
హైదరాబాద్ తాగునీటికి రూ. 1900 కోట్లు!
జంటనగరాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మెరుగైన తాగునీటి సరఫరా కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రూ. 1900 కోట్లతో పనులు చేపడుతోందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు.
దీనివల్ల జీహెచ్ఎంసీ పరిధితో పాటు చుట్టుపక్కల మునిసిపాలిటీలు, 164 గ్రామ పంచాయతీలలోని 30 లక్షల మందికి అదనంగా తాగునీరు సరఫరా అవుతుందని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ వివరించారు. నీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఆయన అధికారులకు సూచించారు.
Hyderabad Metro Water Works would be taking up works worth Rs 1900 Crores, to augment the water supply in GHMC area.
— Min IT, Telangana (@MinIT_Telangana) October 9, 2015