తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తప్పుపట్టారు. డిసెంబర్ 19న జరిగిన విపక్షాల ‘ఇండియా కూటమి’ సమావేశంలో పాల్గొన్న సీఎం స్టాలిన్‌పై నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు.
ఇటీవల భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయిందని ఇటువంటి సమయంలో ప్రజల మధ్య ఉండాల్సింది పోయి.. సీఎం స్టాలిన్ ‘ఇండియా కూటమి’ హాజరుకావడం ఏంటని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షం, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సీఎం స్టాలిన్ ఎందుకు సానుకూలమైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేయడంపై తాజాగా కపిల్ సిబల్ నిర్మలా సీతారామన్‌పై మండిపడ్డారు. దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న దేశ అప్పులు, పోషకాహార లోపం ఉన్న పిల్లలు, ఆకలి, పేదరికం వంటి సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు. సీఎం స్టాలిన్‌పై విమర్శలకు చేయడానికి బదులు దేశంలో ఉన్న ఈ సమస్యలపై దృష్టి సారించాలని కపిల్ సిబాల్ కౌంటర్ ఇచ్చారు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గతేడాది మేలో కాంగ్రెస్‌ను వీడి సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికకైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment