
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పెద్దకొత్తపల్లి(మహబూబ్నగర్): ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ప్రేమ పెళ్లి వివాదానికి దారి తీసింది. అమ్మాయి బంధువులు అబ్బాయి బంధువులపై దాడి చేయడంతో అబ్బాయి వదిన మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలోని సంపంగి కృప, అదే గ్రామానికి చెందిన ఆత్మకూరి సంతోష్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 5న పెళ్లి చేసుకుని ఎటో వెళ్లిపోయారు.
ఇది జీర్ణించుకోలేని అమ్మాయి బంధువులు సంపంగి లక్ష్మయ్య, లింగస్వామి, శాంతమ్మ ఈనెల 6న గొడ్డలి, రోకలిబండతో అబ్బాయి వదిన ఉష (32), అన్న చెన్నయ్యపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఉషను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈమెకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ విషయమై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ గిరిబాబు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment