relatives
-
బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!
నమ్మేవాళ్లుండాలే గానీ ఎంతటి మోసానికి పాల్పడవచ్చు. కానీ మోసం ఎంతోకాలం దాగదు. ఎప్పటికైనా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం తప్పదు.చైనాకు చెందిన ఒక మహిళ స్టోరీలో అక్షరాలా ఇదే జరిగింది. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ నాడకమాడి, బంధువులను నిలువునా ముంచేసింది. చివరికి ఆమె కుట్ర గుట్టు రట్టు అయింది. విచారించిన కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆమె వలలో బంధువులు ఎలా పడ్డారు? ఈ స్కామ్ వెలుగులోకి ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరీ స్టోరీ చదవాల్సిందే!చైనాకు చెందిన మంగ్ (40) అనే మహిళ పెద్ద ప్లానే వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆమె ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నిర్వహించేది. కానీ అందులో నష్టాలు రావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. బిలియనీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ బంధువులను నమ్మించింది. ఫ్యామిలీని సైతం మోసం చేయాలనుకుంది. మందస్తు పథకం ప్రకారం డ్రైవర్ జియాంగ్ను పావుగా ఎంచుకుంది. ఈ విషయంలో జియాంగ్ను కూడా బాగానే బుట్టలో వేసుకుంది. ప్రేమిస్తున్నట్టు నమ్మిచింది. తన వయస్సు కారణంగా వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని అందుకే పెళ్లి చేసుకుందామంటూ ఒప్పించింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక ఆ తరువాత తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అనేక పెద్ద ప్రాజెక్టుల వెనుక రియల్టర్ అయిన తన భర్త జియాంగ్ ఉన్నాడని బంధువులను నమ్మించింది. తక్కువ ధరకే, అతి చౌకగా విలువైన ఆస్తులను దక్కించుకోవచ్చని ఆశపెట్టింది. అంతేకాదు మెంగ్ రూ.1.2 కోట్ల విలువైన ఒక చిన్న ఫ్లాట్‌ను కూడా కొనుగోలు చేసి, దానిని సగం ధరకు బంధువుకు విక్రయించింది.తనకు గొప్ప ధర వచ్చిందని బంధువులకు అబద్ధం చెప్పమని జియాంగ్ను కోరింది. మరో అడుగు ముందుకేసి, కొత్త నివాస భవనాల షోరూమ్‌లకు తీసుకెళ్లి, చదరపు మీటరుకు రూ. 61వేలవరకు తగ్గుతుందని ఆశచూపిచింది. దీంతో ఆమె మోసానని పసిగట్టలేని బంధువులు రూ.14 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) మేర డబ్బులను ముట్ట చెప్పారు.కనీసం ఐదుగురు బంధువులు ఫ్లాట్లను కొనడానికి ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. కొందరు మంచి ఆస్తికి మారాలనే ఆశతో ఉన్న ఫ్లాట్లను కూడా అమ్మేశారు.ఇక్కడే సమస్య మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రాపర్టీ బంధువులకు స్వాధీనం చేయలేదు మంగ్.ఇదీ చదవండి: అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?డిస్కౌంట్లో ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ దాట వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని ఫ్లాట్లను అద్దెకు తీసుకుని, ఇవి మనవే అని వారికి చూపించింది. ఇలా కాలం గడుస్తున్నకొద్దీ, సాకులుచెబుతోంది తప్ప ఆస్తి తమ చేతికి రాకపోవడంతో ఏదో తప్పు జరిగిందని గ్రహించిన బంధువులలో ఒకరు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారిని సంప్రదించాడు. దీంతో ఆమె అసలు స్కాం బైటపడింది. అవి అసలువి కాదని తేలిపోయింది. మెంగ్ నివసిస్తున్న ఫ్లాట్ ఆమెది కాదని వెల్లడైంది.దీంతో బాధితులంతా పోలీసులు ఆశ్రయించారు.ఈ కేసును విచారించిన కోర్టు మోసం చేసినందుకు మంగ్‌కు 12 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఫ్లాట్ల విషయంలో లీజు ఒప్పందాలపై సంతకం చేసినందుకు నకిలీ భర్త జియాంగ్‌కు కూడా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఇతర బంధువుల ముందు అబద్ధం చెప్పిన మరో బంధువుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. (ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త) -
చితి నుంచే నీళ్లడిగిన అవ్వ!
సేలం: అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. వివవారు.. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ (72). ఇతని భార్య చిన్నమ్మాల్ (62). వీరు పూలతోట నిర్వహిస్తున్నాడు. ఈనెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్‌ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో చేసేదిలేక చిన్నమ్మాల్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. బంధువులు విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్‌పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్ తనపై పడి ఏడుస్తున్న బంధువులు ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం చేస్తున్నారు. #DINAMANI | இறுதிச் சடங்கில் உயிருடன் எழுந்த மூதாட்டியால் பரபரப்பு!#trichy #shocking #funeral #notdead pic.twitter.com/xE7L1OOhts— தினமணி (@DinamaniDaily) November 19, 2024VIDEO CREDITS: DinamaniDaily -
మాజీ మంత్రి హరీష్‌రావు బంధువులపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు బంధువులపై చీటింగ్ కేసు నమోదైంది. తన ప్రాపర్టీలో అక్రమంగా ఉంటున్నారని దండు లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. తన్నీరు గౌతం, బోయినిపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావుపై మియాపూర్ పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.బ్లాంక్ చెక్, బ్లాంక్ ప్రామిసరీ నోటు తీసుకుని హరీష్‌రావు బంధువులు చీటింగ్‌కు పాల్పడ్డారని.. తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారంటూ జంపన ప్రభావతిపై లచ్చిరాజు ఆరోపిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారని.. ఈ విషయంపై 2019 నుంచి పోరాడుతున్నానని లచ్చిరాజు అంటున్నారు.ఇదీ చదవండి: సాహితీలో తవ్వేకొద్దీ డొల్ల కంపెనీలు -
తల్లిదండ్రులు... పొరుగువారు
మీరంతా తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నూ మిన్నూ కానని వారు, తమ గొప్పతనం గురించి విర్రవీగే వారిని అల్లాహ్ ఇష్టపడడు (దివ్య ఖుర్ ఆన్: 4:36) బంధువులు: నానమ్మ, తాతయ్య, పెదనాన్న, బాబాయి, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, పిన్నమ్మలు, వారి సంతానంతో మనం కలిసి మెలిసి ఉండాలి. పరస్పరం ఆదుకుంటూ... సహకరించు కుంటూ ... సేవ చేసుకుంటూ ఉండాలి. పోరపొచ్చాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అభిమానం, ఆ΄్యాయతలు కలిగి బంధుత్వాలను పటిష్టపరుచుకోవాలి. అనాథులు: వీరికి శాపనార్థాలు పెట్టకూడదు. తిట్ట కూడదు. కోపగించుకోకూడదు. ప్రేమగా, లాలనగా చూడాలి. మీరు మీ పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారో అంత ప్రేమతో గనుక ఈ అనాథ తల నిమిరితే మీ చేతికి ఎన్ని వెంట్రుకలయితే తగులుతాయో అన్నిపాపాలు క్షమించబడతాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.∙నిరుపేదలు: ఎవరైతే పేదరికంతో ఉండి కూడా అభిమానం వల్ల ఎవరి ముందూ చేయి చాపకుండా ఎవరి వద్ద బాకీ తీసుకోకుండా అంతలోనే ఇబ్బంది పడుతూ గడుపుతూ ఉంటారో అలాంటి వారిని నిరుపేదలు అంటారు. వారికి కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా ఇస్తామనే సామెతలా మసులుకోవాలి. పొరుగున ఉన్న బంధువులు: పొరుగున నిజంగా మన బంధువులు లేక బంధువులు కాని వారు ఉన్నా వారిని కూడా బంధువులు గానే పరిగణించాలి. అన్నారు మహనీయ ప్రవక్త.అపరిచితులైన పొరుగువారు: అంటే మనం ప్రయాణిస్తున్న సందర్భంగా పరిచయం లేని వారు. మన పక్కన కూర్చుంటారు. వారికి ఇబ్బంది కలిగించకూడదు. పోగ తాగుతూ, గుట్కా నములుతూ, జర్దా ΄ాన్ వేసుకుంటూ ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. వారికి కూర్చోవడంలో ఇబ్బంది కలగకుండా చూడాలి. అదేవిధంగా మనం బజారులో సరుకులు కొనడానికి వెళ్లినప్పుడు మన పొరుగున నిలబడిన వాళ్ళు సరుకులు కొంటూ ఉంటారు, వారు కూడా పొరుగువారే. వారు మంచి వస్తువులు ఏరుకుంటున్న సందర్భంగా మనం వారితో పోటీపడకుండా వారికే ప్రాధాన్యమిస్తే మనకు మంచే జరుగుతుంది.– అబ్దుల్ రషీద్ -
మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్?.. కేర్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు వైద్య ఖర్చులు కోసం పేషెంట్ బంధువులు రూ.5 లక్షలు చెల్లించారు.నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వెంకటేష్ తెల్లారేసరికే మృతిచెందారు. విషయం చెప్పకుండా మరో రూ.4 లక్షలు చెల్లించాలని వైద్యులు తెలిపారు. అనుమానంతో ఐసీయూలోకి దూసుకెళ్లిన బంధువులు.. వెంకటేష్ మృతిచెంది ఉండటంతో కోపోద్రిక్తులయ్యారు. మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేశారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. -
కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమె ఇంట్లో సోదాల సందర్భంగా లభించిన ఆధారాల మేరకు శనివారం హైదరాబాద్‌లో మరోమారు తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ఏడుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం మాదాపూర్ డీఎస్ఆర్ అపార్ట్మెంట్స్లోని కవిత ఆడపడుచు అఖిల ఫ్లాట్‌తోపాటు ఇతర బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించింది. ఈ సోదాల్లో కవిత ఆడపడుచు అఖిల అల్లుడు మేక శరణ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కవిత అరెస్టు సందర్భంగా హైదరాబాద్‌లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన సమయంలోనూ కవిత భర్త అనిల్‌తోపాటు శరణ్ సైతం అక్కడే ఉన్నారు. సోదాల సమయంలో ఈడీ అధికారులు కవిత, ఆమె భర్త అనిల్, శరణ్తోపాటు కవిత పీఏలు రాజేశ్, రోహిత్‌రావు ఇతరుల ఫోన్లను సీజ్ చేశారు. శరణ్ తీరుపై అనుమానాలు ఉండటంతో ఫోన్లను తనిఖీ చేయగా స్కాంకు సంబంధించిన పలు ఆర్థిక లావాదేవీల అంశాలు బయటపడ్డట్లు సమాచారం. తమ కస్టడీలో కవిత నుంచి సేకరించిన సమాచారం.. గతంలో ఫోన్లలో వెలుగు చూసిన అంశాలను ఆధారంగా చేసుకొనే ఈడీ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ప్రధానంగా గోవా, పంజాబ్ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి హైదరాబాద్ నుంచే రూ. కోట్లు సమకూరినట్లు ఆధారాలు లభించాయి. ఈ కేసులో సౌత్ గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించిన వారిపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమె నుంచి సేకరిస్తున్న సమాచారంతో మరికొందరి పాత్రను బయటకు తెస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలన్నీ కవిత ఆడపడుచు కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా ఆరా తీస్తే కొత్త కోణాలు వెలుగు చూస్తాయని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి: కవిత తనపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రౌస్ అవెన్యూ కోర్టులోకి వెళ్లే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలనే పదేపదే అడుగుతున్నారని చెప్పారు. ఏడాది కాలంగా అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను అరెస్టు చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. తన అరెస్టుపై న్యాయస్థానాల్లో పోరాడతానని కవిత పేర్కొన్నారు. -
కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు..
-
కేరళ నాయర్లూ...రాజస్తాన్ గుజ్జర్లూ చుట్టాలే!
దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని నాయర్లు... వాయవ్య దిశలో ఉన్న రాజస్తాన్, దాని పొరు గునే ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన గుజ్జర్లు చుట్టాలేనట! ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. నాయర్లతోపాటు కేరళకే చెందిన థియ్యాలు, ఎళవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయవ్య ప్రాంతానికి చెందిన వారని జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించింది. – సాక్షి, హైదరాబాద్ వలసలపై భిన్న వాదనలు... భారతదేశ నైరుతి ప్రాంతం.. అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవవైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చరిత్రకారులు చెబుతుంటారు. యూదు లు, పార్సీలు, రోమన్ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వారంతా గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఈ వాదనతో మరికొందరు విభేదించేవారు. వారంతా ఇండో–సిథియన్ వర్గం వారని, దేశ వాయవ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని పేర్కొనేవారు. డీఎన్ఏ సేకరణతో... ఈ నేపథ్యంలో నాయర్లు సహా ఇతరుల వలస ఎలా సాగింది? వారు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వంటి భూస్వామ్య, యుద్ధవీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించింది. అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డీఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్ గుర్తులను (మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి) విశ్లేషించింది. వాటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో తంగరాజ్ బృందం పోల్చిచూసింది. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్ (ఐశ్వర్యరాయ్ బంట్ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయవ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు జినోమ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వారి మధ్య ఎక్కువ జన్యుసంబంధాలు.. నాయర్లు, థియ్యా, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయవ్య ప్రాంతంలోని కాంభోజ్, గుజ్జర్ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాకుండా వారిలో ఇరాన్ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది. తల్లివైపు నుంచి అందిన జన్యు సమా చారాన్ని విశ్లేషిస్తే పశ్చిమ యూరేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోంది. దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వారు భాగమై ఉంటారని చెప్పవచ్చు. – డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, శాస్త్రవేత్త గోదావరి తీరం మీదుగా... భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయవ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు నాయర్లు, ఇతర వర్గాల ప్రజలు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తేలింది. – సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి -
బరిలో బంధువులు.. ఫలితం ఏంటీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈసారి ఎన్నికల్లో భారీ స్థాయిలో బంధువులు బరిలో నిలిచారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు, మామ అళ్లుల్లు ఇలా ఏదో ఒక రకంగా బంధుత్వాన్ని పంచుకున్నవారు ఎన్నికల్లో పోటీకి నిలిచారు. వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..? మామా అల్లుడు.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ తరుపున పోటీ చేశారు. ఇక మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ ఘనవిజయం సాధించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరుపున కోమటి రెడ్డి బ్రదర్స్ పోటీ చేశారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 21 వేల మెజార్టీతో గెలుపును ఖాయం చేసుకున్నారు. ఆయన అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో 54 వేలకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. తండ్రి కోడుకులు.. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మైనంపల్లి రోహిత్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఓటమి దిశలో ఉన్నారు. అత్త.. అల్లుడు.. వేముల ప్రశాంత్‌రెడ్డి బీఆర్ఎస్ తరుపున బాల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాడు. ఫలితాల్లో గెలుపు దిశగా దూసుకుపోతూ దాదాపుగా విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇదే స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి మేనత్త అన్నపూర్ణమ్మ ఓడిపోయింది. ఎర్రబెల్లి బ్రదర్స్.. వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్ బీజేపీ తరుపున పోటీలో నిలిచారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున బరిలో ఉన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఇద్దరు ఓటమి పాలయ్యారు. గడ్డం సోదరులు.. సోదరులు గడ్డం వినోద్, గడ్డం వివేక్ విజయం సాధించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగారు. ఆయన సోదురుడు వివేక్ చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. ఇద్దరు విజయం సాధించడం గమనార్హం. కేసీఆర్.. కేటీఆర్.. తండ్రికొడుకులు సీఎం కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ రెండు స్థానాల్లో పోటీలో నిలవగా ఆయన కుమారుడు కేటీఆర్ సిరిసిల్లలో బరిలోకి దిగారు. కామారెడ్డిలో ఓటమి పాలైన కేసీఆర్ గజ్వేల్ మాత్రం విజయం సాధించారు. అటు.. సిరిసిల్లలో కేటీఆర్ అధికారాన్ని కాపాడుకోగలిగారు. భార్యాభర్తలు.. తెలంగాణ ఎన్నికల్లో భార్యభర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి భారీ విజయాన్ని అందుకున్నారు. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పోటీలో నిలిచిన ఆయన భార్య పద్మావతి రెడ్డి ఘనవిజయం సాధించారు. -
భార్యాభర్తల నుంచి బావామరదళ్ల దాకా.. బరిలో బంధువులు
ఒకచోట భార్యాభర్తలు. మరోచోట బావా మరదళ్లు. ఇంకొన్ని స్థానాల్లో బాబాయ్–అబ్బాయ్–అమ్మాయ్. మరో దగ్గరేమో తండ్రీకూతుళ్లు. రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలకు వేదికవుతోంది. పలు స్థానాల్లో బంధువుల మధ్య జరుగుతున్న ఈ పోటీలు రసవత్తరంగా మారుతున్నాయి...! రక్త సంబంధీకులు, దగ్గరి బంధువుల పరస్పర పోట్లాటలు రాజస్తాన్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటువంటి స్థానాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. దాంతారాంగఢ్: భార్యాభర్తల పోరు ఈ స్థానం రాష్ట్రవ్యాప్త ఆసక్తికి కారణమైంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున వీరేంద్ర సింగ్ బరిలో ఉన్నారు. ఆయనపై ఏకంగా భార్య రీటా పోటీ చేస్తున్నారు. జన్ నాయక్ జనతా పార్టీ తరఫున ఆమె బరిలో ఉన్నారు. వీరేంద్ర తండ్రి నారాయణ్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత కావడం విశేషం. 2018లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కుమారుడికి టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. అయితే వీరేంద్రకు కొంతకాలంగా భార్యతో గొడవలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదిగా వారు విడిగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపించగానే రీటా ఏకంగా భర్తపైనే బరిలో దిగారు! ధోల్పూర్: గోదాలో బావామరదళ్లు ఇక్కడ బీజేపీ తరఫున శివచరణ్ కుష్వహా పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఏకంగా ఆయన మరదలు శోభారాణీకి టికెటిచ్చి బరిలో దించింది. చదవండి: ఎన్నికల బరిలో వారసులు ఆళ్వార్ (గ్రామీణ): తండ్రీ కూతుళ్ల సవాల్ ఇక్కడ బీజేపీ జయరామ్ జాటవ్‌కు టికెటిచ్చింది. ఆయనతో విభేదాల నేపథ్యంలో కుమార్తె మీనాకుమారి ఏకంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి తండ్రినే సవాలు చేస్తున్నారు! ఇద్దరు పరస్పరం జోరుగా విమర్శల వర్షం కురిపించుకుంటూ ఓటర్లకు యథాశక్తి వినోదం పంచుతున్నారు. బాబాయ్–అబ్బాయ్–అమ్మాయ్ భాద్రా అసెంబ్లీ స్థానంలో బీజేపీ నుంచి సంజీవ్ బెనీవాల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఆయన అన్న కుమారుడు అజిత్ బెనీవాల్ బరిలో దిగి బాబాయ్‌ని సవాలు చేస్తున్నారు. ఖెత్డీ అసెంబ్లీ స్థానంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మనీషా గుజ్జర్ పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆమె బాబాయ్ ధర్మపాల్ బరిలో దిగారు. నాగౌర్‌లో బీజేపీ నుంచి జ్యోతీ మీర్ధా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ తరఫున ఆమెకు బాబాయ్ వరసయ్యే హరేంద్ర మీర్ధా బరిలో ఉన్నారు. సోజత్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆర్య బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆయన బంధువు శోభా చౌహాన్ పోటీలో దిగారు. ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ బస్సీ అసెంబ్లీ స్థానంలో మరో రకం పోటీ నెలకొంది. మాజీ ఐఏఎస్ చంద్రమోహన్ మీనా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఆయనపై పోటీ చేస్తున్న లక్ష్మణ్ మీనా మాజీ ఐపీఎస్ అధికారి కావడం విశేషం. పైగా వీరిద్దరూ బంధువులే. నా కుమారుడికి ఓటు వేయొద్దు! ఖండార్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ తరఫున అశోక్ బైర్వా బరిలో ఉన్నారు. తండ్రి డాల్‌చంద్‌తో ఆయనకు చాలాకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘నా కొడుక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయకండి’ అంటూ డాల్చంద్ జోరుగా ప్రచారం చేస్తుండటం విశేషం. దాంతో ఏమీ చేయలేక అశోక్ తలపట్టుకుంటున్నారు. -
ఒకనాటి వేసవి
రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసి ఉంచేవారు. తెల్లారి పచ్చిమిర్చి అందుకునేవారు. దాన్ని మధ్యకు చీల్చి, ఉప్పుగల్లు దూర్చి, నాష్టాలో ఒక ముద్ద అది... పంటి కింద ఇది. బాగుండేది. నీటిసొద జాస్తి. దూరం దూరం పోయి, చాలని తాడుకు కొత్తది ముడివేసి, అడుగు నుంచి లాగి, బిందె భుజాన మోసి... అయితేనేం? నేస్తులతో కలసి కబుర్లాడుకుంటూ నడుస్తుంటే బాగుండేది. తొణికే నీళ్లు వీపున చరుస్తూ ఉన్నా బాగుండేది. కలిగిన వాళ్లు కొత్త తాటాకుల పందిరి వేసేవారు. కుదిరినవారు కొబ్బరాకులతో నీడ పరిచే వారు. కింద నిలబడితే ఆ చలువదనం బాగుండేది. ఐసుబండి ఆపితే ఆ జిల్లుదనమూ బాగుండేది. కోసి చూపించమని అడక్కుండా పుచ్చకాయ కొనేదే లేదు. త్రికోణాకార ముక్కను అప్పటికప్పుడు తినకుండా వదిలిందీ లేదు. ముంతమామిళ్లవి పలు రంగులు. వాటి మరకలు బట్టలు మీద పడితే వీపు మీద అమ్మ జాజ్ డ్రమ్ కొట్టేది. పచ్చి తాటాకుల పొట్లాల్లో ముంజలు తెచ్చేవారు. ఆపి బేరం చేస్తే ఒకో పొట్లాన్ని కొడవలితో కోసి విడిపించేవారు. ముదురు ముంజకాయ కొబ్బరికి అటుఇటుగా ఉండేది. లేతది నోట అమృతం చిమ్మేది. తాటికాయలతో చేసిన బండికి టోల్గేట్ అడిగే దమ్ము ఎవరికీ లేదు. తెల్లరంగు స్ట్రాంగ్ పిప్పరమెంట్ దవడన పెట్టుకుంటే అదే పెట్రోలుగా పరుగు తీసేది. చింత చిగురొచ్చేది. బంగారం రేటుతో తూగేది. మునగచెట్లు విరగ గాసేవి. వేపచెట్టు బ్రాండు ఏ.సి ప్రతి రచ్చబండ దగ్గర కూల్ టెంపరేచర్ మెయిన్ టెయిన్ చేసేది. వీధిన తిరగలేని అవ్వ వేరుశనక్కాయలను అక్కడే అమ్మేది. రూపాయి చేజిక్కించుకుని మ్యాట్నీకి దౌడు తీస్తే ఉబ్బరింత. బాగుండేది. కరెంటు పోయి తలుపులు తీస్తే జొరబడే చల్లగాలి. బాగుండేది. కడప నుంచి కర్బూజ పండ్లు వస్తాయి. చక్కెర జల్లి కాసేపు వదిలి తింటే జీరాను తలపిస్తాయి. నిమ్మకాయల రేటు గజనిమ్మకాయల సైజుకు వెళుతుంది. సుగంధ వేర్లు... హలో మేమున్నాం అంటాయి. ఆరెంజి సోడా ఆగిఆగి తాగమని షోకులు పోతుంది. చలివేంద్రాల దగ్గరుండే పొడవు కాడల గరిటెలు ఆ తర్వాత ఏమవుతాయో ఏమో! పాత గొడుగులకు మర్యాద దక్కి డ్యూటీ ఎక్కుతాయి. వాసానికి దూర్చిన విసనకర్ర దగ్గరి స్నేహితుడిలా పలకరిస్తుంది. పిచ్చుకల హడావిడి మీటింగుల మధ్య మధ్యాహ్నపు కునుకు అమోఘంగా ఉంటుంది. సాయంత్రం నాలుగు లోటాలు కుమ్మరించుకుంటే అదే స్వర్గం. డాబా మీద నీళ్లు జల్లితే రాత్రికి చుక్కలు చల్లగా పలకరిస్తాయి. నిద్రకు ఇంటిల్లిపాది మేడెక్కితే పరుపులున్నవారు శ్రీమంతులు. టేబుల్ ఫ్యాను తిప్పగలిగేవారు కుబేరులు. తల దగ్గర నీళ్ల చెంబుకు బోర్లించిన గ్లాసే మూతవుతుంది. మేను వాల్చాక స్తంభించ కుండా గాలి వీస్తే పరమ పరవశం. ఆవకాయ సెంటిమెంట్. అర ఎకరం అమ్మైనా లంక మిరపకాయలు, గానుగ నూనె, ఆవాలు, మెంతులు, పచ్చడి మామిడి కాయలు వెల జరిగేవి. ముహూర్తం చూసి మరీ అమ్మమ్మ పని మొదలెట్టేది. కొడుకు నడుం మీద చేతులతో సాయానికి సిద్ధమయ్యేవాడు. కోడలు చూపుతో చెప్తే చేత్తో అందుకునేది. పిల్లలు కిలకిలారావాలు చేసేవారు. ఎర్రగా కలిపిన తొలిముద్ద పెట్టడానికి ప్రతి చిన్నారికి ఇంట పెద్ద తలకాయ ఉండేది. చుట్టాలొచ్చేవారు. పిల్లల్ని తెచ్చేవారు. ఆటల్లో ఉత్తుత్తి విందు ఒండి బాదం ఆకుల్లో బలవంతాన తినిపించేవారు. ఏటికి చాటుగా వెళ్లినవారు జేబుల్లో ఇసుకతో దొరికిపోయేవారు. ఆడపిల్లలు తీరిగ్గా గోరింటాకు పెట్టుకుని పడుకుంటే తెల్లారేసరికి అరచేతుల్లో చంద్రుళ్లు ఉదయించేవారు. పైతరగతికి వెళ్లే ముందొచ్చే వేసవికై పిల్లలు ఎదురు చూసేవారు. తీక్షణ ఆనందాల ఎండలకై ఆరాటపడేవారు. ఇప్పటిలా కాక రోషమున్న మల్లెలు వేసవిలోనే గుబాళించేవి. సీజను ముగియక ముందే స్త్రీలను జడల్లో వీలైనన్ని తురుముకోమనేవి. కనకాంబరాలతో కలిపి అల్లితే వాటిదొక అందం. మరువంతో, దవనంతో జత చేస్తే మరో చందం. మాలలు కట్టడానికి అమ్మలక్కలంతా కూడి ఇకఇకలు పకపకలు పోతుంటే చూడటం బాగుండేది. ప్రతి ఇంటి గోడ మీద అమ్మాయి పూలజడ ఫోటో కళకళలాడేది. తీపి మామిడిపండ్లు ఈ దేశవాసుల కోసమే కాసేవి. దిల్ పసంద్ ఎంతో పసందుగా ఉండేది. బంగినపల్లి ప్రతి ఇంటా కనీసం చేరేది. రసాలు మాత్రమే పిండుకు తాగేవారు కొందరు. ఇమాం పసంద్కై పట్టుబట్టే వారు ఇంకొందరు. నీలాలు ఆఖరున వచ్చేవి. తోతాపురికి ఉప్పూకారాలే గతి. బిగ్ బాస్కెట్ లేని కాలంలో కారు మాట్లాడుకుని చలో చిత్తూరనేవారు. నూజివీడుకు పదమనేవారు. మధుర ఫలాల బుట్టలు ప్రాప్తమున్నవారికి దక్కేవి. యుగాలుగా వేసవి ఇలాగే ఉంది. ప్రియజనుల కోసం ఇలా పునరావృతం అవుతూనే ఉంది. మనిషే ఈ రుతువుల సౌందర్యానికి ఎడంగా జరుగుతున్నాడు. వేసవి చెప్పే తీర్పు– విరామం ప్రకటించుకోమని, ఆటవిడుపుపై దృష్టి పెట్టమని, అయినవారి సాంగత్యాన్ని ఆస్వాదించమని! ఇవాళ మనిషి వెళ్లడానికి ఊరు లేనివాడు. పిల్లలతో వెళ్లడానికి బంధువులు, బంధాలు నిలబెట్టుకోని వాడు. అన్నీ ఉన్నా ఎందుచేతనో మనసు ఇరుకు చేసుకుంటున్నాడు. ఇంటి సభ్యులు తప్ప బయటి మనిషి వచ్చి ఒకపూట చేయి కడగని నిరుపేదవుతున్నాడు. సూర్యనారాయణమూర్తి వేసవిలో తన దగ్గర ఉన్నది ఏదీ దాచుకోకుండా ధారాళంగా భూమి మీద ప్రసరింపజేసి ఆ వెంటనే మొలకలెత్తే వర్షానికి కారకుడవుతాడు. ఈ వేసవిలో మనం కూడా మనలో దాగి ఉన్న, ఎక్కడో అణిచివేయబడి ఉన్న, మరుపున పడి ఉన్న అనుబంధాల్ని ఏదో మేరకు వెలికి తీసి, ఒకనాటి వేసవిని, ఒకనాటి ఆనందాల్ని పొందలేమా? ప్రయత్నిద్దామా? బాగుంటుంది. -
విశాఖ ఫారెస్ట్ భూముల వివాదంపై స్పందించిన మాజీమంత్రి బాలినేని వియ్యంకుడు
సాక్షి,ప్రకాశం: విశాఖ ఫారెస్ట్ భూముల వివాదంపై మాజీమంత్రి బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి స్పందించారు. తాను 2004లో కొనుగోలు చేసిన అనంతరం లేఅవుట్‌కు అనుమతుల కోసం అప్లై చేయగా 2009లో అప్రోవుల్కు అనుమతులు వచ్చాయన్నారు. 2011లో నా కూతురుని బాలినేని కుమారుడికి ఇచ్చానని, అప్రోవల్ వచ్చేనాటికి బాలినేనికి తమకు ఎటువంటి బంధుత్వం లేదని స్పష్టం చేశారు. పోలిటికల్ సఫరర్స్ భూములను కొనుగోలు చేయవలసిన నీచమనస్థత్వం తమది కాదని, ఫారెస్ట్, పొలిటికల్ సఫరర్స్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు. దీనిపై ఎటువంటి విచారణకైన సిద్దమేనని చెప్పారు. తాను ఒక్క సెంట్ ఆక్రమించానని నిరూపించినా ఆ ల్యాండ్ మెత్తాన్ని ప్రభుత్వానికి రాసిస్తానన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాలినేనితో రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి.. అంతేకాని దానికి నా వ్యాపార ప్రాజెక్టులతో ముడిపెట్టడం మంచి పద్దతి కాదని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇటువంటి ఆరోపణలు చేస్తే చట్టపరంగా తేల్చుకుంటానని స్పష్టం చేశారు. -
ప్రీతి మృతిపై సమగ్ర విచారణకు బంధువుల డిమాండ్
-
పండ్లరసంలో మద్యం కలిపి తాగించి..వృద్ధుడు అఘాయిత్యం
ఒంటరిగా చిన్నారులు కనిపిస్తే చిదిమేయాలనుకునే కామాంధులు సమాజంలో పెరిగిపోయారు. అదే కోవలో ఓ పసిమొగ్గకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టిన వృద్ధుడు కడతేరిపోయాడు. బాధితురాలి కుటుంబీకులు దాడి చేసి కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఐటీ సిటీలోని హెణ్ణూరు పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాక్షి, బనశంకరి: మైనర్ బాలికకు పండ్లరసంలో మద్యం కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడిన వృద్ధ కామాంధుడు బాలిక బంధువుల దాడిలో విగత జీవి అయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో హెణ్ణూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కుప్పణ్ణ (72) హతుడు. నమ్మించి ఇంట్లోకి పిలిపించి సోమవారం తూర్పు విభాగం డీసీపీ భీమాశంకర్ గుళేద్ కేసు వివరాలను వెల్లడించారు. కుప్పణ్ణ గత నాలుగేళ్లుగా హెణ్ణూరు పరిధిలోని బాబుసాపాళ్యలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇతడు తాపీ కూలీగా పనిచేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం పక్కింట్లో ఉండే నాలుగేళ్ల బాలిక ఇంటిపైన ఆరేసిన దుస్తులను తీసుకురావడానికి వెళ్లింది. అక్కడే ఉన్న కుప్పణ్ణ బాలికకు జ్యూస్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిపించుకున్నాడు. సరేనని వెళ్లిన బాలికకు జ్యూస్‌లో మద్యం కలిపి ఇవ్వగా తాగిన బాలిక మత్తులోకి జారుకుంది. వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి దాడి సాయంత్రం వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. కుప్పణ్ణ ఉండే ఇంటి పై అంతస్తులో బాలిక స్పృహ తప్పి ఉన్నట్లు తెలిసి బాలికను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో బాలిక వివరంగా చెప్పడంతో బంధువులు అగ్రహోదగ్రులయ్యారు. వెంటనే వెళ్లి కుప్పణ్ణను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు వదిలాడు. మరోవైపు కుప్పణ్ణ తమ బాలిక మీద లైంగిక దాడి చేశాడని హెణ్ణూరుపోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి గమనించగా కుప్పణ్ణ శవమై ఉన్నాడు. కుప్పణ్ణ పై పోక్సోయాక్టు కేసు, బాలిక కుటుంబసభ్యులపై హత్యకేసు నమోదైందని డీసీపీ తెలిపారు. హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు. -
జడ్చర్ల నేతాజీ చౌరస్తాలో ఉద్రిక్తత
-
మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే?
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేశారు. సోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ మల్లారెడ్డి సహా, కుమారులు, అల్లుడికి అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా, తాను లేని సమయంలో తన కుమారుడితో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి సంతకం చేయించుకున్నారని బోయినపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సంతకం చేపించుకుంటున్నారని, ఇండ్లల్లో చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు.. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రాస్తున్నారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. గందరగోళంగా రైడ్స్ చేసారు. మా దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదు. మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అబద్ధాలు రాశారని’’ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. చదవండి: మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు.. అర్ధరాత్రి హైడ్రామా -
మంత్రి మల్లారెడ్డి సమీప బంధువు ఇంట్లో నగదు సీజ్
-
శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన.. బతికున్న తల్లి కూతుళ్లను మట్టితో పూడ్చి..
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: హరిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తల్లికూతుళ్లను సజీవ సమాధి చేసేందుకు బంధువులు యత్నించారు. స్థలం ఆక్రమణపై ప్రశ్నించినందుకు మూడు ట్రాక్టర్లతో మట్టి కుమ్మరించి హత్యాయత్నం చేశారు. ఆ మహిళలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కాపాడారు. ఊరొదిలి వెళ్లిపోవాలంటూ 7 ఏళ్లుగా బంధువులు వేధిస్తున్నారు. బంధువుల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ఏపీపై ‘దుష్టచతుష్టయం’ పగబట్టిందా.. వచ్చే ఎన్నికల వరకు భరించాల్సిందేనా? -
చనిపోయాడని అంత్యక్రియలు చేస్తే.. తిరిగొచ్చాడు
Tamil Nadu man returns home alive: కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమేనా? లేక కల అనిపిస్తుంది. కళ్లతో చూస్తున్నప్పటకీ ఇది నిజమేనా అని సందేహంగా ఉండిపోతాం. పరిస్థితులు కూడా అలానే ఎదురవుతాయి. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....55 ఏళ్ల మూర్తి అనే వ్యక్తి చనిపోయాడని భావించి ఆదివారం సాయంత్రం అతని బంధువులు ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అతను అనుహ్యంగా సజీవంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా బంధువులంతా షాక్ అయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో బనగలద్‌పూర్‌లో చోటుచేసుకుంది. మూర్తి దినసరి కూలీ. చెరకు కోయడానికి కొన్ని రోజుల క్రితం తిరుపూర్ వెళ్లాడు. అయితే అతని కుమారుడు కార్తిక్‌కి.. మూర్తి ఓ బస్టాప్‌లో చనిపోయినట్లు బంధువుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అతను సంఘటన స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి తన తండ్రేనని గుర్తించాడు కూడా. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అంతేగాదు ఆ మృతదేహానికి ఆదివారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు కూడా. ఇదిలా ఉండగా 24 గంటల తర్వాత కార్తిక్ వాళ్ల నాన్న మూర్తి అనుహ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబీకులు షాక్ తిన్నారు.ఈ క్రమంతో కార్తీ మాట్లాడుతూ..‘‘మా నాన్న మరణ వార్త విని చాలా షాక్ అయ్యాను. ఇప్పుడు అతను ఇంటికి రావడంతో తాను మరింత షాక్‌కి గురయ్యాను. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ అన్నాడు. కార్తీ ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించాడు. ఇప్పుడు పోలీసులు చనిపోయిన వ్యక్తి ఎవరా? అని విచారణ చేయడం ప్రారంభించారు. (చదవండి: హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ రైటర్ అరెస్ట్.. ట్విస్ట్ ఏంటంటే..) -
మతిస్థిమితం లేని యువతితో పెళ్లి.. నా చావుకు కారకులు వీరే..
కర్నూలు: ‘మతిస్థిమితం లేని యువతితో పెళ్లి చేసి మోసం చేయడమే కాక నా పైన, నా కుటుంబ సభ్యులపైన దౌర్జన్యం చేసి కేసులు పెట్టారు. భార్య తరఫు బంధువులు అమీన్‌బాషా, మాసూంబీ, షేక్షా, షాషా, మైమూన్, ఆశ వేధించారు. వారి సూటిపోటి మాటలు తాళలేకపోతున్నా. నా చావుకు కారకులు వీరే. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయండి’ అంటూ ముదిరాజ్‌నగర్‌కు చెందిన షేక్ హుస్సేన్ బాషా (24) సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నబిసాహెబ్ లారీ క్లీనర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు షేక్ హుస్సేన్‌బాషా ఓ మార్కెటింగ్ సంస్థలో పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మృతి కల్లూరు ఎస్టేట్‌కు చెందిన హుస్సేన్‌బీ కుమార్తె షాహీన్‌తో ఐదు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగిన వారం రోజుల నుంచే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దలు పంచాయితీ చేసి సర్ది చెప్పి కాపురం నిలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే షాహీన్ భర్తతో మళ్లీ గొడవపడి మూడు నెలల క్రితం తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇటీవల షాహీన్ దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కౌన్సెలింగ్‌కు పిలిపించడంతో హుస్సేన్‌బాషా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తండ్రి నబిసాహెబ్ తెల్లవారుజామున గుర్తించి ఉరి నుంచి తప్పించి వైద్య చికిత్సల నిమిత్తం ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య తరఫు బంధువుల వేధింపులు తాళలేకనే తన కుమారుడు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు నాల్గవ పట్టణ ఎస్ఐ రామయ్య తెలిపారు. సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైరల్ వీడియో: అందరూ చూస్తుండగానే రోడ్డుపై కర్రలతో హల్చల్
న్యూఢిల్లీ: జనమంతా చూస్తుండగా రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు బంధువులపై కర్రలతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆస్తి పంపకాల విషయంలో రెండు కుటుంబాల మధ్య ఈ కొట్లాట జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఆస్తి వివాదంపై కొంతమంది వ్యక్తులు తమ బంధువులపై కర్రలు, క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. పట్టపగలు నడిరోడుపై కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లర్ల నుంచి పరిస్థితిని నియంత్రించి. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. దాడులకు పాల్పడిన నలుగురిని జగత్ (62), హరేందర్ (41), సుమిత్ (29), అమిత్ (24)గా గుర్తించారు. పోలీసులు ఇప్పటి వరకు జగత్‌ను మాత్రమే అరెస్టు చేశారు. అయితే శ్యామ్, జగత్, అతని పిల్లలకు మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. శ్యామ్, అతని బంధువులపై జగత్ తన కొడుకులు దాడి చేశారని పేర్కొన్నారు. ఇరు కుటుంబాలు ఈ ప్రాంతంలో గతంలో కూడా కొట్టుకున్నాయని, వారిపై పాత కేసులు కూడా ఉన్నాయని డీసీపీ సంజయ్ తెలిపారు. చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!! - incident took place in Northeast Delhi's New Usmanpur area. One accused has been arrested. pic.twitter.com/mMllfvLAVo — Mahender Singh Manral (@mahendermanral) February 12, 2022 -
బాలికపై అఘాయిత్యం.. 80 ఏళ్ల వృద్ధుడితోపాటు.. మరో ఐదుగురు
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): విల్లుపురం, సెంజి సమీపంలోని ఈ చంకుప్పానికి చెందిన 16 ఏళ్ల బాలికపై బంధువులే సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. 80 వృద్ధుడితో కలసి బాలికను మరో ఇద్దరు యువకులు కూడా బలాత్కారం చేసినట్లు తెలిసింది. ఈ కేసులో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటేశన్ పెద్ద కుమారుడు మోహన్, ఇతని స్నేహితుడు ఇళయరాజా తదితరులును పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కథనం మేరకు లైంగిక దాడికి గురైన బాలిక పదిహేనేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆమె కోవైలో ఉన్న శరణాలయంలో ఉంటూ ప్లస్ వన్ చదువుకుంటోంది. సెలవు రోజుల్లో సెంజి సమీపంలో ఉన్న ఈచంకుప్పం ప్రాంతంలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రెండు రోజుల ముందు విద్యార్థి అనారోగ్యం బారిన పడడంతో బంధువులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆమెకు వరసకు అన్న అయిన మోహన్ మొదట విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడని తరువాత మిగిలిన వారు అత్యాచారం చేసినట్లు తెలిసింది. దీనికి సహకరించిన పెద్దమ్మ కుప్పును అరెస్టు చేశారు. నిందితుల్లో ఐదుగురిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. చదవండి: ఢిల్లీలో ప్రైవేట్ ఆఫీసుల మూసివేత -
భార్యాభర్తల గొడవ.. అడ్డుకోబోయిన ఎస్ఐపై దాడి
గౌరిబిదనూరు(బెంగళూరు): పోలీస్‌స్టేషన్ వద్ద ఇరుకుటుంబాల గొడవలో ఎస్ఐపై దాడి జరిగింది. పట్టణానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి మహమ్మద్ సిద్దికి కు మాలూరు తాలూకాకు చెందిన వీఏఓ ఉస్నా ఖానంతో మూడు నెలల క్రితం పెళ్లయింది. గొడవలు జరగడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసున్నారు. ఆదివారం సాయంత్రం ఎస్ఐ చంద్రకళతో మాట్లాడి కట్నకానుకలను వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. స్టేషను బయటకు రాగానే ఉస్మాఖానం బంధువులు, సిద్దికిపై దాడి చేశారు. అడ్డుకోబోయిన ఎస్ఐ చంద్రకళకు స్వల్పంగా దెబ్బలు తగిలాయి. లాఠీ ఛార్జి చేయడంతో ఇరువర్గాలు శాంతించాయి. ఉస్నా ఖానం వైపు వారిపై కేసు దాఖలు చేయడమైంది. చదవండి: Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ? -
బెడిసికొట్టిన కిడ్నాప్ డ్రామా
సాక్షి, వేలూరు(తమిళనాడు): ఆంబూరులో కిడ్నాప్ నాటకం ఆడిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరులోని ముకకొల్లై ప్రాంతానికి చెందిన ఎర్రగడ్డల వ్యాపారి ఆశీన్. ఇతను ఆదివారం రాత్రి ఆంబూరు సమీపంలోని వేంగిలిలో ఉన్న అత్తగారింటికి కారులో బయలుదేరాడు. ఈ సమయంలో ముగ్గురు యువకులు కారును వెంబడించి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆశీన్ ఆంబూరు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆశీన్‌కు పిల్లలు లేక పోవడంతో అక్క కుమారుడు అమీద్(21)ను పెంచుకుంటున్నాడు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో అమీద్ సెల్ నెంబర్ నుంచి ఆశీన్‌కు ఫోన్ వచ్చింది. అందులో గుర్తుతెలియని వ్యక్తులు అమీద్‌ను కిడ్నాప్ చేశామని రూ. 10 లక్షలు ఇస్తే వదిలి పెడుతామని హెచ్చరించారు. వీటిపై ఆశీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులు మాదనూర్ వద్ద ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నిల్స్ ద్వారా గుర్తించి.. అక్కడ కారులో దాగి ఉన్న అమీద్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఆంబూరు ఆయిల్లా నగర్‌కు చెందిన మహ్మద్ సిద్దిక్, కుపేర వీధికి చెందిన అర్హత్ అబీ, పూతోటకు చెందిన పయాస్ అహ్మద్‌గా తెలిసింది. ఈ ముగ్గురు కిడ్నాపర్లు అమీద్ స్నేహితులుగా తెలిసింది. ప్రణాళిక ప్రకారం మామ అశీన్ కిడ్నాప్ చేయడానికి వేసిన పథకం విఫలం కావడంతో.. అమీద్ తనను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడినట్లు తేల్చారు. -
సుశాంత్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం
Sushant Singh Rajput Relatives Died In Road Accident In Bihar: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్ కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ బంధువు ఓం ప్రకాశ్ సింగ్ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి తిరిగి వస్తుండగా లఖిసరాయ్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న సుమో ట్రక్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో మొత్తం 10మంది ఉన్నారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో సుశాంత్ మేనల్లుడు సహా బావ, హర్యానా కేడర్ ఐపీఎస్ ఓం ప్రకాశ్ సింగ్ సమీప బంధువులు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు. చదవండి: భర్త విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న కాజల్ Bhumika Chawla: 'నా కోసం ముంబై వచ్చిన మేకర్స్ చాలామంది ఉన్నారు' -
వచ్చే ఏడాది వివాహం.. బామ్మర్దిని హత్య చేయించిన పోలీస్ హోంగార్డ్..
-
వచ్చే ఏడాది వివాహం.. బామ్మర్దిని హత్య చేయించిన పోలీస్ హోంగార్డ్..
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): బామ్మర్దిని హత్య చేయించిన పోలీస్ హోంగార్డ్‌తో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఫలక్‌నుమా ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ వివరాలు వెల్లడించారు. జహనుమా పయీంబాగ్కు చెందిన మహ్మద్ ఆరీఫ్ అలియాస్ షోయబ్ (32)కు సంగారెడ్డికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వచ్చే జనవరిలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సదరు యువతి గత నెల రోజులుగా అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ముంబైలోని ఓ బాబాను సంప్రదించారు. ఆరీఫ్ దగ్గరి బంధువులే ఆమెకు క్షుద్రపూజలు (చేతబడి) చేయించారంటూ సదరు బాబా చెప్పడంతో ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యుల ఆరీఫ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆరీఫ్ హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్న తన బావ (అక్క భర్త) మహ్మద్ సమీ మోయియుద్దీన్పై అనుమానం పెంచుకున్నాడు. అతనే తనకు కాబోయే భార్యకు చేతబడి చేయించి ఉంటాడని ఆరోపిస్తూ గొడవకు దిగాడు. తనకు కాబోయే భార్యకు నయం చేయించాలని పట్టుబట్టడంతో చేసేది లేక సమీ రూ. 50 వేలు ఇచ్చాడు. అయినా ఆరీఫ్ తరచూ డబ్బుల కోసం బావను వేధించేవాడు. దీనిని భరించలేని సమీ అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం నవాబుసాబ్కుంటకు చెందిన తన సోదరుడు మహ్మద్ అంజద్ మోయియుద్దీన్, అతడి స్నేహితులు మహ్మద్ అలీ, ఆమేర్ మహ్మద్ ఖాన్లకు కొంత డబ్బు ఇచ్చి ఆరీఫ్‌ను హత్య చేయాలని కోరాడు. ఈ నెల 13న రాత్రి ఇంటి సమీపంలో ఫోన్ మాట్లాడుతున్న ఆరీఫ్ కళ్లల్లో ఆమేర్ మహ్మద్ ఖాన్ కారం పొడి చల్లగా.....అంజద్, మహ్మద్ అలీ అతడిపై గొడ్డలి, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్, అదనపు ఇన్స్పెక్టర్ కె.ఎస్.రవికుమార్, ఎస్సై నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. -
కొంప ముంచిన పెళ్లి భోజనం.. 190 మంది అస్వస్థత
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పెళ్లింట భోజనం చేసిన 190 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన సంఘటన దావణగెరె జిల్లా హోన్నాళి తాలూకా హోసదేవర హొన్నాళి గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో భోజనం చేసిన వారికి అర్థరాత్రి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. దీంతో వారందరినీ సమీప ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. 10 మందికి ఆరోగ్యం విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేసారు. వివాహ వేడుకలో చేసిన ఆహారాన్ని పరీక్షల కోసం దావణగెరెకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఈ వర్షం సాక్షిగా... నువ్వు నాకే సొంతం!
సాక్షి, చెన్నై(తమిళనాడు): జోరువానలోనూ ఓ జంట అతికష్టం మీద వివాహం చేసుకోవాల్సి వచ్చింది. చెన్నైకి చెందిన ప్రభు, ముత్తులక్ష్మికి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. తేనాంపేటలోని ఓ పెద్ద కల్యాణ మండపాన్ని బుక్ చేశారు. ఆహ్వానాలు కూడా పంపించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి తేనాంపేట పరిసరాల్లో నడుం లోతు వరకు నీరు నిలిచింది. దీంతో పెళ్లి వారికి కష్టా లు మొదలయ్యాయి. చివరకు వధూవరులు, బంధు వులను ప్రైవేటు బోట్ల ద్వారా మూడు కి.మీ దూరం తీసుకెళ్లాల్సి వచ్చింది. పెళ్లి అనంతరం కొత్త జంట బోటులో ఊరేగింపుగా ముందుకు సాగింది. వరుడు ప్రభు మాట్లాడుతూ పెళ్లి ఘనంగా చేసుకోవాలని ఏర్పాట్లు చేశామన్నారు. ఊరేగింపునకు లగ్జరీ కారు, బ్యాండు మేళా, గానా భజానా సమకూర్చుకున్నా చివరకు బోటులో వెళ్లాల్సి వచ్చిందన్నారు. పడవ ప్రయాణం జీవితంలో తీపి గుర్తుగా నిలిచిపోయిందన్నారు. -
భార్యాభర్తలను ఇంటి బయటకు ఈడ్చకెళ్లి.. కిరాతకంగా హత్య
పట్నా: వారసత్వ భూమి తగాదాల కారణంగా ఒక వ్యక్తిని, గర్భవతి అయిన అతని భార్యను బంధువులు కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం వైశాలి పోలీస్ స్టేషన్‌లోని బేలార్ పోలీస్ అవుట్‌పోస్ట్‌లోని జరాంగ్ రాంపూర్ గ్రామంలో ఈ జంట హత్య జరిగింది. మృతులు శశి ఠాకూర్, అతని భార్య సంగీత దేవి ఐదు నెలల గర్భిణి. ఈ దంపతులకు రెండు, మూడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శశి ఠాకూర్‌కు తన బంధువులతో వారసత్వ భూమికి సంబంధించి ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఈ విషయంపై తన బంధువులతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో శశి ఠాకూర్, అతని భార్య సంగీతా దేవిని వారి బంధువులు ఇంటి నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. ఆపై పదునైన కత్తితో వారి గొంతులు కోసి హత్య చేశారు. అనంతరం వారి మృతదేహాలను ఒక నిందితుడి ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు. ఈ ఘర్షణలో మృతుడికి చెందిన ముగ్గురు బంధువులకు గాయాలు కాగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్యకు గురైన గర్భిణీ సంగీతా దేవి తల్లి అహల్య దేవి 17 మంది కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సన్నీ ఠాకూర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పెళ్లయిన నెలరోజులకే.. నవవధువు ఆత్మహత్య -
‘అధికారులు వేధిస్తున్నారని మాకు చెప్పేది.. ఇది హత్యే’
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఎస్సై ట్రైనింగ్ లో ఉన్న కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన భవాని అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వేధిస్తున్నారని ఆమె తమతో చెప్పేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎస్సై ఆత్యహత్య చేసుకున్న విషయం తెలియడంతో స్వగ్రామమైన కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భవాని తన తల్లి అన్నలతో నివసిస్తోంది. శిక్షణ కోసం వెళ్తున్నట్లు ఇంటివద్ద తల్లికి చెప్పి వెళ్లిన భవాని ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. భవాని స్వగ్రామమైన సాలెంపాలెంలో బంధువులు, గ్రామస్తులు భవానిని హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, దోషులను శిక్షించి వారి కుటంబసభ్యులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. చదవండి: 6 నెలల వ్యవధిలో 13 హత్యలు.. ఇప్పటికీ అతని పేరు కూడా మిస్టరీనే ! -
పండుగరోజు విషాదం: చెల్లితో రాఖీ కట్టించుకోకుండానే...
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): జమ్మికుంట పురపాలక సంఘం పరిధి రామన్నపల్లి గ్రామానికి చెందిన వెలిపికొండ రాకేశ్(25) పండుగపూట మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఆదివారం రాకేశ్ కారులో బంధువులను సుల్తాన్బాద్లో దించి తిరిగి ఇంటికి వస్తుండగా ఓదెల మండలం కనగర్తి గ్రామ శివారులో కారు చెట్టును ఢీకొని చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాకేశ్ మృతిచెందాడు. రాకేశ్ స్వగ్రామం హూజూరాబాద్ మండలం సిరిసపల్లి గ్రామం. అతడి తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మృతి చెందగా అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. రాకేశ్ మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి ఒక చెల్లె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. చదవండి: తాలిబన్ల దమనకాండ -
భార్య భర్తల మధ్య గొడవ.. మామపై లారీ ఎక్కించి..
సాక్షి, సేలం(తమిళనాడు): భార్యభర్తల మధ్య గొడవకు బంధువు బలయ్యాడు. వివరాలు.. సేలం గాంధీనగర్ చోలపల్లానికి చెందిన సుబ్రమణి (32) లారీ డ్రైవర్. భార్య జీవిత. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జీవిత పుట్టింటికి వెళ్లింది. ఆదివారం రాత్రి సుబ్రమణి అత్తారింటికి వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన సుబ్రమణి కంటైనర్ లారీతో మామను గుద్దడానికి యత్నించాడు. ఆయన్ను తప్పించే ప్రయత్నంలో జీవిత అత్త కుమారుడు జీవా (26)పై లారీ ఎక్కింది. తీవ్రంగా గాయపడిన జీవాను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. స్థానికు లు సుబ్రమణికి దేహశుద్ధి చేశారు. దీంతో అదే ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
కుటుంబ సభ్యుల క్రూరత్వం, ఫోన్లో మాట్లాడుతున్నారని..
భోపాల్: దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించిన వారి పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా వారి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు, ఇంకెన్నో కార్యక్రమాలు చేపడుతున్నా అవేవి వారిని కాపాడలేకపోతున్నాయనే చెప్పాలి. ఓ వైపు బయట వాళ్ల నుంచి లైంగిక దాడులు, మరో వైపు కుటుంబ సభ్యుల నుంచి ఆచారాలు పేరుతో ఆగడాలు.. ఇలా వాళ్లపై హింసాకాండలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఓ యువతిని కుటుంబ సభ్యులే చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టగా.. తాజాగా సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనే సందేహం కలిగేలా.. బంధువులతో ఫోన్లో మాట్టాడారని నేపంతో కుటుంబ సభ్యులే యువతులపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు వారి బంధువులతో ఫోన్ మాట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కోపంతో ఆ యువతులను ఇంట్లోని వారే దారుణంగా హింసించారు. కాగా వీడియో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో.. యువతులు కొట్టకండి అని కుటుంబ సభ్యులను వేడుకుంటున్నా కనికరం లేకుండా వాళ్లను కర్రలు, రాళ్ళతో కొట్టారు. వారిని హింసించిన వారిలో ఓ మహిళ కూడా ఉండడం గమనార్హం. తాండా పోలీస్ స్టేషన్ అధికారుల ప్రకారం.. ఈ సంఘటన జూన్ 22 న పీపాల్వా గ్రామంలో జరగగా, వీడియో కాస్త జూన్ 25 న పోలీసులకు చేరింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. I have received another complaint of a woman being brutally beaten up by a mob. If anyone can update me on this case : wrt location and date. What kind of a barbaric society have we become, the person is laughing while filming this! No fear of the law? Contempt of SC judgments! pic.twitter.com/kl1CNUIs6S— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) July 4, 2021 -
వధువు వాళ్లు మటన్ వండలేదని పెళ్లికొడుకు ఎంత పనిచేశాడు..
భువనేశ్వర్: సాధారణంగా వివాహవేడుకలో అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వధువు తరపువారు, వరుడి వైపు బంధువులని సరిగ్గా పలకరించలేదనో.. పెళ్లిలో వసతులు సరిగ్గా లేవని అలిగిన సంఘటనలు మనకు తెలిసిందే. మరికొన్ని చోట్లలో మగ పెళ్లి వారు అడిగినంత కట్నం ఇవ్వలేదని, చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకుని మండంపైన వివాహలు ఆగిపోయిన సందర్భాలు కొకొల్లలు. తాజాగా ఒడిశాలో జరిగిన వివాహం కాస్త వెరైటీ కారణంతో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాలు.. కియోంజర్ జిల్లాలోని మానతీరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాగా, పెళ్లి వేడుకలో భాగంగా ఒక రోజు ముందు.. మగ పెళ్లివారు బంధువులతో కలిసి బరాత్‌గా వధువు ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ దావత్లో వరుడి బంధువులు మటన్ కావాలని అడగగా.. ఆడపెళ్లివారు వండలేదని సమాధానం చెప్పారు. దీంతో వరుడి తరపు వారు ఆగ్రహంతో ఊగిపోయారు. కాసేపటికి, ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగింది. దీంతో అక్కడ స్వల్ప ఘర్శణ వాతావరణం తలెత్తింది. అనంతరం పెళ్లి కొడుకు వివాహన్ని రద్దు చేసుకుని తమ బంధువులతో కలిసి గంధాపాల గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసని రోజే తమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని పులజారా ప్రాంతానికి చెందిన మరో యువతితో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ఇదేం.. పైత్యం వాళ్లకి..’, ‘వరుడికి.. బుధ్దుందా అసలు..’, ‘బ్రో.. మీరు ఎప్పుడు మారతారు..’, ‘పాపం.. అమ్మాయి పరిస్థితి ఏంటో..’, ‘ ఇలాంటి శాడిస్టు భర్త నీకేందుకు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఆమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆ దేవుడే ఇలా వచ్చాడేమో! -
పెళ్లి పత్రికలో పేర్లు లేవని కత్తితో దాడి
సాక్షి, సికింద్రాబాద్: పెళ్లి పత్రికలో పేర్ల కోసం జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం చంద్రశేఖర్ నగర్‌కు చెందిన సురేష్ అనే వ్యక్తి వివాహం జరిగింది. అయితే పెళ్లి పత్రికలలో తమ పేర్లు ఎందుకు పెట్టలేదని బంధువు సర్వేశ్ పెళ్లి రోజే కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. సురేష్ సోదరి బాలమణిని కూడా దూషించాడు. అయితే మిగతా బంధువులందరూ సర్ది చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడదామని ఆదివారం ఉదయం బలమణి తన కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకొని సర్వేశ్ ఇంటికి వెళ్లింది. దీంతో సర్వేశ్, అతని సోదరుడు శేఖర్ ఇంటికి వచ్చిన వారిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో బంధువులు ఎస్ ప్రవీణ్(30), నోముల పరశురాము(35), డి యాదగిరి (42), ఎన్ ప్రతాప్ కుమార్ (32) తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడినవారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నిందితులు పరారయ్యారు. గాయపడినవారిలో ఎస్ ప్రవీణ్, నోముల పరశురాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కట్టుకున్న భర్తను.. -
బంధువని నమ్మితే.. భర్త పెన్షన్ కొట్టేశాడు ..
సాక్షి, సైదాబాద్(హైదరాబాద్): బంధువని నమ్మి చనిపోయిన భర్తకు రావాల్సిన పెన్షన్ పనులు అప్పగించిన వృద్ధురాలినే మోసం చేశాడు ఓ ఘనుడు. విషయం పసిగట్టిన బాధితురాలు బుధవారం సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిస వివరాల ప్రకారం... సైదాబాద్‌కు చెందిన సర్వారీ బేగం ప్రస్తుతం నిజామాబాద్‌లోని తన కూతురు ఇంట్లో ఉంటోంది. ఆమె భర్త ఎంఏ. సత్తార్ హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తూ 2006 నవంబర్‌లో మృతి చెందాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త చనిపోవటంతో అతనికి రావాల్సిన పెన్షన్ తదితర బెనిఫిట్స్ మంజూరు చేయించే పనులను బంధువైన అబ్దుల్ హక్ అలీంకు అప్పగించింది. అయితే అతను ఆ పనులు చేయిస్తానని నమ్మబలికి ఆమె నుంచి కొన్ని తెల్ల కాగితాలు, స్టాంప్ పేపర్ల మీద వేలిముద్రలు తీసుకున్నాడు. అయితే ఇటీవల తన భర్తకు రావాల్సిన రూ.14 లక్షల పెన్షన్ మంజూరు అయ్యాయని వాటిని తన బంధువు అబ్దుల్ ఆమె వేలిముద్రలు వేసిన కాగితాల సహాయంతో తన ఎకౌంట్లోకి వేసుకున్నాడని తెలిసింది. అంతేకాకుండా తానే అబ్దుల్‌కు రూ.8.90 లక్షలు అప్పుగా ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడని పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతిని పెళ్లి చేసుకుంటానని కానిస్టేబుల్ మోసం -
ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వివాదం.. కారణం ఏంటంటే..
సాక్షి, పెద్దకొత్తపల్లి(మహబూబ్‌నగర్): ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ప్రేమ పెళ్లి వివాదానికి దారి తీసింది. అమ్మాయి బంధువులు అబ్బాయి బంధువులపై దాడి చేయడంతో అబ్బాయి వదిన మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలోని సంపంగి కృప, అదే గ్రామానికి చెందిన ఆత్మకూరి సంతోష్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 5న పెళ్లి చేసుకుని ఎటో వెళ్లిపోయారు. ఇది జీర్ణించుకోలేని అమ్మాయి బంధువులు సంపంగి లక్ష్మయ్య, లింగస్వామి, శాంతమ్మ ఈనెల 6న గొడ్డలి, రోకలిబండతో అబ్బాయి వదిన ఉష (32), అన్న చెన్నయ్యపై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఉషను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఈమెకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ విషయమై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ గిరిబాబు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. చదవండి: మంత్రగాడనే అనుమానంతో గిరిజన వృద్ధుడిని.. -
వామ్మో.. బంధువులని చేరదీస్తే ఎంత పనిచేశారు..
సాక్షి, కోనరావుపేట(రాజన్న సిరిసిల్ల): దగ్గరి బంధువని చేరదీస్తే ఉన్న ఆస్తి రాయించుకున్నాడు. ఇప్పుడు ఆ వృద్ధురాలినే ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటున్నాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని నిమ్మపల్లికి చెందిన మానుక రాజయ్య–నర్సవ్వ దంపతులకు పిల్లలు లేరు. కొన్నేళ్ల క్రితం నుంచి దగ్గరి బంధువు మానుక శంకర్ వారింట్లోనే ఉంటున్నాడు. రాజయ్యకు ఫించన్ ఇప్పిస్తానని చెప్పి ఆస్తి కాగితాలపై సంతకాలు చేయించుకుని ఇల్లు, 30 గుంటల భూమిని తనపేరిట చేయించుకున్నాడు. రాజయ్య నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. ఈక్రమంలో ఒంటరి అయిన నర్సవ్వకు తిండి పెట్టకపోవడంతో శంకర్‌ను నిలదీయగా ఇది తనదని, వెళ్లిపొమ్మంటూ కొడుతున్నాడని బాధితురాలు రోదిస్తూ చెప్పింది. శంకర్ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకుంది. గ్రామానికి వచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తానని వృద్ధురాలికి ఎస్సై రాజశేఖర్ హామీ ఇచ్చారు. కన్న కొడుకులు కూడు పెడ్తలేరు వేములవాడ: కనీ పెంచి పెద్దచేసిన కొడుకులు మలిసంధ్యలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండలంలోని నిజామాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమ బాధను చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన శ్రీరాముల రామయ్య–సత్తవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు దేవయ్య, లచ్చయ్య, చంద్రయ్య. వృద్ధులు కావడంతో ఒక్కో కొడుకు దగ్గర 3 నెలలు ఉండాలని నిర్ణయించారు. కానీ గత కొన్ని నెలలుగా దేవయ్య, లచ్చయ్య తల్లిదండ్రులను పోషించడంలేదు. ఇంట్లోకి రానివ్వకపోవడంతో చిన్న కుమారుడు చంద్రయ్య వద్దే ఆరునెలల నుంచి ఉంటున్నారు. సోమవారం ఎస్సై రాజశేఖర్‌ను కలిసి తన ఇద్దరు కుమారులు పోషించడంలేదని ఫిర్యాదు చేశారు. కుమారులను పిలిపించి మాట్లాడుతానని బాధితులకు ఎస్సై హామీ ఇచ్చారు. చదవండి: భార్యను తిట్టాడని ఆవేశంతో.. కన్న తండ్రినే -
కరోనా రోగి మృతదేహాన్ని నదిలో పడేసిన బంధువులు
లక్నో: కరోనా ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపుతోంది. రక్త సంబంధీకులు దగ్గరకి రావడానికి జంకుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్ రోగి మృతదేహాన్ని బంధువులు రాప్తీ నదిలో పడేశారు. ఈ ఘటన మే 28న బల్రాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీన్ని ఆ వైపు నుంచి కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వీడియో తీశారు. వీడియోలోని ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పీపీఈ కిట్ వేసుకున్నారు. కాగా కరోనా బాధితుడు మే 25న చికిత్స కోసం బల్రాంపూర్ ఆస్పత్రిలో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో మే 28న మరణించాడు. అతని మృతదేహాన్ని కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం అతని బంధువులకు అప్పగించారు. అయితే రోగి మృతదేహాన్ని బంధువులు నదిలో పడేసినట్లు తమకు సోషల్ మీడియా ద్వారా తెలిసినట్లు బల్రాంపూర్ మెడికల్ ఆఫీసర్ బిబి సింగ్ తెలిపారు. కాగా మృతదేహాన్ని తిరిగి వారికి అప్పగించి వారిపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. ట్విట్టర్లో స్పందించిన కేంద్ర మంత్రి ఈ ఘటనపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర శేఖవత్ ట్విట్టర్లో స్పందించారు. గంగా నదిలో మృతదేహాలను వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీటిని నిషేధించడానికి చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా ఇటువంటి సంఘటనలను తనిఖీ చేయడానికి నది తీరాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను కోరింది. కోవిడ్-19 నియమ నిబంధనల ప్రకారం మృతదేహాలను పారవేయాలని, 14 రోజుల్లోగా దీనిపై నివేదిక పంపాలని ఆ రాష్ట్రాలకు సూచించింది. ఈ నెల ప్రారంభంలో బీహార్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో గంగా నది ఒడ్డుకు వందలాది మృతదేహాలు కొట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. బక్సర్ జిల్లాలో 71 మృతదేహాలను నదీతీరం నుంచి స్వాధీనం చేసుకున్నారు. గంగానది పక్కన ఉండే ఇసుక డంపింగ్‌లలో వేలాది ఇతర మృతదేహాలు ఖననం చేసినట్టు స్థానిక అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. In UP's Balrampur district, video of body of man being thrown in the river from a bridge has surfaced. The body was of a man who succumbed to Covid on May 28. pic.twitter.com/DEAAbQzHsL — Piyush Rai (@Benarasiyaa) May 30, 2021 (చదవండి: Kumbh Mela IG: ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనడం సరికాదు) -
రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి..
పొన్నూరు(గుంటూరు జిల్లా): ఓ వివాహిత స్నానం చేస్తుండగా కొంత మంది బంధువులు వీడియో తీశారు. ఆ వీడియో బయటపెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశారు. రూ.లక్షల్లో ఇచ్చినా ఇంకా కావాలంటూ డిమాండ్ చేశారు. చనిపోవాలంటూ ప్రేరేపించారు. ఈ వేధింపులు తాళలేక ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోతీసి అందులో వేధింపుల వైనాన్ని వివరించింది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు.. పొన్నూరు 17వ వార్డులో నివసించే బలిమిడి లక్ష్మీతిరుపతమ్మ (32) ఈ నెల ఒకటో తేదీన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. పనికి వెళ్లిన భర్త శ్రీనివాసరావు ఇంటికి వచ్చినా భార్య ఎంతసేపటికీ ఇంటి తలుపులు తీయకపోవడంతో అతను అత్తమామలు, బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి తలుపులు పగలగొట్టి ఆమెను బయటికి తీసుకొచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్యులు చికిత్స చేశాక స్పృహలోకి వచ్చిన ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులకు తెలిపింది. అన్ని వివరాలతో ఫోన్లో వీడియో తీసి ఉంచానని, చూడాలని చెప్పింది. ఫోన్లో వీడియో చూడగా.. లక్ష్మీతిరుపతమ్మ స్నానం చేస్తుండగా బంధువులు కొందరు నగ్నంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఉంది. వారికి రూ.లక్షల్లో ఇచ్చానని, ఇంకా కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, చనిపోవాలని ప్రేరేపిస్తున్నారని, అడిగినంత డబ్బు తమకు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం మృతిచెందింది. తన భార్య మృతికి కారణమైన అన్నావారి శ్రీనివాసరావు, కొంకిపూడి సురేష్, నాగలక్ష్మి, సూర్యారెడ్డి, హరీష్, కొంకిపూడి లక్ష్మీ తిరుపతమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ శరత్‌బాబు చెప్పారు. నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన కలెక్టర్ వివేక్ యాదవ్‌ను లక్ష్మీ తిరుపతమ్మ భర్త, బంధువులు కలసి న్యాయం చేయాలని కోరారు. చదవండి: అనుమానం; ఎలాగైన భార్యను చంపేయాలని పక్కా ప్లాన్‌తో! కోవిడ్ సెంటర్లలో రెచ్చిపోతున్న కామాంధులు -
నటుడు తారకరత్న బంధువులపై దాడి..
సాక్షి, బంజారాహిల్స్ : సినీ నటుడు నందమూరి తారకరత్న బంధువులపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి దాడి చేసి పరారైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నం.2 లోని సాగర్ సొసైటీ ఫ్లాట్ నంబర్ 35లో విజయవాడకు చెందిన బెజవాడ బాలకృష్ణ(33) అనే తారకరత్న బంధువు అద్దెకుంటున్నాడు. శుక్రవారం ఉదయం తన సోదరుడు ఎం.కృష్ణాత్మ(45) అనే ఈవెంట్ మేనేజర్‌తో కలిసి టీ తాగుతున్నాడు. ఇదే సమయంలో నలుగురు ఆగంతకులు ఉదయం 10.30 గంటల ప్రాతంలో ఇంట్లోకి ప్రవేశించి వీరిద్దరి కళ్లల్లో కారం పొడి చల్లారు. కర్రలతో తీవ్రంగా కొట్టారు. కొద్దిసేపట్లోనే ఆ నలుగురు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. ఈ దాడిలో కృష్ణాత్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరికి తల, చేతులకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కోలుకున్న తర్వాత రాత్రి తారకరత్నలో కలిసి పోలీసులకు తమపై దాడి జరిగిన విషయాన్ని ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారు 30 నుంచి 35 ఏళ్ల వయసు వారై ఉంటారని తెలిపారు. వారు తమపై ఎందుకు దాడి చేశారు, వారు ఎవరై ఉంటారన్న వివరాలు తెలియదని తెలిపారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు వచ్చిన కారు నంబర్ కోసం ఆరా తీస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 452, 324 కింద కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు. -
దగ్గరి బంధువులే దోపిడి చేశారు
సాక్షి, హైదరాబాద్(చాదర్‌ఘాట్): వృద్ధురాలిని కత్తితో బెదిరించి దోపిడీ చేసిన కేసు మిస్టరీని చాదర్‌ఘాట్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకొని సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అప్పులు తీరే దారిలేక సొంత పెద్దమ్మ ఇంట్లోనే భర్తతో కలిసి యువతి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాలు.. అజంపురా ఉస్మాన్‌పురాలో నివసించే నికారున్నీసా (65) గురువారం ఇఫ్తార్ ముగించి భర్త బయటకు వెళ్లటంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో బురఖాలో వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఇంట్లోకి చొరబడి ఆమెను కట్టేసి కత్తితో బెదిరించి బీరువాలోని రూ.2 లక్షల నగదు, బంగారు చైను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చాదర్‌ఘాట్ పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. నికారున్నీసా సోదరి కుమార్తె అజంపురాకు చెందిన సాదివి ఇదాయాత్ (32), ఆమె భర్త అక్సర్ (43) లను నిందితులుగా గుర్తించారు. దంపతులకు అప్పులు ఎక్కువ కావటంతో దోపిడీకి పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నారు. పోలీసులు వారిని అదుపులోనికి తీసుకొని రూ.1.70 లక్షల నగదు, బంగారు చైను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ( చదవండి: కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు ) -
‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’
భీమునిపట్నం: కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న వేళ ఇక్కడ నేరెళ్లవలస కాలనీకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటికి ఎవరూ రావద్దని బుధవారం బ్యానర్ కట్టారు. బంధువులు, మిత్రులు, ఎవరు రావద్దని అందులో రాశారు. ‘మనకు మొహమాటం ఉన్నా కరోనాకు లేదు’ అని బ్యానర్‌పై రాసి ఇలా ఇంటి ముందు పెట్టాడు. చదవండి: హడలెత్తించిన 14 అడుగుల గిరినాగు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 2 లక్షల కోవిషీల్డ్ డోసులు -
ఆదమరచి నిద్రిస్తున్న వారిని.. అతి కిరాతకంగా..
సాక్షి, నల్గొండ: నేరెడుగొమ్ము మండలం బుగ్గతండాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. అర్ధరాత్రి ఆరుబయట ఆదమరచి నిద్దరోతున్న దంపతులపై దాయాదులు పథకం ప్రకారం దాడి చేసి ఘాతుకానికి ఒడిగట్టారు. కళ్లలో కారంచల్లి, కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికారు. ఏం జరుగుతుందోనని తెలుసుకునే లోపే.. ప్రత్యర్థుల దాడిలో ఆ దంపతులు విలవిలలాడుతూ ప్రాణాలు విడిచారు. దీంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న బుగ్గతండా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడుగొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన వాంకుణావత్ సోమాణి(48), బుల్లి(42) దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు. కాగా, సోమాణి సోదరుడు లచ్చ కుటుంబంతో కొంత కాలంగా వివాదాలు నడుస్తున్నాయి. తరచూ కుటుంబపరమైన వివాదాలు చోటు చేసుకునేవని ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు. కాగా, కొన్నేళ్ల క్రితం లచ్చ అనారోగ్యంతో మృతిచెందాడు. తరచు గొడవలే.. తండాకు చెందిన సోమాణి, లచ్చ కుటుంబాలు పక్కపక్కనే గృహాలు నిర్మించుకుని నివాసిస్తున్నారు. అయితే, రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలు ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రతి చిన్న విషయంపై రెండు కుటుంబాలు తారస్థాయిలో గొడవపడినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే లచ్చ అనారోగ్యంతో మృతిచెందడంపై కూడా అతడి కుమారులు అనుమానం పెంచుకున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లచ్చ కుమారులైన రమేశ్, గణేశ్, సురేష్, నరేశ్ సోమాణి కుటుంబంపై కక్ష పెంచుకున్నారని తెలుస్తోంది. పథకం ప్రకారమే.. లచ్చ కుమారులు పథకం ప్రకారమే సోమాణి, బుల్లిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ముందస్తుగానే తమ ఇంట్లోని మహిళలను మరో చోటికి పంపి దాడి చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా, వేసవి కాలం కావడంతో సోమాణి, బుల్లి దంపతులు ఆది వారం రాత్రి ఆరుబయట నిద్రించారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రాణాలు విడిచారని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని డిండి సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో పరిశీలించారు. కాగా, సమాచారం అందుకున్న సోమాణి కుమారులు, బంధువులు లచ్చ కుమారుల ఇంటిపై దాడికి దిగారు. దీంతో గ్రామంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు నచ్చజెప్పారు. కాగా, హత్యోదంతంతలో లచ్చ కుమారులే పాల్గొన్నారా..? మరి కొంత సహకారం తీసుకున్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహా లను దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే హత్యకు పాల్పడిన నిందితులు పరా రీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడి కుమారు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ( చదవండి: డబ్బు ఇవ్వలేదని.. కన్నతండ్రినే బకెట్‌తో కొట్టి.. ) -
బంధువుల మధ్య ఘర్షణ,ఒకరు మృతి
కొలిమిగుండ్ల: బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం అబ్దులాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొలిమిగుండ్ల ఎస్ఐ హరినాథరెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అబ్దులాపురానికి చెందిన షేక్ కాశీం (38), వలి బంధువులు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇరు కుటుంబాల మధ్య కొద్ది రోజుల నుంచి విభేదాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతుండేవారు. ఆదివారం రాత్రి వలి భార్య లక్ష్మీదేవి ఇంటి ముందు నీళ్లు చల్లింది. అవి తమ ఇంటి ముందు వరకు పడ్డాయనే కోపంతో కాశీం కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ గొడవ తీవ్రమై దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఆవేశానికి లోనైన వలి చలిక పారతో కాశీంతో పాటు అతని తల్లి మాబున్నీ, భార్య రమీజాపై దాడి చేశాడు. ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం బంధువులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమించి కాశీం మృతి చెందాడు. ఎస్ఐ గ్రామానికి చేరుకుని ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. కాశీం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ( చదవండి: బాలికను నిర్బంధించి 4 లక్షల సొత్తు చోరీ ) -
దారి గొడవలో గాయపడ్డ మహిళలు.. పరిస్థితి విషమం
సాక్షి, వరంగల్: అర్బన్ జిల్లాలో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన దారి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గొడవలో ప్రశ్నించిన ఒక కుటుంబానికి చెందిన మహిళలపై కర్రలతో చితకబాదిన దారుణ ఘటన ఖిల్లా వరంగల్ వసంతపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. తీవ్రగాయలైన వారిని హాస్పిటల్‌కు తరలిచించారు. ప్రస్తుం వారి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... దారి విషయంలో గుండెకారి బాబు, గుండెకారి జగదీష్ అనే అన్నదమ్ముల కుటుంబాలు గత కొద్దికాలం నుంచి గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఈ రెండు కుటుంబాల మధ్య మాట మాట పెరగడంతో జగదీష్ కుటుంబ సభ్యులు కర్రలతో దాడికి దిగారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా పశువులను కొట్టినట్లు కర్రలతో చితక బాదారు. ఈ దాడిలో బాబు భార్యతో పాటు, అడ్డుకున్న మరో మహిళ తలకు కూడా తీవ్ర గాయలయ్యాయి. దీంతో వారిని హాస్పిటల్‌కు తరలించారు. తలకు గట్టి గాయాలు కావడంతో వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు పెర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గీసు గీసుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముంబైలో బైడెన్ బంధువులు..!
ముంబై: ఉత్కంఠభరితంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. త్వరలోనే 46వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో బైడైన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. బైడెన్ బంధువులు కొందరు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివాసం ఉన్నట్లు తెలిసింది. దీని గురించి గతంలో బైడెనే స్వయంగా వెల్లడించారు. 2013లో వైస్ ప్రెసిడెంట్ పర్యటనలో భాగంగా ముంబైలో ఐదుగురు బైడెన్లు ఉన్నారు అని తెలిపారు. భారత్‌లో ఇస్టిండియా పాలన కొనసాగుతున్న కాలంలో తన పూర్వీకులు ఇండియాలో పని చేశారని.. రిటైర్మెంట్ తర్వాత ఇక్కడే స్థిరపడ్డారని బైడెన్ స్వయంగా వెల్లడించారు. బైడెన్ మాట్లాడుతూ.. ‘నా 29వ ఏట 1972లో తొలిసారి సెనెటర్‌గా ఎన్నికయ్యాను. ఆ సమయంలో నాకు వచ్చిన ఓ ఉత్తరాన్ని ఎప్పటికి మర్చిపోను. పేరు చివర బైడెన్ అని ఉన్న ఓ పెద్దమనిషి దగ్గర నుంచి నాకు ఆ ఉత్తరం వచ్చింది. నా పేరు.. ముంబైలో ఎలా అని ఆశ్యర్యపోయాను. అప్పుడు నా గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్‌ఫాదర్ జార్జ్ బైడెన్ ఈస్ట్ఇండియా ట్రేడింగ్ కంపెనీలో కెప్టెన్‌గా పని చేశారని.. భారతీయ మహిళను వివాహామాడి ఇండియాలోనే స్థిరపడ్డారని తెలిసింది. అలా ఇండియాలో నా బంధువులు ఐదుగురు ఉన్నారనే విషయం నాకు తెలిసింది’ అన్నారు. (చదవండి: అమెరికా ఎన్నికలు.. అరుదైన దృశ్యం!) దీని గురించి వంశవృక్ష శాస్త్రవేత్తలు ఎవరైనా పరిశోధన చేసి.. పూర్తి వివరాలు వెల్లడిస్తే బాగుంటుందని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇక ముంబైలోని తన బంధువుల బైడెన్స్ ఫోన్ నంబర్లతో సహా ఎవరైనా తనకు వివరాలను అందించాల్సిందిగా బైడెన్ కోరారు. భారత-అమెరికా సివిల్ న్యూక్లియర్ డీల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా 2015లో వాషింగ్టన్లో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ కార్యక్రమంలో బైడెన్ దీని గురించి మరో సారి మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఆయన ముంబై బంధువులు ఎవరనేది తెలియ లేదు. అంతేకాక మేం బైడెన్ బంధువులమంటూ ఎవరు ప్రకటించలేదు. -
కరోనా భయం.. కొరవడిన మానవత్వం
తెర్లాం: కరోనా మహమ్మారి మానవత్వాన్ని తుంచే స్తోంది. మనుషులను కఠిన పాషాణులుగా మార్చేస్తోంది. ఏ కారణంగా మృతి చెందినా... ఆయనకు కరోనా ఉందేమోనన్న భయంతో దగ్గరకు వెళ్లేందుకు కూడా వెనుకంజ వేసేలా చేస్తోంది. ఇలాంటి సంఘటనే తె ర్లాంలో శుక్రవారం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తికి కరోనా ఉందేమోనన్న భయంతో అంత్యక్రియలు జరిపించేందుకు కూడా బంధువులు ముందుకు రాలేదు. తుదకు ఎస్ఐ జోక్యం చేసుకుని ఆటోలో మృతదేహాన్ని తరలించి, తానే స్వయంగా దగ్గరుండి ఖననం చేయించారు. వివరాలిలాఉన్నాయి. తెర్లాం గ్రామానికి చెందిన వడ్డాది నూకరాజు(తాతా లు) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. విషయం బంధువులకు తెలియజేసినప్పటికీ అంత్యక్రియలు జరిపించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కన్నకుమారుడు దివ్యాంగుడు కావడంతో నిస్సహాయంగా ఉండిపోయాడు. శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు కూడా ఎవరూ సహకరించలేదు. కరోనా పాజిటివ్ ఉందేమోనన్న భయంతో ఎవ్వరూ దగ్గరకు చేరలేదు. ఈ విషయాన్ని ఆయన సామాజిక వర్గానికే చెందిన కందుల శ్రీనివాసరావు ఎస్సై నవీన్ పడాల్‌కు ఫోన్లో తెలియజేశారు. ఆయన వెంటనే మృతుని ఇంటికి వచ్చి మరణించిన నూకరాజుకు కరోనా వైరస్ లేదని, అంత్య క్రియ లు జరిపించేందుకు ముందుకు రావాలని బంధువులకు నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. ఇక చేసేది లేక ఎస్ఐ మానవత్వంతో ఆలోచించి తానే ఆ మృతదేహా న్ని ఖననం చేసేందుకు పూనుకున్నారు. గ్రా మానికి దగ్గరలో ఉన్న చెరువులో జేసీబీతో గొయ్యిని తీయించారు. మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి ఖననం చేశారు. అనారోగ్యంతోనే మృతి చెందాడు తెర్లాంకు చెందిన వడ్డాది నూకరాజు(తాతాలు) అనారోగ్యంతోనే మృతి చెందాడు. అతనికి కరోనా లక్షణాలు లేవు. వృద్ధాప్యంలో ఉండడంతో కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మృతునికి కరోనా లేదు. కేవలం పుకార్లతోనే మృతునికి అంత్యక్రియలు జరిపించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని తెలిసింది. ఇది చాలా బాధాకరం. – డాక్టర్ రెడ్డి రవికుమార్, వైద్యాధికారి, తెర్లాం పీహెచ్సీ -
పెళ్లివారమండీ... ‘విందు’ తెచ్చినామండీ..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): పెళ్లంటే మేళ తాళాలు.. మామిడి తోరణాలు. సందళ్ల ముంగిళ్లు.. పచ్చని పందిళ్లు. మూడు ముళ్లు.. ఏడడుగులు. వీటన్నింటి కళను ఇనుమడించేలా.. బంధుమిత్రుల ఆనందోత్సహాలు. చిరకాలం గుర్తుండిపోయేలా షడ్రసోపేతమైన విందు భోజనాలు. అయితే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో ఇంత సంతోషం ఆవిరైపోయింది. జీవితాంతం గుర్తుండిపోయే వివాహ వేడుక మొక్కుబడి తంతుగా మారిపోయింది. పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించేలా ఆంక్షలు అమలవుతూ ఉండడంతో పెళ్లికి పప్పన్నం కూడా పెట్టలేని పరిస్థితి తలెత్తింది. అయితే సమస్య ఉన్నప్పుడే చిట్కా కూడా ఉంటుంది కదా.. అందుకే ఇప్పుడు పెళ్లికి కొద్ది మందినే ఆహ్వానిస్తున్నా.. బంధుమిత్రులందరికీ పెళ్లి వేడుక జరిగే రెండు రోజులూ పంచభక్ష్య పరమాన్నాల పార్శిళ్లు పంపే కొత్త సంప్రదాయం మొదలైంది. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఐదు నెలల కిందట వివాహం కుదిరింది. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అప్పుడే పెండ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. జూలై 25న కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలకు నిర్ణయించుకున్నాయి. ఇంతలో కరోనా ముంచుకొచ్చింది. వ్యాధి విజృంభణ అధికంగా ఉండడంతో ప్రభుత్వం వివాహ వేడుకలకు నిబంధనలు విధించింది. దీంతో ఘనంగా శుభకార్యం చేసుకోవాలనుకున్న ఇరు కుటుంబాల వారు నీరసపడిపోయారు. దగ్గర బంధువులకే చెప్పుకుని మొక్కుబడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వివాహం అనగానే అందరికీ గుర్తొచ్చేంది విందు భోజనం. పది మందికి ఆకులు వేయాలన్న సంప్రదాయాన్ని కొనసాగించాలని పెండ్లి కుమారుడు నిర్ణయించుకున్నాడు. వివాహానికి ఆహ్వానం పలికిన కొద్ది మందికైనా భోజనం పెట్టాలి.. ఎలా అని ఆలోచించాడు. అందర్నీ పిలిచి భోజనాలు పెట్టేకన్నా.. భోజనాలు తయారు చేసి నేరుగా బంధువుల ఇంటికే పంపిస్తే.. అని ఆలోచించి అమలు చేశాడు. బంధువుల ఇంటికే నేరుగా టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పంపించే ఏర్పాట్లు చేసుకున్నాడు. వివాహ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అతన్ని పెండ్లి కుమారుడ్ని చేశారు. ముందుగా అనుకున్నట్టే తన కుటుంబ సభ్యులతో ఉదయం 7 గంటలకే బంధువుల ఇంటికి నేరుగా టిఫిన్ అందించాడు. మధ్యాహ్నం 11 గంటలకే భోజనం పంపించాడు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో తెలుసుకుని టిఫిన్, భోజనాలు, ప్లేట్లు, స్పూన్, వాటర్ బాటిల్, డిన్నర్ స్పూన్.. పంచభక్ష్య పరమన్నాలన్నీ కలిపి ఓ ప్యాక్ చేసి అందించడం విశేషం. ఫలితంగా బంధువులు వారి వారి ఇళ్లల్లోనే పెండ్లి భోజనం తృప్తిగా ఆరగించారు. బత్తెం రోజులు గుర్తొచ్చాయి మూడు, నాలుగు దశాబ్దాల కిందట బత్తెలు పంచేవారు. ఎటువంటి శుభకార్యం నిర్వహించినా.. సమీప బంధువులు, కుటుంబ సభ్యులకు భోజనాలకు చెప్పుకునేవారు. ఇరుగు పొరుగు వారికి కిలో బియ్యం, పావు కిలో పెసరపప్పు/కందిపప్పు, కాసింత చింతపండు, వంకాయ, బంగాళదుంప.. ఇలా కూరగాయలతో పాటు ఎండుమిర్చి, పోపు దినుసులు ఇచ్చేవారు. కాలం మారింది. బత్తెం రోజులకు స్వస్తి పలికారు. అందరికీ సహపంక్తి భోజనాలు పెట్టేవారు. మారుతున్న కాలంలో సహపంక్తి భోజనాలకు బై.. బై చెప్పారు. బఫే మీల్స్ ట్రెండ్‌గా మారింది. నిలబడి తినే రోజులు వచ్చాయి. కరోనా వచ్చింది.. వాటన్నింటిని తిరగ రాసింది.. అసలు భోజనాలు పెట్టుకోవడానికే అవకాశం లేకుండా చేసింది. -
బావతో వివాహం.. తర్వాత ఎన్ని మలుపులో..!
