సాక్షి, విశాఖపట్నం: అంగన్‌వాడీ టీచర్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. రూ.35 వేలు ప్రాణం మీదికి తెచ్చింది. నిందితురాలు సంగీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగీత వద్ద అంగన్‌వాడీ టీచర్ మున్నిసా బేగం రూ.35 వేలు అప్పు తీసుకోగా.. డబ్బులు అడిగేందుకు సంగీత వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ సంగీత బెదిరింపులకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ గొడవలో పెట్రోల్ మీద పోసుకున్న అంగన్‌వాడీ టీచర్ అగ్గిపుల్ల గీసి అంటించుకుంది.. దీంతో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కయ్యపాలెం పరిధిలోని శ్రీనివాసనగర్‌లో యువతిపై యాసిడ్ దాడి అంటూ ప్రచారం జరగడంతో కలకలం రేగింది. యువతి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. బైక్ మీద ఆగంతకులు వచ్చారని, ఆమెపై యాసిడ్ పోశారంటూ ప్రచారం జరిగింది.
ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప-2కు రాజకీయ సెగ!
Comments
Please login to add a commentAdd a comment