
జంటనగరాల్లో భారీ బందోబస్తు
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల నిందితులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో జంట నగరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎల్‌బీనగర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధాన కూడళ్లు, షాపింగ్ మాల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల ఘటనలో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.