బంధు గణం... ముఠా రూపం! | robbery group formed inside the jail | Sakshi
Sakshi News home page

బంధు గణం... ముఠా రూపం!

Published Sat, Oct 3 2015 4:25 AM | Last Updated on Thu, Aug 30 2018 5:24 PM

బంధు గణం... ముఠా రూపం! - Sakshi

బంధు గణం... ముఠా రూపం!

- జైల్లోనే జతకట్టిన మరో గ్యాంగ్
- జంట కమిషనరేట్లలో 30 స్నాచింగ్స్
- 2 అంతర్రాష్ట్ర ముఠాలు అరెస్టు  
 
 సాక్షి, హైదరాబాద్:
చైన్ స్నాచింగ్‌తో నగర మహిళలను హడలెత్తిస్తున్న మహారాష్ట్ర, హైదరాబాద్ సభ్యులతో కూడిన రెండు గ్యాంగ్‌లను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిని పట్టుకున్న ఈస్ట్, సౌత్‌జోన్ల బృందాలు 30 నేరాలకు సంబంధించి కేజీ బంగారం రికవరీ చేసినట్లు కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఎన్.కోటిరెడ్డిలతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  

అక్కడ నివాసం.. ఇక్కడ షెల్టర్...
 మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన రషీద్‌ఖాన్, మహ్మద్ సయీద్ అలీ, షేక్ అర్షద్ అలీ, అఫ్రోజ్‌ఖాన్ బంధువులు. వీరిలో రషీద్ నగరంలోని పీర్జాదిగూడలో, అఫ్రోజ్ సోమాజీగూడలో నివసిస్తూ వడ్రంగి పని చేస్తున్నారు. ఈ నలుగురూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. సయీద్, అర్షద్‌లు నగరానికి వచ్చినప్పుడు రషీద్, అఫ్రోజ్ వద్దే షెల్టర్ తీసుకునేవారు.

బజాజ్ పల్సర్ వాహనాలను సమకూర్చేవారు. వీటిపై నలుగురూ రెండు గ్రూపులుగా సంచరిస్తూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న, నిల్చున్న మహిళల్ని టార్గెట్‌గా చేసుకుని స్నాచింగ్స్ చేసేవారు. వాటాలు పంచుకుని సెలైంట్ అయిపోయి... కొన్ని రోజుల తరవాత మళ్లీ స్నాచింగ్స్‌కు పాల్పడేవారు. ఈ గ్యాంగ్ నగరంలో 19 స్నాచింగ్స్ చేసింది. రషీద్, సయీద్‌లపై గతంలోనూ కేసులున్నాయి. చైతన్యపురిలో గత ఏడాది నమోదైన కేసులో సయీద్ వాంటెడ్‌గా ఉన్నాడు.

జైలు పరిచయంతో జట్టు కట్టి...
 మహారాష్ట్ర జాల్నాకి చెందిన మీర్ అయాన్ అలీ, తలాబ్‌కట్టకు చెందిన సయ్యద్ అహ్మద్ బేగ్, బీహార్‌కి చెందిన బబ్లూ 2011లో వివిధ కేసులకు సంబంధించి నగరంలో అరెస్టయ్యారు. జైల్లో స్నేహితులుగా మారారు. బయటకు వచ్చి ముఠాగా ఏర్పడి నేరాలు చేయడం మొదలుపెట్టారు. దీనికోసం నాలుగు నెలల క్రితం అయాన్ ఓ అపాచీ బైక్‌ను ఖరీదు చేసి అహ్మద్ బేగ్ దగ్గర ఉంచాడు. తరచుగా అయాన్, బబ్లూ నగరానికి వస్తూ అహ్మద్ దగ్గర షెల్టర్ తీసుకునే వారు. ఇద్దరు చొప్పున బైక్‌పై తిరుగుతూ అదును చూసుకుని స్నాచింగ్స్‌కు పాల్పడేవారు. సొత్తు పంచుకుని ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోయేవారు.

 

ఇలా గడిచిన నాలుగు నెలల్లో 11 నేరాలకు పాల్పడ్డారు.  రెండు ముఠాల కోసం ముమ్మరంగా గాలించిన టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు సీహెచ్.శ్రీధర్, ఠాకూర్ సుఖ్‌దేవ్ సింగ్ శుక్రవారం రషీద్, సయీద్, అర్షద్, అఫ్రోజ్, అయాన్, అహ్మద్‌లను పట్టుకున్నారు. బబ్లూ తప్పించుకున్నాడు. వీరి నుంచి కేజీ బంగారం, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement