చెన్నై: లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చి సాధించుకున్న ఇమేజ్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్క స్వీట్ బాక్స్‌తో ముక్కలు చేశాని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కోయంబత్తూరులో డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల ‘విజయ ర్యాలీ’ సభలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.
‘‘ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను చివరిసారి కోయంబత్తూరు వచ్చినప్పడు నా పర్యటన దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. మోదీ తమిళనాడకు 8 సార్లు పర్యటించి పొందిన ఇమేజ్‌ను కోయంబత్తూరులో రాహుల్ గాంధీ నాకు కేవలం ఒక స్వీట్ బ్యాక్స్ ఇచ్చి ముక్కలు చేశారు. నేను కోయంబత్తూరులో ఉన్న సమయంలో తమిళనాడుకు వచ్చిన రాహుల్ నాకు స్వీట్ బాక్స్ ఇచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ నాపై చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోను’’ అని స్టాలిన్ అన్నారు.
నరేంద్ర మోదీ బీజేపీ సొంతబలంతో ప్రధానమంత్రి కాలేదని, భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మోదీ ఫెయిల్యూర్‌కు నిదర్శనం అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన విజయం సాధారణమే అయినప్పటికీ.. మోదీని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేకుండా చేయటంలో ‘చారిత్రాత్మక విజయం’ గా మారిందని అన్నారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్తం 40 స్థానాల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించిందన్నారు. అయితే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పిందని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 41వ విజయం సాధించిందని తెలిపారు. ఇదే విజయాన్ని 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రిపీట్ చేస్తామని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment