Mk Staline
-
కావేరీ నీటి వాటా: కర్ణాటక నిర్ణయాన్ని ఖండించిన సీఎం స్టాలిన్
చెన్నై: తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి వాటా విడుదలపై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం స్టాలిన్ ఖండించారు. ఆయన మంగళవారం కావేరీ జలాల వివాదంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటిని విడుదల చేయకపోవటాన్ని తప్పుపట్టారు.‘కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయకపోవటాన్ని అఖిలపక్షం తీవ్రంగా ఖండించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి వాటాను విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని కోరుతున్నాం’ అని తెలిపారు.ఇక.. కర్ణాటక ప్రభుత్వం కేవలం 8వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తమిళనాడుకు విడుదల చేస్తామని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదివారం నుంచి మళ్లీ కావేరీ జలాల వివాదం తెరపైకి వచ్చింది. అయితే తమిళనాడుకు వెయ్యి క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేయాల్సి ఉంది.నిన్న(సోమవారం) కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం అనంతరం తమిళనాడు కావేరీ నీటి పంపిణీపై నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ‘మేము ప్రతిరోజు ఒక టీఎంసీ కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయలేం. కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయగలమని కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని అన్నారు. -
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు: సీబీఐ దర్యాప్తునకు మాయావతి డిమాండ్
చెన్నై: తమిళనాడు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కే. ఆర్మ్‌స్ట్రాంగ్ గుర్తుతెలియని దుండగుల చేతిలో శుక్రవారం హత్యకు గురయ్యారు. ఆదివారం మాజీ సీఎం, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతికకాయనికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ హత్య కేసులు పోలీసులు అరెస్ట్ చేసిన నిందితలు అసలైనవారు కాదని అన్నారు. హత్య కేసులో సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను డిమాండ్ చేశారు.#WATCH | Chennai, Tamil Nadu: BSP Chief Mayawati and party's National Coordinator, Akash Anand pay their last respects to Tamil Nadu BSP President K Armstrong.K Armstrong was hacked to death by a group of men near his residence in Perambur on 5 July. pic.twitter.com/4kQImXFYX9— ANI (@ANI) July 7, 2024 ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య పట్ల మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులు గుంపుగా వచ్చి ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసిన తీరును గమనిస్తే.. తమిళనాడులో అసలు శాంతి భద్రతలు లేవనిపిస్తోందని అన్నారు. సీఎం ఎంకే స్టాలిన్ ఈ కేసును వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించి, న్యాయం అందించాంని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వం ఈ కేసులో తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదని తెలిపారు. ఆర్మ్‌స్ట్రాంగ్ ఘటనతో రాష్ట్రంలో దళితలు అభద్రతాభావంతో తీవ్రంగా ఆందోళన పడుతున్నారని అన్నారు. ఈ ఘటనను బీఎస్పీ చాలా సీరియస్‌గా తీసుకుంది. కానీ, పార్టీ కార్యకర్తలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని అన్నారు.బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ (47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. -
‘ఒక్క స్వీట్ బాక్స్‌తో మోదీ ఇమేజ్‌కు రాహుల్ చెక్’
చెన్నై: లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చి సాధించుకున్న ఇమేజ్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్క స్వీట్ బాక్స్‌తో ముక్కలు చేశాని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కోయంబత్తూరులో డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల ‘విజయ ర్యాలీ’ సభలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.‘‘ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను చివరిసారి కోయంబత్తూరు వచ్చినప్పడు నా పర్యటన దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. మోదీ తమిళనాడకు 8 సార్లు పర్యటించి పొందిన ఇమేజ్ను కోయంబత్తూరులో రాహుల్ గాంధీ నాకు కేవలం ఒక స్వీట్ బ్యాక్స్ ఇచ్చి ముక్కలు చేశారు. నేను కోయంబత్తూరులో ఉన్న సమయంలో తమిళనాడుకు వచ్చిన రాహుల్ నాకు స్వీట్ బాక్స్ ఇచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ నాపై చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోను’’ అని స్టాలిన్ అన్నారు.నరేంద్ర మోదీ బీజేపీ సొంతబలంతో ప్రధానమంత్రి కాలేదని, భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మోదీ ఫెయిల్యూర్‌కు నిదర్శనం అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన విజయం సాధారణమే అయినప్పటికీ.. మోదీని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేకుండా చేయటంలో ‘చారిత్రాత్మక విజయం’ గా మారిందని అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్తం 40 స్థానాల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించిందన్నారు. అయితే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పిందని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 41వ విజయం సాధించిందని తెలిపారు. ఇదే విజయాన్ని 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రిపీట్ చేస్తామని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. -
అవినీతి యూనివర్సిటి ఛాన్సలర్ మోదీ : సీఎం స్టాలిన్
చెన్నై: డీఎంకేని అవినీతి పార్టీ అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి అనే ఓ యూనివర్సిటీ ఉంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఛాన్సలర్ అవుతారని అని సెటైర్లు వేశారు. ‘అవినీతి పేరుతో ఓ విశ్వవిద్యాలయం స్థాపిస్తే.. ఆ యూనివర్సిటీకి ప్రధాన మంత్రి మోదీ ఛాన్సలర్ అవుతారు. ఛాన్సలర్ కావడానికి ప్రధాని మోదీకి అన్ని అర్హతలు ఉన్నాయి. బీజేపీనే దేశంలో అతిపెద్ద అవినీతీ పార్టీ. దానికి ఉదాహారణ.. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం. అది ఒక్కటే కాదు.. పీఎం కేర్స్ ఫండ్, కేసుల్లో ఇరుకున్న ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరిన తర్వాత విచారణ ఉండకపోవటం. అసలు అవినీతితో కూడిన పార్టీ బీజేపీ’ అని సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ఇక.. బుధవారం తమిళనాడులోని వెల్లూరులో బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అధికార డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే అవినీతి పార్టీ అని మండిపడ్డారు. ‘అవినీతికి మొదటి కాపీ రైట్ డీఎంకేకు చెందుతుంది. ఎంకే స్టాలిన్ కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంది. తమిళనాడు ప్రజలను అవినీతి కుటుంబ పాలన కొనసాగించే డీఎంకే తమ ట్రాప్‌లో పడిపోయారు. డీఎంకే పార్టీ తమిళ సంస్కృతి, సాంప్రదాయానికి వ్యవతిరేకంగా ఉంది. సీఎం స్టాలిన్ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నారు’ అని మోదీ విమర్శలు చేశారు. -