సాక్షి, ఒంగోలు: ఓ యువతిని సొంత బంధువులే కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు నిందితుల కార్లను ఛేజ్ చేసి ఆమెను రక్షించి నగరంలోని ఓ హోమ్‌కు తరలించారు. వివరాలు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతి వైజాగ్‌లో బీఎల్ చదివే క్రమంలో తల్లిదండ్రులు ఆమెకు ఆమె బావతో వివాహం చేశారు. ఆమెకు ఆ వివాహం ఇష్టం లేకపోవడంతో ఎనిమిది నెలల్లోనే మూడుసార్లు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. మూడోసారి ఈ ఏడాది జనవరి 29న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తిరిగి కనీసం వారికి టచ్‌లోకి కూడా రాకపోవడంతో తల్లి బెంగ పెట్టుకుంది. ఎలాగైనా తన కుమార్తె ఆచూకీ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తల్లి ఆమె స్నేహితులను కలిసింది. చదవండి: నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..! వైజాగ్‌కు చెందిన తరుణ్ తన కుమార్తెకు స్నేహితుడని తెలుసుకుని అతడితో తల్లి మాట్లాడింది. తాను ప్రస్తుతం బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నానని, తనకు మీ కుమార్తె విషయం తెలియదని తెలిపాడు. తల్లి మరింతగా ప్రాధేయపడటంతో ఓకే అన్న తరుణ్..తనతో పాటు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న రాఘవ, అతని స్నేహితుడు మనోజ్‌ల సాయం తీసుకున్నాడు. ఆమె ఎక్కడ ఉందనే విషయమై ఫేస్బుక్లో ముగ్గురు కలిసి సెర్చ్ చేశారు. చివరకు ఆమె ముంబైలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తోందని తెలుసుకున్నారు. ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న సీఐ డబ్బుకు ఆశ పడిన యువకులు తన కుమార్తెను అప్పగిస్తే ఎన్ని డబ్బులైనా ఇస్తానని తల్లి చెప్పడంతో ఆ ముగ్గురు యువకులు ఒక ప్లాన్ వేశారు. తమ స్నేహితురాలు ఒకరు ముంబైలో ఉద్యోగం చేయాలనుకుంటోందని, మదనపల్లె వస్తే ఆమెను కూడా తీసుకెళ్దువంటూ యువతిని కోరారు. ఈ మేరకు ఆమె గోవా వరకు బస్సులో రాగా యువకులు ముగ్గురు కారులో వెళ్లి ఆమెను తొలుత మదనపల్లె తీసుకొచ్చారు. తమ కుమార్తెను ఎలాగైనా ఒంగోలు తీసుకురావాలని ఆమె తల్లి ఆ ముగ్గురు యువకులను కోరింది. వారు నచ్చ జెప్పడంతో యువతి నమ్మి వారితో పాటు ఒంగోలు వచ్చి ఓ హోటల్లో బస చేసింది. ఈ క్రమంలో యువకులు ముగ్గురు ఆమె తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. చదవండి: అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? దౌర్జన్యం చేసిన బంధువులు సదరు మహిళ బంధువులతో పాటు తల్లి హోటల్‌కు వచ్చి దౌర్జన్యం చేశారు. రూమ్ నంబర్ 104లో బస చేసిన తమ కుమార్తెను లాక్కెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో యువకులు అడ్డం పడటంతో వారిపై దాడి చేయడంతో పాటు వారు వచ్చిన కారును సైతం ధ్వంసం చేశారు. అనంతరం అడ్డుపడ్డ రాఘవను బలవంతంగా తమతో పాటు కారులో ఎక్కించుకుని చిలకలూరిపేట బయల్దేరారు. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ భీమానాయక్ తన సిబ్బందితో కలిసి కార్లను వెంబడించి మహిళను రక్షించారు. ఆమెతో పాటు ఉన్న తల్లి, ఇతర బంధువులను అదుపులోకి తీసుకుని ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. యువకులు మాత్రం తాము కేవలం ఆమెను వారికి అప్పగించేందుకైన ఖర్చులు చెల్లించమని కోరామని, తాము సహకరిస్తే ఆమె బంధువులతో చావుదెబ్బలు తిన్నామని వాపోయారు. యువతి తల్లి మాత్రం తమ కుమార్తెను ఆ ముగ్గురు యువకులే తీసుకెళ్లారంటూ ఆరోపిస్తుండగా యువతి మాత్రం తనకు వివాహం ఇష్టం లేక వెళ్లిపోయానని, స్నేహితులుగా ఉంటూ తనను నమ్మించి తనను తల్లిదండ్రులకు బలవంతంగా అప్పగించేందుకు ప్రయత్నించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. యువతి తల్లి, సోదరుడు, భర్త, మరో ఐదుగురు బంధువులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. యువతి తన తల్లిదండ్రులు, భర్తతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమెను ఒన్‌స్టాప్ హోమ్‌కు తరలిస్తున్నట్లు సీఐ భీమానాయక్ తెలిపారు. -
సామాజిక వనంలో కార్తీక జన భోజనాలు
కార్తీకమాసం మరికొద్దిరోజులు మాత్రమే ఉంది. ఇంతకాలం వివిధ కారణాల వల్ల వనభోజనాలకు వెళ్ల(లే)నివారు ఇప్పుడైనా సరే.. ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో బంధుమిత్రులతో కనీసం కుటుంబ సభ్యులతో కలసి ఒక పిక్నిక్లా వనభోజనాలకు వెళ్లి, స్నేహంగా... ప్రేమగా.. సమైక్యతా భావంతో జరుపుకుంటే.. ఆత్మీయానుబంధాలు పెనవేసుకుంటాయి. మానవ సంబంధాలు బలపడతాయి. కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అంతేకాదు.. ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు కార్తీక వనభోజనాలు మంచి ఆటవిడుపు. పూర్వం సూతమహర్షి ఆధ్వర్యంలో నైమిశారణ్యంలో మునులందరూ వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు కార్తీకపురాణం చెబుతోంది. అలా పూర్వం ఆ మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాల ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ మనందరం ఏర్పాటు చేసుకుంటున్నాం. నలుగురితో కలిసి మెలిసి సంతోషంగా వేడుకలు జరుపుకొంటూ ఆనందిస్తున్నాం. ప్రత్యేకించి ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కార్తీక వన భోజనాలు సమీప ఉద్యానవనాలలో, తోటల్లో, నదీ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు. వనభోజనాలు మనలోని కళా ప్రావీణ్య ప్రదర్శనకూ వేదికగా నిలుస్తాయి. భోజనాలకే పరిమితం కాకుండా, అందరూ కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా, ఆనందంగా గడిపేందుకు ఇది ఒక చక్కటి వేదిక అవుతుంది. ప్రకృతి ఆరాధన మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్నీ, నీడనూ, నారబట్టలనూ అందించే వృక్షాలు గొప్ప దేవతలు. ఫలం, పుష్పం, పత్రం లేకుండా మన పూజలు సంపూర్ణం కావు. సంస్కృతి ముందుకు సాగినా భారతీయులు ఆనాటి మూలాలను మర్చిపోలేదు. మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని వారికి తెలుసు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు. అలాంటి వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావించి పూజించాలన్నది పెద్దల మాట. అలాంటి ఆరుబయల్లో అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా, ఔషధభరితమైన ఉసిరి వంటి చెట్ల గాలిని పీల్చుకోవడానికైనా వనభోజనాలు సరైన సందర్భాలు. ఎక్కడపడితే అక్కడ వనభోజనాలు అంత ఆరోగ్యకరం కాదు కాబట్టి ఉసిరి చెట్టు ఉన్న వనం ముఖ్యం అన్నారు పెద్దలు. వినోదం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, సామాజికం... ఇలా ఏ కోణంలోంచి చూసినా వనభోజనాలకు సాటి మరో సందర్భం కానరాదు! ‘వనం’ అనే పదానికి ‘అరణ్యాన్ని ప్రేమించడమ’ని అమరకోశం చెబుతుంది. జపానులో కూడా హనామి (హన – పువ్వు, మిమస్ – చూడటం) పేరుతో మార్చి చివరి వారంలో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుకను జరుపుకుంటారు. సామాజిక కోణం వనభోజనాలు సంప్రదాయమే కాదు అందులో సామాజిక కోణమూ వుంది. స్నేహాన్ని, సమైక్యతను పెంచేదే ఈ కోణం. అంతస్తుల తారతమ్యాలు లేని సమైక్యతా భావం ఈ సహపంక్తి భోజనాల్లో వెల్లివిరుస్తుంది. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించే క్రమంలో వన భోజనాలు జన భోజనాలుగా వర్థిల్లుతాయి. – పూర్ణిమాస్వాతి గోపరాజు కార్తీక మాసంలోనే ఎందుకంటే..? కార్తీక మాసపు రోజుల్లో బయట గడిపేందుకు వాతావరణం అనువుగా ఉంటుంది. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పడతాయి కాబట్టి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. అలాంటి ఆరుబయలు ప్రదేశంలో అందరూ కలిసి అక్కడే వంటలు వండుకుని తినడం మరీ మంచిది. కుదరని పక్షంలో అందరి ఇళ్లనుంచి తెచ్చిన వంటకాలను ఒకరితో ఒకరు పంచుకుని తినడం కూడా స్నేహపరిమళాలు ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది. అందరూ కుటుంబాలతో వెళ్లడం, చెట్లకింద రకరకాలవంటలు వండుకుని తినడం ఒక అనుభవం. అయితే... ఉసిరి చెట్టు ఉన్న వనంలో వనభోజ నాలు చేయడం ఆరోగ్యకరం అంటారు పెద్దలు. -
ఎవరి జీవితం వారిదే
మీరు నివసిస్తున్న కాలనీలో మిగిలిన అందరి కంటే మీరే అన్ని విషయాల్లో ఎక్కువగా ఉండాలనే కోరిక మీలో బలంగా ఉంటోందా? మీ సహోద్యోగి మీ కంటే బాగా కనిపిస్తే మీకు తెలియ కుండానే మీలో ఆందోళన మొదలవు తోందా? మీ దగ్గరి బంధువు కుటుంబం మీ కుటుంబం కంటే మెరుగ్గా ఉంటే ఆ సంగతి మీకు తరచూ గుర్తుకు వస్తోందా? అయితే మీలో నరకం మొదలైందనే! ఒక వ్యక్తికి జీవితం ఎప్పుడు నరకప్రాయం అవుతుందంటే.. తనను మరొక వ్యక్తితో పోల్చుకోవడంతోనే! నిజమే.. పోలిక ఆత్మన్యూనతకు దారి తీయవచ్చు. ఈర్ష్య, అసూయలను కలిగించనూ వచ్చు. ఈర్ష్య, అసూయలు మనిషిని తనతో తాను రగిలిపోయేలా చేస్తాయి. మనిషిని... తన జీవితాన్ని తాను జీవించలేని దుస్థితిలోకి తోసేస్తాయి. మనుషులు తనకు తెలియకుండానే ఈ కంపేరిజన్ ఊబిలోకి చిక్కుకుపోతుంటారు. ఇంట్లో నలుగురు పిల్లలుంటే ఒకరితో ఒకరిని పోల్చి ఒకరిని ప్రశంసించడం, మరొకరికి విమర్శించడం వల్ల పిల్లల్లో ఒకరి మీద మరొకరికి ఈర్ష్య, అసూయలకు బీజం పడుతుంటుంది. పెద్దయిన తర్వాత కూడా తమను మరొకరితో పోల్చుకోకుండా ఉండలేని బలహీనత ఆవరిస్తుంది. మనిషి జీవితాన్ని దుర్భరం చేసేది ఈ బలహీనతే. ఈ దుర్బలత్వాన్ని జయించడానికి సైకాలజిస్టులు ప్రధానంగా ఏడు విషయాలను మర్చిపోకూడదని అంటున్నారు. అవి : ఏ ఒక్కరూ పరిపూర్ణులు కాదు ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకే విధమైన లక్షణాలతో పుట్టరు. అలాగే మనుషుల్లో ఎవరూ పరిపూర్ణులు కాదు, కాలేరు కూడా. ఒక్కొక్కరిలో ఒక్కో అవలక్షణం లేదా అవకరం ఉంటుంది. తమలో ఒక అసహజత్వం ఏదైనా ఉన్నట్లు అనిపిస్తే దానిని అధిగమించడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో తనను అందరూ పరిపూర్ణమైన, సమగ్రమైన వ్యక్తిగా గుర్తించాలనే కోరిక ఉండడం కూడా సరి కాదు. ఎవరి ఇబ్బందులు వాళ్లకుంటాయి ఈ మాట కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ ఇది అక్షరాలా నిజం. కష్టాలు, సమస్యలు, సవాళ్లు లేకుండా ఎవరి జీవితమూ ఉండదు. ఎవరి సవాళ్లను వాళ్లు తమకు చేతనైనట్లు ఎదుర్కొంటూ.. తమ జీవితాన్ని తమకు తగినట్లు, తమకు తోచినట్లు రూపొందించుకోవాలి. అంతే తప్ప తమకు బాగా నచ్చిన మరెవరిలాగానో మారడానికి ప్రయత్నించడం కూడా మంచిది కాదు. మనకు నచ్చిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవచ్చు కానీ అనుకరణగా తీసుకోకూడదు. ఏ ఒక్కరి జీవితలమూ మరొకరి జీవితంలా ఉండదు. జీవితం విషయంలో ఒక సమీకరణ ఏ ఇద్దరికీ వర్తించదు, ఎవరిది వారికే. అందుకే ఎవరి జీవితాన్ని వాళ్లు యథాతథంగా స్వీకరించాలి. ఎవరిని వారు ఇష్టపడాలి ‘నాకు ఎలాంటి గుర్తింపూ లేదు. నేను ఎందుకూ పనికిరాని వ్యక్తిని’ అనే భావన ఒకసారి మనసులో ప్రవేశించిందీ అంటే.. ఆ ఆలోచనను వీలయినంత త్వరగా వదిలించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమలో ఉన్న మంచి లక్షణాలను ఒకసారి పరిశీలించుకుని వాటిని గౌరవించుకోవాలి, ఇష్టపడాలి, ఆ మంచి లక్షణాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి. అంతేతప్ప ఏదో ఒక విషయంలో ప్రత్యేకంగా గౌరవాలందుకుంటున్న మరెవరినో చూసి వారిలాగా మారాలనుకోకూడదు. అలాంటి ప్రయత్నం మొదలైందీ అంటే.. అవతలి వ్యక్తిలా మారడం సాధ్యం కాదు కానీ.. తమలో ఉన్న మంచి లక్షణాలను గాలికొదిలేసినట్లే. ఆ తర్వాత జీవితంలో ఏ ప్రత్యేకతా లేని వ్యక్తుల్లా అనామకంగా మిగిలిపోవాల్సి వస్తుంది. పక్కదారి పట్టించే పోలిక మరొకరితో పోల్చుకోవడం మొదలైన క్షణం నుంచి తమ లక్ష్యాన్ని మర్చిపోవడం, లక్ష్యం తమ ప్రాధాన్యత క్రమంలో కిందకు జారిపోవడం జరిగిపోతాయి. ఒక క్లాసులో బాగా చదివే విద్యార్థి.. తనను అదే క్లాసులో ఉన్న తెల్లటి విద్యార్థితో పోల్చుకుంటూ, ఆ విద్యార్థిలాగా తెల్లగా రావడానికి ప్రయత్నించడం మొదలు పెడితే.. అప్పటి వరకు చదువు మీదనే కేంద్రీకృతమైన దృష్టి పక్కదారి పడుతుంది. దాంతో చదువులో వెనుకపడిపోతారు. పోలిక.. పోరుకు వేదిక ఎంత మంచి స్నేహితుల మధ్య అయినా సరే, ఏదైనా విషయంలో పోలిక వచ్చిందీ అంటే.. వారి మధ్య స్నేహం బీటలు వారిందనే చెప్పాలి. ఇద్దరి మధ్యా ఇదీ అని కచ్చితంగా చెప్పలేని గ్యాప్ ఏదో మొదలవుతుంది. క్రమంగా ఈర్ష్య కూడా కలుగుతుంది. అంతకు ముందులాగ అరమరికలు లేకుండా ఉండలేకపోతారు. ఫ్రెండ్ పట్ల ఈర్ష్య పెంచుకుని బంధాన్ని బలహీన పరుచుకున్న వ్యక్తిగా ముద్ర పడుతుంది. అంటే ఇది ఒక వ్యక్తి తన వ్యక్తిత్వ హననానికి తానే బీజం వేసుకున్నట్లు అన్నమాట. ఆత్మగౌరవానికి సమాధి మరొకరితో పోల్చుకోవడం అంటే... ఆ వ్యక్తి ఆత్మగౌరవాన్ని తనకు తానుగా పరిహసించినట్లే. ఇది ఇక్కడితో ఆగదు. చెదపురుగులా మారి ఆ వ్యక్తిలోని ఆత్మవిశ్వాసాన్ని తినేస్తుంది. మనిషిలో దిగులు, ఆత్మన్యూనతలు మొదలయ్యేది ఇక్కడి నుంచే. ఇది క్రమంగా ఇతరులతో కలడానికి కూడా ధైర్యం లేకుండా మనిషిని కుదేలు చేస్తుంది. ప్రవర్తనతోనే గౌరవం పోలిక అనేది ఏ సందర్భంలోనూ మంచి చేయదు. పైగా పోల్చుకోవడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. క్రమంగా పోల్చుకోకుండా ఉండలేనంత వ్యసనంగానూ పరిణమిస్తుంది. మనిషికి గౌరవం దక్కేది ప్రవర్తనతోనే తప్ప రూపలావణ్యాలతో కాదని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అలాగే ఇతరులతో వ్యవహారించే ధోరణిని బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అది ఆ వ్యక్తితో కలకాలం నిలిచి ఉంటుంది. సృష్టికర్త ప్రతి ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకమైన లక్షణాన్ని ప్రసాదిస్తాడు. మన ఎదురుగా ఉన్న వారికి సొంతమైన మంచి లక్షణం మనలో ఉండకపోవచ్చు. అలాగని మనలో ఏ మంచి లక్షణమూ లేదని కాదు. ఎవరికి వాళ్లు తమ జీవితాన్ని ప్రశాంతంగా, పరిపూర్ణంగా జీవించడానికి ప్రయత్నించాలి తప్ప పోల్చుకుని జీవితాన్ని దుఃఖమయం చేసుకోకూడదు. మనం మొదట్లో చెప్పుకున్నట్లు ఏ ఒక్కరూ పరిపూర్ణులు కారు. అయితే ఎవరికి వాళ్లు తమ జీవితాన్ని పరిపూర్ణంగా మలుచుకోవడం సాధ్యమే. – మంజీర -
బంధువులే ముఠాగా ఏర్పడి..
నెల్లూరు(క్రైమ్): వారు ముగ్గురూ బంధువులు. ముఠాగా ఏర్పడ్డారు. బైక్‌లను దొంగలించి వాటిపై సంచరిస్తూ మహిళ మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లసాగారు. నెల్లూరు సీసీఎస్, పొదలకూరు పోలీసులు వారి కదలికలపై నిఘా ఉంచి అరెస్ట్ చేశారు. శుక్రవారం నగరంలోని సీసీఎస్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్ సైదా వివరాలను వెల్లడించారు. దగదర్తి మండలం చాముదల గ్రామానికి చెందిన కె.తిరుపతి, ఆత్మకూరుకు చెందిన డి.తిరుపతి అలియాస్ పులి, ఎన్.కిరణ్‌లు బంధువులు. వారు చెడు వ్యవసనాలకు బానిసలై దొంగలుగా మారారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు పాలై బెయిల్‌పై బయటకు వచ్చారు. తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో.. నిందితులు కొంతకాలం క్రితం బుచ్చిరెడ్డిపాళెంలో ఓ మోటార్‌బైక్‌ను దొంగలించారు. దానిపై పొదలకూరు, రాపూరు, కండలేరు, కలువాయి ప్రాంతాల్లో తిరుగుతూ మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లసాగారు. వీరి కదలికలపై సీసీఎస్, పొదలకూరు పోలీసులు నిఘా ఉంచారు. శుక్రవారం ఉదయం నిందితులు పొదలకూరు సంగం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్నారనే సమాచారం పోలీసులకు అందింది. సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్ సైదా, పొదలకూరు సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై రవినాయక్‌లు తమ సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించగా నేరాలు చేసినట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి రూ.3.25 లక్షలు విలువచేసే ఒక మోటార్‌బైక్, 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. సిబ్బందికి అభినందన నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ బాజీజాన్ సైదా, పొదలకూరు సీఐ ఫిరోజ్, ఎస్సై రవినాయక్, సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్స్ ఆర్.సురేష్‌కుమార్, కె.వెంకటేశ్వర్లు, పి.సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్స్ జి.రాజేష్, జి.ప్రభాకర్, యు.సురేష్, సీహెచ్ శ్రీనివాసులను సీసీఎస్ డీఎస్పీ బి.నరసప్ప అభినందించి రివార్డులు ప్రకటించారు. నిందితులపై పలు కేసులు ♦ కె.తిరుపతిపై జలదంకి పోలీసు స్టేషన్లో బంగారు దొంగతనం కేసు ఉంది. ♦ డి.తిరుపతి అలియాస్ పులిపై పొదలకూరు పోలీసు స్టేషన్లో మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఉంది. ♦ ఎన్.కిరణ్‌పై ఆత్మకూరు పోలీసు స్టేషన్లో రేప్, మర్డర్ కేసు ఉంది. మరో నిందితుడు పోలీసులకు చిక్కిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారి బంధువైన దగదర్తి మండలం చవటపుత్తేడు గ్రామానికి చెందిన కె.వినోద్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.75 వేలు విలువచేసే రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
‘పెళ్లి పిలుపులు రాని తల్లి’
టెలివిజన్ రంగంలో ఎన్ని ఘన విజయాలు సాధించినప్పటికీ ఏక్తా కపూర్ సాంఘికంగా ‘పెళ్లి కాని తల్లి’గానే గుర్తింపబడుతోంది. ఆమె ఎదురుపడితే మొదలయ్యే మొదటి ప్రశ్న ‘పెళ్లెప్పుడు?’ అనే!ఏక్తా కపూర్‌కు 43 ఏళ్లు వచ్చాయి. కాని ఇప్పటికీ ఆమె బంధువులకు ఎదురు పడటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళిళ్లకు హాజరవ్వడానికి ఇంకా ఇబ్బందిపడుతూ ఉంటుంది. దానికి కారణం ఆ పెళ్లిలో ‘నెక్ట్స్ నీ పెళ్లే’ అని బంధువులు ఆమెతో అంటూ ఉంటారు. అదీ ఆమె భయం. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు ఆమెకు. ‘స్త్రీ ఎన్ని ఘనవిజయాలు సాధించినా పెళ్లితోనే ఆమె జీవితం సంపూర్ణమవుతుందనే సాంఘిక అభిప్రాయానికి కాలం చెల్లాల్సి ఉంది’ అని ఏక్తా అంటుంది. పెళ్ళిళ్లకు తీసుకెళితే పెళ్లి మీద మనసు పుడుతుందేమోనని ఏక్తా తల్లి శోభా కపూర్ గతంలో ఏక్తాను పెళ్ళిళ్లకు పిలుచుకుని వెళ్లేది. కాని అక్కడ ఏక్తాను ఇలా అర్థం లేని ప్రశ్నలు అడుగుతుంటే దానికి ఏక్తా అర్థం లేని సమాధానాలు చెప్పడం చూసి, ఆ సమాధానాలకు ఎదుటివారు హర్ట్ అవడం గమనించి ఏక్తాను పెళ్లిళ్లకే తీసుకెళ్లడం మానుకుంది. ఎలాగూ రాదు కదా అని అసలు పెళ్లి పిలుపులు ఆమెకు పంపడం కూడా మానేశారు బంధువులు.ఏక్తా కపూర్ జనవరి 2019లో సరొగసి ద్వారా ఒక మగబిడ్డకు తల్లయ్యింది. ‘నా జీవితంలో నేను చూసిన అన్ని విజయాలకంటే గొప్పది నా కుమారుణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించడం’ అని ఏక్తా అంది. ఏక్తా మొదట తనే ఐవిఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది. అయితే అందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో డాక్టర్లు సరొగసి ద్వారా ఆమె తల్లయ్యే ఏర్పాటు చేశారు. ఏక్తా తండ్రి జితేంద్ర, ఏక్తా సోదరుడు తుషార్ కపూర్ మాత్రమే కాదు ఏక్తా స్నేహితులు కూడా ఈ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఏక్తా తన కుమారుడికి ఘనంగా నామకరణం కూడా చేసింది. జితేంద్ర అసలు పేరైన ‘రవి కపూర్’ను తన కుమారుడికి పెట్టుకుంది. తుషార్ కపూర్ కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సరొగసి ద్వారా తండ్రైన సంగతి తెలిసిందే.ఈ ఘట్టం ఇలా ముగిసినా పెళ్లి గురించి వెంటపడే బంధువులు మాత్రం అలాగే ఉన్నారు. ‘మా అమ్మా నేను ఈ విషయమై లక్ష సార్లు మాట్లాడుకున్నాం’ అంటుంది ఏక్తా. ‘నేను చేయాల్సిన పనులు చాలా ఉండగా పెళ్లెలా చేసుకోను’ అంటుందామె. ‘కాని గత పదేళ్లుగా మా బంధువుల్లో చాలా మంది ఆడపిల్లలు విడాకులు తీసుకున్నారు. అది చూసి మా అమ్మ నయం... నీకింకా పెళ్లి కాలేదు... నీ నిర్ణయమే సరైనదిలా ఉంది అని నిట్టూర్చింది’ అని నవ్వింది ఏక్తా.జితేంద్ర బంగ్లా ఇప్పుడు ఇద్దరు చిన్నారుల కేరింతలతో కళకళలాడుతోంది. అది కోడలు లేని బంగ్లా, అల్లుడు లేని బంగ్లా కావచ్చు. కాని మనుమలు ఉన్న బంగ్లా. వారంతా సంతోషంగా ఉన్నారు. సమాజానికి ఒక కొత్తపద్ధతి చూపించారు. ఈ దారిలో అందరూ నడవక పోవచ్చు.... ఈ దారి ఒకటి అంగీకారం పొందుతోంది అని తెలుసుకుంటే సరిపోతుంది. -
అల్లుళ్లతో కలిసి కుమారుడిని చంపించిన తల్లి..
సాక్షి, సిటీబ్యూరో: దాదాపు 18 ఏళ్ల క్రితం జరిగిన హత్య అది... సూత్రధారిగా ఉన్న హతుడి తల్లి, పాత్రధారులైన బంధువులు, స్నేహితులు ఇన్నేళ్లు స్వేచ్ఛగా సమాజంలో తిరిగారు... కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ ఘాతుకం ఇన్నాళ్లకు బయటకు పొక్కింది... లోతుగా ఆరా తీసిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్యకు సూత్రధారి అయిన హతుడి తల్లి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్చక్రవర్తిలతో కలిసి వివరాలు వెల్లడించారు. హష్మాబాద్‌కు చెందిన మసూదా బీ, మహ్మద్ సాబ్ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు కాగా, ఐదుగురు ఆడపిల్లలు. మహ్మద్ సాబ్ 30 ఏళ్ల క్రితమే కన్నుమూయడంతో అప్పటి నుంచి అన్నీ తానై కుటుంబాన్ని పోషించిన మసూదా బీ ఆడపిల్లలకు వివాహాలు చేయడంతో పాటు మగవాళ్లను సెటిల్ చేసింది. అయితే రెండో కుమారుడు మహ్మద్ ఖాజా మాత్రం ఆమెకు తలనొప్పిగా మారాడు. చిన్నతనం నుంచే మద్యం, పేకాట తదితర వ్యవసనాలకు బానిసైన అతను డబ్బు కోసం తల్లితో పాటు కుటుంబసభ్యులను వేధించేవాడు. దీనికితోడు వారి ఇంటిని సైతం పేకాట శిబిరంగా మార్చేశాడు. ఓ దశలో ఖాజా వేధింపులు తట్టుకోలేకపోయిన ఉమ్మడి కుటుంబం హష్మాబాద్ నుంచి అల్ జుబైల్కాలనీకి మకాం మార్చింది. అయినా అతను వేధింపులు మానుకోలేదు. నిత్యం ఆ ఇంటికీ వెళ్తూ తనకు డబ్బు ఇవ్వకపోతే హష్మాబాద్‌లోని ఇల్లు అమ్మేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. ఖాజా చివరకు తన భార్యతోనూ నిత్యం ఘర్షణ పడుతూ డబ్బు కోసం ఆమెనూ వేధించేవాడు. అతడి ధోరణి ఇలాగే కొనసాగితే కుటుంబం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన మసూదా బీ అతడిని అడ్డు తొలగించుకునేందుకు అల్లుళ్లు రషీద్, బషీర్‌లతో పాటు ఖాజా స్నేహితుడు సయ్యద్ హషమ్‌తో చర్చలు జరిపింది. వీరంతా కలిసి ఖాజాను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం 2001 జూన్ 4న ఖాజాకు కల్లు ఆశచూపిన రషీద్, బషీర్, హషమ్ అతడికి బండ్లగూడకు తీసుకువెళ్లారు. హషమ్కు చెందిన ఆటోలో అక్కడికి వెళ్లిన నలుగురూ ఓ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగారు. అక్కడి నుంచి ఖాజాను శాస్త్రీపురంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఓ ద్రాక్ష తోటలో అతడిని కూర్చోపెట్టిన వారు అదును చూసుకుని అతడిపై బండరాళ్లతో దాడి చేసి చంపేశారు. మృతదేహాన్ని అక్కడే వదిలి తిరిగి వచ్చిన వీరు మసూదా బీకి విషయం చెప్పారు. అప్పట్లో ఖాజా శవాన్ని గుర్తించిన స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హతుడు, హంతకులకు సంబంధించి ఆధారాలు దొరక్కపోవడంతో కొలిక్కిరాని కేసుగా పరిగణించి ఫైల్ మూసేశారు. అప్పటి నుంచి మసూదా బీ సహా ఎవరూ ఈ హత్య విషయం బయటపెట్టలేదు. అయితే కొన్ని రోజుల క్రితం మసూదా బీ ఇంట్లోనే గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఈమెకు అల్లుళ్లతో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు ఖాజాను చంపడం ద్వారా నీకు చాలా సహాయం చేశామని, ఇప్పటి వరకు ఆ విషయం బయటకు చెప్పలేదని నోరు జారారు. దీనిపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు మహ్మద్ తఖియుద్దీన్, ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్‌వర్మ, వి.చక్రవర్తి లోతుగా ఆరా తీశారు. నిందితుల్లో ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2010లో రాజేంద్రనగర్ ఠాణా నుంచి వేరుగా మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం నిందితులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్ప గించి పరారీలో ఉన్న మసూదా బీ కోసం కోసం గాలిస్తున్నారు. ‘నగరంలో ఎవరు నేరం చేసినా? ఎన్నాళ్ళ క్రితం చేసినా? పోలీసుల నుంచి తప్పించుకోలేరు అనడానికి ఈ కేసు ప్రత్యక్ష నిదర్శనం’ అని నగర కొత్వాల్ అంజనీకుమార్ అన్నారు. -
కమలాపూరం ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధుల బంధువులు
-
శుభలేఖలు పంచేందుకు వెళ్తూ..
సాక్షి, బీబీనగర్ (భువనగిరి) : శుభలేఖలు పంచేందుకు వెళ్తున్న తల్లికుమారుడికి మార్గమధ్యలో అనుకోని ప్రమాదం ఎదురైంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి జారి కిందపడడంతో తల్లి తీవ్ర గాయాలపాలై దుర్మరణం పాలైంది. ఈ విషాదకర ఘటన మంగళవారం బీబీనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామ పరిధిలోని పెద్దతండాకు చెందిన పానుగోతు పూర్ణ(45) తన కూతురు వివాహానికి సంబందించిన పెళ్లి కార్డులను బంధువులకు పంచేందుకు మంగళవారం తన కుమారుడు రమేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై బీబీనగర్ వచ్చింది. కాగా బైక్‌పై వెళ్తున్న క్రమంలో వెనుక కూర్చున్న పూర్ణ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో తలకు, కడుపునకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బంధువుల మెప్పు కోసం...
డెహ్రడూన్ : బంధువుల మెప్పు కోసం.. వారి ముందు ధనవంతులుగా గుర్తింపు పొందడం కోసం దొంగతనానికి పాల్పడ్డారు ఓ జంట. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రడూన్‌కి చెందిన సప్న(26) పేద కుటుంబానికి చెందిన మహిళ. ఇమెకు 2009లో వివాహం అయ్యింది. కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భర్త నుంచి విడిపోయి వర్మ అనే మరో వ్యక్తితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సప్న సోదరునికి వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లికి వచ్చే తన బంధువుల ముందు తాను గొప్పగా కన్పించడం కోసం కారులో వెళ్లాలని భావించింది. ఇందుకోసం డెహ్రడూన్‌కు చెందిన శుభం శర్మ అనే టాక్సీ డ్రైవర్‌ను కలిసి తమను ఢిల్లీ తీసుకెళ్లి.. తిరిగి డెహ్రడూన్‌కి చేర్చేలా కిరాయి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న సప్న, వర్మలు మరో స్నేహితురాలితో కలిసి టాక్సీలో ఢిల్లీ బయలు దేరారు. కొంత దూరం ప్రయాణించిన తరువాత సప్న, వర్మ తమ దగ్గర ఉన్న తుపాకీతో టాక్సీ డ్రైవర్‌ను బెదిరించి కారు తీసుకుని పారిపోయారు. టాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం సప్న, వర్మలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నిద్ర పోతున్న బాలికను లాక్కెళ్లి..
భోపాల్ : ఇంట్లో నిద్ర పోతున్న బాలికను టెర్రస్ పైకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛాతార్పూర్ జిల్లా ఖజురహో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక స్వగృహంలో నిద్రపోతుండగా.. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలికను టెర్రస్ పైకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో ఎవరూ గమనించకపోవటంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని బాలిక బంధువులుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఛాతార్పూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
టెక్కలి ఆస్పత్రిలో ఉద్రిక్తత
టెక్కలి రూరల్/నందిగాం : టెక్కలి ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలు శార్వాణీ చేసిన శస్త్రచికిత్స వికటించి బాలింత మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. శనివారం ఉదయం నుంచి ఆస్పత్రి ఎదు ట ధర్నా చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించడంతో సుమారు 5 గంటల పాటు ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. ఉద్రి క్తత తారా స్థాయికి చేరుకునే లోపు ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, డా క్టర్లు, సంఘం నాయకులతో, మృతురాలి బం ధువులతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి బం ధువులు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మందస మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి తారకరావుకు నందిగాం మండలం పాలవలస గ్రామానికి చెందిన గుర్రల వాసు కుమార్తె లక్ష్మి(24)కి సుమారు ఐదేళ్ల కిందట వివాహమయింది. వీరికి మూడేళ్ల కుమారుడు రుత్విక్ ఉన్నాడు. అయితే లక్ష్మి రెండో కాన్పు నిమిత్తం తన అత్తవారింటి నుంచి కన్నవారింటికి పాలవలస వచ్చింది. గురువారం ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ శార్వాణీ అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి శుక్రవారం ఉదయం 11 గంటలకు శస్త్రచికిత్స చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి. అనంతరం డాక్టర్ ఈమెకు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స కూడా పూర్తిచేసి తల్లీ పిల్లలు బాగున్నారని భావించి ప్రసూతి విభాగానికి తరలించా రు. వారిని వార్డుకు తరలించే క్రమంలో అక్కడే ఉన్న కిందిస్థాయి సిబ్బంది శస్త్రచికిత్స ఖర్చులు నిమిత్తం రూ. 2100 తీసుకున్నట్టు లక్ష్మి అన్నయ్య గుర్రాల గణపతి తెలిపారు. అయితే అక్కడికి కొంత సమయం తర్వాత సాయంత్రం 4 గంటలకు లక్ష్మికి బ్లీడింగ్(రక్తం) అవుతుందని తన సోదరుడు గుర్రాల గణపతి నర్సులకు చెప్పగా, వారు మీరు మాకు చెప్పడం ఏమిటి... ముందు మీరు బయటకు నడవండి.. మీరు ఇక్కడ ఉండకూడదు అని తూలనాడారు. దీంతో అతడు బయటకు వచ్చేశాడు. ఆమెకు ఏమి అవ్వదు మాకు తెలుసు అని చెబుతూ రక్తాన్ని గుడ్డతో తుడిచేశారు. బ్లీడింగ్ మరీ ఎక్కువవడంతో డాక్టర్ శార్వాణీకి సమాచారం ఇవ్వడంతో ఆమె లక్ష్మికి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి మందులు ఇచ్చారు. తర్వాత ఆస్పత్రిలో ఏబీ పాజిటివ్ రక్తం లేకపోవడం, లక్ష్మి బీపీ డౌన్ అవ్వడంతో సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చేరిన తర్వాత లక్ష్మి మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, భర్త తారకరావు, సోదరుడు గణపతి టెక్కలి ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. టెక్కలి ఆస్పత్రిలోని నర్సులు, వైద్యులు కలిసే లక్ష్మిని చంపేశారని, పిల్లలను అనాథలను చేశారని వాపోయారు. మృతదేహాన్ని పట్టుకుని టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అర్ధరాత్రి 12 గంటలు దాటింది తెల్లవారి ఫిర్యాదు ఇవ్వండి అని పోలీసులు అనడంతో వారు వెళ్లిపోయారు. అయితే శనివారం ఉదయం నుంచే మృతురాలి కన్నవారు ఊరు పాలవలస, అత్తవారి ఊరు సువర్ణపురం గ్రామస్తులు, నాయకులు తదితరులతో కలిసి ఆస్పత్రి గేటు ముందు ధర్నాకు దిగారు. సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో టెక్కలి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. అనంతరం టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, తాహసీల్దార్ ఆర్.అప్పలరాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ కణితి కేశవరావు, జనసేన నాయకుడు యాదవ్, దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ చల్ల రామారా>వు, దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు బొకర నారాయణరావు, కేఎన్పీఎస్ నాయకులు బెలమర ప్రభాకరరావు, ఈశ్వరరావు కలిసి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వైద్యం అందించి లక్ష్మి మృతికి కారణమైనందుకు వైద్యులు, వైద్య సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి చివరకు సమస్యను పరిష్కరించారు. టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జ రుగుతున్న ఆం దోళనను తెలుసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ రాఘవ ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, బాధితుల నుంచి సమాచారం అడిగితెలుసుకున్నారు. బాధితులకు అందించే సౌకర్యాలు మృతురాలు లక్ష్మికి చెందిన ఇద్దరు పిల్లలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించేవిధంగా చర్యలు తీసుకుంటాం. పిల్లలు పేరు మీద నందిగాం మండల కేంద్రంలో రెండు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలం ఎక్కడైన గుర్తించినట్టు అయితే ఎకరా పొలం, చంద్రన్న బీమా ఉంటే వచ్చేలా కృషిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా తక్షణ సహా యం కింద బాధిత కుటుం బానికి రూ. 40 వేలు ఆర్థిక సహాయం చేశారు. -
ఘోర ప్రమాదం : పెళ్లింట విషాదం
బంధువులకు, స్నేహితులకు పెళ్లి పత్రికలు పంచి తిరుగుప్రయాణమైన వారిపై మృత్యువు పంజా విసిరింది. కొన్ని గంటల్లో ఇళ్లు చేరాల్సిన ఐదుగురి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. సూళగిరి సమీపంలో జాతీయరహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. సాక్షి, చెన్నై(టీనగర్) : బంధువులకు, స్నేహితులకు పెళ్లి పత్రికలు పంచి తిరుగుప్రయాణమైన వారిపై మృత్యువు పంజా విసిరింది. కొన్ని గంటల్లో ఇళ్లు చేరాల్సిన ఆ ఐదుగురి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. సూళగిరి సమీపంలో జాతీయరహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన శంకర్ (50) బెంగళూరులోని లక్ష్మీనారాయణపుర ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇతని ఇంట్లో త్వరలో వివాహం జరగనుంది. బంధువులైన సుమతి(32), కుబేరన్(51), సుమతి(45),మణి(45), ఆనంద్‌లతో కలిసి చెన్నై, తిరుపత్తూరు తదితర ప్రాంతాలలోని బంధువులకు శుభలేఖలు పంచి సోమవారం రాత్రి కారులో బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. సూళగిరి సమీపంలోని అడ్డగురికి వద్ద బెంగళూరు నుంచి పాండిచ్చేరికి వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ డీలక్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలివైపు రోడ్డులోకి దూసుకెళ్లి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. అదే సమయంలో కారు వెనుక వస్తున్న ట్రక్అదే కారుపై దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుకాగా శంకర్, సుమతి, కుబేరన్, సుమతి, మణి మృత్యువాత పడ్డారు. వారి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కారులోని ఆనంద్‌కు, కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ చిక్కణ్ణయ్య(50), కల్లకురిచ్చి జిల్లా, వేప్పేరికి చెందిన ట్రక్ డ్రైవర్ శివ గాయపడ్డారు. స్థానికులు స్పందించి ఆనంద్‌ను బెంగళూరుకు, మిగతా ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సూళగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కోసంహోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ కదిరవన్, çహోసూరు సబ్‌కలెక్టర్ చంద్రకళ, సూళగిరి తహసీల్దార్ పెరుమాళ్ మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల ఆగ్రహం ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సూళగిరి నుంచి పేరండపల్లి వరకు జాతీయ రహదారి పక్కన సర్వీసు రోడ్డు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, యూటర్న్లు, సొరంగమార్గాలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత రెండేళ్లలో జాతీయ రహదారి సూళగిరి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలకు ఇప్పటివరకు సుమారు 50 మంది మృతి చెందారని, రహదార్ల శాఖాధికార్లు పరిశీలనలు చేపట్టి సొరంగమార్గాలు, యూ–టర్న్‌లు, ఫైఓవర్లు నిర్మిస్తామని ఉత్తుత్తి హామీలు ఇచ్చారని మండిపడ్డారు. -
శ్రీదేవి మరణం మాకు తీరని లోటు
-
నిందితుడి బంధువుల దాడి.. 10 మంది పోలీసులకు గాయాలు
మధ్యప్రదేశ్ : పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న ఓ దొంగను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుడి బంధువులు దాడి చేశారు. వివరాలు..దేవాస్ జిల్లా చాంద్గడ్ గ్రామానికి చెందిన సీతారాం గుర్జార్(23) ఇటీవలే దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆదివారం టాంక్ కుర్ద్ పోలీస్ స్టేషన్ నుంచి బేడీలతో సీతారం పరారయ్యాడు. దీంతో పోలీసులు అతనిని పట్టుకునేందుకు పోలీసులు అతని స్వగ్రామం చాంద్గడ్కు బయలుదేరారు. అతని ఇంటిని సమీపించగానే నిందితుడి బంధువులు కాల్పులకు దిగారు. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. ఓ పోలీసుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను చికిత్స నిమిత్తం ఇండోర్‌కు తరలించారు. పోలీసుల కర్తవ్యాన్ని అడ్డుకున్నందుకు, వారిపై హత్యాయత్నం చేసినందుకు గానూ 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాన ఇప్పటి వరకూ ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదు. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న సీతారం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెప్పారు. -
దారితప్పిన అన్నదమ్ములు
విశాఖ క్రైం: వారిద్దరూ సొంత అన్నదమ్ములు. వ్యసనాలకు బానిసలు కావడంతో దొంగతనాల బాట పట్టారు. బంధువులు, స్నేహితులనే టారెŠగ్ట్ చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మానవత్వం మరిచిపోయి సొంత మేనత్త పీక నులిమి ఆమె మెడలోని గొలుసు అపహరించుకుపోయారు. సుమారు నాలుగేళ్ల పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లకు నమ్మకంగా వెళ్లి దొంగతనాలు చేసిన వీరిరువురు... గడిచిన ఏడాదిన్నర నుంచి ఒంటరిగా కనిపించే మహిళల మెడలోని చైన్లు తెంపుకుపోవడమే పనిగా పెట్టుకున్నారు. పలు స్టేషన్లలో 15 కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిలో ఒకరు పోలీసులకు గురువారం చిక్కాడు. వీరికి సహకరించిన బంగారం వ్యాపారిని, 144 గ్రాముల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏ2 నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించి కమిషనరేట్ సమావేశ మందిరంలో క్రైం డీసీపీ షిమోషి బాజ్‌పాయ్ వివరాలు వెల్లడించారు. గండిగుండం గ్రామానికి చెందిన గండ్రెడ్డి అప్పలరాజు (36), గండ్రెడ్డి సత్తిబాబు(32) అన్నదమ్ములు. కూలి పని చేసుకుంటూ, ఆటో నడుపుకొని జీవనం సాగించే వీరు వ్యసనాలకు బానిసలయ్యారు. ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో 2013 నుంచి దొంగతనాల బాటపట్టారు. చోరీ చేసిన బంగారం విక్రయించేందుకు గోపాలపట్నం ప్రాంతానికి చెందిన గొరస రమేష్‌తో పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో అడవివరం బైరవస్వామి గుడి ప్రాంతంలో ఎక్కువగా చైన్‌స్నాచింగ్‌లు జరుగుతుండడంతో ఎస్ఐ గోపి నిఘా పెంచారు. చేతికి ఆరు వేళ్లు కలిగిన వ్యక్తి చోరీలకు పాల్పడుతున్నట్లు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో చేతికి ఆరు వేళ్లు కలిగిన గండ్రెడ్డి అప్పలరాజు ఈ ప్రాంతంలో గురువారం అనుమానాస్పదంగా సంచరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలన్నీ వెలుగుచూశాయి. మొత్తం 15 కేసుల్లో నిందితునిగా ఉన్న గండ్రెడ్డి అప్పలరాజును, ఆభరణాలు కొనుగోలు చేసిన రమేష్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఎ – 2 నిందితుడు సత్తిబాబు పరారీలో ఉన్నాడని, అతని కోసం వెతుకుతున్నట్లు క్రైం డీసీపీ షిమోషి బాజ్‌పాయ్ ప్రకటించారు. ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన బంగారంతోపాటు 144 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరి చేశామని తెలిపారు. సమావేశంలో క్రైం ఏడీసీపీ వి.సురేష్‌బాబు, ఎస్ఐలు గోపి, జి.డి.బాబు(పెందుర్తి), సుధాకర్, పోలీస్ కానిస్టేబుల్ చిట్టిబాబు, అప్పలరాజు, నర్శింగరావు పాల్గొన్నారు. బంధువులు, స్నేహితులే బలి ♦ గండ్రెడ్డి అప్పలరాజు, గండ్రెడ్డి సత్తిబాబు తమ దొంగతనాలను మేనత్త ఇంటి నుంచే ప్రారంభించారు. 2013 ఏప్రిల్ నెలలో గండిగుండం గ్రామానికి చెందిన తమ మేనత్త వాకాడ సింహాచలం ఇంటిలో రెండు బంగారు నక్లెస్‌లు దొంగతనం చేశారు. ♦ 2014 ఏప్రిల్‌లో మేనత్త వాకాడ సింహాచలం జీడితోటలో పిక్కలు ఏరుతుండగా... ఆమె ముక్కు, నోరు మూసి పీక నులిమేసి హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని 29 గ్రాముల బంగారు గొలుసు అపహరించుకుపోయారు. ఈ బంగారాన్ని పెందుర్తి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కంపెనీలో అప్పలరాజు తాకట్టుపెట్టాడు. ♦ 2014 అక్టోబర్‌లో అక్కిరెడ్డిపాలెంలో బంధువు కోన దుర్గమ్మ ఇంటిలో బంగారు గొలుసు అపహరించారు. ♦ 2015 జనవరిలో సరిపల్లి గ్రామంలోని బంధువు అడ్డూరి కొండమ్మ ఇంటిలో రెండు బంగారు ఎత్తుగొలుసులు చోరీ చేశారు. ♦ 2015 మే నెలలో శొంఠ్యాం గ్రామంలోని స్నేహితుడు బొద్దపు పోలినాయుడు ఇంటిలో బంగారు తాడు దొంగతనం చేశారు. ♦ 2016 మార్చి, ఏప్రిల్‌లో స్నేహితుల ఇళ్లలో పుస్తెల తాడు, చైను అపహరించుకుపోయారు. ♦ 2016 అక్టోబర్ నెలలో సరిపల్లి గ్రామంలో సొంత అత్త ఇంటిలోని జుంకాలను అప్పలరాజు అపహరించాడు. ♦ 2016 అక్టోబర్ నెలలో సింహాచలం బస్టాండ్ వద్ద ఒక మహిళ మెడ నుంచి పుస్తెల తాడు తెంపుకొని ఉడాయించారు. ♦ 2017 సెస్టెంబర్లో మామిడిలోవ గ్రామంలోని స్నేహితుడు రవి ఇంటిలో బంగారు నల్లపూసల దండ దొంగతనం చేశారు. ♦ 2017 ఆగస్టు, అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు ప్రాంతాల్లోని ఐదుగురు మహిళల మెడల్లోని పుస్తెల తాళ్లు తెంపుకుపోయారు. -
ఇలా కూడా చేస్తారా.. వింత ఆచారం!
మరణాలపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన నమ్మకాలు, మత విశ్వాసాలు, ఆచారాలు, పద్దతులు ఉంటాయి. ఈజిఫ్టు పిరమిడ్లు కూడా ఇటువంటి ఆచారాలు, నమ్మకాల కోవలోకే వస్తాయి. మన దేశంలో కూడా వ్యక్తి మరణం తరువాత చేయాల్సిన కొన్ని పనులను కర్మలుగా నిర్వహిస్తాం. కాకపోతే కొందరి ఆచారాలు.. భీతిగొలిపేలా, ఇటువంటివి కూడా ఉంటాయా? అన్న ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటాయి. ఇండోనేషియాలోని రిందిగాల్లో గ్రామ ప్రజలు నమ్మకాలు, విశ్వాసాలు ఇలాగే ఉంటాయి. రిందిగాల్లో గ్రామ ప్రజలు చనిపోయిన వారి మీద చూపే ప్రేమ, గౌరవం చాలా గొప్పగా ఉంటుంది. సాధారణంగా ఎక్కడైనా మృతి చెందిన వారికి ఏడాదికోసారి సంవత్సరీకం పేరుతో వారిని స్మరించుకోవడం సహజం. అయితే రిందిగాల్లో గ్రామ ప్రజలు మాత్రం.. వారిని పార్థివ దేహాలను సమాధుల నుంచి వెలికి తీసి కార్యక్రమాలను నిర్వహిస్తారు. మృత దేహాలను ఏడాదికోసారి సమాధుల నుంచి బయటకు తీస్తారు. వాటిని చాలా జాగ్రత్తగా రసాయనాలతో శుభ్రపరుస్తారు. వారు బతికున్నప్పుటి అలవాట్లను గుర్తు చేసుకుంటూ శవాలను ఆలా రూపొందిస్తారు. వారికి నచ్చే రంగులతో రూపొందించిన దుస్తులు, కళ్లజోడు, సిగరెట్లు, తినే పదార్థాలను ఏర్పాటు చేస్తారు. తరువాత శవాలను ఇంటికి తీసుకువచ్చి.. బతికున్నప్పుడు ఎక్కడైతో కూర్చునేందుకు ఇష్టపడేవారే.. ఆ స్థలంలో కూర్చోబెడతారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తారు. రోజంతా వారు పండుగలా గడిపేస్తారు. సాయంత్రం అయ్యేసరికి గ్రామస్థుల మొహాల్లో విషాదఛాయలు కనిపిస్తాయి. చీకటి పడ్డతరువాత గ్రామస్థులంగా శవాలను తిరిగి సమాధుల్లోకి భద్రంగా చేరుస్తారు. ఆ రాత్రంతా వారు జాగరణ చేస్తూ గడుపుతారు. -
వెంటాడి గొంతుకోసి చంపిన బంధువులు
గూడూరు: పాత కక్షలు పురివిప్పాయి... అదను కోసం కాపుకాసిన బంధువులు మారణాయుధాలతో వెంటాడి.. అతి కిరాతకంగా చిన్న జయరామయ్య(30), డేగా పెద్ద జయరామయ్య (32) అనే ఇద్దరిని గొంతుకోసి, నరికి చంపిన దారుణ ఘటన గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరానగర్‌లో ఆదివారం జరిగింది. ఈ జంట హత్యలతో ఆ ప్రాంతం భీతిల్లింది. వివరాల మేరకు.. పందులు మేపుకుంటూ జీవనం సాగించే దొమ్మరి సామాజిక వర్గానికి చెందిన సమీప బంధువులైన డేగా రామయ్య, డేగా చెంగయ్య కుటుంబాలకు పాత కక్షలు ఉండేవి. ఈ ఏడాది జూలై 5న డేగా చెంగయ్య కుమారుడు నారాయణ పందులను మేతకు తోలుకెళ్తున్నాడు. ఈ క్రమంలో డేగా రామయ్యతో కలిసి అతని తమ్ముడు చిన కోటయ్య, కొడుకులు చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్య, బాబు, కాపుకాసి నారాయణను హతమార్చారు. దీంతో పోలీసులు చిన్న, పెద్ద జయరామయ్యలు, బాబు, తండ్రి రామయ్య, చిన్నాన్న చిన్న కోటయ్యలైన ఐదుగురిపై హత్య కేసు నమోదు చేయడంతోపాటు, రౌడీ షీట్లు కూడా తెరిచారు. ఆ రెండు కుటుంబాల మధ్య మళ్లీ ఘర్షణలు పునరావృతమై హత్యలకు దారితీయకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా వారిని ఊరు విడిచి వెళ్లిపోవాలని చెప్పడంతో, వారు కోట మండలం విద్యానగర్‌కు కాపురం వెళ్లాపోయారు. ఈ క్రమంలో గత శుక్రవారం రామయ్య ఇల్లు కాలిపోవడంతో, చిన్న, పెద జయరామయ్యలు, సోదరుడు బాబు, వారి భార్యాపిల్లలు గూడూరుకు వచ్చారు. అదును చూసి హత్యచేశారు.. ఇదే అదును కోసం కాపుకాసి ఉన్న డేగా చెంగయ్య బంధవులు రమేష్, శీను, చింతాలు, కాంతారావుతో ఇంకొందరు మహిళలు.. ఇంటి పనులు చేసుకుంటున్న చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్యలతోపాటు, వారి కుటుంబ సభ్యులపై కారప్పొడి చల్లి దాడికి పాల్పడ్డారు. సోదరులు చిన్న పెద్ద జయరామయ్యలను విచక్షణా రహితంగా గొంతు కోసి, ముఖంపై కత్తులతో పోట్లు పొడిచి గుర్తుపట్టలేనంతగా హత్యచేశారు. ఈ దాడిలో సోదరులిద్దరూ మృతి చెందగా, పెద్ద జయరామయ్య భార్య చినక్క, అత్త పూజారి రామమ్మ తీవ్రంగా గాయపడ్డారు. అయితే సోదరులతోపాటు వచ్చిన బాబు అప్పుడే వెళ్లిపోవడంతో తప్పించుకున్నాడు. లేదంటే అతన్ని కూడా మట్టుపెట్టేవారని బంధువులు విలపించారు. పోలీసుల అదుపులో కొందరు నిందితులు ఈ మేరకు సమాచారం అందుకున్న గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు, పట్టణ సీఐ టీవీ సుబ్బారావులతోపాటు ఎస్సై బాబి ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగినట్లు తెలుసుకున్న మృతుల బంధువులు అక్కడికి చేరుకుని మృత దేహాల వద్ద బోరున విలపించారు. తమ వారిని హత్య చేసిన వారిని కూడా చంపేస్తామంటూ బయలుదేరబోగా డీఎస్పీ వారిని వారించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి మృతుని భార్య చిన్నక్క నుంచి వివరాలు సేకరించారు. దారుణ హత్యలకు పాల్పడ్డ వారిలో కొందరు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
అక్రమ సంబంధంతో మా పరువు తీస్తున్నావు..
కరీంనగర్‌క్రైం: దగ్గరి బంధువులు అవమానించారని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్‌లోని మారుతినగర్లో గురువారం జరిగింది. కాలనీకి చెందిన రహనా సుల్తానా(27) మూడు రోజుల క్రితం ఇంటి వద్ద పని చేసుకుంటుండగా ఆమెకు దగ్గరి బంధువు అయిన ఎండీ.నసీబ్‌ఖాన్, అతడి భార్య పర్వీన్, కూతురు ఆఫ్రిన్, అల్లుడు ఎండీ.రహీం ఇంటికి వెళ్లారు. రహీంతో ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకున్నావు... మా ఇంటి పరువు తీస్తున్నావు.. ఎందుకు బతికి ఉన్నావు అంటూ దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన సుల్తానా గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆమెను దూషించిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్రిటౌన్ ఇన్స్పెక్టర్ విజయకుమార్ తెలిపారు. -
బంధువే రాబందువు
చిన్నారులను హతమార్చిన యువకుడు గోదారి చూపిస్తానని.. కాలువలో తోశాడు అదృశ్యమైన పిల్లలు నిర్జీవులయ్యారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన గ్రామస్థులు రవిశేఖర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొయ్యలగూడెం దిప్పకాయలపాడులో అదృశ్యమైన ప్రశాంత్, విక్కీల కథ విషాదాంతంగా ముగిసింది. ఈ నెల 23న గ్రామం నుంచి అదృశ్యమైన వీరిరువురు పోలవరం కుడికాలువలో పోలవరం మండలం, గోపాలపురం మండలంలో వేర్వేరు చోట్ల విగతజీవులుగా కనిపించారు. దిప్పకాయలపాడు గ్రామానికి చెందిన కైకవరపు చిన్నారావు, మంగ దంపతులకు ప్రశాంత్ (10), విక్కీ(5)లు సంతానం. గత ఆదివారం పాలు తీసుకురావడానికి బయటకు వచ్చిన వారిని చిన్నారావు బంధువైన కైకవరపు రవిశేఖర్ గోదావరి కాలువ చూపిస్తానంటూ బైక్‌పై ఎక్కించుకుని పట్టిసీమ ఎత్తిపోతల పథకం జీరో పాయింట్ వద్దకు తీసుకువెళ్లాడు. కాలువ చూస్తున్న ఇరువురు చిన్నారులను వెనుక నుంచి ప్రవాహంలోకి నెట్టివేయడంతో చిన్నారులు మృత్యువాత పడ్డారు. విక్కీ మృతదేహం పోలవరం మండలం రేపల్లెవాడ, ఇటికిలకోట సమీపంలో మంగళవారం ఉదయం గుర్తించగా, ప్రశాంత్ మృతదేహాన్ని గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం సమీపంలో గుర్తించారు. చిన్నారులు అదృశ్యమైన రోజునే వారి తండ్రి కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అప్పటికే చిన్నారులను బలితీసుకున్న రవిశేఖర్ ఏమీ ఎరగని వాడిలా చిన్నారావుతోపాటు పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. చిన్నారుల అదృశ్యం మెట్టప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో డీఎస్పీ చిటికెన మురళీకృష్ణ దర్యాప్తు చేపట్టారు. 24వ తేదీ దిప్పకాయలపాడు వెళ్లి విచారణ చేపట్టిన అనంతరం రవిశేఖర్‌పై పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ఫోన్‌కాల్స్‌తో పోలీసుల వల: దిప్పకాయలపాడు చిన్నారుల మృతికి కారణమైన రవిశేఖర్‌ని పోలీసులు ఫోన్ కాల్స్‌తో పట్టుకోగలిగారు. డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో రవిశేఖర్‌ను అనుమానించి 24వ తేదీ రాత్రి అతనికి ఫోన్ చేసి చిన్నారులు ఇరువురూ సేఫ్‌గా ఇంటికి తిరిగి వచ్చారని తెలిపారు. దీంతో పోలీసులకే రవిశేఖర్ పలుసార్లు తిరిగి ఫోన్ చేసి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, వారిని ఎవరైనా ఏదైనా చేశారా అంటూ పదే పదే సందేహాలు వ్యక్తంచేయడం పోలీసుల అనుమానానికి మరింత బలమైన ఆధారం ఏర్పడింది. ఇరువురు చిన్నారులు దిప్పకాయపాడు ఇంటి వద్దకు వచ్చారని పోలీసులు తెలపగా రవిశేఖర్ మాత్రం దిప్పకాయలపాడు రాకపోవడంతో నిందితుడు అతనే అని అనుమానించారు. దీంతో అతని గురించి విచారణ చేపట్టి పట్టుకుని కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. విచారణలో రవిశేఖర్ నిజం వెల్లడించాడు. ఆ సమాచారంతో తెల్లవారు ప్రాంతంలో పోలీసులు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. దర్యాప్తులో గోపాలపురం, బుట్టాయగూడెం, ధర్మాజీగూడెం, పోలవరం స్టేషన్లకు చెందిన ఎస్సైలు, సీఐ శ్రీనివాసయాదవ్‌లు పాల్గొన్నారు. గ్రామస్థుల ఆగ్రహం... కొయ్యలగూడెం: చిన్నారులను హతమార్చిన యువకుడు రవిశేఖర్‌ను తమకు అప్పగించండి, వాడికి సరైన శిక్షను అమలు చేసి మరొక వ్యక్తి ఇటువంటి అకృత్యం చేయకుండా ఉండటానికి గుణపాఠం నేర్పుతాం అంటూ దిప్పకాయలపాడు గ్రామస్తులు మంగళవారం తీవ్ర ఆగ్రహావేశాలతో పేర్కొన్నారు. చిన్నారులు ప్రశాంత్, విక్కీలను రవిశేఖర్ దారుణంగా హతమార్చాడన్న విషయం తెల్లవారే సరికల్లా దావానలంలా చేరడంతో దిప్పకాయలపాడు దళితవాడలో 500 మందికి పైగా ప్రజలు చేరుకుని రవిశేఖర్ ఇంటిని ధ్వంసం చేశారు. ఆగ్రహం చల్లారక అతని తండ్రి కాంతారావుపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను పక్కకు తోశారు. అయినా స్థానికులు శాంతించకపోవడంతో కాంతారావును పోలీసు జీపులో ఎక్కించుకుని కొయ్యలగూడెం తరలిస్తుండగా మహిళలు జీపునకు అడ్డంగా కూర్చొని అందోళనకు దిగారు. జీపు టైర్లలో గాలిని తీసివేసి కాంతారావును తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. అప్పటికే కొందరు పెద్దలు నిందితుడు రవిశేఖర్ అని, కాంతారావు, అతని మరో కొడుకు, కుటుంబ సభ్యులకు ఏ సంబంధం లేదని నచ్చజెప్పారు. దీంతో వివాదం కొంత సర్దుమణిగింది. వివాహేతర సంబంధమే కారణమా.. చిన్నారులను బలితీసుకోవడానికి కారణం వివాహేతర సంబంధం అని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా పోలీసులు దీనిపై ఏమీ చెప్పడం లేదు. చిన్నారుల తల్లితో రవిశేఖర్ గతంలో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. అయితే రెండు నెలలుగా ఆమె రవిశేఖర్‌తో కలవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పిల్లలే అడ్డుగా భావించిన రవిశేఖర్ వారిని చంపడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుని ఈ నెల 23న కాలువలోకి నెట్టి హతమార్చినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. -
లోపలి శత్రువులను జయించాలి!
అర్జునునికి శత్రుపక్షంలోని వారందరూ బంధువులు, గురువులు అని తెలిసినప్పటికీ, వారిని జయించాలనే ఉద్దేశంతోనే యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. అయితే వారందరినీ చూడగానే మమకారం పెల్లుబికి, నిస్సహాయుడయ్యాడు, నిలువెల్లా విషాదం ఆవరించడంతో యుద్ధం చేయలేనని వెనుదిరిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినదే శ్రీమద్భగవద్గీత. ఇంతకీ గీత ఏమంటోందంటే... పుట్టిన ప్రతిప్రాణికీ మరణం తప్పదు, మరణించిన వానికి తిరిగి జన్మించడమూ తప్పదు, అనివార్యమైనదీ, నిశ్చితమైనదీ అయిన జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడే వారి కోసం దుఃఖించడం సరికాదు అంటాడు శ్రీకృష్ణుడు. అంటే చనిపోయేది ప్రాణి మాత్రమే, ఆత్మ కాదు. మనం ఎవరయితే మరణించారని అనుకుంటున్నామో ఆ మరణించింది భౌతిక సమ్మేళనాలే కాని, చైతన్యరూపంలో ఉండే ఈ ఆత్మ మాత్రం కాదు. ముండకోపనిషత్ ప్రకారం ఆత్మ అనేది ప్రతి జీవి హృదయంలో ఉండి అక్కడి నుంచి శక్తిని ప్రసరింప చేస్తూ ఉంటుంది. ఈ చైతన్య ప్రసారం ఆగినప్పుడే దేహం నిర్జీవమవుతుంది. శరీరం నశించినా ఆత్మ మరణించదు. కనుక ఆత్మ నిత్యం, సత్యం, శాశ్వతం, పురాతనం అయినది. ఇది తెలిసిన వాడు జ్ఞాని. మానవుడు చిరిగిపోయిన పాతవస్త్రాలను వదిలి నూతన వస్త్రాలను ధరించినట్లే నాశన రహితమైన ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఇప్పుడు యుద్ధం లేకపోవచ్చు కానీ, అంతఃశత్రువులున్నారు. కామక్రోధలోభమోహమదమాత్సర్యాలే ఆ శత్రువులు. ఆ శత్రువులను జయించడం కోసమైనా గీతను ఆకళింపు చేసుకోవడం, అందులోని సూత్రాలను ఆచరించడం అవసరం. -
మూఢనమ్మకాలు నమ్ముతారా.. అయితే జాగ్రత్త !
వరంగల్: మూఢ నమ్మకాలను నమ్మొద్దని ప్రభుత్వం పెద్దెత్తున ప్రచారం చేస్తున్నా.. శాసనసభలో చట్టాలు చేసే ప్రజాప్రతినిధులే జాతకాలు చెప్పే కోయ దొరల మాయమాటలకు లొంగిపోయి లక్షల రూపాయలు సమర్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల చెవిలో పూలు పెట్టి పూజల పేరిట లక్షల రూపాయలను వసూలు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజలు, యాగాల పేరిట జాతకాలు చెప్పే కోయదొరలు తమ వద్ద నుంచి లక్షల రూపాయాలు వసూలు చేశారని హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలోని ప్రజాప్రతినిధి బంధువులు నగరంలోని ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలగులోకి వచ్చింది.తమ బంధువు అయినా ప్రజాప్రతినిధికి అత్యున్నత పదవీ వచ్చేందుకు రూ.57 లక్షలను వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సదరు ప్రజాప్రతినిధి పోపలీసులకు సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ మేరకు వరంగల్ ప్రాంతానికి చెందిన వాస్తు, గ్రహ పూజలు చేసే కోయదొరలను ఆదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని పోలీసు అధికారుల ఏర్పుటు చేసినట్లు తెలిసింది. గతంలో వారి కుంటుబ సభ్యులకు పూజలు చేయడం వల్ల పలు శుభాలు జరడగంతో వీరి మాటలు నమ్మి లక్షల్లో డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాశీలో పూజలు, అక్కడి పూజారులకు వేలల్లో డబ్బులు ఇచ్చేందుకు పలువురు కోయదొరలు దఫాల వారీగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా హిమాలయాల్లో సైతం పూజలు చేయాలని కోరడంతో ఒకే సారి లక్షల్లో డబ్బులు వారికి అప్పగించినట్లు ఫిర్యాదులో పేర్కొనట్టు తెలిసింది. ఈ మోసానికి పాల్పడిన కోయదొరలను పోలీసులు ఆదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
మహిళ అదృశ్యం
నందికొట్కూరు: స్థానిక వడ్డెపేటకు చెందిన బోయభూలక్ష్మి అనే వివాహిత పదిరోజుల క్రితం అదృశ్యమైంది. చుట్టుపక్కల గ్రామాల్లో, బంధువుల ఊర్లలో ఎంత గాలించినా కనిపించకపోవడంతో భూలక్ష్మి తల్లి బోయమద్దమ్మ ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. అదృశ్యమైన మహిళ 24 ఏళ్ల వయస్సు, 5.4 అడుగుల ఎత్తు, చామనచాయ రంగు కలిగి ఉంటుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు సంతానం. ఆచూకీ తెలిసిన వారు సెల్: 9440795559 నంబర్‌కు ఫోన్ చేయాలని ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
మృతదేహాలతో ఆందోళన
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తల ఘటన శుక్రవారం ఆందోళనకు దారితీసింది. ఆటోమొబైల్ వ్యాపారి చిక్కాల సీతారామరాజు (రాజా), భార్య శ్రీదేవి గురువారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సూసైడ్ నోట్ రాసి వీరు బలవన్మరణం చెందారు. వీరి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను వెంటనే తీసుకురావాలని, అప్పటివరకు మృతదేహాలకు అంత్యక్రియలు జరపమని రాజా తల్లి ఝాన్సీ, బంధువులు భీష్మించారు. చివరకు బం ధువులు, స్నేహితుల సూచనల మేరకు అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో పోలీస్‌స్టేషన్ వద్ద మృతదేహాలను తీసు కువెళ్తున్న వాహనాన్ని నిలిపి ఆందోళన చేయాలని నిర్ణయిం చుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు స్టేషన్ వద్ద ఆం దోళనకు అంగీకరించలేదు. తమకు న్యాయం జరిపించాలని మృతుని తల్లి ఝాన్సీ సీఐ శ్రీనివాస్‌యాదవ్‌ను వేడుకున్నారు. ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దీంతో మృతదేహాలను అంత్యక్రియలకు తీసుకువెళ్లారు. -
ఆస్తి కోసం చంపాలని చూస్తున్నారు
బుచ్చిరెడ్డిపాళెం : ఆస్తి కోసం తనకు మరిది వరస అయ్యే వ్యక్తి తనను చంపాలని చూస్తున్నారని బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన ముంగర మాలిని ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాళెంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముంగర రామచంద్రారెడ్డికి బాలశంకర్ రెడ్డి, సదాశివరెడ్డి, విశ్వనా«థ్‌రెడ్డి, శివకుమార్‌రెడ్డి, రామలింగారెడ్డి కుమారులని తెలిపింది. వీరిలో బాలశంకర్‌రెడ్డి కుమారుడు తన భర్త అని, ఉమ్మడిగా ఉన్న ఓ థియేటర్, 24 ఎకరాల భూమిని రామచంద్రారెడ్డి ఐదు భాగాలు చేశారన్నారు. అయితే విశ్వనాథ్‌రెడ్డి కుమారుడు విక్రమ్‌కుమార్‌రెడ్డి ఆరో భాగం అతనికి కేటాయించినట్లు ఫోర్జరీ సంతకాలు చేసి కోర్టుకు వెళ్లాడని, దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారన్నారు. ఈ ఆస్తిలో బాలశంకర్‌రెడ్డి కోడలిగా తనకు రావాలి్సన వాటా ఇవ్వకుండా తనను చంపేందుకు విక్రమ్‌కుమార్‌రెడ్డి మరి కొంతమంది సహాయంతో ప్రయత్నిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు 20 మందిపై కేసు నమోదు మాలినిపై బుధవారం రాత్రి హత్యాయత్నానికి ప్రయత్నించిన 20 మందిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులందరూ కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. -
పురోహితుడిపై వధువు బంధువుల దాడి
పాలకుర్తి: మంత్రాలు సరిగ్గా చదవడం లేదని, పెళ్ళి ఆలస్యంగా చేస్తున్నాడని పురోహితుడిపై వరుడి బంధువులు దాడి చేశారు. సంఘటన శనివారం కరీంనగర్ జిల్లాలోని బసంత్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బసంత్‌నగర్‌కు చెందిన రాజయ్య కూతురు వివాహం జరిపించేందుకు స్థానిక కోదండ రామాలయం పూజారి సేనాపతి వెంకటరమణాచారి వెళ్ళారు. అయితే పెళ్ళి ముహూర్త సమయానికి కంటే ఆలస్యంగా జరిగింది. ఈనేపథ్యంలో చిత్తుగా మద్యం సేవించిన వధువు తరఫు బంధువు ఒకరు.. మంత్రాలు సరిగ్గా చదవడం లేదంటూ గొడవకు దిగి పెళ్లకి ఆటంకం కల్పించాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరువైపులా బంధువులు సర్థిచెప్పి వివాహతంతు ముగించారు. వివాహం ముగిసిన అనంతరం చొప్పదండి మండల కేంద్రానికి చెందిన వధువు తరుపు బంధువు సమీపంలోని కర్రతో పూజారిపై దాడి చేసి పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో పూజారి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే చికిత్స నిమిత్రం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. విషయం తెలిసిన బసంత్‌నగర్ పోలీసులు సంఘటనపై విచారణ చేపట్టారు. -
తిరుమలలో టీటీడీ చైర్మన్ బంధువుల హల్చల్
-
బంధువులకు దక్కనున్న జయ విలువైన ఆస్తులు
-
మూడు రోజుల పెళ్ళి అమ్మాయి బంధువులకు నో ఎంట్రీ!
తెలుగునాట ఒకప్పుడు అయిదు రోజుల పెళ్ళిళ్ళు... మూడు రోజుల పెళ్ళిళ్ళు... ఆనవాయితీ! ఇప్పటికీ మూడు రోజుల పెళ్ళిళ్ళు చూడాలంటే... ఛలో చెచెన్యా! రోజుల్లోనే కాదు... సంప్రదాయం విషయంలోనూ మనకూ, అక్కడికీ పోలికలున్నాయి. సంప్రదాయ చెచెన్ వివాహమంటే... స్నేహితులంతా కలసి అమ్మాయిని అందంగా సిద్ధం చేస్తారు. అయితే, ఇక్కడే ఒక తిరకాసు. అంతగా తయారైన పెళ్ళికూతురు అన్నీ చూస్తూ ఉండాలే కానీ, ఈ ఆటలు, పాటల కోలాటంలో పాల్గొనకూడదని సంప్రదాయమట! పెళ్ళికొడుకు తరఫు కుటుంబానికి గౌరవం చూపిస్తూ ఉండిపోవాలట! వేడుకకు అమ్మాయి కుటుంబం రాకూడదు! చెచెన్యాలో సంప్రదాయం ప్రకారం పెళ్ళి కూతురి వయసు కేవలం 17 నుంచి 18 ఏళ్ళ లోపుండాలి. పెళ్ళి కొడుకు వయసేమో 20 ఏళ్ళ చిల్లర ఉండాలి. పెళ్ళి ఖర్చంతా వరుడి తరఫు వాళ్ళదే! కానీ, వరుడి కుటుంబమే తప్ప, వధువు తరఫువాళ్ళు హాజరు కాకూడదు. చెచెన్యా రాజధాని గ్రోజ్నీలో జరిగిన ఓ పెళ్ళిలో కారెక్కి, పెళ్ళి మండపానికి వెళుతూ ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటున్న నవ వధువు ఫోటో పక్కనే చూస్తున్నారుగా! దేశాలు, ప్రాంతాలు మారినా, ఆడపిల్ల మనసు, ఆ మనసులోని ప్రేమానురాగాలు ఒకటే కదూ! కానీ, అక్కడి సంప్రదాయం కూడా ఇక్కడ లానే పితృస్వామ్య భావజాలంతో ఉండడమే విచారకరం! -
కాళ్లు పట్టుకుని బతిమాలినా..
వైద్యం చేయడానికి నిరాకరించిన మాచర్ల వైద్యులు వారి నిర్లక్ష్యంపై సాగరమ్మ బంధువుల ఆగ్రహం కాన్పు చేసినందుకు జీజీహెచ్ వైద్యులకు కృతజ్ఞతలు గుంటూరు మెడికల్ : ‘కాళ్లు పట్టుకుని బతిమాలినా మాచర్ల వైద్యులు కాన్పు చేయలేదు.. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న మాకు అప్పటికప్పుడు మాచర్ల నుంచి గుంటూరుకు జీపు బాడుగకు మాట్లాడుకుని వెళ్లటం కష్టసాధ్యమైంది. తప్పనిసరై రూ.5 వేలు వడ్డీకి తీసుకుని జీపు బాడుగకు తీసుకుని రూ.3 వేలు చెల్లించాం..’ అని గర్భిణి చాట్ల సాగరమ్మ తల్లి మిరియమ్మ వాపోయింది. గుంటూరు జీజీహెచ్‌లో వైద్యులు పెద్ద మనసుతో చికిత్స అందించటంతో తన కుమార్తె, మనవరాలు క్షేమంగా ఉన్నారని ఆమె శనివారం తనను కలిసిన ‘సాక్షి’కి తెలిపింది. అప్పటికప్పుడు జీపు బాడుగకు తీసుకొని కుమార్తెను గుంటూరు జీజీహెచ్‌కు తీసుకురాగా స్థానిక వైద్యులు చికిత్స అందించారు. శనివారం ఉదయం సాగరమ్మ సాధారణ కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టగానే శిశువు ఏడవకపోవడంతో ఐసీయూలో ఉంచారు. పేదరికంలో ఉన్న తమను మాచర్ల ప్రభుత్వాస్పత్రిలో పట్టించుకోలేదని ఈ సందర్భంగా మిరియమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఇస్రాయేలు, తాను కలిసి మాచర్ల వైద్యులను కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదని వాపోయింది. తన అల్లుడు లక్ష్మయ్య కూడా కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడని వెల్లడించింది. ఒకవేళ పురిటినొప్పులు తట్టుకోలేక ఏదైనా అపాయకర పరిస్థితి ఏర్పడి తల్లి, బిడ్డకు ప్రమాదం సంభవిస్తే దానికి ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించింది. ఆందోళన వద్దు : ఆర్ఎంవో జీజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్ శనివారం సాగరమ్మను పరామర్శించారు. ఎలాంటి వైద్య సహాయం కావాలన్నా తక్షణమే అందేలా చూస్తామని, ఎలాంటి ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండాలని సాగరమ్మ కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. సకాలంలో వైద్య సేవలు అందించిన జీజీహెచ్ వైద్యులకు సాగరమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
రామకృష్ణ స్వగ్రామంలో విషాద ఛాయలు
-
ఆందోళన.. ఉద్రిక్తత
న్యాయం చేయాలని మృతుని బంధువుల రాస్తారోకో 3 సెంట్ల స్థలం, రూ. 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ కంకిపాడు : పునాదిపాడు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన స్వల్ప వివాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి శనివారం ఉదయం మృతిచెందాడు. దీందో మృతుని బంధువులు, గ్రామస్తులు కంకిపాడు సెంటర్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కోలవెన్ను గ్రామానికి చెందిన కొల్లూరు సాంబశివరావు (38)పై పునాదిపాడుకు చెందిన దేవరపల్లి కిరణ్ శుక్రవారం రాత్రి దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాంబశివరావు శనివారం ఉదయం మృతిచెందాడు. దీంతో మృతుని బంధువులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. మూడు సెంట్ల స్థలం, రూ. 10 లక్షలు చెల్లించాలని గ్రామ పెద్దలు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని అతని బంధువులు స్వగ్రామమైన గడ్డిపాడు తీసుకెళ్తున్నారని సమాచారం రావడంతో మృతుడి భార్య బంధువులు, గ్రామస్తులు పోలీసుస్టేషన్‌కు సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఐ శ్రీధర్, ఎస్ఐ హనీష్లను నిలదీశారు. మృతదేహాన్ని అతని బంధువులే తీసుకెళ్లారని, తిరిగి కోలవెన్ను రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట ఈ క్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మంత్రులు ఘటనాస్థలానికి రావాలని పట్టుబడుతూ గ్రామస్తులు మరోమారు ఆందోళనకు దిగారు. డీసీపీ కోయ ప్రవీణ్, ఏసీపీ విజయభాస్కర్, ఇతర అధికారులు ఆందోళనకారులతో చర్చించారు. చర్చలు జరుగుతున్న తరుణంలోనే డీసీపీ ప్రవీణ్ ఒక్కొక్కరినీ తోసుకుంటూ వెళ్లడం, చేయి చేసుకోవడంతో మిగిలిన పోలీసు సిబ్బంది కూడా రోప్‌ల సాయంతో ఆందోళనకారులను రోడ్డుపై నుంచి తొలగిం చారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. స్పృహ కోల్పోయిన మృతుడి భార్య బుజ్జిని ఆసుపత్రికి తరలించాలనే నెపంతో బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అడ్డుపడుతుండగా బుజ్జిని 108 వాహనంలో తరలించారు. ఖనన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని గడ్డిపాడు వాసులు చెప్పటంతో ఎంతో కాలంగా కోలవెన్నులోనే ఉంటున్నారని, భార్య బుజ్జి వచ్చి నిర్ణయం చెప్పాలనడంతో అందరూ సరేనన్నారు. వైద్య చికిత్స చేయించుకుని గ్రామానికి చేరుకున్న బుజ్జి కోలవెన్నులో ఖననం చేయాలని చెప్పడంతో వివాదం సమసింది. ప్రభుత్వపరంగా ఆదుకుంటాం ప్రభుత్వ పరంగా మృతుడు సాంబశివరావు కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని డీసీపీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవరపల్లి కిరణ్, సాంబశివరావు మధ్య పునాదిపాడు వద్ద రోడ్డు దాటే క్రమంలో గొడవ జరిగిందన్నారు. మృతుడి పిల్లలను సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చేర్చి ఉన్నత విద్య అందేలా చూస్తామన్నారు. ఆందోళనకారులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
మద్యం తాగించి గొంతు కోశాడు
యైటింక్లయిన్ కాలనీ(కరీంనగర్) : ఓ యువకుడికి సమీప బంధువే చిత్తుగా మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక తలపై ఇనుప రాడ్‌తో కొట్టి, గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసిన సంఘటన గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యైటింక్లయిన్ కాలనీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన ఆకుల సంతోష్ తన తల్లి కర్మకోసం ఉదయం యైటింక్లయిన్‌కాలనీలో ఉంటున్న తన సోదరుడి ఇంటికి వచ్చాడు. తన స్నేహితుడు జంగిటి ప్రవీణ్‌తో కలిసి మద్యం సేవించాడు. తర్వాత ఇద్దరూ కలిసి సమీప బంధువు ప్రసాద్(32) వద్దకు వెళ్లారు. ముగ్గురు కలిసి స్థానికంగా మద్యం కొనుగోలు చేసి యైటింక్లయిన్‌కాలనీ-పోతనకాలనీ మధ్య నున్న జల్లారం వాగు ఒడ్డున ఉన్న పొదల వద్దకు వెళ్లి సేవించారు. ఈ క్రమంలో పాత గొడవల ప్రస్తావన రావడంతో సంతోష్, ప్రసాద్ మద్య మాటామాటా పెరిగింది. ఆగ్రహించిన సంతోష్ తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో ప్రసాద్ తలపై కొట్టాడు. స్పృహ తప్పడంతో కత్తిలో గొంతు కోసి, కడుపులో పొడిచాడు. సంతోష్‌కు ప్రవీణ్ సహకరించాడు. ప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. అనంతరం నిందితుల కోసం పట్టణంలో గాలించారు. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కొంతకాలంగా కాపురానికి రావడంలేదని తెలిసింది. పథకం ప్రకారమే హత్య..? రెండేళ్లుగా ఆకుల సంతోష్, ప్రసాద్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈక్రమంలో ప్రసాద్ అడ్డు తొలగించుకునేందుకు సంతోష్ పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం తన స్నేహితుడు జంగటి ప్రవీణ్ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు సంతోష్ అవివాహితుడు. హైదరాబాద్ మెట్రోరైల్లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఉదయం ఇద్దరు యువకులొచ్చారు.. మా తమ్ముడి కోసం ఇద్దరు యువకులు వచ్చారు. ప్రసాద్ ఎక్కడున్నాడు.. అంటూ శనివారం ఉదయం ఇద్దరు యువకులు స్కూటీపై మా ఇంటికి వచ్చారు. లేడని చెప్పడంతో వెళ్లిపోయారు. తర్వాత కాసేపటికే ఇంటికి వచ్చిన మా తమ్ముడు టిఫిన్ చేసి బీరువాల షాపులో పనిచేయడానికి వెళ్లాడు. రోజూ మధ్యాహ్నం భోజనానికి వచ్చే వాడు రాలేదు. ఆతర్వాత చనిపోయాడని తెలిసింది. -మృతుడి అక్క రమాదేవి -
బంధువుల చెరలో ఆ ముగ్గురు!
♦ రైల్వేకోడూరులో 10న ముగ్గురు పిల్లల అదృశ్యం ♦ తన పెద్ద కూతురును ఇవ్వనన్నందుకే కిడ్నాప్ చేశారంటున్న తండ్రి ♦ డోన్‌లో ఉంటున్న సోదరుడి భార్యపై అనుమానం ♦ ఎస్పీ ఆదేశాలతో కదిలిన పోలీసులు రైల్వేకోడూరు రూరల్ : రైల్వేకోడూరు పట్టణంలో ఈ నెల 10న అదృశ్యమైన ముగ్గురు పిల్లలు వారి బంధువుల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు రోజులుగా కనిపించని తమ పిల్లలను తమ వద్దకు చేర్చి న్యాయం చేయాలని పిల్లల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తొలుత పెద్దగా పట్టించుకోని పోలీసులు ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగారు. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంబల్ కాలనీ అంబమొరానా ప్రాంతానికి చెందిన షేక్ నజీర్ తన రెండవ భార్య సఖినా బేగంతో కలిసి రైల్వేకోడూరులోని శాంతినగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నజీర్ లారీలో ఇతర ప్రాంతాలకు వెళితే రెండు మూడు రోజుల తర్వాత వచ్చేవాడు. వీరికి కూతరు హజ్రిన్ హుస్సేన్(8), కుమారులు హజరత్ హుస్సేన్(6), జమీర్ హుస్సేన్(3) ఉన్నారు. వీరు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఇంటి వెనుక ఆడుకుంటూ అదృశ్యమయ్యారు. ఆ రోజంతా అన్ని ప్రాంతాల్లో వెతికామని, బంధువులకు కూడా ఫోన్లు చేసి విచారించామని.. అయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు 11వ తేదీన ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. ఎక్కడైనా ఆడుకోవడానికి వెళ్లి ఉంటారని, వెతకాలని పోలీసులు చెప్పారన్నారు. మీ పిల్లలు మహారాష్ట్రలో ఉన్నారంటూ అదే రోజు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి (+917709855612) ఫోన్ వచ్చిందన్నారు. షేక్ నజీర్ మొదటి భార్య కూతురు నజరానా(18)ను డోన్‌లో ఉన్న గణేష్‌కు ఇచ్చి పెళ్లి చేస్తే సమస్య పరిష్కారమవుతుందని, లేదంటే చంపుతామని బెదిరించారన్నారు. దీంతో తాము జిల్లా ఎస్పీని కలిసి ఆదుకోవాలని కోరామన్నారు. ఆయన ఆదేశాలతో కోడూరు పోలీసుస్టేషనులో కేసు నమోదు చేశారన్నారు. నా సోదరుని భార్య షమీనా బేగం పనే ఇది.. భాధితులు మాట్లాడుతూ తమ పిల్లలను తీసుకెళ్లింది కర్నూలు జిల్లా డోన్‌లో ఉంటున్న తన సోదరుడు జాకీర్ హుస్సేన్ భార్య షమీనా బేగం అని అనుమానంగా ఉందని షేక్ నజీర్ చెప్పారు. వారి ఇంటికి పారిశుద్ధ్య కార్మికుడైన బినోద్ అగర్వాల్ అనే వ్యక్తి వచ్చి వెళ్తుండే వాడన్నారు. ఇదివరకు తాము వారి ఇంటికి వెళ్లినప్పుడు అతను తన కుమార్తె నజరానాను చూశాడని, అతని బావమరిది గణేష్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని కోరాడన్నారు. ఇందుకు తాము తిరస్కరించడంతో కక్ష గట్టిన బినోద్ అగర్వార్ తన సోదరుడి నలుగురు కుమారులను కిడ్నాప్ చేసినట్లు బంధువుల ద్వారా తెలిసిందన్నారు. నజరానాను తీసుకువస్తే వారి పిల్లలను వదిలేస్తానని బెదిరించడం వల్లే.. షమీనా తమ పిల్లలను ఎత్తుకెళ్లిందని అనుమానం వ్యక్తం చేశారు. షమీనా ఈ నెల 10న కోడూరుకు వచ్చి.. తన గురించి అడగ్గా, తాను లారీపై వెళ్లానని తన భార్య చెప్పిందన్నారు. ఇదే అదునుగా ఇంటి వెనుక ఆడుకుంటున్న పిల్లలను తీసుకెళ్లిందన్నారు. సోమవారం రాత్రి పోలీసులుతో కలిసి డోన్‌కు వెళుతున్నామని ఆయన తెలిపారు. తన మొదటి భార్య పప్పీ బేగం 11 ఏళ్ల క్రితం చనిపోయిందని, నజరానాను తన రెండవ భార్య సఖినా బేగం సొంత తల్లిలా చూసుకుంటోందన్నారు. మంచి అయ్య చేతిలో పెట్టాలని భావించడంతోనే తాము ఆ సంబంధాన్ని తిరస్కరించామని చెప్పారు. -
ఆదిశేషు బంధువుల ఇంట్లో ఏసీబీ సోదాలు
ఏలూరు అర్బన్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో ఇటీవల అరెస్ట్ అయిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు డిస్టిలరీస్‌లో అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేస్తున్న మామిళ్లపల్లి ఆదిశేషు బినామీ ఇంటిలో ఆదివారం ఏసీబీ సోదాలు జరిగాయి. నాలుగు రోజులుగా ఆదిశేషు బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని శ్రీపాండురంగస్వామి వారి ఆలయం పక్కన ఉన్న ఆదిశేషు సమీప బంధువు మామిళ్లపల్లి ఏడుకొండల వెంకటసుబ్బారావు ఇంట్లో హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ సెంట్ర ల్ టీం డీఎస్పీ ఎ.అనూరాధ, ఇన్స్పెక్టర్ సుదర్శనరెడ్డి సోదాలు నిర్వహించారు. సుమారు రూ.రెండు కోట్ల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్, టాబ్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ అనూరాధ మాట్లాడుతూ ఆదిశేషు అక్రమాస్తులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారాన్ని 9440446130 నంబర్‌కు తెలపాలని కోరారు. సోదాలలో ఏలూరు ఏసీబీ సీఐ యు.విల్సన్ సహకరించారు. -
డ్రైవర్ మృతితో బంధువుల ఆందోళన
వేములపల్లి: ఓ రైస్ మిల్లు డ్రైవర్ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వేములపల్లి మండలం కనకమహాలక్ష్మి రైస్‌మిల్లులో దూదిమెట్ల సైదులు(28) రైస్‌మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు గుండెపోటుతో మృతిచెందాడని చెప్పారు. దీంతో అతని బంధువులు మృతదేహంతో రైస్‌మిల్లు ఎదుట ఆందోళనకు దిగి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. -
అమెరికా వెళ్లాల్సిన వృద్ధుడు అదృశ్యం
అమెరికా వెళ్లడానికి నగరానికి వచ్చిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోయిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన సూర్యారావు(65) అమెరికాలో ఉంటున్న కుమారుడు, కూతురు దగ్గరికి వెళ్లడానికి ఈనెల 6 తేదీ ఉదయం శాలివాహననగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి వెళాల్సి ఉండగా.. 4 గంటల సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన బంధువులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. సూర్యారావుకు మతిమరుపు ఉన్నట్లు బంధువు రామకృష్ణ పోలీసులకు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఒంగోలుకు వచ్చిన జానీ లీవర్
ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లీవర్ ఆదివారం ఒంగోలు పట్టణానికి వచ్చారు. జానీలీవర్ బందువు ఆనారోగ్యంతో ఉండంతో.. పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిసింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న ఓ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న ఆయన ఒంగోలుకు వచ్చి వెళ్లారు. జానీ లీవర్ స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి. ఆయన తల్లిదండ్రులు ముంబైకి వలస వెళ్లారు. ఇప్పటికీ వారి బంధువులు కనిగిరి ప్రాంతంలో ఉన్నారు. -
బంధు గణం... ముఠా రూపం!
-
బంధు గణం... ముఠా రూపం!
- జైల్లోనే జతకట్టిన మరో గ్యాంగ్ - జంట కమిషనరేట్లలో 30 స్నాచింగ్స్ - 2 అంతర్రాష్ట్ర ముఠాలు అరెస్టు సాక్షి, హైదరాబాద్: చైన్ స్నాచింగ్‌తో నగర మహిళలను హడలెత్తిస్తున్న మహారాష్ట్ర, హైదరాబాద్ సభ్యులతో కూడిన రెండు గ్యాంగ్‌లను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిని పట్టుకున్న ఈస్ట్, సౌత్‌జోన్ల బృందాలు 30 నేరాలకు సంబంధించి కేజీ బంగారం రికవరీ చేసినట్లు కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఎన్.కోటిరెడ్డిలతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అక్కడ నివాసం.. ఇక్కడ షెల్టర్... మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన రషీద్‌ఖాన్, మహ్మద్ సయీద్ అలీ, షేక్ అర్షద్ అలీ, అఫ్రోజ్‌ఖాన్ బంధువులు. వీరిలో రషీద్ నగరంలోని పీర్జాదిగూడలో, అఫ్రోజ్ సోమాజీగూడలో నివసిస్తూ వడ్రంగి పని చేస్తున్నారు. ఈ నలుగురూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. సయీద్, అర్షద్‌లు నగరానికి వచ్చినప్పుడు రషీద్, అఫ్రోజ్ వద్దే షెల్టర్ తీసుకునేవారు. బజాజ్ పల్సర్ వాహనాలను సమకూర్చేవారు. వీటిపై నలుగురూ రెండు గ్రూపులుగా సంచరిస్తూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న, నిల్చున్న మహిళల్ని టార్గెట్‌గా చేసుకుని స్నాచింగ్స్ చేసేవారు. వాటాలు పంచుకుని సెలైంట్ అయిపోయి... కొన్ని రోజుల తరవాత మళ్లీ స్నాచింగ్స్‌కు పాల్పడేవారు. ఈ గ్యాంగ్ నగరంలో 19 స్నాచింగ్స్ చేసింది. రషీద్, సయీద్‌లపై గతంలోనూ కేసులున్నాయి. చైతన్యపురిలో గత ఏడాది నమోదైన కేసులో సయీద్ వాంటెడ్‌గా ఉన్నాడు. జైలు పరిచయంతో జట్టు కట్టి... మహారాష్ట్ర జాల్నాకి చెందిన మీర్ అయాన్ అలీ, తలాబ్‌కట్టకు చెందిన సయ్యద్ అహ్మద్ బేగ్, బీహార్‌కి చెందిన బబ్లూ 2011లో వివిధ కేసులకు సంబంధించి నగరంలో అరెస్టయ్యారు. జైల్లో స్నేహితులుగా మారారు. బయటకు వచ్చి ముఠాగా ఏర్పడి నేరాలు చేయడం మొదలుపెట్టారు. దీనికోసం నాలుగు నెలల క్రితం అయాన్ ఓ అపాచీ బైక్‌ను ఖరీదు చేసి అహ్మద్ బేగ్ దగ్గర ఉంచాడు. తరచుగా అయాన్, బబ్లూ నగరానికి వస్తూ అహ్మద్ దగ్గర షెల్టర్ తీసుకునే వారు. ఇద్దరు చొప్పున బైక్‌పై తిరుగుతూ అదును చూసుకుని స్నాచింగ్స్‌కు పాల్పడేవారు. సొత్తు పంచుకుని ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోయేవారు. ఇలా గడిచిన నాలుగు నెలల్లో 11 నేరాలకు పాల్పడ్డారు. రెండు ముఠాల కోసం ముమ్మరంగా గాలించిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సీహెచ్.శ్రీధర్, ఠాకూర్ సుఖ్‌దేవ్ సింగ్ శుక్రవారం రషీద్, సయీద్, అర్షద్, అఫ్రోజ్, అయాన్, అహ్మద్‌లను పట్టుకున్నారు. బబ్లూ తప్పించుకున్నాడు. వీరి నుంచి కేజీ బంగారం, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే సన్నిహితురాలి దౌర్జన్యం
విజయవాడ (సత్యనారాయణపురం): విజయవాడలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సన్నిహితురాలు, పోలీస్ కానిస్టేబుల్, సెక్యూరిటీ గార్డులు కలసి ఒక మహిళపై దాడిచేసి దారుణంగా కొట్టారు. దీనిపై బాధితులు సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఎమ్మెల్యే అనుచరులు సెటిల్మెంట్ పేరుతో బెదిరించటమేగాక కౌంటర్ కేసు నమోదు చేయించారు. బాధితుల కథనం మేరకు.. స్థానిక బావాజీపేట రెండో లైన్లో ఎమ్మెల్యేకు సన్నిహితురాలైన మహిళ శోభారాణి నివసిస్తోంది. ఆమె కారు డ్రైవర్‌గా పనిచేసిన బొందలపాటి శ్రీనివాసరావుకు ఇద్దరు భార్యలున్నారు. బొందలపాటి సత్యవతి మొదటి భార్య. రెండో భార్యకు ముగ్గురు కుమార్తెలు. కొంతకాలంగా భార్యలకు దూరంగా ఉంటున్న శ్రీనివాసరావు తన పిల్లల్ని శోభారాణి వద్ద ఉంచాడు. పిల్లల్లో ఇద్దరు చదువుకుంటుండగా, మరో కుమార్తె అవంతిక (14)తో శోభారాణి ఇంట్లో పనిచేయిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అవంతిక ఫోను చేయడంతో సత్యవతి, ఆమె కుమారుడు శోభారాణి ఇంటికి వచ్చి అవంతికను తమతో పంపాలని కోరారు. శోభారాణి తిరస్కరించారు. వీధిలోకి వెళ్లిన సత్యవతిని, ఆమె కుమారుడిని కానిస్టేబుల్ గోవిందరాజులు శోభారాణి ఇంట్లోకి తీసుకెళ్లి సెక్యూరిటీ గార్డుతో కలసి తీవ్రంగా కొట్టారు. గాయపడిన సత్యవతి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గాంధీనగర్‌కు చెందిన ఓ టీడీపీ నాయకుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాజీ పడదామంటూ రాయబేరాలు సాగించాడు. దీనికి సత్యవతి అంగీకరించకపోవడంతో అవంతికతో బాధితులపై కౌంటర్ కేసు పెట్టించాడు. వచ్చినవాళ్లు తనకు తెలియదని, తనను దౌర్జన్యంగా తీసుకెళ్లాలని చూశారని అవంతిక తెలిపింది. -
మక్కాలోనే అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లి పవిత్ర మక్కా మసీదు వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. మక్కా మసీదు విస్తరణ పనుల్లో వినియోగిస్తున్న భారీ క్రేన్ కుప్పకూలడంతో గత శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన మచిలీపట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదర్(38), ఫాతీమాబీ(32) దంపతులు ఈ ఘటనలో మృతిచెందినట్లు ఇప్పటికే ప్రభుత్వం ధ్రువీకరించింది. కాగా, మృతుల్లో కర్ణాటకకు చెందిన షమీమ్ బాను, ఖాదర్ బీ అనే మహిళలు సైతం ఉన్నట్లు సోమవారం గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు టూర్ ఆపరేటర్ ద్వారా హజ్ యాత్రకు వెళ్లడంతో వీరిద్దరినీ నగరవాసులుగా భావించారు. అనంతరం వీరిద్దరూ కర్ణాటకవాసులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాగా, ఈ నలుగురి అంత్యక్రియలను ఆనవాయితీ ప్రకారం పవిత్ర మక్కా మసీదులోనే జరపాలని వారి కుటుంబ సభ్యులు కోరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అంత్యక్రియలకు హాజరు కావడానికి మృతుల బంధువులను మక్కాకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇదే ప్రమాదంలో గాయాలపాలైన నాంపల్లి బజార్‌ఘాట్‌కు చెందిన మహమ్మద్ హమీద్ ఖాన్, ఆయన భార్య అనీస్‌లు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భవానీ నగర్‌కు చెందిన షేక్ మహమ్మద్ ముజీబ్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి మక్కా ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను హైదరాబాద్‌కు తీసుకురావాలా? అక్కడే అంత్యక్రియలు చేయాలా? అన్న దానిపై హజ్ కమిటీ మృతుల బంధువులతో సంప్రదించిం ది. పవిత్ర మక్కాలో అంత్యక్రియలు జరపడం అదృష్టమనే విశ్వాసంతో అక్కడే అంత్యక్రియలు చేయాలని బంధువులు కోరారు. -
వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి మృతి
- ఆందోళనకుదిగిన మృతుడి కుటుంబసభ్యులు ఎంజీఎం : వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, మిత్రులు ఆందోళన చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కథనం ప్రకారం.. నగరంలోని కాశిబుగ్గకు చెందిన సీహెచ్. అమర్నాథ్(18) ఈనెల 5వ తేదీన కృష్టాష్టమి వేడుకల్లో గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిటయ్యూడు. కాలుతోపాటు నడుముకు తీవ్రగాయాలు కావడంతో అమర్నాథ్ను ఆర్థోవార్డులో అడ్మిట్ చేశారు. అప్పట్నుంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 6వ తేదీ నుంచి అమర్నాథ్ జ్వరంతో బాధపడుతున్నాడు. మరుసటి రోజు జ్వరం తీవ్రమైంది. సోమవారం రాత్రి పరిస్థితి విషమించింది. శ్వాసతీసుకోవడం సైతం ఇబ్బంది కరంగా మారింది. దీంతో సిబ్బంది వెంటనే క్యాజువాలిటీకి తరలించారు. అరుుతే, వైద్య చికిత్సలు అందిస్తున్న క్రమంలోనే అమర్నాథ్ మృతి చెందాడు. వైద్యులు సక్రమంగా వైద్యం చేయలేదని, అందుకోసమే అమర్నాథ్ మృతి చెందాడని బంధువులు, మిత్రులు ఆరోపించారు. వైద్యులు నిర్లక్ష్యం చేశారంటూ ఆందోళనకు దిగారు. అనంతరం మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. ఎంజీఎం పరిపాలనాధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. -
విమాన ప్రమాదంలో లాడెన్ కుటుంబ సభ్యుల మృతి
లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో అల్‌కాయిదా ఒకప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న ఫీనమ్ 300 అనే ప్రైవేట్ జెట్ విమానం హాంప్‌షైర్‌లోని బ్లాక్‌బుషె ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌అయ్యేందుకు ప్రయత్నిస్తూ కుప్పకూలింది. రన్‌వేను దాటి దూసుకెళ్లిన విమానం ఫెన్సింగ్‌ను తాకి సమీపంలో ఉన్న కార్ల వేలంపాట సంస్థ ప్రదేశంలో బోల్తాపడి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా నలుగురు మృతిచెందారు. మృతుల్లో లాడెన్ సవతి తల్లి, సోదరి, ఆమె భర్త ఉన్నట్లు అరబ్ మీడియా పేర్కొంది. ఇటలీలోని మిలాన్-మాల్పెన్సా ఎయిర్‌పోర్టు నుంచి ఈ విమానం బయలుదేరింది. బిన్ లాడెన్ తండ్రి మొహమ్మద్ బిన్ లాడెన్ సైతం 1967లో సౌదీ అరేబియాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందారు. -
కన్నీళ్లే కన్నెర్ర చేస్తే..
కర్నూలు: అభం శుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని వారు తట్టుకోలేక పోయారు. దాడికి పాల్పడిన మానవ మృగాన్ని తామే చంపేస్తామంటూ పాతబస్తి వాసులు ఒక్కటై కదలివచ్చారు. కర్నూలు పెద్దాసుపత్రి ఆవరణలోని పోలీసు సదన్‌లో చికిత్స పొందుతున్న నిందితుడిని అంతు చూస్తామంటూ సోమవారం రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఆసుపత్రి ఎదురుగా గంట పాటు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సార్... మాకు ఐదు నిమిషాలు అవకాశమివ్వండి... ఆ మానవ మృగాన్ని చంపేస్తామంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ఈ దశలో ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. పాతబస్తీ వాసులకు బీజేపీ నాయకులు హరీష్ బాబు, రంగస్వామి, హేమలత, కాంగ్రెస్ నాయకులు పద్మావతి తదితరులు మద్దతు తెలిపారు. రాస్తారోకో అనంతరం ఒక్క ఉదుటున వందల సంఖ్యలో యువకులు నిందితుడు చికిత్స పొందుతున్న పోలీస్ సదన్ వద్దకు పరుగులు తీశారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐలు రంగనాయకులు, ప్రవీణ్‌కుమార్, బాబుప్రసాద్, రామకృష్ణ తమ సిబ్బందితో ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో మళ్లీ ఆందోళనకారులు ఆసుపత్రి ఎదుట రహదారిపై ఆందోళన చేశారు. నిందితుడిని ఉరి తీసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం అక్కడి నుంచి రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరికి వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు హఫీజ్‌ఖాన్ మద్దతు తెలిపారు. -
మాజీ డీజీపీ బంధువు ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్:హైదరాబాద్: మాజీ డీజీపీ దినేష్ రెడ్డి బంధువు ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఆయన సోదరుడి కుమార్తె ఇంట్లో సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు పలు విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం-58 లో ఉండే దినేష్ రెడ్డి సోదరుడి కుమార్తె దివ్యారెడ్డి గతనెల 4 న అమెరికా వెళ్లింది. వెళ్లు ముందు వజ్రపు ఉంగరాలు, గాజులు దుస్తుల మధ్యలో ఉంచి, వాటిని ఒక బ్యాగ్ లో పెట్టి తన తల్లి వద్దకు పంపింది. అయితే దుస్తుల్లో నగలు పెట్టిన విషయాన్ని తల్లికి చెప్పడం మరిచిపోయింది. గత నెల 17 న దివ్యారెడ్డి అమెరికా నుంచి తిరిగి రావడంతో తల్లి తన వద్ద ఉన్న బ్యాగులో మరికొన్ని దుస్తులు పెట్టి తిరిగి పంపింది. అయితే అప్పటి నుంచి దివ్యారెడ్డి బ్యాగ్ లోని నగలను చూసుకోలేదు. కాగా గత నెల 30 న బ్యాగ్ లో చూసుకోగా నగలు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా దివ్యారెడ్డి నివాసంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు నిందితుల ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది. -
స్నేహితుడే కాలయముడు
పట్టాయగూడెం (చింతలపూడి) : స్నేహితుడే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో మాటామాటా పెరిగి స్నేహితుడి హత్యకు దారి తీసిన ఘటన పట్టాయిగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టాయిగూడెంకు చెందిన సందెళ్ల ఏసుబాబు(20), యండ్రపాటి రాంబాబు స్నేహితులు. వీరు దూరపు బంధువులు కూడా. చిన్ననాటి నుంచి కూలిపనులకు వెళ్లేవారు. ఇటీవల వీరి మధ్య చిన్న తగాదాలు జరిగారుు. మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి రాంబాబు అర్ధరాత్రి వరకు మద్యం తాగాడు. ఏసుబాబును పక్కనే ఉన్న తోటలోకి తీసుకువెళ్లి ఘర్షణ పడ్డాడు. ఏసుబాబును విచక్షణా రహితంగా కొట్టడంతో అతను అక్కడి కక్కడే మరణించాడు. చనిపోయూడని తెలిసి ఆందోళన చెందిన రాంబాబు గ్రామానికి దగ్గరలో ఉన్న రంగ చెరువులో మృతదేహాన్ని పడేశాడు. ఆదివారం ఉదయం చెరువులో ఏసుబాబు మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. చింతలపూడి సీఐ జి.దాసు, ఎస్సై డి.రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుని శరీరంపై ఉన్న గాయాలను పరిశీలించారు. తన కుమారుణ్ణి రాంబాబు హత్య చేసి చెరువులో పడవేశాడని మృతుని తండ్రి పాశ్చాత, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో రాంబాబును అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
బాలికపై బంధువుల అకృత్యం
కొబ్రా: ఛత్తీస్‌గఢ్ కొబ్రా జిల్లాలో దారుణం జరిగింది.14 ఏళ్ల బాలికపై ఆమె సమీప బంధువులే అకృత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోబ్రా ఎస్పీ కీర్తన్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని సోల్వా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక గత బుధవారం రోజూలానే మంచినీళ్లు తెచ్చేందుకు బోరింగ్ వద్దకు వెళ్లింది. ఇంతలోనే ఆమె సమీప బంధువైన యువకుడు వచ్చి అత్యవసరమైన పని ఉందంటూ ఆమెను నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే కాపుకాసిన మరో ఇద్దరితో కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే చంపుతామని బెదిరించి వదిలేశారు. శారీక బాధ తాళలేని ఆ బాలిక చివరకు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో దురాగతం బయటికి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులైన భరత్ రతియా (20), త్రిలోచన్ రతియా (19), గౌతం రతియా (23)లను అరెస్టుచేశారు. -
చట్టానికి చుట్టాలు
(జీవన కాలమ్) తీరా నేరం చేశాక- ఈ హీరోగారు ఒక ట్రస్టుని ప్రారంభించి ప్రజా సేవ చేస్తున్నారట. కానీ బాధితుల కుటుంబాలకు కేటాయించిన 19 లక్షల్లో ఒక్క రూపాయి కూడా ఈ 13 ఏళ్లలో వారికి చేరలేదు! ఈ దేశంలో దాదాపు అన్ని రంగాలూ అవినీతితో భ్రష్టు పట్టిపోతుండగా ఒక్క చట్ట మూ, న్యాయమూ ఏకాస్తో ఉపశమనం కలిగిస్తున్నదన్న ఆశ సామాన్య మానవునికి మిగిలింది. అయితే డబ్బూ, పరపతి, పదవి, అధికారం వంటివి ఆ చట్టాన్ని కూడా లొంగదీసుకోవచ్చునని ఇప్పుడిప్పుడే రుజువవుతోంది. అలనాడు మహాత్మా గాంధీ ‘యంగ్ ఇండియా’లో అన్నా రు: ‘‘బ్రిటిష్ న్యాయ స్థానాల్లో న్యాయం ఖరీదైన సరు కు. సాధారణంగా బరువైన డబ్బు సంచీదే విజయం’’ అని. మనం బ్రిటిష్ వ్యవస్థ వారసులం. 13 సంవత్సరాల కిందట తాగి, లెసైన్సు లేకుండా కారు నడిపి ఒకరిని చంపి, నలుగురిని గాయపరిచి, సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ప్రముఖ నటు డు- సల్మాన్ ఖాన్ ఈ 13 సంవత్సరాలూ ఖరీదయిన లాయర్ల దన్నుతో కేసుని సాగదీశారు. 13 ఏళ్ల తర్వాత కారులోలేని మరొక కొత్త సాక్షిని -డ్రైవర్ని-రంగంలోకి దింపారు. చట్టంలో అలసత్వం కారణంగా న్యాయవ్య వస్థ - ఎంత డబ్బుని, ఎంత సమయాన్ని, ఎంత విలు వైన సిబ్బంది కృషిని వెచ్చించిందో ఆలోచిస్తే ఇలాంటి నేరస్థుల వల్ల వ్యవస్థ ప్రజాధనాన్ని ఎంత వృథా చేస్తోం దో అర్థమవుతుంది. ఇది సామాన్య పౌరుడి పెట్టుబడి. మనందరి సొమ్ము. తీరా న్యాయస్థానం సల్మాన్ ఖాన్ నేరస్థుడని తీర్పు ఇచ్చాక- ఏనాడూ జరగని విధంగా కోర్టులూ, ఆఫీ సులూ రాత్రి ఎనిమిది వరకు పనిచేసి ఈ నేరస్థుడయిన హీరోగారు జైలుకి వెళ్లకుండా కాపాడాయి. 48 గంటల తర్వాత 13 సంవత్సరాల బెయిలుని మరో రెండు రోజులు పొడిగించారు. కోర్టు ఆర్డరు చేతికి రాకుండానే హైకోర్టు రెండు గంటల్లో తీర్పుని ఇచ్చింది! ఈ దేశంలో కనీసం రెండున్నర లక్షల మంది- నూరు రూపాయల లంచం తీసుకున్న పాపానికి బెయి లు డబ్బు కట్టుకోలేక, కోర్టులకు తమ గోడుని ఎలా వినిపించాలో తెలియక సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. 1984లో 57 రూపాయలు మనియా ర్డరు సొమ్ము తిన్న ఒకానొక పోస్టుమాన్ 372 సార్లు - 17 సంవత్సరాలు కోర్టుకు హాజరయాడట! చివరికి అతను నిరపరాధి అని కోర్టు తీర్పు ఇచ్చింది! తీరా నేరం చేశాక- ఈ హీరోగారు ఒక ట్రస్టుని ప్రారంభించి ప్రజా సేవ చేస్తున్నారట. చేతులు కాల్చుకు న్నాక, చేతులు కాలాయని తెలిసిన గడుసయిన ‘డబ్బు న్న’ నటుడు ఆకులు పట్టుకున్న తెలివైన ప్రణాళిక. ఇం తకీ చచ్చిపోయిన వ్యక్తి కుటుంబానికీ, గాయపడినవారి కుటుంబాలకూ కేటాయించిన 19 లక్షల్లో ఒక్క రూపా యి కూడా ఈ 13 ఏళ్లలో బాధితులకి చేరలేదు! ఇంతకూ సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్తారా? వారి పట్ల అభిమానులు ఎలా ఆవేశపడుతున్నారు? సినీ ప్రపంచం ఏకమయి ఎలా సానుభూతి పలుకుతోంది? ఆయన్ని కోర్టులో చూసి తరించిన పోలీసులు అతి ఆనందంగా వారితో ఎలా కరచాలనం చేస్తున్నారు? చట్టాన్ని అటకె క్కించి తనని జైలు నుంచి తప్పించిన లాయర్లని హీరో గారు ఎంత ఉదారంగా కావలించుకుంటున్నారు?- ఈ దృశ్యాల్ని కేవలం 72 గంటలు చూపించి చానళ్లు సమృ ద్ధిగా డబ్బు చేసుకున్నాయి. ఇదంతా పెద్ద తమాషా. మరో పంచ రంగుల కల. 1988లో 28 ఏళ్ల ఫిలిం డెరైక్టర్ చారుదత్ ఆచా ర్యని ఓ ప్రముఖ దర్శకుడు, కవి కూతురు కారుతో గుద్దేసింది. అతని కాలు నుగ్గు నుగ్గు అయి శాశ్వతంగా కుంటి అయ్యాడు. ఆమె యాక్సిడెంటు స్థలం నుంచి యథాప్రకారంగా నిష్ర్కమించింది. ఈ ఆచార్యగారి మాటలు: ‘‘ఢీకొట్టి, పారిపోవడంలో (హిట్ అండ్ రన్) రెండు అంశాలున్నాయి. ఢీకొట్టడం, పారిపోవడం. చాలా సందర్భాల్లో-రక్తంలో విస్కీ పాలు ఎక్కువయి ఢీకొట్టవచ్చు. కాని పారిపోవడం- వ్యక్తిలో మానవతా విలువలు పూర్తిగా లోపించాక, రక్తంలో అహంకారం ప్రబలినప్పుడు మాత్రమే జరుగుతుంది. విస్కీ మత్తులో ఉన్నవాడు కారు నడపడం రద్దీగా ఉన్న వీధిలో చింపాం జీ చేతికి ఏకే-47 రైఫిల్ ఇచ్చినట్టు. ఇది కేవలం తాగు బోతు కారు నడిపిన కేసు మాత్రమే కాదు. సిగ్గూ యెగ్గూ లేకుండా పరారీ అయిన నేరస్థుడి కథ. తమ కోటీశ్వరుల క్లబ్బులో వాటాదారుడయిన ఒక స్టార్‌కి వెన్నెముకలేని పరిశ్రమ మద్దతు పలికే సిగ్గు మాలిన కథ.’’ ఇవి నా మాటలు కావు. 17 సంవత్సరాలు ఇలాం టి యాక్సిడెంటులో ఎన్నో ఆపరేషన్లు, ఎన్నో వైఫ ల్యాలు, రోగాలు తట్టుకుని ఉపాధిని కోల్పోయి చేతి కర్రతో మిగిలిన ఓ దురదృష్టవంతుడి గొంతు. చట్టాలకు కొందరు చుట్టాలుంటారు. వారిలో డబ్బులేని పేద నేర స్థులకి చోటు లేదు. ఆ కారణానికే ఈ దేశంలో ఖరీద యిన చింపాంజీలు చాలా వున్నాయి. (గొల్లపూడి మారుతీరావు) -
భూవివాదంతో కత్తులు దూసుకున్నారు
పశ్చిమగోదావరి: భూ వివాదం రెండు బంధువర్గాల మధ్య వివాదాన్ని తీసుకొచ్చింది. అది కాస్త ఘర్షణగా మారి కత్తులు దూసుకునే వరకు వచ్చింది. ఈఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో పొలం విషయంలో భూ వివాదం నెలకొని రెండు బంధువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గంపై మరో వర్గం కత్తులతో దాడికి దిగింది. దీంతో తేలి సూర్యారావు, మెంటే పెంటయ్య, జంగ రాజు అనే వ్యక్తులు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని జంగారెడ్డి గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మనిషికి సమీప బంధువు..
