twin cities
-
ఉరిమిన వరుణుడు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (ఫోటోలు)
-
జంట నగరాల కాలనీలలో కంపు!
జంట నగరాలంటేనే కాలనీల మయం. ప్రపంచంలోనే అతి పెద్ద కాలనీలు ఇక్కడ ఉన్నా యని గర్వంగా చెప్పుకుంటారు. ప్రతి పెద్ద రోడ్డు పక్కనా కొమ్మల్లా రెమ్మల్లా కాలనీలు మొలుస్తాయ్. ఇవన్నీ బల్దియా పాలనలోనే వర్ధిల్లుతుంటాయి. వాటి సౌలభ్యాన్నిబట్టి మేడలు, మిద్దెలు, బహుళ అంత స్తుల భవనాలతో నిండిపోతుంది. ఇక్కడకూడా పన్నులు భారీగానే పిండుకుంటారు. కానీ, అంతగా పట్టించు కోరు. కార్పొరేటర్ల పాలన, అజమాయిషీ వీటిమీదే అధి కంగా ఉంటుంది. ఇలా నగరం వేగంగా వృద్ధి చెందడం ఆనందంగానే ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా మాత్రం ఉండదు. కాలనీ రూపుదిద్దుకునేటపుడే ముందుచూపు, ఆర్థిక స్తోమత ఉన్నవారు ఒకటికి నాలుగు ప్లాట్లు కొని పడేస్తారు. ఒక దాంట్లో ఇల్లు కట్టుకుంటారు. మిగిలిన నాలుగు స్థలాలు ఓ పక్కన పడుంటాయ్. కాలనీ చిక్క పడినకొద్దీ స్థలాల రేట్లు ఆకాశంవైపు చూస్తుంటాయి. అవి మధ్య మధ్యలో ఖాళీగా ఉండి, అందరికీ ‘డంపింగ్ యార్డ్’లుగా మారతాయి. ఇవి కాలక్రమంలో భయంకర మైన అపరిశుభ్ర కేంద్రాలుగా మారతాయ్. ఈగలు, దోమలు, వీధికుక్కలు అక్కడే పుట్టి పెరుగుతుంటాయి. ఈ కరోనా టైంలో వాటిని నిత్యం శుభ్రం చేసేవారు లేక, శానిటేషన్ లేక కాలనీవాసులకు ఎన్ని సమస్యలు తెచ్చి పెట్టాయో అందరికీ తెలుసు. సీజనల్ అంటువ్యాధులు ప్రబలినపుడు మాత్రం కార్పొరేషన్ కుంభకర్ణుడిలా ఒక్క సారి మేల్కొంటుంది. నాలుగు ఫాగింగ్‌లతో ఆవలించి, మళ్లీ నిద్రకి ఉపక్రమిస్తుంది. ఎక్కడైనా కాలనీలలో ఇసుక, కంకర దిగిన ఆనవాళ్లు కనిపిస్తే కార్పొరేటర్లు హడావుడిగా వచ్చేస్తారు. కొలతల ప్రకారం, లెక్కల ప్రకారం ఉందా? లేదా? అంటూ ఇంటి యజమాని ప్రాణం తీస్తారు. ఇది నిత్యం మనం చూసే తంతు. ఈ ఖాళీ ప్లాట్ల యజమానులు తెలియకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులైపోతారు. అక్కడ ఏమీ కట్టరు. వాటిని అమ్మరు. వారు ఎక్కడో ఉండి తమ ప్లాట్లని పర్య వేక్షిస్తూ, ధరలు తెలుసుకుంటూ, లాభాలు లెక్కించు కుంటూ ఉంటారు. వాళ్ల ఖాళీ ప్లాట్లు ఎంత అశుభ్రంగా చెత్త నిలయంగా ఉన్నాయో వారికి తెలిసినా పట్టించు కోరు. కాలనీవాసులకి ఈ ఖాళీ స్థలాలు నానారకాల చెత్తల్ని వదిలించుకోవడానికి చేతివాటంగా అందు బాటులో ఉంటాయి. ఇదంతా కార్పొరేషన్ వారే బాధ్యత తీసుకుని బాగు చేస్తారని, బాగు చేయాలని అనుకుంటారు. ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు. నిత్యం రకరకాల బయో వ్యర్థాలు ఆ గుట్టల్లో పడి ఎంత అనా రోగ్యాన్ని సృష్టిస్తాయో అందరికీ తెలుసు. ఇక మధ్య మధ్య పడే వానజల్లులు మరింత అపకారం కలిగిస్తాయి. చిన్న ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ వేస్తారు. అందు లోకి కావల్సినంత చెత్తపడుతుంది. ఇది మనవాళ్ల నైజం. దీన్ని పూర్తిగా అరికట్టాలి. ఇది ఒక జంట నగరాల లోనే కాదు రెండు రాష్ట్రాల పెద్ద నగరాలన్నింటిలో ఉన్న సమస్య. విజయవాడ, గుంటూరు, ఏలూరు, తెనాలి ఏదైనా కావచ్చు ఇలాంటి భయంకరమైన అశుభ్ర దృశ్యాలతోనే ఎదురవుతాయి. కార్పొరేషన్లు ముందు వాటిపై నిఘాపెట్టాలి. ధరలొస్తాయని కొనిపడేసిన స్థలా లపై అజమాయిషీ చాలా ముఖ్యం. పరోక్షంగా రియల్ ఎస్టేట్ చేస్తున్న వారిపై పన్ను అధికం చేయండి. లేదా జప్తు చేయండి. ఫలానా సమయంలోగా నిర్మాణాలు చెయ్యండని చెప్పండి. లేదంటే ఆ స్థలాలని తీసుకుని సద్వినియోగం చెయ్యండి. మనం పదేపదే ‘విశ్వనగరం’ చేస్తామని కబుర్లు చెబితే చాలదు. స్వచ్ఛ భారత్ ఉద్యమానికి ఇవి ఎంతగా అడ్డుతగిలాయో అందరికీ తెలుసు. చాలామంది స్థలాలు కొని, పడేసి ఏ దేశమో వెళ్లిపోతారు. వారికి దోమల బాధ, ఈగల బెడద, పురుగు చెదల గొడవ ఏదీ ఉండదు. ధర వచ్చినపుడు ఫోన్‌మీద అమ్మకాలు సాగిస్తారు. లేదా వాటిని సక్రమంగా పరిశుభ్రంగా నిర్వహించి మిగిలినవారికి ఇబ్బంది లేకుండా చేయ డానికి వాటి యజమానుల నించే అధిక పన్ను వసూలు చేయండి. కార్పొరేటర్లు బాధ్యత వహించాలి. జగన్ మోహన్‌రెడ్డి గ్రామ పంచాయతీల్లో ప్రారంభించిన వ్యవస్థ లాంటి దాన్ని ప్రతి వార్డులోనూ పెట్టాలి. పదవి కోసం కాకుండా, ఎంతో కొంత సేవ చేయడానికి వార్డు లీడర్లు ఉండాలి. స్వచ్ఛ భారత్ ఉద్యమం ఇక్కడ నించే ప్రారంభం కావాలి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
జంటనగరాల్లో భారీ బందోబస్తు
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో జంట నగరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధాన కూడళ్లు, షాపింగ్ మాల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనలో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
జంట నగరాల్లో దంచికొట్టిన వాన
-
జంట నగరాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ
-
హైదరాబాద్ తాగునీటికి రూ. 1900 కోట్లు!
జంటనగరాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మెరుగైన తాగునీటి సరఫరా కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రూ. 1900 కోట్లతో పనులు చేపడుతోందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధితో పాటు చుట్టుపక్కల మునిసిపాలిటీలు, 164 గ్రామ పంచాయతీలలోని 30 లక్షల మందికి అదనంగా తాగునీరు సరఫరా అవుతుందని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ వివరించారు. నీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఆయన అధికారులకు సూచించారు. Hyderabad Metro Water Works would be taking up works worth Rs 1900 Crores, to augment the water supply in GHMC area. — Min IT, Telangana (@MinIT_Telangana) October 9, 2015 This would ensure clean drinking water to an additional 30 Lakh residents living in GHMC & surrounding municipalities & 164 gram panchayats — Min IT, Telangana (@MinIT_Telangana) October 9, 2015 Minister KTR instructed officials to ensure state-of-the-art technology is used in building infrastructure & supply of water. — Min IT, Telangana (@MinIT_Telangana) October 9, 2015 -
బంధు గణం... ముఠా రూపం!
-
బంధు గణం... ముఠా రూపం!
- జైల్లోనే జతకట్టిన మరో గ్యాంగ్ - జంట కమిషనరేట్లలో 30 స్నాచింగ్స్ - 2 అంతర్రాష్ట్ర ముఠాలు అరెస్టు సాక్షి, హైదరాబాద్: చైన్ స్నాచింగ్‌తో నగర మహిళలను హడలెత్తిస్తున్న మహారాష్ట్ర, హైదరాబాద్ సభ్యులతో కూడిన రెండు గ్యాంగ్‌లను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిని పట్టుకున్న ఈస్ట్, సౌత్‌జోన్ల బృందాలు 30 నేరాలకు సంబంధించి కేజీ బంగారం రికవరీ చేసినట్లు కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఎన్.కోటిరెడ్డిలతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అక్కడ నివాసం.. ఇక్కడ షెల్టర్... మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన రషీద్‌ఖాన్, మహ్మద్ సయీద్ అలీ, షేక్ అర్షద్ అలీ, అఫ్రోజ్‌ఖాన్ బంధువులు. వీరిలో రషీద్ నగరంలోని పీర్జాదిగూడలో, అఫ్రోజ్ సోమాజీగూడలో నివసిస్తూ వడ్రంగి పని చేస్తున్నారు. ఈ నలుగురూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. సయీద్, అర్షద్‌లు నగరానికి వచ్చినప్పుడు రషీద్, అఫ్రోజ్ వద్దే షెల్టర్ తీసుకునేవారు. బజాజ్ పల్సర్ వాహనాలను సమకూర్చేవారు. వీటిపై నలుగురూ రెండు గ్రూపులుగా సంచరిస్తూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న, నిల్చున్న మహిళల్ని టార్గెట్‌గా చేసుకుని స్నాచింగ్స్ చేసేవారు. వాటాలు పంచుకుని సెలైంట్ అయిపోయి... కొన్ని రోజుల తరవాత మళ్లీ స్నాచింగ్స్‌కు పాల్పడేవారు. ఈ గ్యాంగ్ నగరంలో 19 స్నాచింగ్స్ చేసింది. రషీద్, సయీద్‌లపై గతంలోనూ కేసులున్నాయి. చైతన్యపురిలో గత ఏడాది నమోదైన కేసులో సయీద్ వాంటెడ్‌గా ఉన్నాడు. జైలు పరిచయంతో జట్టు కట్టి... మహారాష్ట్ర జాల్నాకి చెందిన మీర్ అయాన్ అలీ, తలాబ్‌కట్టకు చెందిన సయ్యద్ అహ్మద్ బేగ్, బీహార్‌కి చెందిన బబ్లూ 2011లో వివిధ కేసులకు సంబంధించి నగరంలో అరెస్టయ్యారు. జైల్లో స్నేహితులుగా మారారు. బయటకు వచ్చి ముఠాగా ఏర్పడి నేరాలు చేయడం మొదలుపెట్టారు. దీనికోసం నాలుగు నెలల క్రితం అయాన్ ఓ అపాచీ బైక్‌ను ఖరీదు చేసి అహ్మద్ బేగ్ దగ్గర ఉంచాడు. తరచుగా అయాన్, బబ్లూ నగరానికి వస్తూ అహ్మద్ దగ్గర షెల్టర్ తీసుకునే వారు. ఇద్దరు చొప్పున బైక్‌పై తిరుగుతూ అదును చూసుకుని స్నాచింగ్స్‌కు పాల్పడేవారు. సొత్తు పంచుకుని ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోయేవారు. ఇలా గడిచిన నాలుగు నెలల్లో 11 నేరాలకు పాల్పడ్డారు. రెండు ముఠాల కోసం ముమ్మరంగా గాలించిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు సీహెచ్.శ్రీధర్, ఠాకూర్ సుఖ్‌దేవ్ సింగ్ శుక్రవారం రషీద్, సయీద్, అర్షద్, అఫ్రోజ్, అయాన్, అహ్మద్‌లను పట్టుకున్నారు. బబ్లూ తప్పించుకున్నాడు. వీరి నుంచి కేజీ బంగారం, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. -
‘గండి’ కొట్టారు!
- ఉస్మాన్‌సాగర్ బఫర్ జోన్‌ను మింగుతున్న అక్రమార్కులు సాక్షి, హైదరాబాద్: జంట నగరాలకు తాగునీరందించే గండిపేట జలాశయానికి అధికారులు, ప్రజాప్రతినిధులు గండి కొడుతున్నారు. జలాశయాన్ని సంరక్షించాల్సిన వారే కాసుల కోసం బఫర్‌జోన్‌ను మింగేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విల్లాల నిర్మాణం సాగుతున్నా అధికార యంత్రాంగం దృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తోంది. ఉస్మాన్‌సాగర్(గండిపేట) జలాశయానికి ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్) 30 మీటర్లు కాగా.. రివర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఆర్‌ఎఫ్‌టీఎల్) 500 మీటర్లుగా ఉంది. పట్టా భూములున్న ఆర్‌ఎఫ్‌టీఎల్ ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా వ్యవహరిస్తారు. నిబంధనల ప్రకారం ఈ జోన్లో ఎలాంటి నిర్మాణాలను అనుమతించరు. కానీ ఉస్మాన్‌సాగర్ డౌన్ స్ట్రీమ్‌లోని సర్వే నం.390 (పార్టు), 19, 20, 28, 29, 30లలో సుమారు 24 ఎకరాల్లో ‘విల్లాల’ నిర్మాణం సాగుతోంది. మంచిరేవుల, గండిపేట గ్రామాల పరిధిలోని ఈ భూముల్లో గ్రూపు హౌసింగ్ పేరుతో హెచ్ఎండీఏ నుంచి నాలుగెకరాలకు పర్మిషన్ తీసుకొన్న ఎన్.కె.కన్స్ట్రక్షన్స్ సంస్థ.. ఏకంగా 24 ఎకరాల విస్తీర్ణంలో విల్లాల నిర్మాణాలు సాగిస్తోంది. వీటికి స్థానిక గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకొన్నట్లు ఆ సంస్థ వాదిస్తోంది. గ్రూపు హౌసింగ్‌కు విధిగా హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా ఆ నియమాన్ని పాటించకుండా.. 400 చదరపు గజాలు, 800చదరపు గజాల విస్తీర్ణంలో సుమారు 96 విల్లాలను నిర్మించింది. విశాలమైన రోడ్లు, సకల సదుపాయాలతో నిర్మించిన 400 చ.గ. విల్లా రూ.1.5 - 2.5 కోట్లు, 800 చ.గ. విల్లా రూ.2.5- 3.5 కోట్ల చొప్పున విక్రయించినట్లు సమాచారం. వీటిని కొనుగోలు చేసిన వారిలో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. రెండు మూడేళ్ల నుంచి ఇక్కడ అడ్డగోలుగా విల్లాల నిర్మా ణం సాగుతున్నా అడ్డుకోవాల్సిన పంచాయతీ గానీ, హెచ్ఎండీఏ గానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. హెచ్‌ఎండీఏకూ పాత్ర ఉస్మాన్‌సాగర్ బఫర్‌జోన్‌ను సంరక్షించాల్సిన హెచ్ఎండీఏ.. అక్రమార్కులకు అండగా నిలుస్తోందన్న ఆరోపణలున్నాయి. మూడేళ్లుగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నా వాటిని అడ్డుకోవాల్సింది గ్రామ పంచాయతీయేనని చెప్పుకొస్తోంది. కానీ బఫర్‌జోన్‌లోని ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరిస్తోంది. ఏకమొత్తంగా ఎకరాల కొద్ది భూమిని క్రమబద్ధీకరిస్తే వ్యవహారం బయటపడుతుందని నాలుగైదు వేల గజాల చొప్పున ప్లాట్లుగా క్రమబద్ధీకరిస్తూ నిర్మాణ సంస్థకు సహకరించినట్లు హెచ్ఎండీఏలోని రికార్డులు సూచిస్తున్నాయి. హెచ్ఎండీఏలోని కొందరు అధికారులు దీనంతటినీ చక్కబెట్టారని, అక్రమాలు బయటపడకుండా కొన్ని ఫైళ్లను మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల ఆవాసం.. కొందరు ప్రజాప్రతినిధులు సైతం జంట జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్‌హౌస్‌లు నిర్మించుకోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు ఈ ప్రాంతాన్ని ఆవాసంగా మార్చుకొన్నారు. ఒక మంత్రికి హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్‌హౌస్ ఉండగా, మాజీ మంత్రి ఒకరు ఉస్మాన్‌సాగర్ బఫర్‌జోన్‌లోని 17 ఎకరాల్లో తోటలు, గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేసుకొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సదరు నాయకుడు ఎల్ఆర్ఎస్ కింద ఈ భూమిని క్రమబద్ధీకరించుకొన్నట్లు సమాచారం. ఉస్మాన్‌సాగర్ బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరిపించి నివేదిక తెప్పించుకొన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల్లో కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకూ పాత్ర ఉన్నందున చర్యలు ఉంటాయా.. లేదా అనేది ప్రశ్నార్థకమే! -
భారీవర్షం.. కొట్టుకుపోయిన కార్లు
జంటనగరాల్లో భారీవర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం దాదాపు గంటన్నర, రెండు గంటల పాటు కుంభవృష్టిగా కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడపడితే అక్కడ ఆగిపోయింది. వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో అయితే కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల వైపు నుంచి వచ్చే వాహనాలు దాదాపు గంటకు పైగా ఆగిపోయాయి. రెండు గంటలపాటు ఆగకుండా కురిసిన వానతో దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, అక్బర్ బాగ్, ఓల్డ్ మలక్‌పేట్, కాలాడేరా, మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి, సైదాబాద్, సరూర్‌నగర్, మీర్పేట్, జిల్లెలగూడ, కొత్తపేట్, బడంగ్పేట్ తదితర కాలనీలు, బస్తీలు జలమయంగా మారాయి. మలక్‌పేట్, నల్లగొండ క్రాస్‌రోడ్డు, సైదాబాద్, సరూర్‌నగర్, ఆర్కేపురం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. మైత్రీవనం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ బాగా నిలిచిపోయింది. సికింద్రాబాద్ ప్రాంతంలో వర్షపునీరు వరదలా పొంగి పారుతుండటంతో డ్రైనేజి గోతిలోకి ఆర్టీసీబస్సు కూరుకుపోయింది. అంబర్‌పేట, ఛేనెంబర్ చౌరస్తా ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. మరోవైపు విశాఖపట్నంఓల కూడా భారీ వర్షం కురిసింది. పగలే చీకటిని తలపించింది. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వాహనాలు నీటమునిగాయి. ఆటోలు నీళ్లలో మునిగి ఆగిపోవడంతో డ్రైవర్లు వాటిని తోసుకుని వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు కనిపించాయి. -
హైదరాబాద్-ఖింగ్దాసోదర నగరాలు
చైనా, భారత్‌ల మధ్య కుదిరిన 24 కీలక ఒప్పందాలు బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత్, చైనాల మధ్య 24 కీలక ఒప్పందాలు కుదిరాయి. చైనాలోని చెంగ్దూ, భారత్‌లోని చెన్నైల్లో రాయబార కార్యాలయాల ఏర్పాటు సహా రైల్వే, విద్య, గనులు, ఖనిజాలు తదితర రంగాల్లో కుదిరిన ఒప్పందాలపై మోదీ, చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ల సమక్షంలో సంతకాలు జరిగాయి. సోదర రాష్ట్రాలు, సోదర నగరాలకు సంబంధించిన 4 ఒప్పందాలు కూడా అందులో ఉన్నాయి. ముఖ్యమైన ఒప్పందాలు హైదరాబాద్- ఖింగ్దా; చెన్నై- చాంగ్క్వింగ్; ఔరంగాబాద్- దున్హాంగ్ నగరాలను సోదర నగరాలుగా, కర్ణాటక- చైనాలోని సించువాన్ రాష్ట్రాన్ని సోదర రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందాలు. రైల్వే రంగంలో సహకారానికి సంబంధించిన కార్యాచరణపై భారతీయ రైల్వే, చైనా జాతీయ రైల్వేల మధ్య ఒప్పందం. విద్యారంగంలో సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందం(ఎంఓయూ). అంతరిక్ష రంగంలో సహకారంపై అగ్రిమెంట్. తీరప్రాంత రక్షణలో సహకారంపై, సాగర అధ్యయనంపై ఒప్పందాలు. అహ్మదాబాద్‌లో మహాత్మాగాంధీ నైపుణ్య కేంద్రం ఏర్పాటు. దూరదర్శన్, చైనా అధికార టెలివిజన్ సీసీటీవీల మధ్య ప్రసారాలకు సంబంధించిన ఒక ఒప్పందం. యున్నన్ మింజు యూనివర్సిటీ, ఐసీసీఆర్‌ల మధ్య రెండు ఒప్పందాలు. ఫుదాన్ విశ్వవిద్యాలయంలో యోగా కళాశాల ఏర్పాటు, గాంధీయన్, ఇండియన్ స్టడీస్ సెంటర్ ఏర్పాటుపై ఒప్పందాలు. -
జంటనగరాల్లో 15 ప్రమాదాలు, ఇద్దరి మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా...ఎన్ని నిబంధనలు విధించినా న్యూ ఇయర్ వేడుకల్లో ప్రమాదాలు మాత్రం ఆగటం లేదు. ఈ సారి కూడా జంటనగరాల్లో మొత్తం 15 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద చెట్టును బైక్ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. సికింద్రాబాద్‌లో డివైడర్‌ను బైక్ ఢీ కొట్టడంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి మందుబాబుల జోరుకు మూకుతాడు వేశారు. 400 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 400 వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఒక్క రూపాయికే టిఫిన్!!
