tamilnadu
-
తిరుమల కొండపై అపచారం
-
కేరళ,తమిళనాడుకు ‘కల్లక్కడల్’ ముప్పు..!
తిరువనంతపురం: కేరళ,తమిళనాడు(Tamilnadu) తీరాలకు ‘కల్లక్కడల్’ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్కాయిస్’ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. బుధవారం(జనవరి 15)న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన రాకాసి అలలు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది.బుధవారం రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో అర మీటరు నుంచి ఒక మీటరు మేర అలల తాకిడి ఉంటుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (Incois) హెచ్చరించింది.ఇన్కాయిస్ హెచ్చరిక నేపథ్యంలో కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ అప్రమత్తమైంది.తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పడవలు పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.మత్స్యకారులు ముందుగానే పడవలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని ప్రకటించింది. పర్యాటకులు బీచ్‌లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.కల్లక్కడల్ అంటే ఏంటి..?కల్లక్కడల్ అనేది మళయాలం పదం. కల్లక్కడల్ అంటే సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్ని సార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని Incois వెల్లడించింది.ఎలాంటి సూచన,హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయని పేర్కొంది.అందుకే దీనిని స్థానికంగా ‘కల్లక్కడల్’ అని పిలుస్తారు. -
విజయ్ హజారే ట్రోఫీలో ధోని శిష్యుడి విధ్వంసం
విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని శిష్యుడు, మాజీ సీఎస్కే ప్లేయర్ ఎన్ జగదీశన్ (తమిళనాడు) అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో జగదీశన్ ఒకే ఓవర్లో వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. రాజస్థాన్ పేసర్ అమన్ సింగ్ షెకావత్ బౌలింగ్‌లో జగదీశన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఛేదనలో ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన షెకావత్.. తొలి బంతిని వైడ్‌గా వేశాడు. ఈ బంతిని వికెట్ కీపర్ పట్టుకోలేకపోవడంతో బౌండరీకి వెళ్లింది. దీంతో రెండో ఓవర్లో బంతి పడకుండానే తమిళనాడు ఖాతాలో ఐదు పరుగులు చేరాయి. అనంతరం షెకావత్ వేసిన ఆరు బంతులను ఆరు బౌండరీలుగా మలిచాడు జగదీశన్. ఫలితంగా రెండో ఓవర్లో తమిళనాడుకు 29 పరుగులు వచ్చాయి. జగదీశన్ షెకావత్‌కు సినిమా చూపించిన వీడియో (ఆరు బౌండరీలు) సోషల్‌మీడియాలో వైరలవుతుంది.4⃣wd,4⃣,4⃣,4⃣,4⃣,4⃣,4⃣29-run over! 😮N Jagadeesan smashed 6⃣ fours off 6⃣ balls in the second over to provide a blistering start for Tamil Nadu 🔥#VijayHazareTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/pSVoNE63b2 pic.twitter.com/JzXIAUaoJt— BCCI Domestic (@BCCIdomestic) January 9, 2025తమిళనాడు వికెట్‌కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన జగదీశన్ 2018 నుంచి 2022 వరకు ధోని అండర్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (277) చేసిన రికార్డు జగదీశన్ పేరిటే ఉంది. జగదీశన్‌ను 2023 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ 90 లక్షలకు సొంతం చేసుకుంది. 2024, 2025 ఎడిషన్లలో జగదీశన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్లో 13 మ్యాచ్‌లు ఆడిన జగదీశన్ 110.20 స్ట్రయిక్‌రేట్‌తో 162 పరుగులు మాత్రమే చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి ఐదు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) రాణించారు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్, లోమ్రార్‌తో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0), ఎన్ జగదీశన్ (65; 10 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (37) ఔట్ కాగా.. విజయ్ శంకర్ (18), మొహమ్మద్ అలీ (23) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీ, అమన్ సింగ్ షెకావత్, అజయ్ సింగ్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 104 పరుగులు చేయాలి. -
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి
చెన్నై:తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో శనివారం(జనవరి4) భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని సత్తూర్ సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.బాణసంచా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీ సమీపంలోని ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల జనాలు అక్కడినుంచి పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి -
డీఎంకే ఎంపీ ఇంట్లో ‘ఈడీ’ సోదాలు
చెన్నై:డీఎంకే ఎంపీ కదిర్ ఆనంద్ నివాసంతో పాటు ఆయనకు చెందిన ఇతర ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేస్తోంది. శుక్రవారం(జనవరి3) ఉదయం వెల్లూరు జిల్లాలోని కదిర్ ఆనంద్ ఇంట్లో ప్రారంభమైన సోదాలు కొనసాగుతున్నాయి. ఎంపీ ఇంటితో పాటు ఆయన సన్నిహితులు,బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేస్తోంది.ఐటీ శాఖకు పన్ను ఎగవేసిన కేసులో గతంలో ఆనంద్ దగ్గరి బంధువుల ఇళ్లలో రూ.11.48 కోట్ల నగదు పట్టుబడింది. ఈ వ్యవహారంలోనే ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు ఓటర్లకు పంచిపెట్టేందుకే దాచారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 2019లో ఆనంద్‌తో పాటు అతని బంధువులపై క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ కేసు నమోదైంది.ఈ కేసులో అప్పటి రాష్ట్రపతి కోవింద్ కదిర్ ఆనంద్ ఎన్నికను రద్దు చేశారు. తిరిగి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆనంద్ మళ్లీ ఎంపీగా గెలిచారు. గతేడాది జరిగిన లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఆనంద్ ఏకంగా 2లక్షలకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ కుమారుడే కదిర్ ఆనంద్.ఇదీ చదవండి: దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు -
శతక్కొట్టిన షారుఖ్ ఖాన్.. రింకూ సింగ్‌కు షాక్!
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అద్భుత శతకంతో మెరిశాడు. విధ్వంసకర ఆట తీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తమిళనాడుకు భారీ విజయం అందించాడు. విశాఖ వేదికగాకాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ)లో గ్రూప్-‘డి’లో తమిళనాడు గురువారం నాటి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్(యూపీ)తో తలపడింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. ఇక విశాఖలో టాస్ గెలిచిన యూపీ.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.టాపార్డర్‌లో ఓపెనర్లు నారాయణ్ జగదీశన్(0) డకౌట్ కాగా.. తుషార్ రహేజా(15), ప్రదోష్ పాల్(0) కూడా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్లో బాబా ఇంద్రజిత్(27), విజయ్ శంకర్(16) కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న షారుఖ్ ఖాన్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.శతక్కొట్టిన షారుఖ్.. అలీ హాఫ్ సెంచరీఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన షారుఖ్.. 85 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఏడో నంబర్ బ్యాటర్ మొహమద్ అలీ(75 బంతుల్లో 76 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించాడు. ఫలితంగా తమిళనాడు మెరుగైన స్కోరు సాధించింది.హాఫ్ సెంచరీ చేసినా రింకూకు షాక్!ఇక లక్ష్య ఛేదనలో యూపీ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి(14), ఆర్యన్ జుయాల్(8)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ శర్మ(8) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రాణా(17) చేతులెత్తేయగా.. ప్రియమ్ గార్గ్(48), కెప్టెన్ రింకూ సింగ్(Rinku Singh- 55) రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్లో విప్రజ్ నిగమ్(2), సౌరభ్ కుమార్(7), శివం మావి(2), యశ్ దయాల్(1), ఆకిబ్ ఖాన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.114 పరుగుల భారీ తేడాతో ఘన విజయంఈ నేపథ్యంలో 32.5 ఓవర్లలో 170 పరుగులకే యూపీ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా తమిళనాడు 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీయగా.. సీవీ అచ్యుత్, మొహమద్ అలీ, కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో తమిళనాడు తొలుత చండీగఢ్‌తో తలపడగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసింది. తాజాగా రెండో మ్యాచ్‌లో యూపీని మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదిలా ఉంటే...‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షారుఖ్ ఖాన్‌కు లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
భార్యపై కోపం.. రెండు బస్తాల నాణేలతో కోర్టుకు భర్త.. తర్వాత ఏమైందంటే..
సాక్షి, చైన్నె: తన భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ. 2 లక్షలు మొత్తాన్ని చిల్లరగా 20 బస్తాలలో కోర్టుకు ఓ భర్త గురువారం తీసుకొచ్చాడు. ఈ చిలర్ల చూసి షాక్‌కు గురైన న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ చిల్లర మొత్తాన్ని నోట్లుగా మార్చి సమర్పించాలని ఆదేశించారు. వివరాల ప్రకారం.. కోయంబత్తూరుకు చెందిన దంపతులు గతంలో విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు రాగా, తనకు భరణం ఇప్పించాలని ఆ భార్య కోర్టుకు విన్నవించారు. దీంతో, న్యాయమూర్తి ఆ భర్తకు ఆదేశాలు ఇచ్చారు. రూ. 2 లక్షలు భరణం అందజేయాలని సూచించారు. దీనిని ముందే గ్రహించిన ఆ భర్త వినూత్న ప్రయోగం చేసి కంగు తిన్నాడు. తన భార్య మీదున్న కోపంతో కోర్టు నుంచి బయటకు వెళ్లి తన కారులో ఉన్న బస్తాలు ఒకొక్కటిగా తీసుకొచ్చి పెట్టారు. అనంతరం, 20 బస్తాలను కోర్టులో ఉంచి, ఇదిగోండి రూ. 2 లక్షలు అంటూ సూచించాడు. న్యాయమూర్తి ప్రశ్నించగా, రూ. 80 వేలకు ఒక్క రూపాయి నాణెలు, మిగిలిన మొత్తం రూ. 5 ,రూ. 10, రూ. 20 నాణేలు అంటూ వివరించాడు. దీనిని విన్న అక్కడున్న వారంతా అవ్వాక్కయారు. ఇతడు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న జడ్జి మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈచిల్లరను నోట్లుగా మార్చి తీసుకొచ్చి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ భర్త చిల్లర బస్తాలను కోర్టు నుంచి మళ్లీ తన కారు వద్దకు మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ వ్యవహారం కోయంబత్తూరుకోర్టు ఆవరణలో సర్వత్రా హాస్యాన్ని పంచినట్లయ్యింది. విచారణ వాయిదా పడడంతో చిల్లర బస్తాలతో ఆ భర్త తాను వచ్చిన కారులోనే వెళ్లియాడు. -
ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!
ఉద్యోగం వద్దు వ్యవసాయమే ముద్దు అని అతను నమ్మాడు. సాగులోకి దిగింది మొదలు నిరంతర కృషితో రుషిలా తపించి ఒక అద్భుత మునగ వంగడాన్ని రూపొందించారు. ఈ వంగడం ఖ్యాతి దేశం నలుమూలలకు విస్తరించింది. అధిక దిగుబడులనిస్తూ అళగర్ స్వామికే కాదు అనేక రాష్ట్రాల్లోని వేలాది మంది రైతులకూ కనక వర్షం కురిపిస్తోంది. ఈ ఆవిష్కరణతో అళగర్ స్వామి వ్యవసాయ క్షేత్రం మునగ నర్సరీగా మారిపోయింది.ఏరోజు కారోజు విధులు ముగించుకొని బాధ్యతలు తీర్చుకునే ఉద్యోగం కాదు రైతు జీవితం. అలాగని పంటలు పండించటం, అమ్ముకోవటంతోనే దింపుకునే తల భారమూ కాదు. ఎంత చాకిరీ చేసినా వద్దనని పొలం సముద్రాన్ని ఈదటంలా అనిపిస్తుంటే.. అలసిపోని చేపలా మారి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితేనే రాణింపు, సంతృప్తి. అళగర్స్వామి చేసింది అదే. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పల్లపట్టి గ్రామం స్వామి జన్మస్థలం. ఆర్ట్స్‌లో పీజీ విద్యను పూర్తి చేసిన స్వామి మక్కువతో వ్యవసాయాన్ని చేపట్టారు. మొక్కుబడి వ్యవసాయం చే యకుండా నిరంతరం శాస్త్రవేత్తలతో చర్చిస్తూ ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకుంటూ.. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. దిండిగల్ నుంచి మధురైకి వెళ్లే ప్రధాని రహదారి పక్కనే అళగర్ స్వామికి చెందిన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. బీడు భూమిని సాగులోకి తెచ్చే క్రమంలో మునగ వంగడాన్ని రూ పొందించేందుకు కృషిని మమ్మురం చేసి 2002లో ఒక నూతన మునగ వంగడాన్ని ఆవిష్కరించారు. రెండు స్థానిక రకాలను సంకరం చేసి ఈ వంగడాన్ని సృష్టించారు. దీనికి ‘పళ్లపట్టి అళగర్ స్వామి వెళ్లిమాలై మురుగన్’(పీఏవీఎం) అని తన పేరే పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఈ వంగడం కరవు పరిస్థితులను, చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. సాగులో ఉన్న రకాలకన్నా అధిక దిగుబడులను ఇస్తుండటంతో ఆనోటా ఈనోటా ప్రచారంలోకి వచ్చిన ఈ వంగడం ఖ్యాతి దేశమంతటా పాకింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మునగకు పుట్టినిల్లయిన ఉత్తర భారతదేశంలోనూ రైతులు ఈ వంగడం సాగుపై మొగ్గు చూపుతున్నారు. (కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా? )తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది రైతులు 30 వేల ఎకరాల్లో పీఏవీఎం మునగ వంగడాన్ని సాగు చేస్తున్నారు. దాదాపు 90 లక్షల పీఏవీఎం మునగ మొక్కలను అళగర్ స్వామి వివిధ రాష్ట్రాల రైతులకు అందించారు. గ్రాఫ్టింగ్ లేదా ఎయిర్ లేయర్ పద్ధతుల్లో అంట్లు కడుతున్నారు.20 అడుగులకో మొక్క...మునగను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులను అళగర్ స్వామి అనుసరిస్తున్నారు. పంచగవ్యను కనుగొన్న డాక్టర్ నటరాజన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. పంచగవ్యను క్రమం తప్పకుండా వాడతారు. భూమిని దున్ని సిద్ధం చేసుకున్న తర్వాత.. తూర్పు పడమర దిశలో మొక్కలు, సాళ్ల మధ్య 20 అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా లబిస్తుంది. ఎకరాకు 150 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. మునగ మొక్కలు పెళుసుగా ఉంటాయి కాబట్టి రవాణాలోను.. నాటుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. 50 సెం. మీ. లోతు వెడల్పుతో గుంతలు తీసుకోవాలి. 20 రోజుల వయసు మొక్కలను నాటుకొని, గాలులకు పడి పోకుండా కర్రతో ఊతమివ్వాలి. ప్రతి మొక్కకు 5 కిలోల కం΄ోస్టు ఎరువు లేదా 10 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. కొత్త మట్టితో గుంతను నింపితే మొక్క త్వరగా వేళ్లూనుకుంటుంది. నాటిన మరుసటి రోజు నుంచి రెండు నెలల పాటు నీరుపోయాలి. తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి తగుమాత్రంగా తడులు ఇవ్వాలి. పూత కాత దశలో మాత్రం సమృద్ధిగా నీరందించాలి. మిగతా సమయాల్లో పొలం బెట్టకొచ్చినట్టనిపిస్తే తడి ఇవ్వాలి. వర్షాధార సాగులో నెలకు రెండు తడులు ఇస్తే చాలు. అంతర కృషి చేసి చెట్ల మధ్య కలుపును ఎప్పటికప్పుడు తొలగించాలి. ఒకటిన్నర ఏడాది తర్వాత కొమ్మల కత్తిరింపు చేపట్టాలి. బలంగా ఉన్న నాలుగైదు కొమ్మలను మాత్రమే చెట్టుకు ఉంచాలి. పెద్దగా చీడపీడలు ఆశించవు. పశువుల బారి నుంచి కాపాడుకునేందుకు కంచె వేసుకోవాలి.లక్షల మొక్కల సరఫరా...ఆళ్వార్ స్వామి ప్రస్తుతం మునగ కాయల సాగుపైన కన్నా నర్సరీపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 100 మంది కూలీలతో పల్లపట్టి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు పీఏవీఎం మొక్కలను సరఫరా చేస్తున్నారు. 90 లక్షలకు పైగా మొక్కలను విక్రయించారు. ఏటా రూ. 6 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అళగర్ స్వామి కృషికి మెచ్చి ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక సృష్టి సమ్మాన్ అవార్డుతోపాటు సీఐఐ అవార్డు, మహీంద్రా టెక్ అవార్డు వంటి దాదాపు వంద అవార్డులు ఆయనను వరించాయి. సిటీ బ్యాంక్ ఉత్తమ ఔత్సాహిక వ్యాపారవేత్త అవార్డుతో సత్కరించడం విశేషం. అద్భుతమైన ఆవిష్కరణతో ఖ్యాతి గడించిన అళగర్ స్వామి స్థానిక గ్రామీణ ఆవిష్కర్తల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ రైతులకు స్ఫూర్తినిస్తున్నారు. ఐదేళ్లలో చెట్టుకు 3 క్వింటాళ్ల దిగుబడి..ఇతర వంగడాలు నాటిన 9 నెలలకు కాపుకొస్తాయి. పీఏవీఎం మునగ ఆరు, ఏడు నెలల నుంచే కాస్తుంది. సాళ్లు, మొక్కల మధ్య 20 అడులు దూరంలో ఎకరానికి 150 మొక్కలు నాటుకోవాలని అళగర్ స్వామి సూచిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచి ఎకరానికి 10 – 15 టన్నుల కాయల దిగుబడి వస్తుంది. ఐదేళ్ల వయసు చెట్టు సగటున ఏడాదికి 300 కిలోల దిగుబడినిస్తుంది. ఐదేళ్ల తోట నుంచి ఏడాదికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. సాధారణ రకాల్లో కాయల దిగుబడి 20 టన్నులే. పైగా అవి ఐదారేళ్ల పాటే నిలకడగా దిగుబడులిస్తాయి. పీఏవీఎం మాత్రం ఏడాదికి 8 –9 నెలల చొప్పున 20–25 ఏళ్లపాటు మంచి దిగుబడి నిస్తుంది. తమిళనాడు రైతులు స్థానిక మార్కెట్లలో కాయ రూ. 5 – 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను ఏటా ఎకరాకు రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కొందరు రైతులు కంచె పంటగాను ఈ వంగడాన్ని సాగు చేస్తున్నారు. -
అల్పపీడన ప్రభావం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు
సాక్షి,విశాఖపట్నం: దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, తమిళనాడులో వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం నెల్లూరు,తిరుపతి,విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.18వ తేదీన ఉదయం తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 35 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు ఈ నెల 18 వరకూ వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
తమిళనాడులోని దిండిగల్ లో ఘోర అగ్ని ప్రమాదం
-
నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు
‘దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ’ అనేది ప్రతీ యుగంలోనూ జరుగుతూవస్తోంది. ఈ మహోన్నత కార్యాన్ని నెరవేర్చేందుకు అవతారపురుషులు, మహనీయులు జన్మిస్తూనే ఉన్నారు. ఇదే కోవలో దుష్ట శిక్షణకు ఉద్భవించినవాడే సుబ్రహ్మణ్యుడు. లోకసంరక్షణార్ధం పరమశివుని మహాతేజస్సు నుంచి షష్టి తిథి రోజున సుబ్రహ్మణ్యస్వామి అవతరించాడు. అందుకే ఆ రోజును సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు.సుబ్రహ్మణ్య షష్ఠి దీపావళి పండుగ తర్వాత వస్తుంది. దీనిని స్కందషష్ఠి అని, సుబ్బారాయషష్ఠి అని కూడా అంటారు. ఈ సారి సుబ్రహ్మణ్య షష్టి 2024, డిసెంబరు 7న అంటే ఈరోజు వచ్చింది. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య షష్టిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యుడిని కార్తికేయుడు అని కూడా అంటారు.తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కుక్కే సుబ్రమణ్య షష్ఠి లేదా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి పేరుతో వివిధ ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున కార్తికేయుడు ఆరు రోజుల సుదీర్ఘ యుద్ధం తర్వాత తారకాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. తమిళనాడులో ఎంతో ప్రాచుర్యం పొందిన సుబ్రమణ్యస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాల్లో సుబ్రహ్మణ్య షష్టి రోజున ఘనంగా పూజలు నిర్వహిస్తారు.1. తిరుపరంకుండ్రం.. ట్రెక్కింగ్ చేస్తూ..తమిళనాడులోని తిరుపరంకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. కొండపై ఉన్న ఈ దేవాలయంలోని శిల్పకళ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అందమైన పరిసర ప్రాంతాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని తరచూ దర్శిస్తుంటారు. ఇక్కడ జరిగే ‘పంగుని ఉతిరమ్’ ఉత్సవానికి లక్షలాదిమంది భక్తులు హాజరవుతుంటారు. ట్రెక్కింగ్ చేసేవారు తమ అభిరుచిని నెరవేర్చుకుంటూ, ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.2. తిరుచెందూర్.. బంగాళాఖాతం ఒడ్డున..తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తమిళనాడులోని సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలలో ఒకటి. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉంది. ఈ ఆలయం వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. స్కంద షష్టినాడు ఇక్కడ జరిగే పూజలను తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయం పక్కనే కనిపించే సుందరమైన బీచ్ భక్తులకు అద్భుత అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ కనిపించే సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంతో అద్భుతంగా ఉంటాయని చెబుతారు. ఈ ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది.3. దండాయుతపాణి ఆలయం.. ప్రత్యేక ప్రవేశ ద్వారం..దండయుతపాణి స్వామి ఆలయం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని పళనిలో ఉంది. ఎత్తైన కొండపై ఉన్న ఈ దేవాలయానికి అద్భుతమైన ప్రవేశ ద్వారం ఉంది. నాటి శిల్పకళకు తార్కాణంగా ఈ ఆలయం నిలుస్తుంది. ఈ ఆలయానికి భక్తులే కాకుండా సహసయాత్ర చేయాలనుకునేవారు కూడా తరలి వస్తుంటారు.4. స్వామినాథ స్వామి ఆలయం.. 60 మెట్లతోతమిళనాడులోని స్వామిమలైలో ఉన్న స్వామినాథ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొండపై ఉన్న ఈ ఆలయం సందర్శకులకు దివ్యమైన అనుభూతిని అందిస్తుంది. జీవితంలోని ఆరు దశలకు ప్రతీకగా ఇక్కడ 60 మెట్లు కనిపిస్తాయి. వీటి అధిరోహణ యాత్రికులకు అద్భుత అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.5. తిరుత్తణి.. 365 మెట్లను అధిరోహిస్తూ..తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాకుండా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు అవకాశం కల్పిస్తుంది. భక్తులు ఈ ఆలయాన్ని దర్శించేందుకు 365 మెట్లను అధిరోహించాల్సి ఉంటుంది. ఈ ఆచారాన్ని ఇక్కడకు వచ్చే భక్తులు తప్పనిసరగా పాటిస్తుంటారు. పండుగల సమయంలో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. అద్భుతమైన శిల్ప సంపద ఈ ఆలయంలో అడుగడుగునా కనిపిస్తుంది.6. పజముదిర్చోలై.. కార్తికేయుని ఆరు నివాసాలలో..తమిళనాడులోని పురాతన సుబ్రమణ్య స్వామి ఆలయాలలో పజముదిర్చోలైలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఒకటి. ఇది కార్తికేయుని ఆరు నివాసాలలో ఒకటిగా పేరొందింది. ఈ ఆలయాన్ని అరుపడై వీడు అని పిలుస్తారు. ముఖ్యంగా కార్తిక మాసంలో ఈ ఆలయానికి లెక్కకు మించిన సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.7. కల్యాణ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకల్యాణ సుబ్రమణ్య స్వామి దేవాలయం తమిళనాడులో కల్యాణ పులియంకుళం పట్టణంలో ఉంది. ఈ మురుగన్ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేష పూజలు జరుగుతుంటాయి. అలాగే సుబ్రహ్మణ్యుని కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణం సాంప్రదాయ, ఆధునిక శైలులకు ప్రతీకగా నిలుస్తుంది.8. అరుపడై వీడు మురుగన్ ఆలయంకొడైకెనాల్ శివారులో ఉన్న అరుపడై వీడు మురుగన్ ఆలయం కొండలు, అందమైన లోయల నడుమ ఉంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. తమిళనాడులో మురుగన్‌కు ఉన్న ఆరు నివాసాలలో ఇది ఒకటని చెబుతుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించేవారు ఇక్కడ ట్రెక్కింగ్ చేయడాన్ని అమితంగా ఇష్టపడతారు.9. పచ్చైమలై మురుగన్ ఆలయం.. ప్రశాంతతకు నిలయంపచ్చైమలై మురుగన్ ఆలయం తమిళనాడులోని గోబిచెట్టిపాళయంలో ఉంది. కొండలపై నెలకొని ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెతుక్కునే వారికి ఇది మైలురాయిలా నిలుస్తుంది. ఆలయ నిర్మాణం దక్షిణ భారతీయ శైలిలో ఉంటుంది.10. సెంగుంథర్ శివ సుబ్రమణ్య స్వామి ఆలయంతమిళనాడులోని సెంగుంథర్పేట పట్టణంలో ఉంది. ఈ ఆలయం సెంగుంథర్ సంప్రదాయాలకు నిలయంగా ఉంది. ఈ ఆలయ విశిష్టత మురుగన్ పురాణ గాథలలో కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య షష్టి రోజున ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.ఇది కూడా చదవండి: ఏ పెట్రోల్ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.. రోజూ వెళ్లేవారికీ తెలియని విషయాలు -
ఢిల్లీలో తగ్గని కాలుష్యం, కేరళలో భారీ వర్షాలు, కశ్మీర్లో కురుస్తున్న మంచు
న్యూఢిల్లీ: దేశంలో చలి వాతావరణం కొనసాగుతోంది. జాతీయ రాజధాని ఢిల్లీలో విషపూరితమైన గాలి అక్కడి జనాలను పీడిస్తోంది. ఆదివారం కూడా గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో ఉంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి అతలాకుతలమయ్యింది. దీంతో సైన్యం వరద సహాయక చర్యలను చేపడుతోంది.పుదుచ్చేరిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా వరదలు సంభవించాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. డిసెంబర్ 2న పుదుచ్చేరిలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.ఫెంగల్ తుఫాను ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటింది. ఈ నేపధ్యంలో చెన్నై బీచ్‌లలో అధిక అలలు ఏర్పడ్డాయి. ఫెంగల్ తుఫాను పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర తీర ప్రాంతాలపై క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఐఎండీ కేరళలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్‌లలో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువకు పడిపోయాయి. డిసెంబరు 2వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఎత్తయిన ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. గుల్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉష్ణోగ్రత మైనస్ 0.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
ఫెంగల్ టెన్షన్.. చెన్నై ఎయిర్‌పోర్టులోకి వరద నీరు
Cyclone Fengal Updates..👉 తీరం దాటుతున్న ‘ఫెంగల్’ తుపానుపుదుచ్చేరి సమీపంలో ‘ఫెంగల్’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపిన ఐఎండీఈ ప్రక్రియకు దాదాపు నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలుదక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం👉మహాబలిపురం వద్ద ఫెంగల్ తుపాన్ తీరాన్ని తాకింది. 👉తుపాను ఎఫెక్ట్.. విమానాలు రద్దు..వాతావరణం సరిగా లేని కారణంగా విశాఖ నుంచి వెళ్లే పలు విమానాలు రద్దు చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన మూడు విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దువిమానాల రద్దుతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు ఉదయం 4 గంటల వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత. 👉ఫెంగల్ తుపాను ప్రభావం తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరి, ఏపీపై చూపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. #ChennaiAirport During #FengalCyclone#CycloneAlert#Chennaipic.twitter.com/EPLZlM5CYt— Musharraf Mughal. (@marcanthony99) November 30, 2024 👉మరోవైపు.. లోతట్టు పప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చి చేరుకుంది. 📍 சென்ட்ரல் ரயில் நிலையம் எதிரில். ✍️ ஆபத்தான முறையில் கீழே விழ இருந்த அறிவிப்புப் பலகை உடனடியாக அகற்றப்பட்டது. #ChennaiRains #chennaipolice #cyclone #Fengal pic.twitter.com/b3et05ClSi— Greater Chennai Traffic Police (@ChennaiTraffic) November 30, 2024 👉రన్‌వే పైకి వరద నీరు చేరుకోవడంతో పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అలాగే, కొన్ని సర్వీసులను దారి మళ్లించారు. 👉నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుపాను భయపెడుతోంది. గంటకు 12 కిమీ వేగంతో తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం సాయంత్రానికి తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.👉తుపాన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలో గంటకు 70-80 కి.మీ వేగంలో గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. చెన్నైకు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు సైతం ఆలస్యమవుతున్నాయి. పలు రైలు సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉంది. Cyclone Fengal 🌀 effect on CHENNAI cityParts of the city have reported inundations due to spells of intense rainfall activityStay safe & indoors for the next crucial 36 hours#ChennaiRains #ChennaiRains2024 #ChennaiRain https://t.co/voiAq7RIiP pic.twitter.com/2GX6SbHD4K— Karnataka Weather (@Bnglrweatherman) November 30, 2024👉తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విలుపురం, కల్లకురుచ్చి, కుద్దలూరు, పుద్చుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అల్టర్ విధించింది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.சிக்கி தவிக்கும் தலைநகரம். #Fengal #FengalCyclone #Chennai #ChennaRains #DMKFails pic.twitter.com/OHBlmMmy8D— D.Jackson Jayaraj (@VirugaiJackson) November 30, 2024👉ఫెంగల్ ప్రభావం ఏపీపై కూడా కొనసాగనుంది. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు , కడప జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌కు అకాశముందని హెచ్చరికలు రావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమయ్యింది. పెంగల్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదర్తి, బోగోలు మండల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ஆட்டோ உள்ளே தண்ணீர்போகும் அளவுக்கு சூளைமேடு பகுதி #ChennaiRains @thatsTamil #Chennaiflood pic.twitter.com/6AohpLlbhb— Veerakumar (@Veeru_Journo) November 30, 2024 -
ఫెంగల్ పంజా.. చూస్తుండగానే కూలిన భవనం
చెన్నై: తమిళనాడులో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఫెంగల్ ధాటికి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలతో.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలలోని కాలేజీలు, స్కూళ్లకు రెండురోజుల పాటు సెలవు ప్రకటించింది.వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆరు గంటలపాటు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో త్రికోణమలీకి తూర్పు- ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు నాగపట్టినానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు పేర్కొంది. VIDEO | An old house collapsed in Tamil Nadu's Mayiladuthurai due to heavy rains earlier today.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#TamilNaduRains pic.twitter.com/sYHwEFfO5W— Press Trust of India (@PTI_News) November 27, 2024 -
‘ఫెంగల్’ తుఫాన్.. తమిళనాడు,పుదుచ్చేరిలకు రెడ్ అలర్ట్
చెన్నై:తమిళనాడు,పుదుచ్చరిలకు భారత వాతవావరణశాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం తుఫానుగా మారనుందని వెల్లడించింది.ఫెంగల్ తుఫాను ప్రభావంతో బుధ,గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు పుదుచ్చేరిలోని కారైకల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు,పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో గురువారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.ప్రస్తుతం తుపాను తమిళనాడులోని నాగపట్నం నుంచి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుపాను దగ్గరగా రానున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
గోల్స్ సునామీ సృష్టించిన తమిళనాడు.. 60 నిమిషాల్లో 43..
జాతీయ పురుషుల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తమిళనాడు జట్టు ఆటగాళ్లు ఊహించనిరీతిలో అండమాన్ నికోబార్ జట్టుపై గోల్స్ సునామీ సృష్టించారు. చెన్నైలో జరుగుతున్న ఈ టోరీ్నలో నాలుగు క్వార్టర్ల పాటు 60 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 43 గోల్స్ సమోదయ్యాయి. తమిళనాడు 43–0తో అండమాన్ నికోబార్ జట్టుపై జయభేరి మోగించింది. కెప్టెన్ కార్తీ సెల్వం 13, సోమన్న, సుందరపాండి చెరో 9 గోల్స్ తుఫాన్ సృష్టించారు. మారీశ్వరన్ శక్తివేల్ 6, పృథ్వీ 3, సెల్వరాజ్ కనగరాజ్ రెండు గోల్స్ సాధించారు. శ్యామ్ కుమార్ ఒక గోల్ చేశాడు. కనీస ప్రతిఘటన చేయలేకపోయిన అండమాన్ జట్టు కనీసం ఖాతా తెరువక పోవడమే విడ్డూరంగా ఉంది. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్... మధ్యప్రదేశ్ ధాటికి చేతులెత్తేసింది. ఏపీ జట్టును ఖాతా తెరవనీకుండా మధ్యప్రదేశ్ జట్టు 17–0తో విజయం సాధించింది. -
దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!
కార్తీకమాసం సందర్బంగా సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన మయూర నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటిగా పేరు గాంచింది. మాయవరంలోని మయూర నాథ ఆలయం. శివుడు లింగ రూపంలో వెలసిన ఆలయాలు అనేకంఉన్నాయి, అందులో అతి పెద్ద శివాలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం ఏమింటంటే... పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం ఇది. మరి పార్వతీదేవి ఈ దేవాలయాన్ని ఎందుకు సృష్టించింది? ఇదెక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుందాము...తమిళనాడు లోని, నాగపట్నం జిల్లాలోని మైలాడుతురై అని పిలిచే మాయవరంలో మయూరనాథ దేవాలయం వుంది.ప్రస్తుతమున్న మైలాడుతురైనే మాయవరం అని పిలిచేవారు. ఇది చాలా పురాతనమైన ఆలయంగా, ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ దేవాలయ రాజగోపురం తొమ్మిది అంతస్థులలో నిర్మితమైంది.దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివాలయాలలో ఇది కూడా ఒకటి.స్థలపురాణంఇక్కడ దక్షప్రజాపతి శివపార్వతులను ఆహ్వానించక చేస్తున్న యాగానికి, పరమశివుడు వారిస్తున్నా వినకుండా వచ్చిన పార్వతీదేవిని అవమానిస్తున్న సందర్భంలో... జరుగుతున్న ఈ రసాభాసలో ఆ యజ్ఞగుండ అగ్నికి భయపడి, అక్కడే ఉన్నటువంటి ఓ చిన్న నెమలిపిల్ల పార్వతీదేవి ఒడిలో దాక్కుంది. అదే సమయానికి పార్వతీదేవి తనని తాను యోగాగ్నిలో దహించుకునేసరికి, ఒడిలో ఉన్న నెమలిపిల్ల కూడా ఆహుతైపోతుంది.అలా నెమలితో అగ్నికి ఆహుతి కావడంతో, తర్వాత నెమలి రూపంలో జన్మించి, జరిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోడానికి పార్వతీదేవి ఇక్కడ శివుని మందిరాన్ని సృష్టించి, శివుణ్ణి ప్రార్థించి, ఆయనలో లీనమైనట్లు స్థల పురాణం చెబుతోంది. పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం కాబట్టి, ఈ ఆలయానికి మయూర నాథ దేవాలయం అని పేరు స్థిరపడింది. ఈ మయూరనాథుడే శివుడు. పార్వతీదేవిని ఇక్కడ అభయాంబిక, అభయ ప్రధాంబిక అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.ఈ ఆలయాన ఓ మర్రి చెట్టు ఉంది.ఈ మర్రి చెట్టుకిందే పార్వతీదేవి మయూర రూపంలో తపస్సు చేసినట్లు భక్తులు భావిస్తారు.ఇక్కడ కావేరీ నది ప్రవహిస్తోంది. దీనిని వృషభా తీర్థం అని పిలుస్తారు. ఇక్కడి కావేరీ నదిలో, ప్రతీ పౌర్ణిమ రోజున తమ తమ గంగ యమునలతోపాటు ఇక్కడికి వచ్చి తమ అంశలతో కూడిన నదులు ఇక్కడికి వచ్చి, తమ జలాల్ని ఈ కావేరినదిలో జారవిడుస్తాయట. అందువలనే ఈ ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమమని భక్తులు తలుస్తుంటారు.మాయవరం పట్టణం చిదంబరం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది.పురాతన ఆలయం శాసనాల ప్రకారం క్రీ.శ 9 వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమైందని చెబుతారు.చోళరాజుల వాస్తు నైపుణ్యం, అద్భుతమైన చెక్కడాలు, అపురూపమైన శిల్పాలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి. తమిళనాడులోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
అగ్గిపుల్లలాంటి ఆడపిల్లకు ఫైర్‌తో భయం ఏమిటి..?
కన్నగి రాజేంద్రన్ వెల్డర్‌గా ఉద్యోగంలో చేరినప్పుడు ‘వెల్డన్’ అని ఎవరూ అనలేదు. ‘వెల్డింగ్ పనిలోకి వెళుతున్నావా! అది మామూలు పని అనుకున్నావా... మంటలతో చెలగాటం’ అని మాత్రమే అన్నారు. ‘ఫైర్’ ఉన్న అమ్మాయికి ఫైర్‌తో భయం ఏమిటీ! అలాంటి ఒక ఫైర్ కన్నగి. ‘వెల్డింగ్ ఫీల్డ్‌లో రావడానికి భయం అక్కర్లేదు. కాస్త ధైర్యం చాలు’ అంటుంది...పురుషుల డొమైన్‌గా భావించే వెల్డింగ్ ప్రపంచంలోకి మహిళలు అడుగు పెట్టడమే కాదు, తమ సత్తా చాటుతున్నారు. దీంతో తమిళనాడులోని కర్మాగారాలు వెల్డింగ్‌కు సంబంధించి మహిళా ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.ఈ మార్పుకు కారణం కన్నగి రాజేంద్రన్లాంటి మహిళలు. ఆరియలూరుకు చెందిన కన్నగి రాజేంద్రన్ వెల్డింగ్ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టినప్పుడు....‘ఇది తప్ప నీకు చేయడానికి మరే పని దొరకలేదా’ అన్నట్లుగా మాట్లాడారు.ఆ మాటలకు కన్నగి వెనకడుగు వేసి ఉంటే ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిని ఇచ్చేది కాదు. నాలుగు సంవత్సరాలుగా ‘ష్వింగ్ సెట్టర్ ఇండియా’లో వెల్డర్‌గా పనిచేస్తున్న కన్నగి ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెల్డింగ్’ నిర్వ హించిన గ్యాస్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ (జిఎంఎడబ్లు్య) పోటీలో ఉత్తమ పైప్ వెల్డర్‌గా అవార్డ్ గెలుచుకుంది.ఈ పోటీలో 45 డిగ్రీల కోణంలో ఉంచిన పైపుపై వెల్డర్ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. పైప్ చుట్టూ వివిధ స్థానాలలో వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో నెగ్గుకు రావడానికి అధునాతన టెక్నిక్, బహుముఖప్రజ్ఞ అవసరం అవుతాయి. ఆ బహుముఖప్రజ్ఞను సొంతం చేసుకున్న కన్నగి అవలీలగా విజయం సాధించింది. ఈ పోటీ కోసం కంపెనీలో వివిధ వెల్డింగ్ విభాగాలలో విస్తృతమైన శిక్షణ పొందింది.ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్లే కన్నగి వెల్డింగ్ ఫీల్డ్‌లోకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అన్నయ్య డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెల్లి ప్రభుత్వ కళాశాలలో ఇంజనీరింగ్ చేసింది. తిరుచ్చిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో చేరిన కన్నగి 2021లో ‘ష్వింగ్ సెట్టర్ ఇండియా’లో ట్రైనీగా ఉద్యోగంలో చేరింది. ‘నేను ట్రైనీగా చేరినప్పుడు ఒక్క మహిళ కూడా లేదు. ఎందుకు ఇలా అని అడిగితే అధిక శ్రమతో కూడిన ఈ పనిలోకి మహిళలు ఎందుకు వస్తారు అనే జవాబు వినిపించింది. నేను మాత్రం ఈ పని చేయగలనా అని కాస్త సందేహించాను. అలా భయపడితే ఎలా అని ఆ తరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఎంతైనా కష్టపడాలి అనుకున్నాను. ఆ కష్టమే ఈ పురుషాధిక్య రంగంలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడింది. రెండు నెలలలోనే నా పనికి ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు రావడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది’ అంటుంది కన్నగి.కంపెనీ ఫ్యాబ్రికేషన్ విభాగంలో వెల్డర్‌గా చేరినప్పుడు మొదట్లో ఆమె కుటుంబసభ్యులు భయపడ్డారు.వెల్డింగ్ ఫీల్డ్‌లో జరిగే ప్రమాదాల గురించి ప్రస్తావించారు. వారికి సర్ది చెప్పి ఉద్యోగంలో చేరింది. మొదట్లో చర్మ సమస్యలు, కంటి సమస్యలు వచ్చాయి. సరైన మందులు, భద్రతాచర్యలతో త్వరలోనే వాటి నుంచి బయటపడింది.‘ప్రతి ఉద్యోగంలో కష్టాలు, సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించినప్పుడే మనల్ని మనం నిరూపించుకోగలం’ అంటున్న కన్నగి రాజేంద్రన్ వెల్డింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటున్న యువతులకు ధైర్యాన్ని ఇస్తోంది. ‘చేయగలనా! అనే సందేహం దగ్గర ఉండిపోతే అక్కడే ఆగిపోతాం. యస్... నేను చేయగలను అనుకుంటే ముందుకు వెళతాం. నేను సాధించిన విజయం సంతోషాన్ని ఇవ్వడమే కాదు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రాబోయే కాలంలో మరింత మంది మహిళలు ఈ రంగంలోకి రావాలి. అలా వచ్చినప్పుడు పురుషాధిక్య రంగాల్లో మహిళలు కూడా రాణించగలరు. తాము పురుషులతో సమానమని వారు తెలుసుకుంటారు’ అంటుంది కన్నగి రాజేంద్రన్.(చదవండి: జీవితాన్నే మార్చేసిన ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్) -
అమెరికా ఎన్నికలు: తులసేంద్రపురంలో పూజలు
చెన్నై:అమెరికా ఎన్నికల పోలింగ్ వేళ తమిళనాడు తులసేంద్రపురం గ్రామంలో సందడి నెలకొంది. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలాహారిస్ పూర్వీకులది ఇదే గ్రామం. తమ ఊరి బిడ్డ ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని తులసేంద్రపురం వాసులు గ్రామంలోని ఆలయంలో మంగళవారం(నవంబర్ 5) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికే కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ తులసేంద్రపురంలో పెద్ద బ్యానర్‌నే ఏర్పాటు చేశారు. గతంలో కమలాహారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించినపుడు కూడా తులసేంద్రపురం వాసులు టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.ప్రస్తుతం కమల ఏకంగా అధ్యక్ష పోరులోనే బరిలో ఉండడంతో ఆమె గెలుపుపై గ్రామ వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. కమల ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టక ముందు కాలిఫోర్నియా అటార్నీగా పనిచేస్తున్నపుడు తులసేంద్రపురంలోని గ్రామ ఆలయానికి 60 డాలర్లు విరాళమివ్వడం గమనార్హం.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలపై హిప్పో జోస్యం వీడియో వైరల్ -
దేవుడిచ్చిన కూతురు తల్లై ఎదురొచ్చింది!
డాక్టర్ జె. రాధాకృష్ణన్‌కు అవి ఉద్విగ్న భరితమైన క్షణాలు! కిందటి శనివారం ఆయన నాగపట్నంలోని సంరక్షణాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చేతుల్లో బిడ్డతో సౌమ్య ఆయనకు ఎదురొచ్చింది. ఆ బిడ్డను మురిపెంగా తన చేతుల్లోకి తీసుకున్నారు ఆయన. సౌమ్య తనకు దేవుడిచ్చిన కూతురైతే, ఆ కూతురి కన్నబిడ్డ ఆయన చేతుల్లోని పసికందు. సౌమ్య తల్లయిందని తెలిసి ఆమెను చూడ్డం కోసం ఆ హోమ్‌కి వచ్చారు రాధాకృష్ణన్, ఆయన భార్య కృతిక. తన బిడ్డకు వారి ఆశీర్వాదం కోసం తను పెరిగిన హోమ్‌కే తీసుకు వచ్చింది సౌమ్య. సౌమ్యను ఇరవై ఏళ్లు కంటికి రెప్పలా చూసుకున్న హోమ్ అది. ఈ ఇరవై ఏళ్లుగా హోమ్‌లో సౌమ్య బాగోగులను చూసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ రాధాకృష్ణన్. ఎందుకు ఆయనకు సౌమ్య అంటే అంత మమకారం?! ఈ ప్రశ్నకు సమాధానం వెలాంకిణి మాతకు తెలుసు. ఆ మాతే కదా.. సునామీలో సౌమ్య తల్లిదండ్రులు కొట్టుకుపోవటం చూసింది! ఆ మాతే కదా అనాథగా నాగపట్నం తీరంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న నాలుగేళ్ల సౌమ్యను నన్స్ చేత చేరదీయించి, వారు చేర్పించిన సంరక్షణాలయంలో రాధాకృష్ణన్ కంట పడేలా చేసింది! 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రం విప్పిన సునామీ పడగ ఉప్పెన తమిళనాడు తీరప్రాంతం నాగపట్నాన్ని కూడా ముంచెత్తింది. వేలాదిగా మరణాలు. కొట్టుకుపోయిన ఇళ్లు... చెల్లాచెదురైన కుటుంబాలు. వారి పునరావాసం కోసం ప్రభుత్వం తంజావూరు జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్‌ను అక్కడికి పంపింది. ఆ కొద్దిరోజులకే ఆయనకు నాగపట్నం జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది.వెలాంకిణి ఆలయ నన్స్ అనాథ పిల్లల్ని చేర్పించిన అన్నై సాథియ గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్‌ను సందర్శించినప్పుడే రాధాకృష్ణన్ మొదటిసారిగా సౌమ్యను చూశారు. ఆ చిన్నారి కళ్ళలోని విషాదం ఆయన మనసును కలచివేసింది. దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కూతుళ్ళు లేకపోవటం వల్ల కావచ్చు సౌమ్యను చూడగానే దేవుడిచ్చిన కూతురు అనే భావన ఆయనలో కలిగింది. కుదిరినప్పుడల్లా వెళ్లి ఆ కూతుర్ని మనసు నిండుగా చూసుకుని వచ్చేవారు. కాలం గడిచింది. 2018 లో ఒకసారి ఆయన సౌమ్యను చూడానికి వెళ్ళినప్పుడు సౌమ్య, ఆమె స్నేహితురాలు మీనా కనిపించారు. ‘మిగతా పిల్లలంతా దత్తతకు వెళ్లిపోయారని, అప్పటి పిల్లల్లో వీళ్ళిద్దరే మిగిలారని‘ హోమ్ వాళ్ళు చెప్పారు. మళ్లీ వెళ్ళినప్పుడు... మణివణ్నన్ అనే సముద్ర ఉత్పత్తుల వ్యాపారి, ఆయన భార్య మలర్విళి సౌమ్యను దత్తత తీసుకున్నారని తెలిసింది. 2022లో సుబ్బయ్య అనే టెక్నీషియన్‌తో సౌమ్య పెళ్లి జరిగింది. రాధాకృష్ణన్ దంపతులే వారి పెళ్లి జరిపించారు. ఈ అక్టోబర్ 22న పాపను ప్రసవించింది సౌమ్య. ఆ పాపకు సారా అని పేరు పెట్టుకుంది. పాపను చూడాలని ఉందంటే హోమ్ వాళ్లే ఈ ‘తండ్రీ కూతుళ్లు‘ కలిసే ఏర్పాట్లు చేశారు.ఎకనామిక్స్‌లో బి.ఏ. చేసిన సౌమ్య ప్రస్తుతం నర్సింగ్ కోర్స్ చేస్తోంది. అందుకు రాధాకృష్ణన్ సహకారం ఉంది. ఆయన ఇప్పుడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ. కో ఆపరేషన్, ఫుడ్, కన్సూ్యమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్కి ఇంఛార్జి. ‘సునామీని తట్టుకుని నాగపట్నం నిలబడినట్లే... సౌమ్య, మీనా, ఇంకా అటువంటి అనాథ పిల్లలు జీవితాన్ని ఎదుర్కొన్న తీరు ఆదర్శనీయం‘ అంటారు రాధాకృష్ణన్. -