మనకి బంధువులు ఉంటారు కదా! అమ్మ తరఫు నుంచీ... నాన్న తరఫు నుంచి ఎంతోమంది చుట్టాలు ఉంటారు. అయితే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఈ రకమైన బంధుత్వం గురించి కాదు! జంతువులతో మనిషికి ఉన్న చుట్టరికం గురించి. డి.ఎన్.ఎ. పరంగా చూసుకుంటే... మనిషికి అతి సమీప బంధు జంతువు గొరిల్లా. అవును, దీని డి.ఎన్.ఎ. మనిషి డి.ఎన్.ఎ.కి దాదాపు 98 శాతం దగ్గరగా ఉంటుంది. అందుకే, గొరిల్లాలు చాలా తెలివైన జంతువులు. ఎంత తెలివైనవి అంటే... జంతు ప్రదర్శన శాలల్లో ఉండే సైన్ బోర్డులను సైతం ఇవి అర్థం చేసుకుని మసలుకోగలవు! -
భార్య బంధువుల నుంచి రక్షణ కల్పించండి
బనగానపల్లె వాసి ఎస్పీకి వినతి కర్నూలు: భార్య తరఫు బంధువుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బనగానపల్లెకు చెందిన నడిపి హుసేన్ ఎస్పీ ఆకే రవికృష్ణను వేడుకున్నారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ, అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరుగా వచ్చి కలసినవారి నుంచి ఎస్పీ వినతులను స్వీకరించారు. సాయంత్రం వరకు పోలీసు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె వాసి నడిపి హుసేని ఎస్పీని కలసి వినతిపత్రం రూపంలో తన సమస్యను చెప్పుకున్నారు. తన భార్య సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కొట్టడం జరిగిందని, అందుకు ఆమె తరపు బంధువులు వచ్చి తనను చితకబాదడంతో తప్పించుకుని పారిపోయానని పేర్కొన్నాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు, కొంత నగదు తీసుకువెళ్లారని ఫిర్యాదు చేశాడు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా వేడుకున్నాడు. తన కుమారునికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బుక్కాపురం భాస్కర్‌రెడ్డి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని పసుపుల గ్రామానికి చెందిన రాముడు ఫిర్యాదు చేశాడు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నానని, పదో తరగతి పాసైన తన కుమారునికి రైల్వే శాఖలో హెల్పర్ పోస్టు ఇప్పిస్తానని భాస్కర్‌రెడ్డి నమ్మించి రూ.లక్ష తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరాడు. తన కుమార్తె వివాహం జరిగిన రెండు రోజుల నుంచి అజ్ఞాత వ్యక్తులు ఆమె మొబైల్‌కు వివిధ నెంబర్ల నుంచి ఇబ్బందికరమైన బ్లాక్మెయిల్ మెసేజ్‌లు పంపుతూ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు చేశారు. బంగారు షాపులో పనిచేస్తున్న స్నేహితుడు ఒకరు నా భార్యకు ఫోన్ చేసి ఇబ్బంది ప్రవర్తిస్తున్నాడని డోన్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తరచూ తనతో ఫోన్లో మాట్లాడకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. బేతంచెర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలుములపల్లి గ్రామంలో బెల్టుషాపు ఏర్పాటుతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, మద్యం సేవించినవారు అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్నారని, బెల్టు షాపు నిర్మూలించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎస్పీ, ప్రజాదర్బార్లకు వచ్చిన ఫిర్యాదులన్నిటిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
పెళ్లి విందులో గొడవ
హైదరాబాద్: సాఫీగా సాగిపోవాల్సిన పెళ్లి విందు కాస్తా రణరంగంగా మారింది. వధువు, వరుడు తరఫు బంధువులు గొడవకు దిగి ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లికార్జుననగర్‌కు చెందిన ప్రసాద్(25), అంబర్పేట్ కు చెందిన స్వప్న(23) తొమ్మిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువర్గాల మద్య రాజీ కుదరడంతో ఆదివారం గోపాల్‌నగర్ కమ్యూనిటీ హాల్లో పెళ్లి విందు ఏర్పాటు చేశారు. విందులో ఇరువర్గాల మధ్య మొదలైన చిన్న వివాదం చివరికి గొడవకు దారిసింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. దీంతో సోమవారం ఇరువర్గాల వారు మల్కాజిగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మహిళపై అత్యాచారం, హత్య
జోగిపేట: వితంతువుపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలం ఎస్ ఇటిక్యాలలో సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. మిన్పూరు మల్లమ్మ (28) భర్త చనిపోవడంతో ఇటిక్యాల గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటూ కల్లు డిపోలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 20న పనికి వెళ్లిన మల్లమ్మ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుం బసభ్యులు బంధువులు, తెలిసిన వారివద్ద వాకబు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఈ నెల 24న ఆమె సోదరుడు పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలావుండగా, సోమవారం అదే గ్రామానికి చెందిన మేకల కాపరి మల్లేశం శివారులోని చెరకుతోటలో మహిళ మృతదేహాన్ని గుర్తించి గ్రామస్తులకు విషయం చెప్పాడు. మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. చీర ఆధారంగా మృతదేహం మల్లమ్మదిగా గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ నాగయ్య, ఎస్ఐ లోకేశ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ముఖం గుర్తించనంతగా ఉంది, రెండు కాళ్లు కూడా లేవు. ఒక చేయి మోచేతి వరకే ఉంది. ఆనవాళ్లను బట్టి ఎవరో అత్యాచారం చేసి, హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. -
వాగులో యువకుడి గల్లంతు
సాక్షి, బళ్లారి : జిల్లాలో భారీ వర్షానికి వంక పొంగి ప్రవహించడంతో యువకుడు కొట్టుకుపోయాడు. దీంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా కరూరు గ్రామంలో శనివారం భారీ వర్షం కురిసింది. వర్షం తగ్గిపోయిన తర్వాత గ్రామానికి చెందిన నాగరాజు(20) అనే యువకుడు తోటలోకి వెళ్లాలనే ఉద్దేశంతో వంకను దాటుతున్నాడు. ఆ సమయంలో భారీగా ప్రవాహం రావడంతో కొట్టుకుపోయాడు. ఈ విషయం తెలియగానే బంధువులు, స్నేహితులు, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చర్య చేపట్టారు. ఒక్కగానొక్క కుమారుడు నీటి పాలు కావడంతో తల్లిదండ్రులు రెడ్డప్ప, రేణుకమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డిప్లమో చదువుతూ సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన తమ కుమారుడు ఇలా నీటిలో కొట్టుకు పోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. సిరిగేరి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహ వేడుకలో విషాదం
* సిలిండర్ పేలి వ్యాపించిన మంటలు * ఆరుగురి సజీవ దహనం సాక్షి, న్యూఢిల్లీ: వివాహ సంబరాలు జోరుగా జరుగుతున్నాయి. మగపెళ్లివారు, ఆడపెళ్లివారు ముచ్చ ట్లు చెప్పుకుంటూ, కనపడిన బంధువులందరినీ పలకరించుకుంటూ హాయి గా నవ్వుకుంటున్నారు. అయితే అంతలోనే ఈ ఆనందం కాస్తా ఆవిరైపోయింది. అసలేమి జరిగిందంటే... పెళ్లివారి ఇంటిలో గ్యాస్ సిలిం డర్ పేలడంతో ఆరుగురు మరణించారు. జసోలా గ్రామంలోని మసీదువాలీ గల్లీలో సి -13 ఇంటి సభ్యులంతా శుక్రవారం ఉదయం పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్నారు. అంతలోనే ఉదయం 11 గంటల సమయంలో ఎల్పీజీ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అదే ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు అగ్నికీలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో మహిళలు, పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగతా వారంతా బారాత్ కోసం బయటకు వెళ్లారు. మంటలు పొరుగున ఉన్న ఇళ్లకు కూడా వ్యాపించాయని, వీధులన్నీ ఇరుగ్గా ఉండడంతో మంటలను ఆర్పడానికి అవస్థపడాల్సి వచ్చిందనిఅగ్నిమాపక విభాగం తెలిపింది. కాగా క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి పరిసరాలను దిగ్బంధించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ హత్యలు బంధువుల పనే
సాక్షి, ఏలూరు : కృష్ణా జిల్లా పెద అవుటపల్లి జాతీయ రహదారిపై గత నెల 24న పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన తండ్రీకొడుకుల్ని తుపాకులతో కాల్చి చంపిన కేసును ఢిల్లీ పోలీసుల సహకారంతో విజయవాడ పోలీసులు ఛేదించారు. పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు మారయ్య, పగిడి మారయ్యలను హత్యలు చేరయిం చింది అతని బంధువులేనని తేల్చారు. స్థానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా తలెత్తిన వివాదం ఏలూరులోని జేకే ప్యాలెస్ యజ మాని భూతం దుర్గారావు హత్యకు దారితీయగా, అందుకు ప్రతీకారంగా ఈ ముగ్గురినీ హత్య చేరుుం చినట్టు స్పష్టమైంది. దొరికిన నిందితులు తండ్రీకొడుకుల్ని హతమార్చిన కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను మంగళవారం అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ప్రతాప్‌సింగ్, ధర్మవీర్, నితిన్, నీరజ్, మంజీత్, సతీష్‌కుమార్, పంకజ్ అనే వారు ఉన్నారు. అందరూ ఊహించినట్టుగానే హత్యలకు పాల్పడింది హతుల బంధువులేనని తేలింది. ఈ ఏడాది ఏప్రిల్ 6న జేకే ప్యాలెస్ యజమాని భూతం దుర్గారావు హత్యకు గురికాగా, అతని అన్న గోవిందు, తమ్ముడు శ్రీనివాస్, మేనల్లుడు పురాణం గణేష్ ప్రత్యర్థుల హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదీ బంధుత్వం భూతం దుర్గారావు అన్న గోవిందు పెద్ద కుమార్తె ఉమాదేవికి దుర్గారావు హత్య కేసులో నిందితుడైన కూరపాటి నాగరాజు కుమారుడితో వివాహం చేశారు. నాగరాజు సోదరిని గంధం నాగేశ్వరావు వివాహం చేసుకున్నారు. ఈ రకంగా అందరూ బంధువులయ్యారు. ఐదేళ్ల క్రితం తలెత్తిన కుటుంబ కలహాల వల్ల భూతం దుర్గారావు అతని సోదరులు ఓ వర్గంగా, నాగరాజు, నాగేశ్వరావు, వారి కుమారులు మరో వర్గంగా విడిపోయారు. స్థానికసంస్థల ఎన్నికల్లో తలెత్తిన వివాదం దుర్గారావు హత్యకు దారితీ యగా, ప్రతీకారంగా గంధం నాగేశ్వరరావు, అతడి కుమారులను ప్రత్యర్థి వర్గంవారు హతమార్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది. లండన్ నుంచే కుట్ర పోలీసుల విచారణలో వెలుగుచూసిన వాస్తవాల ప్రకారం.. దుర్గారావు అన్న గోవిందు లండన్‌లో ఉంటున్నాడు. అతని తమ్ముడు శ్రీనివాస్ పినకడిమిలో ఉంటున్నాడు. గోవిందు లండన్ నుంచే హత్యలకు ప్రణాళిక రచించగా, అతని తమ్ముడు శ్రీనివాస్ అమలు చేశాడు. ప్రణాళిక ప్రకారం రూ.కోటి సుపారీ ఇచ్చి ఢిల్లీనుంచి కిరాయి హంతకులను పురమాయించుకున్నారు. హత్య జరిగిన రోజు గంధం నాగేశ్వరావు ఇంటినుంచి బయలుదేరగా, భూతం శ్రీనివాస్, పురాణం గణేష్ వారిని అనుసరించారు. అప్పటికి మూడురోజుల ముందునుంచే షూటర్లు జిల్లాలో మకాం వేసిఉన్నారు. లండన్‌లో ఉన్న గోవిందుకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూనే ఉన్నారు. చివరకు ముగ్గుర్నీ హత్య చేసి ఢిల్లీ వెళ్లిపోయారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా షూటర్లు పోలీసులకు చిక్కారు. గ్రామంలో ఉద్రిక్తత నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పినకడిమి గ్రామంలో మరో సారి వాతావరణం వేడెక్కింది. ప్రిల్‌లో భూతం దుర్గారావు హత్య జరిగినప్పుడు ఆ కేసులో నిందితుల ఇళ్లపై బాధితులు దాడికి పాల్పడి సామగ్రి ధ్వంసం చేశారు. అప్పటి నిందితులు ఇప్పుడు బాధితులు కాగా, అప్పటి బాధితులు ఇప్పుడు నిందితులయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయూందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
ఆరిన ఆశా దీపం
పచ్చని పందిరి.. బంధువుల సందడి.. ఇంకా తగ్గనే లేదు. మరుపెళ్లి చూసుకుని వెళ్దామనుకున్నారు కొందరు. ఈలోగా బట్టలు ఉతికేందుక ని పెన్నానదికి బయలుదేరారు. వారి వెంటే ‘నేనూ వస్తానంటూ...’ మూడేళ్ల చిన్నారి మారాం చేసింది. పెద్దలు కాదనలేకపోయారు. ఆ చిన్నారి నది ఒడ్డున ఆడుకుంటుండగా.. పెద్దలు బట్టలుతకడంలో నిమగ్నమయ్యారు. ఆ తరువాత చూసుకునే సరికి ఆ బిడ్డ కన్పించలేదు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు పెన్నానదిలో కొట్టుకుపోయిన చిన్నారి మృతదేహం కన్పించడంతో తల్లి ఆర్తనాదాలు.. బంధువుల ఆక్రందనలతో పెన్నా తీరం మూగబోయింది. సిద్దవటం సిద్దవటం సమీపంలోని పెన్నానదిలో పడి చేతిపట్టు చాముండేశ్వరి అనే మూడేళ్ల చిన్నారి ఆదివారం మధ్యాహ్నం మరణించింది. చిట్వేలి మండలం శేష అగ్రహారం గ్రామానికి చెందిన నాగమణి, చెంగల్రాయుడు దంపతుల కుమార్తె అయని చాముండేశ్వరి అకాల మరణం అందరినీ కలచివేసింది. పెళ్లి కోసం వచ్చి.. తమ అక్క కుమార్తె లక్ష్మీదేవి వివాహం శుక్రవారం జరగ్గా, నాగమణి కుటుంబం హాజరైంది. మరుపెళ్లి చూసుకుని వెళ్దువులే.. అంటూ అక్క, బావ, బంధువులు చెప్పడంతో కాదనలేకపోయింది. శనివారం మరుపెళ్లి జరగ్గా.. ఆదివారం ఉండి, సోమవారం బయలుదేరాలనుకుంది. ఆదివారం మధ్యాహ్నం నాగమణి, అక్క మరికొందరు బంధువులు కలసి బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని పెన్నానదికి బయలుదేరారు. వారి వెంటే చాముండేశ్వరి కూడా వెళ్లింది. పెద్దలు బట్టలుతుకుతుండగా, గట్టుపై ఆడుకుంటున్న చాముండేశ్వరిని వారు గమనించలేదు. బట్టలు ఆరేసేందుకు గట్టుపైకి వచ్చిన వారికి చిన్నారి కన్పించలేదు. ఆందోళనకు గురయ్యారు. పరిసరాల్లో వెతికారు. ఫలితం లేకపోయింది. పెన్నానది నీటిలో మునిగి కొటుట్టుకుపోయిన విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. ఆకుల వీధి సమీపంలోని పెన్నానదిలో కొట్టుకుపోతున్న చిన్నారిని స్థానికుడు ఒకరు గమనించి బయటకు తీశారు. అప్పటికే ఆ పాప ప్రాణంతో లేకుండాపోయింది. విషయం తెలుసుకున్న చాముండేశ్వరి తల్లి, పెద్దమ్మ, ఇతర బంధువులు గుండెలు పగిలే లా రోదించారు. ‘ఎంత పని చేశావు బిడ్డా.. ఇక మీ నాన్నకు ఏమని సమాధానం చెప్పాలంటూ’ నాగమణి తన బిడ్డ మృతదేహంపై పడి రోదించడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. -
అప్పులు తీర్చలేకే...
ఇబ్రహీంపట్నం : ఇంటిని సక్రమ మార్గంలో నడపాల్సిన వ్యక్తే చెడుమార్గంలో పయనించాడు. దీంతో ఆనందంగా గడపాల్సిన ఆ కుటుంబం అర్ధాంతరంగా కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటుపల్లి వ్యాగన్ వర్క్‌షాపులో ఆరేపల్లి సత్యనారాయణ(39) హెల్పర్‌గా పనిచేస్తూ రైల్వే కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. అతడికి భార్య పద్మ, కుమారుడు రామకృష్ణ(14) ఉన్నారు. కుమారుడు విజయవాడ వన్‌టౌన్‌లోని రాజా హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా సత్యనారాయణ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. భార్య ఎంత చెప్పినా వినేవాడు కాదు. అప్పులు పెరిగిపోయాయి. వాటిని బంధువులు కూడా తీర్చలేకపోయారు. అప్పులిచ్చినవారు ఒత్తిడి చేస్తుండటంతో ఏమీ చేయలేక విషయాన్ని భార్యకు చెప్పాడు. అప్పు తీర్చే అవకాశం లేకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యమని ఆ కుటుంబం భావించి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ నెల 14న సత్యనారాయణ, పద్మతోపాటు కుమారుడు రామకృష్ణ కలిసి గుంటుపల్లి వద్ద కృష్ణా నదిలో దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. గొల్లపూడి వద్ద కృష్ణానది పాయలో శుక్రవారం పద్మ మృతదేహాన్ని విజయవాడ వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ, రామకృష్ణ మృతదేహాలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వర్కషాప్లో విషాదఛాయలు సత్యనారాయణ కుటుంబం ఆత్మహత్యతో గుంటుపల్లిలోని వ్యాగన్ వర్క్‌షాపులో విషాదం నెలకొంది. అందరితో కలివిడిగా ఉండే పద్మ ఇక లేదంటూ స్నేహితురాళ్లు విలపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కాలనీవాసులను కలచివేసింది. సత్యనారాయణ స్వస్థలం విద్యాధరపురం. కుమారుడితోపాటు కోడలు, మనవడు మరణించారని తెలియడంతో సత్యనారాయణ తండ్రి ఉమామహేశ్వరరావు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
నేతాజీకి భారతరత్న అవసరంలేదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని వాజ్‌పేయితో పాటు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు దేశ అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తలపై బోస్ బంధువులు స్పందించారు. నేతాజీకి భారతరత్న అవార్డు అవసరం లేదని ఆయన బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనకు తాము మొదట్నుంచి వ్యతిరేకమని, బంధువుల్లో అత్యధికమంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని బోస్ మునిమనవడు చంద్ర కుమార్ బోస్ అన్నారు. నేతాజీ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని, ఇదే తాము కోరుకుంటున్నామని చెప్పారు. -
ఇలాగైతే ఎలా?
బత్తలపల్లి : బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో ఓ మహిళా రైతు తమ వేరుశనగ పొలంలోనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. ఎండుతున్న పంటను చూసి ఆమె గుండె పగిలింది. మరో పది రోజుల్లోనే కుమారుడి వివాహం జరగాల్సిన ఆ ఇంట.. మరణ మృదంగం మోగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన కురబ బీరన్న, లక్ష్మమ్మ(59) దంపతులు తమకున్న నాలుగెకరాల పొలంలో రూ.30 వేలు పెట్టుబడి పెట్టి ఖరీఫ్ వేరుశనగ పంట సాగు చేశారు. త్వరలో తమ కుమారుడు ఆంజనేయులు వివాహం ఉండడంతో.. పెళ్లి పనుల్లో మునిగిపోతే పొలంలో కలుపు తీయడం ఆలస్యమవుతుందని, గురువారం ఉదయం నలుగురు కూలీలను లక్ష్మమ్మ తనతో పాటు తీసుకుని పొలానికి వెళ్లింది. అక్కడికెళ్లాక పంట వాడు పట్టి ఉండటాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైంది. ఈసారి కూడా పెట్టుబడి దక్కేలా లేదని, ఇది వరకే రూ.లక్ష రూపాయల అప్పు ఉందని బాధ పడింది. పంట ఇలా ఎండిపోయిందేంటే అంటూ కూలీలతో ఆవేదన వ్యక్తం చేసింది. ‘అక్కా పెండ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతాండాయి.. బంధువులందర్నీ పిలుస్తున్నారా..’ అని అడుగుతున్న తోటి కూలీలకు సమాధానం చెబుతూ.. గుండెలో నొప్పిగా ఉందంటూ కుప్ప కూలిపోయింది. వెంటనే మంచినీరు తెచ్చి తాపించే ప్రయత్నం చేసేలోపే మృత్యువాత పడింది. కొడుకు పెళ్లిలో బంధువుల సందడితో కళకళలాడాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది. గ్రామస్తులు పొలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. గ్రామ పెద్దలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
సాయం కోసం వెళ్లి మృత్యువాత
గుంతకల్లు రూరల్ : సాయం కోసం వెళ్లిన వారు మృత్యువాడ పడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వాసవీ టాకీస్ సమీపంలో ఉన్న మేదరి వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో ఆదివారం ఉదయం సాయం కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. మృతుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేదరి వీధిలో ధనుంజయ గుప్తా అనే వ్యాపారి, మేస్త్రీ హనుమేష్ ద్వారా కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టాడు. ఆదివారం రెండో అంతస్తులో గ్రిల్ పనులు ప్రారంభించారు. గ్రిల్ బరువు ఎక్కువగా ఉండటంతో సహాయం కోసం అక్కడే హమాలీ పని చేసుకుంటున్న రాముడు(50), అదే సర్కిల్ ఆటో అద్దెకు నడుపుకుంటున్న మారెప్ప(55)ను పిలిచారు. వీరితో పాటు మరో నలుగురు వ్యక్తులు గ్రిల్‌ను పైకి ఎత్తుతుండగా, ప్రమాదవశాత్తూ వెల్డింగ్ మిషన్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో మేస్త్రీ హనుమేష్ ,హమాలీ పెద్దన్న, రాడ్ బైండర్ నాగరాజు, రాముడు, మారెప్ప విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో రాముడు, మారెప్ప అపస్మారక స్థితికి చేరుకున్నారు. బాధితుల్ని వెంటనే బస్టాండు సమీపంలోని ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు తరలించారు. అప్పటికే రాముడు, మారెప్ప మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తన భర్త మృతికి ఇంటి యజమానే బాధ్యత వహించాలని రాముడు భార్య సుంకులమ్మ కుటుంబ సభ్యులతో సహా భర్త మృతదేహంతో నిర్మాణంలో ఉన్న ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు కుమారుడు, కూతురు ఉన్నారని, రెండు నె లల్లో కూతురి వివాహం కూడా ఉందని, ఇపుడు ఇలా జరిగిందే.. అంటూ ఆమె బోరున విలపించింది. అనంతరం కొందరు పెద్ద మనుషులు రంగప్రవేశం చేసి ఆందోళన విరమింపజేశారు. టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బావ.. బావమరిది.. మావయ్య.. తోడల్లుడు
ఆంధ్రప్రదేశ్ కొత్త అసెంబ్లీలో బంధుగణం బాగానే కనిపిస్తోంది. ఒకరికొకరు బంధువులు కావడంతో ఎమ్మెల్యే గారూ, మంత్రిగారూ అని పిలుచుకోడానికి బదులు బావా, మావయ్యా, అన్నయ్యా అంటూ వరుసలతో పిలుచుకుంటూ ఆహ్లాదంగా కనిపిస్తున్నారు. చాలామంది బంధువులు ఈసారి వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి స్వయానా బావమరిది, వియ్యంకుడు కూడా అయిన నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గెలిచారు. దాంతో బావా బావమరుదుల వరస అక్కడి నుంచే మొదలైంది. ఇక ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఇదే అసెంబ్లీలో ఉన్నారు. రవీంద్రనాథ్ రెడ్డికి వియ్యంకుడైన భూమా నాగిరెడ్డి, ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ఒకేసారి ఎన్నికై.. అంతా ఏపీ అసెంబ్లీలోనే ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రూ, ఆయన తోడల్లుడు వరుపుల సుబ్బారావు.. ఇద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉన్నారు. వీళ్లిద్దరూ అన్నగారు, తమ్ముడుగారు అంటూ ఆహ్లాదంగా పలకరించుకుంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులవర్తి ఆంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి కిమిడి మృణాళిని ఎన్నిక కాగా, ఆమె బావ కిమిడి కళావెంకట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి గెలిచారు. ఇలా సమస్త బంధుగణం ఏపీ అసెంబ్లీలో కొలువుదీరి కళకళలాడిస్తోంది. -
కన్నీళ్లు మింగి..మింగి
పిల్లల ఆచూకీ కోసం తల్లిదండ్రులు గంపెడాశతో ఎదురుచూపులు తమవారు వస్తారని భరోసా ‘హిమాచల్’ ఘటన జరిగి 8రోజులు పూర్తి రహమత్‌నగర్,చైతన్యపురి: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నదీ ప్రవాహంలో గల్లంతైన తమ పిల్లల ఆచూకీ ఇప్పటివరకు తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటన జరిగి 8రోజులు దాటినా కనీసం మృతదేహాలు కూడా లభ్యంకాకపోవడంతో వారి బాధ వర్ణానాతీతం. రహమత్‌నగర్ బంగారు మైసమ్మ ప్రాంతానికి చెందిన జగదీశ్ ఆచూకీ లభ్యంకాకపోవడంతో చిన్ననాటి స్నేహితులు, సహచర విద్యార్థులు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ దుఖిఃస్తున్నారు. చదువులో అందరికంటే ముందుండే జగదీష్ తమతో గడిపిన మధురక్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. తమ కొడుకు ఆచూకీ కనిపెట్టాలని ఇంటికొచ్చిన ప్రతిఒక్కర్నీ తల్లిదండ్రులు వేడుకుంటుండడం హృదయాలను కలిచివేస్తోంది. మా అఖిల్ తిరిగొస్తాడు..: ‘మా కొడుకు తప్పక తిరిగొస్తాడు. ఎక్కడో ఉండి ఉంటాడు..ఆ నమ్మకం మాకుందని’ గల్లంతైన మాచర్ల అఖిల్ తల్లిదండ్రులు సుదర్శన్, సవితలు గంపెడాశతో చెప్పారు. దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీకాలనీకి చెందిన అఖిల్ హిమాచల్‌ప్రదేశ్ బియాస్‌నదిలో గల్లంతైన విష యం తెలిసిందే. తమ బిడ్డ ఎక్కడోచోట బతికే ఉం డవచ్చని..తప్పకవస్తాడని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల వత్తిడి వల్లే అక్కడి ప్రభుత్వం గాలింపు చర్యలు తీవ్రం చేసిందని చెప్పారు. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిల పరామర్శ: కాగా అఖిల్ తల్లి దండ్రులను సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ, బీజే పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు ఆదివారం పరామర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గల్లంతయిన వారి కోసం ఇప్పటికీ కేంద్ర బలగాలు శాస్త్రీయ పద్ధతులలో గాలింపు చేపడుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీతో మాట్లాడి గాలింపు చర్యలను మరింత వేగవంతం చేసేలా చూస్తామన్నారు. పర్యాటక కేంద్రం, ప్రమాదం జరిగే అవకా శం ఉన్న ప్రదేశంలో కనీసం హెచ్చరికబోర్డులు ఏ ర్పాటు చేయకపోవడం దారుణమని వాపోయారు. కొవ్వొత్తులతో నివాళి ఉస్మానియాయూనివర్సిటీ, బంజారాహిల్స్: స్టడీటూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది లార్జీడ్యాంలో గల్లంతైన 24మంది విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ఓయూ విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ వరకు సేవ్‌గర్ల్ చైల్డ్ ఇన్ ఇండియా జూబ్లీహిల్స్ చాప్టర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు కూడా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థించారు. -
బాలికపై సవతి తండ్రి, బంధువుల అత్యాచారం
గురుదాస్‌పూర్: సవతి తండ్రి, మరో ముగ్గురు సమీప బంధువులు 14 ఏళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేశారు. గతేడాదిగా ఆ అమ్మాయిపై పలుమార్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. బాధితురాలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సవతి తండ్రి కాశ్మీర్ సింగ్, ఆయన తండ్రి గుల్జార్ సింగ్, ఆయన సోదరులు కుల్దీప్ సింగ్, అమృక్ సింగ్ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఈ నలుగురిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి రెండేళ్ల క్రితం కాశ్మీర్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి కలసి జీవిస్తున్నారు. -
ఉపాధ్యాయుడి దారుణ హత్య
నగదు కోసమేనని అనుమానం అడవి దారిలో ఘటన గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్: గూడెం కొత్తవీధి మండలంలో ఓ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి ఉపాధ్యాయుని బంధువులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రింతాడ పంచాయతీ గుర్రాలగొంది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న సీందేరి సోమయ్య (38) స్వగ్రామం మండెం. ఐతే బుధవారం ఆయన గ్రామంలోని బంధువుల వివాహానికి హాజరయ్యాడు. బుధవారం సాయంత్రం వరకు అక్కడే గడిపాడు. గురువారం ఉదయానే లేచి చింతపల్లిలో నివాసం ఉంటున్న ఇంటికి బయలుదేరాడు. అదే రోజు హత్యకు గురయ్యాడు. గతంలో దామనాపల్లి పంచాయతీ భీమవరం పాఠశాలలో పని చేశాడు. ఈయన ఈ గ్రామం నుంచి చింతపల్లికి వెళ్లేందుకు దగ్గరమార్గం గుండా వెళుతూ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. నగదు కోసమేనా? సోమయ్య గురువారం మారుమూల అటవీ ప్రాంతం మీదుగా వెళుతుండటం సమీప భీమవరం, కట్టుపల్లి గ్రామానికి చెందిన కొందరు చూశారు. వారే నగదుకోసం హత్య చేసి ఉంటారని అతని భార్య లక్ష్మి భోరున విలపించింది. తన భర్త బంధువుల వివాహానికి వెళుతుండగానే సుమారు రూ.7 వేలు ఖర్చుల నిమిత్తం తీసుకు వెళ్ళారని తెలిపారు. ముందుగానే భార్య, పిల్లలను పంపించేసి తాను తరువాత రోజున మళ్లీ వస్తానని చెప్పారన్నారు. బుధవారం నుంచి తన భర్త రాకపోవడంతో బంధువులు ఇంటి వద్ద ఆరా తీసినా తెలియరాలేదన్నారు. సోమవారం భీమవరం అటవీ ప్రాంతంలో మృతదేహం గుర్తించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని సోమయ్య బంధువులు తెలిపారు. మృతదేహాన్ని శవపంచనామా అనంతరం స్థానిక తహశీల్దార్ సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మార్వో శ్యాంసుందర్ తెలిపారు. -
అక్క మృతదేహానికి తాడుకట్టి లాక్కెళ్లిన చెల్లెళ్లు
ఆస్తి కోసం అయినవారి కీచులాట అంత్యక్రియలు తామే చేస్తామంటూ గొడవ అమరాపురం, న్యూస్‌లైన్: మానవత్వం చిన్నబోయింది. మనిషితత్వం బయటపడింది. ఆస్తి కోసం అయినవారే అడ్డంగా వాదులాడుకున్నారు. సంస్కారం మరిచి అంతిమ సంస్కారం తామే చేస్తామంటూ కొట్లాడుకున్నారు. అనంతపురం జిల్లా అమరాపురం మండలం వలస గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (85) సోమవారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె భర్త పూజారప్ప పదేళ్ల కిందటే మరణించాడు. వీరికి సంతానం లేదు. ఇల్లు, ఐదెకరాల పొలం ఉంది. లక్ష్మమ్మ మృతి చెందడంతో ఆమె ఆస్తి కోసం పూజారప్ప సోదరులు ఒకవైపు.. లక్ష్మమ్మ చెల్లెళ్లు శాంతమ్మ, లక్ష్మక్క మరో వైపు పోటీపడ్డారు. అంత్యక్రియలు ఎవరు చేస్తే వారికి ఆస్తిపై హక్కు వస్తుందనే ఉద్దేశంతో.. దహన సంస్కారం తామంటే తాము చేస్తామంటూ గొడవపడ్డారు. ఈ క్రమంలో మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిన బంధువులు, పూజారప్ప సోదరులను లక్ష్మమ్మ చెల్లెళ్లు అడ్డుకున్నారు. చివరికి వాళ్లిద్దరే మృతదేహాన్ని శ్మశానానికి ఎత్తుకెళ్లలేక తాడు కట్టుకుని లాక్కెళ్తుండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని సంప్రదాయం ప్రకారం దహన సంస్కారం చేయించారు. -
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబం
-
మృతుల బంధువుల డీఎన్ఏ నమానాల సేకరణ
-
మృతుల బంధువుల డీఎన్ఏ నమానాల సేకరణ
మహబూబ్ నగర్ బస్సు ప్రమాద దుర్ఘటనలో మరణించిన వారి బంధువులు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. మృత దేహాలను గుర్తించేందుకు బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలను ఆస్పత్రి సిబ్బంది సేకరించారు. బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. బస్సులో మంటలు చేలరేగడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను గుర్తించడానికి వీలులేకుండా కాలిపోయాయి. వీటిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తించడం కోసం బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. ఏలూరుకు చెందిన స్రవంతి, ఆసీఫ్ అహ్మద్ (బెంగళూరు), చంద్రశేఖర్ షిల్గే (మహారాష్ట్ర), జ్యోతిరంజన్ సాహూ (ఒడిశా), అశుతోష్ పాండాల నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. -
‘ప్రేమ’కు మరో ప్రాణం బలి
నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్: కూతురి మృతిని తట్టుకోలేక తండ్రి గుండె ఆగిన సంఘటన మండలంలోని తిర్మలాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కుంటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంబటి నారాయణరెడ్డి(70) తన కూతురు మంగమ్మ మృతి, అల్లుడు నర్సింహారెడ్డి పరిస్థితిని తట్టుకోలేక ఒక్కసారిగా కూప్పకూలినట్టు బంధువులు తెలిపారు. తుప్రాన్ మండలం యావపూర్‌కు చెందిన మంగమ్మ, నర్సింహారెడ్డి దంపతులు తమ కూతురు ప్రేమ విషయాన్ని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం విదితమే. ఈ సంఘటనలో మంగమ్మ మృతి చెందగా నర్సింహారెడ్డి ప్రాణాపాయస్థితిలో కొంపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న నారాయణరెడ్డి అదే రోజు తన కుటుంబ సభ్యులతో కలసి యావపూర్ వెళ్లారు. కూతు రు మంగమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే చికిత్స పొందుతున్న అల్లుడు నర్సింహారెడ్డి పరిస్థితిని చూసి తీవ్రంగా కలత చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా నారాయణరెడ్డికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. ఒక్కగానొక్క కూతురు కావడంతో మంగమ్మను చిన్నప్పటినుంచి నారాయణరెడ్డి గారాబంగా చూసుకునేవారని బంధువులు చెప్పారు. మంగమ్మకు సైతం ఒక్కగానొక్క కూతురు మాలశ్రీ. దీంతో మనవరాలిని సైతం చాలా ప్రేమగా చూసుకునే వారని తెలిపారు. మృతునికి భార్య సత్తమ్మ, కుమారులు గోపాల్‌రెడ్డి, కిష్టారెడ్డి, రాంరెడ్డి ఉన్నారు. మెరుగుపడిన నర్సింహారెడ్డి ఆరోగ్యం... తూప్రాన్: ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహారెడ్డి ఆరోగ్యం కాస్త మేరుగుపడినట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిచ్చార్జి చేయనున్నట్లు సమాచారం. అయితే కూతురు ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై ‘న్యూస్‌లైన్’ స్థానిక ఎస్ఐ.నిరంజన్‌రెడ్డిని సంప్రదించగా కూతురు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. బంధువులు, గ్రామస్థులు మాత్రం స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 5 -
ఇక మాకు దిక్కెవరు
లింగాల, న్యూస్‌లైన్: మృగాళ్ల చేతిలో లైంగికదాడికి గురై.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కనుమూసిన గిరిజన మహిళ(35) మృతదేహాన్ని గురువారం ఆమె స్వగ్రామం కొత్త చెర్వుతండాకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని తండాకు తీసుకురాగానే మృతురాలి పిల్లలు, బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. ‘నాన్న పాయె, ఆలనాపాలనా చూసుకునే అమ్మ కూడా లేదాయె.. ఇక మాకు దిక్కెవరు’ అంటూ ఆ చిన్నారులు విలపించిన తీరు ప్రతిఒక్కరినీ కలిచివేసింది. ఉపాధి కోసం వలస వెళ్లిన మృతురాలు ఈనెల 3న సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపూర్‌లో దుండగుల చేతిలో లైంగికదాడికి గురైన విషయం తెలిసిందే. 12రోజుల పాటు చికిత్సపొందుతూ బుధవారం సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో మృతిచెందింది. అక్కడే పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులు, స్థానికులు కొత్తచెర్వు తండాకు తీసుకొచ్చారు. చిన్నారుల రోదనను చూసి పలువురు చలించిపోయారు. తాము ఉన్నామని పలువురు ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ నాయక్ ఐదువేలు, అంబట్పల్లి సర్పంచ్ వాణి శంకర్ రూ.4,500 నగదు ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు అందజేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలి గిరిజన మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆమె మరణానికి కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోశాధికారి జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన మహిళ మృతదేహంతో లింగాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బతుకుదెరువు కోసం పిల్లలతో వెళ్లిన గిరిజన మహిళ తిరిగి శవమై ఇంటికి రావడం ప్రతి ఒక్కరినీ కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, పిల్లలను ప్రభుత్వమే చదివించాలని ఆమె డిమాండ్ చేశారు. ర్యాలీలో సర్పంచ్ పల్లె నిరంజన్, బాలాజీ నాయక్, రాంజీనాయక్, గోపాల్‌నాయక్, తిర్పతయ్య, కాంగ్రెస్‌పార్టీ మండలాధ్యక్షుడు భగవాన్, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, టీడీపీ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలపై లైంగికదాడులు సిగ్గుచేటు మక్తల్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు దాటినా ఇంకా మహిళలపై లైంగికదాడులు జరుగుతుండటం సభ్య సమాజానికి సిగ్గుచేటని ఏపీసీఎల్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మక్తల్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే సరైన వైద్యం అందక బాధితురాలు మృత్యువాతపడిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌చేశారు.