ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): విల్లుపురం, సెంజి సమీపంలోని ఈ చంకుప్పానికి చెందిన 16 ఏళ్ల బాలికపై బంధువులే సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. 80 వృద్ధుడితో కలసి బాలికను మరో ఇద్దరు యువకులు కూడా బలాత్కారం చేసినట్లు తెలిసింది. ఈ కేసులో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటేశన్ పెద్ద కుమారుడు మోహన్, ఇతని స్నేహితుడు ఇళయరాజా తదితరులును పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసు కథనం మేరకు లైంగిక దాడికి గురైన బాలిక పదిహేనేళ్ల క్రితమే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆమె కోవైలో ఉన్న శరణాలయంలో ఉంటూ ప్లస్ వన్ చదువుకుంటోంది. సెలవు రోజుల్లో సెంజి సమీపంలో ఉన్న ఈచంకుప్పం ప్రాంతంలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో రెండు రోజుల ముందు విద్యార్థి అనారోగ్యం బారిన పడడంతో బంధువులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆమెకు వరసకు అన్న అయిన మోహన్ మొదట విద్యార్థినిపై లైంగిక దాడి చేశాడని తరువాత మిగిలిన వారు అత్యాచారం చేసినట్లు తెలిసింది. దీనికి సహకరించిన పెద్దమ్మ కుప్పును అరెస్టు చేశారు. నిందితుల్లో ఐదుగురిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment