సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మించి మోసం చేసిన రాహుల్ గాంధీని.. అవసరమైతే ఢిల్లీకి వచ్చి నిలదీస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. బూతులు తిట్టినా, అవమానించినా కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తూ, నిలదీస్తూనే ఉంటామని, తమకు పోరాటం కొత్తకాదని కేటీ రామారావు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అశోక్‌నగర్‌కు వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ గుర్తు చేశారు.
‘మీరు ఇచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాల ప్రకటనను నమ్మి యువత కాంగ్రెస్‌కు ఓటు వేసింది. ఎనిమిది నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, ఉద్యోగాలు లేని కేలండర్‌ను జారీ చేశారు. మళ్లీ హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వచ్చి మీ హామీని ఎలా నెరవేరుస్తారో యువతకు చెప్పండి’.. అని కేటీఆర్ పోస్టు చేశారు.
జీవో 46ను రద్దు చేయాలంటూ దీక్ష చేస్తూ అరెస్టయి బండ్లగూడ పోలీసు స్టేషన్‌లో ఉన్న 70 మంది యువతతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ‘30 గంటలుగా దీక్ష చేస్తూ మీరు గొప్ప పోరాట స్ఫూ ర్తిని చూపుతున్నారు. కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి దీక్ష విరమించండి. మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది. అవసరమైతే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారం కోసం మాట్లాడుతాం’.. అని భరోసానిచ్చారు.
రాహుల్‌ను నిలదీస్తాం: కేటీఆర్
Published Sun, Aug 4 2024 5:34 AM | Last Updated on Sun, Aug 4 2024 5:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment