు. వెంటనే పిల్లలు ‘మా షాలినీ టీచర్‌ను మా దగ్గరకు పంపండి’ అన్నారు. ఇలాంటి సమయంలో వారికి ఇష్టమైన టీచర్ తోడుంటే బాగుంటుందనుకున్న మంత్రి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. షాలినీ తన స్కూల్‌కు తాను తిరిగి వచ్చింది.ఆమెను చూసిన పిల్లలు కేరింతలు కొట్టారు. ఆమె కన్నీరు కార్చింది చని΄ోయిన పిల్లలను తలుచుకుని. కాని ఆనందించింది తన స్కూలుకు తాను వచ్చానని.ఆ స్కూల్‌ను తిరిగి ఆట΄ాటలతో నింపడమే ఆమె లక్ష్యం.పిల్లల మోముల్లో చిర్నవ్వును పూయించడమే కర్తవ్యం.షాలిటీ టీచర్ తప్పక సాధిస్తుంది. -
టాలీవుడ్లో గురుశిష్యులు.. వీరిబంధం చాలా ప్రత్యేకం!
శిష్యుల ప్రతిభను, అర్హతలను కచ్చితంగా అంచనావేసి, ఎప్పుడు, ఎవరికి, వేటిని ప్రసాదించాలో తెలిసినవారే నిజమైన గురువులు. అలా జీవిత పాఠాలతో పాటు తమ శిష్యులకు సినిమా పాఠాలు కూడా నేర్పించి సక్సెస్ఫుల్ హీరోలు,డైరెక్టర్లు, సంగీత దర్శకులను అందించిన గురువులు ఎందరో ఉన్నారు.. నేడు గురువుల దినోత్సవం సందర్భంగా అలా సక్సెస్ సాధించిన కొందరిని గుర్తు చేసుకుందాం.సుకుమార్ మార్క్తన దర్శకత్వంతో పాటు రైటింగ్స్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేశారు దర్శకుడు సుకుమార్. 'ఆర్య' చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ లెక్కల మాస్టర్.. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. సుకుమార్ లాగే ఆయన శిష్యులు కూడా తమ సినిమాలతో మెప్పిస్తున్నారు. తొలి సినిమాలతోనే సూపర్ హిట్స్‌ను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు.తన వద్ద పని చేసిన ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటూ తన శిష్యగణాన్ని టాలీవుడ్లో పాపులరయ్యేలా చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. సుక్కు స్కూల్ నుంచి వచ్చినవారందరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు.► 'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన బుచ్చిబాబు సన.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్ ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్లో డైరెక్టర్‌గా లాంఛ్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్‌తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారు.► టాలీవుడ్లో మరో సెన్సేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు.► 'కరెంట్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F'తో మంచి సక్సెస్ అందుకున్నాడు.► జక్కా హరి ప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు► యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే.► డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా 'ఆర్య' సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. ► 'భమ్ భోలేనాథ్' ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడే. సుకుమార్ బ్యానర్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.► ఇండస్ట్రీలో స్టార్ రైటర్‌గా రాణిస్తున్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 పేజీస్ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుకుమార్‌కు సపోర్ట్‌గా శ్రీకాంత్ నిలిచారు. డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఆయన రైటర్‌గా పనిచేశారు.చిరంజీవి- విశ్వనాథ్‌ల బంధంతెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్‌కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్లో మైలురాయిగా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్‌గా నిలుస్తాయనడంలో సందేహం ఉండదు.ఆర్జీవీకి ఆయనే ప్రత్యేకం..ఒకప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఎందరో డైరెక్టర్లు బయటకు వచ్చి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను తెచ్చుకున్నారు. వర్మ శిష్యుల్లో ఆయన తర్వాత అంత పేరు తెచ్చుకున్న వాళ్లలో కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, గుణశేఖర్, శివనాగేశ్వరరావు, నివాస్, అజయ్ భూపతి, జీవన్ రెడ్డి, హరీశ్ శంకర్, జేడీ చక్రవర్తి, బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ అగ్రదర్శకుడు మధుర్ బండార్కర్ ఉన్నారు. వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్జీవీకి చాలా మంది శిష్యులున్నప్పటికీ.. వారిలో ప్రియశిష్యుడు మాత్రం పూరి జగన్నాధ్ మాత్రమే.సంగీతంలో మణిశర్మ..సంగీతంలో స్వరబ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఒక దశాబ్దం పాటు ఆయన తెలుగు సినిమాను ఏలారు. టాప్ హీరో మూవీ అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. ఆయనకు చాలా మంది శిష్యులే ఉన్నారు వారిలో దేవిశ్రీ, హారీష్ జైరాజ్, థమన్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వారు కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి కూడా ఎందరో శిష్యులు ఉన్నారు. వారిలో ఏఆర్ రెహమాన్, మణిశర్మ ముందు వరుసలో ఉంటారు. దేవీశ్రీ ప్రసాద్, తమన్, హారీశ్జైరాజ్ కూడా ఆయన వద్ద శిక్షణ పొందారు.దాసరి నారాయణరావు- మోహన్ బాబుటాలీవుడ్లో దాసరినారాయణరావు- మోహన్ బాబుల అనుబంధం మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలసి కొన్ని సినిమాలలో నటించారు. మోహన్ బాబు ఎప్పుడూ తన గురువును గుర్తు చేసుకుంటారు. వీరిద్దరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గురు, శిష్యులుగా పేరుపొందారు.రాఘవేంద్రరావు- రాజమౌళితెలుగు సినిమాలో ప్రతి విషయాన్ని వీరిద్దరూ చేసుకుంటుంటారు. రాజమౌళి గొప్ప డైరెక్టర్ అయినా కూడా.. తన స్క్రిప్టును మొదట రాఘవేంద్రరావుకు వినిపించాల్సిందేనట. టాలీవుడ్ మరో క్రేజీ గురుశిష్యుల బంధం రాఘవేంద్రరావు- రాజమౌళిదే.త్రివిక్రమ్- పోసాని కృష్ణమురళిగురు, శిష్యుల బంధానికొస్తే తెలుగులో త్రివిక్రమ్- పోసానిది విడదీయరానిబంధం. అందుకే తన గురువైన పోసానికి త్రివిక్రమ్ సినిమాల్లో ప్రత్యేకమైన రోల్స్ ఇస్తున్నారు. అంతకుముందు పోసాని దగ్గర చాలా ఏళ్ల పాటు త్రివిక్రమ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అందుకే త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత ప్రతీ సినిమాలోనూ తన గురువైన పోసానికి పాత్ర ఇస్తాడు. -
Teacher's Day 2024: థ్యాంక్యూ టీచర్..!
అంతవరకూ నీవొక రాయివి. గురువు చేయి పడగానే చెకుముకి అవుతావు. అంతవరకూ నీవొక ప్రవాహం. గురువు కాళ్లను తడపగానే దిశ గల్గి సారవంతమైన నేలకు మళ్లి విత్తుకు ప్రాణం పోస్తావు. అంతవరకూ కేవలం తోలు ముక్క. గురువు?... దానికి నాదం ఇస్తాడు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా ఎవరో ఒకరు ప్రేమగా ఆలనా పాలనా చేయగలరు. ప్రేమ పంచగలరు. కాని జ్ఞానం మాత్రం సరైన గురువే ప్రసాదిస్తాడు. గద్దించి బుద్ధి చె΄్తాడు. కనుచూపుతోనే శాసించి కడుపులో కరుణ దాచుకుని ఎదిగే వరకూ చేయి పట్టి నడిపిస్తాడు. తల్లిదండ్రులు జన్మనిస్తే దానిని సార్థకం ఎలా చేసుకోవాలో గురువే తెలియచేస్తాడు. ఒక్క గురువు వేల జీవితాలకు దిక్సూచి. గొప్ప గొప్ప టీచర్లు ఎందరో. తెలియని మహానుభావులు ఎందరో. విద్యార్థులు ఎదిగేందుకు నిచ్చెనలుగా మారి వారు మాత్రం నేల మీదే ఉండిపోతారు. అలాంటి మహనీయులందరికీ ‘టీచర్స్ డే’ సందర్భంగా నమస్కారాలు. థ్యాంక్యూ టీచర్.నేచరే టీచర్..‘ప్రకృతి అనే బడిలో ఎంతో మంది గురువులు ఉన్నారు’ అంటుంది రచయిత్రి, ఇలస్ట్రేటర్ బుల్బుల్ శర్మ. తానే ఒక గురువుగా మారి ప్రకృతిని గురువుగా చేసుకుని ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో పిల్లలకు చెబుతోంది. వారి కోసం స్టోరీ, ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. క్లాస్‌రూమ్‌లో కూచుంటే టీచర్ మాత్రమే గురువు. అదే ప్రకృతి అనే క్లాస్‌రూమ్‌లోకి వెళితే ప్రతి తీవ, చెట్టు, పక్షి, ఊడ అన్నీ ఎన్నో నేర్పిస్తాయి పిల్లలకు. విషాదం ఏమంటే పిల్లలు ఈ అతి పెద్ద క్లాస్‌రూమ్‌ను మిస్ అవుతున్నారు అంటుంది శర్మ.పిల్లలకు అడవి తెలియదు..‘ఎలాంటి కాలంలో ఉన్నాం మనం? చెట్టు కనిపించడమే అపూర్వం, చెట్టు మీద పిట్ట కనిపించడం అద్భుతం అనుకునే కాలంలో ఉన్నాం. అక్కడెక్కడో చంద్రుడి మీద ఆవాసాల గురించి ఆలోచించే మనం చుట్టు ఉన్న ప్రకృతికి మాత్రం దూరం అవుతున్నాం. పిల్లలను ప్రకృతిలోకి తీసుకురావడానికి, అక్కడ పక్షులు అనే గురువులను వారికి పరిచయం చేయడానికి ఎన్నో కథలు రాశాను. బొమ్మలు వేశాను. వాటిని చూసిన, చదివిన పిల్లలు మనం కూడా పచ్చటి అడవిలోకి వెళదాం అనుకుంటారు’ అంటుంది శర్మ.ఫోన్ నుంచి ఫారెస్ట్‌కి..ఒక రోజు శర్మ ఫోన్ మోగింది. తనని తాను పరిచయం చేసుకున్న తరువాత ‘మా అబ్బాయి మీ పుస్తకం చదివిన తరువాత ఫారెస్ట్‌కు తీసుకువెళ్లు, పక్షులు చూపించు అని ఒకటే అడగడం...’ అని ఒక తల్లి శర్మతో ఫోన్లో చెబుతూ పోయింది. ఆ తల్లి గొంతులో పిల్లాడి మీద అసహనం లేదు. ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. బుల్బుల్ శర్మ పుస్తకాలు పిల్లలపై చూపిన సానుకూల ప్రభావం గురించి చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ‘మీరు ఏం నేర్చుకున్నారు పక్షుల నుంచి’ అని అడిగితే ‘క్రమశిక్షణ, ఐక్యత. కష్టపడడం, ఆత్మవిశ్వాసం, ఎప్పుడూ సంతోషంగా ఉండడం, గుడ్ పేరింటింగ్ ఇలా ఎన్నో మంచి విషయాలు పక్షుల నుంచి నేర్చుకోవచ్చు’ అంటారు పిల్లలు. ఆమె ఏ స్కూల్లోనూ టీచర్‌గా పని చేయలేదు. కాని వందలాది విద్యార్థులకు ప్రియమైన గురువు. ఆమె పుస్తకాలే వారికి గురుబోధ. వారితో ఆమె చేయించే హోమ్‌వర్క్ పేరే అడవి. పిల్లల కోసమే జీవితందిల్లీలో పుట్టిన బుల్బుల్ శర్మ భిలాయ్‌లో పెరిగింది. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో రష్యన్ లాంగ్వేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేసి పై చదువుల కోసం మాస్కో స్టేట్ యూనివర్శిటీకి వెళ్లింది. స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత పెయింటర్‌గా ప్రస్థానంప్రారంభించింది. పిల్లల కోసం ఆమె రాసిన కథలు భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్.. మొదలైన విదేశి భాషల్లోకి కూడా అనువాదం అయ్యాయి. తన పరిశీలన, ప్రయాణాల ఆధారంగా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రచనలు చేయడం బుల్బుల్ శర్మ శైలి. ‘ఏమైనా నేర్చుకోవచ్చు. ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు. ఎవరి నుంచి అయినా నేర్చుకోవచ్చు’ అనేది శర్మ నోటి నుంచి వినిపించే మాట.ఇవి చదవండి: Teacher's Day Special: నా బెస్ట్ టీచర్.. -
Teachers' Day 2024 : ప్రపంచంలో తొలి పాఠశాల ఎలా ప్రారంభమయ్యింది?
మనిషి జీవితంలో గురువు పాత్ర అమోఘమైనది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి కూడా. అయితే ప్రపంచంలోని మొట్టమొదటగా పాఠశాల ఎలా ప్రారంభమయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రపంచంలోని మొట్టమొదటి ప్రొఫెషనల్ టీచర్‌గా కన్ఫ్యూషియస్ గుర్తింపు పొందారు. 551 బీసీలో చైనాలో జన్మించిన తత్వవేత్త కన్ఫ్యూషియస్ ఒక ప్రైవేట్ ట్యూటర్‌గా జీవితం ప్రారంభించారు. కొంతమంది గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ను మొదటి గురువుగా పరిగణించినప్పటికీ, కన్ఫ్యూషియస్‌ను కూడా అదేవిధంగా భావిస్తారు. కన్ఫ్యూషియన్ చైనాలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడని చెబుతారు. ఆయన స్వతహాగా సంగీతం, చరిత్ర, గణితం నేర్చుకున్నాడు. ఆ కాలంలో రాజకుటుంబంలోని పిల్లలకు మాత్రమే విద్యనభ్యసించే అవకాశం ఉండేది. అయితే కన్ఫ్యూషియస్ విద్య అనేది అందరికీ చేరాలని కోరుకున్నాడు. అందుకే అతను ట్యూటర్‌గా మారి, అందరికీ విద్యను బోధించడం ప్రారంభించారు.3,000 బీసీ నాటికే ఈజిప్టులో పాఠశాల విద్య ప్రారంభమైంది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తెలిపిన వివరాల ప్రకారం ఈజిప్టులో రెండు రకాల అధికారిక పాఠశాలలు నెలకొల్పారు. ఒకటి క్లరికల్ పనులు నేర్చించేందుకు, మరొకటి పండిత శిక్షణ కోసం కేటాయించారు. ఐదేళ్ల వయసు గల పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పించేవారు. వారికి 16-17 ఏళ్లు వచ్చేవరకూ విద్యను బోధించేవారు. -
రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
కొవ్వూరు: దేచెర్ల గ్రామ సమీపంలోని చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం గౌరీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బడుగు రాజారత్న (47) మృతి చెందారు. ఏడాదిన్నర కుమార్తెకు అనారోగ్యంగా ఉండడంతో సెలవులో ఉన్న ఆమె శనివారమే విధులకు హాజరయ్యారు. అయితే కుమార్తె ఏడుస్తోందని సమాచారం రావడంతో స్వస్థలమైన రాజమహేంద్రవరం బయలుదేరారు. గౌరీపట్నంలో ఎక్స్‌ప్రెస్‌లు ఆపకపోడంతో ఐ.పంగిడి వెళ్లి రాజమహేంద్రవరానికి బస్సు ఎక్కాలని భావించారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడు కేదాటి ఫణిశేఖర్‌ను సాయం కోరడంతో ఆయన రాజారత్నను తీసుకుని మోటారుసైకిల్‌పై ఐ.పంగిడి బయలుదేరారు. దేచెర్ల చెరువు సమీపంలో బురద మట్టి కారణంగా వాహనం అదుపు తప్పింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ.. రాజారత్న తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. రాజారత్న భర్త రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కర్రి శ్రీహరిరావు తెలిపారు. -
అసభ్యకర వీడియోలతో విద్యార్థులకు వేధింపులు, టీచర్ అరెస్ట్
కోల్‌కతా వైద్యురాలిపై హత్యచారం ఘటన అనంతరం దేశంలో ఎక్కడో ఒక్క చోట మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. చిన్నారులు, యువతులు, మహిళలు ఇలా అందరిపై లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న మహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్ అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే. ఇది జరిగిన మరుసటి రోజే అదే జిల్లాలోని అకోలాలో మరో విద్యార్థినులపై వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది.కాజీఖేడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఆరుగురు బాలికలకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ వారిపై వేధింపులకు పాల్పడినట్లు తేలింది. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు ప్రమోద్ మనోహర్ సర్దార్‌పై కేసు నమోదు చేసి మంగళవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రమోద్‌పై ఆరుగురు బాలికలు ఫిర్యాదు చేశారని అకోలా ఎస్పీ బచ్చన్ సింగ్ తెలిపారు. విద్యార్థినులను ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేసేవాడని, అసభ్యకరమైన వీడియోలు చూపించేవాడని పేర్కొన్నారు. బాధిత విద్యార్థినుల వాంగ్మూలాలను నమోదు చేశామని.. నిందితుడిపై బీఎన్ఎస్, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు తెలిపారు. -
బాలికపై టీచర్ అత్యాచారం.. చికిత్స పొందుతూ మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో మరికొన్ని చోట్ల సైతం చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది.తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ కామాంధుడి దాహానికి బాలిక బలైపోయింది. 14 ఏళ్ల మైనర్‌పై ఓ కీచక టీచర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే బాధితురాలు 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు విడిచింది. రాష్ట్రంలోని సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు విశాంబర్ ఇంకా పరారీలో ఉండటం గమనార్హం.బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొనేందుకు బాలికను పిలిచాడు. అనంతరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక భయపడి ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఘటన తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది.ఆమెను ఛత్తీస్‌గఢ్‌లోని బంధువుల వద్దకు పంపగా.. అక్కడ ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో బాధితురాలు మౌనం వీడి తనకు జరిగిన విషయాన్ని అత్తకు చెప్పడంతో ఆమె ఆస్పత్రిలో చేర్చింది. అనంతరం కుటుంబ సభ్యులు నిందితుడిని నిలదీయగా.. అతడు వారికి రూ. 30 వేలు ఇచ్చి ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు.దీంతో కుటుంబ సభ్యులు భయపడి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదు. అయితే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జూలై 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన విశాంబర్‌పై కేసు నమోదు చేశారు. బాలికను వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మరణించింది.మరోవైపు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్ధులు ఆందోళనలు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్యుల నిరసన కొనసాగనుంది. డాక్టర్ల ఆందోళనలతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. -
దారుణం.. పాఠశాలలోనే బాలికపై టీచర్ అత్యాచారయత్నం
బెంగళూరు: కర్ణాటకలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్ధులకు మంచి బుద్దులు నేర్పించాల్సిన టీచార్.. చిన్నారుల పట్ల నీచంగా ప్రవర్తించాడు. తరగతి గదిలోనే 11 ఏళ్ల విద్యార్థినిపై ఓ టీచర్ అత్యాచారానికి యత్నించాడు. కలబురగి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈఘటన చోటు చేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. అలంద్ తాలూకాలోని నింబర్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి యత్నించాడు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసి తరగతి గదికి వెళ్లిన సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక క్లాస్‌లో ఒంటరిగా ఉంది. అరిస్తే చంపేస్తానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.అయితే బాలిక ధైర్యంగా పోరాడింది. సాయం కోసం గట్టిగా కేకలు వేయడంతో వెంటనే నిందితుడు స్కూల్ నుంచి పరారయ్యాడు. భయంతో ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే పాఠశాల ప్రిన్సిపల్‌ను కలిసి దీనిపై ప్రశ్నించారు. ఆ తరవాత తల్లిదండ్రులు నింబర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
Srikakulam: ఆ బడిలో ఒకే విద్యార్థి.. ఒక్కరే టీచర్..
శ్రీకాకుళం: ప్రైవేటు స్కూళ్ల ధాటికి రొట్టవలస పంచాయతీ అవతరాబాద్ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి మిగిలాడు. ఈ ఒక్క విద్యార్థి కోసం టీచర్ పనిచేస్తుండడం గమనార్హం. వీరికి తోడుగా ఒక మరుగుదొడ్డి నిర్వాహక కార్మికురాలు కూడా ఉన్నారు. -
పిల్లలకు క్లాస్ రూంలో పిచ్చిగ కటింగ్ చేసిన టీచర్
-
ఖమ్మం: లేడీ టీచర్ వికృత చేష్టలు.. విద్యార్థుల జుట్టు కత్తిరించి...
సాక్షి, ఖమ్మం జిల్లా: జుట్టు పెంచుకొని స్కూల్‌కి వస్తున్నారంటూ ఓ టీచర్ కత్తెర పట్టుకుని స్వయంగా తానే విద్యార్థులకు పేనుకొరుకుడు మాదిరిగా కటింగ్ చేసి వికృత చేష్టలకు పాల్పడింది. ఇళ్లకు వెళ్లిన విద్యార్థుల హెయిర్ స్టైల్ చూసి అవాక్కైన తల్లిదండ్రులు స్కూలు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఉపాధ్యాయురాలు విద్యార్థుల జుట్టు కత్తిరించి పైశాచిక ఆనందం పొందారు. కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని, ఎన్నిసార్లు కటింగ్ చేయించుకుని స్కూల్‌కి రావాలని హెచ్చరించిన మాట వినడం లేదని స్వయంగా ఉపాధ్యాయురాలు శిరీషనే బార్బర్ అవతారమెత్తింది.ఓ కత్తెర తీసుకొని తనకి వచ్చిన విధంగా 8 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది. తలపై అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో ఎలుకలు కొరికినట్టుగా మారింది. అయితే విద్యార్థులు ఇంటికి వెళ్లి విషయం తెలపగా పాఠశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకొని ఆందోళన చేపట్టారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని,అవమానభారంతో తమ పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు. అయితే టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. -
‘గురు’తర బాధ్యత
పెంచికల్పేట్ (సిర్పూర్): విద్యార్థులను భుజంపై ఎత్తుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న ఒర్రె దాటించి వారి ప్రాణాలు కాపాడారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పెంచికల్పేట్ మండలం జైహింద్‌పూర్ గ్రామ సమీపంలోని చెరువు నిండి మత్తడి దూకింది. ప్రాథమిక పాఠశాలల సమీపంలోని ఒర్రెలోకి భారీగా వరద చేరింది. పాఠశాలలో మొత్తం 30 మంది చదువుతుండగా.. ఒర్రెకు అవతలి వైపు నుంచి నిత్యం 20 మంది వరకు పాఠశాలకు వస్తుంటారు. గురువారం పాఠశాల ముగిసిన అనంతరం ఉపాధ్యాయుడు సంతోష్ గ్రామస్తుల సాయంతో విద్యార్థులను ఎత్తుకుని ఇలా వాగు దాటించారు. -
టీచరమ్మగా రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము టీచర్‌గా మారారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా గురువారం ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసానాలు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోషు్టలు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు. వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు. -
తనకెంతో ఇష్టమైన టీచర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: వీడియో వైరల్
భారత రాష్ట్రపతిగా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న ద్రౌపది ముర్ము తనకెంతో ఇష్టమైన టీచర్‌గా అవతరించారు. కొత్తఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో కాసేపు ఉపాధ్యాయురాలిగా మారిపోయారు. 9వ తరగతి విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉత్సాహంగా గడిపారు. గ్లోబల్ వార్మింగ్ , పర్యావరణం లాంటి వంటి ముఖ్యమైన సమస్యలను చర్చించారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి వివిధ మార్గాలను విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగానీటి సంరక్షణ, అడవుల పెంపకం ప్రాముఖ్యతను వివరించారు. ఎక్కువ మొక్కలు నాటాలని, నీటి వృథాను అరికట్టాలని, వర్షపు నీటి సంరక్షణ ద్వారా వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి)’ ప్రతిపాదనను ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. అలాగే ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని పిలుపునిచ్చారు. వాయు కాలుష్యం గురించి కూడా ఆమె ప్రస్తావించారు. మీతో సంభాషించడం నిజంగా చాలా ఆనందాన్నించ్చిందనీ, మీ అందరి నుండి చాలా నేర్చుకునే అవకాశం తనకు లభించిందంటూ సంతోషాన్ని ప్రకటించారు LIVE: President Droupadi Murmu teaches the students of Class IX of Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate, on completion of 2 year of Presidency https://t.co/FIrBrZp8qJ— President of India (@rashtrapatibhvn) July 25, 2024 -
చాక్లెట్లో పళ్ల సెట్.. కంగుతిన్న టీచర్
పుట్టిన రోజు సందర్భంగా పిల్లలు ఇచ్చిన చాక్లెట్లు తిన్న ఓ రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు తీపు కబురు కాస్త పీడకలగా మారింది.మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్లో మాయాదేవి గుప్తా స్కూల్ ప్రినిపాల్‌గా రిటైరయ్యారు. ప్రస్తుతం ఓ ఎన్జీవోలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్జీవోలో పిల్లల పుట్టిన రోజు వేడుకలు జరుగుతుంటాయి. ఎప్పటిలాగే ఆ ఎన్జీవోలో పిల్లల పుట్టిన రోజులు ఘనంగా జరిగాయిపుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఓ విద్యార్ధి మాయాదేవికి చాక్లెట్ ఇచ్చాడు. అయితే, ఎంతో ఆనందంతో ఆ చాక్లెట్లు తినేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఏమైందంటే ‘విద్యార్ధి నాకు ఒక పాపులర్ బ్రాండ్‌కి చెందిన కాఫీ ఫ్లేవర్ చాక్లెట్ ఇచ్చాడు. చాక్లెట్ తిన్నాక ఏదో కరకరలాడే చాక్లెట్ ముక్కలా అనిపించింది. మరోసారి నమలడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యపడలేదు. వెంటనే చాక్లెట్‌ను పరీక్షించగా అందులో నాలుగు దంతాల పళ్ల సెట్ చూసి కంగుతిన్నాను.’అని తెలిపారు.వెంటనే ఖర్గోన్‌లోని జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్కు మాయాదేవి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పిల్లలు చాక్లెట్లు కొనుగోలు చేసిన దుఖాణం నుంచి అధికారులు చాక్లెట్ నమూనాలను సేకరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి హెచ్ఎల్ అవాసియా ఈ నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
టీచర్ ఇంటికెళ్లిన స్టార్ హీరో.. ఎందుకంటే?
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం ఆయన దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న గోట్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే రాఘవ.. సమాజ సేవలోనూ ముందున్నారు. మాత్రం ఫౌండేషన్ ద్వారా పేదలను ఆదుకుంటున్నారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించి తన గొప్పమనసును చాటుకున్నారు.తాజాగా హీరో రాఘవ లారెన్స్ ఓ ఉపాధ్యాయున్ని కలిశారు. ఆయన ప్రతిభను గుర్తించిన హీరో ఇంటికెళ్లి మరి సన్మానించారు. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా మనలూరుపేటకు చెందిన సెల్వం అనే డ్రాయింగ్ టీచర్‌ను రాఘవ అభినందించారు. సోషల్ మీడియాలో అతని అద్భుతమైన డ్రాయింగ్స్ చూసి ముగ్ధుడైనట్లు వెల్లడించారు. అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందించాలని నిర్ణయించుకున్నట్లు లారెన్స్ తెలిపారు. ఈరోజు అతన్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతని బహుమతి నా మనస్సుకు హత్తుకుందని రాఘవ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.Hi friends and fans, He’s Selvam, a drawing teacher from Manalurpet Kallakurichi district. I saw his wonderful drawing skills shared on social media by all of you. I wanted to meet him in person and appreciate his talent. Today, I’m happy to meet him and so touched by his gift!… pic.twitter.com/Zai28jVALZ— Raghava Lawrence (@offl_Lawrence) July 14, 2024 -
టీచర్లకు పాలాభిషేకం
-
టీచర్ వెళ్లిపోతున్నాడని బాధతో ఎక్కెక్కి ఏడ్చిన చిన్నారి
-
టీచర్ అంటే ఇలా ఉండాలి..
-
తాగుబోతు టీచర్లు...
-
గురువు ప్రాశస్త్యం: గురువుని సాక్షాత్తు త్రిమూర్తుల రూపంగా..
గురువుని సాక్షాత్తు త్రిమూర్తుల రూపంగా భావించి పూజించే సంస్కృతి భారతీయులది. తల్లిదండ్రులు జన్మనిస్తారు. కానీ ఈ జన్మకి సార్థకత, సాఫల్యం అందించే వ్యక్తి గురువు. మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే తల్లితండ్రుల తర్వాత గురువుకి ప్రముఖ స్థానమిచ్చింది మన సంస్కృతి. మనిషిని మనిషిగా తీర్చిదిద్దే శిల్పి గురువు. అందుకే మన విద్యాలయాల్లో, మన మందిరాలలో గురువుని స్మరిస్తూ ఈ శ్లోకాన్ని నిత్యమూ పఠిస్తున్నాము:"గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః!గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమః!!"మనకు విజ్ఞానశాస్త్రం ఎంత తెలిసినా, జీవన విలువలు అందించేది గురువు మాత్రమే. అయితే నేర్చుకోవాలనే జిజ్ఞాస శిష్యునికి ఉండాలి. గురువు జ్ఞానాన్ని ఒసగినప్పుడు దానిని గ్రహించి ప్రయోజకుడు కావాల్సిన బాధ్యత ప్రధానంగా శిష్యునిదే. భారతీయ గురుపరంపర సమస్తం త్యాగం ద్వారానే నిర్మాణం అయ్యింది. త్యాగం, సమర్పణ అనే ఉన్నత భావాలతో సమాజాన్ని నిర్మించే పనిని భారతీయ ఋషులు చేశారు.వ్యాస, వాల్మీకి, వశిష్ఠ వంటివారు మొదలుకొని ఆది శంకరాచార్య, సమర్థ రామదాసు, రామకృష్ణ పరమహంస వరుసలో అబ్దుల్ కలాం వరకు సేవ, త్యాగం అనేవే ఆదర్శాలుగా జీవించారు. నేడు ఆ ఆదర్శలాతో కోట్లాది మంది జీవిస్తున్నారు. ‘నేను మాత్రమే బాగుండాలి’ అని కాకుండా ‘నాతో పాటు సమాజం బాగుండాలి’, అవసరం అయితే సమాజం కొరకు కష్టపడాలి అనే జీవనవిలువ మన సమాజాన్ని నేటికీ రక్షిస్తోంది. ఇదే ఈ దేశ సహజ గుణం. ఈ జీవన విలువను అందించేది గురువు.ఆహారం, నిద్ర, భయం, సంతానోత్పత్తి విషయాల్లో మనుషులకు, పశువులకు తేడా లేదు. ధర్మం మాత్రమే మానవులకు అధికమైన విశేషణం. ధర్మంగా బతకాలి అనే జీవన విలువను కూడా మన గురువులు అందించారు. ఈ ధర్మం అనేది భారతీయ సమాజంలో మాత్రమే కనపడేది. ప్రకృతిలోని పంచభూతాలు వాటి సహజగుణాన్ని వదిలిపెట్టవు. కానీ మనిషి తన స్వభావాన్ని వదిలిపెడుతున్నాడు. జంతువు జంతువులాగానే, పక్షి పక్షిలాగానే జీవిస్తుంది. కానీ మనిషి మనిషిలా బతకడం లేదు. మనిషికి మాత్రమే మనిషిలా జీవించు అని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అలా చెప్పి సన్మార్గంలో నడిపే వ్యక్తి గురువు మాత్రమే. – సాకి -
Faisal Khan: ఇటు సోషల్ మీడియా.. అటు సోషల్ యాక్టివిటీస్‌లోనూ ఖాన్ సర్ ఫస్టే!
అసలు పేరు ఫైసల్ ఖాన్. టీచర్, యూట్యూబర్. ఖాన్ సర్, ఖాన్ సర్ పట్నాగా పాపులర్. సొంతూరు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. అలహాబాద్ యూనివర్సిటీలో సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశాడు. 2019లో ‘ఖాన్ జీఎస్ రీసెర్చ్ సెంటర్’ పేరుతో యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేశాడు.స్కూళ్లు, కాలేజీలు బంద్ అయిన కరోనా లాక్డౌన్ టైమ్‌లో అకడమిక్స్ని టీచ్ చేస్తూ ఖాన్ చేసిన వీడియోలు ఇటు యూట్యూబ్‌లో అటు ఇన్‌స్టాలో వైరలై అతనికి బోలెడంత మంది ఫాలోవర్స్‌ని.. సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించి పెట్టాయి. ఎంతటి కష్టమైన, క్లిష్టమైన సబ్జెక్ట్‌ని అయినా అరటి పండు మింగినంత అలవోకగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఖాన్ సర్ యూఎస్పీ. అందుకే అతని యూట్యూబ్ చానెల్‌కి స్టూడెంట్సే కాదు వరుణ్ ధవన్ లాంటి సినిమా యాక్టర్స్ కూడా సబ్‌స్క్రైబర్సే!సోషల్ మీడియాలోనే కాదు సోషల్ యాక్టివిటీస్‌లోనూ ఖాన్ సర్ ఫస్టే! స్కూల్‌కి వెళ్లలేని పేద పిల్లలకు ఫ్రీగా టీచ్ చేస్తాడు. ఆర్థికావసరాల్లో ఉన్న వాళ్లకు తనకు తోచిన హెల్ప్ చేస్తాడు. యూట్యూబ్ ద్వారా ఖాన్ సర్ నెలకు 15 లక్షల రూపాయలు సంపాదిస్తాడని అంచనా! ఆర్జనే కాదు సాయమందించే మనసూ ముఖ్యమే అని ప్రూవ్ చేస్తున్నాడు ఖాన్ సర్!ఇవి చదవండి: Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..! -
Viral Photo: స్టూడెంట్ రాక్, టీచర్ షాక్.. గుండె నిండా అమ్మాయిలే
ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు చిటికెలో అందరికీ తెలిసిపోతున్నాయి. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, కామెడీ, ఫన్నీ విషయాలు ఎప్పటికప్పుడుసామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ విద్యార్ధి పరీక్షలో రాసిన సమాధానం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియని సమయంలో చాలా మంది విద్యార్ధులు సినిమా పాటలు, సంబంధం లేని కథలు రాస్తుంటారు. అయితే ఓ ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యారు. గుండె బొమ్మ వేసి, దాని పనితీరును రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను సరిగానే వేశాడు కానీ.. కాని అందులోని నాలుగు గదులను వివరించే బదులు వాటిని ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు.గుండెలోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత, ప్రియ, పూజ, రూప, నమిత అంటూ పేర్లు రాశాడు.. అంతేకాదు గుండె పనితీరు స్థానంలో ఆ అమ్మాయిలు అతనికి ఏ విధంగా సంబంధమో వివరించాడు.ప్రియ తనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తుందని, ఆమెను ఇష్టపడుతున్నాడని రాశాడు. ఇక రూప అందంగా క్యూట్‌గా ఉంటుందని, స్నాప్‌చాట్‌లో తనతో టచ్‌లో ఉంటుందని పేర్కొన్నాడు. పక్కింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు, పెద్దపెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు. పూజ తన మాజీ ప్రేమికురాలని, ఆమెను ఎప్పటికీ మరచిపోలేనని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు. చివరిగా హరిత తన క్లాస్మేట్ అని పేర్కొన్నాడు.ఆ సమాధానం చదివిన టీచర్ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు. అతడి తల్లిదండ్రులను స్కూల్‌కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు,విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. . ‘స్టూడెంట్ రాక్.. టీచర్ షాక్’ అంటూ ఓ నెటిజన్ కామెంట చేయగా... ‘గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇచ్చి ఉండొచ్చు కదా’ అంటూ మరో నెటిజన్ స్పందించారు. -
అక్రమాలకు పాల్పడిన టీచర్ల జంట.. రూ. 9 కోట్లు రికవరీకి చర్యలు
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే అక్రమాలకు పాల్పడితే.. అది కూడా తమకు ఉద్యోగాన్నిచ్చిన ప్రభుత్వాన్నే మోసగించాలని చూస్తే.. దాని పర్యవసానం ఎలా ఉంటుందో రాజస్థాన్‌లో వెల్లడయ్యింది. తమ స్థానంలో డమ్మీ టీచర్లను నియమించి, ఉద్యోగ విధులను చేస్తున్నట్లు నాటకమాడిన ఉపాధ్యాయ దంపతులపై ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పడింది.రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో తమ స్థానంలో డమ్మీ టీచర్లను ఏర్పాటు చేసి, వారి చేత పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్న ఉపాధ్యాయ దంపతుల అక్రమాలపై విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి నుంచి రూ.9 కోట్ల 31 లక్షల 50 వేల 373 రికవరీ చేయాలని విద్యాశాఖ తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం విష్ణు గార్గ్ 1996 నుండి, అతని భార్య మంజు గార్గ్ 1999 నుంచి బరన్ జిల్లా పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు తమ బదులు డమ్మీ టీచర్లను నియమించి, వారిచేత విద్యార్థులకు బోధన సాగేలా చూస్తున్నారు. 2017లోనే వీరి వ్యవహారం బయటపడింది. అయితే రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉచ్చు బిగించింది.పోలీసులు, విద్యా శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి, ఈ ఇద్దరు ఉపాధ్యాయుల స్థానంలో నియమితులైన ముగ్గురు డమ్మీ ఉపాధ్యాయులను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ ఉపాధ్యాయ దంపతులు అరెస్టుకు భయపడి పరారయ్యారు. అక్రమాలకు పాల్పడిన ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు. -
ఎవరీ మమతా దలాల్?..ఏకంగా షారూఖ్, సచిన్ కుమార్తెలకు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ కూడా. చాలా వరకు ముఖేశ్ అంబానీ వంశం గురించి అందరికీ తెలసు గానీ నీతా అంబానీ నేపథ్యం గురించి అంతగా తెలియదు. ముఖ్యంగా ఆమెకు ఒక తోబుట్టువు ఉన్నారనే విషయం చాలమందికి తెలియదు. ఆమె నీతా ఇంట్లో జరిగే ప్రతీ ఈవెంట్‌కి, ఫంక్షన్లకి హాజరవుతారు. కానీ మీడియాకు దూరంగానే ఉంటారు. ఆమె ఎవరంటే..నీతా చిన్న చెల్లెలు మమతా దలాల్. ఆమె ఎక్కువ తన తల్లి పూర్ణిమ దలాల్‌తో కలిసి ఉంటారు. గుజరాతీ కుటుంబంలో జన్మించిన ఈ సోదరిమణుల మధ్య వయో భేదం నాలుగేళ్ల అంతరం ఉంది. 2014లో తండ్రి రవీంద్రభాయ్ దాలాను కోల్పోయారు. మమతా దలాల్ సోదరి నీతా అంబానీ స్థాపించిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రైమరీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంది. ముఖ్యంగా నటుడు షారూఖ్ ఖాన్ కుమార్తె, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో సహా కొంతమంది ప్రముఖుల పిల్లలకు పాఠాలు బోధించారు. అంతేగాదు స్కూల్ మేనేజ్మెంట్ టీమ్‌లో కూడా భాగమే. అయితే ఆమె మీడియాకు మాత్రం చాలా దూరంగా ఉంటారు. ఒక్కసారి మనీష్ మల్హోత్ర ఫ్యాషన్ షోలో మాత్రం మమతా దలాల్ మెరిశారు. అయితే మామాలు ష్యాషన్ షో కాదు. క్యాన్సర్ బాధితుల్లో కొత్త ఆశను రేకెత్తించేలా వారితో చేయించిన ష్యాషన్ షో. ఆమె ఇలాంటి ఎన్నో సేవాకార్యక్రమాలు, భోధనకు సంబంధించిన వర్క్షాప్ల్లోనూ ఎక్కువగా పాల్గొంటారు.ఇటీవల నీతా అంబానీ కొడుడు అనంత అంబానీ రెండో ఫ్రీ వెడ్డింగ్ క్రూయిజ్ వేడుకలో కూడా పాల్గొన్నారు. ఇక నీతా అంబానీనే ఒకానొక ఇంటర్వ్యూలో తన సోదరి మమతాతో ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చారు. తాను, తన చెల్లెలు, తొమ్మిది మంది కజిన్ సోదరీమణులతో కలిసి ఉమ్మడి కుటుంబంలో పెరిగా. మహిళలకు విద్య, సమానత్వం, సాధికారత అత్యంల ముఖ్యమని ప్రగాడంగా నమ్మం, ఆ దిశగానే పెరిగాం అని చెప్పుకొచ్చారు. (చదవండి: ప్రధాని మోదీకి ఇష్టమైన సాత్విక ఆహారాలివే..!) -
రీల్స్ పిచ్చి..టీచర్ పై పోలీస్ కేసు..
-
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
అన్ని రంగాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యా రంగంలోనూ ప్రవేశించింది. ఏఐని విద్యలో విలీనం చేసే దిశగా గౌహతిలో రాయల్ గ్లోబల్ స్కూల్ తొలి ఏఐ టీచర్ 'ఐరిస్'ను ఆవిష్కరించింది.సంప్రదాయ దుస్తులు ధరించిన ఐరిస్ తన పరిజ్ఞానం, సంభాషణ సామర్థ్యాలతో విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ సెషన్లో విద్యార్థులు ‘ఐరిస్’ను ప్రశ్నలతో ముంచెత్తారు. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఏఐ టీచర్ వివరణాత్మకంగా, ఉదాహరణలతో చక్కగా సమాధానాలు ఇచ్చింది.విద్యార్థుల సందేహాలు తీర్చడమే కాదు.. కరచాలనం వంటి హావభావాలను ప్రదర్శిస్తుండటంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) ప్రాజెక్టు కింద మేకర్ల్యాబ్స్ ఎడ్యు-టెక్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ‘ఐరిస్’ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయమైన పురోగతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. -
Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) సోమవారం ఉదయం ప్రారంభమైంది. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్గా.. రోజుకు రెండు సెషన్లు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంకో సెషన్లో పరీక్ష జరగనుంది. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 42 కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కొత్తగా బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సొంత ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు అలాట్ అయ్యాయి. సెంటర్ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని.. సెల్ఫోన్లు, ఇతర ఎలాంటి ఎల్రక్టానిక్స్ వస్తువులను అనుమతించరని అధికారులు తెలిపారు. 2.86 లక్షల మందికిపైగా దరఖాస్తు.. మొత్తంగా టెట్ పరీక్షకు 2,86,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఈడీ అర్హత ఉన్నవారు పేపర్–1 రాయనున్నారు. వారు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు అర్హులవుతారు. పేపర్–1కు 99,588 మంది దరఖాస్తు చేశారు. బీఈడీ అర్హత ఉన్నవారు టెట్ పేపర్–2 రాయనున్నారు. వారు ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు అర్హత ఉంటుంది. దీనికి 1,86428 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో భాగంగా ముందుగా పేపర్–2 నిర్వహిస్తారు. తర్వాత పేపర్–1 నిర్వహిస్తారు. ఇక పదోన్నతులు పొందాలనుకునే సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాల్సి ఉంటుంది. మొత్తం 80 వేల మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాయాల్సి ఉండగా.. 48 వేల దరఖాస్తులే వచ్చాయి. వాస్తవానికి టెట్ గడువు పెంచడం వల్లే దరఖాస్తులు పెరిగాయి. తొలుత ఏప్రిల్ 10 వరకు గడువు ఇవ్వగా 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. తర్వాత అదనంగా పది రోజులు గడువు పెంచగా.. సర్వీస్ టీచర్లు సహా మరో 80 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 2016లో టెట్‌కు 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మేథ్స్ సబ్జెక్టు వాళ్లే ఎక్కువ గణితం, సైన్స్ సబ్జెక్టుల నేపథ్యం ఉన్న వారే ఎక్కువగా టెట్‌కు దరఖాస్తు చేశారు. మొత్తం అప్లికేషన్లలో ఈ సబ్జెక్టు వారే 99,974 మంది ఉన్నారు. సోషల్ నేపథ్యంతో టెట్ రాసేవారు 86,454 మంది ఉన్నారు. పేపర్–1కు ఎక్కువగా ఆదిలాబాద్ (7,504), వికారాబాద్ (5,879) జిల్లాల నుంచి.. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి (771) జిల్లా నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇక పేపర్–2కు నల్గొండ (7,163) జిల్లా నుంచి అధికంగా.. జయశంకర్ భూపాలపల్లి (935), ములుగు (963) జిల్లాల నుంచి అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో టెట్ రాయాలి. ఎలాంటి ఒత్తిడికి లోనుకావద్దు. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకురావాలి. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి. – రాధారెడ్డి, టీఎస్ టెట్ కన్వీనర్ -
పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి నెట్వర్క్: ఓటమి భయం వెంటాడుతుండటంతో టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు హాజరయ్యే ఉద్యోగులను ప్రలోభపెట్టేలా.. ఎన్నికల నియమావళి యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అకృత్యాలకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసింది.వివిధ ప్రాంతాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాలకు పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాగా.. వారిని సామ, దాన, దండోపాయాలతో లోబర్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే నగదు పంపిణీ చేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై పచ్చదండు దాడులకు యత్నించింది. టీడీపీ హయాంలో ఉద్యోగ సంఘాల నేతలుగా పనిచేసిన వారితో ఉద్యోగులకు ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు. కొన్నిచోట్ల పోలింగ్ అధికారులను, పోలీసులను సైతం బెదిరించారు.విశాఖలో ఇలా..సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ఏయూ తెలుగు, ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో చేపట్టారు. పోలింగ్ కేంద్రం ఎదురుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు అనుచరులు హల్చల్ చేశారు. వెలగపూడి అనుచరుడు కాళ్ల శంకర్, టీడీపీ నాయకుడు పోతన్న రెడ్డి, మాజీ కార్పొరేటర్ బొట్ట వెంకట రమణ అక్కడే ఉండి ప్రత్యక్షంగా టీడీపీకి ప్రచారం చేశారు. వెలగపూడికి చెందిన రెండు ప్రచార వాహనాలు ఏయూ ఇన్‌గేట్, అవుట్ గేట్ మధ్యలో భారీ శబ్ధంతో కూడిన మైక్‌లను పెట్టుకుని అటూఇటూ తిరుగుతూ ప్రచారం చేశారు. కొంతమంది ఓటర్లకు డబ్బులు పంపిణీ, మరికొందరికి గూగుల్‌పే, ఫోన్ పే చేస్తూ ప్రలోభాలకు గురి చేశారు.చిత్తూరులోనూ ఇదే పద్ధతితిరుపతిలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం పేరుతో టీడీపీ నేతలు హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాలకు అత్యంత సమీపంలోనే కొందరు ఓటర్లకు బలవంతంగా నగదు పంపిణీకి యత్నించారు. ఎన్నికల అధికారులను, పోలీసుల హెచ్చరికలను సైతం ఏమాత్రం లెక్కచేయలేదు. ఉద్యోగ సంఘ మాజీ నేతలు కొందరు ప్రలోభాల పర్వానికి సహకరించారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో టీడీపీ ప్రచార వాహనాలు యథేచ్ఛగా తిరిగినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు.చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేశారు. పుంగనూరులో ఓటర్లను బెదిరించారు. పూతలపట్టులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. పలమనేరులోని ఓ హోటల్లో ఉద్యోగులకు విందు ఏర్పాటు చేశారు. నగరిలో ఉపాధ్యాయులకు యూనియన్ మాజీ నేతల ద్వారా ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగారు.పులివెందులలో అధికారికి బెదిరింపువైఎస్సార్ జిల్లా పులివెందులలో పోలింగ్ ట్రైనింగ్ అధికారి సంగం మహేశ్వరరెడ్డిపై టీడీపీ నాయకులు అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి, దర్బార్‌బాషా, అంజుగట్టు రవితేజారెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఆయనను దుర్భాషలాడుతూ బయటకు నెట్టివేశారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. టీడీపీ నాయకులు అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగకుండా ఇలాంటి వివాదాలకు పాల్పడుతున్నట్టు అవగతమవుతోంది.బద్వేలులోని జెడ్పీ హైస్కూల్లోని ఫెసిలిటేషన్ సెంటర్‌కు సమీపంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో తిష్టవేసిన టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీచేశారు. కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు షేక్‌హుస్సేన్ ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కాడు.తిరుపతిలో తాయిలాల ఎరతిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లోని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద టీడీపీ, జనసేన అభ్యర్థులు హల్చల్ చేశారు. ముందురోజు రాత్రే కొందరు ఉద్యోగులకు తాయిలాల ఎర చూపారు. శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సెంటర్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ హడావుడి చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించిన ఆయనను పోలీసు అధికారులు ప్రశ్నించడంతో సుధీర్ మీ అంతు చూస్తా అంటూ బూతు పురాణం అందుకున్నారు.గుంటూరులో తికమకపెట్టేలా..గుంటూరులో ప్రభుత్వ ఉద్యోగులను తికమకపెట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నేతలు పోస్టింగ్‌లు పెట్టారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా.. అధికారుల మధ్య సమన్వయలోపం, అవగాహన రాహిత్యం బట్టబయలయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి కార్యాలయం నుంచి బ్యాలెట్ ఓటింగ్ వద్ద గొడవ జరుగుతోందని, రెచ్చగొట్టే విధంగా మెసేజ్‌లు పెట్టారు. -
Viral Video: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్ దాడి
విద్యాసంస్థల్లో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ సభ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులు, తోటి ఉపాధ్యాయులపై దాడికి పాల్పడిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్మిస్ట్రెస్ ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో తీసినందుకు టీచర్‌పై దాడి చేసిన నిర్వాకం మరవక ముందే రాష్ట్రంలో ఆగ్రాలో మరో ఘటన చోటుచేసుకుంది.ఆగ్రాలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఓ ప్రిన్సిపల్-టీచర్‌పై దాడికి పాల్పడింది. బూతులు తిడుతూ, దుస్తులు చెరిగేలా భౌతిక దాడికి దిగింది. సీగానా గ్రామంలోని ప్రీ-సెకండరీ స్కూల్ టీచర్ గుంజన్ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని ప్రిన్సిపాల్ గొడవకు దిగింది. అంతేగాక టీచర్‌పై దాడి చేసింది. ఈ ఘర్షణలో ఇద్దరు వస్త్రాలు చిరిగిపోయాయి.అంతటితో ఆగకుండా నోటికి కూడా పని చెప్పారు. బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ప్రిన్సిపల్ డ్రైవర్ విడదీసే ప్రయత్నం చేసినా.. చివరికి టీచర్‌తో అతడు కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.A Principal in Agra beat up a teacher this bad just because she came late to the school. Just look at her facial expressions. She's a PRINCIPAL 😭 @agrapolice pic.twitter.com/db8sKvnNvs— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 3, 2024 -
ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనం ఏమైంది?
గజ్వేల్/పాపన్నపేట: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలకు మోసం జరిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయు లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు వేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మాట నిలుపుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ రాకముందే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కావాల్సినంత సమయమున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. మార్చి 31న పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు అందాల్సిన డబ్బులను బాండ్ల రూపంలో ఇస్తారని లీకులు వస్తున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ఉనికే లేదని.. కేవలం రాముడిని చూపుతూ ఆ పార్టీ ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు. వీడియోలతో విమర్శనాస్త్రాలు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగు తోంది. శుక్రవారం పాపన్నపేట మండలం కొత్తపల్లి లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వీడి యో క్లిప్పింగ్‌లు ప్రదర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్‌లను చూపుతూ.. ఇవి అమలు అయ్యాయా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. -
‘‘డిజిటల్ యుగంలో డా.అంబేద్కర్ భావజాలం’’ పుస్తకంపై విజయభాను కోటే రివ్యూ
పుస్తక సమీక్ష: “Dr. Ambedkar’s Ideology in the Digital Era” (రచయిత- డా. జేమ్స్ స్టీఫెన్ మేకా (రిజిస్ట్రార్-ఆంధ్ర విశ్వవిద్యాలయం) ప్రపంచం మరుపులో కూరుకుపోతున్నట్లు కనిపించినప్పుడు, కొంతమంది వ్యక్తులు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రతిధ్వనులను కలిగించే స్వరాలను ఎక్కుపెడతారు. డాక్టర్ జేమ్స్ స్టీఫెన్ మేకా గారిని తన తాజా పుస్తకం "డాక్టర్ అంబేద్కర్స్ ఐడియాలజీ ఇన్ ది డిజిటల్ ఎరా" గురించి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అదే భావోద్వేగం కలిగింది. “మీ పుస్తకం శీర్షిక వినూత్నంగా ఉంది. అసలు డిజిటల్ శకానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వారధి కట్టాలని మీకు ఎలా అనిపించింది?” ఈ ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ జేమ్స్ స్టీఫన్ చూపించిన వీడియో చూసి నేను, నా సహచరుడు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురయ్యాము. డాక్టర్ అంబేడ్కర్ చైర్ గా సేవలు అందించిన డాక్టర్ జేమ్స్ స్టీఫన్ వంటి అంబేడ్కరిస్ట్ ను టీవీ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు వేదనకు గురిచేసింది. ఈ కార్యక్రమంలో అడిగిన ఒక ప్రశ్నకు హాట్ సీట్ లో పాల్గొంటున్న వ్యక్తి మాత్రమే కాక కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు కూడా అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం తెలియని పరిస్థితుల్లోకి భారతదేశం వెళ్లిపోతోందని అర్థం అయిన ఆయన ఆ సమస్యను తీవ్రమైన సమస్యగా గుర్తెరిగి, పరిష్కారంగా ఈ పుస్తకాన్ని రచించారు. ఆ “మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోగ్రామ్ వీడియోలో అడిగిన ప్రశ్న, “వీరిలో బాబాసాహెబ్ గా పేరొందిన వారు ఎవరు? దీనికి పార్టిసిపెంట్‌కు జవాబు తెలియక, షోలో భాగంగా “ఆడియన్స్ పోల్” ఎంచుకోవడం, అందులో అంబేడ్కర్ కు 27శాతం మాత్రమే ఓటింగ్ రావడం, చివరికి వల్లభాయి పటేల్ అని జవాబు చెప్పడంతో తనకు సమస్య తాలూకా తీవ్రత అర్థంఅయిందనీ, పనులెన్ని ఉన్నా, లోపల మండుతున్న ఒక నిప్పు రవ్వ నిద్రపోనివ్వని కారణంగా ఈ రచన జరిగిందని చెప్తారు డా. జేమ్స్ స్టీఫన్. అంబేడ్కర్ అనుచరులు ఆయనను ఆప్యాయంగా, అభిమానంతో పిలిచే పేరు “బాబాసాహెబ్”. బాబా అంటే తండ్రి, సాహెబ్ అంటే సార్ అనే గౌరవ సంబోధన. అంబేడ్కర్ “బాబాసాహెబ్” గా భారతదేశం లోనే కాక అంతర్జాతీయంగా కూడా పేరు పొందారు. మన దేశంలో విశ్వవిద్యాలయాలు ఆయన పేరుతో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో ఒక జిల్లా, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. అంబేడ్కర్ జయంతిని ఘనంగా జరిపే భారతావనిలో నేటి యువత ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యతను. ఆ వ్యక్తి భారతదేశానికి చేసిన అత్యున్నత సేవను, ఆ వ్యక్తి చరిత్రలో వేసిన ముద్రను తెలియని స్థితిలోకి జారిపోతున్నారన్న ఆలోచన, ప్రస్తుతం సమాజంలో, ముఖ్యంగా నేటి యువతలో అంబేడ్కర్ గురించిన అవగాహన పెంచడానికి, డిజిటల్ వ్యవస్థను వినియోగించడం ఎలా అన్న అంశాన్ని లోతైన అధ్యయనాల ద్వారా ఈ పుస్తకంలో తెలియజేశారు. అంతే కాక అంబేడ్కర్ సిద్ధాంతాలు నేటి డిజిటల్ యుగానికి ఏ రకంగా అవలంబించవచ్చో తెలియజేశారు. ఈ 20 అధ్యాయాల పుస్తకం నిజమైన అంబేద్కర్‌ను ప్రపంచానికి పరిచయం చేయవలసిన ఆవశ్యకతను వెల్లడిస్తుంది. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు అందించబడాలని నిక్కచ్చిగా చెబుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇండియా వీడీఎం ఇండియా ఆన్ ద మూవ్ ఛైర్మన్ ఆచార్య శ్రీ అజయ్ కుమార్ "ఈ పుస్తకం అంబేద్కర్ యొక్క విజన్, ఒక గొప్ప నాయకుని ఆశయాలు మరియు ఆలోచనలను డిజిటల్ యుగం యొక్క పరివర్తన శక్తితో సమకాలీకరించే ఉన్నతమైన పనిని పూర్తి చేస్తుంది." అన్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి సిద్ధాంతాలను ప్రస్తుత కాలానికి అన్వయించాలంటే ఆ వ్యక్తి గురించిన లోతైన అధ్యయనం చెయ్యాలి, ఆ సిద్ధాంతాలు ఏ కాలానికైనా అవలంబించదగినవని తెలియాలంటే, అనుసంధాన ప్రక్రియ బలంగా ఉండాలి. ఈ పుస్తకంలో రచయిత చేసినది అదే! చరిత్ర భవిష్యత్తుకు పునాదిగా పనిచేస్తుంది. మనం డాక్టర్ అంబేద్కర్‌ను కేవలం గురువుగా మాత్రమే కాకుండా, వారి ఆలోచనలు మరియు దృష్టిని మన భవిష్యత్తుకు అన్వయించగల వ్యక్తిగా కూడా గుర్తుంచుకోవాలి. ఏ కాలానికైనా వర్తించే ఆలోచనలను కొద్ది మంది మాత్రమే ప్రతిపాదించగలరు. అలాంటి వారిలో డాక్టర్ అంబేద్కర్ ఒకరు. డాక్టర్ అంబేద్కర్ జీవితం అన్ని కాలాలకు ఆదర్శంగా నిలుస్తుంది. జ్ఞానాన్ని ఆయుధంగా వాడుకున్న యోధుని గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా ఆయన ఎప్పుడూ గుర్తింపు పొందారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని పాటించినంత కాలం ఆయన మన పౌర జీవితాల్లో జీవిస్తారు. అంబేద్కర్ తన విద్యను సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఉపయోగించారు. మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలకు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసుకునే హక్కు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 20 అధ్యాయాలుగా విభజించబడ్డ ఈ పుస్తకంలో ఒక్కో అధ్యాయాన్ని పుస్తకం యొక్క మూల లక్ష్యాన్ని నిర్మాణాత్మకంగా చేరేలా రచించారు. డాక్టర్ అంబేడ్కర్ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతూ ఆయన ఎదుర్కొన్న వివక్ష ఎంత కాలం, ఎలా ఆయన జీవితాన్నివెంటాడిందో తెలియజేస్తూ, ఆయనలో వివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు ధోరణి, ఆ తిరుగుబాటుకు సూచనగా ఆయన విద్యను ఆయుధంగా ఎంచుకోవడం, ఆ తిరుగుబాటును వ్యక్తీకరించడానికి ఆయన రచనను ఆయుధంగా, వ్యక్తీకరణ సాధనంగా ఎంచుకోవడం గురించి సూక్ష్మంగా అయినా, పదునుగా తెలియజేస్తారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ భావజాలం అప్పట్లో ఒక తిరుగుబాటుగానే పరిగణించబడింది. తన సిద్ధాంతాలను సమాజ మార్పుకు పునాదులుగా చేయడానికి ఒక వ్యక్తి చేసిన అనితరసాధ్య, నిరంతర సంఘర్షణల ఫలితమే అంబేడ్కరిజం. ఆయన సిద్ధాంతాలు లేదా భావజాలం యొక్క పురోగతి వేల యుద్ధాలను దాటిన అనుభవంగా మనం చెప్పవచ్చు. ఇక డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి గల నాయకుడని ఆయన రచనలు చదివే ఈ నాటి యువతకు అర్థం అవుతుంది. ఆయన దృష్టిలో సమ న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక చేర్పు అనే అంశాలను నేటి సాంకేతిక యుగానికి అనుసంధానం చేస్తూ, డిజిటల్ డివైడ్ లేని సమాజం వైపు అడుగులు వేయడం వలన సాంకేతిక సమసమాజ చేర్పుకు నాంది పలకాలని పిలుపును ఇవ్వడం ఈ పుస్తకం యొక్క ఒక ముఖ్య ఉద్దేశ్యం. సాంకేతిక విప్లవం నేటి కాలపు విజయం అని అభివర్ణించే ఈ కాలంలో విద్య మరియు సాంకేతిక సాధికారత గురించి, సాంకేతిక ప్రజాస్వామ్యం గురించి రచయిత లేవనెత్తిన అంశాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇక ఈ కాలంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య సమాచార గోప్యత లేకపోవడం లేదా సమాచార దోపిడీ (మనకు తెలియకుండానే మన సమాచారం ఇతరులు వినియోగించడం. ఉదాహరణకు మనకు తెలియని కంపెనీల నుండి, బ్యాంకుల నుండి మనకు ఫోన్ రావడం రోజూ జరుగుతూనే ఉంటుంది. అది సమాచార చౌర్యం అని తెలిసినా మనకు ఏమి చెయ్యాలో తెలియదు) గురించి వివరించారు రచయిత. ప్రపంచ సమాజం మొత్తం ఇపుదు డిజిటల్ ఆక్టివిజం లోనే ఉందన్నది వాస్తవం. సాంకేతిక క్రియాశీలత వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి అని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతూనే ఉంటారు. అయితే ఈ సాంకేతిక క్రియాశీలత వలన ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ సేవలను గురించి చెప్పుకోవచ్చు. మరి సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే నేడు వార్తా పత్రికల కన్నా సామాజిక మాధ్యమాల ద్వారా వార్తలను తెలుసుకునేవారి సంఖ్య పెరిగింది. ఈ మాధ్యమాలు చర్చావేదికలుగా మారాయి. దేశపు సాధారణ పౌరుల నుండి అత్యున్నత అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ అకౌంట్ల ద్వారా సమాచారాన్ని, ప్రకటనలను వెలువరిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న సాంకేతిక క్రియాశీలత ద్వారా సామాజిక మార్పు సాధ్యాసాధ్యాల గురించి రచయిత విపులంగా చర్చిస్తారు. ఆల్గారిథమిక్ బయాస్ అనేది సమాజంలో ఇప్పటికే ఉన్న పక్షపాతాలను ప్రతిబింబించే డేటాపై అల్గారిథమ్‌లను రూపొందించినప్పుడు లేదా శిక్షణ ఇచ్చినప్పుడు సంభవించే దైహిక మరియు అన్యాయమైన వివక్షను సూచిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను నిలబెట్టడానికి, అల్గారిథమిక్ డెసిషన్ మేకింగ్‌లో ఇటువంటి పక్షపాతాలను నిశితంగా పరిశీలించి సరిదిద్దడానికి కృషి చేయాలి. డాక్టర్ అంబేడ్కర్ భావజాలాన్ని నేటి సాంకేతిక యుగం లో సామాజిక న్యాయం మరియు సమత్వం గురించి చర్చిస్తూ, అట్టడుగు వర్గాలను ఈ డిజిటల్ యుగంలో సామాన్య హక్కుదారులుగా ఎలా చేర్చాలో చర్చిస్తారు. సాంకేతిక యుగంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్షలను కూకటివేళ్ళతో ఎలా పెకిలించాలో దిశానిర్దేశం చేస్తారు. అలాగే డిజిటల్ విద్య అవసరత, తద్వారా ఉపాధి లేదా సామాన అవకాశాల ఆవశ్యకత గురించి చర్చిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ సమసమాజ స్థాపన కొరకు పాటు పడ్డారు. అది విద్య, సాధికారత వలనే సాధ్యం అవుతుందని భావించారు. ఈ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుని, సాంకేతిక సాధికారత, సామాజిక సమానత్వం తీసుకురావడంలో సాంకేతికత పాత్ర గురించి వివరిస్తూ, జీవితకాల అభ్యాసం వలన వనగూరే లాభాలను గురించి ప్రకటిస్తారు. ఈ పుస్తకంలో ఒక మంచి అంశం చాలా చోట్ల కేస్ స్టడీస్ (ఉదాహరణ అధ్యయనాలు) ను తీసుకోవడం. డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను పునాదిగా చేసుకుని నేటి కాలపు స్థితులకు అనుగుణంగా పౌరులను చైతన్యపరచడంలో రచయిత సఫలీకృతులు అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరదృష్టి గల సంఘ సంస్కర్త మరియు భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. ఈ ఆదర్శాల గురించి లోతైన అంతర్దృష్టులను అందించారు. డిజిటల్ వ్యాపారంలో సైతం అసమాన్యతల తొలగింపు గురించి చర్చిస్తూ పౌర నిర్వహణ లేదా పౌర భాగస్వామ్యం గురించి రాసిన విధానం పౌరులందరినీ ఆలోచింపజేస్తుంది. అట్టడుగు వర్గాలకు అందని కొన్ని ప్రయోజనాలు, అనుమతి అసమాన్యతల గురించి చర్చిస్తూ భౌగోళిక అంశాలను గురించి వివరించడం, ఆన్లైన్ అభ్యాస మార్గాలలో అసమానతల నిర్మూలనకు మార్గాలను నిర్దేశించడం జరిగింది. అసమానతలు దేశ ఆర్థికాభివృద్ధిపై చూపే ప్రభావం, వ్యవస్థాపకత లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి కారణాలను తెలియజేస్తుంది ఒక అధ్యాయం. ఇక ఆన్లైన్ అంశాలలో బ్లాగింగ్, వీడియోల ద్వారా సమాచార ప్రచారం, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార ప్రసారం మొదలైన ఎన్నో విషయాలను చర్చిస్తాయి ఇందులోని అధ్యాయాలు. నేటి కాలంలో టెలీ మెడిసిన్, ఆన్లైన్ హెల్త్ కేర్ మొదలైన అంశాలను కూడా తన పుస్తకంలో చేర్చారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ సూత్రాల ఆధారంగా సాంకేతిక అసమానతలను అధిగమించేందుకు సోపానాలను ఒక అధ్యాయంలో వివరించారు రచయిత. సమాచారం సాధికారతకు సోపానం అంటారు రచయిత. అందుకే డిజిటల్ గ్రంధాలయాలకు ఓపెన్ యాక్సెస్ గురించి మాట్లాడుతారు. అందరికీ సామాన విద్య గురించి మాట్లాడుతూ ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అంటారు. డిజిటల్ విద్య అంతరాన్ని తగ్గించడంపై అందరం దృష్టి పెట్టాలి. అలాగే డిజిటల్ లిటరెసీను పెంపొందించే కార్యక్రమాల ఆవశ్యకత, డిజిటల్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జ్ఞానసముపార్జనను ప్రజాస్వామీకరించడం వంటి విలువైన అంశాలను ఈ పుస్తకంలో చేర్చారు. ఈ ప్రక్రియలో భాగంగా మనం ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలకు పరిష్కారాలను, డాక్టర్ అంబేడ్కర్ చారిత్రక ఉద్యమాలను ఉదాహరణలుగా చూపుతూ చర్చించారు. డిజిటల్ వేదికల సద్వినియోగం, అంతర్జాతీయ సహకారం యొక్క ఆవశ్యకత, వెసులుబాటు అవకాశాలు, మార్గాలు, సమాచార భద్రత, సమాచార జీవావరణ వ్యవస్థ (డేటా ఏకొ సిస్టమ్), సమాచార దోపిడీ వలన కలిగే హాని, సమాచార ఆధారిత వివక్ష, సమాచారం యొక్క నైతిక వినియోగం, నిఘా పటిష్టత మొదలైనవాటి గురించిన సంక్షిప్త సమాచారం ఈ పుస్తకంలో ఉంది. రచయిత గోప్యతను మానవ హక్కుగా పేర్కొంటూ రాసిన అధ్యాయం అందరూ చదివి తీరాలి. ఈ అంశాలన్నింటినీ డాక్టర్ అంబేడ్కర్ దృష్టికి, సిద్ధాంతాలకీ అన్వయించి వివరించిన విధానం బావుంది. అదే విధంగా ఆన్లైన్ నేరాలు, సైబర్ బుల్లియింగ్ మొదలైన వేధింపుల గురించి, ఫిర్యాదు పద్ధతుల గురించి ఈ పుస్తకంలో విపులంగా ఉంది. సురక్షితమైన ఆన్లైన్ వేదికల సృష్టి యొక్క ఆవశ్యకతను వివరించారు. కృత్రిమ మేధస్సు సాంకేతికతలో పురోగతి, తద్వారా ఎదుర్కొనే సవాళ్ళు, నైతిక అనిశ్చితి గురించి వివరిస్తూ, సామాజిక సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ గవర్నెన్స్, డిజిటల్ వ్యవస్థాపకతల గురించి డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలతో పోలుస్తూ కొన్ని అధ్యాయాలు రాశారు. వెనుకబడిన సమూహాలకు అందుబాటులో సాంకేతికత ఉండాలన్నది ఆయన వాదన. తద్వారా సామాన అవకాశాలు దక్కుతాయని ఉదాహరణ అధ్యయనాల ద్వారా నిరూపించిన తీరు అమోఘం. డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలను నేటి సాంకేతితక ద్వారా ప్రచారం చేయడానికి పూనుకోవాల్సిన ఆవశ్యకత అవగతం అవుతుంది చదివిన ప్రతి ఒక్కరికీ. అంబేడ్కర్ గురించి అందరికీ తెలియాలి! నేటి సమాజానికే కాదు, ఏ కాలానికైనా ఆయన దార్శనికత వెలుగు చూపే దివ్వె అవుతుందని తెలియాలి! అంబేద్కర్ భావజాలాన్ని డిజిటల్ యుగానికి చేర్చాలనే ఆలోచన భారతదేశ పౌరులతో పాటు మొత్తం ప్రపంచ పౌరులలో అంబేద్కర్ భావజాలం యొక్క అక్షరాస్యతను మెరుగుపరుస్తుందన్నది వాస్తవం. ఈ పుస్తకం మన అందరి భవిష్యత్ ఆలోచనా సరళి మార్పును, భవిష్యత్ తరాలకు అంబేడ్కర్ ఆశయాలను చేర్చేందుకు తీసుకోవలసిన చర్యల ఆవశ్యకతను సూచిస్తుంది. శరవేగంతో పరుగులు పెడుతున్న అభివృద్ధి భారతదేశాన్ని ఏ స్థాయిలో నిలబెట్టగలదో అంచనా వేసేందుకు కొన్ని అధ్యయనాలు, కొన్ని ఆచరణలు అవసరం అని అందరికీ తెలుసు. భారతదేశ భవిష్యత్తు గురించి అత్యున్నత దృక్పథాన్ని కలిగి ఉన్న జాతీయ నాయకుడికి భిన్నమైన భావజాలం ఉంది. దూరదృష్టి కలిగిన ఆ దార్శనికుని మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అందిపుచ్చుకోగలిగితే, అది భారతదేశాన్ని అభివృద్ధిలో శిఖరాగ్రంలో ఉంచగలదన్న విషయాన్ని అర్థం చేసుకుని, సాంకేతికత పరంగా కూడా ఆ భావజాలాన్ని వినియోగించుకోగలగాలి. ఇంత విపులంగా అంబేడ్కర్ ఆశయాల సాధన కొరకు నేటి కాలం సాంకేతికతను సమ్మిళితం చేయగలిగే విధానాలను సూచిస్తూ రచించిన ఈ పుస్తకం ఎంతో మంది పరిశోధకులు, పౌరులు, విద్యార్థులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక పరిజ్ఞాన అభ్యాసకులకు మార్గదర్శిగా ఉండగలదు. - విజయభాను కోటే ఫ్రీలాన్స్ రైటర్, టీచర్, హ్యుటగాజీ ఎక్స్పర్ట్ 8247769052 (పుస్తకం దొరుకు చోటు: Amazon: Dr. Ambedkar's Ideology in The Digital Era https://a.co/d/9erV5My) -
భర్తీ ఎన్ని? మిగిలినవి ఎన్ని?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీల్లో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటం.. దానికితోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పెండింగ్‌లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటివరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు.. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు న్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలో వివిధ కేటగిరీల్లో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గతేడాది ఏప్రిల్ 5వ తేదీన ఏక కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ కేటగిరీల్లోని 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్‌లో ఉండగా.. మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు.. కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటంతో అభ్యర్థులు ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు. దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే మూడు, నాలుగు ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు. ప్రస్తుతం చాలావరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిననప్పటికీ.. ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిశాకే.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈప్రక్రియ మొదలు కానుంది. దీంతో కౌన్సెలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలిన పోస్టులు ఎన్ని.. అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెపుతున్నారు. -
నా స్టూడెంట్ టీచర్ అయింది!
‘ఎక్స్’లో రేవ్ అనే టీచర్ తన స్టూడెంట్ ఆలిషా గురించి చేసిన పోస్ట్ వైరల్ అయింది. స్కూల్ రోజుల్లో ఆలీషా అల్లరిపిల్ల. రేవ్ మాటల్లోనే చెప్పాలంటే రెబెల్. ‘ఈ అమ్మాయి భవిష్యత్ ఎలా ఉండబోతుందో’ అంటూ అలీషా గురించి బెంగపడేది రేవ్. కట్ చేస్తే... ఆలిషా ఇప్పుడు ముంబైలోని ఒక స్కూల్లో స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్‌కు టీచర్. ‘మొండిఘటం. ఏ పనీ చేయలేదు... అని నా గురించి రేవ్ టీచర్‌కు చెప్పేవారు. అయితే టీచర్ మాత్రం నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకునేది. అలాంటి ప్రేమను స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్‌కు పంచాలనుకుంటున్నాను’ అంటుంది అలీషా. -
కాసేపు టీచర్‌గా మారిన హైదరాబాద్ కలెక్టర్
నాంపల్లి: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికార హోదాను కాసేపు పక్కన పెట్టి టీచర్‌గా మారిపోయారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు. టీచర్లలో ఉత్తేజం నింపారు. ఈ సన్నివేశం గురువారం మల్లేపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక తెలుగు, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని తరగతి గదు లను సందర్శించి పిల్లలతో ముచ్చటించారు. విద్యా ర్థులు చదువుతున్న తీరును గమనించారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయులతో బోధనలు చేయించారు. ‘పాఠం అర్థమైందా పిల్లలూ..’అని ఆరా తీశారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్, డీఈఓ రోహిణి, తహసీల్దార్ జ్యోతి పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్కు చురకలు.. మల్లేపల్లి ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలుపులను ఆకతాయి లు రాత్రివేళల్లో పగులగొట్టి లోనికి చొరబడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని టీచర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనూ స్కూల్లోని కంప్యూటర్లు ఎత్తుకెళ్లారని చెప్పారు. అయితే అక్కడే ఉన్న హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ టంగుటూరి రాంబాబును పిలిచి ‘దొంగలు పడితే ఏం చేస్తున్నారు’ అని కలెక్టర్ చురకలు అంటించారు. వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్ నాంపల్లి ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. -
Nayi Disha Seema Seth: కార్పొరేట్ రంగం నుంచి కార్మిక లోకానికి...
కార్పొరేట్ ప్రపంచంలో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సీమా సేథ్ ఇక ఆ రంగంలో మరింత ముందుకు వెళ్లాలనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఒకరోజు ఒక ఆటోడ్రైవర్‌తో మాట్లాడుతున్నప్పుడు చదువుకు దూరమైన నిరుపేద పిల్లల గురించి తెలుసుకుంది. ఈ క్రమంలో కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి ‘నయీ దిశ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి కొత్తదారిలో ప్రయాణిస్తోంది. అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలను విద్యావంతులను చేస్తోంది. తాను కూడా టీచర్‌గా మారి పిల్లలకు పాఠాలు చెబుతోంది.... ‘ఇంజినీర్ కావాలనేది నా లక్ష్యం’ అంటున్న బప్పన్ దాస్ ‘నయీ దిశ’ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. బప్పన్ తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉపాధి వెదుక్కుంటూ పశ్చిమ బెంగాల్ నుంచి గురుగ్రామ్‌కు వచ్చారు. ‘ఈరోజు తిండి దొరికేతే చాలు’ అన్నట్లుగా ఉండేది వారి ఆర్థిక పరిస్థితి. దీంతో చదువు మాట అటుంచి బప్పన్ కనీసం బడిముఖం కూడా చూడలేకపోయాడు. ‘నయీ దిశ’ పుణ్యమా అని బప్పన్ ఎనిమిది సంవత్సరాల వయసులో బడిలోకి అడుగు పెట్టాడు. ‘సీమా మేడమ్ నుంచి పాఠాలు వినడమే కాదు ఆమెతో కలిసి ఆడుకున్నాం. సరదాగా ఎన్నో ప్రాంతాలు తిరిగాం’ అంటాడు బప్పన్. బడి అంటే భయపడే స్థితి నుంచి బడికి ఇష్టంగా వెళ్లడం వరకు బప్పన్‌ను మార్చివేసింది సీమ. ‘నిరుపేద పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మార్గం మరో మార్గంలోకి తీసుకువెళ్లి మరిన్ని మంచిపనులు చేయిస్తుంది’ అంటుంది సీమ. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం సికిందర్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు బోధించేది. ఈ పని తనకు ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చేది. తనను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే ఆటోడ్రైవర్ ‘పిల్లలకు పాఠాలు చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?’ అని అడిగాడు. ‘లేదు’ అని చెప్పింది సీమ. తాను ఉండే కాలనీ పేరు చెప్పి ‘అక్కడ చాలామంది పిల్లలు బడికి వెళ్లడం లేదు’ అని చెప్పాడు. ‘ఎందుకు?’ అని అడిగింది సీమ. ‘పిల్లలను బడికి పంపించే స్తోమత తల్లిదండ్రులకు లేదు’ అని చెప్పాడు ఆటోడ్రైవర్. ఆ తరువాత... ‘మేడమ్... మీరు అక్కడ స్కూల్ పెట్టండి. ఎంతోమంది పిల్లలు చదువుకొని బాగుపడతారు’ అన్నాడు ఆటోడ్రైవర్. సీమ ఆలోచనలో పడింది. ఆ తరువాత ఆసక్తి పెరిగింది. ‘మీ కాలనీలో స్కూల్ ఎక్కడ స్టార్ట్ చేయాలో చెబితే అక్కడే చేస్తాను’ అన్నది సీమ. ఆటోడ్రైవర్ నివసించే పేద ప్రజల కాలనీలో ఒక గోదాములో సీమ స్కూల్ స్టార్ట్ చేసింది. 35మంది పిల్లలతో ‘నయీ దిశ’ ప్రస్థానం మొదలైంది. కొద్దిమంది పిల్లలతో ఒక గదిలో మొదలైన స్కూల్ ఆ తరువాత వందమంది పిల్లలతో ఎనిమిది గదుల్లోకి విస్తరించింది. గురుగ్రామ్‌లోని వివిధ కళాశాలలలో చదివే విద్యార్థులు ఈ స్కూల్‌కు వచ్చి కంప్యూటర్ నుంచి థియేటర్ వరకు ఎన్నో విషయాలు బోధిస్తున్నారు. విద్యాసంబంధమైన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ‘నయీ దిశ’ కేంద్రంగా మారింది. ‘నయీ దిశ’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేద పిల్లలకు అకాడమిక్ పునాదిని ఏర్పాటు చేసింది సీమ. ఇప్పుడు ఆ పునాది మీదే పిల్లలు ఎన్నో కలలు కంటున్నారు. ‘తమ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషించారు. నయీ దిశ పిల్లలకు ఎంత విలువ ఇస్తుందో దగ్గరనుంచి చూశారు. పిల్లలకు బడి అంటే స్వేచ్ఛ అనుకునేలా చేశాం. పిల్లలు తమ మనసులోని భావాలను అందంగా వ్యక్తీకరించడం నుంచి ఇంగ్లీష్‌లో మాట్లాడడం వరకు ప్రతిక్షణం అభ్యాస వేడుకే’ అంటుంది సీమ. ‘మొదటి నుంచీ పిల్లలకు ఎన్నో సబ్జెక్ట్‌లు బోధిస్తూ వారి ఎదుగుదలను చూశాను. మొదట్లో క్రమశిక్షణా రాహిత్యంతో ఉండే పిల్లలు... కాలక్రమేణా మాట, మర్యాద నేర్చుకున్నారు’ అంటుంది ‘నయి దిశ’ స్కూల్లో పని చేస్తున్న నిషా అనే టీచర్. ‘నయీ దిశ’ విజయంతో ఇందిరా కాలనీలో మరో స్కూల్‌ను ప్రారంభించించి సీమ. ఈ స్కూల్లో 65 మంది నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారు. సిలబస్‌ను సరిగ్గా అనుసరిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి నెలకొకసారి టీచర్ ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల పేరెంట్స్–టీచర్ మీటింగ్ కూడా ఉంటుంది. ‘మా అబ్బాయికి చదువు పట్ల ఉండే శ్రద్ధ చూస్తుంటే ముచ్చట వేస్తోంది. ఇదంతా నయీ దిశ పుణ్యమే. డాక్టర్ కావాలనేది మా అబ్బాయి కల. పదిమందికి ఉపయోగపడే కల కంటే అది తప్పక నెరవేరుతుంది అని సీమ మేడమ్ ఒక మీటింగ్‌లో చెప్పారు’ అంటున్నాడు అశోక్‌రావు అనే పేరెంట్. వినే వారు తప్పకుండా ఉంటారు మన మనసులో మంచి ఆలోచన ఉన్నప్పుడు, అది వినడానికి ఈ విశ్వంలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు. ‘ఆలోచన బాగానే ఉంది గానీ.. అసలు ఇది నెరవేరుతుందా...’ అనుకున్న ఎన్నో ఆలోచనలు నెరవేరాయి. మంచి పని కోసం ప్రయాణం ప్రారంభించినప్పుడు దారే తన వెంట తీసుకువెళుతుంది. ఎన్ని అవరోధాలు ఉన్నా వాటంతట అవే తొలగిపోతాయి. – సీమ, నయీ దిశ– వ్యవస్థాపకురాలు -
Maithri Rao: తెలుగు నేల మీద తుళు అడుగులు
మహిళలు చదువుకుంటున్నారు. మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. మహిళలు అభిరుచిని కెరీర్‌గా మలుచుకోగలుగుతున్నారు. మహిళలు సాధికారత లక్ష్యంలో విజేతలవుతున్నారు. ‘సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి నాట్యమే నా మాధ్యమం’ అంటున్నారు మైత్రి రావు. భరతనాట్యం ద్వారా ప్రదర్శించగలిగేది పౌరాణిక ఐతిహాసిక కథనాలనే కాదు, సామాజిక అంశాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కూడా ఇది దీటైన మాధ్యమం అన్నారామె. సమాజం పెట్టే పరీక్షలను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే ప్రతి మహిళా ఒక శక్తిస్వరూపిణే అన్నారామె. అందుకే ప్రతి భావాన్నీ లోతుగా వ్యక్తీకరించే ఈ మాధ్యమం ద్వారా తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లు చెబుతూ, నాట్యాన్నే కెరీర్‌గా మలుచుకున్న వైనాన్ని సాక్షితో పంచుకున్నారు స్త్రీ శక్తి పురస్కార గ్రహీత మైత్రిరావు. ‘‘మహారాష్ట్రలోని మాలేగావ్‌లో పుట్టాను. మా మూలం దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల. నేను పెరిగింది, చదువుకున్నది మైసూర్లో. ఇప్పటికీ ఇంట్లో తుళు భాష మాట్లాడతాం. మైసూర్‌లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేశాను. డాన్, యోగాలను పూర్తి స్థాయి కెరీర్‌గా మార్చుకోవడానికి ముందు నోకియా కంపెనీలో రెండేళ్లపాటు డెవలపర్‌గా బెంగళూరులో ఉద్యోగం చేశాను. డాన్ మీద ఆసక్తి నాలుగేళ్ల వయసులోనే బయటపడింది. నా ఆసక్తిని గమనించి మా అమ్మానాన్న నాకు ఎనిమిదవ ఏట నుంచి భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. 2010లో అరంగేట్రం జరిగింది. నాట్యంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ప్రతి చిన్న పెద్ద క్లిష్టమైన కీలకమైన సున్నితమైన లోతైన భావాలన్నింటినీ చాలా స్పష్టంగా, సునిశితంగా వ్యక్తీకరించగలిగిన మాధ్యమం ఇది. సాధన ద్వారా సాధించిన ఈ నైపుణ్యాన్ని దూరం చేసుకోవడానికి కళాకారులెవ్వరూ ఇష్టపడరు. అందుకే ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే కళాసాధన ద్వారా వచ్చే సంతృప్తికి సమానం కాదు, కాలేదు. మయూరి, మాధురి ఉపాధ్యాయ ఇద్దరూ నాకు ఇష్టమైన నాట్యకారిణులు, స్ఫూర్తిప్రదాతలు కూడా. మా డాన్ టీచర్లు, సీనియర్ స్టూడెంట్స్ నుంచి కూడా స్ఫూర్తి పొందాను. ఒక్కొక్కరిలో ఒక్కో అంశం మనల్ని ప్రభావితం చేస్తుంది. నేర్చుకోవాలన్నంత ఆసక్తిగా గమనిస్తే ప్రతి వ్యక్తిలోనూ గురువు కనిపిస్తారు. భరతనాట్యంతోపాటు కలరియపట్టు, అట్టక్కలరి, వ్యాలికవల్ రీతులను కూడా సాధన చేశాను. నాట్యాన్ని విస్తరింపచేయడమే నా బాధ్యత అనుకున్నాను. బెంగళూరులో శివాన్ష్ స్కూల్ ఆఫ్ డాన్ 2017లో స్థాపించాను. ఆ తర్వాత శివాన్ష్ శాఖలను హైదరాబాద్‌లోని సన్ సిటీ, కిస్మత్పూర్, కొండాపూర్, బంజారా హిల్స్లకు విస్తరించాను. శాస్త్రీయ నాట్యాన్ని మాధ్యమంగా చేసుకుని సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలతోపాటు అరుదైన ఇతివృత్తాలతో రూపకల్పన చేశాను. కళలనే కెరీర్‌గా తీసుకున్న మహిళలే నాతోపాటు మా ‘టీమ్ శివాన్ష్’లో ఉన్నారు. సాధించాం... ఇంకా ఉంది నాట్యం నాకు చాలా ఇచ్చింది. టీవీ రియాలిటీ షోలలో విజేత కావడం ఒక సరదా. అయితే మైసూర్ లిటరరీ అండ్ కల్చర్ ఫౌండేషన్ నుంచి యువశ్రీ పురస్కారం, ఉత్కళ యువ సాంస్కృతిక సంఘ్ నుంచి నృత్యమణి, హైదరాబాద్ డాన్ ఫెస్టివల్ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలంగాణతోపాటు జాతీయ స్థాయిలో స్త్రీ శక్తి పురస్కారాలందుకోవడం గర్వకారణం. నాట్యం ఇతివృత్తంగా రెండు సినిమాలు చిత్రీకరించారు. వాటికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇక నా వంతుగా నాట్యం మాధ్యమంగా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్నాను. సమాజంలో మహిళలు తమకెదురైన సమస్యలను ఎదుర్కొంటూ శక్తిమంతులుగా మారుతున్నారు. మహిళ సాధికారత కోసం ఎన్ జీవోలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఒక తరానికి మరో తరానికి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మహిళల స్థితి చాలా మెరుగైంది. మహిళల్లో అక్షరాస్యత పెరగడం తొలి విజయం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు కచ్చితంగా ఉంటున్నాయి, అలాగే శిక్షల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటి దృష్ట్యా మహిళాభివృద్ధి పురోగమనంలో సాగుతోందనే నాకనిపిస్తోంది. అయితే ‘మనం సాధించేశాం’ అని సంతృప్తి చెందగలిగిన స్థితికి మాత్రం చేరలేదు. కానీ... సమానత్వ స్థాయిని మా తరంలోనే చూడగలమనే భరోసా కలుగుతోంది’’ అని మహిళాభివృద్ధి పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మైత్రి రావు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వినూత్నం: రోబో టీచరమ్మ.. పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే..
'సినిమాల్లో హ్యుమనాయిడ్ రోబోను చూడగానే పిల్లల సంతోషం ఇంతా అంతా కాదు. సినిమాల్లో కనిపించే రోబో క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెడితే? ‘అబ్బో! ఆ అల్లరికి అంతు ఉండదు’ అనుకుంటాం. అయితే ‘ఐరిష్’ అనే ఈ రోబో ముందు మాత్రం పిల్లలు బుద్ధిగా, సైలెంట్‌గా ఉండాల్సిందే. ఇంతకూ ఎవరీ ఐరిష్?' కేరళలోని తిరువనంతపురం కేటీసీటీ హైయర్ సెకండరీ స్కూల్ లోకి ఫస్ట్ జెనరేటివ్ ఏఐ స్కూల్ టీచర్ ఐరిష్ అడుగు పెట్టింది. ఈ హ్యుమనాయిడ్ ఉపాధ్యాయురాలు మూడు భాషల్లో మాట్లాడగలదు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా జవాబులు చెప్పగలదు. ఎడ్టెక్ ‘మేకర్ల్యాబ్స్’ రూపకల్పన చేసిన ఈ జెనరేటివ్ ఏఐ స్కూల్ టీచర్ కేరళలోనే కాదు దేశంలోనే మొదటిది. ‘ఐరిష్ నాలెడ్జ్బేస్ ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే విస్తృతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది’ అంటుంది మేకర్ ల్యాబ్స్. చదువుకు సంబంధం లేని సబ్జెక్ట్‌ల జోలికి ‘ఐరిష్’ వెళ్లదు. ‘కృత్రిమ మేధతో అవకాశాలు అనంతం అని చెప్పడానికి ఐరిష్ ఒక ఉదాహరణ. పిల్లలు అడిగే సందేహాలకు టీచర్‌లాగే ఐరిష్ సరిౖయెన సమాధానాలు ఇవ్వగలదు’ అంటున్నారు ‘మేకర్ల్యాబ్స్’ సీయీవో హరిసాగర్. ‘మేకర్ల్యాబ్స్తో కలిసి ఎన్నో రకాల వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటి ద్వారా పిల్లలు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్‌కు సంబంధించిన నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు’ అంటున్నారు స్కూల్ ప్రిన్సిపాల్ మీరా ఎంఎన్. ఇవి చదవండి: International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే? జీవితంపై అధికారం హక్కులపై ఎరుక -
స్కూల్లో ఏఐ పంతులమ్మ పాఠాలు!
ఏఐ టెక్నాలజీ ఉద్యోగులు అవసరం లేకుండా కంపెనీని నిర్వహించే గలిగే సామార్థ్యాన్ని అందిస్తుంది. దీన్ని చూసే యువతలో భయాలు మొదలయ్యాయి. అసలే ఉద్యోగాలు దొరక్క బాధపడుతుంటే..ఇక ఈ టెక్నాలజీ వస్తే అంతే పరిస్థితి అని బెంబేలెత్తిపోతున్నారు. అసలు భవిష్యత్తులో ఉద్యోగాలు అనేది ప్రశ్నార్థకమో అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేంత వరకు సాధ్యమనేది క్లారిటీ లేదు గానీ చాలా రంగాల్లోకి ఈ ఏఐ టెక్నాలజీనే తీసుకొచ్చేలా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడూ టీచర్ అవసరం లేకుండానే క్లాస్‌లో పాఠాలు చెప్పే ఏఐ పంతులమ్మను తీసుకొచ్చింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్ల్యాబ్స్. ఎలా పాఠాలు చెప్పిందంటే.. కేరళలో తిరువనంతపురంలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్ని ప్రవేశ పెట్టింది కొచ్చికి చెందిన స్టార్ట్-అప్, మేకర్ల్యాబ్స్. అక్కడ ఏఐ టెక్నాలజీతో కూడిన టీచరమ్మ ఎలా పాఠాలు చెబుతుందో పరీక్షించారు. చక్కటి చీరకట్టులో ఈ ఏఐ పంతులమ్మ సుమారు మూడు వేల మందికి విద్యార్థులకు చకచక పాఠాలు బోధించటం, సందేహాలు నివృత్తి చేయడం వంటివి చేసింది. ఈ ఏఐ టీచరమ్మ పేరు ఐరిస్ . ఇది మొత్తం మూడు భాషల్లో మాట్లాడగలదు. దీని నాలెడ్జ్ బేస్‌లో ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే మెరుగైన అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇది చాట్ జీపీటీ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా కూడా పనిచేయగలదు. ఈ ఐరిస్ పంతులమ్మ అచ్చం స్త్రీ స్వరంలోనే మాట్లాడుతుంది. ఒక టీచర్ ఎలా పాఠాలు చెబుతుందో అలా అర్థవంతంగా చెప్పగలదు. విద్యార్థుల ప్రశ్నలకు ఉపాధ్యాయుడు ఎలా విడమరిచి వివరించి చెబుతాడో అలానే అన్నింటికి సమాధానాలు ఇచ్చింది ఏఐ ఐరిస్. ఈ మేరకు మేకర్స్ ల్యాబ్ సీఈవో హరిసాగర్ మాట్లాడుతూ.."విద్యార్థులు తమ ల్యాబ్ ద్వారా అనేక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు. రోబిటిక్స్ వంటి రంగాల్లో అనుభవాన్ని పొందారు కూడా. అలాగే విద్యార్థుల నుంచి ఈ ఏఐ టీచరమ్మ పట్ల సానుకూల స్పందన వచ్చింది. ఎక్కువ మంది క్లాస్ రూంలో ఈ ఏఐ టీచర్ ఉండే బాగుంటుంది అని తమ అభిప్రాయన్ని వెలిబుచ్చడం విశేషం". అని అన్నారు. (చదవండి: జస్ట్ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్!) -
రూ.5 వేల జీతానికి నానా అగచాట్లు.. ఇప్పుడు ఏకంగా...
సాధారణంగా ప్రైవేటు టీచర్లంటే చిన్నచూపు ఉంటుంది. తక్కువ జీతం ఉంటుందని, పెద్దగా సంపాదన ఉండదని భావిస్తారు. కానీ టీచింగ్‌తోనే ఎడ్టెక్ సంస్థలు పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్న వారూ ఉన్నారు. వారిలో దేశంలోనే రిచెస్ట్ టీచర్‌గా నిలిచిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సంపన్న ఉపాధ్యాయుడిగా నిలిచారు ఫిజిక్స్‌వాలా ( PhysicsWallah ) వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే ( Alakh Pandey ). అయితే దేశంలో రిచెస్ట్ టీచర్ బైజూస్ రవీంద్రన్ అని చాలామంది వాదించవచ్చు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ ఆయనది కాదు. ఫోర్బ్స్ ప్రకారం బైజూస్ పతనం తర్వాత, దాని నికర విలువ కూడా రూ. 830 కోట్లకు పడిపోయింది. అంటే రూ. 2000 కోట్ల కంటే ఎక్కువ నెట్‌వర్త్ ఉన్న అలఖ్ పాండేనే దేశంలోనే అత్యంత ధనిక ఉపాధ్యాయుడు. ప్రముఖ ఉపాధ్యాయుడు, ఎంటర్‌ప్రిన్యూర్‌గా పేరొందిన అలఖ్ పాండే సాధారణంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖలో ఈ స్టార్టప్ నమోదై ఆయన వార్షిక వేతనం వెల్లడి కావడంతో వార్తల్లోకి వచ్చారు. భారతీయ టెక్, స్టార్టప్ సంస్థల సమాచారం అందించే ‘Inc42’ నివేదిక ప్రకారం.. అలఖ్ పాండే వేతనం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.6 కోట్లు. దీంట్లో ఆయన రూ.5 కోట్లను తగ్గించుకున్నారు. అయినప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో అలఖ్ పాండే వేతనం రూ. 4.57 కోట్లు. ఇంత ఆదాయం ఉన్న అలఖ్ పాండే మొదటి సంపాదన ఎంతో తెలుసా.. కేవలం రూ.5 వేలు. అది కూడా చాలా మంది పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చేది. యాక్టర్ కావాలనుకున్నాడు దేశంలో 101వ యునికార్న్ కంపెనీ ఫిజిక్స్‌వాలాను స్థాపించిన అలఖ్ పాండే ఒక టీచర్‌గానే చాలా మందికి తెలుసు. అయితే యాక్టర్ కావాలన్నది తన కల అని ఎంత మందికి తెలుసు? అలహాబాద్‌లో జన్మించిన అలఖ్ పాండే యాక్టర్ అవ్వాలనే కోరికతో నుక్కడ్ నాటకాల్లో పాల్గొనేవాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో 8వ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలఖ్ పాండే, ఆయన సోదరి చదువుల కోసం వారి తల్లిదండ్రులు తమ ఇంటిని అమ్మేశారు. అలఖ్ పాండే చాలా చురుకైన విద్యార్థి. 10వ తరగతిలో 91 శాతం, 12వ తరగతిలో 93.5 శాతం మార్కులు వచ్చాయి. కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఐఐటీలో చేరాలనుకున్న అలఖ్ పాండే కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. అయితే, కోర్సు మూడవ సంవత్సరం తర్వాత కాలేజీ మానేశాడు. 2017లో యూపీలో ఒక చిన్న గది నుంచి యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అలాఖ్ పాండే వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. ఎంతగా అంటే ఓ ఎడ్-టెక్ కంపెనీని ప్రారంభించేంతలా. ఇందులో ఇప్పుడు 500 మందికి పైగా టీచర్లు, 100 మంది టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. యూట్యూబ్‌లో ఫిజిక్స్‌వాలా చానల్‌కు కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. -
యాజ్ఞవల్క్యుడి స్వాభిమానం
అది ద్వాపరయుగం. వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజన చేశాడు. నాలుగు భాగాలనూ తన నలుగురు శిష్యులైన జైమిని, వైశంపాయనుడు, పైలుడు, సుమంతులకు అప్పగించాడు. లోకంలో వాటిని ప్రచారం చేయమని వారిని ఆదేశించాడు. వ్యాసుడి ద్వారా వైశంపాయనుడు యజుర్వేదాన్ని పొందాడు. గురువు ఆదేశం మేరకు యజుర్వేద ప్రచారం కోసం శిష్యులకు బోధించసాగాడు. వైశంపాయనుడి శిష్యులలో యాజ్ఞవల్క్యుడు మిగిలిన శిష్యులందరి కంటే చాలా తెలివైనవాడు. గురువుకు శ్రద్ధగా శుశ్రూష చేస్తూ, ఆయన వద్ద యజుర్వేదాన్ని కూలంకషంగా నేర్చుకున్నాడు. అదే కాలంలో ఒకనాడు మహర్షులందరూ మేరుపర్వతం మీద సభను ఏర్పాటు చేశారు. అన్ని రాజ్యాల్లో ఉన్న మహర్షులందరికీ వర్తమానం పంపారు. మహర్షులందరూ ఆ సభకు తప్పక రావాలని, ఎవరైనా సభకు రానట్లయితే వారికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని తీర్మానించారు. మహర్షుల సభకు రావలసినదిగా వైశంపాయనుడికి కూడా వర్తమానం అందింది. అయితే, కారణాంతరాల వల్ల ఆయన ఆ సభకు వెళ్లలేకపోయాడు. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం వైశంపాయనుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఈ పరిణామానికి వైశంపాయనుడు ఎంతగానో దిగులు చెందాడు. బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడే ఉపాయమేమిటని మహర్షులను అడిగాడు. ‘ఎవరైనా తపస్సు ధారపోస్తే బయటపడవచ్చు’ అని వారు తరుణోపాయం చెప్పారు. ఇదంతా జరిగినప్పుడు ఆశ్రమంలో యాజ్ఞవల్క్యుడు లేడు. ఏదో పని మీద బయటకు వెళ్లాడు. గురువుకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కల్పించడానికి వైశంపాయనుడి మిగిలిన శిష్యులంతా ఆశ్రమ ప్రాంగణంలో తపస్సు ప్రారంభించారు. అదే సమయానికి యాజ్ఞవల్క్యుడు వచ్చాడు. ఆశ్రమంలో తన సహాధ్యాయులందరూ తపోనిష్ఠలో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు వారంతా తపోనిష్ఠలో ఉన్నారో అతడికి అర్థంకాలేదు. నేరుగా గురువు వైశంపాయనుడి వద్దకు వెళ్లాడు. ‘గురువర్యా! నా సహాధ్యాయులందరూ తపోనిష్ఠలో ఉన్నారేమిటి? నేను లేనప్పుడు వారికి ఏదైనా దీక్ష ఇచ్చారా? లేదా ఏదైనా బృహత్కార్యం కోసం వారంతా తపస్సు చేస్తున్నారా?’ అని ప్రశ్నించాడు. ‘నాయనా! మేరుపర్వతం మీద మహర్షుల సభ జరిగింది. అనివార్య కారణాల వల్ల నేను ఆ సభకు వెళ్లలేకపోయాను. అందువల్ల మహర్షుల తీర్మానం ప్రకారం నాకు బ్రహ్మహత్యాపాతకం సంప్రాప్తించింది. తరుణోపాయం కోసం నేను మహర్షులనే ఆశ్రయించాను. వారు చెప్పిన తరుణోపాయం ప్రకారం నాకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలగాలంటే ఎవరైనా తమ తపః ఫలాన్ని నాకు ధారపోయవలసి ఉంటుంది. తపః ఫలితాన్ని నాకు ధారపోయాలనే నా శిష్యులంతా తపస్సుకు పూనుకున్నారు’ అని చెప్పాడు వైశంపాయనుడు. ‘గురువర్యా! వీళ్లంతా అల్పజ్ఞులు. వీళ్ల తపస్సు వల్ల మీకు పాపవిమోచన కలగడానికి ఎన్నాళ్లు పడుతుందో! నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీకోసం ఘోరమైన తపస్సు చేస్తాను’ అన్నాడు యాజ్ఞవల్క్యుడు. సహాధ్యాయులను అల్పజ్ఞులుగా సంబోధించిన యాజ్ఞవల్క్యుడిపై వైశంపాయనుడికి పట్టరాని కోపం వచ్చింది. ‘సాటివారిని అవమానించే నీలాంటి గర్వాంధుడితో నాకు పనిలేదు. నీలాంటి వాడికి నాకు శిష్యుడిగా ఉండే అర్హత కూడా లేదు. నేను చెప్పిన విద్యను ఇక్కడే వదిలేసి వెళ్లు’ హూంకరించాడు వైశంపాయనుడు. యాజ్ఞవల్క్యుడు స్వాభిమాని. గురువు మాటలు అతడికి అవమానంగా తోచాయి. గురువు వద్ద నేర్చుకున్న విద్యనంతా అక్కడే నల్లని నెత్తురుగా కక్కేశాడు. అతడు కక్కిన నెత్తురు కృష్ణ యజుర్వేదమైంది. ఆ నెత్తుటిని తిత్తిరి పక్షులు తిన్నాయి. తిత్తిరి పక్షులు తినేసిన నెత్తురు ఆ తర్వాత తైత్తరీయోపనిషత్తు అయింది. గురువు వద్ద నేర్చుకున్న వేదాన్నంతా కక్కేసిన యాజ్ఞవల్క్యుడు సూర్యుడి కోసం తపస్సు చేసి, ఆయనను ప్రసన్నుడిని చేసుకున్నాడు. సూర్యుడి వద్దనే నేరుగా వేదవిద్యను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు సూర్యుడి వద్ద నేర్చుకున్నది శుక్లయజుర్వేదమైంది. ఈ వేదభాగాన్నే యాజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కణ్వ, మధ్యందినాదులకు బోధించాడు. యాజ్ఞవల్క్యుడు బోధించిన శుక్లయజుర్వేదం ‘వాజసనేయ సంహిత’గా ప్రసిద్ధి పొందింది. వాజః అంటే అన్నం. సని అంటే దానం. యాజ్ఞవల్క్యుడి తండ్రి నిరతాన్నదానం చేసేవాడు. అందువల్ల ఆయనకు వాజసని అనే పేరు వచ్చింది. వాజసని కొడుకు కావడం వల్ల యాజ్ఞవల్క్యుడికి వాజసనేయుడు అనే నామాంతరం ఏర్పడింది. - సాంఖ్యాయన -
ప్రైవేటు టీచర్ అదృశ్యం.. చివరిసారి కాల్ చేసిన యువకుడు
కర్ణాటక: మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకా మేలుకోటె దగ్గర మాణిక్యనహళ్ళికి చెందిన వి. దీపిక గౌడ (28) అనే ప్రైవేటు స్కూలు టీచర్ అదృశ్యమై, ఆపై హత్యకు గురికావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మేలుకోటెలో ప్రసిద్ధ యోగ నరసింహ స్వామి కొండ కింద పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం సోమవారం సాయంత్రం బయటపడింది. ఫోన్ రాగానే స్కూలు నుంచి వెళ్లి.. వివరాలు.. మానిక్యనహళ్ళిలో వెంకటేష్ కుమార్తె అయిన దీపికకు అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకునితో పెళ్లయింది, వారికి 8 ఏళ్ల కూతురు ఉంది. మేలుకోటెలోని ఎస్‌ఈటి పబ్లిక్ స్కూల్లో టీచర్‌గా ఆమె పనిచేసేది. గ్రామం నుంచి రోజూ తన డియో స్కూటర్లో స్కూలుకు వెళ్లి వచ్చేది. ఈ నెల 20వ తేదీన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్కూలు అయిపోగానే ఆమెకు ఒక ఫోన్ కాల్ రావడంతో స్కూటర్లో వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె జాడ లేదు. ఆమె శవం దొరికిన చోటుకు కొంతదూరంలో స్కూటర్ పార్క్ చేసింది. సోమవారం కూడా స్కూటర్ అక్కడే ఉండడం చూసి స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి స్కూటర్ వివరాలను బట్టి దీపకదిగా గుర్తించి ఆమె తండ్రి వెంకటే‹Ùను కలిసి మాట్లాడారు. ఈ నెల 20వ తేదీనే తమ కూతురు మిస్సింగ్ అని మేలుకోటె పీఎస్‌లో ఫిర్యాదు చేశానని ఆయన చెప్పాడు. చివరకు స్కూటర్ చుట్టుపక్కల ప్రజలతో కలిసి గాలించగా పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం లభ్యమైంది. టిక్‌టాక్ వీడియోలు దీపిక సినిమా హీరోయిన్‌కు తీసిపోని అందంతో ఆకట్టుకునేది. ఇన్‌స్టా, యూట్యూబ్‌తో పాటు గతంలో టిక్‌టాక్‌లో సినిమా పాటలు, డైలాగుల వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేది. ఆమెకు ఎంతోమంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. దీంతో ఆమె టిక్‌టాక్ దీపికగా స్థానికంగా ఎంతో పేరుపొందింది. పరారీలో యువకుడు పోలీసులు మృతదేహాన్ని వెలిసితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శవంపై ఎలాంటి గాయాలు లేవని, ఎవరో దుండగులు చంపి పూడ్చిపెట్టారని తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయి. ఆమెకు చివరిసారి కాల్ చేసింది నితిన్ అనే యువకుడు అని, అతడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఉపాధ్యాయురాలు దారుణ హత్య
కర్ణాటక రాష్ట్ర మండ్య జిల్లాలో ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురయ్యారు. విధులకు వెళ్లిన టీచర్.. విగతజీవిగా కనిపించారు. వివరాలు.. మేలుకోటె ఎస్ఈటీ పబ్లిక్ పాఠశాలలో మాణిక్యనహళ్లికి చెందిన దీపిక అనే మహిళా ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు భర్త లకేష్.. ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. గత శనివారం తరగతులు ముగించుకున్న ఆమె..ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చెందిన ఈమె భర్త లోకేశ్ మేలుకోటె పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో యోగ నరసింహ స్వామి బెట్ట దిగువన ఖాళీ స్థలంలో ఆమె మృతదేహాన్ని హంతకులు పూడ్చి పెట్టారని ఎస్పీ యతీశ్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. -
గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్ కావాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసినా.. బాలికలు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 26 రాష్ట్రాల్లో సర్వే చేసి.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతున్నవారితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవసాయం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది. లెక్కలు, ఇంగ్లిష్‌లో వెనుకబాటు తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్‌పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే. ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు ‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ -
విద్యార్థికి చెంప దెబ్బ: యూపీ సర్కార్‌ను తప్పుపట్టిన సుప్రీం కోర్టు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఓ ముస్లిం విద్యార్థి చెంపపై ఇతర విద్యార్థులను కొట్టమని శిక్ష విధించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. అయితే తాజాగా ఈ ఘటనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ఇలాంటి ఘటనలు జరగకుండా యూపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయాల్సి ఉందని, కానీ.. యూపీ ప్రభుత్వం అలా చేయలేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. విద్యార్థుల్లో ఇటువంటి ప్రవర్తన మార్చాలని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి నవంబర్‌లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టీఐఎస్ఎస్) నిపుణుల బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. టీఐఎస్ఎస్ ఇచ్చిన సిఫార్సులు పరిశీలించాలని అవసరమైతే పిల్లల తల్లిదండ్రులతో సంప్రదించి తదుపరి సూచనలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఫరాసత్కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచనలు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా.. టీఐఎస్ఎస్ సిఫార్సులు సరిగా లేవని న్యాయవాది ఫరాసత్ సుప్రీంకోర్టును వెల్లడించారు. మరోవైపు.. క్లాస్‌రూం ఘటనపై సుప్రీంకోర్టు గుర్రుగా ఉంది. ఈ ఘటన సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘించినట్లు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తరగతి గదిలో పిల్లలు వివక్ష ఎదుర్కొకుండా చూడటం స్థానిక అధికారుల విధి అని తెలిపింది. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సదరు టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలో జాప్యం చేయటంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశాలలో ఇటువంటి ఘటన జరగటంపై సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉందని జస్టిస్ ఓకా వ్యాఖ్యానించారు. ఈ కేసులో పోలీసులు సదరు టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆలస్యం చేస్తూ.. టీచర్ త్రిప్తా త్యాగి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి బాధిత బాలుడి తండ్రి వాంగ్మూలం కూడా నమోదు చేయకపోవటం సరికాదని వ్యాఖ్యానించింది. మతపరమైన మైనారీటీలకు చెందిన విద్యార్థులపై సహవిద్యార్థుల వల్ల జరిగే హింసకు సంబంధించి పాఠశాల వ్యవస్థలో నివారణ, పరిష్కార మార్గదర్శకాలను రూపొందిచాలని పిటిషనర్ తుషార్ గాంధీ తరఫు న్యాయవాది ఫరాసత్ సుప్రీం కోర్టును కోరారు. చదవండి: ఫిబ్రవరి 1న కేంద్రం మధ్యంతర బడ్జెట్ -
జగనన్న మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు: జయ భూషణ
-
నా ఫొటొలకు రిప్లే ఇవ్వలేదో నిన్ను ఫెయిల్ చేస్తా
భువనగిరి క్రైం: పదో తరగతి విద్యార్థినికి ఉపాధ్యాయుడు అసభ్య మెసేజ్‌లు పంపి వేధించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బుధవారం భువనగిరి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు, విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో నివసించే బెల్లి సంజయ్ పట్టణంలో పలు పాఠశాలల్లో పీరియడ్ వారీగా సైన్స్ సబ్జెక్ట్ బోధిస్తుంటాడు. కొందరు విద్యార్థులు సబ్జెక్ట్‌లో తమ అనుమానాల నివృత్తి కోసం పలుమార్లు సంజయ్‌ను సెల్ఫోన్లో సంప్రదించేవారు. ఇదే అదనుగా భావించిన సంజయ్ ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌కు అసభ్య మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. సోషల్ మీడియా యాప్ అయిన ఇన్‌స్ట్రాగామ్‌లోనూ ఆ విద్యార్థినికి ఫొటోలు పంపేవాడు. తన ఫొటోలకు రిప్లే ఇవ్వాలని.. లేదంటే ఫెయిల్ చేస్తానని బెదించేవాడు. దీంతో ఆ విద్యార్థిని ఆందోళనకు గురవుతుండగా కుటుంబ సభ్యులు గుర్తించి ఏం జరిగిందని ఆరా తీయడంతో సంజయ్ బాగోతం బయటపడింది. దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇదే విషయమై బుధవారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు సంజయ్‌ని నిలదీయగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులు సంజయ్‌కి దేహశుద్ధి చేశారు. స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ సంజయ్ కృ, ఎస్ఐ నాగరాజు పాఠశాలకు వచ్చి టీచర్ సంజయ్‌ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు సరెండర్ చేశారు. కాగా సంజయ్‌పై గతంలోనూ ఇదేవిధంగా పలువురిని ఇబ్బందులు పెట్టినట్లు తెలుస్తోంది. నిందుతుడిని కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, ఆలిండియా పేరెంట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కలెక్టర్, డీఈఓ, పోలీసులకు ఫిర్యాదులు, వినతి పత్రాలు సమర్పించారు. -
స్టూడెంట్‌తో అసభ్య ఫోటోషూట్.. టీచర్ సస్పెండ్
పదో తరగది విద్యార్ధితో ఫోటోషూట్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. బీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా చిక్కబళ్లాపూర్ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డీడీపీఐ) బైలాంజినప్ప ఉత్తర్వులు జారీ చేశారు అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని చిక్కబళ్లపూర్లోని మురుగమళ్ల ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్ధులు, ఉపాధ్యాయులు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, పదో తరగది చదువుతున్న విద్యార్ధితో కలిసి అసభ్యకరంగా ఫోటోలు దిగారు. టీచర్ అనే పదానికి అర్ధాన్ని మార్చేస్తూ స్టూడెంట్‌తో లవర్‌లాగా పోజులు ఇచ్చారు. ముద్దులు కౌగిలింతలతో హద్దులు మీరి ప్రవర్తించారు. విద్యార్ధి సైతం ఉపాధ్యాయురాలిని ఎత్తుకొని, ప్రేమతో ఆమె కొంగు లాగుతున్నట్లు ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఇంకేముంది ఈ ఫోటోలోను అమిత్ సింగ్ రాజవత్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Where are we heading as a society ? Pictures and videos from a romantic photoshoot of a government school teacher with a Class 10 student in Karnataka's Murugamalla Chikkaballapur district, went viral, following which the student's parents filed complaint with the Block… pic.twitter.com/WviIHtOP3J — Amit Singh Rajawat (@satya_AmitSingh) December 28, 2023 ఈ ఫోటోషూట్‌పై నెటిజన్లు మండుపడుతున్నారు. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆ పదవికి కలంకం తెచ్చే ప్రవర్తించిన టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక విద్యార్ధిపై కూడా చివాట్లు పెడుతున్నారు. వీళ్ల కారణంగా ఇతరులు చెడిపోయే ప్రమాదం ఉందని, ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఫోటోషూట్ సమాచారం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు వెళ్లి సైతం టీచర్‌తో గొడవకు దిగారు. దీంతో ఫిర్యాదు అందుకున్న బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి టీచర్‌ను సస్పెండ్ చేశారు. -
ఆణిముత్యాలు
సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. అవని అంతటినీ నడిపించే శక్తి ఆమె. గ్రామీణ విద్యార్థులను అంతర్జాతీయ వేదిక మీద నిలిపిన టీచర్ ఒకరు. సమాజంలో నెలకొన్న రుగ్మతలకు కూడా చికిత్స చేస్తున్న డాక్టర్ ఒకరు. నిస్సహాయుల బతుకును ఈతతో దరిచేరుస్తున్న తల్లి ఒకరు. సాటి మహిళకు స్వావలంబన సాధనలో సహకారం అందిస్తున్న శక్తి ఒకరు. స్థితప్రజ్ఞత సాధనకై నాట్య యోగ ధ్యాన క్రియలతో శ్రమిస్తున్న ఔత్సాహిక ఒకరు. చక్కటి జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్న ఆణిముత్యాలు వీళ్లు. ఇయర్ రౌండప్‌లో ఈ ఏడాది వారు సాధించిన లక్ష్యాల గురించి క్లుప్తంగా... శ్రుతకీర్తి శ్రుతకీర్తి ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డాన్స్ హెచ్వోడీగా శాస్త్రీయ నాట్యంలో కొత్తతరాలకు మార్గదర్శనం చేస్తున్నారు. మూడేళ్ల వయసులో వేదిక మీద తొలి ప్రదర్శన ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవిదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలిచ్చారామె. గొంతు, ఉచ్చారణ బాగుందని టీచర్లు స్కూల్ రేడియోలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అలా మొదలైన వ్యాఖ్యాన పరంపరలో ఆరవ తరగతిలో ప్రముఖుల కార్యక్రమాలకు వేదిక మీద వ్యాఖ్యాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగారు. ఐదు వందలకు పైగా సభలను నిర్వహించిన శ్రుతకీర్తి తొమ్మిదవ తరగతి నుంచి న్యూస్ ప్రెజెంటర్‌గా జెమినీ టీవీలో వార్తలు చదివారు. ఎంబీఏ, ఎల్ఎల్బీ, కౌన్సెలింగ్ సైకాలజీలో డాక్టరేట్ చేసిన కీర్తి... దశాబ్దకాలంగా మాతా ఆత్మానందమయి శిష్యరికంలో సుషుమ్న క్రియ యోగదీక్ష సాధన చేస్తూ ప్రపంచ శాంతి, మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కోసం దేశవిదేశాల్లో స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు కార్పొరేట్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనసు చంచలమైనది. సాధన ద్వారా స్థితప్రజ్ఞత సాధించాలి. ఇప్పుడు ప్రపంచం అంతటా యువతను పీడిస్తున్న సమస్య ఏకాగ్రతలోపం. నాట్యం, యోగసాధన, ధ్యానం ద్వారా ఏకాగ్రతను సాధించవచ్చని ఆచరణాత్మకంగా తెలియచేస్తున్నానని చెబుతారు శ్రుతకీర్తి. నీరజ గొడవర్తి ‘సంకల్ప బలమే లక్ష్యం వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ‘నో’ అనే పదానికి స్థానమే లేదు’ అంటున్న నీరజ గొడవర్తిది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ. ఏకశిల కెమికల్స్ లిమిటెడ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దాదాపు నలభై ఏళ్లుగా ఆ సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రవృత్తి, అభిరుచుల విషయానికి వస్తే... ఇకబెనా ఫ్లవర్ డెకరేషన్, కర్ణాటక సంగీత గాయని, పాటల రచయిత, స్వరకర్త, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉంటారు. పారిశ్రామిక రంగం అంటే మగవాళ్ల ప్రపంచం అనే అభిప్రాయం స్థిరంగా ఉన్న రోజుల్లో పరిశ్రమ స్థాపించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తగా నిలదొక్కుకోవడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో తనకు తెలుసంటారామె. అందుకే పరిశ్రమల రంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఒక మార్గం వేయాలనే ఉద్దేశంలో కోవె(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్) నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మహిళలను సంఘటితం చేస్తూ, ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలందిస్తున్నారు. ఆమె విశిష్ట సేవలకు గాను ఈ ఏడాది ‘డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డు, హార్టికల్చరిస్ట్, మల్టీ టాలెంటెడ్ ఉమన్’ పురస్కారాలను అందుకున్నారు. లక్ష్మీదేవి కృష్ణా జిల్లా, పెడన గ్రామం, జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ టీచర్ లక్ష్మీదేవి. విద్యార్థులకు పాఠాలు నేర్పించడంతోపాటు ప్రయోగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతారామె. ఆమె స్టూడెంట్స్ మణికంఠ, వినయ్ కుమార్ ఈ ఏడాది యూఎస్‌లోని డాలస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేర్‌లో పాల్గొని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్‌ను ప్రదర్శించి నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు వందకు పైగా ప్రయోగాలు చేసిన లక్ష్మీదేవి తన పరిశోధన ఫార్ములాను స్టార్టప్ కంపెనీలకు ఉచితంగా ఇస్తూ... ‘వినియోగదారులకు తక్కువ ధరకు ఇవ్వండి. అదే మీరు నాకిచ్చే గొప్ప పారితోషికం’ అంటారు. ప్రస్తుతం ఫ్లోరైడ్ బాధిత ఆదివాసీ గ్రామాల కోసం మట్టిలో తులసి ఆకుల పొడి కలిపి కుండలను చేసి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. నూజివీడు సమీపంలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి పంచడానికి కుండలను సిద్ధం చేస్తున్నారు. ఒక సందేహం రావడం, ఆ సందేహానికి సమాధానం కోసం అన్వేషణ. పరిశోధన, ప్రయోగాలతో సమాధానాన్ని రాబట్టడం ఆమె వంతు. ఆ సమాధానంతో సమాజంలోని సమస్యకు పరిష్కారం లభించడం... ఆమె ప్రయోగాల గొప్పతనం. సమాజానికి ఆమె అందిస్తున్న శాస్త్రీయ సేవకు గాను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలందుకున్న లక్ష్మీదేవి ఈ ఒక్క ఏడాదిలోనే పదికి పైగా సత్కారాలందుకున్నారు. రజనీ లక్కా రజనీ లక్కా స్విమ్మింగ్ చాంపియన్. ఆమె తన కోసం తాను రికార్డు సాధించడమే కాదు, స్పెషల్లీ చాలెంజ్డ్ (దివ్యాంగులు) పిల్లలకు ఉచితంగా ఈతలో శిక్షణనిస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినప్పుడు మామూలు వాళ్లు ఈదుకుంటూ ఒడ్డుకు చేరతారు. కానీ దివ్యాంగులు... శారీరక వైకల్యం కారణంగా ఈదలేక నిస్సహాయంగా నీటిలో మునిగిపోవడాన్ని సహించలేకపోయారామె. వారికి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు. దశాబ్దకాలంగా సాగుతున్న ఆమె సర్వీస్‌లో అరవై మందికి పైగా పిల్లలు ఈత నేర్చుకుని, పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఆమె సాధించిన పతకాలు నూట పాతికకు చేరితే ఆమె శిష్యులు సాధించిన పతకాల సంఖ్య రెండు వందల యాభై దాటాయి. సాయి నిఖిల్ గత ఏడాది నేషనల్ రికార్డు సాధించగా గోపీచంద్ ఈ ఏడాది ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్నాడు. అనంతపురానికి చెందిన ఆమె బళ్లారిలో నివసిస్తున్నారు. ప్రతి వ్యక్తీ ఆల్ రౌండర్‌గా ఉండాలని అభిలషించే రజని సోలో ట్రావెలర్, గార్డెనర్, మిసెస్ ఇండియా కిరీటధారి కూడా. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ అవార్డు– 2020 అందుకున్న రజని లక్కా ఈ ఏడాది కర్ణాటక ప్రభుత్వం నుంచి వ్యక్తిగత సేవావిభాగంలో పురస్కారం అందుకున్నారు. పెన్నా కృష్ణప్రశాంతి డాక్టర్ పెన్నా కృష్ణ ప్రశాంతి, కన్సల్టెంట్ ఫిజీషియన్. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. జాతీయస్థాయిలో బైరాక్ (బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్) బోర్డు మెంబర్‌గా ఎంపికైన తొలి మహిళ. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్ మెంబర్. ఇంతకు ముందు ఈ హోదాల్లో మగవాళ్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఆ గిరిగీతను చెరిపేసిన మహిళ ఆమె. శ్రీసాయి హర్షిత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఆమె వైద్యసేవలందిస్తున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బయోటెక్ ఇన్క్యుబేషన్ సౌకర్యాల కల్పనతోపాటు విద్యార్థినులకు సలహా సూచనలిస్తున్నారు. పలు విద్యాసంస్థల్లో పాలక వర్గంలో సభ్యురాలు. మహిళా సంక్షేమం కోసం పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నారు. ఆమె వైద్యరంగానికి, సమాజానికి అందిస్తున్న సేవలకుగాను ‘తెలివిగల నాయకత్వ లక్షణాలున్న మహిళ’గా రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. -
కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పవిత్రమైన ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి.. పదో తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన జనకేశ్వరరావుకి 25 ఏళ్లు జైలు శిక్షతో పాటు, 50 వేల రూపాయలు జరిమానాను కోర్టు విధించింది. విశాఖలోని నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 ఏడాదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి ఆధారాలతో కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితురాలికి 4 లక్షల 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితులకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: సినిమా స్టోరీలా.. పరువు హత్య -
నిన్నే పెళ్లాడుతా.. బాలికపై ఉపాధ్యాయుడి వేధింపులు
కర్ణాటక: వసతి పాఠశాల విద్యార్థినితో ఒక ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన తుమకూరు తాలూకా హెబ్బూరులోని నరసాపుర మొరార్జీ వసతి పాఠశాలలో జరిగింది. ఇటీవల జరిగిన ఒక స్వాగత వేడుకలో ఆరో తరగతి చదువుతున్న బాలికతో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు రవీంద్ర అసభ్యంగా ప్రవర్తించాడు. నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నావు, వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటూ రవీంద్ర వేధించాడు. పదే పదే వెంటబడి వేధిస్తున్న రవీంద్ర పోరు తట్టుకోలేక బాలిక ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించింది. తరువాత తన సోదరుడు, మామతో పాటు మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు కీచకున్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
'పదో తరగతి పరీక్షల' పేరుతో విద్యార్థినిలపై అసభ్యకరంగా..
ఆదిలాబాద్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు వెకిలిచేష్టలకు పాల్పడుతున్నాడని నేరడిగొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం తరగతి గదులను విడిచి పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కొంతకాలంగా సీనియర్ ఉపాధ్యాయుడినంటూ పదో తరగతి పరీక్షలు నా చేతిలోనే ఉంటాయని విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు వారు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఏలేటి మహేందర్‌రెడ్డి పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పాడు. దీంతో వారు అక్కడి నుంచి తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు. అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనం సైతం సరిగ్గా అందించడం లేదని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాలపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మను వివరణ కోరగా ఈ విషయాలు తన దృష్టికి రాలేదని తెలిపారు. ఎంఈఓ భూమారెడ్డిని వివరణ కోరగా రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నానని, పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాల కారణంగా విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధితశాఖ అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇవి కూడా చదవండి: ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు -
అప్పులపాలైన అభాండాలే !
-
పదోన్నతులకు టెట్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఇప్పుడు సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం వెల్లడించకపోతే పదోన్నతులు క్లిష్టంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పాఠశాల విద్యాశాఖాధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. వీలైనంత త్వరగా డిపార్ట్మెంటల్ పరీక్ష తరహాలో దీన్ని నిర్వహించాలని సూచిస్తున్నాయి. టెట్ చేపట్టమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదని, దీనివల్ల తాము నష్టపోయామని పేర్కొంటున్నాయి. జాతీయ విద్యా విధానం–2020 అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ టెట్ అర్హతకు ప్రాధాన్యత పెరిగిందని వారు అంటున్నారు. ఎప్పుడో చెప్పిన కేంద్రం ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టెట్ పాసవ్వాలని కేంద్రం 2012లోనే నిబంధన విధించింది. పాసైన వారికే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2012కు ముందు రాష్ట్రంలో టెట్ లేదు. జిల్లా నియామక మండలి పరీక్ష ద్వారానే టీచర్ల ఎంపిక జరిగింది. అందువల్ల అనేక మందికి టెట్ అర్హత ఉండే అవకాశం లేదని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు పొందింది. రాష్ట్రావిర్భావం తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతోంది. తాజా గా దీనిపై కేంద్రం మళ్ళీ స్పందించింది. ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఎన్నికల ముందు జరిగిన ఈ ప్రక్రియపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. టెట్ అర్హత ఉంటేనే పదోన్నతి కల్పించాల్సి ఉంటుందనే నిబంధనను కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఖాళీలు తెలిసేందుకూ వీల్లేదు! రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణులు 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు. కాగా ప్రభుత్వ టీచర్లు 1.05 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2012 తర్వాత రిక్రూట్ అయిన 15 వేల మందికి మాత్రమే టెట్ అర్హత ఉంది. అంటే దాదాపు 90 వేల మంది టీచర్లకు అర్హత లేదు. దీంతో వీళ్ళు పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉండదు. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ ఆగిపోవడంతో కచ్చితమైన ఖాళీలు తెలిసే వీల్లేకుండా పోయింది. దీంతో టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియకూ బ్రేకులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు 80 వేల మంది టీచర్లకు డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి అంతర్గతంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇదొక్కటే ప్రస్తుతం ఉన్న మార్గమని సూచిస్తున్నారు. ఏప్రిల్ లోపు ఈ తరహా టెట్ నిర్వహిస్తే.. వచ్చే జూన్, జూలైలో పదోన్నతులు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టి పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కన్పించడం లేదు. -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు మృతి.. ఉపాధ్యాయ సంఘాలు సంతాపం
జడ్చర్ల టౌన్: పట్టణంలోని బాదేపల్లికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు కె.వేణుగోపాల్ (75) బుధవారం మృతి చెందారు. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా దివంగత అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అదేవిధంగా 30ఏళ్ల పాటు ఎస్టీయూ సంఘం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. మున్సిపాలిటీలోని నేతాజీ చౌరస్తాలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం ప్రతిష్ఠించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. బాదేపల్లి శాఖ గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేశారు. జడ్చర్లలో జరిగిన అనేక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విద్యార్థులను సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించే వారు. ఆయన మృతిపై పలు ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం బాదేపల్లిలో నిర్వహించనున్నారు. -
నమస్కారం అంటే..!
గురువు గారికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాను... అనడం సాధ్యమయ్యే విషయం కాదు. గురువు విషయంలో చేయగలిగినది ఏమిటి.. అంటే ...‘జలజాతేక్షణు? దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్/నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్/గలరే; దీనికి నీకు? బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం/జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!‘ అంటుంది రుక్మిణీ దేవి భాగవతంలో. అంతటి ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నేనేం చేయగలను.. అంజలి ఘటించడం తప్ప... అంటుంది. అంటే రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం. ఈ ఐదు వేళ్ళతో కూడుకున్న చెయ్యి–కర్మేంద్రియ సంఘాతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు పదింటిని, బుద్ధిస్ధానమయిన 11వదయిన శిరస్సును కలిపి మీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను... అని చెప్పడానికి నమస్కారం చేస్తారు. ఈ తలలో వచ్చిన ఎన్నో ఆలోచనలను, ఈ చేతులతో ఎన్నో చేయకూడని పనులను చేసి మనుష్య జన్మ పాడుచేసుకున్నా. మీ వాక్కులు అగ్నిహోత్రం. నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి నేను ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపించి నన్ను రక్షించండి... అని చెప్పడానికి అంజలి ఘటిస్తారు. అంతటి గొప్పరూపం గురువు. సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా కూడా ఉంటాడు. గురువు ఒకడు, భగవంతుడు ఒకడు కాదు. నిజానికి భగవంతుడే గురువు. శైవసంప్రదాయంలో దక్షిణామూర్తి చాలా చాలా గొప్ప గురువు. ఆయన నోటితో మాట్లాడకుండా చిన్ముద్రపట్టి కూర్చున్నాడు. ఆయన గురువు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువు.‘కృష్ణం వందే జగద్గురుమ్!’. అమ్మవారు గురు మండల రూపిణి. సమస్త గురుమండల రూపిణి జగన్మాతయే. భగవంతుడు ఏ అవతారంలో మనముందుకొచ్చినా గురువుపట్ల అమిత గౌరవంతో ప్రవర్తిస్తాడు. 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన నరుడెవరు? – అంటే రామచంద్రమూర్తిని చూపించాడు నారద మహర్షి సంక్షేప రామాయణంలో. అంతటి గొప్ప రాముడు కూడా గురువుకు నమస్కరించి తలవంచుకుని నిలబడ్డాడు. ఏదో యాంత్రికమైన నమస్కారం కాదు. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో తెలుసుకుని చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలన్నా, అభివాదం చేయాలన్నా ఒక పద్దతి ఉండాలి. రెండు చేతులు కలిపి తలతాకించి నమస్కారం చేయడం కూడా నమస్కారమే. అలాకాక, ప్రణిపాతం.. కర్ర ఎలా నేలమీద పడిపోతుందో అలా పడిపోవడం. అంటే ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. ఇంతకన్నా కిందపడే అవకాశం లేదు. ఇప్పుడు నన్ను పైకెత్తడం మీ చేతుల్లో ఉంది... అన్న భావనతో చేస్తే ప్రణిపాతం. అంటే అహంకారం వదిలి పెద్దలముందు పడిపోవడం. రామచంద్రమూర్తి అలా గురువుగారి ముందు నిలబడి నమస్కరించి నేను రాకుమారుడిని కాదు, కింకరుడిని.. సేవకుడిని, మీరేది ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా.. ఆజ్ఞాపించండి. అన్నాడు.. గురువుల, పెద్దల విషయంలో అలా మసలుకోవాలనేది సనాతన ధర్మం మనకు ఇచ్చిన సందేశం. గురువు గారికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాను... అనడం సాధ్యమయ్యే విషయం కాదు. గురువు విషయంలో చేయగలిగినది ఏమిటి.. అంటే ... ‘జలజాతేక్షణు? దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్/నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్/గలరే; దీనికి నీకు? బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం/జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!‘ అంటుంది రుక్మిణీ దేవి భాగవతంలో. అంతటి ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం నేనేం చేయగలను.. అంజలి ఘటించడం తప్ప... అంటుంది. అంటే రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం. ఈ ఐదు వేళ్ళతో కూడుకున్న చెయ్యి–కర్మేంద్రియ సంఘాతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు పదింటిని, బుద్ధిస్ధానమయిన 11వదయిన శిరస్సును కలిపి మీ పాదాల దగ్గర న్యాసం చేస్తున్నాను... అని చెప్పడానికి నమస్కారం చేస్తారు. ఈ తలలో వచ్చిన ఎన్నో ఆలోచనలను, ఈ చేతులతో ఎన్నో చేయకూడని పనులను చేసి మనుష్య జన్మ పాడుచేసుకున్నా. మీ వాక్కులు అగ్నిహోత్రం. నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి నేను ప్రయాణించాల్సిన మార్గాన్ని చూపించి నన్ను రక్షించండి... అని చెప్పడానికి అంజలి ఘటిస్తారు. అంతటి గొప్పరూపం గురువు. సనాతన ధర్మంలో భగవంతుడే గురువుగా కూడా ఉంటాడు. గురువు ఒకడు, భగవంతుడు ఒకడు కాదు. నిజానికి భగవంతుడే గురువు. శైవసంప్రదాయంలో దక్షిణామూర్తి చాలా చాలా గొప్ప గురువు. ఆయన నోటితో మాట్లాడకుండా చిన్ముద్రపట్టి కూర్చున్నాడు. ఆయన గురువు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో శ్రీకృష్ణపరమాత్మ జగద్గురువు.‘కృష్ణం వందే జగద్గురుమ్!’. అమ్మవారు గురు మండల రూపిణి. సమస్త గురుమండల రూపిణి జగన్మాతయే. భగవంతుడు ఏ అవతారంలో మనముందుకొచ్చినా గురువుపట్ల అమిత గౌరవంతో ప్రవర్తిస్తాడు. 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన నరుడెవరు? – అంటే రామచంద్రమూర్తిని చూపించాడు నారద మహర్షి సంక్షేప రామాయణంల.. అంతటి గొప్ప రాముడు కూడా గురువుకు నమస్కరించి తలవంచుకుని నిలబడ్డాడు. ఏదో యాంత్రికమైన నమస్కారం కాదు. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా నమస్కారం చేయాలో తెలుసుకుని చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలన్నా, అభివాదం చేయాలన్నా ఒక పద్దతి ఉండాలి. రెండు చేతులు కలిపి తలతాకించి నమస్కారం చేయడం కూడా నమస్కారమే. అలాకాక, ప్రణిపాతం.. కర్ర ఎలా నేలమీద పడిపోతుందో అలా పడిపోవడం. అంటే ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను. ఇంతకన్నా కిందపడే అవకాశం లేదు. ఇప్పుడు నన్ను పైకెత్తడం మీ చేతుల్లో ఉంది... అన్న భావనతో చేస్తే ప్రణిపాతం. అంటే అహంకారం వదిలి పెద్దలముందు పడిపోవడం. రామచంద్రమూర్తి అలా గురువుగారి ముందు నిలబడి నమస్కరించి నేను రాకుమారుడిని కాదు, కింకరుడిని.. సేవకుడిని, మీరేది ఆజ్ఞాపిస్తే అలా చేయడానికి సంసిద్ధంగా ఉన్నా.. ఆజ్ఞాపించండి. అన్నాడు.. గురువుల, పెద్దల విషయంలో అలా మసలుకోవాలనేది సనాతన ధర్మం మనకు ఇచ్చిన సందేశం. (చదవండి: అలవాటుని అధిగమించటం అతికష్టం!) -
శశిథరూర్లాగా ఇంగ్లీష్ గిట్ల మాట్లాడాలే...
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అరుదైన, పలకడానికి కష్టంగా ఉన్న ఇంగ్లీష్ పదాలు వాడుతుంటాడు అనేది తెలిసిన విషయమే. అతడి ఖరీదైన ఇంగ్లీష్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన జే అనే టీచర్ ‘శశి థరూర్స్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఈజ్ బ్యూటీఫుల్’ అనడమే కాదు అతడిలా చక్కని ఇంగ్లీష్ మాట్లాడాలంటే అంటూ కొన్ని టిప్స్ చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జే పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. శశి థరూర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియోలను ప్లే చేస్తూ.... ‘చూడండి ఈ పదాన్ని ఎలా పలికాడో. ఆ పదాన్ని ఎలా స్ట్రెస్ చేశాడో’ అంటూ చెబుతూ పోతాడు జే. -
టీచర్‌ను కిడ్నాప్.. తలపై తుపాకీతో బెదిరించి కూతురితో పెళ్లి
బిహార్‌లో వింత పెళ్లి జరిగింది. ఓ టీచర్‌ను కిడ్నాప్ చేసి తలపై తుపాకీ పెట్టి బెదిరించి తన కుతురితో వివాహం జరిపించాడు కిడ్నాపర్. బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఈ ఉదాంతం వెలుగుచూసింది. వివరాలు.. గౌతమ్ కుమార్ ఇటీవలే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పటేపూర్‌లోని రేపురాలోని పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తునాడు. . బుధవారం అతను పాఠశాలలో ఉండగా.. ముగ్గురు నలుగురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారు. 24 గంటల్లోనే తుపాకీతో బెదిరించి కిడ్నాపర్లలో ఒకరి కుమార్తెతో బలవంతంగా వివాహం చేశారు. వివాహానికి నిరాకరించింనందుకు బాధితుడిపై దాడి కూడా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తప్పిపోయిన ఉపాధ్యాయుడిని గాలించే పనిలో పడ్డారు. గౌతమ్ కుమార్ కుటుంబ సభ్యులు రాజేష్ రాయ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి రాయ్ కుమార్తె చాందినితో వివాహం చేసి ఉంటారని ఆరోపించారు. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా బిహార్‌లో పకడ్వా వివాహం(ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం) ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. గతేడాది అనారోగ్యానికి గురైన జంతువుకు వైద్యం చేసేందుకు వచ్చిన పశువైద్యుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి బెగుసరాయ్‌లో బలవంతంగా వివాహం జరిపించారు. కొన్నేళ్ల క్రితం బీహార్‌లో ఓ ఇంజనీర్‌కు సంబంధించిన ఇలాంటి ఘటనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల వినోద్ కుమార్ పాట్నాలోని పండరక్ ప్రాంతంలో ఓ మహిళను కొట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. -
దారుణం: పట్టపగలే కిడ్నాప్.. టీచర్‌ను వ్యాన్‌లో ఎక్కించి..
బెంగళూరు: కర్ణాటకాలో పట్టపగలే దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ స్కూల్ టీచర్(23)ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఎస్‌యూవీలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. అర్పిత(23) స్థానికంగా ఓ పాఠశాలలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. నేడు రాష్ట్రంలో స్కూళ్లకు సెలవు ఉన్న నేపథ్యంలో అర్పిత బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను వెంబడించారు దుండగులు. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి అమాంతం ఒక్కసారిగా ఎస్‌యూవీలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. రాము అనే యువకుడే ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారని బాధిత యువతి తల్లి ఆరోపిస్తోంది. రాము, అర్పిత గత నాలుగు ఏళ్లుగా ప్రేమించుకున్నారని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సెలవు రోజు అర్పిత ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్లారు? ఇతర అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి -
మెడలో తాళి కట్టి.. విద్యార్థినిపై టీచర్ లైంగికదాడి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: యండగండి పాఠశాలలో అమానుషం జరిగింది. ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడు.. విద్యార్థినిని మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే స్కూల్ లో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న పురెళ్ల సోమరాజు మాయమాటలతో విద్యార్థిని మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నట్లు నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కీచక ఉపాద్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆమెకు ముగ్గురు... మొదటి భర్త ఆత్మహత్య! -
Odisha: గుంజీలు తీస్తూ విద్యార్థి మృతి
జాజ్‌పూర్(ఒడిశా): బడి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ వేసిన శిక్ష ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగో తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ కుప్పకూలి ఆస్పత్రిలో కన్నుమూసిన విషాధ ఘటన ఒరాలీ గ్రామం దగ్గర్లోని సూర్యనారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో జరిగింది. రసూల్పూర్ బ్లాక్ విద్యాధికారి(బీఈఓ) నీలాంబర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పదేళ్ల పిల్లాడు రుద్ర నారాయణ్ సేథీ బడి ప్రాంగణంలో మధ్యాహ్నం పూట మూడు గంటలకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నాడు. అది క్లాసులు జరిగే సమయం కావడంతో ‘‘క్లాస్ వదిలేసి ఏంటీ ఆటలు?’’ అంటూ కోప్పడి అక్కడి టీచర్.. సేథీసహా ఐదుగురిని గుంజీలు తీయండని ఆదేశించారు. దీంతో గుంజీలు తీస్తూ సేథీ కొద్దిసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి, మెరుగైన వైద్యం కోసం కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ‘ చిన్నారి మరణానికి వీళ్లే కారకులు అంటూ ఎవ్వరూ మాకు ఫిర్యాదు చేయలేదు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఈఓ నీలాంబర్ స్పష్టం చేశారు. -
మాస్టార్ తిప్పండి
వనం దుర్గాప్రసాద్ : ఉపాధ్యాయ ఓటర్లను సానుకూలంగా మార్చుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఆయా అనుబంధ సంఘాలతో సంప్రదింపులు చేస్తున్నాయి. పరోక్ష సహకారం అందించాలని కోరుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ నేత హైదరాబాద్‌లో ఓ ఉపాధ్యాయ సంఘం నేతలకు పెద్దఎత్తున విందు ఏర్పాటు చేయడం వివాదమైంది. ఈ విందు సందర్భంగా జిల్లాలవారీగా సంఘ నేతలను పరోక్ష ప్రచారంలోకి దించాలని నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది. ఇదే మాదిరి ఇప్పుడు ఇతర పార్టీలూ తమ అనుబంధ సంఘాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నాయి. ఉపాధ్యాయ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఏయే హామీలివ్వాలనే దిశగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. ఇందులో 80 వేల మంది వరకూ ఎన్నికల విధుల్లో ఉంటారు. వీళ్లంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగిస్తారు. ఉపాధ్యాయ కుటుంబాల నుంచి దాదాపు 4 లక్షల ఓట్లు ఉంటాయి. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలున్నాయి. ఓడీల తాయిలం... ఉపాధ్యాయ సంఘాలు కొన్నేళ్లుగా ఆన్ డ్యూటీ కోసం పోరాడుతున్నాయి. గత ఏడాది ఏకంగా 14 సంఘాలకు ప్రభుత్వం ఓడీ ఇచ్చింది. కానీ గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయ్యింది. అప్పట్నుంచీ దీన్ని పొడిగించకపోవడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎన్నికల సందర్భంగా నేతల వద్ద కూడా ఇదే అంశాన్ని ఉపాధ్యాయులు ప్రస్తావిస్తున్నారు. సంఘాల నేతలకు ఓడీ ఇస్తామన్న భరోసా ఉండాలని అన్ని సంఘాలు పార్టీలను కోరుతున్నాయి. ఓడీ ఇవ్వడం ద్వారా టీచర్ల సంఘ నేతలు విధులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎన్నికల ముందు కేవలం ఒకేఒక సంఘానికి ఓడీ లభించడం కూడా ఉపాధ్యాయ సంఘాల మధ్య భిన్న ధోరణికి కారణమైంది. ఓడీ ఇచ్చిన సంఘానికి వ్యతిరేకంగా ఓడీ రాని సంఘాలు ఏకమవ్వడాన్ని వివిధ పార్టీలు గుర్తిస్తున్నాయి. వీరిని సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులూ కీలకమే.. దీర్ఘకాలంగా బదిలీలు, పదోన్నతులపై టీచర్లు ఆశలు పెట్టుకున్నారు. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా 317 జీఓ అమలు చేశారు. ఇది కూడా కొంతమంది ఉపాధ్యాయుల్లో అసంతృప్తి కలిగించింది. సాధారణ బదిలీల్లో కొన్ని మార్పులుంటాయని టీచర్లు ఆశించారు. కానీ 2022లో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం భావించినా, కోర్టు స్టే ఇవ్వడంతో ఆగిపోయింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. దీంతో బదిలీలు, పదోన్నతులపై పార్టీలు స్పష్టత ఇవ్వాలని మెజారిటీ టీచర్లు కోరుతున్నారు. దీన్ని గుర్తించిన పార్టీలు ఆ దిశగా అడుగులేసేందుకు సిద్ధపడుతున్నాయి. వీలైతే ఎన్నికల ప్రచారంలో ఎక్కడో చోట దీన్ని ప్రస్తావించి, టీచర్ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. దీంతో పాటు ఖాళీల భర్తీ, కొత్త పోస్టుల నియామకంపై కూడా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావన వచ్చే అవకాశముంది. విందు, వినోద రాజకీయాలు మాతో వద్దు టీచర్లకయినా వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. ఇదేమీ తప్పుకాదు. కానీ విధి నిర్వహణపై ప్రభావం చూపకూడదు. ఎన్నికలవేళ రాజకీయ పార్టీల విందులు, వినోదాలకు వెళ్లే చిల్లర రాజకీయాలు ఆమోదయోగ్యం కాదు. నాయకులే కాదు..ఓటర్లనూ ఇది ప్రలోభ పెట్టే చర్యగానే చూడాలి. ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడి పవిత్రతను అందరూ కాపాడాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వృత్తి గౌరవమే ముఖ్యం ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వ్యక్తి. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘ నేతలూ గుర్తించాలి. ఓట్ల ప్రలోభాలకు టీచర్లను లక్ష్యంగా చేయొద్దు. ఉపాధ్యాయూలూ దీనికి దూరంగా ఉండాలి. వృత్తి గౌరవాన్ని భంగపరిచే చర్యలకు పాల్పడొద్దు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత సంఘ నేతలకు ఉంది. –సయ్యద్ షౌకత్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఉపాధ్యాయుడు విధులు ముగించుకొని.. ఇంటికి వెళ్తుండగా..
సాక్షి, ఆదిలాబాద్: ప్రతిరోజులాగే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలోని చించోలి గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అన్వేష్ (25) బోథ్ మండలంలోని పాట్నపూర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా బోలెరో వాహనాన్ని ఢీ కొనడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఎస్సై సాయన్న మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి మోతిలాల్ సైతం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రికి ఒక్కడే కొడుకు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. -
ప్రాణాల మీదికి తెచ్చిన అయ్యోరి వడ్డీ వ్యాపారం
పలమనేరు: ఓ ఉపాధ్యాయుడి వడ్డీ వ్యాపారం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చింది. సోమవారం సాయంత్రం పట్టణ సమీపంలోని సాయినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బైరెడ్డిపల్లి మండలం మిట్టకురప్పల్లెకు చెందిన చంద్రప్ప(33) గ్రామంలో తన 53 సెంట్ల పొలంలో సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. మూడేళ్ల కిందట చంద్రప్ప భార్య అనారోగ్యానికి గురికావడంతో మిట్టకురప్పల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేసే తమ బంధువైన కృష్ణమూర్తి వద్ద తన పొలాన్ని రాసిచ్చి రూ.2 లక్షలను వడ్డీకి తీసుకున్నాడు. ఆపై తీసుకొన్న అప్పు వడ్డీతో కలసి రూ.4లక్షల వరకు పెరిగింది. ఆ డబ్బు మొత్తం చెల్లిస్తే తిరిగి భూమి వెనక్కి రాసిస్తానని టీచర్ చెప్పాడు. దీంతో బాధితుడు రెండేళ్లుగా డబ్బు కడుతానంటూ టీచర్ వద్దకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీంతో సోమవారం సాయంత్రం బైరెడ్డిపల్లెలో క్రిమిసంహార మందును వెంటబెట్టుకుని స్థానిక సాయినగర్‌లోని టీచర్ ఇంటివద్దకెళ్లి వడ్డీతో కలసి మొత్తం డబ్బు చెల్లిస్తానని, తన భూమి తనకు రిజిస్ట్రర్ చేసివ్వాలని ప్రాధేయపడ్డాడు. ససేమినా కాదని ఆయన చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు వెంట తెచ్చుకున్న క్రిమిసంహారకమందును సేవించి అక్కడే అపస్మారక స్థితిలోకెళ్లాడు. దీన్ని గమనించిన స్థానికులు 108 ద్వారా అతన్ని పలమనేరు ప్రభు త్వాస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి వైద్యులు తిరుపతి రుయాకు తరలించారు. ప్రస్తుతం బాధితుని పరిస్థితి విషమంగా ఉందని, అతని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. -
లారీ ఢీకొని టీచర్ ధనలక్ష్మి మృతి
వేలూరు: కాట్పాడి సమీపంలో లారీ ఢీకొనడంతో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. వేలూరు శలవన్‌పేటకు చెందిన ఆరుముగం భార్య ధనలక్ష్మి(36) కాట్పాడి సమీపంలోని క్రిష్టియన్‌పేటలోని ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె బైక్‌లో పాఠశాలకు వెళుతోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరింది. కాట్పాడి సమీపంలోని కల్పదూరు వద్ద సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడిని తప్పించబోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొని కింద పడింది. ఆ సమయంలో వెనుక వైపున కాట్పాడి నుంచి చిత్తూరు వెళుతున్న లారీ ధనలక్ష్మిని ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కాట్పాడి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
నా భార్యది ఆత్మహత్య కాదు.. ఇదిగో వినండి.. వాయిస్ రికార్డ్!
సాక్షి, కుమురం భీం: చెరువులో దూకి అధ్యాపకురాలు బలవన్మరణం చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ వాసుదేవరావు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నస్పూర్ మండలానికి చెందిన పసునూటి తిరుమలేశ్వరి (32) చెన్నూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. సోమవారం ఉదయం విధుల్లో భాగంగా కళాశాలకు వెళ్లి రిజిష్టర్‌లో సంతకం చేసింది. అనంతరం బయటకు వెళ్తుండగా తొటి ఉపాధ్యాయురాలు ప్రశ్నించడంతో సెల్‌ఫోన్ మర్చిపోయాను.. ఇంటికి వెళ్లివస్తానని చెప్పింది. 10 గంటల ప్రాంతంలో పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త సంపత్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీయించి పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కీలకంగా మారిన వాయిస్ రికార్డు.. ఆత్మహత్యకు ముందు తిరుమలేశ్వరి తన మృతికి కళాశాల ప్రిన్సిపాల్, ఏటీసీ, పీఈటీతో పాటు మరో ఉపాధ్యాయురాలు కారణమని సెల్ఫోన్లో వాయిస్ రికార్డు చేసింది. ఇదే కేసులో కీలకంగా మారింది. వాయిస్ రికార్డు ఆధారంగా మృతురాలి భర్త సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. బంధువుల ఆందోళన! మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు కుమారస్వామి, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి గురుకుల కళాశాల అధికారులు వచ్చే వరకు పోస్ట్‌మార్టం చేయవద్దని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఆర్సీవో స్వరూపారాణి వచ్చి మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తిరుమలేశ్వరి ఉద్యోగాన్ని భర్త సంపత్‌కు ఇస్తామని, ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ కుమార్తె పేరున అందజేస్తామని రాసివ్వడంతో ఆందోళన విరమించారు. ప్రిన్సిపాల్, ఏసీటీ, మరో ముగ్గురిపై కేసు నమోదు.. అధ్యాపకురాలి మృతి కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమలేశ్వరి ఉద్యోగ రీత్యా చెన్నూర్‌లోని ఆదర్శనగర్‌లో నివాసం ఉంటోంది. నాలుగేళ్లుగా గురుకుల కళాశాల లెక్చరర్‌తో పాటు మెస్ కేర్‌టేకర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కొన్ని రోజులుగా ప్రిన్సిపాల్ రాజమణి, ఏసీటీ స్రవంతి, పీఈటీలు రేష్మ, శిరీష, మరో ఉపాధ్యాయురాలు పుష్పలత వేధింపులకు గురిచేస్తున్నారని మృతురాలి భర్త సంపత్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
టీచర్‌పై కాల్పులు.. సోషల్ మీడియాలో పోస్టింగ్
ఆగ్రా(యూపీ): కోచింగ్ సెంటర్ టీచర్‌పై అకారణంగా కోపం పెంచుకున్న ఇద్దరు విద్యార్థులు తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపారు. మరోసారి మరిన్ని బుల్లెట్లు దించుతామని సోషల్ మీడియాలో హెచ్చరించారు. ఆగ్రాలోని ఖండోలిలో చోటుచేసుకుంది. సుమిత్ సింగ్ గతంలో ఓ కోచింగ్ సెంటర్లో పనిచేశారు. ఆయన వద్ద చదువుకున్న 16, 18 ఏళ్ల ఇద్దరు విద్యార్థులు ఓ బాలికతో మాట్లాడుతుండగా సుమిత్ సోదరుడు తరుణ్ అడ్డుకున్నారు. దీనిపై వారు కోపం పెంచుకుని గురువారం సుమిత్‌కు ఫోన్ చేసి, కోచింగ్ సెంటర్‌కు రావాలని కోరారు. రాగానే తెచ్చుకున్న తుపాకీతో సుమిత్ కాలిపై కాల్చారు. అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ‘గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్’ సినిమాలోని నటుల్లా పోజులు పెట్టి, ప్రస్తుతానికి ఒక్క బుల్లెట్టే కాల్చామని, ఆరు నెల్ల తర్వాత మిగతా 39 బుల్లెట్లనూ సుమిత్ శరీరంలోకి దించుతామంటూ హెచ్చరికలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
Hyderabad: టీచర్ కర్కశత్వం.. పసి ప్రాణం బలి
ఉప్పల్(హైదరాబాద్): ఓ టీచర్ కర్కశత్వం పసి ప్రాణాన్ని బలితీసుకుంది. ఇంకా బలపమే సరిగా పట్టుకోలేని చిన్నారిపై టీచర్ అమానుషంగా ప్రవర్తించాడు. హోంవర్క్ చేయలేదంటూ పలకతో తలపై బలంగా కొట్టాడు. అసలు ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి.. టీచర్ కొట్టిన దెబ్బతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాంతపూర్ వివేక్ నగర్లో స్ట్రీట్ నెంబర్10 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ విద్యార్థిని టీచర్ తలపై బలంగా కొట్టాడు. శనివారం రోజున స్కూల్ హోమ్ వర్క్ చేయలేదని తలపై పలుకతో కొట్టడం తో స్పృహ తప్పి పడిపోయాడు అభం శుభం తెలియని చిన్నారి. దాంతో ఆ పిల్లాడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఈ రోజు ఉదయం చనిపోయాడు. చనిపోయిన అబ్బాయి మృతదేహాన్ని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ దగ్గర ఉంచి తల్లిదండ్రులు, బంధువులు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. అప్పుడు ప్రాణాలు తీశాడు.. ఇప్పుడు ప్రాణం తీసుకున్నాడు -
‘రాధాస్వామి’ గురువు ఎవరు? సత్సంగిలు ఏమి చేస్తుంటారు?
యూపీలోని ఆగ్రాలో గల రాధాస్వామి దయాల్బాగ్ శాఖ ఆమధ్య భూముల ఆక్రమణలకు పాల్పడిందనే ఆరోపణలు వినిపించాయి. కాగా రాధాస్వామి దయాల్బాగ్ శాఖలోని సత్సంగిలు తమదైన సత్సంగంలో ఉంటూ, లోకవ్యవహారాలకు దూరంగా ఉంటారు. ఈ వర్గానికి చెందిన గురువు కూడా ప్రచారానికి దూరంగా ఉంటారు. అతని గురించిన వివరాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం సత్సంగ్‌కు గురువుగా వ్యవహరిస్తున్న డాక్టర్ ప్రేమ్ శరణ్ సత్సంగి ఐఐటీ పాసౌట్. విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. పీహెచ్డీ పూర్తి చేశారు. డాక్టర్ ప్రేమ్ శరణ్ సత్సంగి ఈ శాఖకు ఎనిమిదవ గురువు. ప్రేమ్ శరణ్ 2002 నుంచి గురువుగా వ్యవహరిస్తున్నారు. ఐఐటీ బనారస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల పాటు అమెరికా, యూరప్‌లలోని ప్రముఖ విద్యా సంస్థలలో పనిచేశారు. డాక్టర్ ప్రేమ్ శరణ్ నిరంతరం తెల్లని దుస్తులలో కనిపిస్తారు. సరళత, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. దానినే ఇతరులకూ బోధిస్తారు. ప్రతిరోజూ దయాల్బాగ్ అనుచరులను కలుసుకుంటుంటారు. దేశం నలుమూలల నుండి వచ్చిన సత్సంగిలు దయాల్బాగ్లో ఉంటారు. ఇక్కడ ఎవరికీ కులం ప్రస్తావన ఉండదు. సత్సంగి అనేది ఇంటిపేరుగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న చాలా మంది సత్సంగిలు ఉన్నత విద్యావంతులు. వీరు అర్హతలకు తగిన విధంగా పలు చోట్ల పనిచేస్తుంటారు. ఇది కూడా చదవండి: ఐఎఎఫ్‌హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ -
మెషీన్స్‌కూ..మదర్‌టంగ్ కావాలోయ్!
స్కూలు నుంచి కాలేజీ దాకా సెకండ్ లాంగ్వేజ్‌గా ఉండే మాతృభాషను మొక్కుబడిగా చదివేవారే ఎక్కువ. ఆ.. మనకు తెలిసిందే కదా? దీనికి ఎందుకు ఎక్కువ సమయం కేటాయించాలని లైట్ తీసుకుంటుంటారు. కానీ మాతృభాషతో కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్స్లా ఐటీ కంపెనీల్లో పనిచేయవచ్చు. వాళ్లలా డాలర్లు సంపాదించవచ్చని చెబుతోంది రాధి దాట్ల. హిందీ మాత్రమే చదువుకుని అమెరికా వెళ్లిన రాధికి ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదు. అయినా నిరాశపడకుండా తనకు తగిన ఉద్యోగాన్ని వెతికి పట్టుకుంది. ఇప్పుడామె ఏకంగా ఏఐ యంత్రాలకే హిందీ నేర్పిస్తోంది. అంతర్జాతీయ హిందీ టీచర్‌గా రాణిస్తోన్న రాధి గురించి ఆమె మాటల్లోనే..... అమ్మా వాళ్లు తెలుగు వాళ్లే. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో పుట్టాను. నాన్న ఎయిర్ ఫోర్స్‌లో ఉత్తరభారత దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేయడంతో... కేంద్రీయ విద్యాలయాల్లో చదివాను. అలా నా చదువంతా హిందీలోనే సాగింది. రాయ్‌పూర్ నుంచి విశాఖపట్నం వచ్చినప్పటికీ, యూపీ, పంజాబ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు వైజాగ్‌లో ఉండడంతో నా మొదటి భాష హిందీగా మారింది. హిందీ తరువాత తెలుగు, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. కానీ హిందీ వచ్చినంతగా ఇంగ్లిష్, తెలుగు రాదు. కెరీర్‌గా అనుకోలేదు... డిగ్రీ వరకు హిందీని ఒక లాంగ్వేజ్‌గా మాత్రమే చూశాను. అయితే హిందీనే కెరీర్‌గా మారుతుందని అప్పుడు అనుకోలేదు. ఆ తరువాత మాస్టర్స్ చేసేటప్పుడు లింగ్విస్టిక్స్ చదివే అవకాశం రావడంతో హైదరాబాద్ యూనివర్శిటీలో హిందీకి అప్లైచేశాను. హిందీ కోర్సు చేసేటప్పుడు హిందీ మీద మక్కువ ఏర్పడింది. దీనికితోడు మా ప్రొఫెసర్ ‘‘నీకు తెలిసిన సబ్జెక్టుని కెరీర్‌గా ఎంచుకో’’ అని సలహా ఇచ్చారు. అప్పుడు నేను హిందీనే కెరీర్‌గా మలుచుకోవాలనుకున్నాను. ఆ తర్వాత పీహెచ్డీ చేస్తోన్న సమయంలో పిట్స్ బర్గ్, క్యాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులు, బయాలజీ, ఎకనమిక్స్ తోపాటు హిందీ నేర్చుకునేవారు. అప్పుడు వారికి హిందీ చెప్పేదాన్ని. అమెరికాలో.. హిందీ ఉద్యోగం 2003లో పెళ్లి అయ్యింది. నా భర్త ఉద్యోగ రీత్యా రెండేళ్ల తరువాత అమెరికా వెళ్లాము. అక్కడ ఉద్యోగం చేద్దామని ఉద్యోగాల కోసం వెతికాను. కానీ ఎక్కడా దొరకలేదు. చాలా మంది అమెరికా వచ్చాక... ఉద్యోగం కోసం కంప్యూటర్ సైన్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్‌లు నేర్చుకుంటుంటారు. నేను మాత్రం హిందీ టీచర్‌గా పనిచేసేందుకే ప్రయత్నించాను. అనేక వ్యయప్రయాసల తర్వాత అమెరికాలో బాగా పాపులర్ అయిన ‘బెర్లిట్జ్’ లాంగ్వేజ్ కార్పోరేషన్లో తొలి ఉద్యోగం దొరికింది. అక్కడ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి హిందీ నేర్పించాలి. అలా డిఫెన్స్ వారికి హిందీ నేర్పించాను. ఐదు నెలల బిడ్డను వదిలి... డిఫెన్స్ వాళ్లకు పాఠాలు చెబుతూనే 2008లో జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీకి అప్లై చేసాను. కొన్నాళ్ల తరువాత ఇంటర్వ్యూ కాల్ వచ్చి, హిందీ టీచర్‌గా సెలక్ట్ అయ్యాను. అప్పుడు నాకు ఐదు నెలల బాబు. వాడిని వదిలి వెళ్లాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఆయన మేరీలాండ్ యూనివర్శిటీలో రీసెర్చర్‌గా చేసేవారు. ఆయన ఇంటికి వచ్చాక నేను క్లాసులు చెప్పడానికి వెళ్లేదాన్ని. సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు క్లాసులు చెప్పేదాన్ని. ఇంట్లో కూర్చుని... యూనివర్శిటీలో తరగతులు చెబుతూ ఫారిన్ సర్వీసెస్‌కు అప్లై చేశాను. వివిధ దేశాల్లో నివసిస్తోన్న అమెరికన్లకు హిందీ నేర్పించడానికి ఆఫర్ వచ్చింది. దీంతో అమెరికా ఫారిన్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ ద్వారా హిందీ బోధించేదాన్ని. కోవిడ్ సమయంలో ఎడ్యుకేషన్ అంతా ఆన్లైన్ అయ్యింది. ఇదే సమయంలో మేరీలాండ్ యూనివర్శిటీ ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి ఆఫర్ ఇవ్వడంతో 2021 నుంచి ఆన్లైన్ క్లాసులు చెబుతున్నాను. ఆ తర్వాత ఐటీ కంపెనీ ఆర్కిల్లో భాషా విభాగంలో పనిచేశాను. అక్కడ హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, మరాఠీ, నేపాలీ భాషలను నేర్పించేవారు. ఆ తరువాత అమేజాన్‌లో సీనియర్ లింగ్విస్ట్గా, యాపిల్ కంపెనీలో హిందీ ప్రాజెక్టులో పనిచేశాను. ఇప్పుడంతా డేటా అన లిస్టు, మెషిన్ లెర్నింగ్ గురించే మాట్లాడుతున్నారు. మెషిన్ లెర్నింగ్ ఒక్క ఇంగ్లిష్‌లోనే లేదు. ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వస్తోంది. మెషిన్‌కి అన్ని భాషలు తెలియవు. అందువల్ల ప్రతి భాషను మెషిన్‌కు నేర్పించాల్సిందే. అప్పుడు మాత్రమే కోడింగ్ చేయగలరు. కోడింగ్ ద్వారానే అన్నిరకాల యాప్‌లు క్రియేట్ చేస్తారు. ఒక యాప్ తయారవడానికి కచ్చితంగా భాషా నిపుణులు అవసరం. అందుకే సైన్స్, మ్యాథ్స్లకున్న ప్రాముఖ్యత భాషకూ ఉంది. ఇది మనం గ్రహించాలి. ప్రపంచంలో ఇండియా పెద్ద మార్కెట్. చాలా కంపెనీలు మన దేశం వైపు చూస్తున్నాయి. అందువల్ల భవిష్యత్ తరాలకు హిందీతోనే ఎక్కువసంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇంగ్లీష్‌తోపాటు, హిందీ కూడా అవసరమే. ఇంగ్లీష్‌తో పాటు హిందీ కూడా చక్కగా నేర్చుకోండి ఓపికగా వెతికితే మంచి అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి.’’ అని నేటి యువతరానికి రాధి చెబుతోంది. (చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే..ఎవరు తీసుకొచ్చారు?) -
వెళ్లొదంటూ టీచర్ ని పట్టుకుని ఏడ్చేసిన స్టూడెంట్స్
-
అంగన్వాడీల్లో కొత్త కొలువులు!
సాక్షి, హైదరాబాద్: మినీకేంద్రాల స్థాయి పెంచి ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త కొలువులకు అవకాశం ఏర్పడింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉంటే.. మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్ ఉంటారు. ఇక్కడ హెల్పర్ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్ వివరాలు పంపింది. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టొచ్చు. టీచర్ల భర్తీ తర్వాతే... రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీతో దాదాపు రెండున్నర వేలమంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈక్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగువేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌తో హెల్పర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందే అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. -
అసలైన టీచరమ్మ! అభాగ్యులకు ఆమె " పెద్దమ్మ"! రిటైరై కూడా..
టీచర్ అనే పదమే ఎంతో గౌరవనీయమైంది. ఇక ఆ వృత్తి చేసేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా ఆ వృత్తే వారిని తెలియకుండా సేవ వైపుకి మళ్లీస్తుందో లేక వారి ఆలోచన స్థాయిలు అలా ఉంటాయో!. అచ్చం అలానే పదవివిరమణ చేసిన ఓ టీచరమ్మ విశ్రాంతి తీసుకోకుండా ఎందరో అభాగ్యులకు పెద్దమ్మగా, యువతకు ఓ గైడ్‌గా ఎన్నో సేవలు చేస్తూ అందరిచే మన్నలను అందుకుంటోంది. ఆమే గుర్రాల సరోజనమ్మ. ఇవరామె? ఏం చేసిందంటే.. గుర్రాల సరోజనమ్మది నిజామాబాద్ జిల్లా బోధన్. ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే.. ఆమె భర్త వెంకట్రావు నిజాం షుగర్స్‌లో ఉద్యోగి. ఆర్థికంగా ఏ ఇబ్బందీ లేకున్నా మాకు పిల్లలు లేని లోటు ఉండేది. దత్తత ప్రయత్నాలు చేసినా అవేమీ సాధ్యపడలేదు. పాతికేళ్ల క్రితమే రిటైర్ అయ్యింది. ఆ వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. పింఛన్ వస్తోంది కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటుగా విధికి కన్నుకుట్టి భర్తను తీసుకుపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన సరోజనమ్మ తోబుట్టువుల పిల్లలే తన పిల్లలు అన్యమనస్కంగా జీవిస్తోంది. వాళ్లొచ్చినప్పుడు తెగ సంబరపడేది. వాళ్లూ కూడా ప్రేమగానే ఉండేవారు ఆమెతో. కానీ ఆ ప్రేమలన్నీ.. నా ఆస్తి చుట్టూ తిరగడం నచ్చలేదు. ఇవన్నీ చూసి విసిగిపోయి.. ఇంటిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నా. ఇలా ఆలోచిస్తుండగా మా ఉపాధ్యాయులు పడుతున్న బాధలే ఆమెను కదిలించాయి. విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకి సొంత భవనం లేదని తెలుసుకుంది. అందుకోసం.. ఆ సంఘానికి ఇంటిని రాసిస్తే మున్ముందు ఎందరికో సేవలు అందుతాయని విశ్వసించి మరీ ఆ ఇల్లు తన తర్వాత ఆ ఇల్లు సంఘానికి చెందేలా ఏడాదిన్నర కిందటే రిజిస్ట్రేషన్ చేయించింది. ఇప్పుడూ ఆ ఇంటి విలువ ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలు. ఇది తెలిశాక బంధువులు ఆమె దగ్గరకి రావడమే మానేశారు. ఆ రెండు ఘటనలకు పరిష్కారమే ధర్మస్థల్ ఓసారి దగ్గరి బంధువొకరు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లింది. ఇంటికి కాస్త దూరంగా శవాన్ని ఉంచారు. ఏంటని ఆరా తీయగా.. ఆ ఇంటి యజమాని అనుమతించలేదని తెలిసింది. ఇంకోసారి పరిచయస్థులొకరు చనిపోతే.. వారుండే ఇంటికి దూరంలో అంత్యక్రియలకు కావాల్సిన పనులు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఈ బాధలు తప్పడం లేదని అర్థమైంది సరోజనమ్మకు. ఈ పరిస్థితి అయినవాళ్లని బాధపెడుతుంది కదా! ఈ రెండు ఘటనలూ సరోజనమ్మను ఆలోచింప చేశాయి. ఇందుకు పరిష్కారంగా వెలిసిందే.. ‘ధర్మస్థల్’. ఇందులో చనిపోయినవారి మృతదేహాన్ని అంత్యక్రియలు జరిగేవరకు భద్రపర్చుకోవచ్చు. ఫ్రీజర్ సహా అన్ని సదుపాయాలనూ ఇక్కడ ఉచితంగా అందిస్తారు. ఈ నిర్మాణం ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇందుకోసం రూ.20 లక్షలు వెచ్చించింది. చనిపోయాక మాట అటుంచితే... బతికున్న వాళ్ల ఆరోగ్యానికి భరోసా ఎవరు? అందుకే జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం ట్రస్టు సభ్యులు ప్రారంభించిన జెనరిక్ మందుల దుకాణానికి ఆమె వంతుగా రూ. 2 లక్షలు విరాళమందించింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. అసలు ధరకే మందుల్ని అందివ్వడం ఈ ట్రస్టు ఉద్దేశం. దీనివల్ల మధ్యతరగతి, పేదవారికి ఎంతో ప్రయోజనం. రెంజల్‌లోని కందకుర్తి గోదావరి ఒడ్డున గోశాల నిర్మాణానికీ కూడా విరాళం ఇచ్చింది యువతకోసం నా వంతుగా.. ఒక టీచర్‌గా యువతని మంచి బాట పట్టించాలనే సదుద్దేశంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం ప్రభుత్వ గ్రంథాలయంలో రూ.20 వేల విలువైన పుస్తకాలను అందించింది. ఏడాదికోసారి చింతకుంట వృద్ధాశ్రమానికి వెళ్తుంంది. అక్కడున్న వృద్థులకు నిత్యావసరాల్ని, దుస్తుల్ని అందిస్తుంది. వీలుదొరికినప్పుడల్లా అవయవదానంపై ప్రచారం చేస్తుంది. తన మరణానంతరం దేహాన్ని ప్రయోగాలకు వినియోగించాలని ఆమోదపత్రం కూడా రాసిచ్చింది. మొదట్లో తనకెవరూ లేరునుకుని బాధపడేది. ఇప్పుడు ఈసేవ కార్యక్రమాలు ఎంతోమంది ఆప్తులను ఆమెకు దొరికేలా చేసింది. పైగా వారిచేత ‘పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలిపించుకుంటుంది. నిజంగా ఆమె చాలా గ్రేట్. భర్త పోయి విశ్రాంతిగా ఉండాల్సినీ ఈ వయసులో ఎంతో చలాకీగా ఇలా సేవాకార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సరోజనమ్మ!. (చదవండి: బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..) -
విద్యార్థులే ఊపిరిగా..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మందమతులేం కాదు, తెలివైన, చురుకైన వారు. విద్యార్థులే కాదు టీచర్లు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు’’ అంటోంది నేషనల్ గుడ్ టీచర్ అవార్డు గ్రహీత మాలతీ టీచర్. దేశవ్యాప్తంగా యాభైమంది ఈ అవార్డు అందుకోగా అందులో మాలతీ టీచర్ ఒకరు. తమిళనాడులోని సెంగోటై్టలో పుట్టి పెరిగిన మాలతి నల్లాసైతిరా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభాస్యం పూర్తిచేసింది. మనస్తత్వ, రసాయన శాస్త్రాల్లో మాస్టర్స్ చేసింది. రసాయనశాస్త్రంలో పీహెచ్డీ చేస్తూ టీచర్‌గా పనిచేస్తోంది. 2008లో తిరుపూర్ పెరుమతూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా చేరింది మాలతి. అక్కడ మూడేళ్లు పనిచేశాక బదిలీ అవ్వడంతో తెన్కాసి గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా వెళ్లింది. ఇక్కడ ఏడాది పనిచేశాక ప్రమోషన్ రావడంతో వీరకేరళంబుదూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పోస్టుగ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్‌గా చేరింది. గత పదేళ్లుగా ఇదే స్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ వారి మనసులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. ఆటపాటలతో... పాఠాలు విద్యార్థులు సైన్స్సబ్జెక్టుని ఇష్టపడాలని మాలతి కోరిక. అందుకే ఎంతో కష్టమైన చాప్టర్లను సైతం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తోంది. విలువిద్య, తోలుబొమ్మలాట, పాటలు పాడడం, నృత్యం, కథలు చెప్పడం ద్వారా సైన్స్ పాఠాలను వివరిస్తోంది. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల ద్వారా బోధించింది. గ్రామాల్లో మొబైల్ ఫోన్స్ లేని అంధవిద్యార్థులకు సైతం ఆడియో పాఠాలను అందించింది. నూటపద్దెనిమిది మూలకాల పట్టికను సైతం కంఠస్థం చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి చక్కగా నేర్చుకునేందుకు సాయపడుతోంది. మేధో వైకల్యాలున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వీరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషిచేస్తోంది. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తోంది. ఇలా మాలతీ టీచర్ సాయంతో సైబుల్ ఇస్లాం అనే మేధోవైకల్య విద్యార్థి 25 సెకన్లలో 20 ద్రవాల పేర్లు టకటకా చెప్పి ‘చోళన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాడు. ఇస్లాంకు మాలతీ ఆరునెలలపాటు శిక్షణ ఇచ్చింది. మహేశ్వరి, కరణ్, శక్తి ప్రభ వంటి విద్యార్థులు సైతం సెకన్ల వ్యవధిలో నూటపద్ధెనిమిది మూలకాల పీరియాడిక్ టేబుల్‌ను అప్పచెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్‌లో చోటు దక్కించుకున్నారు. అరవైశాతం మేధో వైకల్యం కారణంగా సరిగా మాట్లాడలేని వారితో సైతం మూలకాల పేర్లను కంఠస్థం చేయించి, గడగడా చెప్పించడం విశేషం. అవార్డులు రికార్డులు... విద్యార్థులను రికార్డుల బుక్‌లో చోటుదక్కించుకునేలా తయారు చేయడమేగాక మాలతీ కూడా కరోనా సమయంలో ఐదువందల రోజులు ఉచితంగా ఆన్లైన్ తరగతులు చెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్ లో చోటు దక్కించుకుంది. మాలతి కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 2020–2021 సంవత్సరానికిగాను డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డుతో సత్కరించింది. 2022లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇరవై ఆరుగంటలపాటు నిరంతరాయంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆరోతరగతి నుంచి పై తరగతులకు పాఠాలు బోధించే మాలతీ తనకు వచ్చిన నగదు బహుమతితో విద్యార్థులకు రోటోటిక్స్ కిట్స్ కొని ఇచ్చింది. గేమ్‌లకు బానిసలు కాకుండా... స్మార్ట్ఫోన్లు వచ్చాక విద్యార్థులంతా మొబైల్ గేమ్స్‌కు అంకితమైపోతున్నారు. వీరిని ఆడుకోనిస్తూనే పాఠాలు నేర్పించడానికి మాలతి క్విజ్గేమ్ వాయిస్ యాప్‌ను రూ΄÷ందించింది. ఈ యాప్‌ను స్టూడెంట్స్‌తోనే తయారు చేయించడం విశేషం. దీనిలో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో విద్యార్థుల పేర్లు, ఇంగ్లిష్‌లోని కష్టమైన పదాలను వెతుకుతూ నేర్చుకోవచ్చు. విద్యార్థులకు నేర్పిస్తోన్న పాఠాలను వారి తల్లిదండ్రులు చూసేలా యూట్యూబ్‌లో పోస్టుచేస్తూ వారి ఉన్నతికి కృషిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మాలతి టీచర్. ‘‘బోధనే నా శ్వాస, విద్యార్థులే నా ఊపిరి. డాక్టర్లు, టీచర్లకు రిటైర్మెంట్ ఉండదు. అధికారికంగా రిటైర్ అయినప్పటికీ ఆ తరువాత కూడా స్టూడెంట్స్ కోసం పనిచేస్తాను. నేను సైకాలజీ చదవడం వల్ల విద్యార్థుల్ని, వారి వైకల్యాలను అర్థం చేసుకుని పాఠాలు చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్క టీచర్ సైకాలజీ చదివితే మరింత చక్కగా బోధించగలుగుతారు. నేషనల్ గుడ్ టీచర్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నేర్చుకుంటూ, విద్యార్థులకు నేర్పించడమే నా జీవితాశయం’’ అని మాలతీ టీచర్ చెబుతోంది. -
SP సుమతి గురువు ఎవరో తెలుసా..?
-
ఉపాధ్యాయునిగా పనిచేసిన కోటీశ్వరుడు - ఎవరో తెలుస్తే ఆశ్చర్యపోతారు!
గురువుని మించిన దైవం లేదనేది లోకోక్తి మాత్రమే కాదు, అక్షర సత్యం. ఒక వ్యక్తి జీవితంలో ఎదిగి గొప్ప స్థాయిలో ఉన్నాడంటే తప్పకుండా వారి గురువు చలవే అయి ఉంటుంది. సాందీపుని దగ్గర కృష్ణుడు, విశ్వామిత్రుని దగ్గర రాముడు విద్య నేర్చుకున్నవారే అని పురాణాలు చెబుతాయి. భగవంతుని సైతం జ్ఞానం నేర్పే అదృష్టం కేవలం గురువుకు మాత్రమే సొంతం. భారతదేశానికి రెండవ రాష్ట్రపతి 'సర్వేపల్లి రాధాకృష్ణన్' జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రపంచంలో అత్యంత ధనిక ఉపాధ్యాయుని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకడుగా నిలిచిన చైనా పారిశ్రామిక & ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేత 'జాక్ మా' (Jack Ma) ఒకప్పుడు ఉపాధ్యాయునిగా పనిచేసినట్లు చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈయన చదువుకునే రోజుల్లోనే ఇంగ్లీష్ టీచర్‌గా గడిపినట్లు సమాచారం, కాగా కొన్ని నెలల క్రితం టోక్యో యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి అంగీకరించాడు. మొదటి ఉపన్యాసానికి (లెక్షర్) సంబంధించిన చిత్రాలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిలియనీర్ విద్యార్థులకు మేనేజ్మెంట్ ఫిలాసఫీ గురించి బోధించాడు. యూనివర్శిటీ ఆఫ్ టోక్యోతో పాటు, మా హాంకాంగ్ యూనివర్సిటీలో కూడా బిజినెస్ ప్రొఫెసర్‌గా ఉండటం గమనార్హం. కొన్ని సంవత్సరాల క్రితం ప్రజల దృష్టి నుంచి అదృశ్యమైన తర్వాత జాక్ మా ఉపాధ్యాయుడిగా తిరిగి దర్శనమిచ్చాడు. ఇదీ చదవండి: దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు! చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల ఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో 'హాంగ్జౌ డియాంజీ యూనివర్సిటీ' ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ పట్టు వదలకుండా మూడవ సారి పరీక్ష రాసి విజయం సాధించి అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పడమ్ మొదలుపెట్టాడు. ఇదీ చదవండి: ఒకదాన్ని మించి మరొకటి.. ఔరా అనిపించే వాహనాలు - ఓ లుక్కేసుకోండి! ఆ తరువాత క్రమంగా అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరుగా నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన ఆస్తులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎన్నెన్నో రంగాల్లో భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంలో గడపాల్సి కూడా వచ్చింది. -
'పాక్‌కు వెళ్లండి..' టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకాలో ఓ టీచర్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి పాకిస్థాన్‌కు వెళ్లండి.. ఇది హిందూ దేశం అని అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు వారి కుటుంబంతో కలిసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శివమొగ్గ జిల్లాలోని ఓ ఉర్దూ ఇన్స్టిట్యూషన్లో ఈ ఘటన జరిగింది. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కన్నడ భాష క్లాస్ జరుగుతుండగానే అల్లరి చేశారు. ఒకరిపై మరొకరు ఘర్ణణకు దిగారు. దీంతో విసిగిపోయిన కన్నడ భాష బోధించే టీచర్.. విద్యార్థులను పాకిస్థాన్‌కు వెళ్లాలని.. ఇది హిందూ దేశమని అన్నారు. సదరు టీచర్‌ను బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఉర్దూ స్కూల్లో ఆ టీచర్ ఎనిమిదేళ్లుగా బోధిస్తున్నారని, మొత్తం 26 ఏళ్ల అనుభవం ఉన్నట్లు గుర్తించారు. ఆమె రెగ్యులర్ ఉద్యోగిని అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఘటనల తర్వాత మళ్లీ కర్ణాటకాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ముస్లిం విద్యార్థిని తోటి పిల్లలతో టీచర్ కొట్టించారు. చివరికి పిల్లాడిని దండించాలనే తప్పా మతపరమైన ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఢిల్లీలో తరగది గదిలో ఓ టీచర్ విద్యార్థులను పాక్‌కు వెళ్లాలని సూచించారు. అనంతరం మళ్లీ కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఇదీ చదవండి: సోనియాగాంధీకి ఆస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స.. -
గుడ్ టచ్ బ్యాడ్ టచ్
దిక్కుల దివ్యగీతాలకు వారసులు, లోకపు భాగ్య విధాతలు పిల్లలు. పాపం పుణ్యం తెలియని ఈ పాపలకు ప్రమాదం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘బ్యాడ్ టచ్ గుడ్ టచ్’ గురించి పిల్లలకు సింపుల్ లాంగ్వేజ్‌లో, సులభంగా అర్థమయ్యేలా ఒక టీచర్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్’ ‘ఈ వీడియోను ప్రతి స్కూల్లో పిల్లలకు చూపించాలి’... అంటూ నెటిజెన్స్ స్పందించారు. రోషన్ రాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
విద్యార్థుల ఎదుటే టీచర్‌కు తలాక్ చెప్పిన భర్త
బారాబంకీ: తరగతి గదిలో పాఠాలు చెబుతున్న టీచర్‌కు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో, సదరు ఉపాధ్యాయినితోపాటు విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఆగస్ట్ 24న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. బారాబంకీకి చెందిన బాధితురాలికి ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ షకీల్‌తో 2020లో వివాహమైంది. కొంతకాలం తర్వాత షకీల్ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. అత్తింటి వారు కట్నం తేవాలంటూ వేధించి ఆమెను బలవంతంగా పుట్టింటికి పంపారు. పుట్టింట్లో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 28న సౌదీ అరేబియా నుంచి సొంతూరుకు చేరుకున్న షకీల్.. జూలై 10న బాధితురాలి వద్దకు వచ్చాడు. తనతో రావాలని కోరాడు. వెంటనే రాలేనని చెప్పడంతో ఆరు రోజుల అనంతరం తిరిగి సొంతూరుకు వెళ్లిపోయాడు. ఆగస్ట్ 24న తరగతి గదిలో ఉండగా వచ్చి విద్యార్థుల ఎదుటే తనకు మూడు సార్లు తలాక్ చెప్పారని బాధితురాలు పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కొత్వాలీ సిటీ పోలీసులు షకీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 2019లో కేంద్రం ట్రిపుల్ తలాక్ ఆచారం చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన విషయం తెలిసిందే. -
'పాక్‌కు ఎందుకు వెళ్లలేదు..?' టీచర్ అనుచిత వ్యాఖ్యలు..
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన ఘటన మరవక ముందే ఢిల్లీలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. దేశ విభజన సమయంలో పాక్‌కు ఎందుకు వెళ్లలేదని తమ టీచర్ ప్రశ్నించినట్లు నలుగురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సదరు టీచర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హేమా గులాటి, గాంధీ నగర్‌లోని ప్రభుత్వ సర్వోదయ బాల్ విద్యాలయాలో పనిచేస్తున్నారు. టీచర్ తమపై మతపరమైన వ్యాఖ్యలు చేసినట్లు నలుగురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాబా, మక్కా, ఖురాన్‌పై కూడా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో పాక్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించినట్లు చెప్పారు. స్వాతంత్య్ర సమరంలో ఎలాంటి పాత్ర పోషించకుండానే దేశంలో ఉంటున్నారని వ్యాఖ్యానించినట్లు విద్యార్థులు పోలీసులకు తెలిపారు. బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించారు. పాఠశాలల్లో ఇలాంటి విద్వేషాలకు తావివ్వకూడదని చెప్పారు. ఆ టీచర్ని స్కూల్ నుంచి బహిష్కరించాలని కోరారు. సరైన అవగాహన లేని విషయాలపై టీచర్లు మాట్లాడకూడదని చెప్పారు. విద్యార్థుల్లో వైషమ్యాలను కలిగించే విధంగా పాఠాలు ఉండకూడదని అన్నారు. ఈ ఘటనపై స్థానిక ఆప్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బాజ్పై ఈ ఘటనపై స్పందించారు. టీచర్ ఇలా మాట్లాడకూడదని అన్నారు. పిల్లలకు మంచి పాఠాలు చెప్పే విధంగా ఉండాలని చెప్పారు. మతాలపై టీచర్లు తమ సొంత వైఖరిని తరగతి గదిలో మాట్లాడకూడదని అన్నారు. ఆ టీచర్‌పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూపీలో ఇటీవల ఓ టీచర్ తరగతి గదిలో ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించింది. అయితే ఈ ఘటనలో తాను మతపరమైన ఉద్దేశంతో చేయలేదని చెప్పారు. విద్యార్థులకు బుద్ధి చెప్పే క్రమంలో ఇలా చేయాల్సి వచ్చిందని సమాధానమిచ్చుకున్నారు. ఇదీ చదవండి: Muzaffarnagar School Video Controversy: స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్ .. ఏం చెప్పిందంటే! -
15 తర్వాతే సమగ్ర నోటిఫికేషన్!
ప్రశ్నపత్రాల కూర్పు ఎవరికి? టీఆర్టీ పరీక్ష నిర్వహణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు ఇవ్వడమా? ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమా? అనే అంశంపై అధికారులు చర్చించారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తే పబ్లిక్ సర్విస్ కమిషన్ పరిధిలోకి తెచ్చే వీలుందని, ఆఫ్‌లైన్ విధానమైతే ఎస్సీఈఆర్టీకి అప్పగించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ఎస్సీఈఆర్టీకి ఇవ్వడమే సరైన నిర్ణయమని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) విధివిధానాల రూపకల్పనపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సమక్షంలో ఉన్నతాధికారులు సోమవారం ఈ అంశంపై చర్చించారు. ఒకటీ రెండు రోజుల్లో వీటిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. ప్రతి జిల్లాలోనూ డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఏర్పాటు, వాటికి ఇవ్వాల్సిన అధికారాలపై అధికారులు చర్చించినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. టీఆర్టీని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో డీఎస్సీలకు పరిమిత అధికారాలు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమన్వయం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. మరోవైపు పరీక్ష నిర్వహణ ప్రక్రియ మొత్తం రాష్ట్రస్థాయిలోనే కేంద్రీకృత వ్యవస్థలో నిర్వహించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. అవసరమైతే రాష్ట్రస్థాయి పరీక్ష నిర్వహణకు ప్రత్యేక సమన్వయ కర్తలను నియమించాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో టీఆర్టీ పరీక్షకు చట్టపరమైన అడ్డంకులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో విధివిధానాల తయారీలో న్యాయ కోవిదుల సలహాలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ సెపె్టంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆన్‌లైనా? ఆఫ్‌లైనా? పరీక్ష నిర్వహణ మొదలుకొని, నియామక ప్రక్రియ వరకూ ఎవరి బాధ్యత ఏమిటనే దానిపై తొలుత వెలువడే ప్రభుత్వ జీవోలోనే స్పష్టత ఇవ్వాలని వాకాటి కరుణ అధికారులకు సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పరీక్షల్లో ఏది ప్రయోజనం అనే అంశాన్నీ చర్చించారు. ఆన్లైన్ విధానంలో కొన్ని సమస్యలు వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు. టీఆర్టీ పరీక్ష భాషా పండితులకు, సబ్జెక్టు టీచర్లకు, ఎస్టీజీటీలకు విడివిడిగా నిర్వహిస్తారు. టీఆర్టీకి దరఖాస్తు చేసే వారి సంఖ్య దాదాపు 4 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ పరీక్ష విధానంలో ప్రశ్నపత్రం కూర్పు సమస్యలకు తావిస్తుందనే సందేహాలున్నాయి. ఒకేరోజు 4 లక్షల మందికి కంప్యూటర్ బేస్డ్గా పరీక్ష నిర్వహణ కష్టమని.ఒక్కో జిల్లాకు రెండు సెషన్స్ పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అదే ఆఫ్‌లైన్‌లో అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు పరీక్ష నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల ఫలితాల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పోస్టులు, వెయిటేజీపై ఇంకా అస్పష్టత సమగ్ర నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 తర్వాతే వెలువడే వీలుందని అధికారులు అంటున్నారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి? సబ్జెక్టుల వారీగా ఎన్ని ఉన్నాయి? రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన, బ్యాక్లాగ్ పోస్టుల సంఖ్యపై ముందుగా స్పష్టత రావాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎస్జీటీలకు, ఎస్‌ఏలకు ఉండే అర్హతలపైనా అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు టెట్ అర్హులకు ఇవ్వాల్సిన వెయిటేజీ పైనా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమగ్ర నోటిఫికేషన్ వెలువడేందుకు మరికొంత సమయం పట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
లెక్కల్లో జీరో స్కోర్.. ఇతర పేరెంట్స్‌కు స్ఫూర్తినిస్తున్న తల్లి సందేశం
పిల్లలు పరీక్షల సమయంలోనూ, వాటి ఫలితాలు వచ్చే సమయంలోనూ తెగ ఆందోళన చెందుతుంటారు. మంచి మార్కులకు రాకపోతే తల్లిదండ్రులతో తన్నులు తప్పవని భావిస్తుంటారు. అలాగే తక్కువ మార్కులు వస్తే టీచర్లు తిడతారని ఆందోళన చెందుతుంటారు. మార్కులు ఎలా ఉన్నా విద్యార్థులు తమ ప్రోగ్రస్ రిపోర్టును తల్లిదండ్రులకు చూపించాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో కొందరు విద్యార్థులు ప్రోగ్రస్ రిపోర్టులో మార్కులను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు తమ ప్రోగ్రస్ రిపోర్టును నిజాయితీగా తల్లిదండ్రులకు చూపిస్తారు. తాజాగా ఇదే అంశానికి సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియా ప్లాట్ఫారం X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది. దీనిని (@zaibannn) అనే పేరు కలిగిన అకౌంట్లో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ‘నా 6వ తరగతి పాత నోట్‌బుక్ దొరికింది. ఇది చూశాక నాకు స్కూలు రోజుల్లో మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయన్న విషయం మరోమారు గుర్తుకు వచ్చింది. అయితే అప్పుడు మా అమ్మ స్కోరు తక్కువ వచ్చిన ప్రతీ టెస్టులో పాజిటివ్ మెసేజ్ రాసేది’ అని రాశారు. ఆ పోస్టులోని వివరాల ప్రకారం ఆమె తల్లి మార్కులు రాసివున్న నోట్ బుక్‌లో సైన్ చేయడమే కాకుండా మెసేజ్ కూడా రాయడాన్ని మనం గమనించవచ్చు. మొదటి ఫొటోలో ‘ఇలాంటి రిజల్టు రావడానికి ధైర్యం కావాలి’ అని రాశారు. రెండవ ఫొటోలోనూ తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆమె తల్లి అలానే రాసింది. వీటిని కలిపి చూసినప్పుడు తల్లిదండ్రులంతా పిల్లలతో ఇలానే వ్యవహరించాలని, అప్పుడేవారు నిరాశ చెందకుండా, మంచి మార్కులు తెచ్చుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తారని దీనిని పోస్టు చేసిన యూజర్ రాశారు. ఇది కూడా చదవండి: నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు found my grade 6 math notebook and love how precious mother was signing every bad test with an encouraging note for me! pic.twitter.com/AEJc3tUQon — zainab (Taylor’s version) (@zaibannn) August 25, 2023 -
స్టూడెంట్‌పై దాడి వైరల్.. సమర్థించుకున్న టీచర్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాబాపూర్ గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలోని క్లాస్‌రూమ్‌లో ఆగస్టు 24న జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మ్యాథ్స్ టేబుల్ నేర్చుకోలేదని ఏడేళ్ల ముస్లిం బాలుడిని తోటీ విద్యార్ధులతో టీచర్ అమానుషంగా దాడి చేయించింది. కాగా ఈ వీడియోను బాలుడి బంధువు నదీవ్ అనే వ్యక్తి వీడియో తీశారు. ఇందులో టీచర్.. విద్యార్థి ముఖం మీద దాడి చేయవద్దని, వెన్నులో కొట్టాలని స్టూడెంట్స్‌కు చెప్పడం వినిపిస్తోంది. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత విద్వేషాలను రెచ్చగెట్టే విధంగా టీచర్ వ్యవహరించడం రాజకీయ దుమారాన్ని రేపింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ సహా పలువురు నేతలు ఈ చర్యను ఖండిస్తూ.. టీచర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దేవాలయంగా భావించే పవిత్రమైన పాఠశాలలో విద్యార్థుల్లో విద్వేషాలను నింపుతున్నారని.. అధికార బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "Main ne to declare kar diya hai Jitne Mohammad bacche Hain inko mar ke bhijao" : Lady Teacher, Tripta Tyagi, headmistress of Neha Public School , Mansurpuri, Muzaffarnagar, UP And the man has a Rascal's laugh..Ha...ha..ha The cost of being a Muslim Kid in India today pic.twitter.com/ZciNQKbxfz — ᎠϴΝ ⚽ (@_Jhon_D_N__30) August 25, 2023 తాజాగా ఈ వైరల్ వీడియోపై టీచర్ త్రిప్తా త్యాగి స్పందించారు. ముస్లిం విద్యార్థిపై దాడి చేసిన చర్యను ఆమె సమర్థించుకున్నారు. బాధితుడు 5వ గుణితం నేర్చుకోవాలని చెప్పానని.. సెలవులు వచ్చినా నేర్చుకోలేదని అన్నారు. అందుకే ఇతర విద్యార్థులతో కొట్టించానన్నారు. ఈ ఘటనలో మతపరమైన కోణాన్ని ఆమె కొట్టిపారేశారు. బాలుడు తన హోంవర్క్ చేయనందున అతన్ని కొట్టమని కొంతమంది విద్యార్థులను కోరినట్లు చెప్పారు. అతనితో కఠినంగా ఉండమని పిల్లల తల్లిదండ్రుల నుంచే ఒత్తిడి వచ్చిందన్నారు. తాను దివ్యాంగురాలు అవ్వడం వల్ల కొంతమంది విద్యార్థులతో కొట్టించానని చెప్పుకొచ్చారు. అయితే వీడియోను ఎడిట్ చేసి మతపరమైన కోణం వచ్చేలా బయడకు విడుదల చేశారని ఆమె ఆరోపించారు. విద్యార్ధి బంధువు క్లాస్‌లో కూర్చొని ఆ వీడియోను అతను రికార్డ్ చేశాడని తరువాత దాని ఎడట్ చేశాడని ఆన్నారు. విద్యార్ధిని ఉద్ధేశపూర్వకంగా కొట్టించలేదని.. తన తప్పును అంగీకరిస్తున్నానని చెప్పారు. కానీ అనవసరంగా దీనిని పెద్ద సమస్యగా మార్చవద్దని కోరారు. ‘ఇది చిన్న సమస్య అని రాజకీయ నాయకులకు చెప్పాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీతో సహా ఇతర నేతలు దీనిపై ట్వీట్ చేశారు. ఇది అంత పెద్ద విషయం కాదు. ఇలాంటి చిన్న విషయాలను వైరల్ చేస్తే టీచర్లు ఎలా పనిచేస్తారు.’ అని ఆమె ప్రవర్తనను వెనకేసొచ్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదైనట్లు ముజాఫర్‌నగర్ కలెక్టర్ అరవింద్ మల్లప్ప తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా చిన్నారికి, అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. A fake anti hindu propaganda is being run by Leftist Islamist gang and Anti Hindu Political leaders over Muzaffarnagar School incident Truth is: - There is no Hindu Muslim angle in this incident - Mslm kid didn't complete his homework - Teacher was worried abt studies of Mslm… pic.twitter.com/PMnjbmgDwd — STAR Boy (@Starboy2079) August 25, 2023 మరోవైపు టీచర్ కొట్టిపించడంపై బాధిత విద్యార్థి మాట్లాడుతూ.. ‘నేను గణిత పట్టికలు నేర్చుకోలేదు. నేను తప్పు చేశానని టీచర్ కొట్టమని చెప్పింది. తోటి విద్యార్థులతో కొట్టించింది. నాపై గట్టిగా దాడిచేయాలని ఆదేశించింది. వారు నన్ను గంటపాటు కొట్టారు’ అని వాపోయాడు. తన కొడుకు వయసు 7 ఏళ్లు అని, గంట, రెండు గంటలపాటు అతడిని చిత్రహింసలకు గురిచేశాడని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలపై ఆరోపణలు చేయనని.. అయితే ఇకపై తన బిడ్డను ఆ పాఠశాలకు పంపకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. Perhaps ppl on Twitter r deaf. In d video Tripta Tyagi can be clearly heard saying,"Why don't you hit hard?" What is wrong in this? Maybe she isn't getting full satisfaction. Every1 has a right to be satisfied. I stand with #Mrs_Tyagi,a teacher frm #Muzaffarnagar#मुस्लिम_बच्चे pic.twitter.com/rAbIFeVqwS — K.R.Tripathi🇮🇳🙏🚩 (@t97688663) August 25, 2023 ఇదిలా ఉండగా ముజఫర్ నగర్ వైరల్ వీడియోలో చెంప దెబ్బ కొట్టిన విద్యార్ధులతో బాధితుడిని కౌగించుకునేలా చేశారు రైతు సంఘాల నాయకుడు నరేష్ తికాయత్. అందరూ ద్వేషాన్ని వదిలేసి సోదరభావాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. कांग्रेस के स्थानीय नेताओं की पहल पर किसान नेता नरेश टिकैत ने #Muzaffarnagar की वायरल वीडियो में थप्पड़ मारने वाले छात्र और पीड़ित छात्र को गले मिलवाया. ख़ुशी की बात है कि सभी ने आगे बढ़कर भाईचारा क़ायम रखने के लिए नफ़रत को खुलकर नकारा है.pic.twitter.com/qfMzgiAgja — Aditya Goswami आदित्य गोस्वामी (@AdityaGoswami_) August 26, 2023 -
నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ పోలీసులు ఇద్దరు నకిలీ టీచర్లను అరెస్టు చేశారు. వీరు నకిలీ డాక్యుమెంట్ల సహాయంతో 14 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఈ టీచర్లిద్దరూ కాన్పూర్‌లోని దేహాత్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇంతేకాదు వీరిద్దరికీ ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించి, హెడ్మాస్టర్లను చేసింది. ఈ విషయం వెల్లడికావడంతో అటు విద్యావిభాగంతో పాటు ఇటు సామాన్యులలోనూ కలకలం చెలరేగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2009లో నకిలీ విద్యార్హతల ధృవపత్రాలతో అనిల్ కుమార్, బ్రజేంద్ర కుమార్‌లు టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. దేహాత్ పరిధిలోని ఝీంఝక్లో ఉంటున్న అనిల్ ములాయి ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్. అలాగే బ్రజేంద్ర కుమార్ షాహ్పూర్ మోహ్రా ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్గా ఉన్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బర్రా పోలీస్ ఇన్స్పెక్టర్ నూర్య బలిపాండే మీడియాతో మాట్లాడుతూ బర్రాకు చెందిన సందీప్ రాథౌడ్ ఏడాది క్రితం అంటే 2022లో గ్వాలియర్‌లో ఉంటున్న అతని బంధువు రాజీవ్ తనను మోసగించాడంటూ ఫిర్యాదు చేశాడన్నారు. రాజీవ్‌తో పాటు అతని తల్లి, సోదరి కలసి తనకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 34 లక్షలు తీసుకున్నారనని సందీప్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ పనిలో కాన్పూర్‌కు చెందిన రామ్‌శరణ్, అతని దగ్గర పనిచేసే ధర్మేంద్రల హస్తం కూడా ఉన్నదని పేర్కొన్నాడు. వీరంతా తాను టీచర్ అయ్యేందుకు కావలసిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని తెలిపాడు. అయితే ఇలా దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం చేసేందుకు సందీప్ నిరాకరించాడు. ఫలితంగా తన డబ్బు కూడా తిరిగి రాలేదని సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. రాజీవ్ నకిలీ ధృవపత్రాలతో ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు ఇప్పించినట్లు పోలీసులు గుర్తించారు. వారు అనిల్ కుమార్, బ్రజేంద్రలుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 14 ఏళ్లుగా కాన్పూర్‌లోని దెహాత్ పాఠశాలలో టీచర్లుగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పోలీసులు వీరికి సంబంధించిన రికార్డులు చెక్ చేయగా, వీరి దగ్గరున్నవి దొంగ సర్టిఫికెట్లని గుర్తించారు. దీంతో వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఈ విషయమై ఏడీసీపీ అశోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారని, వారు నకిలీ పత్రాలతో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు పొందారని గుర్తించామని తెలిపారు. అయితే వీరికి ఉద్యోగాలు ఇప్పించిన రాజీవ్ సింగ్ హైకోర్టు నుంచి అరెస్టు వారెంట్‌పై స్టే తెచ్చుకున్నాడన్నారు. ఈ ఉదంతంతో ప్రమేయం ఉన్న రామ్ కశ్యప్‌ను కొద్ది రోజుల క్రితమే అరెస్టు చేసి, జైలుకు తరలించామన్నారు. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
చదువురానివారు నాయకులైతే దేశం బాగుపడదు.. అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అనకాడమీ సంస్థకు చెందిన ఒక లెక్చరర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన విద్యార్థులతో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికి ఓటు వేయమని అభ్యర్ధించాడు. దీంతో ఆ సంస్థ క్లాస్రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే వేదిక కాదని చెబుతూ అతడిపై వేటు వేసింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ లెక్చరర్ చెప్పిన దాంట్లో తప్పేముందన్నారు. కరణ్ సంగ్వాన్ అనకాడమీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ ద్వారా ఆయన తన విద్యార్థులకు ఎన్నికల్లో విద్యావంతులైన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని ఓ వీడియోలో కోరారు. దీంతో ఆగ్రహించిన ఆ సంస్థ సహ యజమాని రోమన్ సైనీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటిస్తూ X వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై సంగ్వాన్ స్పందిస్తూ.. గత కొద్ది రోజులుగా నాకు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదంగా మారింది. నా తోపాటు జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధపడుతున్న నా విద్యార్థులు కూడా ఆ వీడియో వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న దానిపై వివరణ ఇస్తానని వెల్లడించారు. సంస్థ సహ యజమాని రోమా సైనీ X వేదికగా ఏమని రాశారంటే.. మా సంస్థకు చాలా కచ్చితమైన నియమ నిబంధనలున్నాయి. విద్యార్ధులకు నిశ్పాక్షిక జ్ఞానాన్ని అందించడమే మా కర్తవ్యం. క్లాస్రూమ్ అనేది వ్యక్తిగత అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే వేదిక కాదు. అవి విద్యార్ధులపై తప్పుడు ప్రభావం చూపుతాయి. సంస్థ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారం సంగ్వాన్ ను విధుల నుండి తొలగించామని తెలియజేశారు. ఈ ఉదంతంపై సాక్షాత్తు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ.. చదువుకున్న వ్యక్తికి ఓటు వేయమని అడగడం కూడా తప్పేనా? ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదు. ఇసి సైన్స్ అండ్ టెక్నాలజీ దూసుకెళ్తోన్న తరం. చదువురాని వారి ఆధునిక భారత దేశాన్ని నిర్మించలేరని అన్నారు. क्या पढ़े लिखे लोगों को वोट देने की अपील करना अपराध है? यदि कोई अनपढ़ है, व्यक्तिगत तौर पर मैं उसका सम्मान करता हूँ। लेकिन जनप्रतिनिधि अनपढ़ नहीं हो सकते। ये साइंस और टेक्नोलॉजी का ज़माना है। 21वीं सदी के आधुनिक भारत का निर्माण अनपढ़ जनप्रतिनिधि कभी नहीं कर सकते। https://t.co/YPX4OCoRoZ — Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2023 ఇది కూడా చదవండి: నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ -
హెచ్ఎం వేధింపులు.. జాబ్ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే!
గౌరిబిదనూరు(బెంగళూరు): తాలకాలోని దారినాయకనపాళ్య (డి పాళ్య) గ్రామంలోని ప్రభుత్వ కర్ణాటక పబ్లిక్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడైన రాజేశ్ కాంట్రాక్టు టీచర్‌ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అతని మాటలు వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నాడని దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఆమెను వేధించడమే కాకుండా అసభ్య పదజాలంతో దషిస్తున్నాడని సమితి నేతలు ఆరోపించారు. ఇది తెలిసి తాలకా విద్యాశాఖ అధికారి శ్రీనివాసమూర్తి అక్కడకు చేరుకుని నిరసనకారులతో చర్చించారు. హెచ్ఎం పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రమిచ్చారు. సర్వశిక్షా అభియాన్ అధికారి గంగారెడ్డి పాల్గొన్నారు. చదవండి కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం.. -
ప్రభుత్వ ఉపాధ్యాయురాలైనా.. వారి వలలో పడి.. భారీ మూల్యాన్ని చెల్లించింది..
మంచిర్యాల: నిరక్ష్యరాసులతో పాటు అక్షరాశ్యులు కూడా సైబర్ నేరాగాళ్ల వలలోపడి మోసపోతున్నారు. బెజ్జూర్ మండలంలోని కుంటాలమానెపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నైతం లతశ్రీ కౌటాల మండలంలోని ఇప్పలగూడ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ఫేస్బుక్లో వచ్చిన వ్యాపార ప్రకటనలోని ఫోన్ నంబర్లను సంప్రదించింది. ధనీ బ్యాంకు పేరుతో 9038683321 నంబర్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ఈ నెల 2న రూ.50 లక్షల రుణం మంజూరు చేస్తున్నట్లు ఫోన్‌ద్వారా సందేశం పంపించారు. దీంతో పాటు సైబర్ నేరగాళ్లు ఆధార్, పాన్‌కార్డుతో పాటు ఆమె ఖాతా నంబర్ కలిగిన రూ.50 లక్షల బ్యాంకు చెక్కు వంటి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను వాట్సాప్ ద్వారా పంపించారు. వివరాలను పోల్చి చూసిన బాధితురాలు వారిని నమ్మి లావాదేవీలు జరిపారు. ఆగస్టు 2 నుంచి 11వ తేదీ వరకు పలు దఫాలుగా రూ.1.70 లక్షల నగదును పేటీఎం, ఫోన్‌పేల ద్వారా చెల్లించారు. మరిన్ని చార్జీలు చెల్లిస్తేనే రూ.50 లక్షల రుణం మీ ఖాతాలో జమ అవుతుందని సదరు వ్యక్తులు తెలపడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. కౌటాల ఎస్సై మధుకర్, సీఐ సాధిక్పాషాలకు ఫిర్యాదు చేయడంతో సైబర్ విభాగంలో ఫిర్యాదును నమోదు చేశారు. -
ఇదేం పాడు పని.. విద్యార్థులను గదికి పిలిపించి చేతులు, కాళ్లు
తిరువొత్తియూరు(చెన్నై): మేట్టూరు సమీపంలో పాఠశాల విద్యార్థులను మసాజ్ చేయమని వేధించిన ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని కొలతూరు పంచాయతీలో యూనియన్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ 144 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు రాజా ఐదవ తరగతి విద్యార్థులను తన గదికి పిలిపించి చేతులు, కాళ్లు పట్టాలని, మసాజ్ చేయాలని వేధిస్తున్నాడు. దీనిపై పిల్లలు తల్లిదండ్రులకు తెలిపారు. తల్లిదండ్రులు గురువారం పాఠశాలను ముట్టడించారు. సమాచారం అందుకున్న ఆర్డీవో తనికాచలం, తహసీల్దారు ముత్తురాజా, ఎంఈవో చిన్నరాసు అక్కడికి చేరుకుని విచారించారు. తల్లిదండ్రులు మళ్లీ మేట్టూరు – మైసూరు రోడ్డులో ఆందోళనకు దిగారు. మేట్టూర్ మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని ప్రధానోపాధ్యాయుడు రాజాను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చదవండి: పుట్టింటికి వెళ్తున్నానని ప్రియుడితో కలిసి సహజీవనం.. భర్తకు తెలియడంతో! -
యూనిఫామ్ వేసుకొని పాఠాలు చెప్పే పంతులమ్మ.. ఫుల్ అటెండెన్స్
రాయ్‌పూర్‌లో ఒక టీచర్ పిల్లల్ని వినూత్నంగా ఆకట్టుకుంటోంది. వారానికి ఒకసారి వారిలాగే యూనిఫామ్ ధరించి స్కూల్‌కు వస్తోంది. ‘నేనూ మీలో ఒకదాన్నే’ అనే భావన కలిగించడమే కాదు... టీచర్ అంటే కొట్టే తిట్టే మనిషి కాదనే భరోసా ఇస్తోంది. దీంతో పిల్లలు ఫుల్లుగా స్కూల్‌కు అటెండ్ అవుతున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి ఆమె చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం అందరి ప్రశంసలు పొదుతోంది. రాయ్‌పూర్ (చత్తిస్గఢ్)లోని గోకుల్‌రామ్ వర్మ ప్రైమరీ స్కూల్ అనే ప్రభుత్వబడిలో వారమంతా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. శనివారం ఇంకా ఉత్సాహంగా ఉంటారు. దానికి కారణం ఆ రోజు ఆ స్కూల్ టీచర్ జాహ్నవి యదు వారిలాగే తయారయ్యి వారిలాగే యూనిఫామ్ వేసుకుని వస్తుంది. ఆ రోజు కుర్చీలో కూచోదు. వారి మధ్య కూచుని పాఠాలు, కబుర్లు చెబుతుంది. వారితో సంభాషిస్తుంది. అందుకే పిల్లలందరికీ జాహ్నవి యదు టీచర్ అంటే ఇష్టం. కొత్త ఆలోచన గోకుల్ రామ్ వర్మ ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 వరకూ చదివే 350 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఆ చుట్టుపక్కల బస్తీవాసుల పిల్లలు. వారి తల్లిదండ్రులకు పెద్దగా చదువు లేదు. పిల్లలకు క్రమశిక్షణ అంటే తెలియదు. స్కూల్‌కు రోజూ రావడం ఇష్టం ఉండదు. యూనిఫామ్ వేసుకోరు. గత సంవత్సరం ఇదే బడిలో టీచర్‌గా చేరిన 30 ఏళ్ల జాహ్నవి యదు ఇదంతా గమనించింది. వారితో తిప్పలు పడింది. దారిలో పెట్టలేక సతమతమయ్యింది. ఈ సంవత్సరం అంటే 2023 జూన్‌లో స్కూల్ రీ ఓపెన్ అయినప్పుడు జాహ్నవి యదు కొత్త ఆలోచన చేసింది. హఠాత్తుగా ఒకరోజు వారిలాగా యూనిఫామ్ వేసుకుని వచ్చింది. పిల్లలు ఆశ్చర్యపోయారు. గుమిగూడారు. నవ్వారు. ఆనందించారు. ‘ఎందుకు టీచర్ ఇలా వేసుకొచ్చావ్’ అనంటే ‘స్కూల్‌కి మీరు ఇలాగే రావాలి. అందుకని వేసుకొచ్చా. మనందరం ఒక టీమ్. మనందరం సూపర్‌గా చదువుకోవాలి’ అని వారిని ‘మనం’ చేశాక వాళ్లు సంతోషించారు. టీచర్లా యూనిఫామ్ వేసుకురావాలని వారికీ అనిపించింది. టీచర్ కోసం రోజూ స్కూల్‌కి రావాలని కూడా. అన్నీ ప్రశంసలే జాహ్నవి యదు వారానికి ఒకరోజు అంటే ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్‌లో రావడం రాయ్‌పూర్ అంతా పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు చర్య వల్ల పిల్లలు బెరుకు లేకుండా తమ మనసుల్లో ఉన్నది చెప్పుకుంటున్నారని స్కూల్ అనేది టీచర్లు చావబాదే స్థలం కాదని తెలుసుకుని క్లాసులకు హాజరవుతున్నారని ఊరు మొత్తం తెలిసింది. అందరూ జాహ్నవి యదును అభినందిస్తున్నారు. ‘టీచర్లూ పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం’ అని జాహ్నవి యదు చెప్పింది. అయితే ఇలాంటి బట్టల్లో రావడానికి ఆమె కొంచెం ఆలోచించింది– అత్తామామలు ఏమంటారోనని. కాని వారు అంగీకరించి దూసుకుపో కోడలు పిల్లా అని ఉత్సాహపరిచారు. దాంతో జాహ్నవి యదు పిల్లలతో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతూ దారిలో పెడుతోంది. ఫేవరెట్ టీచర్ కొందరు టీచర్లు తమ కెరీర్ మొత్తం ఏ క్లాస్‌కీ ఫేవరెట్ టీచర్ కాకుండానే రిటైర్ అయిపోతారు. కొందరు టీచర్లు ప్రతి సంవత్సరం ఎంతోమంది పిల్లలకు ఫేవరెట్ టీచర్ అవుతారు. పిల్లలతో బంధం వేసుకోవడం టీచర్‌కు చాలా ముఖ్యం. అందులో ఎంతో ఆత్మతృప్తి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ మొత్తానికి ఫేవరెట్ టీచర్ అయిన జాహ్నవి యదుని చూసి తాము కూడా పిల్లల కోసం ఏదైనా చేద్దామా అనుకుంటున్నారు మిగిలిన టీచర్లు. అది చాలదూ? టీచర్లూ, పిల్లలూ బడిలో సమానమే అనే భావన వ్యాప్తి చేయడమే నా ఉద్దేశం. – జాహ్నవి యదు -
ఛీ.. ఇదేం పాడు పని..స్పెషల్ క్లాసులు అని చెప్పి బాలికలతో..
వంగర: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు పాఠశాలలో పనిచేస్తున్న ఎన్ఎస్ ఉపాధ్యాయుడు బండి రాముడుపై వంగర పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కుమర్తెతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర ఆదేశాల మేరకు సంతకవిటి ఎస్సై బుడుమూరు లోకేశ్వరరావు వంగర చేరుకుని విచారణ చేపట్టారు. ప్రత్యేక తరగతుల పేరిట ముందస్తుగా పాఠశాలకు రావాలని చెప్పడం, అందరిలో బాలిక పట్ల వికృత చేష్టలు చేసిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టుచేసిన ఉపాధ్యాయుడు వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసేవాడని బాధిత బాలిక తల్లిదండ్రులు విచారణలో తెలియజేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు. ఎన్.ఎస్.ఉపాధ్యాయుడు బండి రాముడుపై సస్పెన్షన్ విధిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేసినట్లు పాఠశాల హెచ్ఎం ముద్దాడ రమణమ్మ తెలిపారు. అభంశుభం తెలియని బాలికపై అసభ్యకరంగా వ్యవహరించి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ కోరారు. పాఠశాలలో జరిగిన విషయాన్ని తెలుసుకుని హుటాహుటిన ఆయన పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఎస్సై లోకేశ్వరరావుతో మాట్లాడారు. -
ఎస్సైగా ఉపాధ్యాయురాలు ఎంపిక
ఆదిలాబాద్: మండలంలో ని నిగ్వా గ్రామానికి చెందిన జాడే సుస్మిత ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఆమె ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సైగా ఎంపికై ంది. తల్లిదండ్రులు మీనాక్షి, నాందేవ్‌లు హర్షం వ్యక్తం చేశారు. -
ఉపాధ్యాయుని సమయస్పూర్తితో దక్కిన 40 మంది పిల్లల ప్రాణాలు
-
78 ఏళ్ల తాతకు నైన్త్‌లో అడ్మిషన్.. స్కూలుకు ఎలా వెళుతున్నాడంటే..
మిజోరంనకు చెందిన 78 ఏళ్ల తాత భుజానికి స్కూలు బ్యాగు ధరించి, యూనిఫారం వేసుకుని క్రమం తప్పకుండా రోజూ స్కూలుకు వెళుతున్నాడు. ఇదేమీ జోక్ కాదు.. ముమ్మాటికీ నిజం. నార్త్ ఈస్ట్ లైవ్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం మిజోరంలోని చమ్ఫాయి జిల్లాలోని హువాయికాన్ గ్రామానికి చెందిన లాల్‌రింగథర కథ ప్రతీ ఒక్కరికీ స్ఫూరిగా నిలుస్తుంది. ప్రస్తుతం లాల్‌రింగథర హువాయికోన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాడు. 1945లో భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో జన్మించిన లాల్‌రింగథర తన తండ్రి మరణించిన కారణంగా 2వ తరగతిలోనే చదువును విడిచిపెట్టాల్సి వచ్చింది. వారి ఇంటిలో అతనొక్కడే సంతానం అయిన కారణంగా తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, కూలీనాలీ చేస్తూ జీవనం కొనసాగించాడు. ఉపాధి రీత్యా ఒకచోట నుంచి మరో చోటుకు మారి, చివరకు 1995లో న్యూ హువాయికాన్ గ్రామంలో స్థిరపడ్డాడు. ఉదరపోషణ కోసం ఈ వయసులోనూ స్థానిక ప్రోస్బిటేరియన్ చర్చిలో గార్డుగా పనిచేస్తున్నాడు. తన ఆర్థిక పరిస్థితుల కారణంగా పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాననే బాధ అతనిని నిత్యం వెంటాడేది. అలాగే ఆంగ్లంలో నైపుణ్యం సంపాదించాలని, ఆంగ్ల భాషలోని వివిధ దరఖాస్తులను నింపాలనేది అతని లక్ష్యం. అందుకోసమే ఈ వయసులోనూ అతను పాఠశాలకు వెళుతున్నాడు. లాల్‌రింగథర మీడియాతో మాట్లాడుతూ ‘నాకు మిజో భాష చదవడంలోనూ, రాయడంలోనూ ఎటువంటి సమస్య లేదు. అయితే చదువుకోవాలనేది నా అభిలాష. ఆంగ్ల భాష నేర్చుకోవాలనేది నా తీరని కోరిక. నేటి రోజుల్లో ఎక్కడ చూసినా ఆంగ్ల పదాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు నేను ఇబ్బంది పడుతుంటారు. అందుకే నేను ఆంగ్ల భాషను నేర్చుకోవాలనే తపనతో రోజూ స్కూలుకు వెళుతున్నాను’ అని తెలిపాడు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వన్లాల్‌కిమా మాట్లాడుతూ ‘లాల్‌రింగథర అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచాడు’ అని అన్నారు. కాగా లాల్‌రింగథర ప్రతిరోజూ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం నడిచి, స్కూలుకు చేరుకుంటాడు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్‌తో ప్రేమజంటకు రెక్కలు.. -
ప్లీజ్ మాకు టీచర్ ను పంపించండి
-
లక్షల్లో ఉత్తీర్ణులు.. వేలల్లో పోస్టులు, ఇదేం తీరు సర్కారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెట్‌లో అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22 వేల వరకే ఉన్నాయి. లక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించేవారు. దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నవారు కూడా ఉద్యోగాలు మానేసి టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేరాలేదు. ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్‌ను ముందుకు తెచ్చారనే విమర్శలొస్తున్నాయి. కోర్టు స్టేతో ఆగిన పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తే దాదాపు 12 వేల పోస్టులు ఖాళీ అవుతాయి. ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన పోస్టులు, కొత్తవి కలుపుకుంటే 22 వేల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తవ్వకుండానే కోర్టు స్టేతో ఆగిపోయింది. కనీసం పదోన్నతులు అయినా ఇవ్వొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించినా, అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని నిరుద్యోగులు అంటున్నారు. టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా ప్రయోజనం ఏముంటుంది. టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా టీఆర్టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
పాన్ కార్డ్ స్కాం: టీచర్ చనిపోయిన పదేళ్లకు రూ.7 కోట్ల ట్యాక్స్ నోటీసు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ కుటుంబానికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఆ కుటుంబానికి చెందిన స్కూల్ టీచర్ పేరిట రూ.7 కోట్ల ట్యాక్సీ నోటీసు వచ్చింది. అయితే.. ఆ టీచర్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఈ నోటీసులు రావడం గమనార్హం. 2013లో ఆ టీచర్ చనిపోగా.. 2017-18 ఏడాదికి గాను ఆమె పేరిట ఇంత మొత్తంలో పన్ను వసూలు నోటీసులు వచ్చాయి. ఉషా సోని మధ్యప్రదేశ్‌లోని పట్కేటా గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. జులై 26న ఆమె పేరిట రూ.7.55 కోట్ల ట్యాక్సీ వసూలుకు చెందిన ఆదేశాలు ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుమారుడు పవన్ సోనీ.. మాట్లాడుతూ..' 2013 నవంబర్ 16న మా తల్లి చనిపోయింది. న్యాచురల్ కాస్టింగ్ సంస్థ పేరుపై ముడి సరుకులు కొనుగోలుకు సంబంధించి ఈ ట్యాక్స్ చెల్లించాలని నోటీసులో ఉంది. కేసు నమోదు చేశాము. మా అమ్మ పాన్ కార్డులను ఎవరో దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరో మాకు తెలియదు.' అని అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఒక్క కుటుంబమే కాదు. అనేక కుటుంబాలకు ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. గిరిజన ప్రాంతాలైన బేతూల్ జిల్లాలో దాదాపుగా 44 మందికి ఇలాంటి నోటీసులు వచ్చాయి. దాదాపు రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు నోటీసులు వచ్చాయి. నితిన్ జైన్ అనే మరోవ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. నెలకు రూ.5 నుంచి 7 వేల వరకు సంపాదించే సామర్థ్యం గల ఇతనిపై రూ.1.26కోట్ల పన్ను వసూలుకు సంబంధించిన నోటీసులు వచ్చాయి. తమిళనాడులోని కోర్టల్లమ్‌లో తన పేరుపై ఓ అకౌంట్ ఉంది. ఈ పేరును ఇదే మొదటిసారి వినడమని నితిన్ తెలిపారు. 2014-15 మధ్య తన పేరుపై అకౌంట్ ఓపెన్ అయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఘటనలపై బేతూల్ ఎస్పీ సిద్ధార్ద చౌదరి స్పందించారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: జైపూర్ కాల్పుల ఘటన.. ఆ రోజు రాత్రి రైలులో ఏం జరిగింది..? -
వీడియో వైరల్.. పాఠాలు చెబుతున్న రోబో టీచర్ .. ప్రపంచంలోనే తొలిసారి..
బెంగుళూరు: బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో కృత్రిమ మేధస్సుకు పట్టం కడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో టీచర్‌ను పరిచయం చేశారు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తున్న ఈ రోబో టీచర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధిస్తారు. రోబో పాఠాలు చెబుతున్న వీడియో సామజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ తరహా ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేయబడిన రోబోట్ టీచర్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. రోబోట్ టీచర్ ఖచ్చితత్వం నూటికి నూరు శాతం ఉంటుందని తప్పులు చెప్పే ప్రసక్తే లేదని చెబుతున్నారు దీని రూపొందించిన కృత్రిమమేధస్సు నిపుణులు మిస్టర్ రావ్, మిస్టర్ రాహు. బెంగుళూరుకు చెందిన ఈ ఇద్దరు కృత్రిమమేధస్సు నిపుణులు మాట్లాడుతూ విద్యార్థులు కమాండ్ ద్వారా ఈ రోబోట్ ను ప్రశ్నలు అడిగి ఖచ్చితమైన సమాధానాలు పొందవచ్చని చెబుతున్నారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ భవిష్యత్తులో రోబోట్ టీచర్లు ఉపాధ్యాయుల నియామకాన్ని భర్తీ చేసినా ఆశ్ఛరైపోనక్కరలేదంటున్నారు. దీనికి సాధారణ సెలవులు, ప్రత్యేక సెలవులు, వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, పితృత్వ సెలవులు ఏమీ ఉండవని.. ఏడాది పొడవునా పాఠాలు చబుతూనే ఉంటుందని చెబుతున్నారు. బెంగుళూరు ఇండస్ పాఠశాలలో పాఠాలు చెబుతోన్న ఈ రోబోట్ పంతులమ్మ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోబో టీచరమ్మ పాఠాలు చెప్పడమే కాదు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతోంది. World's first ROBOT teacher designed by Indian AI experts,started teaching at Bangalore in INDUS school.This 5 feet 7 inch ROBOT teaches Physics,Maths, Biology & Chemistry.This AI Robot teacher is First of it's kind in the world.The Precision is 100% & no margin for error. pic.twitter.com/WNPkTPb3m2 — SHAFAAT SHAH (@INFANTRY28) February 27, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో ఘోరం.. కుప్పకూలిన గిర్డర్ లాంచర్.. 15 మంది మృతి -
పిల్లలకు ఒత్తులు, దీర్ఘాలు నేర్పేందుకు.. ‘ఏం ఐడియారా బాబూ’ అంటున్న జనం!
నగరాల్లోని స్కూళ్లు హైటెక్‌గా మరిపోయాయి. గ్రామాల్లోని స్కూళ్లు ఇంకా ఆధునికతను సంతరించుకోలేదు. అయితే గ్రామీణ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అవసరమైన సులభ పద్ధతులను ఆవిష్కరించడంలో అక్కడి ఉపాధ్యాయులు ముందుంటున్నారనే పలు ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. పాటల రూపంలో చిన్నారులకు ఏబీసీడీలు నేర్పడం, పాఠాలు బోధించడం వంటివి చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇటువంటి వీడియోలు కనిపిస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక విద్యార్థి చేతితో ఒక కర్రపట్టుకుని కనిపిస్తాడు. ఆ కర్రకు పైభాగాన హిందీలో ‘క’ అనే అక్షరం రాసివుంటుంది. మరోవైపు బ్లాక్‌బోర్డుపై దీర్ఘాలు, ఒత్తులు రాసివుంటాయి. ఆ విద్యార్థి ‘క’ అక్షరాన్ని ప్రతీ దీర్ఘం, ఒత్తు ముందు చూపిస్తూ, దానిని ఉచ్ఛరిస్తుంటాడు. అనంతరం క్లాసులోని మిగిలిన విద్యార్థులు ఆ అక్షరాన్ని ఉచ్ఛరిస్తుంటారు. ఈ వీడియో రికార్డు స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ట్విట్టర్లో @Ankitydv92 పేరుగ గల అకౌంట్లో జూలై 27న షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 4 లక్షలకు మించిన వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్ దీనిని అద్భుతమైన క్రియేటివిటీ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: చేతులతో మలం ఎత్తుతూ.. ఏటా ఎంతమంది మరణిస్తున్నారంటే..? बढ़िया जुगड़ सेट किए हैं गुरु जी... प्रणाम 🙏 pic.twitter.com/Szh1Wb94kb — Ankit Yadav Bojha (@Ankitydv92) July 27, 2023 -
తప్పతాగి పాఠశాలకు వెళ్లి.. ఛీ, విద్యార్థుల ముందే బట్టలు విప్పి...
లక్నో: విద్యార్థులకు చదువుతో వారికి మంచి చెడులను కూడా బోధించే వాడే ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఓ గౌరవం ఉంది. అయితే ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం ఛీ ఇవేం పనులు అనుకునేలా తప్పతాగి పాఠశాలకు వెళ్లడమే కాకుండా తరగతి గదిలోనే ఆదమరిచి నగ్నంగా నిద్రపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బహ్రైచ్ జిల్లాలోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశేశ్వరగంజ్ బ్లాక్‌లోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో దుర్గా ప్రసాద్ జైశ్వాల్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులు క్రితం ఫూటుగా మద్యం సేవించి పాఠశాలకు వెళ్లాడు. విద్యార్థుల మందే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా నిద్రపోయాడు. ఇదంతా కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ముందు దుర్గా జైస్వాల్ అనుచిత ప్రవర్తన గురించి తెలిసి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆ ప్రధానోపాధ్యాయుడు తరచూ ఇలాంటి చర్యలను పాల్పడేవాడని ఆరోపించారు. ఇటువంటి చేష్టలతో ఇబ్బంది పడిన విద్యార్థినులు కొందరు పాఠశాలకు వెళ్లడం మానేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై చర్య తీసుకున్న ప్రాథమిక శిక్షా అధికారి (బిఎస్ఎ) బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌తో విచారణకు ఆదేశించడంతో పాటు దుర్గా జైస్వాల్‌ను సస్పెండ్ చేశారు. అతడిపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని.. అవసరమైతే, ప్రధానోపాధ్యాయుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. చదవండి జేసీబీతో ఏటీఎంపై దాడి.. దోపిడీకి దొంగల యత్నం -
ఊహించని గిఫ్ట్ ఇచ్చిన విద్యార్థులు.. చూడగానే టీచర్ ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు
చెన్నై: తల్లి, తండ్రి, గురువు అంటారు.. వీళ్లు ముగ్గురు జీవితంలో చాల కీలకమైన వాళ్లుగా మన పెద్దలు చెబుతుంటారు. తల్లిదండ్రులు నీకు ఆలనాపాలనా చూస్తే , గురువులు నీకు విద్యా బుద్దులు నేర్పించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి గురువుకి కొందరు విద్యార్థులు ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా ఊహించిన బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ ఘటన తిరువారూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి తమ గుర్తుగా ఓ చిరు కానుకను అందజేశారు. తిరువారూరు జిల్లా ముత్తుపేట సమీపంలోని అలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రామన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన 1988 జూన్ 27న ఈ స్కూల్లో చేరి శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ క్రమంలో రామన్ ఉద్యోగ విరమణ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని మాలంగాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. ఆయనకు రూ.లక్ష విలువైన ద్విచక్ర వాహనాన్ని బహుమతిగా అందజేశారు. ఉపాధ్యాయుడు రామన్‌ను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. విద్యార్థులు తనపై చూపిన ప్రేమకు ఆ ఉపాధ్యాయుడికి ఆనందంతో కంట కన్నీళ్లు ఆగలేదు. చదవండి: బస్సు వైపు కోపంగా దూసుకొచ్చిన ఏనుగు.. ఇదే చివరి రోజు అనుకున్నారు.. కానీ ఫైనల్‌గా -
ఊపిరి తీసిన బదిలీ బాధ
కర్ణాటక: ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న స్కూల్ నుంచి మరోచోటుకు బదిలీ కావడంతో ఆ ఉపాధ్యాయురాలు తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. ఈ విషాద సంఘటన కోలారు జిల్లా కేజీఎఫ్ తాలూకాలో చోటుచేసుకుంది. వివరాలు... కేజీఎఫ్‌లో ప్రభుత్వ తమిళ పాఠశాలలో టీచర్‌గా నిర్మలాకుమారి ఉద్యోగం చేస్తున్నారు. ఇందులో విద్యార్థుల హాజరు తక్కువగా ఉన్నందున ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా కొందరు టీచర్లను ఇతర పాఠశాలలకు బదిలీ చేశారు. నిర్మలాకుమారి (49)ని శ్రీనివాసపురం తాలూకా సోమయాజులపల్లి ప్రభుత్వ పాఠశాలకు బదిలీ చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నిర్మలాకుమారి మైసూరు ఆస్పత్రిలో గతంలో కిడ్నీ మార్పిడి చేసుకున్నారు. తనను ఆరోగ్య సమస్య దృష్ట్యా బదిలీ చేయవద్దని కౌన్సెలింగ్ సమయంలో ఆమె ఉన్నతాధికారులకు విన్నవించారు. అయితే శ్రీనివాసపురంలో అవసరం ఉందంటూ బదిలీ చేశారు. పాఠశాలను చూసి వస్తూ.. నిర్మలాకుమారి శనివారం సోమయాజులపల్లి పాఠశాలను చూసి వద్దామని కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. నిత్యం ఇంతదూరం రావాలా అని మానసిక ఆవేదనకు గురైంది. తిరిగి వస్తుండగా మార్గమధ్యలో అస్వస్థతకు గురై మరణించింది. విద్యార్థి– టీచర్ నిష్పత్తి (పీటీఆర్)ని అనుసరించి ఉపాధ్యాయులను బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే నియమాలను పాటించారని బీఈఓ చంద్రశేఖర్ తెలిపారు. -
ఇష్టమొచ్చినట్టు పోక్సో చట్టం.. స్కూలు మాష్టారుపై కేసు నమోదు..
బెంగుళూరు: పోక్సో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దీన్నీ సద్వినియోగం చేసుకునేవారు కంటే దుర్వినియోగం చేసేవారి సంఖ్యే ఎక్కువగా ఉందని బాంబే హైకోర్టు సీరియస్ అయ్యిన విషయం తెలిసిందే. అంతలోనే కర్ణాటక తుంకూరు జిల్లాలోని ఓ పాఠశాల అధ్యాపకునిపై హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్న కారణంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు చిక్కనాయకనహళ్లి పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోడెకెరె ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు హెచ్.ఎస్.రవి విద్యార్థులకు ఎక్కువగా హోంవర్క్ ఇస్తూ వేధిస్తున్నారని, హోంవర్క్ చేయకపోతే కఠినంగా శిక్షిస్తున్నారని పిల్లలు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో పిల్లలు స్కూలుకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారని, వారిని ఇంతగా వేధిస్తున్నందుకు అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తలిదండ్రులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. హోంవర్కు ఎక్కువగా ఇచ్చి పిల్లలను వేధిస్తున్నందుకు గాను సదరు లెక్కల మాస్టారుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అసలే పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారని బాంబే హైకోర్టు ఇటీవల మొట్టికాయలు మొట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంటు కల్పించుకుని ఈ చట్టంలో తగిన సవరణలు చెయ్యాలని కోరుతూ ఒక కేసులో నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కేసు గురించి తెలిస్తే బాంబే హైకోర్టు ఇంకెంత సీరియస్ అవుతుందో మరి. ఇది కూడా చదవండి: పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు -
టీచరే బడిదొంగ... ఇరవై ఏళ్లుగా డుమ్మా!
స్కూలుకు డుమ్మా కొట్టే స్టూడెంట్స్‌ను చూసి ఉంటారు. కానీ, టీచర్ని ఎప్పుడైనా చూశారా! ఫొటోలో కనిపిస్తున్న ఈ టీచర్ ఒక రోజు కాదు, వారం కాదు.. ఏకంగా ఇరవై సంవత్సరాలు స్కూలుకు డుమ్మా కొట్టింది. ఇటలీకి చెందిన సింజియా పలైన డిలియో, వెనిస్లోని ఓ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పనిచేస్తుంది. ఇరవై నాలుగు సంవత్సరాల తన ఉద్యోగ జీవితంలో తను స్కూలుకెళ్లింది కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే! అనారోగ్య సెలవులు, కుటుంబ సెలవులు, అనుమతి సెలవులు వంటి వివిధ రకాల సెలవులు పెట్టి, డుమ్మా కొట్టేది. వీటిల్లో కొన్ని రికార్డుల్లో ఉంటే, చాలా వరకు సెలవులు రికార్డుల్లోనే లేవు. ఈ మధ్యనే స్కూల్ ఇన్స్పెక్టర్లు లియో బోధనను పరిశీలించినపుడు, ఆమె గందరగోళంగా పాఠాలను బోధించింది. తర్వాత పనితీరుపై పరీక్ష నిర్వహించినపుడు, విద్యార్థుల నుంచే లియో పుస్తకాలను సేకరించడం గమనించి, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. లియో ఇందుకు ఒప్పుకోలేదు. ఉద్యోగం తిరిగి సాధించుకోవడానికి కోర్టులో కేసు వేసింది. కోర్టు కూడా లియో దాదాపు రెండు దశాబ్దాలు స్కూలుకు హాజరు కాలేదని గుర్తించింది. ‘ఆమెతన ఉద్యోగం తిరిగి పొందలేదు’ అని తీర్పు ఇవ్వడంతో, ఇది కాస్త వైరల్‌గా మారింది. (చదవండి: చిన్నపిల్లలే!.. వారికేం తెలియదు అనుకుంటే..పప్పులో కాలేసినట్లే..) -
ఉపాధ్యాయుడు దారుణ హత్య
రాజాం సిటీ: మండలంలోని కొత్తపేట గ్రామ సమీపంలో ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ(58) దారుణ హత్యకు గురయ్యాడు. తొలుత ఉపాధ్యాయుడి మృతిని అంతా ప్రమాదంగా భావించి, బంధువులకు సమాచారమిచ్చారు. మరోవైపు విషయం తెలుసుకున్న రాజాం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతిపై ఆరాతీశారు. రక్తపు మడుగులో ఉపాధ్యాయుడి మృతదేహం, అతడి ముఖంపై గాయాలు ఉండడంతో దానిని హత్యగా గుర్తించారు. స్థానికులతో పాటు ఉపాధ్యాయుడి స్వగ్రామంలో కూడా దర్యాప్తు చేయగా ఉపాధ్యాయుడు హత్యకు గురైనట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. రాజాం పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసముంటున్న ఏగిరెడ్డి కృష్ణ తెర్లాం మండలంలోని కాలంరాజుపేటలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఎప్పటిలాగే పాఠశాలకు బయలుదేరిన ఆయన కొత్తపేటకు దగ్గరలో హత్యకు గురయ్యాడు. మృతదేహం రోడ్డు పక్కనే బొలెరో వాహనం వద్ద పడి ఉంది. స్థానికులు ఈ విషయాన్ని రాజాం పోలీసులకు తెలియజేయగా, అక్కడికి చేరుకున్న పోలీసులు కృష్ణ మృతదేహాన్ని గుర్తించి, బంధువులకు విషయం తెలియజేశారు. అక్కడికి చేరుకున్న బంధువులు మృతదేహంపై పడి బోరున విలపించారు. ఫిర్యాదులో ఏముంది.. తాము కొంతకాలంగా రాజాంలోని గాంధీనగర్‌లో ఉంటున్నామని, తన తండ్రి కృష్ణ 1998లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందారని కృష్ణ కుమారుడు శ్రావణ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతకుముందు తమ స్వగ్రామం తెర్లాం మండలం, ఉద్దవోలులో రెండు పర్యాయాలు సర్పంచ్‌గా గెలుపొంది, సేవలందించారన్నారు. ఉద్యోగం రావడంతో రాజాంలో ఉండి, ప్రశాంత జీవనం గడుపుతున్నామని, పరోక్షంగా గ్రామంలో రాజకీయాలకు మద్దతుగా నిలుస్తుండేవాడన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందిన వ్యక్తికి తన తండ్రి మద్దతు ఇచ్చాడని, దీనిని ఓర్వలేక ప్రత్యర్థివర్గమైన మరడాన వెంకటనాయుడు, మరడాన మోహనరావు, మరడాన గణపతి, మరడాన రామస్వామిలు మా నాన్నపై కక్ష పెంచుకున్నారని పేర్కొన్నారు. ఎప్పటిలాగే మా నాన్న శనివారం స్కూల్‌కు వెళ్తుండగా, ఇదే అదునుగా భావించిన దుండగులు హత్యకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మీ సాయం కోరే చిన్నారులం
సాక్షి, హైదరాబాద్: నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆవేదన దీక్ష తల్లిదండ్రులతో పాటు చిన్నారుల, వృద్ధుల వేడుకోళ్లతో ఉద్విగ్నవాతావరణంలో సాగింది. 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి పిల్లలు, వయోధికులైన వారి తల్లిదండ్రులు కూడా దీక్షకు తరలివచ్చారు. స్పౌజ్ బదిలీలు నిర్వహించి తమ తల్లిదండ్రులను, కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆవేదన చెందడం అందరినీ కలచివేసింది. తమ తల్లిదండ్రుల బదిలీలు జరగకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న ఇబ్బందులను పిల్లలు కన్నీటి రోదనల మధ్య వివరించారు. ఇప్పటికైనా తమ తల్లిదండ్రులను కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆ సభ ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్నారు. బోనాలతో ప్రత్యేక ర్యాలీ.. బోనాలతో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం ఉన్న ఈ సందర్భంలోనూ.... తమ బదిలీలు జరగక ఆవేదనలో ఉన్నామని.. అమ్మవారికి ప్రత్యేక బోనాలను తయారు చేయించి.. మహిళా ఉపాధ్యాయులు ర్యాలీగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బదిలీలు వెంటనే చేపట్టాలని.. భార్య ఒక జిల్లాలో, భర్త మరొక జిల్లాలో 18 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్పౌజ్ బదిలీలు జరిపించాలని అభ్యర్థిం చారు. ప్రగతిభవన్ ముట్టడికి సైతం వెనుకాడం: ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆవేదన సభకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. యుటీఎఫ్, టీపీటీఎఫ్, తపస్, ఎస్టీయూ, ఆర్.యూ.పీ.పీ, పీఆర్టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అవసరమైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని, ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనకాడమని నాయకులు హెచ్చరించారు. -
ఫేర్వెల్ పార్టీలో హడలెత్తించిన బాలిక.. శవపేటికలో నుంచి లేచి..
చాలామంది చిన్నారులు స్కూల్ ఫేర్వెల్ పార్టీకి అందమైన వస్త్రధారణతో వస్తుంటారు. అయితే 16 ఏళ్ల అబీ రికెట్స్ తమ స్కూల్ ఫేర్వెల్ కార్యక్రమానికి విచిత్ర రీతిలో సిద్ధమై వచ్చింది. తన క్లాస్‌మేట్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు ఒక షో-స్టాపింగ్ స్టంట్‌కు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఆమె ఒక శవపేటికతో పాటు అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. స్కూల్ ఫేర్వెల్ పార్టీ రోజున ఆమె నలుపురంగు దుస్తులు ధరించింది. తరువాత ఆరడుగుల శవపేటికలో పడుకుంది. చేతులను క్రాస్‌చేసి పెట్టుకుంది. అప్పుడు ఆమెతో పాటు వచ్చిన అంత్యక్రియల నిర్వహణ సిబ్బంది ఆ శవ పేటికను రెడ్ కార్పెట్‌పై ఉంచారు. ఇంతలో ఆమె ఎంతో నాటకీయంగా తన కళ్లను తెరిచింది. అక్కడున్నవారంతా ఆమెను చూసి కేకలు పెట్టారు. చుట్టుపక్కలవారు కేకలు పెడుతూ.. ఈ ఘటన గురించి అబీ వివరిస్తూ..‘అప్పుడు నన్ను చూసి చుట్టుపక్కల ఉన్నవారంతా ఆందోళనగా కేకలు పెట్టారని, అసలు విషయం గ్రహించి చప్పట్లు కొట్టారన్నారు. మా ఉపాధ్యాయులు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని’ అన్నారని ఆమె తెలిపింది. అబీ అంత్యక్రియల ‘షో’లో ఆమె తండ్రి, సోదరుడు కూడా ఆమెకు సహకరించారు. వారు అంత్యక్రియల నిర్వాహకుల పాత్ర పోషించారు. ఈ విధంగా అందరినీ భయపెట్టేందుకు అబీ రెండు గంటల పాటు అలంకరణ చేసుకుంది. కుమార్తె షో అద్భుతమంటూ.. తాము శవవాహనం అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించామని, అయితే ఇలాంటి షో కోసం ఎవరూ వాహనం ఇవ్వబోమని చెప్పారని అబీ తెలిపింది. దీంతో తమ ఇంటిలోని వారే తన షో కోసం అన్ని ఏర్పాట్ల చేశారని చెప్పింది. ఈ సందర్భంగా అబీ తండ్రి మాట్లాడుతూ తమ కుమార్తె చేసిన షో విషయంలో తాము ఎంతో గర్విస్తున్నామన్నారు. ఇది కలకాలం నిలిచిపోతుందన్నారు. ఇది కూడా చదవండి: గొంతులో ఇరుక్కున్న లెగ్ పీస్.. వైద్యుని వింత సలహాకు కంగుతిన్న మహిళ..! -
‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు!
ప్రపంచంలో లెక్కకుమించినంతమంది తమ ఉద్యోగాలను అయిష్టంతోనే చేస్తుంటారనే వాదన వినిపిస్తుంటుంది. అయితే వారు తమ హాబీతో ఏమైనా సాధించవచ్చని తపన పడుతుంటారు. అయినా అందుకు తగిన ప్రయత్నాలు చేయరు. కొందరు మాత్రం ఈ ప్రపంచం ఏమనుకున్నా, ఎటుపోయినా తాము అనుకున్నది చేసి చూపిస్తారు. అద్భుతాలు అందిస్తారు. ఇదే కోవలోకి వచ్చే ఒక మహిళ తన హాబీనే తన ఉద్యోగంగా మలచుకుని అత్యధికంగా సంపాదిస్తోంది. ఇందుకోసం ఆమె ఇంతవరకూ చేస్తూ వచ్చిన బోరింగ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసింది. మత్స్య కన్యగా మారిన మాస్ గ్రీన్ మాస్ గ్రీన్ అనే యువతి స్కూలులో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసేది. అయితే ఇప్పుడామె ‘మత్స్య కన్య’గా మారిపోయింది. ఇది వినేందుకు వింతగా అనిపిస్తుంది. ఆమె ఒక ఫుల్‌టైమ్ ‘రియల్ లైఫ్ మత్స్య కన్య’గా మారేందుకు తన ఉద్యోగాన్ని వదిలివేసింది.యూకేలోని ‘మెట్రో’తో మాట్లాడిన ఆమె ‘మత్స్య కన్య’గా ఉండటం తనకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని, తన కెరియర్ మార్చుకున్నాక ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. డెవొన్కు చెందిన 33 ఏళ్ల మాస్ గ్రీన్ ఇంగ్లీషు నేర్చుకునేందుకు 2016లో సిసిలీ వెళ్లింది. మత్స్య కన్యగానే ఎందుకు.. మీడియాతో మాట్లాడిన మాస్ తాను గతంలో ఒక సాగర తీరంలో మత్స్యకన్య మేకప్‌తో ఒక వ్యక్తిని చూశానని, అప్పటి నుంచి తనకు మత్స్యకన్యగా మారాలనే ఆలోచన తరచూ వచ్చేదని తెలిపింది. అయితే అప్పుడు తాను చూసినది ఒక ఇంద్రజాలమని, అయితే తాను నిజంగా మత్స్యకన్యగా మారిపోవాలనుకున్నానని తెలిపింది. ఇది వినేందుకు అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ దీనిని తాను చేసి చూపించానని మాస్ గర్వంగా తెలిపింది. తనను చూసేందుకు జనం విపరీతంగా రావడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని పేర్కొంది. అభిరుచే ఆదాయమార్గంగా మారి.. ‘రియల్ లైఫ్ మత్స్యకన్య’గా మారాక తాను నీటిలో సయ్యాటలాడున్నప్పుడు తన తోక భాగాన్ని చూసి అందరూ ఆనందిస్తారని తెలిపింది. తనకు సముద్రంలో అధిక సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని మాస్ తెలిపింది. తాను సముద్రతీర సందర్శనకు వచ్చే పర్యాటకులకు పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తానని పేర్కొంది. మత్స్యకన్యగా మారేందుకు తాను అధిక సమయం ఊపిరి నిలిపివుంచే శిక్షణ పొందానని తెలిపింది. తాను తనకు ఎంతో ఇష్టమైన అభిరుచిని నెరవేర్చుకోవడంతో పాటు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నానని మాస్ గ్రీన్ ఆనందంగా తెలిపింది. ఇది కూడా చదవండి: ఉన్నట్టుండి షాపింగ్ మాల్లో తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్‌లో ఏం జరిగిందంటే.. -
యోగక్షేమాలు అడుగుతూనే.. టీచర్‌పై విద్యార్థుల ఘాతుకం..
భోపాల్: చదువులు నేర్పించిన టీచర్‌పైనే విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. యోగక్షేమాలను కనుక్కుంటూనే దాడి చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు అడిగారనే పిస్టల్‌తో హత్యాయత్నం చేశారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా జౌరా రోడ్ ప్రాంతంలో జరిగింది. ఇదీ జరిగింది.. గిర్వార్ సింగ్‌ను విద్యార్థులు ఇంటి బయట నుంచి పిలిచారు. ఉపాధ్యాయుడు బయటికి రాగానే ఎలా ఉన్నారంటూ చర్చను ప్రారంభించారు. ఇంతలోనే ఓ కుర్రాడు జేబులోంచి పిస్టల్ తీసి సార్‌ను కాల్చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. విద్యార్థులు గత మూడేళ్ల క్రితం వరకు గిర్వార్ సింగ్ కోచింగ్ సెంటర్లో విద్యను నేర్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫీజులు మాత్రం చెల్లించలేదు. పలు సందర్భాలలో ఆ డబ్బులపై విద్యార్థులను ప్రశ్నించారు గిర్వార్ సింగ్. దీంతో కక్ష పెంచుకున్న నిందితులు సార్‌పై దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: రైల్లో మహిళతో అసభ్యకర ప్రవర్తన.. అడ్డుకుందని బయటకు తోసేశారు -
యోగానంద నుంచి అయ్యంగార్ వరకూ.. యోగాకు గుర్తింపునిచ్చిన గురువులు వీరే..
ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. యోగా చేయడం వలన కలిగే లాభాల గురించి తెలియజేయడమే యోగా దినోత్సవం ఉద్దేశం. యోగ విధానాలను మనదేశానికి చెందిన రుషులు, మునులు రూపొందించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా సూత్రాలను అనుసరించడం ఎంతో అవసరమని వారు తెలియజేశారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిన ప్రముఖ గురువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరమహంస యోగానంద పరమహంస యోగానంద తన పుస్తకం ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ కారణంగా సుపరిచితులయ్యారు. మెడిటేషన్, యోగా విధానాలను ఆయన ప్రపంచవ్యాప్తం చేశారు. ఇంతేకాదు పరమహంస యోగానంద యోగాకు సంబంధించిన తొలి గురువులలో ప్రముఖునిగా పేరొందారు. ఆయన తన జీవితంలోని అధిక భాగాన్ని అమెరికాలోనే గడిపారు. తిరుమలాయ్ కృష్ణమాచార్య ఈయన ‘ఆధునిక యోగ పితాచార్యులు’గా గుర్తింపు పొందారు. హఠయోగను మరింత విస్తృతంగా ప్రచారం చేశారు. ఈయన అనేక ఆయుర్వేద విషయాలను కూడా ప్రపంచానికి తెలియజెప్పారు. ధీరేంద్ర బ్రహ్మచారి ధీరేంద్ర బ్రహ్మచారి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి యోగా గురువుగా పేరొందారు. ఈయన దూరదర్శన్ ద్వారా యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నించారు. దీనికితోడు ధీరేంద్ర బ్రహ్మచారి ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజీలలో యోగా క్లాసులు నిర్వహించేందుకు నడుంబిగించారు. ఈయన యోగాకు సంబంధించి హిందీ, ఆంగ్లభాషల్లో అనేక గ్రంథాలు రాశారు. జమ్ములో ధీరేంద్ర బ్రహ్మచారి ఆశ్రమం ఉంది. కృష్ణ పట్టాభి జోయిస్ ఈయన కూడా ప్రముఖ యోగా గురువుగా పేరొందారు. 1915 జూలై 26న జన్మించిన ఆయన 2009లో కన్నుమూశారు. ఈయన అష్టాంగ యోగ సాధనకు అమితమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. ఇతని వద్ద శిష్యరికం చేసిన పలువురు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. బీకేఎస్ అయ్యంగార్ బీకేఎస్ అయ్యింగార్ యోగా ప్రపంచంలో ఎంతో పేరు పొందారు. ‘అయ్యంగార్ యోగా’ పేరుతో ఒక స్కూలును నెలకొల్పారు. ఈ స్కూలు ద్వారా ఆయన లెక్కలేనంతమందికి యోగా శిక్షణ అందించారు. 2004లో టైమ్స్ మ్యాగజైన్ బీకేఎస్ అయ్యంగార్ పేరును ప్రపంచంలోని 100 మంది ప్రతిభావంతుల జాబితాలో చేర్చింది. మహర్షి మహేష్ యోగి మహర్షి మహేష్ యోగి బోధించే ‘ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపుపొందింది. పలువురు సెలబ్రిటీలు ఈయన బోధించిన యోగ విధానాలను అనుసరిస్తుంటారు. ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త..హోటళ్లు ఆడ్వాన్ బుకింగ్ చేస్తే.. -
అంగన్వాడీల విద్యార్హత ఇంటర్
మంచిర్యాలటౌన్: అంగన్వాడీ టీచర్లు, ఆయాల నియామకంలో ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో ఈ పోస్టులకు కనీస విద్యార్హత పదో తరగతి ఉండగా ఇంటర్మీడియెట్‌కు పెంచింది. వయోపరిమితిని 35 ఏళ్లకే పరిమితం చేస్తూ, 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారికి మాత్రమే దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ప్రాజెక్టుల వారీగా రిజర్వేషన్ ఖరారుకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కొత్త మార్గదర్శకాల ప్రకారమే ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రధాన అంగన్వాడీ టీచర్‌గా పదోన్నతికి మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కనీసం ఐదేళ్లు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసి, 45 ఏళ్లలోపు వయస్సు ఉండి, ఇంటర్మీడియెట్ విద్యార్హత ఉండాలి. ఖాళీల భర్తీకి రిజర్వేషన్, రోస్టర్ పాయింట్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సెంటర్ల విధి విధానాల ఖరారుకు ఆదేశాలను జారీ చేశారు. ఆయా పోస్టులకు గాను అర్హులుగా స్థానికంగా ఉన్న వివాహిత, అర్బన్ ప్రాంతాల్లో అదే వార్డుకు చెందిన వారు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే అదే గ్రామ పంచాయతీకి చెందిన వారు, ఏజెన్సీలో సంబంధిత హ్యాబిటేషన్‌కు చెందిన మహిళ అయి ఉండాలి. వితంతువులు, ఒంటరి, అనాథ మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ పీవో సభ్యులుగా, నాన్ ట్రైబల్ ప్రాంతాల్లో ఆర్డీవో, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఖాళీల భర్తీకి నిబంధనలు జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 895 ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 840 మంది టీచర్లు పనిచేస్తుండగా, 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 738 మంది ఆయాలు ఉండగా, 157 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మినీ అంగన్వాడీ కేంద్రాలు 74 ఉండగా, 59 మంది టీచర్లు ఉండగా, 15 మినీ అంగన్వాడీ టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది ఖాళీగా ఉన్న గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులకు గాను పదేళ్లు టీచర్‌గా పనిచేసి, డిగ్రీ అర్హత ఉన్న వారికి అర్హత పరీక్ష నిర్వహించి, మెరిట్ ప్రకారంగా ఎంపికై న వారిని సూపర్వైజర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. 17 పోస్టులకు గాను జిల్లా నుంచి 8 మంది అంగన్వాడీ టీచర్లు పదోన్నతి పొందడంతో ఆయా కేంద్రాల్లోనూ అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. పక్కనే ఉన్న ఇతర అంగన్వాడీ టీచర్లకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించి నిర్వహిస్తున్నారు. -
ఆ ఉపాధ్యాయుడు మా కొద్దు!
అనంతపురం: మండలంలోని కళేకుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు జయరాములు తమకొద్దంటూ గ్రామస్తులు మూకుమ్ముడిగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భాస్కరరెడ్డి, ఉప సర్పంచ్ బోయ రామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మారెన్న మాట్లాడుతూ... వేసవి సెలవులకు ముందు కొందరు విద్యార్థినిల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని గుర్తు చేశారు. ఆ సమయంలో1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఒక్కసారికి తనను క్షమించి వదిలేయండని, మరోసారి ఎలాంటి తప్పు చేయనని, సాధారణ బదిలీల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ జయరాములు ప్రాధేయపడడంతో అందరూ మౌనంగా ఉండిపోయామన్నారు. అయితే ఆయన బదిలీపై వెళ్లకుండా పాఠశాల పునఃప్రారంభం రోజున రావడంతో విద్యార్థినిలు బడికి వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించకపోతే పాఠశాల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
హయత్ నగర్ రాజేష్ మృతి కేసులో కొత్తకోణం