స్టాలిన్ బర్త్‌డే.. బీజేపీ ‘కౌంటర్’ విషెస్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ, అందులో ఆయనకు కౌంటరే వేసింది. ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ యాడ్‌పై రాష్ట్ర మత్స్య మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ వివరణ కూడా ఇచ్చారు. ‘ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. మాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది’ తెలిపారు. అయితే.. వివాదాన్ని కొనసాగిస్తూ.. సీఎం స్టాలిన్‌కు మాండరీన్ భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు(స్టాలిన్‌కు) ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ‘ఎక్స్’(ట్విటర్)లో బీజేపీ కౌంటర్ వేసింది. On behalf of @BJP4Tamilnadu, here’s wishing our Honourable CM Thiru @mkstalin avargal a happy birthday in his favourite language! May he live a long & healthy life! pic.twitter.com/2ZmPwzekF8 — BJP Tamilnadu (@BJP4TamilNadu) March 1, 2024 అంతకు ముందు.. తిరునెల్వేలిలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ డీఎంకేపై విమర్శలు సంధించారు. ‘ప్రస్తుతం హద్దులు దాటేశారు. ఇస్రో లాంచ్ చేసే రాకెట్‌కు చైనా స్టిక్కర్‌ను అతికించారు. ఇది మన అంతరిక్ష శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని అవమానించడమే. ప్రజల పన్ను, డబ్బు, దేశాన్ని అవమానించటమే’అని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు డీఎంకే ఊరుకోలేదు.. కౌంటర్ ఇచ్చింది. తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా చొరబాట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటి చూపు కూడా సన్నగిల్లిందేమో.. మోదీ చైనా జెండాను పేపర్ యాడ్‌లో నిశిత దృష్టితో చూడగలరు. కానీ, గత పదేళ్లలో భారత భూభాగంలో చైనా జెండా పాతిందనే నివేదికలు ఆయన కళ్లను కప్పేశాయయేమో అని డీఎంకే ఎంపీ పి విల్సన్ విమర్శించారు. -
నిర్మలా సీతారామన్‌కు కపిల్ సిబల్ కౌంటర్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తప్పుపట్టారు. డిసెంబర్ 19న జరిగిన విపక్షాల ‘ఇండియా కూటమి’ సమావేశంలో పాల్గొన్న సీఎం స్టాలిన్‌పై నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయిందని ఇటువంటి సమయంలో ప్రజల మధ్య ఉండాల్సింది పోయి.. సీఎం స్టాలిన్ ‘ఇండియా కూటమి’ హాజరుకావడం ఏంటని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షం, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సీఎం స్టాలిన్ ఎందుకు సానుకూలమైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేయడంపై తాజాగా కపిల్ సిబల్ నిర్మలా సీతారామన్‌పై మండిపడ్డారు. దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న దేశ అప్పులు, పోషకాహార లోపం ఉన్న పిల్లలు, ఆకలి, పేదరికం వంటి సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు. సీఎం స్టాలిన్‌పై విమర్శలకు చేయడానికి బదులు దేశంలో ఉన్న ఈ సమస్యలపై దృష్టి సారించాలని కపిల్ సిబాల్ కౌంటర్ ఇచ్చారు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గతేడాది మేలో కాంగ్రెస్‌ను వీడి సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికకైన విషయం తెలిసిందే. చదవండి: వచ్చే ఎన్నికల్లో 50 శాతం ఓట్లు రావాలి: మోదీ -
సినీ సాహసి.. ఘట్టమనేని
సినీ సాహసి ఘట్టమనేని కృష్ణ.. అద్వీతీయ నటనతో 350కి పైగా చిత్రాలు చేసిన నటుడు. ఇన్ని చిత్రాలు చేసిన హీరో మరొకరు తెలుగు సినీ పరిశ్రమలోనే లేరు. కృష్ణ సినీ కళామతల్లి ఒడిలో ఎదిగింది చెన్నైలోనే. ఈయన కోడంబాక్కం ముచ్చట్లు చాలానే ఉన్నాయి. ఆయన ఎదుగుదల, వెలుగుకు చెన్నైనే చిరునామా. కృష్ణ సాహసాలు చేసింది. సూపర్ స్టార్ అయ్యింది ఇక్కడే. పద్మాలయ ఫిలిమ్స్ సంస్థను ప్రారంభించింది, నిర్మాతగా మారింది, దర్శకుడిగా అవతారం ఎత్తింది చెన్నపురిలోనే. ఇక్కడ సూపర్‌స్టార్ కృష్ణ సంబంధించిన మధుర స్మతులు ఎన్నో ఎన్నెన్నో. లెజెండరీ హీరో కృష్ణ ని్రష్కమణతో టాలీవుడ్‌తో పాటు తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. కొత్తదనాన్ని పరిచయం చేసిన నటుడు: సీఎం తెలుగు సూపర్‌స్టార్ కృష్ణ మరణ వార్త తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. తెలుగు సినిమాకు కొత్తదనాన్ని పరిచయం చేసిన ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. కృష్ణ కుమారుడు నటుడు మహేశ్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత చలన చిత్ర నటుడు రజినీకాంత్ స్పందిస్తూ, తాను ఎప్పటికీ అభిమానించే నటుడు కృష్ణ అని, ఆయనతో కలిసి మూడు హిట్ చిత్రాల్లో నటించానని గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి పేర్కొంటూ గొప్ప కీర్తిని సంపాదించుకున్న సేవాతత్పరుడు, గట్స్ ఉన్న మనిషి, వివాదరహితుడు, గౌరవ ప్రదమైన వ్యక్తి అయిన కృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తమిళనాడు తెలుగు యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిలిం ప్రొడ్యుసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్పందిస్తూ ఆయన వద్ద 22 చిత్రాలకు తాను కో– డైరక్టర్‌గా పని చేసి ఎంతో నేర్చుకున్నానని గుర్తు చేశారు. హాస్య నటుడు సెంథిల్ మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తి సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. విశ్వనటుడు కమలహాసన్ పేర్కొంటూ, తెలుగు సినీ వినీలాకాశంలో ఉన్నతస్థాయికి ఎదిగిన నటుడు కృష్ణ అని వ్యాఖ్యానించారు. ఏడాది వ్యావధిలో తల్లి, సోదరుడు, తండ్రిని వరుసగా కోల్పోయిన నటుడు మహే‹Ùబాబు కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలన్నారు. నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ పేర్కొంటూ.. కృష్ణ మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ నటీనటుల తరపున ఆ సంఘం అధ్యక్షుడు నాజర్ తదితరులు తమ సంతాపాన్ని తెలియజేశారు. -
నటి వాణిశ్రీని పెద్ద సమస్య నుంచి గట్టెక్కించిన తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై: నటి వాణిశ్రీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండగా నిలిచారు. ఓ పెద్ద సమస్య నుంచి ఆమెను గట్టెక్కించారు. నటి వాణిశ్రీకి చెందిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఆ స్థలం విలువ దాదాపుగా రూ.20 కోట్లు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం ఎం.కె.స్టాలిన్, తమిళనాడు ప్రభుత్వం.. వాణిశ్రీ భూమిని కబ్జా కోరల్లో నుంచి విడిపించారు. చదవండి: బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి! సదరు భూమి పత్రాలను వాణిశ్రీకి స్టాలిన్ అప్పగించారు . ఇదే సందర్భంలో నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారాన్ని కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. తన భూమిని తనకు అప్పగించిన స్టాలిన్ సాయానికి వాణిశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు. -
విద్య, వైద్యంపై ఖర్చు ‘ఉచితాలు’ కావు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
చెన్నై: ఆరోగ్యం, విద్యారంగాలపై ప్రభుత్వాలు చేసే వ్యయం ఉచితాలు కిందికి రాదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ రెండింటిపై చేసే పథకాలు పేదలకు ఎంతో మేలు చేసేవేనన్నారు. ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకాలంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం, దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. శనివారం కొలత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉచితాలు, సంక్షేమ పథకాలు వేర్వేరని అంటూ ఆయన..ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుందని పేర్కొన్నారు. ‘విద్య, వైద్యంపై చేసే వ్యయం ఉచితాల కిందికి రాదు. ఎందుకంటే విద్య జ్ఞానసముపార్జనకు, వైద్యం ఆరోగ్యానికి సంబంధించినది. మా ప్రభుత్వం ఈ రెండు రంగాల్లో సంక్షేమ పథకాలను అమలు చేయాలనుకుంటోంది. ఇవి ఉచితాలు కావు. సంక్షేమ పథకాలు. ఉచితాలు ఉండకూడదంటూ ఇటీవల కొందరు కొత్తగా సలహాలిస్తున్నారు. దాన్ని మేం పట్టించుకోం. కానీ, ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుంది. కాబట్టి, దీనిపై మరింతగా మాట్లాడదలుచుకోలేదు’అంటూ ముగించారు. -
వీసీల నియామకం రాష్ట్ర హక్కే: తమిళనాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆది నుంచి గవర్నర్ తీరుపై గుర్రుగా ఉన్న డీఎంకే ప్రభుత్వం.. తమ తీరును మరోసారి అసెంబ్లీ సాక్షిగా చాటింది. సోమవారం కీలకమైన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ల నియామకంలో అధికార మార్పిడికి కోసం.. సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. తద్వారా ఇప్పటి వరకు గవర్నర్ పరిధిలో ఉన్న వీసీల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గుజరాత్ తరహాలోనే తమిళనాడులో సైతం వీసీల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని అన్నారు. గవర్నర్ వద్ద ఈ అధికారులుంటే వివాదాలు తలెత్తుతాయని చెప్పారు. అందుకే తగిన మార్పులతో కొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు. తమిళనాడు ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని మొత్తం 13 వర్సిటీలు విద్యాబోధనలో చారిత్రాత్మకమైన విధానాలను అవలంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వీసీల నియమించే అధికారం లేకపోవడం వల్ల వర్సిటీల పనితీరులో అవకతవకలతో ప్రశ్నార్థకంగా మార్చివేసిందని అన్నారు. ఈ ఏడాది జనవరిలోనే.. అంతకు ముందు ఉన్నత విద్యాశాఖమంత్రి పొన్ముడి తమిళనాడు యూనివర్సిటీల సవరణ చట్టం –2022 బిల్లును అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టగా ఆమోదించారు. బిల్లు ప్రవేశపెడుతున్న దశలోనే బీజేపీ సభ్యులు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నకాలంలో తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ రాష్ట్ర ఉన్నతవిద్యశాఖకు సంబంధించి బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. వర్సిటీలకు వైస్ చాన్స్లర్ల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ కేవలం ఆమోదముద్ర మాత్రమే వేయాల్సి ఉందని డీఎంకే ప్రభుత్వం అంటోంది. అయితే అన్నాడీఎంకే హయాంలో గవర్నర్ భన్వారీలాల్ వీసీల నియామకం పూర్తి చేయడం వల్లనే ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య విబేధాలు మొదలైనాయని డీఎంకే శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇందువల్లే అన్నావర్సిటీ వీసీ సూరప్పపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ బదిలీ కాగా ఆర్ఎన్ రవి ఆ తరువాత బాధ్యతలు చేపట్టారు. కొత్త గవర్నర్ సైతం భన్వారీలాల్ కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నట్లు డీఎంకే భావిస్తోంది. అంతేగాక ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను తమిళనాడు వీసీలుగా నియమించడం చర్చకు దారితీసింది. ఇకపై వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందని, ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడుతామని జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం స్టాలిన్ ప్రకటించారు. అనేక రాష్ట్రాల్లో వీసీల నియామకం ప్రభుత్వమే చేస్తోందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి అదే అసెంబ్లీ సమావేశంలో స్పష్టం చేశారు. కొసమెరుపు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అధ్యక్షతన తమిళనాడులోని అన్ని యూనివర్సిటీల వీసీలు, విభాగాధిపతుల మహానాడు నీలగిరి జిల్లా ఊటీలో ‘నవ ప్రపంచలో భారత్ భాగస్వామ్యం’ అనే అంశంపై సోమవారం జరిగింది. ఈ మహానాడు జరుగుతున్న సమయంలో గవర్నర్ అధికారాలను కత్తిరిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం గమనార్హం. బీజేపీ వాకౌట్ వీసీల నియామకం వ్యవహారంపై బీజేపీ సభ్యులు వాకౌట్ చేయగా, అన్నాడీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి, మరో అంశంపై వాకౌట్ చేశారు. -
బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ వైఖరిని వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలన్నీ సమైక్యఫ్రంట్‌గా ఏర్పడాలని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాలను విడిచిపెట్టి దేశాన్ని రక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో డీఎంకేతో మైత్రి మాదిరిగానే దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సూత్రప్రాయమైన మైత్రిని ఏర్పర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఎంకే స్టాలిన్ పీటీఐకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారతదేశం భిన్నత్వాన్ని, సమాఖ్య విధానం, లౌకికత, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం, రాష్ట్రాల హక్కులు, విద్యారంగ హక్కులను పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాన్ని పక్కనబెట్టి ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి’అని ఆయన అన్నారు. బీజేపీ పట్ల తమది వ్యక్తిగత ద్వేషం కాదన్నారు. అంశాల ప్రాతిపదికగానే బీజేపీ విధానాలను తాము విమర్శిస్తున్నామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో డీఎంకే ఎప్పుడూ కీలకభూమిక పోషిస్తూనే ఉందన్నారు. పార్లమెంట్లో డీఎంకే మూడో అతిపెద్ద పార్టీ అని చెప్పారు. ‘రాష్ట్రాల రాజకీయాలన్నీ కలిస్తేనే జాతీయ రాజకీయాలు. అంతే తప్ప, జాతీయ, రాష్ట్ర రాజకీయం అంటూ వేర్వేరుగా ఉండవు’అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలహీనంగా మారినందున బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉండా లంటూ వస్తున్న వాదనపై ఆయన స్పందిస్తూ.. ఈ విధానం కొన్ని రాష్ట్రాల్లో సరైంది కావచ్చు. కానీ, చాలా రాష్ట్రాల విషయంలో ఈ వైఖరి సరిపోదు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలి. మా రాష్ట్రంలో బీజేపీతో విభేదించే పార్టీలతో కూటమిగా ఏర్పడి, లౌకిక శక్తులను ఏకం చేశాం. కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇదే మైత్రితో వ్యవహరించాలని స్టాలిన్ అన్నారు -
రెబల్స్‌పై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆగ్రహం
‘‘పార్టీ నిర్ణయమే శిరోధార్యం కావాలి.. కాదు.. కూడదంటే వేటు తప్పదు. మిత్రపక్ష పార్టీలకు కేటాయించిన స్థానాల్లో డీఎంకే రెబల్స్ పోటీ చేయడం తగదు. వెంటనే పట్టణ పంచాయతీ అధ్యక్ష, మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు రాజీనామా చేసి నాతో భేటీ అవ్వండి లేకుంటే తగిన మూల్యం తప్పదు..’’ అని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై: డీఎంకే కూటమి కట్టుబాట్లను అతిక్రమించి, పార్టీ అదేశాలను ధిక్కరించి కొందరు నాయకులు పదవులు చేజిక్కించుకోవడాన్ని సహించేది లేదని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. రెబల్స్ అంతా తమ పదవులకు వెంటనే రాజీనామా సమర్పించి ఆ తరువాత తనను కలవాలని హుకుం జారీ చేశారు. కూటమి నేతల నిరసన డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్పొరేషన్, మునిసిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల పదవులకు శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడు డీఎంకే అధిష్టానం నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు ధిక్కరించారు. రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగి.. పదవులను కైవసం చేసుకున్నారు. మునిసిపాలిటీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులకు సంబంధించి 16 స్థానాలను మిత్రపక్ష వీసీకేకు డీఎంకే కేటాయించింది. అయితే ఏడు స్థానాల్లో డీఎంకే రెబల్స్ పోటీచేసి ఆ పదవులను దక్కించుకున్నారు. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక వీసీకే అధ్యక్షుడు తిరుమాంళవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ బహిరంగంగానే నిరసన తెలిపారు. కూటమి పా ర్టీలకు కేటాయించిన పదవుల్లో డీఎంకే కౌన్సిలర్లు పోటీ చేసి పీఠం దక్కించుకోవడంపై తీవ్రస్థాయిలో మండిపడిన స్టాలిన్ చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతలతో శుక్రవారం సాయంత్రం çసమావేశమయ్యారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి పదవులు పొందిన డీఎంకే కౌన్సిలర్లు వెంటనే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకరిద్దరు ఈ ఆదేశాలకు తలొగ్గి రాజీనామా చేసినా.. అధికశాతం మంది ఆలోచనలో పడ్డారు. రాజీనామా చేయకుండానే స్టాలిన్‌ను కలిసి నచ్చజెప్పాలని, తప్పనిసరైన పక్షంలోనే రాజీనామా చేయాలని వారు భావిస్తున్నారు. చెన్నైలో కమిటీల ఎన్నికకు సన్నాహాలు చెన్నై మేయర్‌గా ఆర్. ప్రియ, డిప్యూటీ మేయర్‌గా మహేష్‌కుమార్ ఎన్నిక పూర్తయ్యింది. చెన్నై కార్పొరేషన్‌లోని 200 వార్డుల్లో 80 లక్షల మంది నివసిస్తున్నారు. వీరికి తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం తదితర ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు గాను 15 మండల కమిటీలు, ఆరు స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే వీటికి అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పదవులకు గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉండటంతో అన్ని కమిటీలనూ ఏకగ్రీవం చేయాలని డీఎంకే భావిస్తోంది. -
ప్రధాని మోదీ గుప్పిట్లో వ్యవస్థలు: రాహుల్ గాంధీ
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పలు వ్యవస్థలను శాసిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ‘మీలో ఒకడిని’ పేరిట తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రచించిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకాన్ని సోమవారం చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రాల సమాఖ్య భారత్ అని, ఈ సమైక్యతను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు. దేశ, రాష్ట్రాల చరిత్రలు తెలుసుకోకుండా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రధాని సిద్ధపడుతున్నారని విమర్శించారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని అన్నారు. ‘అందరికీ అన్నీ’ అనేది ద్రవిడ సిద్ధాంతమని, ఈ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తం చేసేందుకు జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ పాల్గొన్నారు. -
నేనూ తమిళ బిడ్డనే..! ఈ భూమిలో మా రక్తం కలిసి ఉంది..
సాక్షి , చెన్నై: ‘నేను తమిళ బిడ్డనే, మా రక్తం ఈ భూమిలో కలిసి ఉంది’.. అని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ‘మీలో ఒకడిని’ పేరుతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రచించిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం చెన్నై నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్లో సోమవారం మధ్యాహ్నం జరిగింది. రాహుల్‌గాంధీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ‘‘ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో తమిళనాడు గురించే ఎక్కువ సేపు మాట్లాడి నేనూ తమిళుడనని చాటుకున్నాను. ఎందుకంటే నా తండ్రి రాజీవ్ గాంధీ రక్తం ఈ భూమిలో కలిసి పోయింది. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయం, నాగరికతను గౌరవిస్తూ తమిళనాడుకు వచ్చాను. అందుకే తమిళ పౌరుడనని చెప్పుకునేందుకు నాకు అర్హత ఉంది. ప్రధాని మోదీ తమిళనాడుకు వచ్చినప్పుడు తన భావాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారు. మూడు వేల ఏళ్ల చారిత్రాత్మక నేపథ్యం కలిగిన తమిళనాడుపై ఎవ్వరూ ఆధిపత్యం చెలాయించ లేరు. దేశం, రాష్ట్రాల చరిత్రను తెలుసుకోకుండా ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రధాని సిద్ధపడుతున్నారు. స్టాలిన్ స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో రాహుల్ గాంధీ, పినరయి విజయన్, ఒమర్ అబ్దుల్లా తదితరులు ప్రేమాభిమానాలతో ఏదైనా సాధించుకోవచ్చు, పెత్తనంతో కాదు.. తమిళనాడు ప్రజల కోసం ఎన్నో సుధీర్ఘ పోరాటాలను సాగించి స్టాలిన్ ఈ దశకు చేరుకున్నారు. ఆయన జీవిత చరిత్రను ఆవిష్కరించడానికి ఈ ఒక్క పుస్తకం సరిపోదు. మరిన్ని సంపుటికలు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిత్య యవ్వనులుగా ఎలా ఉండగలుగుతున్నారో వివరించేలా ఒక పుస్తకం తీసుకురావాల్సి ఉంది’’ అని ఆయన చమత్కరించారు. "உங்களில் ஒருவன் - 1" நூல் வெளியீட்டு விழா நேரலை: https://t.co/nvzFrdlCYv — M.K.Stalin (@mkstalin) February 28, 2022 ఒకతల్లి బిడ్డల్లా.. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాట్లాడు తూ, తమిళనాడు, కేరళ ప్రజలు ఒక తల్లి బిడ్డల వంటి వారని అభివర్ణించారు. ప్రస్తుతం దేశంలో సెక్యు లరిజం, ప్రజ్వాస్వామ్యం ఖూనీ అవుతోందని, కేంద్రం విభజించి పాలిస్తోందని ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను, సహజ సిద్ధంగా సంక్రమించిన హక్కులను కాలరాస్తోందన్నారు. వీటి పరిరక్షణ కోసం సమష్టిగా పోరాడక తప్పదని చెప్పారు. బిహార్ ప్రతి పక్షనేత తేజస్వీయాదవ్ మాట్లాడుతూ, ప్రజలతో ఎలా మమేకం కావాలి, సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో స్టాలిన్ తన పుస్తకంలో స్పష్టం చేశారని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక రిజర్వేషన్ల అమలులో తమిళనాడు ప్రభుత్వం ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని అభిప్రాయపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న సిద్ధాంతాల ను బిహార్‌లో కూడా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టు కున్నట్లు తెలిపారు. స్టాలిన్ రచించిన ఈ పుస్తకం అతని రాజకీయ దూరదృష్టిని చాటిచెప్పిందని కొనియాడారు. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రసంగిస్తూ, స్టాలిన్ జీవిత చరిత్ర పుస్తకంలో ఎలాంటి అభూతకల్పనా లేదన్నారు. తమిళ ప్రజల మనోభావాలు బాగా తెలిసిన స్టాలిన్ తొమ్మిది నెలల తన పాలనలో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. నా జీవిత పోరాటాలను.. చివరగా సీఎం స్టాలిన్ అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ నా తండ్రి కరుణానిధిలా మాట్లాడలేను, రాయలేను. కానీ ఆయన శైలిని దగ్గర నుంచి గమనించిన వ్యక్తిగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఒక సీఎంగా కాదు. ఎప్పటికీ ప్రజల్లోని మనిషినే అని మరో సారి చాటేందుకే ఆ పుస్తకానికి మీలో ఒకరిని అనే పేరు పెట్టాను. 1953 నుంచి 1976 వరకు 23 ఏళ్ల పాటు నా జీవిత పోరాటాలను ఇందులో ప్రస్తావించాను. ప్రతి వ్యక్తికీ యవ్వన దశ ఎంతో ముఖ్యమైంది. ఆ సమయంలోనే తన జీవన లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. అయితే, నేను ఆ సమయంలో జైలు జీవితం గడిపాను. నా లక్ష్య సాధనకు ఎలాంటి సాహసాలు చేయలేదు, ఆ అవసరం రాలేదు. గోపాలపురం ఇల్లే అన్నీ తానై నా జీవితాన్ని నడిపించింది. నా తండ్రి కరుణానిధి కూర్చున్న సీఎం కుర్చీలో కూర్చుంటానని ఏనాడూ అనుకోలేదు’’ అని చెప్పారు. డీఎంకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిత్రపక్షాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నటుడు సత్యరాజ్ స్టాలిన్ పుస్తకంలోని ముఖ్యాంశాలను వివరించారు. 12 రోజుల పాటూ జన్మదిన వేడుకలు సీఎం స్టాలిన్ జన్మదినాన్ని మార్చి 1వ తేదీన కోలాహలంగా జరుపుకోవడం పార్టీ శ్రేణులకు అలవాటు. అయితే ఈ ఏడాది స్టాలిన్ తొలిసారిగా సీఎం హోదాను చేరుకోవడంతో 12 రోజులపాటూ వేడుకలు నిర్వహించనున్నారు. మార్చి 1, 3, 5, 7,9, 11, 13, 17, 19, 21, 23 తేదీల్లో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు డీఎంకేతోపాటూ మిత్రపక్ష కాంగ్రెస్, వామపక్షాల నేతలు ఈ మేరకు హాజరుకానున్నారు. కాంగ్రెస్ నేతలతో రాహుల్ భేటీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్న రాహుల్‌గాంధీకి విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పుస్తకావిష్కరణ ముగిసిన తరువాత చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి పుర పాలక ఎన్నికల్లో గెలుపొందిన వారితో సమావేమై అభినందించారు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో చెన్నై నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణమయ్యా రు. రాహుల్ రాక సందర్భంగా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
స్టాలిన్, కేసీఆర్‌లకు మమతా ఫోన్‌కాల్
కోల్ కత్తా : దేశ రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు బీజం పడుతున్న సంకేతాలు మరోసారి స్పష్టంగా బయటకు వచ్చాయి. అయితే, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా కూటమి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనతో మాట్లాడినట్టు ట్విట్టర్ వేదికగా సీఎం స్టాలిన్ తెలిపారు. దేశంలోని బీజేపీయేతర సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాల్లో గవర్నర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఈనెల 12న జరిగిన నాలుగు మున్సిపల్సంస్థల ఎన్నికల్లో అధికార తృణముల్ పార్టీ(టీఎంసీ) భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ రాజ్యాంగాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీతో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకీ సంబంధాలేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆలోచన లేకుండా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. తన ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. దేశ సమైక్య విధానాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్లనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగానే తమిళనాడు సీఎంతో తాను మాట్లాడినట్టు మమత వెల్లడించారు. దేశ ప్రయోజనాల కోసం తమతో చేతులు కలపాలని సీపీఎంను అడిగినట్టు పేర్కొన్నారు. అయితే తనకు ఎవరిపై వ్యక్తిగతంగా ద్వేషం లేదని అన్నారు. ఇదే క్రమంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయకపోవడంపై మమత స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను బలహీన పరచరాదనే ఉద్దేశ్యంతోనే అక్కడ పోటీ చేయలేదని చెప్పారు. ఈసారి ఎస్పీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మమత బెనర్జీ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని మమతా వెల్లడించారు. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్తామని మమత స్పష్టం చేశారు. -
స్టాలిన్‌తో కేసీఆర్ భేటీకి ప్రాధాన్యత
సాక్షి, చెన్నై/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌తో చెన్నైలో భేటీకానున్నారు. కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండటం.. రైతులు, వ్యవసాయ అంశాలపై దేశవ్యాప్త పోరాటం చేస్తామని ఇటీవల కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో బీజేపీని వ్యతిరేకించే ఇతర బలమైన రాజకీయ పార్టీలను కూడగట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారా? అందులో భాగంగానే స్టాలిన్‌తో భేటీ అవుతున్నారా? అన్న చర్చ మొదలైంది. ఇటు సీఎం పర్యటన.. అటు పల్లా వ్యాఖ్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. గత నెల 18న సీఎం కేసీఆర్ స్వయంగా ధర్నా కూర్చున్నారు. తర్వాత వరుసగా ప్రెస్మీట్లు పెట్టి బీజేపీపై, కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అవసరమైతే ఢిల్లీలో కూడా నిరసనకు దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో జట్టుకట్టాలనే యోచనలో ఉన్నారని, అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లడం.. ఇదే సమయంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, బీజేపీని గద్దె దించాలని కోరుకుంటున్న శక్తులను కేసీఆర్ కలుస్తారని ప్రకటించడం.. చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు అవసరమని కేసీఆర్ ప్రకటించారు. బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిలతో వరుస భేటీలు జరిపారు. అప్పట్లో పలు కారణాలతో వెనక్కితగ్గిన కేసీఆర్.. ప్రస్తుతం మళ్లీ ఆ ప్రతిపాదనను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రంగనాథ స్వామిని దర్శించుకుని.. సీఎం కేసీఆర్ సోమవారం కుటుంబసమేతంగా తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు ఉదయమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. తమిళనాడులోని తిరుచ్చికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ఆలయ పండితులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర మంత్రి అరుణ్ నెహ్రూ, అధికారులు కేసీఆర్ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేసీఆర్, ఆయన భార్య శోభతోపాటు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాంశు, మనవరాలు అలేఖ్య, ఎంపీ సంతోష్‌కుమార్ తదితరులు రంగనాథస్వామిని దర్శించుకున్నారు. తర్వాత సీఎం కేసీఆర్ ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ఆలయ నిర్వహణ చాలా బాగుందని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నట్టు ప్రకటించారు. అనంతరం చెన్నైకి చేరుకుని రాత్రికి అక్కడే ఓ హోటల్లో బస చేశారు. యాదాద్రి పునః ప్రారంభానికి ఆహ్వానం యాదాద్రి ఆలయ పునః ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్ కోరనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిగే భేటీలో దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. గత నెల 18న సీఎం కేసీఆర్ స్వయంగా ధర్నా కూర్చున్నారు. తర్వాత వరుసగా ప్రెస్మీట్లు పెట్టి బీజేపీపై, కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అవసరమైతే ఢిల్లీలో కూడా నిరసనకు దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో జట్టుకట్టాలనే యోచనలో ఉన్నారని, అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లడం.. ఇదే సమయంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, బీజేపీని గద్దె దించాలని కోరుకుంటున్న శక్తులను కేసీఆర్ కలుస్తారని ప్రకటించడం.. చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యా మ్నాయ రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు అవసరమని కేసీఆర్ ప్రకటించారు. బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిలతో వరుస భేటీలు జరిపారు. అప్పట్లో పలు కారణాలతో వెనక్కితగ్గిన కేసీఆర్.. ప్రస్తుతం మళ్లీ ఆ ప్రతిపాదనను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రంగనాథ స్వామిని దర్శించుకుని.. సీఎం కేసీఆర్ సోమవారం కుటుంబసమేతంగా తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు ఉదయమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. తమిళనాడులోని తిరుచ్చికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ఆలయ పండితులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర మంత్రి అరుణ్ నెహ్రూ, అధికారులు కేసీఆర్ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేసీఆర్, ఆయన భార్య శోభతోపాటు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య, ఎంపీ సంతోష్‌కుమార్ తదితరులు రంగనాథస్వామిని దర్శించుకున్నారు. తర్వాత సీఎం కేసీఆర్ ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ఆలయ నిర్వహణ చాలా బాగుందని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నట్టు ప్రకటించారు. అనంతరం చెన్నైకి చేరుకుని రాత్రికి అక్కడే ఓ హోటల్లో బస చేశారు. యాదాద్రి పునః ప్రారంభానికి ఆహ్వానం యాదాద్రి ఆలయ పునఃప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజు ల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్ కోరనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిగే భేటీలో దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశముంది. -
పండుగ వేళ జర భద్రం
సాక్షి, చెన్నై(తమిళనాడు): పండుగల సీజన్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ హెచ్చరించారు. రాష్ట్రంలో థర్డ్ వేవ్‌కు ఆస్కారం ఉండదు..రాదు...అనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇక, శనివారం రాష్ట్రంలో 50 వేల శిబిరాల్లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ పకడ్బందీగా నిర్వహించారు. కరోనా నియంత్రణ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి ఆదివారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు విడుదలు ఈ శిబిరాలు విజయవంతం అయ్యాయి. నాలుగున్నర కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. మరో కోటి మంది తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంది. అయితే, ఆదివారం శిబిరాల ఏర్పాటు కారణంగా మందుబాబులు, మాంసం ప్రియులు టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదన్న విషయం పరిశీలనలో తేలింది. దీంతో ఈసారి మెగా శిబిరం శనివారానికి మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రపథమంగా 50 వేల శిబిరాల్ని ఏర్పాటు చేశారు 60 లక్షల మేరకు డోస్‌ల టీకాను సిద్ధంగా ఉంచారు. అయితే, ఆశించిన మేరకు ఈసారి ఈ డ్రైవ్‌కు స్పందన రాలేదు. 15 లక్షల మంది మేరకు టీకా వేయించుకున్నారు. సీఎం పరిశీలన, సమీక్ష కన్నగి నగర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ శిబిరాన్ని సీఎం ఎంకే స్టాలిన్ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడా రు. వారి సమస్యల్ని తెలుసుకున్నారు. అలాగే, అక్కడ వెళ్తున్న నగర రవాణా సంస్థ బస్సుల్లో ఆకస్మికంగా ఎక్కి.. మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత బస్సు సేవల గురించి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా పలువురు మహిళలు కొన్ని సమస్యలు, సూచనలు ఇచ్చారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న సీఎం స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. పండుగ సీజన్ వేళ కరోనా ఆంక్షల సడలింపు, ఈనెల 31తో ముగియనున్న ఆంక్షలు, కొనసాగింపు గురించి సమీక్షించారు. అంగన్వాడీలు, నర్సరీ పాఠశాలలు నవంబర్ 1వ తేదీ నుంచి తెరవాలనే విషయాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించారు. షిఫ్ట్‌ల వారీగా తరగతులు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు నవంబర్ 1వ తేదీ నుంచి షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కరోనా ఆంక్షలను నవంబర్ 15వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. క్రీడల, స్విమ్మింగ్ తదితర పోటీల నిర్వహణకు, థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులకు అనుమతి కల్పించారు. అయితే, రాజకీయ కార్యక్రమాలు, ఆలయ ఉత్సావలకు గతంలో విధించిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక చెన్నైలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించినానంతరం ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, పండుగ సీజన్లో జనం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలు దేశాల్లో థర్డ్ వేవ్ విజృంభిస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం పండుగ సీజన్ ఆందోళన కల్గిస్తోందని, టీకా వేసుకోని వాళ్లు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు. ఇంకా కోటి మందికి తొలి డోస్ వేసుకోవాల్సి ఉందని, మరో 57 లక్షల మంది రెండో డోస్ వేసుకోవాల్సి ఉందని వివరించారు. వీరంతా టీకా వేయించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అరియలూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించినానంతరం మీడియాతో ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్మాట్లాడుతూ, విద్యార్థులకు చదువులు కుంటు పడకుండా ఉండేందుకే.. పాఠశాలల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత దాని ధర డబుల్ .. -
తమిళనాడు: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాక్షి, చెన్నై: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆయా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలకు ప్రసూతి సెలవుల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను ఏడాడి కాలం పాటు పొడగిస్తున్నట్లు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ శుక్రవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా ప్రభుత్వం ఉద్యోగలు 9 నెలల ప్రసూతి సెలవులు పొందుతున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో మహిళా ఉద్యోగులు ఏడాది పాటు ప్రసూతి సెలువులు పొందనున్నారు. డీఎంకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో హామీల్లో ప్రసూతి సెలవుల పెంపు ఒకటని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రసూతి సెలవుల పెంపుతో.. తల్లుల ఆర్యోగం మెరుగుపడుతుందని, మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లి పాలు సమృద్ధిగా అందుతాయని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం మాతా, శిశువులకు ఉచిత వ్యాక్సినేషన్, పోషకాహారం అందిస్తోంది. కానీ, చాలా మంది తల్లులకు సరైన సమయం లభించకపోవటంతో వారి ఆరోగ్యం, శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతున్నారని అధికారులు తెలిపారు. పొడగించిన ప్రసూతి సెలవులతో మాతా, శిశువుల ఆరోగ్యం విషయంలో మంచి ఫలితాలుంటాయని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం ఎం.కే స్టాలిన్.. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. -
ఢిల్లీ చేరనున్న ‘డ్యాం’ పంచాయితీ..!
సాక్షి, చెన్నై: కావేరి తీరంలోని మేఘదాతు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మాణ తలపెట్టిన డ్యాం వ్యవహారం ఢిల్లీకి చేరనుంది. అనుమతులు ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి దురై మురుగన్ ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. డ్యాం నిర్మాణ ప్రయత్నాలను వీడాలని కర్ణాటక సీఎం యడ్యూరప్పకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం లేఖ రాశారు. డ్యాం నిర్మాణానికి అడ్డుచొప్పొద్దని కోరుతూ సీఎం స్టాలిన్‌కు కర్ణాటక సీఎం యడ్యూరప్ప శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. డ్యాం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ పాలకులు కర్ణాటకలోని తమ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించబోతున్న సంకేతాలతో ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను కలిసి డ్యాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వ కూడదని ఒత్తిడి తెచ్చేందుకు నీటి పారుదల శాఖ మంత్రి దురై మురుగన్ నేతృత్వంలోని బృందం సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది. మంగళవారం ఈ బృందం కేంద్ర మంత్రితో భేటీ కానుంది. కావేరి జల వివాదం, డ్యాం నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని పట్టుబట్టడమే కాకుండా, మార్కండేయ నదిలో కర్ణాటక నిర్మించిన ఆనకట్ట తదితర అంశాల గురించి చర్చించనున్నారు. అలాగే సీఎం స్టాలిన్ తరఫున కేంద్ర మంత్రికి లేఖ సమరి్పంచనున్నారు. యడ్డీకి లేఖాస్త్రం తనకు యడ్యూరప్ప రాసిన లేఖకు సమాధానంగా సీఎం స్టాలిన్ ఆదివారం లేఖాస్త్రం సంధించారు. అందులో కావేరి జల వివాదం, కోర్టు తీర్పు, నీటి పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో సాగుతున్న కావేరి పథకాలను గుర్తు చేస్తూ, ఈ పథకాల కారణంగా తమ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. అయితే కర్ణాటకలోని మేఘదాతులో నిర్మించతలపెట్టిన డ్యాం కారణంగా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్ప మేరకు సరిహద్దులోకి నీళ్లు సక్రమంగా వచ్చి చేరాల్సి ఉందన్నారు. తమిళ రైతులకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేయ వద్దని కోరారు. బెంగళూరుకు నీటి అవసరాల పేరిట ఈ డ్యాం నిర్మాణాలు సాగడం లేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల మెరుగు, కొనసాగింపు లక్ష్యంగా ఈ డ్యాం నిర్మాణ ప్రయత్నాన్ని వీడాలని కోరారు. ఇదిలా ఉండగా మార్కండేయ నదిపై ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం కృష్ణగిరిలో రైతులు నిరసన తెలపనున్నారు. -
సీఎం స్టాలిన్ సైక్లింగ్: ఈసీఆర్‌లో 20 కి.మీ ప్రయాణం
సాక్షి, చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ఈసీఆర్ మార్గంలో సైకిల్‌పై దూసుకెళ్లారు. ముట్టుకాడు నుంచి మహాబలిపురం వరకు 20 కి.మీ దూరం సైకిల్ తొక్కుతూ, మార్గ మధ్యలో ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు. సీఎం స్టాలిన్ వ్యాయామం, సైక్లింగ్, వాకింగ్ చేస్తుంటారు. ప్రతి ఆదివారం ఈసీఆర్ మార్గంలో సైక్లింగ్ చేసేవారు. సీఎం అయినా ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తల్లో మార్పు లేదని చాటుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు వచ్చిన ఓ ఆదివారం సైకిల్‌పై స్టాలిన్ దూసుకెళ్లారు. ఆ తర్వాత అధికారంలోకి రావడం, కరోనా కట్టడికి విస్తృతంగా సేవల్ని అందించడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కరోనా కట్టడికి వచ్చిన నేపథ్యంలో మళ్లీ సైకిల్ పయనంపై దృష్టి పెట్టారు. మార్గ మధ్యలో సెల్ఫీలు ఇది వరకు ఎలాంటి భద్రత లేకుండా ఒకరిద్దరితో కలిసి సైకిల్‌పై స్టాలిన్ వెళ్లేవారు. సీఎం కావడంతో భద్రతా పరంగా చర్యలు తప్పలేదు. ఎక్కడా ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈసీఆర్ మార్గంలో సైక్లింగ్ చేశారు. ఉదయాన్నే 15 మందితో కలిసి స్టాలిన్ ముట్టకాడు చేరుకున్నారు. అక్కడ రోడ్డుపక్కన ఉన్న ఓ దుకాణంలో తేనీరు సేవించి సైకిల్‌పై మహాబలిపురం వైపుగా 20 కి.మీ దూరం ప్రయాణించారు. సైకిళ్లు ముందుకు సాగుతుంటే, వెనుక ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు కదిలాయి. మార్గ మధ్యలో అక్కడక్కడ ప్రజలను స్టాలిన్ పలకరించారు. సెల్ఫీలు దిగారు. మహాబలిపురం వద్దకు చేరుకుని అక్కడి ఓ హోటల్లో తేనీరు సేవించి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. -
సీఎం స్టాలిన్ ఉద్వేగం: ‘నాన్నకు ప్రేమతో..’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘‘మీకు ఇచ్చిన హామీని నెరవేర్చానని సగర్వంగా తలెత్తుకుని తెలియజేసేందుకు మీ వద్దకు (చెన్నై మెరీనా బీచ్‌లోని కరుణ సమాధి) వస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. తన తండ్రి కరుణానిధి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ‘తలై నిమిర్దిందు వరుగిరేన్’ (తలెత్తుకుని వస్తున్నాను) పేరున ఉద్వేగపూరితమైన వీడియో ను గురువారం విడుదల చేశారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘తిరువారూరులో ఉద్భవించి తమిళనాడునే తన సొంతూరుగా మార్చుకుని, నేతలకే నేతగా, ముఖ్యమంత్రులకే ముఖ్యమంత్రి కలైంజ్ఞర్. జూన్ 3వ తేదీ మీ జయంతి మాత్రమే కాదు, మీరు ప్రాణప్రదంగా ప్రేమించే కోట్లాది ప్రజలందరినీ ఉత్తేజితులను చేసేరోజు. ఈ రోడ్డులో ఒకరోజు నేను చేసిన ప్రతిజ్ఞను సహచరుల సహకారంతో నెరవేర్చి చూపాను. ఈ విషయాన్ని సగర్వంగా చాటుకునేందుకు మీ వద్దకు వస్తున్నాను. మీరు మరణించలేదు, పైనుంచి నన్ను గమనిస్తున్నారని, ఇంకా గమనిస్తూనే ఉంటారని భావిస్తున్నాను. జార్జికోట (చెన్నై సచివాలయం)ను అధిరోహించిన నాటి నుంచే కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి పారదోలేందుకు పాటుపడుతున్నాము. పాటుపడాలి, సాధించాలని అనేలా నన్ను తీర్చిదిద్దారు. మీరు చెప్పిన ఆ మాటలకు అద్దంపట్టేలా నడుచుకుంటున్నాను. ‘ఎవరైతే నిన్ను ప్రశంసించడం లేదు, వారిచేత ప్రశంసలు పొందేలా నడుచుకోవాలి’ అంటూ చెప్పిన మాటలు గుర్తున్నాయి. మీ మాటలే నాకు శాసనం. మీ జీవితం నాకు పాఠం. మీ వారసుడిగా విజయపూరితమైన సమాచారంతో మీ వద్దకు వస్తున్నాను. శుభాకాంక్షలు అని దీవించండి మహా నాయకుడా’ అని వీడియో సందేశం ద్వారా తన తండ్రికి స్టాలిన్ నివాళులర్పించారు. చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత -
కరోనా: తమిళనాడుకు మేఘా సహాయం
దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వాలకు సహాయసహకారాలు అందిస్తున్న విధంగానే హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ. తాజాగా తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను, బెడ్స్‌ను, ఆస్పత్రులకు వివిధ మౌళిక సదుపాయాలను కల్పించిన ఎంఈఐఎల్, తమిళనాడు వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం ఉచితంగా ఆస్పత్రులలో ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. మేఘా ఇంజనీరింగ్ తో పాటు తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సంస్థ ఇందులో భాగస్తులయ్యాయి. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యావేక్షిస్తున్నారు. చెన్నైలో 1070 ఆక్సిజన్ బెడ్లు గ్రేటర్ చెన్నై పరిధిలోని ఆసుపత్రులలో 1070 ఆక్సిజన్ బెడ్ల ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ యుద్ధపాత్రిపదికన పనులు చేస్తోంది. వీటితో పాటు ఇరోడ్ జిల్లాలో 200, వెల్లూరు 250, అంబూరు 100, నట్టారం వళ్లి 100, మెలిశ్వరం 100, అయ్యపాకం 200, శోలింగార్ 50, వనియంబాడిలో 100, వల్లఝాలో 100 ఆక్సిజన్ పడకల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 660 బెడ్లను సిద్ధం చేసిన ఎంఈఐఎల్ రాబోయే రోజుల్లో 2500 బెడ్ల ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఐఎల్) తనవంతు సహాయంగా తమిళనాడుకు ఆక్సిజన్ బెడ్లను అందిస్తోంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. మేఘాకు సేవల్లో పాలు భాగస్తులైన క్రెడాయ్, జి రియల్టర్స్ మధురై ప్రభుత్వ ఆసుపత్రి (తోప్పూర్ జిహెచ్) లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ 500 స్కేలబుల్ ఆక్సిజనేటెడ్ బెడ్ సౌకర్యాలను మే 21 ప్రారంభించారు. ఇందులో 200 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 300 పడకలు త్వరలో ప్రజల ఉపయోగం కోసం అందుబాటులో ఉంచనున్నారు. మేఘా సంస్థ చొరవతో ప్రజలకు ఉచిత చికిత్సను అందిస్తున్నారు. జి స్క్వేర్ రియల్టర్స్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, క్రెడాయి మదురై జిహెచ్ వద్ద 72 గంటల రికార్డు సమయంలో 500 ఆక్సిజన్ బెడ్ సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. జి స్క్వేర్ రియల్టర్ తో కలిసి మేఘా ఇంజనీరింగ్ సంస్థ చెన్నై అన్నా నగర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఒమాండురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కొక్కటి 100 ఆక్సిజనేటెడ్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా యాజమాన్యం కృషి చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమయ్యింది. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని ఎంఈఐఎల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కోవిడ్ రోగులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. క్రెడాయ్ తమిళనాడు అధ్యక్షుడు సురేష్ కృష్ణ మాట్లాడుతూ, “సిఎస్ఆర్ పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, లైఫ్ స్టైల్ (చెన్నై), ఒలింపియా, టిఎన్ ఇస్పాట్ పరిషత్ లిమిటెడ్, తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం వంటి అనేక సంస్థలు తమిళనాడు ప్రజల కోసం ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కేవలం 72 గంటల తక్కువ వ్యవధిలో మేఘా సంస్థ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది” జి స్క్వేర్ రియల్టర్స్ ప్రమోటర్ బాలా మాట్లాడుతూ, “మానవ జీవితం కంటే మరేమీ ముఖ్యమైనది కాదు. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) - జి స్క్వేర్ సంస్థలు కలిసి ప్రభుత్వానికి అండగా నిలబడడం గర్వంగా ఉందన్నారు. ఈ ఆసుపత్రులను తమిళనాడు అంతటా ఏర్పాటు చేయడానికి గౌరవ ఆరోగ్య మంత్రి, తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి తమ పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయన్నారు” బాధ్యతగా కోవిడ్ బాధితులను ఆదుకుంటున్నాం: బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేసి గుర్తింపు పొందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ సంస్థ కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు వచ్చిందని ఆ సంస్థ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ర్టంలో 2500 పడకల ఆక్సిజన్ బెడ్ల ఆసుపత్రులను యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేస్తున్నామన్నారు. మదురైలో కేవలం 72 గంటల్లోనే 200 పడకల ఆక్సిజన్ బెడ్స్ ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి 200 పి.ఎస్.ఏ ప్లాంట్లు ఏర్పాటు చర్యలు ప్రారంభించినట్లు బి.శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. అలాగే క్రయోజనిక్ ట్యాంకుల తయారీ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకు డిఆర్డీవో, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. తొలిసారిగా తెలంగాణకు థాయిలాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసి ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. చదవండి: జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ -
Tamil Nadu: ‘ఆ ఏడుగురి విడుదలకు వ్యతిరేకం’
సాక్షి ప్రతినిధి, చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడం తమకు ఎంత మాత్రం ఆ మోదం కాదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి తెలిపారు. నేరస్తులకు శిక్ష వేయడం న్యాయస్థానాల పరిధిలోని వ్యవహారమని, ఇందులో రాజకీయ జోక్యం, వత్తిళ్లు తగదని పేర్కొన్నారు. జైళ్లలో ఏడుగురే కాదు.. వందమందికి పైగా తమిళులు ఉన్నారని వ్యాఖ్యానించారు. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలని కోరుతూ 2018లో రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతికి ఈనెల 20వ తేదీన లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజీవ్‌గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం చెన్నై సైదాపేటలోని ఆయన నిలువెత్తు విగ్రహానికి టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తదితర కాంగ్రెస్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతికి రాసిన లేఖపై స్పందించారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 21వ శతాబ్దాన్ని పురస్కరించుకుని అనేక పథకాలు అమలుచేశారని తెలిపారు. అవి యువతకు ఎంతో ఉపకరించాయన్నారు. సమాచార వ్యవస్థ సైతం కొంతపుంతలు తొక్కిందని పేర్కొన్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయంటే రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమని వివరించారు. పారిశ్రామిక రంగాన్ని సైతం పరుగులు పెట్టించి తమిళుల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. అలాంటి నేతను హత్య చేసిన ఏడుగురు తమిళ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడం తమకు సమ్మతం కాదన్నారు. రాష్ట్రంలోని జైళ్లలో వంద మందికి పైగా తమిళ ఖైదీలు 20 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. తమిళులు అనే భావనతో ఏడుగురిని మాత్రమే విడుదల చేయాలని కోరడం సబబుకాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏడుగురు తమిళుల విడుదల అంశాన్ని డీఎంకే తన మేనిపెస్టోలో పొందుపరిచిందని, ఆ విషయౖమై డీఎంకేను కాంగ్రెస్ ఎలాంటి వత్తిడి చేయలేదని ఆయన వివరించారు. చదవండి: రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్ -
తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్: మే 10 నుంచి 24 వరకు
-
తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్: మే 10 నుంచి 24 వరకు
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా పలు రాష్ట్రాలు లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ విధిందిచిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాక్డౌన్ ఎల్లుండి( సోమవారం) నుంచి అమల్లో ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల మే 10 నుంచి 2వారాలపాటు లాక్డౌన్ కొనసాగనుంది. శుక్రవారం సీఎం స్టాలిన్ కలెక్టర్లతో కరోనాపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవటంతో ప్రభుత్వం లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10న ఉయదం 4 గంటల నుంచి మే 24 తేది ఉదయం 4 గంటల వరకు తమిళానాడులో పూర్తి లాక్డౌన్ కొనసాగనుంది. మధ్యాహ్నం 12వరకు అత్యవసర సేవలకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్లో బ్యాంకులు (50 శాతం సిబ్బందితో), రేషన్ షాపులకు అనుమతి ఉన్నట్లు తెలిపింది. రెస్టారెంట్లలో పార్సిల్ సౌకర్యం ఉంటుందని.. క్యాబ్‌లు, ఆటో సేవలు కేవలం ఆస్పత్రి, వివాహ, అంత్యక్రియకు మాత్రమే అనుమతిస్తున్నట్లు లాక్డౌన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!