attack case
-
Vizag: అంగన్వాడీ టీచర్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: అంగన్వాడీ టీచర్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. రూ.35 వేలు ప్రాణం మీదికి తెచ్చింది. నిందితురాలు సంగీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగీత వద్ద అంగన్వాడీ టీచర్ మున్నిసా బేగం రూ.35 వేలు అప్పు తీసుకోగా.. డబ్బులు అడిగేందుకు సంగీత వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ సంగీత బెదిరింపులకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ గొడవలో పెట్రోల్ మీద పోసుకున్న అంగన్వాడీ టీచర్ అగ్గిపుల్ల గీసి అంటించుకుంది.. దీంతో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కయ్యపాలెం పరిధిలోని శ్రీనివాసనగర్‌లో యువతిపై యాసిడ్ దాడి అంటూ ప్రచారం జరగడంతో కలకలం రేగింది. యువతి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో.. బైక్ మీద ఆగంతకులు వచ్చారని, ఆమెపై యాసిడ్ పోశారంటూ ప్రచారం జరిగింది.ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప-2కు రాజకీయ సెగ! -
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లగచర్ల బాధితుల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను లగచర్ల దాడి కేసు బాధితలు శనివారం కలిశారు. పోలీసుల దాడిపై కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ పట్ల దౌర్జన్యకరంగా ప్రవర్తించారని బాధితులు ఫిర్యాదు చేశారు. కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, ఫార్మా కంపెనీకి మేం వ్యతిరేకం కాదన్నారు. రైతుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నామని తెలిపారు.త్వరలో లగచర్ల గ్రామంలో పర్యటిస్తామని అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను విచారిస్తామమని కమిషన్ ఛైర్మన్ తెలిపారు. దోషులను కమిషన్ వదిలిపెట్టదని.. ఎస్సీ ఎస్టీలకు అండగా ఉంటుందని తెలిపారు. భూములు కోల్పోతున్న ప్రజలకు న్యాయం చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.కాగా, కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. లగచర్ల దాడి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, పలువురు లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పీఎస్‌కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. -
లగచర్ల ఘటన: ‘కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేత’
వికారాబాద్, సాక్షి: దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న(సోమవారం) ఫార్మా రైతుల ప్రజాభిప్రాయం సేకరణకు వచ్చిన అధికారులపై దాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. దాడికి కారణమైన బీఆర్ఎస్ నేతలతో పాటు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే వికారాబాద్ వెళ్లాళని ఏడీజీ మహేశ్ భగవత్‌కు రాష్ట్ర డీజీపీ ఆదేశించారు. దాడి ఘటనపై మహేశ్ భగవత్ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘‘లగచర్ల ఘటనలో మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నాం. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నాం. అధికారులపై దాడి చేసిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు సురేష్ కీలకంగా వ్యవహరించారు. రాజకీయ కోణం ఏదైనా ఉందా? అని విచారణ చేస్తున్నాం. సురేష్ వెనక ఎవరు ఉన్నారనేది విచారణలో తేలుతుంది. కలెక్టర్‌పైకి దూసుకువచ్చే దృష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దాడిలో పలువురి అధికారులకు గాయాలయ్యాయి’’ అని అన్నారు. కలెక్టర్ ఘటన నేపథ్యంలో ఇవాళ.. దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు.మరోవైపు.. లగచర్ల ఘటన ప్రభావం మిగతా చోట్ల పడేలా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం గణేష్ పహాడ్‌లో ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. వికారాబాద్ కలెక్టర్ ఘటన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న(సోమవారం) ఫార్మా రైతుల ప్రజాభిప్రాయం సేకరణకు వచ్చిన అధికారులపై దాడి ఘటనకు సంబంధించి అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అక్కడ పోలీసు బలగాలు ఇంకా మోహరించే ఉన్నాయి.లగచర్ల ఘటన ప్రభావం మిగతా చోట్ల పడేలా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం గణేష్ పహాడ్‌లో ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. వికారాబాద్ కలెక్టర్ ఘటన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో లగచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో 250 మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.ఈ ఘటనను ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడికి నిరసన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. -
డాక్టర్‌పై దాడి.. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదైంది. నానాజీతో పాటు అనుచరులపై బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంతం నానాజీ పై చిన్న చిన్న సెక్షన్లతో సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు.డా.ఉమామహేశ్వరరావుపై పంతం నానాజీ దౌర్జన్యానికి పాల్పడటంతో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పంతం నానాజీని చేర్చగా, కేసు వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.నానాజీపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు సాయంత్రం ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు డా.ఉమామహేశ్వర రావు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. నిన్న(సోమవారం) ప్రాయశ్చిత దీక్ష అంటూ ఎమ్మెల్యే నానాజీ కొత్త నాటకానికి తెరలేపారు.ఇదీ చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడికాగా, రంగరాయ వైద్య కళాశాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతానని బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిచింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తమవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీబాల్ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్యంతరం చెప్పినందుకు ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావును నానాజీ బండబూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. -
వైఎస్సార్సీపీ నేతలపై కఠిన చర్యలొద్దన్న ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్సార్సీపీ నేతలపై కఠిన చర్యలొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ కృపాసాగర్ గత వారం విచారణ జరిపారు.పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల విచారణను గురువారం చేపట్టాలని కోరారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పిటిషనర్ల పాత్రపై ఆధారాలను కోర్టు ముందుంచుతామన్నారు. పిటిషనర్లపై కఠిన చర్యలొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర నిందితులకు మధ్యంతర ఉత్తర్వులను వర్తింప చేయవద్దని వారు కోర్టును కోరారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి స్పందిస్తూ.. గురువారం ఇతర కేసులున్నాయని, ఆ రోజు వాదనలకు వీలుపడదని తెలిపారు. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు.జోగి రమేష్ వ్యాజ్యంపై విచారణ 23కు వాయిదాఇదిలా ఉంటే, చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన గొడవపై నమోదైన కేసులో ముందుస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తదుపరి విచారణ కూడా ఈ నెల 23కి వాయిదా పడింది. జోగి రమేష్‌పై కఠిన చర్యలొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ కృపాసాగర్ 23 వరకు పొడిగించారు. -
రైతుబిడ్డకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు!
బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆదివారం షో ముగిసిన తర్వాత పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కార్లపై జరిగిన దాడులపై పోలీసులు సీరియస్ అయ్యారు. అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు పలు ఆర్టీసీ బస్సులపై సైతం ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే... ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
నాపై హత్యాయత్నం కుట్ర కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు జరపలేదు
సాక్షి, అమరావతి: తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణంపై లోతుగా దర్యాప్తు చేసేలా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఆదేశించాలన్న పిటిషన్‌ను విజయవాడ ఎన్ఐఏ కోర్టు కొట్టి వేయటాన్ని సవాల్ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రీ అభ్యంతరాలపై విచారణ జరిపే నిమిత్తం ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచి్చంది. న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి దీనిపై విచారణ జరిపారు. సీఎం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రిజిస్ట్రీ అభ్యంతరాలకు సంబంధించి నిరంజన్‌రెడ్డి వినిపించిన వాదనలతో న్యాయమూర్తి సంతృప్తి చెందారు. ఈ క్రమంలో ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ చంటి అనే వ్యక్తి ఆయనపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. నిందితుడు పదునైన కత్తితో వైఎస్ జగన్ మెడపై దాడికి ప్రయతి్నంచాడు. ఈ ఘటనలో వైఎస్ జగన్ ఎడమ చేయికి లోతైన గాయమైంది. ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ చార్జిïÙట్ దాఖలు చేసింది. వైఎస్ జగన్‌ను చంపడమే నిందితుడు శ్రీనివాసరావు ఉద్దేశమని, అందుకే మెడపై కత్తితో దాడికి ప్రయతి్నంచాడని ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది. దీని వెనుక ఉన్న కుట్ర వ్యవహారాన్ని తదుపరి దర్యాప్తులో తేలుస్తామని ప్రత్యేక కోర్టుకు నివేదించింది. అయితే అటు తరువాత కుట్ర కోణంపై ఎన్ఐఏ దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం ఘటన వెనుక ఉన్న కుట్రపై లోతైన దర్యాప్తు జరిపేలా ఎన్ఐఏను ఆదేశించాలని అభ్యరి్థస్తూ సీఎం వైఎస్ జగన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ దర్యాప్తులో లోపాలను కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు దీన్ని కొట్టివేస్తూ ఈ ఏడాది జూలై 25న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీఎం జగన్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యకాలీన పిటిషన్ (ఇంటర్లాక్యుటరీ)పై ఎన్ఐఏ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై క్వాష్ పిటిషన్ దాఖలు చేయవచ్చా? అంటూ రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. దీనిపై విచారణ జరిపే నిమిత్తం పిటిషన్ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచి్చంది. సీఎం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ వ్యాజ్యకాలీన పిటిషన్‌పై క్వాష్ పిటిషన్ దాఖలు చేయవచ్చని, పలు సుప్రీం కోర్టు తీర్పులను కోర్టుకు నివేదించారు. ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసే పరిధి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు లేదన్నారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి జిల్లాలు విశాఖ ఎన్ఐఏ కోర్టు పరిధిలోకి వస్తాయన్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ కేసును విచారించే పరిధి విశాఖ ఎన్ఐఏ కోర్టుకు మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు ఉత్తర్వులు చెల్లవన్నారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చారు. -
పక్కా ప్లాన్ ప్రకారమే కత్తితో దాడి: న్యాయవాది వెంకటేశ్వర్లు
సాక్షి, విజయవాడ: విశాఖ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసుపై సీఎం తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసిందని వెల్లడించారు. కాగా, సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరెడ్డి బుధవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నంపై కేసులో ఎన్ఐఏ 39 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు ఎన్ఐఏకి సిట్ వివరాలు అప్పగించలేదు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉంది. 2017లో శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. శ్రీనివాస్ పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసింది. నాటి డీజీపీ ఎన్ఐఏకి రికార్డ్ చేయవద్దని సిట్‌కి ఆదేశాలు ఇచ్చారు. రికార్డులు ఎన్ఐఏకి పోలీసులు మొదట అప్పగించలేదు. ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్ ఎలా తిరిగాడు?.. ఎయిర్‌పోర్టు అథారిటీకి శ్రీనివాస్ చాలా మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారు. శ్రీనివాస్‌ది ఎయిర్‌పోర్టులో ఇల్లీగల్ ఎంట్రీ. కత్తితో ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్ ఎలా తిరిగాడు?. శ్రీనివాస్‌పై కేసు ఉన్నందుకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగానికి అతను అనర్హుడు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేసే నాటికి శ్రీనివాస్‌పై కేసు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది అబద్దం. ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీట్ వేశారు. ప్లాన్ ప్రకారమే దాడి.. సీఎం జగన్‌పై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగింది. సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఎన్ఐఏ కూడా చెప్పింది. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. హత్యాయత్నంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తమ మీదకి కేసు రాకుండా ఉండేందుకే హత్యాయత్నం తీవ్రతను తగ్గించేందుకు కొందరు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్‌పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు -
ఎన్ఐఏ దర్యాప్తులో చాలా లోపాలున్నాయి
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తులో చాలా లోపాలున్నాయని సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు సోమవారం ఎన్ఐఏ కోర్టుకు నివేదించారు. ఎన్ఐఏ సరైన దిశలో దర్యాప్తు చేయలేదని.. అనేక కీలక అంశాలను సమాధానాల్లేని ప్రశ్నలుగా మిగిల్చిందని ఆరోపించారు. దర్యాప్తును తూతూ మంత్రంగా పూర్తి చేసిందన్నారు. చార్జిషీట్‌ను కూడా చాలా హడావుడిగా దాఖలు చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై మొదట దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పలు కీలక సాక్ష్యాలను సేకరించిందన్నారు. అయితే ఆ తర్వాత దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ మాత్రం ఆ సాక్ష్యాలను ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. అందుకే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టుకు నివేదించారు. ఎంట్రీ పాస్ లేకుండానే విమానాశ్రయంలోకి నిందితుడు.. వైఎస్ జగన్‌పై అక్టోబర్ 25, 2018లో హత్యాయత్నం జరిగిందని.. ఘటనా స్థలంలోనే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. ఆ మరుసటి రోజు శ్రీనివాసరావు ఇంటి నుంచి సిట్ అధికారులు విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఏరోడ్రమ్ ఎంట్రీ పాస్ (ఏఈపీ)ని స్వాధీనం చేసుకున్నారన్నారు. హత్యాయత్నం జరిగిన రోజు ఎలాంటి ఎంట్రీ పాస్ లేకుండానే శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి వెళ్లారని చెప్పారు. పాస్ ఇంటిలోనే ఉన్నప్పుడు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. నిందితుడు కత్తిని లోపలకు ఎలా తీసుకెళ్లాడు? జగన్‌తో కలిసి నిందితుడు ఫొటో దిగినట్లు ఉన్న ఫ్లెక్సీని కూడా సిట్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారని సీఎం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అసలు ఈ ఫ్లెక్సీని ఎవరు తయారు చేశారు? ఏ ఉద్దేశంతో తయారు చేశారన్న వివరాలను ఎన్ఐఏ పట్టించుకోలేదని కోర్టుకు నివేదించారు. ఫెక్ల్సీ విషయంలో నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు ఇచి్చన వాంగ్మూలాన్ని సిట్, ఎన్ఐఏ రికార్డు చేశాయన్నారు. అయితే ఈ రెండు వాంగ్మూలాలకు వైరుధ్యం ఉందన్నారు. ఇందులో ఏది నిజమో తేల్చాల్సిన బాధ్యత ఎన్ఐఏపై ఉందని కోర్టుకు నివేదించారు. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని గుర్తు చేశారు. లోపల ఉన్న హోటల్లోకి వెళ్లే సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారన్నారు. మరి శ్రీనివాసరావు కత్తి తీసుకుని ఎలా లోపలికి వెళ్లారో ఎన్ఐఏ చెప్పడం లేదన్నారు. ఈ విషయంలో విమానాశ్రయ అప్పటి భద్రతా అధికారులను, సిబ్బందిని ఎన్ఐఏ విచారించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. విమానాశ్రయంలో ఉన్న ఫ్యూజన్ హోటల్లో ఉద్యోగం సంపాదించేందుకు శ్రీనివాçÜరావు తనపై ఎలాంటి కేసులు లేవంటూ స్థానిక పోలీసుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారన్నారు. దీన్ని ఆ హోటల్ యజమాని హర్షవర్ధన్ కూడా ధ్రువీకరించారని గుర్తు చేశారు. హర్షవర్ధన్ కారణంగానే శ్రీనివాసరావుకు అక్కడ ఉద్యోగం వచచిందన్నారు. శ్రీనివాసరావు హాజరు విషయంలో బయోమెట్రిక్ యంత్రాన్ని, సీసీ కెమెరాలను ఎన్ఐఏ సరిగా విశ్లేషించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటి దృష్ట్యా ఈ కేసులో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ వాదనలు వినిపించేందుకు ఎన్ఐఏ తరఫు న్యాయవాది సిద్ధిరాములు గడువు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరిస్తూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
దేవుని మాలలో ఉండి దారుణం..కూతురు కోసం వచ్చి అత్తపై దాడి
సాక్షి, జ్యోతినగర్: కూతురి ఆచూకీ కోసం వచ్చిన ఓ తల్లిని ఆమె అల్లుడే క్షణికావేశంలో హతమార్చాడు. ఈ విషాద ఘటన ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణానగర్‌కు చెందిన కాసు సతీశ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. సతీశ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్యతో గొడవలు మొదలయ్యాయి. దీంతో కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లి, మరో ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పద్మ తీవ్ర మనోవేదనకు గురై, ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు శృతి తండ్రి వద్దకు వెళ్లి, అమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపింది. దీంతో అతను తన ఇద్దరు కూతుళ్లను తీసుకొని, ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు రామయ్యపల్లెలో ఉంటున్న పద్మ తల్లిదండ్రులు ఈర్ల లక్ష్మీ(65)–రాజయ్యలకు సమాచారం అందించడంతో ఠాణాకు చేరుకున్నారు. అనంతరం మనవరాళ్లను చూసేందుకు కృష్ణానగర్ వెళ్లారు. ఇంట్లో అల్లుడు సతీశ్ కనిపించడంతో తమ కుమార్తె నీ మూలంగానే ఇంటి నుంచి వెళ్లిపోయి ందన్నారు. ఇది గొడవకు దారితీసింది. క్షణికావేశంలో సతీశ్ తాను దేవుని మాల వేసుకున్న విషయాన్నీ మర్చి పోయి, అత్త లక్ష్మీపై దాడి చేశాడు. స్థానికులు అతన్ని సముదాయించి, స్పృహ కోల్పోయిన లక్ష్మిని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటనతో ఆస్పత్రి ఆవరణలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై బి.జీవన్, పోలీసు సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి చిన్న కుమారుడు గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సతీశ్‌పై హత్య కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు? లక్ష్మి మృతి చెందిన విషయం తెలుసుకున్న సతీశ్ తన మెడలోని మాల తీసివేశాడు. అనంతరం పోలీ స్‌స్టేషన్‌కు వెళ్లి, లొంగిపోయినట్లు సమాచారం. (చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య) -
ఒవైసీ హత్యాయత్నం కేసు.. యూపీ సర్కార్‌కు నోటీసులు
ఢిల్లీ: ఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. ఒవైసీ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ అంశాన్ని పునర్విచారణ కోసం అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలా వద్దా అనే అంశంపై మాత్రమే సుప్రీంకోర్టు ఇవాళ నోటీసు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11న చేపట్టనుంది. హాపూర్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన కాన్వాయ్‌పై ఫిబ్రవరి 3వ తేదీన దాడి జరిగింది. తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. అయితే దాడి నుంచి ఒవైసీ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ హత్యాయత్నానికి సంబంధించి నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. అయితే వాళ్లకు బెయిల్ మంజూరు కావడంతో ఇప్పుడు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్విస్ట్ -
మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనపై కేసు నమోదైంది. ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఇద్దరు కాంగ్రెస్ నేతల పేర్లు నమోదు చేశారు. సోమశేఖర్‌రెడ్డి, హరివర్ధన్‌రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సెక్షన్ 173, 147, 149, 341, 352, 506 కింద కేసు నమోదు చేశారు. రేవంత్‌రెడ్డి అనుచరులే దాడి చేశారంటూ టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు చేశారు. చదవండి: నన్ను చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు -
నడిరోడ్డుపై దారుణం...వివాహిత పై యువకుడి దాడి
సంతోష్‌నగర్: నగరంలో నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమ పేరిట వివాహితను వేధిస్తూ.. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇష్టానుసారంగా పొడవడంతో తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కంచన్‌బాగ్ పరిధిలోని హఫీజ్‌బాబానగర్ ఎ–బ్లాక్ ప్రాంతానికి చెందిన నూర్ భాను (40) భర్త ఇంతియాజ్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం నూర్ భాను కుమారుడితో కలిసి నివాసముంటోంది. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన షేక్ నసీరుద్దీన్ ఆలియాస్ హబీబ్ (32) ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నూర్ భాను బాబానగర్ ఉమర్ హోటల్ సమీపానికి రాగానే...షేక్ నసీరుద్దీన్ వెనుక నుంచి యాక్టివా ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముఖం, చేతులు, ఇతర ప్రాంతాల్లో కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితురాలు అక్కడే స్పృహ కోల్పోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాధితురాలిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బాధితురాలిని నిందితుడికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చిధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా నిందితుడి మీద గతంలో కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. (చదవండి: ముస్లిం యువతిని ప్రేమించడమే ఆ యువకుడి పాలిట శాపమైందా?) -
అధికారిణిపై దాడి.. టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావుపై కేసు..
సాక్షి, పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై కేసు నమోదైంది. మున్సిపల్ అధికారిణిపై దాడి చేసిన కేసులో పత్తిపాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతుల్లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి చెరువు వద్ద బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ప్లాంట్ పునఃప్రారంభం పేరుతో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళా అధికారిపై దాడికి తెగబడ్డారు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్న చంద్రబాబు చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పాత మంచినీటి చెరువు కట్టపక్కన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పేరుతో వాటర్ ప్లాంట్‌ను నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ ప్లాంట్ మనుగడలో లేదు. కానీ, దీనిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం మీడియాలో ప్రచారం చేశారు. దీనికితోడు.. పురపాలక సంఘానికి చెందిన స్థలంలో గుట్టుగా రెండు బోర్లు వేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు బోర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి తదుపరి చర్యలు నిర్వహించరాదని గురువారం నోటీసులు జారీచేశారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా, పత్తిపాటి తన అనుచరులు సుమారు 200మందితో ప్లాంటు వద్దకు చేరుకుని నానా రభస సృష్టించారు. ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన పత్తిపాటి పుల్లారావుకు మునిసిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్) కోడిరెక్క సునీత, రెవెన్యూ అధికారి ఫణికుమార్, ఇతర అధికారులు బోర్లు, ప్లాంట్ నిర్వహణకు అనుమతుల్లేవని స్పష్టంచేశారు. అర్బన్ సీఐ జి. రాజేశ్వరరావు, పట్టణ ఎస్ఐలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. టీడీపీ నాయకులు మునిసిపల్ అధికారులను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగి రభస సృష్టించారు. అంతేకాక.. మహిళ అని కూడా చూడకుండా సునీతను తోసేసి, ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు భుజం, వీపు ప్రాంతంలో గట్టి దెబ్బలు తగిలాయి. -
అమానుషం: పేకాట ఆడుతున్న చిన్నారుల దుస్తులు ఊడదీసి..
అబిడ్స్: చిన్నారుల దుస్తులు ఊడదీసి వారిని తీవ్రంగా కొట్టిన సంఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్లాబండ గుట్టపై చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గత నెల 29న అల్లాబండ్డ పరిసర ప్రాంతాలకు చెందిన బాలలు కొందరు పేకాట ఆడుతున్నారు. దీనిని గుర్తించిన హరికిరణ్, అమోస్, రాహుల్ అనే యువకులు పేకాట ఆడుతున్న 10 మంది పిల్లల దుస్తులు ఊడదీసి బెదిరించడమేగాక, కర్రలతో బాదారు. దీనిని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి మంగళవారం సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై సమాచారం అందడంతో మంగళ్‌హాట్ పోలీసులు బాధిత చిన్నారుల ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. 6మంది పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో హరికిరణ్, అమోస్, రాహుల్‌లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో.. నటి ఆత్మహత్య) -
నటి చౌరాసియాపై దాడి కేసులో నిందితుడిపై పీడీ యాక్ట్
PD Act Slapped On Actress Shalu Chourasiya Attack Case: సినీ నటి షాలు చౌరాసియాపై దాడి కేసులో నిందితుడిపై నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. గతేడాది నవబంర్‌లో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియా నడక పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా కొమ్మూరిల బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై దాడికి పాల్పడి షాలు చౌరాసియా పోన్ ఎత్తుకెళ్లాడు బాబు. ఈ దాడితోపాటు బాబుపై మరో మూడు కేసులు ఉండటంతో పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ప్రస్తుతం చంచల్గూడా జైలులో బాబు శిక్ష అనుభవిస్తున్నాడు. చదవండి: నటి చౌరాసియాపై దాడి: సీసీ కెమెరాలను తప్పించుకుతిరిగాడా? మహబూబ్ నగర్ జిల్లా కుల్కచర్లకు చెందిన బాబు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు నాలుగున్నరేళ్ల క్రితం వచ్చాడు. సినిమాల్లో సెట్లు వేసే వారి వద్ద రోజు కూలీగా చేరాడు. సంపాదన సరిపోక రాత్రివేళల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. కాగా 2021, నవంబర్ 14వ తేదీన సాయంత్రం పూట వాకింగ్ చేస్తున్న షాలూ చౌరాసియాపై బాబు దాడి చేసి తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని పేటీఎం చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. బండరాయి పక్కన కిందకు తోసేసి ఆమెను తీవ్ర ఇబ్బందికి గురి చేశాడు. ఒక సందర్భంలో బండరాయిని ముఖంపై బాది హత్య చేసేందుకు కూడా యత్నించాడు. శక్తిని కూడదీసుకున్న చౌరాసియా తన మోచేతితో నిందితుడిపై దాడి చేసి ఫెన్సింగ్ దూకి బయటికి పరుగులు తీసింది. చదవండి: సినీ నటి చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిపై మరో కేసు -
తల్లడిల్లిన తల్లి హృదయం.. కన్న బిడ్డలను రక్తం కారేలా కొట్టారు..
సాక్షి, అనకాపల్లి(విశాఖపట్నం): పదిహేనేళ్ల క్రితం భర్త పోయాడు.. ఇద్దరు కొడుకులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిని వృద్ధిలోకి తీసుకురావాలన్న ఆశతో ఆమె బతుకుతోంది.. తన కళ్ల ముందే వారిని స్తంభానికి కట్టేసి రక్తం కారేలా కొడితే ఆమె తట్టుకోగలదా? వారిని వదిలేయమని వేడుకున్నా.. మహిళ అని కూడా చూడకుండా దుర్భాషలాడడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. జీవీఎంసీ విలీన గ్రామం కేఎన్ఆర్ పేటలో ఈనెల 10వ తేదీ రాత్రి జరిగిన ఘటన సభ్యసమాజాన్ని తలవంచుకునేలా చేసింది. ద్విచక్రవాహనం వేగంగా నడిపారంటూ టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ ఇద్దరు యువకులను మందలించడంతో ప్రారంభమైన ఘర్షణ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. దురుసుగా ప్రవర్తించారంటూ అక్కడి వారంతా ఇద్దరు దళిత యువకులపై మూకుమ్మడిగా దాడి చేసి చివరకు స్తంభాలకు కట్టి కొట్టడంపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. మారేడుపూడికి చెందిన రావాడ రాజ్యలక్ష్మి భర్త 2006లో చనిపోయాడు. ఆమె ఇద్దరి కుమారులు రావాడ రాకేష్, లోకనాథ్ ఐటీఐ, డిప్లమో చదువుతున్నారు. గతంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేసిన రాజ్యలక్ష్మి ప్రస్తుతం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. ఈనెల 10వ తేదీన కేఎన్ఆర్ పేటలో తన కుమారులపై దాడి జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్లి ప్రాధేయపడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో బయటకు చెప్పుకోలేని విధంగా దూషించడంతోపాటు.. తనను తోసేశారని రాజ్యలక్ష్మి కన్నీంటిపర్యంతమవుతోంది. తప్పు ఒప్పులుంటే సర్దిచెప్పుకోవాలి తప్ప మరీ స్తంభానికి కట్టి రక్తమొచ్చేలా కొడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ మాతృమూర్తి. సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులను కూడా కొందరు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు పెద్దఎత్తున రంగంలోకి దిగి బాధితులను విడిపించి ముందుగా అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి, తర్వాత విశాఖకు తరలించారు. ప్రస్తుతం రాకేష్ తీవ్ర గాయాలతో విశాఖ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన లోకనాథ్ కాసింత స్వస్థత చేకూరిన తర్వాత 12వ తేదీ సాయంత్రం అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు జరిపి ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును నీరుగార్చేందుకు కుయుక్తులు... ఇటీవల గెలుపొందిన ఒక టీడీపీ కార్పొరేటర్ ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఈ కార్పొరేటర్‌తోపాటు ఒక టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగినప్పటికీ పోలీసులు బాధితులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. బాధితులకు న్యాయం జరగాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. -
హృదయ విదారక ఘటన: చెట్టుకు కట్టేసి దళిత కుటుంబంపై దాడి
చండీగఢ్: పంజాబ్‌లో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. కొంత మంది గ్రామస్తులు దళిత దంపతుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. సదరు కుటుంబాన్ని చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మైనర్ బాలికను, ఆమె తల్లిని లైంగిక వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. కాగా, పంజాబ్‌లోని ఫాజిల్కా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ అమానుషాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ (ఎన్సీఎస్సీ) తీవ్రంగా పరిగణించింది. దీనిపై వెంటనే విచారణ ప్రారంభించి, నిందితులను పట్టుకోవాలని పంజాబ్ పోలీసు అధికారులను ఆదేశించింది. కాగా, విచారణ వివరాలను మెయిల్ ద్వారా తమకు నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ కేసుపై పోలీసు అధికారులు జాప్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని పంజాబ్ పోలీసులు తెలిపారు. చదవండి: మైనర్‌ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి! -
ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వివాదం.. కారణం ఏంటంటే..
సాక్షి, పెద్దకొత్తపల్లి(మహబూబ్‌నగర్): ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ప్రేమ పెళ్లి వివాదానికి దారి తీసింది. అమ్మాయి బంధువులు అబ్బాయి బంధువులపై దాడి చేయడంతో అబ్బాయి వదిన మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలోని సంపంగి కృప, అదే గ్రామానికి చెందిన ఆత్మకూరి సంతోష్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 5న పెళ్లి చేసుకుని ఎటో వెళ్లిపోయారు. ఇది జీర్ణించుకోలేని అమ్మాయి బంధువులు సంపంగి లక్ష్మయ్య, లింగస్వామి, శాంతమ్మ ఈనెల 6న గొడ్డలి, రోకలిబండతో అబ్బాయి వదిన ఉష (32), అన్న చెన్నయ్యపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఉషను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈమెకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ విషయమై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ గిరిబాబు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. చదవండి: మంత్రగాడనే అనుమానంతో గిరిజన వృద్ధుడిని.. -
దారుణం: తాగడానికి నీళ్లు అడిగి.. నోట్లో గుడ్డకుక్కి.. ఆపై..
నర్సాపూర్(మెదక్): నర్సాపూర్‌లో మంగళవారం పట్టపగలు వృద్ధురాలిపై దాడి చేసిన గుర్తు తెలియని మహిళ చోరీకి పాల్పడింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక బస్టాండు ఎదురుగా ఉన్న కాలనీలో రెడ్డిపల్లి పెంటమ్మ(65) ఒక్కతే తన ఇంట్లో ఉంటుంది. మంగళవారం ప్రెషర్ కుక్కర్లు అమ్ముతామంటూ ఓ మహిళ అటుగా వచ్చి పెంటమ్మను కుక్కర్ తీసుకోవాలని ఒత్తిడి చేయగా నిరాకరించింది. సదరు మహిళ తాగడానికి నీళ్లు ఇవ్వాలని అడగడంతో పెంటమ్మ ఇంట్లోకి వెళ్లగా ఆమె వెనకాల మహిళ వెల్లి తలుపులకు గడియపెట్టి పెంటమ్మ నోట్లో గుడ్డకుక్కి అక్కడే ఉన్న కర్రతో దాడిచేసింది. అనంతరం పెంటమ్మ మెడలో ఉన్న సుమారు తులం బంగారు గుండ్లు, చేతులకు ఉన్న వెండి గాజులు తీసుకుని పారిపోయింది. ఆమె వెళ్లిన కొంత సేపటికి పెంటమ్మ కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగరాజు చెప్పారు. తీవ్రంగా గాయపడిన పెంటమ్మను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుపోయి చికిత్స చేయించారు. చదవండి: తల్లిని వేధిస్తున్నందుకు.. తండ్రిని చంపిన తనయుడు -
MadhyaPradesh: దళిత కుటుంబంపై దాష్టీకం
మధ్యప్రదేశ్‌లో దాష్టీకం చోటు చేసుకుంది. పిలిస్తే పనులకు రాలేదని ఓ దళిత కుటుంబంపై దాడి చేసి మూడు రోజులపాటు బంధించారు. గర్భవతి అని కూడా చూడకుండా ఓ మహిళను కిరాతకంగా హింసించారు. ఈ ఘటన అక్కడి సోషల్ మీడియాను కుదిపేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. భోపాల్: మధ్యప్రదేశ్ ఛాతర్పూర్ జిల్లా బండార్ఘడ్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పొలం పనులకు రాలేదని ఓ దళిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. గర్భంతో ఉన్న మహిళపై రాడ్లతో దాడి చేశారు. ఆపై మూడు రోజులు ఇంట్లోనే బంధించారు. ఆలస్యంగా ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామంలో స్వర్ణ కులానికి చెందిన ఓ వ్యక్తి, బాధిత కుటుంబాన్ని పోలం పనులకు రావాలని పిలిచాడు. అయితే వేరే పనులు ఉండడంతో తర్వాత వస్తామని వాళ్లు చెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి కొందరిని వెంటేసుకుని ఆ ఇంటికి వెళ్లాడు. బాధిత మహిళను, ఆమె అత్తను కులం పేరుతో దూషిస్తూ.. దాడికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లో మగవాళ్లను చంపుతామని బెదిరించాడు. మూడు రోజులపాటు ఇంట్లోనే బంధించి.. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి వదిలేశారు. అయితే కొందరు యువకుల సాయంతో విషయం పోలీసులకు చేరడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్తో నిందితుల కోసం గాలిస్తున్నామని రాజ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పంకజ్ శర్మ తెలిపారు. అత్యాచారం? కాగా, ఈ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరిగిందని దళిత సంఘాలు సోషల్ మీడియాలో ఉద్యమిస్తున్నాయి. ఐదు రోజులు ఆ కుటుంబం నరకం అనుభవించిందని, పిల్లల కళ్లెదుటే ఆమెపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించకపోగా.. కేసు దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. #Horrific A pregnant dalit woman from Chattarpur MP brutally beaten and raped by caste Hindu patel community. The Dalit refuses to work on the fields of Patel, then the oppressed hold the family hostage for 5 days, raping the pregnant mother in front of the children for 4 days... pic.twitter.com/3iMUNqOHjV — The Dalit Voice (@ambedkariteIND) May 29, 2021 -
వామ్మో.. తాగుబోతు ఎంత పనిచేశాడు!
సాక్షి, బంజారాహిల్స్: బోరబండ ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని కాకతీయ వైన్స్‌లో మద్యం తీసుకునేందుకు గోపి అనే డ్రైవర్ శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. మద్యం ధరకు అనుగుణంగా క్యూఆర్ కోడ్‌తో డబ్బులు చెల్లించేందుకు యత్నిస్తుండగా ఆ మిషన్ రెండు నిమిషాలు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. ఇంత ఆలస్యమా అంటూ గోపి మద్యం సీసా ఇచ్చిన సేల్స్‌మెన్ రంజిత్‌పై అదే సీసాతో తలపై దాడి చేశాడు. దీంతో రంజిత్ తల పగలడంతో ఆగ్రహానికి లోనైన వైన్‌షాప్ ఇతర సిబ్బంది మూకూమ్మడిగా గోపిని కొట్టారు. రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనపై కూడా దాడి చేశారంటూ గోపి కూడా శనివారం ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా పరిశీలిస్తున్నారు. -
‘గాంధీ’లో డిష్యుం.. డిష్యుం
గాంధీఆస్పత్రి: గాంధీ ఆస్పత్రిలో రెగ్యులర్ ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాంట్రాక్టు కార్మికుడు శంకరయ్య గాంధీ క్యాజువాలిటీ ఆపరేషన్ థియేటర్ (సీఓటీ) వద్ద విధులు నిర్వహిస్తుండగా, రెగ్యులర్ ఉద్యోగి లక్ష్మీపతి మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్ఓ)గా పనిచేస్తున్నాడు. ఈనెల 10న హెల్త్ సూపర్వైజర్ రవికుమార్ కార్యాలయం వద్ద వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో హెల్త్ సూపర్వైజర్ సమక్షంలోనే లక్ష్మీపతి, శంకరయ్యపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై శంకరయ్య పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు లక్ష్మీపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగిపై దాడి విషయం తన దృష్టికి వచ్చిందని ఆస్పత్రి నోడల్ అధికారి, కాంట్రాక్టు కార్మికుల ఆర్ఎంఓ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడికి పాల్పడిన లక్ష్మీపతిని తక్షణమే సస్పెండ్ చేయాలని కాంట్రాక్టు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. శంకరయ్యకు మద్దతుగా సోమవారం ధర్నా, నిరసన చేప్టటనున్నారు. ( చదవండి: ప్రభుత్వ ధరలకే కోవిడ్ చికిత్స ) -
ముగ్గురు అన్నదమ్ములు.. 33 కేసులు
సాక్షి, కొత్తూరు(రంగారెడ్డి) : కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ శివారులో జాతీయ రహదారి పక్కనున్న ఓ దాబాలో ఆదివారం తెల్లవారుజామున యజమానిపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సోమవారం స్థానిక ఠాణాలో షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ సోహిల్, సయ్యద్ సాహిల్, సయ్యద్ మొహమ్మద్ ముగ్గురు అన్నదమ్ములు. వీరికి నగరంలోని టోలీచౌకికి చెందిన ఎండీ షారూఖ్, షాలిబండకు చెందిన అలీబిన్ హుస్సేన్ స్నేహితులు. వీరు ఈనెల 16న ఎక్కడైనా చోరీ చేద్దామని పథకం వేశారు. వీరంతా కలిసి తమ స్నేహితుడు అబ్దుల్ రాయిస్‌కు చెందిన కారును పని ఉందని చెప్పి తీసుకున్నారు. అనంతరం నగరం నుంచి జాతీయ రహదారి మీదుగా అర్ధరాత్రి సమయంలో షాద్‌నగర్ వరకు వెళ్లారు. ఎక్కడా చోరీకి అనువైన ప్రాంతం కనిపించకపోవడంతో తిరుగు పయణమయ్యారు. తిమ్మాపూర్ శివారులోని అమూల్య దాబాను గమనించారు. అక్కడ సాహిల్, సోహైల్, అలీబిన్ హుస్సేన్ గోడ దూకి దాబాలోకి వెళ్లగా కారులో ఉన్న మరో ఇద్దరు కాపలాగా ఉన్నారు. దాబాలో నిద్రిస్తున్న యజమాని భరత్‌రెడ్డిపై చాకుతో దాడి చేసి రూ. 8,500 నగదు, స్మార్ట్‌ఫోన్‌ను చోరీ చేసి కారులో హైదరాబాద్ వైపునకు పారిపోయారు. కొద్దిపేపటికి దాడి నుంచి తేరుకున్న అనంతరం బా«ధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వినియోగించిన కారు సోమవారం కొత్తూరు వైపునకు వస్తుందనే సమాచారంతో స్థానిక వై జంక్షన్ కూడలిలో వాహనాలను తనిఖీ చేపట్టారు. పోలీసులను గమనించిన నిందితులు కారును ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో పోలీసులు వారి వాహనాన్ని వెంబడించి పెంజర్ల కూడలికి సమీపంలో ఓ వెంచర్లో పట్టుకున్నారు. వారిని విచారించగా దాబాలో దోపిడీ నేరాన్ని అంగీకరించారు. కారులో ఉన్న సోహైల్, షారూఖ్‌ను రిమాండుకు తరలించగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సాహిల్, సోహైల్, మొహమ్మద్‌పై నగరంలోని పలు ఠాణాల్లో 33 చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు ఏసీపీ చెప్పారు. కేసును ఒకే రోజులో ఛేదించిన కొత్తూరు ఇన్స్పెక్టర్ చంద్రబాబు బృందాన్ని ఈ సందర్భంగా ఏసీపీ సురేందర్ అభినందించారు. సీసీ కెమెరాల సాయంతో.. దాబాలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు సీసీ కెమెరాల సాయంతో ఒకేరోజు ఛేదించారని ఏసీపీ సురేందర్ తెలిపారు. దాబాలో సీసీ కెమెరాలు ఉండటంతో నిందితులను సులువుగా పట్టుకున్నామన్నారు. ప్రజలు హోటళ్లు, ఇళ్ల ఎదుట ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. -
అక్బరుద్ధీన్‌పై దాడి కేసు: పహిల్వాన్ మృతి
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీపై దాడి చేసిన మహమ్మద్ పహిల్వాన్ మంగళవారం మృతి చెందారు. ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎనిమిదేళ్ల క్రితం అక్బరుద్ధీన్‌పై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన పహిల్వాన్ బెయిల్‌పై బయట ఉంటున్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ దాడిలో అక్బరుద్ధీన్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగాయి. పలు కత్తిపోట్లకు గురయ్యారు. ఆ సమయంలో అక్బరుద్దిన్ శరీరంలో నుంచి డాక్టర్లు కేవలం ఒకే బుల్లెట్ తీశారు. దీంతో ఆయన శరీరంలో ఉన్న మరో బుల్లెట్ కారణంగా ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. అక్బరుద్ధీన్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి విదితమే. -
ఆ గ్రంథాలు చదివితే.. తీవ్ర పరిణామాలు..!
లక్నో : హిందూ మత గ్రంథాలు చదువుతున్న ఓ ముస్లిం వ్యక్తిపై అదే వర్గానికి చెందిన యువకులు దాడి చేశారు. ఇంకెప్పుడైనా హిందూ మతగ్రంథాలు చదువుతున్నట్టు తెలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఘటన మీరట్‌లో వెలుగుచూసింది. వివరాలు.. ఢిల్లీగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే దిల్షర్ (55) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి గత 40 ఏళ్ల నుంచి హిందూమత పవిత్ర గ్రంథాలైన రామచరిత మానస్, భగవద్గీత పఠించడం అలవాటు. ఆ క్రమంలో శుక్రవారం కూడా రోజులాగే డ్యూటీ నుంచి వచ్చి రామచరిత మానస్‌ను పఠించడానికి సిద్ధమవుతుండగా.. జకీర్, సమీర్ అనే ఇద్దరు యువకులు ఇంట్లోకి చొరబడి ఆయనపై దాడి చేశారు. ఇలాంటి చర్యలు మానుకోకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. ‘ఆధ్యాత్మిక గ్రంథాలు చదవితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏదేమైనా నా సొంత వర్గీయులు చేసే ఇలాంటి దాడులను ఎదుర్కోవడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను’అన్నారు. దిల్షర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
వద్దమ్మా..కాల్చొద్దమ్మా.. ప్లీజ్ అమ్మా..
వద్దమ్మా..కాల్చొద్దమ్మా.. ప్లీజ్ అమ్మా..కొట్టకే..నొప్పెడుతోందమ్మా అంటూ ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లారో ఎంతగా..వెక్కివెక్కి ఏడ్చారో పాపం వీపంతా వాతల మయంచెంపలు, మోచేతులు చర్మం ఊడి..గాయాలైన ఆ చిన్నారులు..ఆ పసికూనలు బిక్కుబిక్కు మంటున్నారు. కన్నతల్లి అనైతిక చేష్టలతో రోజూ నరకం చూసి కదిలిస్తే..బోరున విలపిస్తున్నారు. కొత్తగూడెంఅర్బన్: నవ మాసాలు మోసిన కన్న తల్లే కూతుళ్ల పట్ల కాసాయిలా మారింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే సాకుతో చిన్నారులను చిత్రహింలకు గురి చేసింది. ఈ విషయం ఆమె సోదరుడికి(పిల్లల మేనమామ) తెలియడంతో నిర్వాకం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం టూటౌన్ ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాలిలా..కొత్తగూడెం పట్టణంలోని బొగ్గు గని ప్రాంతమైన రుద్రంపూర్‌కు చెందిన గౌడ్స్ ఓం ప్రకాశ్ మూడు నెలల క్రితం మృతి చెందాడు. అతడి భార్య రూప, కూతుళ్లయిన 8 సంవత్సరాల హేమశ్రీ, ఐదేళ్ల శ్రీప్రియ ఉన్నారు. రూపకు అప్పటికే గౌతంపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. అయితే భర్త చనిపోయిన తర్వాత వీరిరువురి బంధం బలపడింది. ఈ క్రమంలో కూతుళ్లు హేమశ్రీ, శ్రీప్రియ అడ్డుగా ఉన్నారనే కారణంతో రూప వారిని ప్రతిరోజూ చిత్రహింసలకు గురి చేస్తోంది. ఒళ్లంతా వాతలు పెట్టింది. ముఖంపైనా తీవ్రంగా గాయపర్చింది. చిన్నారుల ఒళ్లంతా గాయాలే కనిపించడంతో ఈ విషయం రూప సోదరుడు ఉర్సు కుమార్‌కు తెలిసింది. కుమార్ బుధవారం రూప ఇంటికి వెళ్లి పిల్లలను ఆరా తీయగా నిజం బయటపడింది. చిన్నారులు జరిగిన విషయమంతా వివరించారు. దీంతో కుమార్ ఇద్దరు పిల్లలను తీసుకుని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై కుమారస్వామి రూపను స్టేషన్‌కు పిలిపించి విచారించగా తన కూతుళ్లను గాయపర్చింది, చిత్రహింసల పాలు చేసింది నిజమేనని అంగీకరించింది. ఆమెపై ఎస్సై కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న టీడీపీ దాడులు
సాక్షి, అనంతపురం : మండలంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆదివారం సంజీవపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు తెలిపిన మేరకు.. సంజీవపురం గ్రామంలో వైఎస్సార్ సీపీ నేత ఈశ్వరరెడ్డి, టీడీపీ నాయకుడు సోమశేఖర్‌రెడ్డి మధ్య భూమిలో పైపులైన్ వివాదం ఉంది. దీనిపై రెండు గ్రూపుల మధ్య మాటల యుద్ధం సాగింది. కక్ష పెంచుకున్న సోమశేఖరరెడ్డి, సూర్యప్రతాప్‌రెడ్డి, అశోక్‌రెడ్డి తదితరులు కర్రలతో ఈశ్వరరెడ్డి, అతని కుమారుడు మహేశ్వరరెడ్డి, తమ్ముడు రాజశేఖరరెడ్డిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈశ్వరరెడ్డి, రాజశేఖరరెడ్డిని కుటుంబసభ్యలు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. కాగా, ఈశ్వరరెడ్డి, అతని బంధువులు గతంలో టీడీపీలో ఉండేవారని, గత ఎన్నికల సమయంలో వారు వైఎస్సార్సీపీలో చేరడంతో జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు కక్ష పూరితంగానే దాడులకు తెగబడినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
లావేరు: మండలంలోని లావేటిపాలేంలో వైఎస్సార్సీపీ కార్యకర్త లుట్ట సురేష్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు శుక్రవారం రాత్రి దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడి కథనం మేరకు... గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త లుట్ట సురేష్ ఇంటి పక్కన స్థలంలో టీడీపీ వర్గానికి చెందిన ఎలగాడ సంధ్యారాణి, ఎలగాడ రమణమ్మ చెత్తా చెదారాలు వేశారు. ఇలా చెత్తా చెదారాలు వేయడం వల్ల దోమలు, ఈగలు బెడద ఎక్కువగా ఉంటుందని, చెత్తను తీసివేయాలని కోరాడు. దీంతో ఆగ్రహం చెందిన టీడీపీ వర్గీయులు ఎలగాడ చిన్నారావు, సంధ్యారాణి, రమణమ్మ, చిట్టెమ్మలతోపాటు తాళ్లవలస గ్రామానికి చెందిన రేగాడ నాగరాజు సురేష్‌పై రాళ్లు, గాజు పెంకులతో దాడికి దిగారు. దీంతో సురేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు లావేరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో లావేరు పోలీసుల సూచన మేరకు శ్రీకాకుళం రిమ్స్‌కు 108 అంబులెన్సులో తరలించారు. ఈ మేరకు బాధితుడు రిమ్స్ అవుట్ పోస్టు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న లావేరు హెచ్‌సీ రమణ శనివారం ఉదయం లావేటిపాలేం గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
బర్త్‌డేకి డబ్బులు ఇవ్వలేదని కోడుకు ఘాతుకం
-
బర్త్‌డేకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై..
సాక్షి, ప్రకాశం: జిల్లాలోని మార్కాపురంలో ఎస్సీ బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకలకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎస్సీ బీసీ కాలనీకి చెందిన మురారి జలయ్య, తల్లి లక్ష్మి కుమారుడు ప్రసాద్ బర్తడే వేడుకలకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తండ్రి మురారి జలయ్యతో పాటు తల్లి లక్ష్మి, నాయనమ్మకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : బర్త్‌డేకి డబ్బులు ఇవ్వలేదని కోడుకు ఘాతుకం -
రౌడీ పోలీస్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇళ్లకు వెళుతున్న ‘సాక్షి’ సబ్ ఎడిటర్లపై అకారణంగా దాడి చేసి నిర్బంధించిన హెడ్ కానిస్టేబుల్ కె.పద్మారావు వ్యవహారాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి సర్కిల్ పరిధిలోని రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పద్మారావు గత చరిత్ర కూడా వివాదాస్పదమేనని పోలీసుల విచారణలో తేలింది. తాజాగా ‘సాక్షి’ సబ్ ఎడిటర్లపై అకారణంగా దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండడంతో శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించింది. సదరు హెడ్ కానిస్టేబుల్ కొడుకుపై కూడా గతంలో కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో దాడి కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పాత కేసులను తిరగతోడిన కరీంనగర్ పోలీసులు పద్మారావు తీరుపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి కరీంనగర్ కమిషనర్, సిరిసిల్ల ఎస్పీకి పంపించారు. కోతిరాంపూర్‌లో సదరు హెడ్ కానిస్టేబుల్ నివసిస్తున్న ఇంటి సమీపంలోనే అతని మేనత్త కాంతమ్మ పేరిట 170 గజాల ఆస్తి ఉంది. 2015లో అక్కడ ఇల్లు నిర్మించుకునేందుకు కాంతమ్మ కుటుంబం ప్రయత్నిస్తుండగా, దాన్ని అడ్డుకునేందుకు, ఆస్తిని స్వాధీనం చేసుకునే క్రమంలో 2015, మార్చి 26న అర్ధరాత్రి ఆ కుటుంబంపై దాడికి దిగారు. అప్పట్లో కథలాపూర్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఇతను తన కొడుకుతో కలిసి దాడి చేసినట్లు 2015, మార్చి 27న కేసు (నంబర్ 120/ 2015) నమోదైంది. ఈ కేసులో కూడా పద్మారావు మొదటి నిందితుడు (ఎ–1) కావడం గమనార్హం. ఐపీసీ సెక్షన్లు 448, 427,290, 323, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈనెల 10వ తేదీ రాత్రి కోతిరాంపూర్‌లో ‘సాక్షి’ సబ్ ఎడిటర్లపై దాడి కేసు (నంబర్ 255/2019)లో ఐపీసీ 290, 323, 34, 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదయింది. అకారణంగా జర్నలిస్టులపై దాడి చేసి, నిర్బంధించి గాయపరిచిన పద్మారావు, అతని కొడుకు ప్రదీప్, పద్మారావు బంధువులపై పెట్టిన కేసులో ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ, పద్మారావుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా, పద్మారావు కానిస్టేబుల్‌గా ఉన్నప్పుడే దాడి కేసులు నమోదైనప్పటికీ, అతనికి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించడం గమనార్హం. ఎన్నికల విధుల పేరిట వచ్చి కరీంనగర్లో మకాం... సిరిసిల్ల జిల్లా చందుర్తి సర్కిల్ పరిధిలోని రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పద్మారావు ఈనెల 10న బోయినపల్లిలో ఎన్నికల డ్యూటీ పేరిట రిలీవ్ అయి వచ్చాడు. అదే రోజు పద్మారావు ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో కరీంనగర్ కోతిరాంపూర్‌లోని ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం నుంచే మొదలైన విందు అర్ధరాత్రి వరకు సాగడం, రాత్రి 12.40 గంటల సమయంలో సబ్ ఎడిటర్లు డ్యూటీ ముగించుకుని రావడంతో ముందు కొడుకు, తరువాత తండ్రి దాడికి తెగబడ్డారు. మద్యం మత్తులో ఫంక్షన్‌కు వచ్చిన బంధువులు కూడా సబ్ ఎడిటర్లు రాములు, వెంకటేశ్‌పై దాడి చేసి, నిర్భందించడం గమనార్హం. కోతిరాంపూర్ బస్తీలో రౌడీయిజం ప్రదర్శించడంపై బస్తీలోని మిగతా కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రదీప్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి: టీయూడబ్ల్యూజే సాక్షి సబ్ ఎడిటర్లు రాములు, వెంకటేశ్‌పై అకారణంగా దాడి చేసి, నిర్బంధించిన హెడ్ కానిస్టేబుల్ పద్మారావును సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని, అతని కొడుకు ప్రదీప్‌పై రౌడీషీట్ తెరవాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మారుతి స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హెడ్ కానిస్టేబుల్‌గా ఉంటూనే జర్నలిస్టులపై రౌడీయిజం ప్రదర్శిండంతోనే పద్మారావు నేరప్రవృత్తి తెలుస్తుందని పేర్కొన్నారు. అతని కొడుకు ప్రదీప్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అర్ధరాత్రి బస్తీల్లో తిరుగుతూ రౌడీయిజం చేస్తున్న ప్రదీప్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలని కమిషనర్ కమలాసన్‌రెడ్డిని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ నాయకునిపై దాడి
రాజంపేట : పట్టణంలోని మన్నూరుకు చెందిన టీడీపీ నాయకుడు బండారు బాలయ్య తనపై దాడి చేసి గాయపరిచినట్లు వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణ తెలిపారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున తాను పనిచేశాననే కక్షతోనే తనపై దాడి చేసినట్లు ఆరోపించారు. బండారు బాల య్య, ఆయన సంబంధీకులు దౌర్జన్యంగా తన ఇంటిపైకి వచ్చి దాడికి దిగారన్నారు. చికిత్స కో సం ఏరియా ఆసుపత్రికి వస్తే ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రెఫర్ చేయలేదన్నారు. అధికారపార్టీ ఒత్తిడికి తలొగ్గే వైద్యులు ఇలా వ్యవహరించారన్నారు. కాగా గాయపడిన నారాయణను వైఎస్సార్సీపీ కన్వీనర్ పోలా శ్రీనివాసులరెడ్డి, నాయకుడు విశ్వనాథరాజు, పలువురు పట్టణ నాయకులు పరామర్శించారు. కేసులు నమోదు చేశాం మన్నూరులో జరిగిన ఘటనపై ఇరువర్గాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేశ్‌నాయుడు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణను కలిసి ఘర్షణకు కారణమైన వివరాలను సేకరించామన్నారు. -
సాక్షి సబ్ ఎడిటర్లపై హెడ్‌కానిస్టేబుల్ పిడిగుద్దులు
కరీంనగర్‌క్రైం: సాక్షి దినపత్రికలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఇద్దరు సబ్ ఎడిటర్లను రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పద్మారావు, అతడి కుమారుడు దిలీప్ అకారణంగా అడ్డగించి జులుం ప్రదర్శించారు. ‘ఇది మా ఏరియా.. ఎవరూ రాకుడదు.. నేను పోలీసు..’ అంటూ దాడి చేసి చితకబాదారు. ఈ సంఘటన కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కరీంనగర్ వన్‌టౌన్ సీఐ తుల శ్రీనివాసరావు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెవుల రాములు, తన్నీరు వెంకటేశ్ తిమ్మాపూర్‌లోని సాక్షి యూనిట్ కార్యాలయంలో సబ్ ఎడిటర్లుగా పని చేస్తూ కరీంనగర్ కోతిరాంపూర్‌లో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి కోతిరాంపూర్‌లో ఆఫీసు బస్సు దిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో అతిగా మద్యం సేవించి ఉన్న హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు కుమారుడు దిలీప్, మరో ఇద్దరు బంధువులు ఇంటి బయట ఉన్నారు. రాములు, వెంకటేశ్‌లను అడ్డగించి ‘ఇది మా ఏరియా మీరు ఎవరు.. ఎందుకు వచ్చారు.. అంటూ దబాయించారు. సాక్షి దినపత్రికలో సబ్ ఎడిటర్లుగా పని చేస్తున్నామని, ఆఫీసు నుంచి వస్తున్నామని చెప్పారు. అయినా వినిపించుకోకుండా గుర్తింపు కార్డులు చూపించాలంటూ బెదిరించారు. వెంకటేశ్ గుర్తింపుకార్డు చూపించగా... గుర్తింపుకార్డులు మీకెందుకు చూపించాలని రాములు ప్రశ్నించడంతో దిలీప్ అకారణంగా దూషిస్తూ ‘మా నాన్న పోలీసు’ అంటూ కాలర్ పట్టుకుని దాడి చేశాడు. ఇక్కడ విద్యుత్ స్తంభానికి కట్టేస్తామంటూ కొట్టుకుంటూ అక్కడికి తీసుకుని వెళ్లారు. అదే సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు ‘నేను పోలీసును రా ఎవరినైనా తంతా..’ అంటూ నోటికి వచ్చినట్లు దూషించి పిడిగుద్దులు కురిపించాడు. రాములు ప్రాధేయపడినా పట్టించుకోకుండా రాళ్లతో దాడిచేసేందుకు యత్నించారు. రాములు వారి నుంచి తప్పించుకుని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు, అతడి కుమారుడు దిలీప్, మరో ఇద్దరు బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్ సీఐ తుల శ్రీనివాసరావు తెలిపారు. కాగా, తమపై దాడి జరుగుతున్న విషయాన్ని డయల్ 100కు సమాచారం అందించినా పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ సరిగా స్పందించలేదని బాధితులు తెలిపారు. పైగా హెడ్‌కానిస్టేబుల్ పద్మారావుకు మద్దతుగా మాట్లాడుతూ నీవు ఎందుకు వెళ్లావని నన్నే దబాయించాడని రాములు ఆవేదన వ్యక్తం చేశాడు. హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలి.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సాక్షి సబ్ ఎడిటర్లపై హెడ్‌కానిస్టేబుల్ పద్మారావు, అతని కుమారుడు దిలీప్, బంధువులు అకారణంగా దాడి చేయడాన్ని టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. వెంటనే నిందితులపై చర్య తీసుకోవాలని, పద్మారావును విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుని, జర్నలిస్ట్‌కు రక్షణ కల్పించాలని కోరారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంఘం బాధ్యులు వన్‌టౌన్ సీఐ తుల శ్రీనివాసరావును కలిసి విజ్ఞప్తి చేశారు. సీఐని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానపట్ల మారుతి, కోశాధికారి తాండ్ర శరత్‌రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, సాక్షి కరీంనగర్ బ్యూరో ఇన్చార్జి ఆంజనేయులు ఉన్నారు. -
ఇటుకతో కొట్టి ఇద్దరు కొడుకులను చంపిన తల్లి
కోల్‌సిటీ(రామగుండం): ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్తబంధం విలువ నీకుతెలియదురా... నుదుటిరాతలు రాసే ఓ బ్రహ్మదేవా.. తల్లికొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా’ అంటూ తన కొడుకు కోసం ‘తల్లి’డిల్లిన పాట ప్రతీతల్లి హృదయాన్ని కలిచి వేస్తుంది. పిల్లలు పుట్టాలని ఎందరో వ్రతాలు చేస్తున్నారు. మహాశివరాత్రికి జాగారం చేస్తున్నారు... పుట్టినబిడ్డ కాలికి రాయి తగితేనే విలవిల్లాడి పోతారు. కానీ గోదావరిఖనిలో ఓ అమ్మ... తన రెండు కనుపాపలను తనే పొడుచుకుంది. ఇటుకతో ఇద్దరు కొడుకులపై విచక్షణ రహితంగా దాడి చేసింది. తలలు పగిలి మెదడు బయటపడేలా కొట్టింది.. ‘అమ్మా.. ప్లీజ్ నొప్పిగా ఉందమ్మా... ప్లీజ్ కొట్టకమ్మా... అంటూ ప్రాధేయపడినా ఆ తల్లి మనసు కరుగలేదు. గోదావరిఖనిలో సోమవారం జరిగిన ఈ దారుణఘటన ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్–రమాదేవి దంపతులిద్దరూ ఉన్నత విద్యావం తులే. శ్రీకాంత్ ఎమ్మెస్సీ బీఈడీ చేయగా, రమాదేవి బీఎస్సీ బీఈడీ చదివింది. వీరి పెద్ద కొడుకు అజయ్‌కుమార్(10) 4వ తరగతి, చిన్న కొడుకు ఆర్యన్(6) ఎల్కేజీ చదువుతున్నారు. శ్రీకాంత్ స్థానిక రమేష్‌నగర్‌లోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రమాదేవి కొంత కాలం ప్రైవేట్టీచర్గా పనిచేసి, ఇప్పుడు ఇంట్లోనే ఉంటోంది. చికిత్స పొందుతూ మృతి.. తల పగిలి అపస్మారకస్థితిలో ఉన్న అజయ్‌కుమార్ చికిత్స ప్రారంభించేలోగా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న చిన్న కొడుకు ఆర్యన్‌ను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదు గంటలు ప్రాణాలతో కొట్లాడి తుదిశ్వాస విడిచాడు. కన్నీరుపెట్టిన కాలనీ.. ఈ సంఘటన సప్తగిరికాలనీలో రెండు కుటుంబాలతోపాటు కాలనీ ప్రజలను కంటతడిపెట్టించింది. చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అజయ్‌కుమార్, ఆర్యన్ మృతదేహాలను పక్కపక్కనే పెట్టిన ఈ దృశ్యం కుటుంబ సభ్యులతోపాటు, స్థానిక ప్రజలను కన్నీరు పెట్టించింది. సాయంకాలానికి అన్నదమ్ములిద్దరికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అమ్మచేత అన్నం తినకుండానే కన్నుమూశారు సోమవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే గంగస్నానం చేసి వచ్చి సంతోషంగా అమ్మ చేత అన్నం తినాలని పిల్లలు సంతోషపడ్డారు. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలని ఎదురుచూశారు. గురుకులంలో పనిచేసిన శ్రీకాంత్ ఆదివారం రాత్రి అక్కడే బస చేసి సోమవారం ఉదయం ఇంటికి పూజా సామగ్రితోపాటు పిల్లలకు అల్పాహారం, పండ్లు తీసుకువచ్చాడు. కానీ అప్పటికే ఇంట్లో జీవచ్ఛవాలుగా పడి ఉన్న కొడుకులిద్దరినీ చూసి గుండెలవిసేలా రోదించాడు. కనికరించని తల్లిమనసు.. పిల్లలిద్దరూ బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేసిన రమాదేవి కొడుకులపై ఒక్కసారిగా దాడి చేసింది. ఇటుకతో అజయ్‌కుమార్, ఆర్యన్ తలలపై విచక్షణారహితంగా కొట్టింది. ప్లీజ్ మమ్మీ.. నొప్పిగా ఉంది.. కొట్టకు మ మ్మీ.. అంటూ కొడుకులిద్దరూ ప్రాధేయపడు తూ దెబ్బలకు తట్టుకోలేక విలవిల్లాడిపో యారు. అప్పటికే తలలు పగిలి రక్తం కారుతున్నా పిల్లలను చూసినా ఆ తల్లి మనసు కనికరించలేదు. తలలు పగిలి కుప్పకూలారు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొడుకులిద్దరిని తండ్రితోపాటు స్థానికులు గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొడుకులను చంపిన ఆవేశం దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శ్రీకాంత్ తల్లిదండ్రులు, రమాదేవి తల్లిదండ్రులు కలిసి సప్తగిరికాలనీలో ఓ ఇంటిని కొనుగోలు చేసి శ్రీకాంత్–రమాదేవికి ఇచ్చారు. అయితే తండ్రితో చనువుగా ఉంటున్న ఇద్దరు కొడుకులు తనతోమాత్రం సరిగా ఉండడం లేదని పిల్లలపై రమాదేవి కోపం పెంచుకునేదని శ్రీకాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నా డు. అదే ఆవేశం కొడుకుల ప్రాణంతీసింది. అమ్మా మాకెందుకీ శిక్ష! పెద్దపల్లి: అదిగో శివ నామస్మరణం.. ఇంటింటా శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు.. తమ్ముడూ ఆర్యన్ లే.. నిన్నే కాదు అమ్మ నన్ను కూడా కొట్టింది.. నా తల పగిలి రక్తం కారుతోంది.. నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు ఒక శివనామస్మరణ తప్ప.. జోల పాడిన అమ్మ మనకెందుకు మరణశిక్ష విధించింది.. నవమాసాలు మోసి కన్న మమ్ముల్ని తప్పటడుగులు వేసినప్పుడు కాలు జారి కింద పడితేనే విలవిల్లాడిన అమ్మ ఇటుకరాయితో నిన్ను బాదుతుంటే అడ్డం వచ్చిన నా తలపైనా కొట్టింది. లేరా తమ్ముడు అన్నయ్య అజయ్ శివాలయానికి వెళ్దాం.. శివపూజలు చేద్దాం.. అమ్మ మనసు మార్చమని వేడుకుందాం.. ఆగండి, మా తమ్ముడిని ఎటు తీసుకెళ్తున్నారు.. ఆస్పత్రి వద్దు మాకేం కాలేదు.. గోరుముద్దలు తినిపించిన అమ్మ కొట్టిన దెబ్బలు మమ్మల్నేం చేయలేవు.. ఎన్నో రోజులు ఉపవాసం ఉండి మాకు స్వీట్లు తినిపించిన అమ్మ ఇప్పుడు మమ్ముల్ని రాయితో కొట్టి రక్తం కళ్ల చూసింది.. ఊపిరి ఆడడం లేదు.. కనుచూపు కనిపించడం లేదు.. అదిగో డాక్టర్లు వచ్చి తమ్ముడిని, నన్నూ కోసి మూటగట్టి నాన్నకు అందజేస్తున్నారు. ఏడవకండి పండగ పూట మా కన్నీళ్లు మీకు శివరాత్రి జాగరణగా మార్చాయని తెలుసు. అందరినీ విడిచి.. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నాం. – అజయ్, ఆర్యన్ల ఆత్మఘోషకు అక్షరరూపం పోలీసుల అదుపులో నిందితురాలు రమాదేవిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పిల్లలను విచక్షణారహితంగా కొట్టిన తర్వాత, రమాదేవి ఇంట్లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసిందని రమాదేవి తండ్రి పాపయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇద్దరి మనమళ్లను ఎందుకు కొట్టి చంపాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని తెలిపాడు. సంఘటనాస్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్ పరిశీలించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు.శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రియురాలిపై దాడి చేసిన ప్రియుడి అరెస్టు
జ్యోతినగర్(రామగుండం): ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అంతలోనే అనుమానంతో ప్రియురాలిని అంతం చేయాలని చూశాడు ప్రియుడు. ఇందుకు ఆమెపై కత్తితో దాడి చేశాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. హత్యాయత్నానికి పాల్పడిన నస్పూరి శ్రీనివాస్(30)ను ఎన్టీపీసీ ఎస్సై శంకరయ్య అరెస్ట్ చేయగా.. వివరాలను గోదావరిఖని ఏసీపీ రక్షిత కే.మూర్తి, రామగుండం సీఐ బి.స్వామి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఆటోనగర్‌కు చెందిన యువతి, భీమునిపట్నంకు చెందిన నస్పూరి శ్రీనివాస్ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. 2013లో యువతికి వేరే వ్యక్తితో వివాహమైంది. అయినా.. శ్రీనివాస్ యువతి వెంటపడ్డాడు. ఆమె భర్త నుంచి విడాకులు ఇప్పించాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామని కోరగా వాయిదా వేస్తూ వచ్చాడు. అదే సమయంలో యువతిని అనుమానిస్తూ గొడవపడేవాడు. ఈనెల 21న యువతి ఇంటికొచ్చిన శ్రీనివాస్.. మార్చి 10న వివాహం చేసుకుందామని చెప్పి.. రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. మార్గంమధ్యలో కత్తితో దాడి చేశాడు. బాధితురాలు తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు చేరింది. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలించారు. సోమవారం ఉదయం ఓపెన్‌కాస్ట్–4 ప్రాంతంలో నిందితుడిని పట్టుకున్నారు. యువతిపై దాడి చేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
దూకుడు పెంచిన ఏసీబీ
వరంగల్ క్రైం: ప్రభుత్వం వేల రూపాయల వేతనాలు పెంచినా.. కొంత మంది అధికారుల వక్ర బుద్ధి మారడం లేదు. ప్రజలను లంచం పేరుతో జలగల్లా పీక్కుతుంటున్నారు. పైసలు ఇవ్వందే ఫైళ్లు కదలటం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అవినీతి అధికారుల వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. ఉచితంగా..స్వచ్ఛందంగా చేయాల్సిన పనులకు పర్సంటేజీలు కట్టి వాటిని వసూల్ చేసేందుకు నిబంధనలున అడ్డుగా పెట్టి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూన్నారు. పచ్చ నోట్లు చేతుల్లో పెడితే ఫైళ్లకు రెక్కలు వస్తున్నాయి. కాసుల కక్కుర్తికి నిబంధనలకు నీళ్లు ఒదులుతున్నారు. ప్రతినిత్యం అందిన కాడికి దోచేద్దాం అనే ఆలోచనలో కొంత మంది అధికారులు కార్యాలయాలకు వస్తున్నారు. ఇలాంటి దృష్యాలు ప్రతీ సర్కారు ఆఫీసుల్లో దర్శనం ఇస్తున్నాయి. అక్రమ సంపాదన కోసం ప్రజలను పీక్కుతుంటున్న అవినీతి అధికారుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక శాఖ ఇటీవల దూకుడు పెంచింది. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు కాదు...రాకెట్లు పరుగిడుతున్నాయి. ఏసీబీ వల్ల కొంత మంది అధికారులైన స్వచ్ఛందంగా పనులు చేయటానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల ఏసీబీ పెంచిన దూకుడుకు అవినీతి చేపలు ఒక్కొక్కటిగా వలలో చిక్కుతున్నాయి. గత ఏడాది జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అ«ధికారులు 12 కేసులు నమోదు చేయగా ఈ సంవత్సరం ఒక నెలల్లోనే మూడు కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించారు. గత ఏడాది 12 కేసులు నమోదు.. 2018 సంవత్సరంలో ఏసీబీ అధికారులు అక్రమాస్తులు, లంచం పుచ్చుకున్న అధికారులపై 12 కేసులు నమోదు చేశారు. మునిసిపాలిటీ డీఈ పాటి కొండల్రావు ఆదాయంకు మించి ఆస్తులు ఉన్నాయనే కారణంతో అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. మహబుబాబాద్ టౌన్ సబ్ఇన్స్పెక్టర్ ముత్తె కమలాకర్ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్ఎస్ఏ ఈఈ రవీందర్రావు కాంట్రాక్టర్ నుంచి రూ.3 లక్షల లంచం తీసుకుని పట్టుబడ్డాడు. నర్సంపేట నగరపంచాయతీ ఆర్ఐ మెరుగు మురళి రూ.10 వేలు లంచం తీసుకోని ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. భూపాల్పల్లి ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పిండి శ్రీనివాస్ రూ.50 వేలు లంచం తీసుకుని పట్టుబడ్డాడు. జనగామ జిల్లా చిల్పూరుగుట్ట దేవస్థానం ఈవో చెరుకు జయశంకర్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. హన్మకొండ ఆర్అండ్బీ ఏఈ వంగరి కోటేశ్వర్రావు కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. చిట్యాల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే డిప్యూటీ తహశీల్దార్ కిరణ్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మహబుబాబాద్ జిల్లా, కురవి మండలం బలుపాల వీఆర్ఓ గౌసియాబేగం రూ.8 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయింది. జనగామ ఫైర్ అధికారి ఆర్.సత్యనారాయణ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. భీందేవరపల్లి మండలం వంగర వీఆర్ఓ గుమ్మడి రమేష్ రూ.5 వేలు, ఇరిగేషన్ కార్యాలయంలో పనిచేసే డీఈ వి.రఘుపతి, ఏఈ గాడిపల్లి గౌరిలక్ష్మీలు రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక్క నెలలో మూడు కేసులు.. ఈ సంవత్సరం జనవరి నెలలోనే ముగ్గురు అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అవినీతి అధికారులపై ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై స్పందిస్తున్న అధికారులు అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ప్రజలను పీడీస్తున్న అధికారులకు ఏసీబీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. మహబుబాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం వి. వీరేశంను రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ములుగు ఇరిగేషన్ కార్యాలయం టెక్నికల్ అధికారి ఎం.ఆశలు రూ.20 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. తెలంగాణ రాష్త్ర ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయం సూపరింటెండెంట్ పల్లకొండ యాదగిరి రూ.64,500 లంచం పుచ్చుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదులు చేస్తే స్పందిస్తాం ప్రభుత్వ అధికారులు పనుల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన, లంచం డిమాండ్ చేసిన అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తే స్పందిస్తాం. ఫిర్యాదులపై విచారణ చేసి దాడులు నిర్వహిస్తాం. ఫిర్యాదు దారులు వాస్తవ విషయాలను మాత్రమే చెప్పాలి. వ్యక్తిగత కక్షలతో ఫిర్యాదు చేయరాదు. ఇక్కడ ప్రతి ఫిర్యాదుపై లోతైన విచారణ ఉంటుంది. అవినీతి అధికారులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఏ అధికారైన లంచం కోసం డిమాండ్ చేస్తే నేరుగా 1064,104 టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలి. దీంతో పాటు 9440446146 నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతీ ఫిర్యాదును గోప్యంగా ఉంచుతాం. యువకులు, స్వచ్ఛంద సంస్థలు అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నవారి వివరాలు అందజేసిన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. –కె.భద్రయ్య, వరంగల్ ఏసీబీ డీఎస్పీ -
టీడీపీ నాయకుల దుశ్చర్య!
శ్రీకాకుళం రూరల్: మండలంలోని ఇప్పిలి గ్రామం పెద్దవీధికి చెందిన యువతి ఇప్పిలి జ్యోతికుమారిపై టీడీపీ నాయకులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం ఉదయం బాధితురాలి సోదరుడు సంతోష్‌కుమార్ తన ఇంటి ఆరుబయట కాళ్లు శుభ్రం చేసుకుంటున్న సమయంలో అటువైపుగా వెళ్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇప్పిలి సత్యనారాయణ ‘మీరు వాడే మురికి నీరు దాటి మేం వెళ్లాలా’ అంటూ వాగ్వివాదానికి దిగారు. తగాదా పెద్ద కావడంతో సమీపంలో ఉన్న సత్యనారాయణ కుమారుడు ఇప్పిలి లోకేష్, టీడీపీకి చెందిన ఇప్పిలి వెంకటరమణ, ఇప్పిలి సన్యాసి, ఇప్పిలి గణపతిరావు మాకుమ్మడిగా యువకుడిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. తన అన్నపై దాడి చేస్తున్నారని తెలుసుకున్న జ్యోతికుమారి.. ఇంట్లో నుంచి కేకలు వేస్తూ బయటకు వచ్చి వారిని అడ్డుకోబోయింది. ఆమెను కూడా నిందితులు కర్రతో తలపై బలంగా మోదడంతో రక్తపు మడుగుల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే 108లో శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. తలపై బలమైన గాయాలు కావడంతో ఆమెకు 7 కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. రెండేళ్లుగా భరిస్తున్నాం.. ఇదిలా ఉండగా... ఇప్పిలి సత్యనారాయణ మాస్టారు బాత్రూం నీరు గతంలో తమ ఇంటి మీదుగానే వెళ్లేదని, తమ కుటుంబం అంతా ఆ మురికి నీటి మీదుగానే రెండు సంవత్సరాలుగా రాకపోకలు సాగించే వాళ్లమని బాధితుడు సంతోష్‌కుమార్ తెలిపారు. అయితే... ఇటీవల కాలువలు నిర్మించడంతో మురుగు నీరంతా అందులోకే పోతుందని, దీని వల్ల ఏ ఇంటికీ ఇబ్బంది లేదని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన వారంతా కక్ష్య పూరితంగానే తమపై దాడికి పాల్పడ్డారని, ఆడపిల్లని కూడా చూడకుండా తన చెల్లిని విచక్షణా రహితంగా కొట్టారని వాపోయారు. మరోవైపు... విషయం కాస్తా శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులు శనివారం ఉదయం రిమ్స్ ఆస్పత్రిని చేరుకొని వివరాలను నమోదు చేశారు. డిస్చార్జ్ అయిన అనంతరం ఆధార్‌కార్డు తీసుకొని స్టేషన్‌కు రాజీ కోసం రావాలంటూ బాధితులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. -
ప్రాణం తీసిన నిషా?
వనపర్తి క్రైం: వనపర్తి జిల్లా కేంద్రంలో గంజాయి గుప్పుమంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయి తీసుకుని ఇంట్లో వారిపై దౌర్జన్యాలకు దిగిన సంఘటనలు ఇటీవల వనపర్తి పోలీస్ స్టేషన్ వరకు వచ్చినట్లు సమాచారం. అయినా కన్నప్రేమ విషయం బయటకు పొక్కనివ్వవటం లేదు. ఈనేపథ్యంలోనే నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి యువకులు చేసుకున్న సంబరాల్లో ఓ యువకుడు మృతి చెందడానికి గంజాయి మత్తే కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మత్తులో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. వనపర్తి సీఐ సూర్యానాయక్, ఎస్ఐ జములప్ప, రమణ తెలిపిన వివరాలు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వ్యాపారం కోసం కొన్నేళ్ల క్రితం వనపర్తికి వచ్చిన దేవేందర్ ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనతో పాటు తమ్ముడు పుష్పెందర్ (28) వనపర్తిలోనే నివాసం ఉండేవాడు. పుష్పెందర్‌కు గత ఏడేళ్ల క్రితం సుజాత అలియాస్ రాఖితో వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత వారు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. అక్కడ వ్యాపారంలో నష్టం వచ్చిందని మళ్లీ నలభై రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి వనపర్తికి వచ్చాడు. తన అన్నవెంట పనిచేసే యోగేష్‌తో కలిసి సోమవారం ఇంట్లోనే మద్యం సేవించిన పుష్పేందర్.. మిత్రుడు భానుకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సంతబజార్‌లో ఎస్పీ కార్యాలయం పక్కన తెలిసిన వ్యక్తులు సాయి, చరణ్ మరికొందరు కనిపిస్తే శుభాకాంక్షలు చెప్పారు. అక్కడే ఇరువర్గాల మధ్య మునుపటి విషయాలపై ఘర్షణ మొదలైంది. ఈ సందర్భంగా పుష్పేందర్‌పై సాయి, చరణ్‌తో పాటు మరికొందరు దాడి చేయగా యోగేష్ అడ్డుకునేందుకు యత్నించినా వారు వినకపోవడంతో పారిపోయాడు. ఆ వెంటనే విషయాన్ని పుష్పేందర్ అన్న దేవేందర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న దేవేందర్ ఎస్పీ కార్యాలయం పక్కన రోడ్డుపై పడి ఉన్న పుష్పేందర్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిందని ఎస్ఐ జములప్ప తెలిపారు. కాగా, ఈ విషయమై సీఐ సూర్యానాయక్‌ను వివరణ కోరగా.. జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయనే అంశంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. -
పోలీస్‌స్టేషన్‌కు రమ్మని పిలిచి..
అనంతగిరి (కోదాడ) : భూ వివాదంపై ఓ వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎస్ఐ చితకబాదాడు. ఈ ఘటన అనంతగిరిలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గంధం శ్రీనుకు తన తల్లి, చెల్లెలుతో జరుగుతున్న భూ వివాదాన్ని పరిష్కరించాలని ఎస్పీ అనంతగిరి ఎస్ఐని ఆదేశించారు. ఈ మేరకు ఎస్ఐ రామాంజనేయులు గంధం శ్రీనుని ఫోన్లో సంప్రదించి స్టేషన్‌కు రావాలంటూ ఆదేశించాడు. దీంతో శ్రీను న కొడుకు మనోహర్‌తో కలిసి మంగళవారం రాత్రి ఎడున్నర గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్లాడు. లోపలికి వెళ్లగానే.. స్టేషన్ లోపలికి వెళ్లగానే ఎస్ఐ తనపై దాడి చేశాడని బాధితుడు వాపోయాడు. దుర్భాషలాడుతూ సిబ్బందితో కలిసి చిత్రహింసలు పెట్టారని తెలిపా డు. చివరకు బూటుకాలిని నాకించి అవమానానికి గురిచేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు. న్యాయం చేయాలని.. తనపై దాడి చేసిన పోలీసులపై చర్య తీసుకుని న్యా యం చేయాలని కోరుతూ బాధితుడు శ్రీను కుటుంబంతో సహా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయిం చాడు. సివిల్ కేసును కో ర్టుకు పంపకుండా అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించాడు. ఎస్ఐ రామాంజనేయులు తీరుతో తనకు ప్రాణ హాని ఉన్నదని పై న్యాయం చేయాలని వేడుకున్నారు. దాడి చేయలేదు : ఎస్ఐ గంధం శ్రీనుపై తాము దాడి చేసినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎస్ఐ రామాంజనేయు తెలిపారు.శ్రీనుపై విచారణ చేపట్టాలంటూ ఎస్పీ ఆదేశాల మేరకు అతడిని పిలిపించామని తెలి పా రు. అతని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచా రించామని, ఆకేసు నుంచి తప్పించుకునేందుకే తప్పుడు ఆనోపణలు చేస్తున్నాడన్నారు. అనుమతి లేకుండా స్టేషన్ ఎదుట ఆందోళన చేసినందుకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
‘‘మేము ఎవరిమో నీకు తెలుసా..?’’
సాక్షి, కొత్తగూడెంఅర్బన్: పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో, విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై, పోలీసులపై నలుగురు తాగుబోతులు దౌర్జన్యం చేశారు. ‘మేము ఎవరిమో తెలుసా..? తెల్లారేసరికి నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాం’ అని, ఎస్సైని బెదిరించారు. కొత్తగూడెం త్రీటౌన్ సీఐ ఆదినారాయణ, ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలు... అది, కొత్తగూడెంలోని సూపర్‌బజార్ సెంటర్. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలు దాటింది. కొత్తగూడెం 33వ వార్డు కౌన్సిలర్ కుమారుడు బాలిశెట్టి పృథ్వీరాజ్‌తోపాటు బి.కృష్ణార్జున్, ఎండి.రఫిక్, బాలిశెట్టి సత్యనారా యణ.. మద్యం మత్తులో ఉన్నారు. తమ కారును సెంటర్లో ఆపారు. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. అదే సమయంలో అటువైపుగా ఎస్సై నరేష్, పోలీసులు వచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారితో ఎస్సై చెప్పారు. అంతే.. ఆ నలుగురు ఎదురుతిరిగారు. ‘‘మేము ఎవరిమో తెలుసా..?’’ అంటూ, ఎస్సైపై.. సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ‘‘తెల్లారేసరికి నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాం’’ అంటూ, మీది మీదికొచ్చి నెట్టేశారు. దుర్భాషలాడారు. ఆ నలుగురు తాగుబోతులను జీపులోకి ఎస్సై ఎక్కించారు. అప్పుడు కూడా ఆ తాగుబోతులు ఎదురు తిరిగారు. వారిని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిపై సీఐ ఆదినారాయణకు ఎస్సై నరేష్ ఫిర్యాదు చేశారు. సీఐ ఆదినారాయణ కేసు నమోదు చేశారు. ఆ నలుగురిని శనివారం కోర్టుకు అప్పగించారు. -
రైతుపై వీఆర్వో దాడి
సాక్షి, తొర్రూరు(పాలకుర్తి): పాస్‌పుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఓ రైతుపై వీఆర్వో దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మహబూ బాబాద్ జిల్లా తొర్రూరు మండలం పత్తేపురం గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్, రైతు లక్ష్మారెడ్డి, అదే గ్రామానికి చెందిన అతడి మేనత్త తలాసాలి పుషమ్మ తమకు ఉన్న వ్యవసాయ భూమిని రికార్డుల్లో ఎక్కించి పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ నాలుగేళ్లుగా వీఆర్వో ఉప్పలయ్య చుట్టూ తిరుగుతున్నారు. ఇందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పగా, వారు కొద్ది నెలల క్రితం రూ.10వేలు ఇచ్చారు. అయినా భూమిని రికార్డుల్లోకి ఎక్కించడంలేదు. పాస్‌పుస్తకం జారీ చేయ డం లేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మారెడ్డి వీఆర్వోను తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రశ్నించాడు. మరో రూ.10వేలు ఇస్తేనే పాస్‌పుస్తకాలు జారీ చేస్తానని నిర్లక్ష్యంగా చెప్పి వెళ్లిపోతున్నాడు. తాను అడుగుతుంటే సరైన సమాధానం చెప్పకుండా వెళ్తున్నావేమిటని వీఆర్వోను లక్ష్మారెడ్డి నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన వీఆర్వో లక్ష్మారెడ్డితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి వీఆర్వో ఉప్పలయ్య లక్ష్మారెడ్డిపై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ సిబ్బంది చేరుకుని శాంతింపజేశారు. పురుగుల మందు డబ్బాతో రైతు నిరసన భూపాలపల్లి: వీఆర్వో తనకు అన్యాయం చేశాడని ఆరోపిస్తూ ఓ రైతు ఆర్డీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం క్రిమిసంహారక మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన పోత శ్రావణ్‌కు ధన్వాడ శివారులోని సర్వే నంబర్ 236/ఏలో 18 గుంటలు, సర్వే నంబర్ 235లో 2.11 ఎకరాల భూమి, సర్వే నంబర్ 326లో 2.22 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో 60 ఏళ్లుగా తాత, తండ్రి, ప్రస్తుతం తాను వ్యవసాయం చేశామని తెలిపాడు. కాగా వీఆర్వో రాజయ్య తనకు తెలియకుండా ఆ భూమిని వేరే ముగ్గురి పేర పట్టా చేశాడని ఆరోపించాడు. ఈ విషయమై వీఆర్వోను అడగ్గా సమస్యను పరిష్కరించకపోగా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని తెలిపాడు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తన భూమిని తనపై పట్టా చేయాలని, లేని పక్షంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని పట్టుబట్టాడు. ఆర్డీఓ కార్యాలయంలోని సిబ్బంది వచ్చి ఆర్డీఓ వచ్చాక సమస్యను విన్నవించాలని చెప్పి, క్రిమిసంహార మందు డబ్బాను లాక్కున్నారు. -
భర్తను గొడ్డలితో నరికిన భార్య
కురవి(డోర్నకల్): దసరా పండుగ రోజు మద్యం తాగి వచ్చి గొడవ పడడంతో ఆగ్రహించిన భార్య గొడ్డలితో భర్తను నరకగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. దసరా పండుగ సందర్భంగా రాజోలు గ్రామంలో మీరంపల్లి ఉపేందర్ తాగిన మైకంలో భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన భార్య సావిత్రి గొడ్డలితో అతడి తలపై నరికింది. తీవ్రంగా గాయపడగా మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సఅందిస్తున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని కురవి ఎస్సై నాగభూషణం తెలిపారు. -
మద్యం మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి
పెద్దేముల్(తాండూరు): భార్యాభర్తల గొడవలో పక్కింటి వ్యక్తి తలదూర్చాడు. దీంతో దంపతులిద్దరూ ఏకమై మా సమస్య గురించి నీకెందుకు అని వారించడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి తన ఇంట్లో నుంచి కత్తి తీసుకొచ్చి భర్తను దాడి చేసిన సంఘటన పెద్దేముల్ పొలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండల బండపల్లి గ్రామానికి చెందిన చిన్నింటి బుజ్జమ్మ భర్త హన్మంతులు ఆదివారం రాత్రి సుమారు 9:30 సమయంలో కుటుంబ విషయమై గొడవ పడుతున్నారు.ç పక్కింటి వ్యక్తి చిన్నింటి రాములు వచ్చి గొడవ ఏంటీ..? నిత్యం ఇదేనా అంటూ మందలించాడు. దీంతో నీవు మా వద్దకు ఎందుకు వచ్చావు..? నీకు మా సంసారం విషయంతో సంబంధం ఏంటీ అంటు హన్మంతు రాములును ప్రశ్నించాడు. దీంతో రాములు పక్కనే ఉన్న రాడ్డుతో హన్మంతుపై దాడికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. అప్పటికే మద్యం మత్తుల్లో ఉన్న చిన్నింటి రాములు ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న కత్తి తీసుకొచ్చి హన్మంతు తలపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన హన్మంతును గ్రామస్తులు వెంటనే చికిత్స నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుభాష్ అదే రాత్రి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గతంలో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా.. అని ఆరా తీశారు. హన్మంతు భార్య బుజ్జమ్మ ఫిర్యాదు మేరకు రాములును అదుపులోకి తీసుకొని కేసు నమేదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమపెళ్లి..ఇద్దరు ఒకే కులం అయినా?
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రేమపెళ్లి చేసుకున్న ఓ యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో సోమవారం చోటు చేసుకుంది. తీవ్రగాయాలకు గురైన యువకుడిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని దుమాల గ్రామానికి చెందిన దుంపలపల్లి మహేశ్(23) అదే గ్రామానికి చెందిన సోమారపు రేఖ(21) ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు అయినప్పటికీ రేఖ మహేష్‌కు వరుసకు చెల్లెలు కావడం వల్ల వారి పెళ్లిని అమ్మాయి కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో గతేడాది నవంబర్ 21న హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఉంటున్నారు. అయితే ఇరువురూ ఇంటికి రాకుంటే మహేశ్ తల్లిని చంపివేస్తామని రేఖ కుటుంబ సభ్యులు బెరించారు. దీంతో ఇరువురూ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే నెల తిరగకుండానే ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 9న పోలీస్‌స్టేషన్‌లో రెండువర్గాల వారు పంచాయితీ చేసుకున్నారు. మహేశ్ ఇకపై రేఖను కలువరాదని షరతులు పెట్టి పుట్టింటికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆదివారం కానిస్టేబుల్ పరీక్ష రాయడానికి రేఖ కరీంనగర్ వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ ఆమెను వెంబడించి కొదురుపాక వద్ద కలిసి తనతో ఉండాలని ఒత్తిడి చేశాడు. యువతి ఇంటికి వెళ్లి మహేశ్ వెంటపడి వేధించాడని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కోపోదిక్తులైన వారు మహేష్ ఇంటికి వెళ్లి దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అడ్డుగా వెళ్లిన తల్లి బాలమణిని సైతం చితకబాదారు. పోలీసులు రంగంలోకి దిగి మహేశ్‌తో పాటు అతని తల్లిని చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. పెళ్లి ఇష్టం లేకనే దాడి నా కొడుకు రేఖను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే కర్రలు, రాడ్‌తో దాడి చేశారు. కులాలు ఒక్కటైనా ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నా కొడుకు చావుబ్రతుకుల మధ్య ఉన్నాడు. అమ్మాయి కుటుంబసభ్యులు షరవింద్, బాను, బాల్‌రాజు, చందు, వజ్రవ్వ ఆమె భర్త కలిసి కొట్టారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. – బాలమణి, మహేశ్ తల్లి -
మంచం కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు
కరీమాబాద్ (వరంగల్): తల్లిదండ్రులకు చెందిన మంచం కోసం అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణ కాస్త ఒకరి ప్రాణం తీసింది. అన్నను తమ్ముడు కర్రతో కొట్టి హత్య చేసిన సంఘటన మంగళవారం రాత్రి నగరంలోని లేబర్ కాలనీలో చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ సీఐ దయాకర్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. నగరంలోని లేబర్‌కాలనీకి ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలో విద్యుత్ లైన్‌మన్ ఇమ్మడి భాను ప్రకాష్(43) తన అన్నదమ్ములకు తల్లిదండ్రులు ఆస్తులు పంచగా మిగిలిన డెకోలం మంచం తమ్ముడైన ఇమ్మడి రాములు ఇంట్లో ఉంది. ఆ మంచాన్ని తీసుకెళ్లేందుకు మంగళవారం సాయంత్రం సుమా రు 6.30 గంట ల ప్రాంతంలో అన్న ఇమ్మడి భానుప్రకాష్ వస్తాడు. ఈ క్రమంలో తమ్ముడు రాములుకు భానుప్రకాష్ కు మధ్య తీవ్రంగా గొడవ జరుగుతుంది. ఆగ్రహం చెందిన రాములు అక్కడే ఉన్న కర్రతో అన్న భానుప్రకాష్ తల, కాళ్లమీద కొట్టాడు. దీంతో అపస్మారక స్తితిలోకి వెళ్లిన భానుప్రకాష్‌ను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృ తిచెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. రాములు పరారీలో ఉన్నాడు. -
ప్రియురాలి కోసం వేటకొడవలితో...
గీసుకొండ(పరకాల): తన ప్రియురాలిని వెంట తిప్పుకుంటున్నాడని టీఆర్ఎస్ నాయకుడిపై ఓ వ్యక్తి కొడవలితో హత్యా యత్నం చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండలో ఆదివారం జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోనె మల్లయ్య(మల్లారెడ్డి)ని గీసుకొండకు చెందిన ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా అటెండర్ గ్యాస్ సేఫ్టీ డివైజ్ విక్రయానికి సంబంధించి ఏజెంట్‌గా చేర్పించింది. కాగా శని వారం మల్లారెడ్డితోపాటు టీమ్ లీడర్లు సదానందం, బాలిరెడ్డి, మహిళా అటెండర్ తమ కంపెనీ పనిపై కారులో సంగెం మండలం లోహిత గ్రామానికి బయల్దేరారు. వరంగల్ నగరంలోని అండర్‌బ్రిడ్జి దాటి వెళ్తుండగా గమనించిన మనుగొండ గ్రామానికి చెందిన బోయరాజు (ఊకల్ క్రాస్‌లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ యజమాని) బైక్‌పై వేగంగా వెళ్లి కారుకు అడ్డంగా పెట్టాడు. మహిళా అటెండర్‌ను ఎందుకు తీసుకెళ్తున్నారని గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి ఆమె నిద్రిమాత్రలు మింగడంతో బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు మల్లారెడ్డి తన కారులో తీసుకుని వెళ్లి ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమె కోల్కోవడంతో ఆదివారం తెల్లవారుజామున ఇంటి వద్ద దింపి వెళ్లాడు. అక్కడికి బోయరాజు వచ్చి ఆమెతో గొడవపడి చంపుతానని బెదిరిం చాడు. వితంతువైన ఆమె, తాను ప్రేమించుకున్నామని, చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నామని, ఫొటోలు చూపుతూ ఆమెతో తిరగరాదని హెచ్చరించాడు. గీసుకొండలో ఎంపీపీ భర్త రాజ్‌కుమార్ వద్ద మాట్లాడుకుందామని చెప్పి మల్లారెడ్డి అక్కడికి వెళ్లాడు. ఉదయం గ్రామంలోని ఆంధ్రాబ్యాంకు ఎదురుగా హోటల్ వద్ద రాజ్‌కుమార్ ఉండగా అతడికి విషయం చెబుతుండగానే అక్కడే ఉన్న బోయ రాజు వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మల్లారెడ్డి మెడపై వేటు వేయడానికి యత్నించాడు. అయితే చొక్కా కాలర్‌కు కొడవలి తగలటంతో మెడపై స్వల్ప గాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రాజ్‌కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఎస్సై విఠల్ తెలిపారు. -
ఘర్షణను అడ్డుకున్నాడని..
మునగాల(నల్గొండ) : ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నిం చిన ఓ వ్యక్తిపై నిందితులు దాడి చేసి తీవ్రంగా పరిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మునగాల మండలం బరాఖత్‌గూడెంలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరాఖత్‌గూడెం గ్రా మానికి చెందిన షేక్ బంటుసాహెబ్(45) వృతి ్తరీత్యా వ్యవసాయ కూలీ. ఇతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు. రెండో అన్న షేక్ దస్తగిరి పెద్ద కుమారుడు షేక్ షరీఫ్, పెద్ద అన్న షేక్ మన్సూర్ అలీతో ఆదివారం రాత్రి ఓ విషయంలో ఘర్షణకు ది గాడు. షరీఫ్ సాయంత్రం 7గంటల సమయంలో మన్సూర్ అలీ ఇంటివద్దకు వచ్చి ఘర్షణ పడుతుండగా అటుగా వస్తున్న బంటు సాహెబ్ ఘర్షణ వద్దని షరీఫ్‌ను అడ్డుకోబోయాడు. దీంతో ఆగ్రహించిన షరీఫ్ బంటు సాహెబ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. దీంతో గాయపడిన బం టు సాహెబ్ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య జాన్‌బీ, కూతురు, అల్లుడికి వివరిస్తుండగా పక్కఇంటిలో ఉన్న షరీఫ్ తండ్రి దస్తగిరి, సోదరుడు మీరా మరోసారి బంటుసాహెబ్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బంటు సాహెబ్‌ను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కోదాడకు తరలించగా చికిత్స పొం దు తూ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కో దాడ డీఎస్పీ బి.సుదర్శన్‌రెడ్డి, స్థానిక సీఐ ఎస్.శివశంకర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఘర్ష ణకు దారితీసిన విషయాలను స్థానికులు, కుటుం బసభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతుని భా ర్య జానిబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు షేక్ షకీర్, షేక్ దస్తగరి, షేక్ మీరాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్ఐ గడ్డం నగేష్ తెలిపారు. బంటు సాహెబ్ మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు సీఐ శివశంకర్ గౌడ్ తెలిపారు. -
నర్సరీ వ్యాపారి పై కత్తులతో దాడి
సూర్యాపేటక్రైం : పూటుగా మద్యం సేవించిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని అమ్మగార్డెన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెరుమాళ్ల శ్రీనివాస్‌గుప్తా గుజరాత్లో నర్సరీ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి చేరుకుని పని పూర్తిచేసుకుని, ఆదివారం రాత్రి గుజరాత్‌కు తన సొంత కారు (ఏపీ 37సీవీ 2444)లో బయలుదేరాడు. ఖమ్మం మీదుగా సూర్యాపేటలోని అమ్మగార్డెన్ సమీపంలోకి అర్ధరాత్రి చేరుకున్నాడు. అక్కడ కారు ఆపి మూత్రవిసర్జన చేస్తుండగా రెడ్ పల్సర్ బైక్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాస్‌గుప్తా వద్దకు వచ్చా రు. ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదని దబాయించి దాడిచేశారు. అంతేకాకుండా.. నీ వద్ద ఎంత నగదు ఉందంటూ.. ఆ నగదు మొత్తం ఇవ్వాలని బెదిరించారు. తన వద్ద డబ్బులు లేవని బాధితుడు చెప్పినా వినకుండా కిందపడేసి పైజేబులో ఉన్న రూ.5 వేల నగదును అపహరించుకెళ్లారు. అంతటితో ఆగకుండా కత్తులతో రెండు చోట్ల పొడిచారు. తేరుకున్న శ్రీనివాస్ వెంటనే 100కు ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దాడి చేసి.. డబ్బులు దోచేసి..
రాజేంద్రనగర్ : గుర్తుతెలియని దుండగులు ఓ గ్యాస్ ఏజెన్సీ క్యాషియర్‌పై దాడి చేసి రూ. 6.7లక్షలు దోచుకుపోయారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్ ప్రాంతానికి చెందిన రాము(23) రాజేంద్రనగర్ బుద్వేల్‌లో ఉన్న భార్గవి గ్యాస్ ఏజెన్సీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం వచ్చే నగదును ఇంటికి తీసుకువెళ్లి మరుసటి రోజుబ్యాంకులో డిపాజిట్‌చేస్తుండేవాడు. ఈక్రమంలో బుధవారం రూ. 6.70 లక్షల నగుదు రావడంతో బ్యాగులో పెట్టుకొని రాత్రి 11 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గంమధ్యలో బుద్వేల్ ప్రధాన రహదారిపైకి రాగానే నలుగురు యువకులు రామును వెంబడించి వాహనంపై నుంచి నెట్టివేశారు. కిందపడిన అతడి వద్ద నుంచి బ్యాగును లాక్కునేందుకు ప్రయత్నించారు. రాము వారిని అడ్డుకునే యత్నం చేయగా కట్టెలతో దాడి చేశారు. దుండగులు తలపై మోదడంతో రాము అక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం డబ్బులు ఉన్న బ్యాగును తీసుకొని నలుగురు యువకులు పరారయ్యారు. స్థానికులు విషయాన్ని గమనించి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడిని హైదర్‌గూడలోని ఉషామోహన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తలకు 18 కుట్టు వేశారు. ప్రస్తుతం రాము కోలుకుంటున్నాడు. తనపై దాడి చేసిన యువకులను మరోసారిచూస్తే గుర్తుపడతానని అతడు పోలీసులకు తెలిపాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
బ్యుటీషియన్ పద్మ కేసు: తెరపైకి నూతన్ భార్య
సాక్షి, హనుమాన్ జంక్షన్ : బ్యూటీషియన్ పద్మపై దాడి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్ కుమార్ తాజాగా ఆత్మహత్య చేసుకోవడంతో.. ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అన్నది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో పద్మ ప్రియుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ భార్య సునీతను పోలీసులు సోమవారం విచారించారు. తన భర్త చనిపోవడానికి బ్యూటీషియన్ పద్మనే కారణమని సునీత తెలిపింది. 2012లో తమ వివాహం జరిగిందని, తన భర్త నూతన్ ఓ ప్రైవేటు షోరూంలో మేనేజర్ గా పనిచేసేవారని తెలిపింది. ఆ సమయంలో అదే ఆఫీస్‌లో పనిచేస్తున్న పద్మ తన భర్తను లోబరుచుకుందని ఆమె ఆరోపించారు. తన భర్తకు ఇష్టం లేకున్నా వేధింపులకు గురిచేసిందని, విడాకులు తీసుకోవాల్సిందిగా నూతన్‌ను పద్మ హింసించిందని సునీత తెలిపింది. ప్రసుత దారుణమైన పరిస్థితులన్నింటికీ పద్మే కారణమని తెలిపింది. మరోవైపు బ్యూటీషియన్ పద్మ విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్న నూతన్ కుమార్ మృతదేహానికి ఇదే ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. -
సీఎస్‌పై దాడి చార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలను నిందితులుగా చేరుస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్‌కు సమర్పించిన చార్జిషీట్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో 11 మంది ఎమ్మెల్యేల పేర్లున్నాయి. ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ను అధికారిక విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు, గాయపరిచేందుకు కేజ్రీవాల్, సిసోడియా తదితరులు కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, చంపేస్తామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. కాగా, చార్జిషీటుపై ఈనెల 25వ తేదీన విచారణ చేపడతామని మెజిస్ట్రేట్ ప్రకటించారు. -
రిజిస్ట్రార్‌పై దాడి ఎఫెక్ట్
సాక్షి, కర్నూలు(గాయత్రీ ఎస్టేట్) : రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్పై దాడి ఘటన పట్ల ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. బీఈడీ కళాశాలల స్టాఫ్ అప్రూవల్ విషయంలో ఈనెల 5న రిజిస్ట్రార్‌పై ఎస్కే యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్ప చౌదరి, కర్నూలు ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్య దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిపై కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. దాడికి యత్నించినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది మూడు రోజుల పాటు విశ్వవిద్యాలయాన్ని బంద్ చేసి ఆందోళనలు చేపట్టారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో పలు సందేహాలకు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం వర్సిటీ ఘటనపై చర్యలకు పూనుకుంది. ఈమేరకు శనివారం మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎస్కేయూ, ఆర్యూ ఇన్చార్జ్ వీసీలకు పలు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రార్‌పై దాడికి యత్నించిన ఎస్కేయూ అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్ప చౌదరిని సస్పెండ్ చేయాలని, ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్య కళాశాల అఫిలియేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. శుభపరిణామం ఆర్యూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అమర్నాథ్పై దాడి ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించడం శుభపరిణామమని ఆర్యూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు సూర్య పేర్కొన్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవటం వర్సిటీ విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది విజయమన్నారు. -
నవదంపతులపై దాడి కేసులో ట్విస్ట్
-
‘మేమేం రేప్‌లు, మర్డర్లు చేయలేదు’
సాక్షి, మంగళూరు : దాదాపు 9 ఏళ్ల వాదనల తర్వాత మంగళూర్ పబ్ దాడి కేసులో నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాలు లేనందున వారిని విడుదల చేస్తున్నట్లు సోమవారం జేఎంఎఫ్‌సీ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో శ్రీ రామ్ సేన అధినేత ప్రమోద్ ముథాలిక్, కార్యకర్తలకు ఉపశమనం కలిగింది. తీర్పు అనంతరం బయటకు వచ్చిన ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా చిన్న విషయమని తెలిపారు. ‘మేమేం రేప్‌లు, మర్డర్లు చేయలేదు. ఇది చాలా చిన్న విషయం. అనవసరంగా కొందరు భూతద్దంలో పెట్టి ప్రపంచానికి చూపాలనుకున్నారు. జమ్ము కశ్మీర్ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయంటూ అసందర్భ ప్రేలాపనలు చేశారు. పెద్ద పెద్ద నేరాలు చేస్తున్న వాళ్లే బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మేం ఏ తప్పు చెయ్యలేదు. చివరకు ధర్మం గెలిచింది’ అంటూ ప్రమోద్ వ్యాఖ్యానించారు. కాగా, మహిళలని కూడా చూడకుండా పబ్ నుంచి బయటకు లాకొచ్చి మరీ నిర్దాక్షిణ్యంగా దాడి చేశారన్నది వీరందరిపై నమోదైన ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ప్రమోద్‌తోపాటు 30 మంది శ్రీ రామ్ సేన కార్యకర్తలపై కేసు నమోదు అయ్యింది. తొమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు వారందరినీ నిర్దోషులుగా కోర్టు తేల్చింది. ఈ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ముథాలిక్ తెలిపారు. మంగళూర్ పబ్ దాడి కేసు... 2009, జనవరి 24వ తేదీన మంగళూర్‌లోని అమ్నేషియా పబ్‌లో పార్టీ చేసుకుంటున్న యువతపై శ్రీ రామ్ సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను పక్కదోవ పట్టిస్తూ పాశ్చాత్య సంస్కృతిని అవలంభిస్తున్నారంటూ వారిపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో ఉన్న వాళ్లందరినీ బయటకు లాక్కొచ్చి మరీ తరిమి కొట్టారు. అయితే మహిళలను కూడా జుట్టు పట్టుకుని విసిరేస్తూ దాడులు చేయటం.. ఆ వీడియోలు వైరల్ కావటంతో దేశ్యాప్తంగా ఘటన చర్చనీయాంశంగా మారింది. జాతీయ మహిళా కమిషన్ జోక్యంతో కేసు దాఖలు కాగా.. శ్రీ రామ్ సేన అధినేత ప్రమోద్ ముథాలిక్, ఆయన అనుచరుల మీద కేసు నమోదు అయ్యింది. 30 మందిలో 25 మంది నిందితులుగా కోర్టు విచారణను ఎదుర్కోగా.. ముగ్గురు విదేశాలకు పారిపోయారు. మరో ఇద్దరు కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే ప్రాణాలు విడిచారు. -
యువకుడిని చితకబాదిన కేసులో ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీ
బంజారాహిల్స్: ఈ నెల 9వ తేదీన రాత్రి జూబ్లిహిల్స్ చెక్‌పోస్ట్‌లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అంకిత్ సింగ్ అనే వాహనదారుడిపై దాడి చేసిన ఘటనలో జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు జితేందర్, వెంకటేష్‌లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వీరిద్దరినీ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఆ రోజు రాత్రి జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అంకిత్ సింగ్‌ను బయటికి లాగి కిందేసి తొక్కిన దృశ్యాలు వీడియోలో నమోదు కాగా బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ వీడియో దృశ్యాలను పరిశీలించిన అధికారులు వీరిద్దరిపై చర్యలు తీసుకున్నారు. యువకుడు ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ జరిపిన పోలీసు కమిషనర్ తక్షణం కానిస్టేబుళ్లను అటాచ్ చేయాల్సిందిగా ఆదేశించారు. కారులో పక్కన కూర్చున్న వ్యక్తిని సంబంధంలేని విషయంలో తలదూర్చి ఈ కానిస్టేబుళ్లు చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ అంకిత్సింగ్ తమను కొట్టినట్లు జితేందర్ ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేయగా జూబ్లిహిల్స్ పోలీసులు అంకిత్సింగ్ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే వీడియోను మార్ఫింగ్ చేశారని ముందు తననే వారు కొట్టడంతో తాను ఆత్మరక్షణ కోసమే ఎదుర్కోవాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు. -
రూ.10 కోసం కొట్టి చంపాడు..!
ముంబై: కేవలం రూ.10 అడిగినందుకు ఓ వ్యక్తిని స్నేహితుడే కొట్టిచంపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోవైలోని సాయి బన్‌గుర్దా గ్రామానికి చెందిన స్నేహితులు జీవన్ మోరే(35), దినేశ్ లక్ష్మణ్ బుధవారం ఓ షాపులో మద్యం సేవించారు. అనంతరం లక్ష్మణ్ ఓ హోటల్ నుంచి ఇద్దరికీ ఆహార పదార్థాలను తీసుకొచ్చాడు. ఆహారం ఖర్చులో కొంత భరించాలనీ, రూ.10 చెల్లించాలని లక్ష్మణ్ మోరేను కోరాడు. ఇద్దరిమధ్య మాటామాటా పెరగటంతో ఆగ్రహానికి లోనైన మోరే..ఓ కర్రతో లక్ష్మణ్‌పై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. -
నా వెనుక ఎవరూ లేరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భాషను అపహాస్యం చేస్తున్నాడని ఆరోపిస్తూ వీ6 చానెల్ తీన్మార్ యాంకర్ కావలి రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తిపై సోమవారం దాడికి పాల్పడిన మణికంఠను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. గత కొంత కాలంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని వీ6 చానెల్ వద్ద రెక్కి నిర్వహించి మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన బిత్తిరి సత్తిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. చానల్ కార్యాలయం లోపలికి వెళ్తుండగా హెల్మెట్‌తో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతడిని సికింద్రాబాద్‌కు చెందిన కలాసిగుడకు చెందిన మణికంఠగా గుర్తించారు. సత్తి వాడే భాష తెలంగాణ యాసను వెక్కిరిస్తున్నట్టు ఉందని అందుకే దాడి చేసినట్లు తెలిపాడు. తెలంగాణ భాషా గౌరవాన్ని దెబ్బతీయవద్దనే ఈ దాడికి పాల్పడినట్టు తెలిపాడు. తన వెనుక ఎవరూ లేరని అతను పేర్కొన్నాడు. బిత్తిరి సత్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
దాడి కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు
వరంగల్ లీగల్ : ఉద్దేశపూర్వకంగా కక్ష గట్టి ఒకరిపై దాడి చేసి గాయపరిచిన నేరం రుజువు కావడంతో నగరంలోని రంగశాయిపేటకు చెందిన నేరస్తులు వేముల భూపాల్, వేముల క్రాంతికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.800 చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం మూడో మున్సిఫ్ కోర్టు జడ్జి కే.అజేష్‌కుమార్ తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రంగశాయిపేట ప్రాంతానికి చెందిన అలువాల వెంకట్ నాయుడు పెట్రోల్‌పంపు వద్ద లారీ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసేవాడు. పక్కనేగల మరో లారీ ఆఫీస్‌లో భూపాల్, క్రాంతి పనిచేసేవారు. వెంకట్ వలన తమకు వ్యాపారం లాభసాటిగా సాగడం లేదని అతడిపై వీరిద్దరు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో 2012, మార్చి19న రాత్రి సమయంలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న వెంకట్‌పై మార్గమధ్యలో దారికాచి దాడి చేశారు. కాళ్లు, చేతులపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఫోన్ ద్వారా సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి వచ్చి బాధితుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.వారి ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదుచేశారు.కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి అజేష్‌కుమార్ నేరస్తులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.800 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసును అప్పటి ఎస్సై ఆంజనేయులు పరిశోధించగా, సాక్షులను కానిస్టేబుల్ జి.నరేందర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏసీపీ జి.భద్రాద్రి వాదించారు. -
దాడి కేసులో నిందితుల అరెస్ట్
వరంగల్ జిల్లా: కేసముద్రం మండలంలో క్వారీ మేస్త్రీని బెదిరించి దొంగతనానికి పాల్పడిన ఆరుగురి నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మొత్తం ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శ్రీను, సర్దార్, పృథ్వీరాజ్, పుచ్చకాయల నరేష్, గోపి, భరత్‌లుగా గుర్తించారు. బాబు అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సెవ్యా అలియాస్ శ్రీను అనే వ్యక్తి పనికి వెళ్లని రోజుల్లో కూడా జీతం చెల్లించాల్సిందిగా మేస్త్రీని కోరాడు. మేస్త్రీ ఒప్పుకోకపోవడంతో తన స్నేహితులతో కలసి మేస్త్రీ దగ్గర ఉన్న రెండుతులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. అంతేకాకుండా మద్యం సేవించి మేస్తీపై దాడికి పాల్పడ్డారు. మేస్త్రీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. -
కత్తితో దాడి కేసులో మూడేళ్ల జైలు
విజయవాడ లీగల్: మాజీ భార్యపై కత్తితో దాడి చేసినట్లుగా కృష్ణలంక పోలీసులు దాఖలు చేసిన కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.1,000 జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ జడ్జి జి.అనుపమ చక్రవర్తి గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన నిందితుడు చింతపల్లి వెంకటేశ్వరరావుకు, విజయనగరానికి చెందిన నాగమణితో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వారిద్దరూ ఉపాధి కోసం విజయవాడ నగరానికి వచ్చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు భార్యను వేధించడం మొదలు పెట్టాడు. నాలుగేళ్ల కిందట ఫిర్యాది భర్తపై వరకట్నం, వేధింపులపై పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది.ఆ కేసును విచారించిన కోర్టు నిందితునిపై నేరం రుజువు కావడంతో జైలుశిక్ష విధించింది. అనంతరం ఇద్దరు విడాకులు తీసుకుని ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. కాగా, మాజీ భార్య తనకు శిక్ష వేయించిందని కోపం పెంచుకున్న నిందితుడు ఆమెపై పగ తీర్చుకునేందుకు పథకృ పన్నాడు. 2013 జూలై 17న నాగమణి పనిచేస్తున్న వస్త్ర దుకాణం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా వెంబడించాడు. ఆమె యింటికి వెళ్లి కింద పోర్షన్లో అద్దెకుంటున్న వారిని అడగ్గా వారు కేకలు వేయడంతో పారిపోయాడు. విషయం తెలుసుకున్న నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తుండగా కాపు కాచి కత్తితో ఆమెపై దాడి చేశాడు.ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.కోర్టు విచారణలో నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. -
పవన్ అభిమానిపై దాడి: పోలీసుల అదుపులో నలుగురు
గోపాల.. గోపాల ఆడియో విడుదల కార్యక్రమం వద్ద పాస్‌లు ఇవ్వలేదన్న కారణంగా పవన్ కల్యాణ్ అభిమానిపై దాడిచేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆడియో విడుదల కార్యక్రమానికి సంబధించిన వీడియో ఫుటేజి ఆధారంగా వీరిని గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో.. కుమారస్వామి, నరేష్ కుమార్, రాకేష్, రంజిత్ అనే నలుగురు ఉన్నారు. వీళ్లు చేసిన దాడిలో కరుణ శ్రీనివాస్ అనే పవన్ కల్యాణ్ అభిమాని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పవన్ స్వయంగా పరామర్శించి, రూ. 50 వేల సాయం కూడా చేశారు. -
గుజరాత్ పోలీసులపై దాడి కేసులో ముగ్గురికి జైలు
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంలో గుజరాత్ పోలీసులపై జరిగిన హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. పోలీసులపై హత్యాయత్నం చేసినట్లు రుజువు కాలేదని, దాడికి పాల్పడినట్లు మాత్రమే తేలడంతో ముఖీముద్దీన్ యాసిర్, బలివుద్దీన్ జాబేర్, మహ్మద్ షఫిక్‌లకు జైలు శిక్ష పడింది. ఈ ముగ్గురికి సెక్షన్ 148 కింద ఏడాది జైలు, 5 వేల జరిమానా, సెక్షన్ 324 కింద ఏడాది జైలు రూ.వెయ్యి జరిమానా, సెక్షన్ 332 కింద రెండేళ్లు జైలు, రూ.వెయ్యి జరివూనా విధించింది. మౌతసిమ్‌బిల్లా, మహ్మద్ షకీల్‌లను కోర్టు నిర్ధోషులుగా తేల్చింది. ఈ కేసులో 35 మందిని నిందితులుగా చేర్చగా ఐదుగురిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన 30 మంది నిందితుల్లో డీజేఎస్ అధ్యక్షుడు మహబూబ్అలీ మృతి చెందగా మరో 29 మంది పరారీలో ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. కాగా, శిక్ష పడిన ముగ్గురికి నాంపల్లి కోర్టు రూ.10 వేల షూరిటీలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. -
పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, ముస్తఫాలపై దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడిచేసి నలుగురు ఎంపీటీసీలను ఎత్తుకెళ్లిన ఘటనపై త్వరితగతిన విచారణ పూర్తి చేయటం లేదంటూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ, గుంటూరు రూరల్ ఎస్పీ, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిలను చేర్చారు. రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా మేడికొండురూ సమీపంలో ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు ప్రయాణిస్తున్న అంబటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ నిందితులను గుర్తించలేదు. పోలీసులు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం త్వరిగతగతిన విచారణ పూర్తి చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయస్థానం ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.