-
ఒక్క రూపాయికే టిఫిన్!!
ఒక రూపాయి పెడితే ఏమొస్తుంది.. మహా అయితే ఒక మంచినీళ్ల ప్యాకెట్ వస్తుందేమో. అది కూడా అన్ని చోట్లా కాదు. ఆర్టీసీ బస్టాండ్ల లాంటి చోట్ల అయితే.. మూడు రూపాయలు కూడా అవుతుంది. కానీ, జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలోనే పేదలు, బడుగు జీవులకు ఒక్క రూపాయికే ఉదయపు అల్పాహారాన్ని అందించబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ - సికింద్రాబాద్ జంటనగరాల్లోని 8 కేంద్రాల్లో ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం అందిస్తున్న జీహెచ్ఎంసీ.. ఈ పథకానికి హరేకృష్ణ ఫౌండేషన్ సహకారం తీసుకుంటోంది. పూరీ, ఇడ్లీ, ఉప్మా లాంటి అల్పాహారాలను కూడా ఇక నుంచి ఒక్క రూపాయికే అందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ సోమేష్‌కుమార్ సోమవారం వెల్లడించారు. ఐదు రూపాయల భోజన పథకానికి సంబంధించి తాము ఇప్పటికే 8 కేంద్రాలు తెరిచామని, మరో 42 కేంద్రాలు కూడా తెరవాల్సి ఉందని, త్వరలోనే టిఫిన్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు. నిరుపేదలకు ఆరోగ్యకరమైన, వేడివేడి ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. -
కేన్సర్ విస్తరిస్తోంది.. బహుపరాక్!!
జంట నగరాల్లో రోడ్ల మీద ఎలాంటి మాస్కులు లేకుండా, హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఒక్క గంటసేపు తిరగండి.. తర్వాత కూడా మీరు ప్రశాంతంగానే ఉండగలుగుతున్నారా? హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారా? రెండూ కష్టమే. ఎందుకంటే మన గాలిలో ఒక క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాముల వరకు పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) ఉండొచ్చని ప్రమాణాలు చెబుతుంటే, ఇప్పుడు ఉన్నది మాత్రం 95 మైక్రో గ్రాములు! వీటివల్ల ఏమవుతుందో తెలుసా? మామూలు ఆస్తమా నుంచి ఊపిరితిత్తుల కేన్సర్ వరకు, గుండెపోటుతో సహా అనేక రకాల వ్యాధులు వస్తాయి!! ఇదంతా కేవలం పీఎం వల్ల మాత్రమే. అదే ఆటోలు, బస్సులు, ఇతర వాహనాల నుంచి వెలువడుతున్న పొగలో ఉండే కాలుష్యం వల్ల పలు రకాల కేన్సర్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఈ కాలుష్యం వల్ల బాగా దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. ఇటీవలి కాలంలో లంగ్ కేన్సర్ కేసులు ఎక్కువ కావడానికి ఇదే ప్రధాన కారణమని పల్మనాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 4) ప్రపంచ కేన్సర్ దినం. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు.. ఇలా పలు రకాల కారణాలతో కేన్సర్ విస్తృతంగా వ్యాపిస్తోంది. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరినీ వదలట్లేదు. దీని బారిన పడిన కుటుంబాలు ఇటు ఆర్థికంగా, అటు మానసికంగా దారుణంగా చితికిపోతున్నాయి. చాలావరకు కేన్సర్లు మూడు, నాలుగో దశలలో తప్ప బయట పడకపోవడం, అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో చికిత్సకు కూడా ఒక పట్టాన లొంగదు. ఒకటిన్నర ఏళ్ల వయసున్న హర్షిత్ చాలా చురుగ్గా ఉండేవాడు. చకచకా అటూ ఇటూ ఇంట్లో పరుగులు తీస్తూ అమ్మానాన్నలను ఒక్కక్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంచేవాడు. అలాంటిది ఉన్నట్టుండి నడవడం మానేశాడు. భయం భయంగా చూసేవాడు. దాంతో కలవరపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే, ఎంఆర్ఐ తీయించారు. మెదడుకు సంబంధించిన హైడ్రోకెఫాలస్ అనే వ్యాధి వచ్చిందని, దాంతోపాటు మెదడులో ట్యూమర్లు కూడా ఉన్నాయని వైద్యులు తేల్చారు. ఆ రెండింటికీ శస్త్రచికిత్సలు చేశారు. కానీ, ఆ చిన్నారి కోలుకోలేదు. కోమాలోనే ఉండిపోయాడు!! 78 ఏళ్ల గోపాలకృష్ణ రిటైర్డ్ హెడ్మాస్టారు. ఒక్క దురలవాటు కూడా లేదు. నిత్యం పూజా పునస్కారాలతో నిష్ఠగా జీవితం గడిపేవారు. ఉన్నట్టుండి గొంతు మింగుడు పడటం తగ్గింది. ఏం తినాలన్నా, చివరకు మంచినీళ్లు తాగాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేది. కొన్నాళ్లు చూసి, డాక్టర్ల దగ్గరకు వెళ్తే, అనుమానం వచ్చి ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయించారు. చూస్తే.. అన్నవాహిక వద్ద కేన్సర్ వచ్చినట్లు తెలిపారు. విషయం తెలిసిన మూడు నెలలకే ఆయన కన్నుమూశారు. చక్కగా తిరుగుతూ ఉండేవాళ్లను కూడా కబళిస్తున్న ఈ కేన్సర్ విస్తృతి వెనుక బహుళజాతి సంస్థల కుట్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార పంటలపై విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న పురుగు మందులు, రసాయనాలు కూడా నేరుగా శరీరంలోకి వెళ్లిపోయి కేన్సర్‌ను కలగజేస్తున్నాయని అంటున్నారు. వీటన్నింటికీ పరిష్కారం ఎప్పటికి దొరుకుతుందో చూడాలి మరి!! -
న్యూఇయర్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా జంట నగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 నుంచి 2గంటల వరకు ప్లైఓవర్లను మూసివేయనున్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సైబారాబాద్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్‌రింగ్‌రోడ్డుపై ఎయిర్ టిక్కెట్ ఉన్నవారికే అనుమతిని ఇస్తున్నట్టు సీవీ ఆనంద్ చెప్పారు. అలాగే ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్టు సిటీ పోలీస్ కమీషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. రాత్రి 12గంటల వరకే బార్, పబ్బుల్లో న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి ఇస్తున్నామని చెప్పారు. హోటల్లో వేడుకలకు ఒంటిగంట వరకు అనుమతిని ఇస్తున్నట్టు తెలిపారు. రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా మందుబాబుల ఆకృత్యాలపై వీడియో కెమెరాల నిఘా పెట్టినట్టు కమీషనర్ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. -
జంటనగరాల్లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
-
జంటనగరాల్లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : గణేష్ నిమజ్జనం సందర్భంగా జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం .8 నుంచి రా.9 వరకు పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులు లక్డీకాపూల్ వరకే అనుమతిస్తున్నారు. ఇక చార్మినార్ వైపు వెళ్లే సిటీ, జిల్లాల బస్సులు అఫ్జల్‌గంజ్ వరకే అనుమతిస్తుండగా, లింగంపల్లి నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్ వరకే అనుమతి ఉంది. హయత్‌నగర్, దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే బస్సులు కోఠి వరకే అనుమతిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే వస్తాయి. వరంగల్ నుంచి వచ్చే జిల్లాల బస్సులు ఉప్పల్ వరకే అనుమతిస్తారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జంటనగరాల్లో అదననపు ఎంఎంటీఎస్ రైళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలనుంచి ఎల్లుండి ఉదయం నాలుగు గంటల వరకు ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. అలాగే ఆర్టీసీ కూడా నిమజ్జనం సందర్భంగా అదనంగా 360 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.