స్కూల్లో గ్యాస్ లీక్.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరంలో గల ఓ పాఠశాలలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. గ్యాస్ లీకేజీ కారణంగా పిల్లలతో పాటు కొందరు ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువొత్తియూర్‌లోని మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 30 మందికి పైగా విద్యార్థులు గ్యాస్ లీక్ కారణంగా అస్వస్థత బారిన పడ్డారు. బాధితులను స్కూలు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, వారికి చికిత్స జరుగుతున్నదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.విద్యార్థులకు సాయం అందించేందుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఏకే చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ లీకేజీకి ఖచ్చితమైన కారణం తెలియరాలేదన్నారు. తమ బృందం బాధితులకు సహాయం అందిస్తున్నదన్నారు. బాధిత విద్యార్థి ఒకరు మాట్లాడుతూ గ్యాస్ లీకేజీతో ఇబ్బంది ఎదుర్కొన్న మేము తరగతి గది నుండి బయటికి పరుగుపరుగున వచ్చేశామన్నారు. ఉపాధ్యాయులు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారని, కొంతమంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. వెంటనే బాధిత విద్యార్థులకు ఉపాధ్యాయులు సాయమందించాన్నారు.పాఠశాలలో నుంచే గ్యాస్ లీకేజీ జరిగిందా లేదా రసాయన కర్మాగారం నుంచి వచ్చిందా అనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం తెలియగానే విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూలుకు చేరుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల సిబ్బంది స్పష్టమైన సమాచారం అందించడం లేదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: డెడ్ డ్రాప్ పంథాలో సింథటిక్ డ్రగ్స్ దందా! -
తమిళనాడుకు భారీ వర్ష సూచన.. మిగిలిన రాష్ట్రాల్లో..
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.తమిళనాడుతో అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా చెన్నైతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 5-6 రోజులలో దక్షిణ కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 14 నుంచి 16వ తేదీ మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.గడచిన 24 గంటల్లో రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. తూర్పు రాజస్థాన్‌లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. సంచోర్ (జలోర్)లో గరిష్టంగా 25 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఢిల్లీలో మేఘావృతమై గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: దేవర గట్టు కర్రల సమరంలో పారిన నెత్తురు.. 100మందికి పైగా భక్తులకి గాయాలు -
తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు
చెన్నై:తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తమిళనాడు డెల్టాప్రాంతంలో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై,పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.పుదుచ్చేరిలో ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పేషెంట్లను మరో ఆస్పత్రికి అధికారులు తరలించారు. వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి చెన్నై,పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడు సేలం జిల్లాలో సబ్వేలో వరద నీరు నిలిచింది.ఇదీ చదవండి: మురసోలి సెల్వమ్ కన్నుమూత -
TN: ఎయిర్ షో మరణాలకు కారణం అదే: మంత్రి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం(అక్టోబర్6) జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందడంపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం స్పందించారు.ఎయిర్‌షోలో మరణాలు ప్రభుత్వ నిర్వహణ లోపం,తొక్కిసలాట వల్ల కాదని డీ హైడ్రేషన్ వల్లే సంభవించాయని చెప్పారు.అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన వందల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. షో కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అడిగనదాని కంటే ఎక్కువ ఏర్పాట్లే చేశామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వారు 100 బెడ్లు సిద్ధంగా ఉంచాలని కోరారని, తాము 4 వేల బెడ్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. బీచ్‌లో జరిగిన ఐఏఎఫ్ ఎయిర్‌షోకు భారీగా జనం హాజరవడంతో తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి చెందడంతో పాటు చాలా మందికి గాయాలయ్యాయి.ఇదీ చదవండి: చుక్కలు చూపించిన ఎయిర్‌షో -
ఉదయనిధికి ప్రమోషన్ అందుకే: స్టాలిన్ వివరణ
చెన్నై: తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. డీఎంకే ప్రభుత్వ పాలనను మరింత మెరుగుపరిచేందుకే ఉదయనిధికి డిప్యూటీసీఎం పదవి ఇచ్చినట్లు తెలిపారు. సీఎంగా ఉన్న తనకు సహాయంగా ఉండేందుకు డిప్యూటీ సీఎంను చేయలేదని క్లారిటీ ఇచ్చారు. క్రీడా శాఖ మంత్రిగా ఉదయనిధి దేశమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని కొనియాడారు. తమిళనాడు అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పతకాలు తీసుకువచ్చే దిశగా క్రీడాశాఖలో ఉదయనిధి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని ప్రశంసలు కురిపించారు. డీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉదయనిధి పనిచేయాలని స్టాలిన్ సూచించారు. ఆదివారం(సెప్టెంబర్29) డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన ఉదయనిధి క్రీడాశాఖను తన వద్దే ఉంచుకున్నారు. అదనంగా ప్లానింగ్, డెవలప్మెంట్ పోర్ట్‌ఫోలియో నిర్వహించనున్నారు. ఇదీ చదవండి: సిద్ధూపై ఈడీ కేసు