Niramala Sitharaman
-
జులైలో కేంద్ర బడ్జెట్!
ఢిల్లీ: కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం జూలై మధ్యలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. 2024-25 బడ్జెట్ కోసం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ వివిధ శాఖల మంత్రులతో ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల సమావేశాలను జూన్ 17 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో కేంద్రం లేవలం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక.. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉంటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ మంత్రులను పార్లమెంట్‌కు పరిచయం చేయనున్నారు. -
ఉద్యోగులకు గుడ్ న్యూస్ 7 లక్షల వరకు No Tax
-
వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం
-
బడ్జెట్ 2024: మంత్రికి పెరుగు తినిపించిన రాష్ట్రపతి
మధ్యంతర బడ్జెట్ 2024-25 సమర్పణకు వెళ్లే ముందు భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పెరుగు తినిపించారు. 2024-25 ముందస్తు ఎన్నికల బడ్జెట్‌ను సమర్పించే ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రి పార్లమెంటుకు వెళ్లే ముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పించేందుకు అనుమతి తీసుకుంటారు. అందులో భాగంగానే మంత్రి రాష్ట్రపతిని కలిశారు. ముర్ము నిర్మలమ్మకు పెరుగు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. -
నిర్మలా సీతారామన్‌కు కపిల్ సిబల్ కౌంటర్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తప్పుపట్టారు. డిసెంబర్ 19న జరిగిన విపక్షాల ‘ఇండియా కూటమి’ సమావేశంలో పాల్గొన్న సీఎం స్టాలిన్‌పై నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయిందని ఇటువంటి సమయంలో ప్రజల మధ్య ఉండాల్సింది పోయి.. సీఎం స్టాలిన్ ‘ఇండియా కూటమి’ హాజరుకావడం ఏంటని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షం, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సీఎం స్టాలిన్ ఎందుకు సానుకూలమైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేయడంపై తాజాగా కపిల్ సిబల్ నిర్మలా సీతారామన్‌పై మండిపడ్డారు. దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న దేశ అప్పులు, పోషకాహార లోపం ఉన్న పిల్లలు, ఆకలి, పేదరికం వంటి సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు. సీఎం స్టాలిన్‌పై విమర్శలకు చేయడానికి బదులు దేశంలో ఉన్న ఈ సమస్యలపై దృష్టి సారించాలని కపిల్ సిబాల్ కౌంటర్ ఇచ్చారు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గతేడాది మేలో కాంగ్రెస్‌ను వీడి సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికకైన విషయం తెలిసిందే. చదవండి: వచ్చే ఎన్నికల్లో 50 శాతం ఓట్లు రావాలి: మోదీ -
అప్పులు కావవి విష ప్రచారం..ఇదీ నిజం!
సాక్షి, అమరావతి: అప్పులు అప్పులు అంటూ ఆంధ్రప్రదేశ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన వారికి కేంద్రం ప్రటించిన నివేదిక చెంపపెట్టుగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తమిళనాడు అత్యధిక రుణ బకాయిలున్న రాష్ట్రంగా నిలిచింది. 2022-23 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర (స్టేట్ డెవలప్మెంట్ లోన్- ఎస్డీఎల్) బకాయిలు రూ.7.54 లక్షల కోట్లుగా ఉండగా, దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అప్పు రూ.7.10 లక్షల కోట్లకు చేరుకుందని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా తెలిపారు. గడిచిన మూడు ఆర్ధిక సంవత్సరాల్లో (2020 -2023) అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలోనూ తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ కర్ణాటక, ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సంఖ్య రాష్ట్రం తీసుకున్న అప్పు 1 తమిళనాడు రూ.7.54 లక్షల కోట్లు 2 ఉత్తర ప్రదేశ్ రూ.7.10 లక్షల కోట్లు 3 మహారాష్ట్ర రూ.6.80 లక్షల కోట్లు 4 పశ్చిమ బెంగాల్ రూ.6.08 లక్షల కోట్లు 5 రాజస్థాన్ రూ.5.37 లక్షల కోట్లు 6 కర్ణాటక రూ.5.35 లక్షల కోట్లు రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన సమాధానం చూసైనా మారాలని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 2019 మార్చినాటికే రాష్ట్రానికి రూ.2,64,451 రుణభారం ఉండగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం 1,77,991 కోట్లేనని ఆయన వివరించారు. ఈ వాస్తవాలను విస్మరించి 10 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం చేయడం దుర్మార్గం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు విజయ సాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు. లోక్‌సభలో ఖమ్మం బీఆర్ఎస్ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు సీతారామన్. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లు అప్పు ఉంటే 2023 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లుగా ఉంది. రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన సమాధానం చూసైనా పరివర్తన తెచ్చుకోవాలి. 2019 మార్చినాటికే రాష్ట్రానికి రూ.2,64,451 రుణభారం ఉండగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం 1,77,991 కోట్లే. 10 లక్షల కోట్ల అప్పు… pic.twitter.com/t8pveEL21r — Vijayasai Reddy V (@VSReddy_MP) July 26, 2023 -
ఎడతెగని వర్షాలు: ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు మరో నెల పొడిగింపు?
ITR filing 2023: ఆదాయపన్ను చెల్లింపుదారులు పన్ను రిటర్ను (ఐటీఆర్) దాఖలుకు గడువు సమీపిస్తోంది. మరో తొమ్మిది రోజుల్లో అంటే జూలై 31 నాటికి ఈ గడువు ముగియనుంది. అలాగే డెడ్‌లైన్ ముగిసేలోపు, రిటర్న్స్ దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా ఇప్పటికే సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్‌ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని ఇటీవల స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఏడాది గడువు పెంపు ఉంటుందని చాలామంది ఆశిస్తున్నారు. గతంలో, ప్రభుత్వం వివిధ కారణాల వల్ల ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలను పొడిగించింది. అలాగే ప్రస్తుత వరదలు, అనిశ్చిత వాతారణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది పొడిగింపు ఉంటుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) మరోవైపు ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ గడువును ఒక నెల పెంచాలంటూ సేల్స్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రికి ఒక లేఖ రాసింది. ముఖ్యంగా రాజధాని న్యూఢిల్లీలో వరదల కారణంగా ఇన్కమ్ టాక్స్ ఆఫీస్ సహా చాలా ఆఫీసులు పనిచేయ లేదని పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆదాయపన్ను శాఖ అధికారిక ప్రకటన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. (22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) కాగా ఐటీఆర్ ఫైలింగ్ పన్ను చెల్లింపుదారులు ఈ నెల 18 నాటికి 3.06 కోట్ల రిటర్నులు ఫైల్ చేసినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఇందులో 91శాతం మంది (2.81 కోట్లు) తమ రిటర్నులను ఎలక్ట్రానిక్ రూపంలో ధ్రువీకరించినట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించిన 2.81 కోట్ల ఐటీఆర్‌లలో 1.50 కోట్ల పత్రాలను ఇప్పటికే ప్రాసెస్ చేయడం కూడా పూర్తయినట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే మూడు కోట్ల రిటర్నుల నమోదు ఏడు రోజులు ముందుగానే నమోదైనట్టు తెలిపిన సంగతి తెలిసిందే. -
G20 ఇంధన పరివర్తనలో కలసి పనిచేస్తాం: కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్
G20 గుజరాత్ రాజధాని నగరం గాంధీ నగర్లో మూడవ జీ20 ఆర్థికమంత్రులు,కేంద్రబ్యాంకుల సమావేశం సోమవారం మొదలైంది. గుజరాత్ రాజధానిలో జూలై 14 నుండి 15 వరకు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్ (FCBDs) సమావేశం జరుగుతుంది. పీఎం మోదీ అమెరికా పర్యటన అమెరికా-భారత్ భాగస్వామ్యంలో బలాన్ని, చైతన్యాన్ని పెంచిందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక అధిపతులు చేసిన ప్రకటనల ప్రకారం ఇండియా-అమెరికా దేశాలు కొత్త ఇన్వెస్ట్మెంట్ వేదిక ద్వారా ఇంధన పరివర్తన వ్యయాన్ని తగ్గించడానికి కలిసి పనిచేయాలని అంగీకరించాయి. అభివృద్ధి సహకారం , పునరుత్పాదక ఇంధనం కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికల ద్వారా కొత్త పెట్టుబడి అవకాశాల ద్వారా ఇదరు దేశాల ద్వైపాక్షిక ప్రయోజనాలను మరింతగా పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ తన సొంత ప్రకటనలో, ఇండియా ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన మూలధనాన్ని, ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి పెట్టుబడి వేదికపై భారతదేశంతో కలిసి పనిచేసేందుకు తాము కూడా ఎదురు చూస్తున్నామని చెప్పారు. VIDEO | "The state visit of PM Modi to the United States last month and his meeting with the US President have enhanced the strength and dynamism of the partnership (between India and US). The historic visit paved the way for new avenues of collaboration, propelling our… pic.twitter.com/YZLXBLdZrj — Press Trust of India (@PTI_News) July 17, 2023 ఆర్థికమంత్రి, ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ శక్తికాంత దాస్ సంయుక్త అధ్యక్షతన జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి, 66 మంది ప్రతినిధులు పాల్గొంటున్నఈ మీట్లో గ్లోబల్ ఎకానమీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి. ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన మొదటి జీ20 ఎఫ్‌ఎంసీబీజీ కాన్క్లేవ్ ఆధారంగా అనేక కీలక బట్వాడాలకు సంబంధించిన పనికి పరాకాష్టగా నిలుస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ అజయ్ సేథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?
సాక్షి, ముంబై: 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్', మహిళా సాధికారత,భాగంగా ప్రకటించిన 2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఆ పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం.కేవలం ఆడపిల్లలు, మహిళలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టేలా పోస్టాఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ వరకూ స్థిర వడ్డీరేటును అందిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) మహిళల పెట్టుబడిలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చిన్న పొదుపు పథకం కింద కేంద్రం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ను అందిస్తోంది. ఇందులో మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రానుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2 సంవత్సరాలలో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలు: మహిళలకు, బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే అవకాశం. ఒక్క ఖాతా మాత్రమే తెరవవచ్చు. మహిళలు లేదా బాలికల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ రెండేళ్ల కాలపరిమితి పథకం ఆకర్షణీయమైనయు స్థిరమైన వడ్డీని 7.5 శాతం వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన ఖాతాకు వడ్డీ బదిలీ ఉదా: రెండేళ్ల కాలానికి రెండు లక్షలు డిపాజిట్ చేస్తే.. 7.5 శాతం వడ్డీ ప్రకారం రెండు లక్షలకు రెండేళ్లకు రూ.30వేలు వడ్డీ రూపంలో అందుతుందన్నమాట. ఎలా నమోదు చేయాలి స్థానిక బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ఫారమ్ తీసుకోవాలి దరఖాస్తులో ఆధార్ కార్డ్ ,పాన్ కార్డ్ , నామినీ లాంటి వివరాలను నమోదు చేయాలి అవసరమైన డాక్యుమెంటేషన్‌తో దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి నగదు లేదా చెక్ రూపంలో సంబంధిత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పప్రూఫ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్ మీ చేతికి వస్తుంది డిపాజిట్ చేసిన తేదీ నుండి రెండేళ్లు పూర్తయిన తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది ఒక సంవత్సరం గడువు ముగిసిన తర్వాత కానీ మెచ్యూరిటీకి ముందు, బ్యాలెన్స్‌లో గరిష్టంగా 40 శాతం వరకు ఒకసారి విత్‌డ్రా చేసుకోవవచ్చు. చిన్న పొదుపు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా పోస్టాఫీసుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలలోని బాలికలు, మహిళా రైతులు, కళాకారులు, సీనియర్ సిటిజన్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు చిన్న మెత్తంలో పెట్టుబడితో మంచి రాబడిని పొందుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. (ఇదీ చదవండి: స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) -
ఎన్నిసార్లు అడిగినా ఒక్కటి కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు
తెలంగాణ విషయంలో కేంద్రం చూపిస్తున్న వివక్షపై రాజ్‌భవన్ దృష్టి పెడితే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిందని ఆరోపించారు. మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం ఉదయం చేసిన ట్వీట్‌పై ఆయన ట్విట్టర్లో స్పందించారు. వైద్య కళాశాలలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కూడా హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. మెడికల్ కాలేజీలపై మోసం ‘రాష్ట్రానికి కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీని తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం మొండిచేయి చూపింది. ఒకటో ఫేజ్‌లో ఇస్తారనుకుంటే రెండో ఫేజ్‌లో కూడా ఇవ్వలేదు, మూడో ఫేజ్‌లో ఇస్తామని చెప్పి చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను ప్రదర్శించింది. పైగా మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం. ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే.. మరొకరు కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీ కోసం తెలంగాణ అడిగిందనీ, అక్కడ ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేక పోయామని అంటారు. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారు, ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు..?’అని హరీశ్ నిలదీశారు. దేశంలోనే నం.1గా రాష్ట్రం ‘కేంద్రం మెడికల్ కాలేజీలు ఇవ్వకున్నా, పైసా నిధులివ్వకున్నా..సీఎం కేసీఆర్ రాష్ట్ర సొంత నిధులతో 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా ఉండటం వాస్తవం కాదా? ఒకే ఏడాది, ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే, ప్రశంసించేందుకు మనస్సు రానివాళ్లు పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా?..’అని ప్రశ్నించారు. గిరిజన వర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీపై దృష్టి పెట్టండి తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని, తెలంగాణ ప్రయోజనాల గురించి ఎందుకు నిలదీయడం లేదని మంత్రి ప్రశ్నించారు. ఏపీ పునర్ విభజన చట్టం –2014 లో ఇచ్చిన0 హామీల మేరకు గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్‌భవన్ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసినట్టవుతుందని పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు ఎందుకింత దుస్థితి? ‘గతంలో బీబీనగర్ ఎయిమ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదు అని ఒక కేంద్ర మంత్రి అన్నారు. ఆధారాలు చూపిస్తే నోట మాట లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలోనూ అలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ స్థాయిలో ఉండాల్సి న బీబీనగర్ ఎయిమ్స్, ఎందుకని గల్లీలోని మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో కూడా లేదు? ఎందుకు అధ్వాన్నంగా ఉంది? రూ.1,365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా, ఎందుకు రూ.156 కోట్లు (11.4%) మాత్రమే మంజూరు చేశారు? ఇదే సమయంలో అంటే 2018లో మంజూరు అయిన గుజరాత్ ఎయిమ్స్‌కు 52% నిధులు ఇచ్చింది వాస్తవం కాదా?..’అని హరీశ్ నిలదీశారు. -
విశాఖపట్నంలో ‘గ్లోబల్ టెక్ సమ్మిట్’
సీతంపేట(విశాఖపట్నం): త్వరలోనే విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుపుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ చిల్ర్టన్ ఎరీనాలో నిర్వహిస్తున్న గ్లోబల్ టేక్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్లోబల్ టెక్ సమ్మిట్‌లో ఆధునిక టెక్నాలజీ ఆవిష్కరణతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాలపై చర్చ నిర్వహిస్తున్నారు. సదస్సులో వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొన్నారు. జి–20 దేశాలతో పాటు మరో 25 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు, 300 వరకు ఐటీ కంపెనీలు పాల్గొన్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎలా అనుసరించాలి, వ్యవసాయ ఉత్పత్తులను ఎలా ఎగుమతి చెయ్యాలి, అవసరమైన నాణ్యతా ప్రమాణాలపై చర్చ జరుగుతుంది. -
టెక్నాలజీ దుర్వినియోగం కానివ్వొద్దు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: టెక్నాలజీలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు డిజిటైజేషన్‌ను అర్థం చేసుకోవడంలో మరింత ముందు ఉండాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ దశాబ్దంలో డిజిటల్ విధానాల వినియోగం గణనీయంగా పెరగనుందని, డిజిటైజేషన్‌పరంగా తగు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) ఐకానిక్ డే వేడుకలను ప్రారంభించిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. మార్కెట్లపై డిజిటైజేషన్ ప్రభావం గణనీయంగా ఉంటోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఎక్కడ దుర్వినియోగ మవుతున్నాయి, ఎక్కడ సడలించాలి, ఎక్కడ కఠినతరం చేయాలి అనే అంశాలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) తదితర నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ సూచించారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్, కార్యదర్శి రాజేశ్ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారదర్శక విధానాలు ఉండాలి.. సమాజాన్ని అన్ని కోణాల్లోనూ ప్రభావితం చేసే డిజిటైజేషన్‌కు సంబంధించిన విధానాలు సముచితంగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఉండాలని నిర్మలా సీతారామన్ చెప్పారు. డిజిటైజేషన్‌తో నియంత్రణ సంస్థలు, ఇతరత్రా సంస్థలు ప్రయోజనం పొందాలన్నారు. అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచేందుకు నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్లకు రిటైల్ ఇన్వెస్టర్ల దన్ను.. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్లు షాక్ అబ్జర్బర్లుగా ఉంటున్నారని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగినా మార్కెట్లు పతనం కాకుండా దన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల సంక్య గణనీయంగా పెరిగిందని ఆమె తెలిపారు. మార్చి నెల గణాంకాల ప్రకారం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) దగ్గర యాక్టివ్‌గా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య ఆరు కోట్లకు పెరిగింది. ఎస్ఎన్ఏతో పారదర్శక పాలన.. కార్యక్రమంలో భాగంగా నేషనల్ సీఎస్ఆర్ ఎక్సే్చంజ్ పోర్టల్‌ను, ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించడంపై స్మారక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదలాయింపు, వాటి వినియోగాన్ని ట్రాక్ చేసేందుకు ఉపయోగపడే సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ) డ్యాష్‌బోర్డును సీతారామన్ ఆవిష్కరించారు. దీనితో పాలన మరింత పారదర్శకంగా మారగలదని, రాష్ట్రాలకు కేంద్రం పంపే ప్రతీ రూపాయికి లెక్క ఉంటుందన్నారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రాలకు రూ. 4.46 లక్షల కోట్లు బదిలీ అవుతుంటాయని మంత్రి చెప్పారు. 75 ఏళ్లు పైబడిన వారికి క్లెయిమ్‌ల విషయంలో తోడ్పాటు కోసం ఐఈపీఎఫ్ఏ ప్రత్యేక విండో ప్రారంభించింది. Smt @nsitharaman launches National CSR Exchange Portal during Iconic Day celebrations of @MCA21India under the #AzadiKaAmritMahotsav. The portal is a digital initiative on CSR enabling stakeholders to list, search, interact, engage & manage their CSR projects on voluntary basis. pic.twitter.com/B6Pf495Py4 — NSitharamanOffice (@nsitharamanoffc) June 7, 2022 -
హిమ్మత్ రఖనా అంటూ కన్నుమూసిన అమ్మానాన్న, ఎల్ఐసీ నోటీసులు, నెటిజనుల స్పందన
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బీమా సంస్థ ఎల్ఐసీ లోన్ రికవరీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. చివరికి ఈ విషయం కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌కు దృష్టికి చేరింది. వెంటనే దీనిపై జోక్యం చేసుకున్న ఆమె ఈ విషయాన్ని పరిశీలించి తనకు వివరాలు అందించాల్సిందిగా ఎల్ఐసీని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్ లోని భోపాల్‌కు చెందిన జితేంద్ర పాఠక్ ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేసేవారు. తల్లి ప్రభుత్వ టీచరు. ఎల్ఐసీ నుంచి ఇంటి కోసం రూ.29 లక్షల రుణం తీసుకున్నారు. అయితే గత ఏడాది జితేంద్ర, ఆయన భార్య డా. సీమా పాథక్‌ను కూడా కరోనా పొట్టన పెట్టుకుంది. అప్పటికి వనిషా వయసు 17 సంవత్సరాలు. ఈమెకు పదకొండేళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే 29 లక్షల రూపాయల లోన్ తీర్చాలంటూ వనిషా పాఠక్‌కు నోటీసులు పంపింది ఎల్ఐసీ. తక్షణమే లోన్ చెల్లించాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా జూన్ 5న ఎల్ఐసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే పిల్లల బంధువులు తమ కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని తెలియజేశారని ఎల్ఐసీ తెలిపింది. ఇకపై ఎలాంటి నోటీసులు అందవని హామీ ఇస్తూ ఏప్రిల్‌లో లేఖ పంపినట్లు కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బాధితుల స్పందన భిన్నంగా ఉంది. ఇదే నిజమైతే మళ్లీ నోటీసులు ఎందుకు వచ్చాయని వనిషా ప్రశ్నించింది. కాగా వనిషా పాఠక్, ఆమె సోదరుడిని ప్రస్తుతం మేనమామ సంరక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులను కోల్పోయిన పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి వనిషా 10వతరగతి సీబీఎస్ఈ పరీక్షలలో ఇంగ్లీష్, సంస్కృతం, సైన్స్, సోషల్ సైన్స్‌లో 100 మార్క్‌లు, గణితంలో 97 స్కోర్ చేయడం విశేషం. అంతేకాదు ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న వనిషా పాఠక్ ఐఐటీ లేదా యూపీఎస్సీ పరీక్షల్లో మెరిట్ సాధించి తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని భావిస్తోందట. దేశానికి సేవ చేయాలని తండ్రి కోరిక అని.. ఇపుడు అది తన డ్రీమ్ అని చెప్పింది. అలాగే అద్భుతమైన కవిత్వంతో అమ్మ నాన్నాలకు ఘనమైన నివాళి అర్పించడమే కాదు ఆ దుఃఖాన్ని, కన్నీళ్లను దిగమింగుకుంటూ ముందుకు సాగుతోంది. మరోవైపు ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజనులు వనిషాకు, ఆమె తమ్ముడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఎల్ఐసీ రుణాన్ని తీర్చి, ఆమె చదువు కయ్యే ఖర్చును భరించేందుకు కూడా కొందరు సిద్ధంగా ఉన్నామని తెలిపారని పిల్లల మేనమామ చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సాయం చేస్తామంటూ ఫోన్లు వస్తూనే ఉన్నాయనీ ఆయన తెలిపారు. అయితే లోన్ రీపేమెంట్లో ఎల్ఐసీ నుంచి కొంత సడలింపు లభిస్తే.. అదే పెద్ద సహాయం అవుతుందన్నారు. -
శభాష్.. నిర్మలా సీతారామన్!.. నెటిజన్ల మెచ్చుకోలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ అధికారి పట్ల ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హోదా, ప్రోటోకాల్ వంటి అంశాలను పక్కన పెట్టి మనసున్న మనిషిగా వ్యవహరించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 2022 మే 8 ఆదివారం న్యూఢిల్లీలో మార్కెట్ కా ఏకలవ్య పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చుండూరు పద్మజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మజా చుండూరు ప్రసంగించడం ప్రారంభించారు. అయితే మార్కెట్‌కు సంబంధించిన వివిధ అంశాలను వివరిస్తున్న క్రమంలో ఆమెకు ఇబ్బంది కలగడంతో మధ్యలో ప్రసంగం ఆపి, మంచి నీళ్ల బాటిల్ ఇవ్వాలంటూ అక్కడున్న హోటల్ సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత ప్రసంగం కొనసాగిస్తున్నారు. పద్మజా చుండూడుకు ఎదురైన ఇబ్బందిని గమనించిన మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే తన దగ్గరున్న బాటిల్లో నీటిని ఓ గ్లాసులో పోసి తన కుర్చీ నుంచి లేచి.. పద్మజా దగ్గకు వెళ్లింది. గ్లాసులో నీళ్లు అందించి తాగాలంటూ సూచించింది. ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగిన ఘటనతో పద్మజతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నిర్మలా సీతారామన్ చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. This graceful gesture by FM Smt. @nsitharaman ji reflects her large heartedness, humility and core values. A heart warming video on the internet today. pic.twitter.com/isyfx98Ve8 — Dharmendra Pradhan (@dpradhanbjp) May 8, 2022 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గంటల తరబడి గుక్కతిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇవ్వడం దిట్ట. అందరికీ అది అంత సులువైన విషయం కాదు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్డడంతో పాటు ఆర్మ నిర్భర్ ప్యాకేజీని సైతం ఆమె గంటల తరబడి సునిశితంగా వివరించారు. అందువల్లే మాట్లాడేప్పుడు వచ్చే ఇబ్బందిని గమనించి.. వెంటనే అక్కడ చాలా సేపుగా మాట్లాడుతున్న మహిలా ఉద్యోగి తాగేందుకు నీళ్ల బాటిల్ అందించారు. చదవండి: ఒకప్పుడు స్టార్టప్‌ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్‌ల రాజ్యం -
మనీలాండరింగ్‌పై పోరుకు భారత్ కట్టుబడి ఉంది
వాషింగ్టన్: నగదు అక్రమ చెలామణీ (మనీలాండరింగ్), ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రక్షణ కోసం ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)’ పోషిస్తున్న పాత్రను ఆమె అభినందించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎఎంఫ్), ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో భాగంగా ఎఫ్ఏటీఎఫ్ మంత్రుల సమావేశాన్ని కూడా నిర్వహించారు. దీనికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే పారిస్ కేంద్రంగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు (2022–24 సంవత్సరాలకు) ఆమోదం తెలిపారు. 1989లో ఏర్పాటైన ఎఫ్ఏటీఎఫ్ అంతర్ ప్రభుత్వ సంస్థగా పనిచేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు హాని చేసే మనీలాండరింగ్, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్, ఇతర సమస్యలపై పోరాడటమే ఈ సంస్థ ఎజెండా. ఎఫ్ఏటీఎఫ్ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు సీతారామన్ మద్దతు పలికారు. మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, సామూహిక హననానికి దారితీసే ఆయుధాలకు ఫైనాన్సింగ్‌ను అడ్డుకోవడం కోసం.. ప్రపంచకూటమిగా ఎఫ్ఏటీఎఫ్ చేస్తున్న కృషికి వనరులను సమకూరుస్తామన్నారు. అమెరికన్ కంపెనీల సీఈవోలతో భేటీ తన పర్యటనలో భాగంగా మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్థలు ఫెడ్ఎక్స్, మాస్టర్‌కార్డ్ సీఈవోలతో భేటీ అయ్యారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో వ్యాపార అవకాశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. భారత్ మార్కెట్ పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నామని, నైపుణ్య శిక్షణ సహా పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికలు ఉన్నట్టు ఫెడ్ఎక్స్ ప్రెసిడెంట్, సీఈవోగా నియమితులైన రాజ్ సుబ్రమణ్యం తెలిపారు. భారత్‌లో పరిశోధన అభివృద్ధి కేంద్రాలను (ఆర్అండ్డీ) ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు సుబ్రమణ్యం తెలిపారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యయాలు తగ్గించేందుకు రూ. 100 లక్షల కోట్లతో కూడిన నేషనల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రధాని గతేడాది ప్రారంభించడం గమనార్హం. యాక్సెంచర్ చీఫ్ జూలీ స్వీట్, మాస్టర్ కార్డ్ సీఈవో మిబాచ్ మైకేల్, డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్‌తోనూ సీతారామన్ సమావేశమయ్యారు. చదవండి👉🏼 ప్రైవేటీకరణకు ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక ఆదేశాలు! -
క్రిప్టో కరెన్సీ అంటే అంత క్రేజ్ ఎందుకు?
డిజిటల్ ఇండియా..డిజిటల్ ఎకానమీ...డిజిటల్ రుపీ. అంతా డిజిటల్. డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేందుకు ఆర్బీఐ త్వరలోనే దేశీ డిజిటల్ కరెన్సీని లాంచ్ భారత్‌లో చేయనుంది. ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్న అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? క్రిప్టో కరెన్సికి ఎందుకంత క్రేజ్? ఇక భవిష్యత్తు అంతా క్రిప్టోకరెన్సీలదేనా? క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ రూపంలోనే కనిపించే కరెన్సీ. అంటే క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఇప్పుడున్న కరెన్సీలాగే చాలా దేశాల్లో వీటిని లావా దేవీలకు అనుమతి ఇస్తున్నారు. . బిట్కాయిన్లను మొట్టమొదటిసారి ఒక కరెన్సీగా వాణిజ్య లావాదేవీల కోసం ఉపయోగించింది 2010 మే 22వ తేదీన. ఫ్లోరిడాకు చెందిన లాస్జ్లో హాన్యే అనే ప్రోగ్రామర్.. 10,000 బిట్కాయిన్లు చెల్లించి రెండు పిజ్జాలు కొన్నాడు. అప్పుడు ఆ పది వేల బిట్కాయిన్ల విలువ సుమారు 47 డాలర్లు మాత్రమే. 2011 ఏప్రిల్‌లో 1 డాలరుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ అదే ఏడాది జూన్ నాటికి 32 డాలర్లకు పెరిగింది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులొచ్చినా 2012 ఆగస్టు నాటికి 13.20 డాలర్లకు పెరిగింది. అయితే బిట్ కాయిన్‌కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో బిట్‌కాయిన్‌తో పోటీగా డిజిటల్ కరెన్సీల తయారీ మొదలైంది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత 10,000 డాలర్లకు ఎగిసిన బిట్‌కాయిన్ 2019లో 7,000 డాలర్లకు పడిపోయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సంక్షోభం, డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో 2020లో బిట్‌కాయిన్ మళ్లీ దూసుకుపోయింది. 2021లో 70వేల డాలర్లు దాటేసి ఇన్వెస్టర్లను ఊరించడం మొదలు పెట్టింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుండి బిట్‌కాయిన్ 16శాతం పతనమై దాదాపు సగానికి పడిపోయింది. 2022 ఫిబ్రవరి 1 తరువాత 39వేల డాలర్ల దిగువకు చేరింది. ఇంత ఒడిదుకుల మధ్య ఉన్నా .. ఆదరణ మాత్రం పెరుగుతూనే ఉంది. (Happy Birthday Shekhar Kammula: శేఖర్ కమ్ముల గెలుచుకున్నది ఎన్ని ‘నంది’ అవార్డులో తెలుసా?) తాజాగా కేంద్రం కూడా డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయనుంది. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి బ్లాక్‌చెయిన్, ఇతర టెక్నాలజీల ఆధారిత డిజిటల్ రూపీని ఆర్బీఐ ప్రవేశపెడుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు. రిజర్వ్ బ్యాంక్ దీన్ని జారీ చేస్తుంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీ ఏ రూపంలో జరిగినా దానిపై 30 శాతం పన్ను విధిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు. అంటే భారత్‌లో ఇకపై క్రిప్టో కరెన్సీ కొనుగోళ్లు, అమ్మకాలు, బహుమతి రూపంలో బదిలీ.. ఇలా లావాదేవీ ఏ రూపంలో ఉన్నా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దేశంలో క్రిప్టో ట్రేడింగ్‌కు అనుమతి ఉంటుందనేసంకేతాలందించారు. భౌతికంగా పేపర్ రూపంలో జారీ చేసే కరెన్సీ తరహాలోనే దీనికి కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని అధికారిక పేపర్ కరెన్సీ రూపంలోకి మార్చుకోవచ్చు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో రూపొందించడం వల్ల లావాదేవీల విషయంలో పారదర్శకత ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీటులో కూడా దీనికి చోటు కల్పిస్తారు కాబట్టి చట్టబద్ధత ఉంటుంది. అనుకున్నట్టుగా ఇండియా డిజిటల్ రుపీని లాంచ్‌చేస్తే అది ప్రపంచ రికార్డు కానుంది. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఈ తరహా 'ఈ-క్రోనా' వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండగా, 2014 నుంచి చైనా పీపుల్స్ బ్యాంకు కూడా డిజిటల్కరెన్సీ వినియోగంపై కసరత్తు చేస్తోంది. గత రెండేళ్లుగా ప్రధాన నగరాల్లో డిజిటల్ యువాన్‌ను ట్రయల్ చేస్తోంది. ముఖ్యంగా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే అథ్లెట్లు, అధికారులు, జర్నలిస్టులకు అందుబాటులో ఉన్న మూడు చెల్లింపు పద్ధతుల్లో ఇదొకటి. అయితే సాధారణ లావాదేవీల వ్యయాలతో పోలిస్తే ఈ తరహా కరెన్సీలతో జరిపే లావాదేవీల వ్యయాలు తక్కువగా ఉండటంతో వీటి వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు దీన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మదుపు చేస్తున్నారు. అయితే, ఈ తరహా అనధికారిక కరెన్సీల విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పైగా వీటికి చట్టబద్ధత లేకపోవడం మరో ప్రతికూలాంశం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం చూపుతాయన్న కారణంతో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్ బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. మార్కెట్‌ను ఎలా నియంత్రించాలనుకుంటోంది లాంటి విషయాలపై భారత ప్రభుత్వం ఎలాంటి రోడ్ మ్యాప్ తయారుచేస్తుందో చూడాలి. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్న భారతీయుల సంఖ్య దాదాపు రెండు కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు 2030 నాటికి ప్రపంచ కరెన్సీ చలామణిలో నాలుగో వంతు క్రిప్టోకరెన్సీలు ఉంటాయని ఆర్థిక నిపుణుల అంచనా. క్రిప్టోకరెన్సీ యూజర్ల వివరాల గోప్యత, నియంత్రణ,భద్రత లాంటి అంశాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ కరెన్సీలతో పోలిస్తే క్రిప్టో కరెన్సీలే బెటర్అని టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, అల్ గోర్, రిచర్డ్ బ్రాన్సన్ తదితరులు ఇప్పటికే చెప్పారు. మనీలాండరింగ్, టెర్రరిస్టు కార్యకలాపాలు, డార్క్‌నెట్ నేరాలు పెరిగిపోతాయని, ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ముప్పేనని వారెన్ బఫెట్, పాల్ క్రుగ్మన్, రిచర్డ్ షిల్లర్ వంటి ఆర్థికవేత్తలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్‌దే..
సాక్షి, న్యూఢిల్లీ: ఏటా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఆ బడ్జెట్లోని అంశాలను క్షుణ్నంగా వివరించడం ఆనవాయితీ. కొందరు ఆర్థిక మంత్రులు ఈ ప్రసంగాన్ని సుదీర్ఘంగా, మరోసారి క్లుప్తంగా చేస్తుంటారు. అయితే అత్యంత ఎక్కువ వివరాలు, పదాలతో కూడిన బడ్జెట్ ప్రవేశ పెట్టినది మన్మోహన్సింగ్. పీవీ నర్సింహారావు ప్రధానిగా, మన్మోహన్ ఆర్థికమంత్రిగా ఉన్న 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా 18,650 పదాలు ఉన్నాయి. ఈ విషయంలో 2018లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీది రెండో స్థానం. ఆ బడ్జెట్లో 18,604 పదాలు ఉన్నాయి. అతి తక్కువ పదాలతో, తక్కువ సమయం ప్రసంగంతో కూడిన బడ్జెట్ రికార్డు హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్‌ది. 1977లో ఆయన 800 పదాలతో, కొద్ది నిమిషాల ప్రసంగంతో బడ్జెట్‌ను ముగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే.. సుదీర్ఘ ప్రసంగం రికార్డు నిర్మలా సీతారామన్‌దే. 2020 ఫిబ్రవరి 1న ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. నిజానికి అప్పటికీ బడ్జెట్ ముగియలేదు. ఇంకో రెండు పేజీలు మిగిలిపోయాయి. ఆమెకు కాస్త అనారోగ్యంగా అనిపించడంతో.. మిగతా వివరాలను క్లుప్తంగా చెప్పి ముగించారు. సుదీర్ఘ ప్రసంగం విషయంలో రెండో స్థానం కూడా నిర్మలా సీతారామన్‌దే. 2019లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆమెకాకుండా మరొకరిని చూస్తే.. 2018లో బడ్జెట్ పెట్టిన అరుణ్‌జైట్లీ గంటా 49 నిమిషాల పాటు ప్రసంగించారు. -
Budget 2022: ఇండియా@100 టార్గెట్‌తో..
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర భారతం 75 ఏళ్లు పూర్తి చేసుకుని అమృతకాలంలోకి ప్రవేశించిందని.. భారత్ వందేళ్లకు చేరుకునే ఈ 25 ఏళ్లు అమృతకాలమని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలతో ‘ఇండియా@100’ విజన్‌ను ప్రధాని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆవిష్కరించారని గుర్తుచేశారు. ఆ విజన్‌కు ప్రస్తుత బడ్జెట్లో పునాది వేస్తున్నామన్నారు. విజన్ లక్ష్యాలను సాధించడానికి మూడు మార్గాలను నిర్దేశించుకున్నట్టు వెల్లడించారు. ► అన్ని స్థాయిల్లో సమ్మిళిత అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమం దృష్టి ►డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్ రంగాలకు ప్రోత్సాహం. ►టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పులు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరిగేలా ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వ పెట్టుబడుల పెంపు’’ ఆ మార్గాలని వివరించారు. పన్నుల వసూలు రాజధర్మం నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివరాలను ప్రారంభిస్తూ.. మహాభారతంలోని శ్లోకాన్ని ఉదహరించారు. ‘దాపయిత్వకరం ధర్యాం రాష్ట్రం నిత్యం యథావిధి అశేషాంకల్పయేంద్రజాయోగ క్షేమానతంద్రితః’ ..శాంతి పర్వంలోని 72వ అధ్యాయంలో ఉన్న ఈ 11వ శ్లోకం రాజ ధర్మం ఎలా ఉండాలో చెప్తుందని ఆమె చెప్పారు. ‘‘రాజు ధర్మానికి అనుగుణంగా రాజ్యాన్ని పాలించాలి. రాజధర్మంలో భాగమైన పన్నుల వసూలు, ప్రజల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం చూపకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని ఆ శ్లోకం అర్థాన్ని వివరించారు. ఈ క్రమంలోనే పన్నుల వ్యవస్థను సరళతరం చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆదాయ పన్ను సహా ఇతర ట్యాక్సులు వేటికి సంబంధించి కూడా ఉపశమనం కలిగించే చర్యలను నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. పన్నుల ఎగవేతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు. పన్నులు పెంచలేదు.. చూడండి లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పన్నుల తగ్గింపు, ఐటీ పరిమితి పెంపుపై మధ్యతరగతి వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఉపశమనం ఇవ్వలేదేమని మీడియా ప్రశ్నించగా.. ‘‘కరోనా మహమ్మారి సమయంలో పన్నులు పెంచి ప్రజలపై భారం వేయదలుచుకోలేదు. అందుకే గత రెండేళ్లుగా ఎలాంటి పన్నులు పెంచలేదు..’’ అని సీతారామన్ సమాధానమిచ్చారు. -
సాక్షి కార్టూన్
-
జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు మలి విడత సమావేశాలు జరుగుతాయి. పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫారసుల మేరకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్టు పార్లమెంటు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన జనవరి 31న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అదే రోజు ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 11న తొలి విడత సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత నెల రోజుల పాటు విరామం ఉంటుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు, పోలింగ్ ఉండడంతో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10 వెలువడతాయి. ఫలితాలు వచ్చాక అంటే మార్చి 14 నుంచి రెండో విడత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 8తో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడం, ఇటీవల 400 మంది పార్లమెంటు సిబ్బంది కరోనా బారిన పడడంతో పార్లమెంటు నిర్వహణకు పూర్తిస్థాయిలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపీలు, పార్లమెంటులోకి రావాలనుకునే ఇతరులు రెండు టీకా డోసులు తీసుకున్నట్లు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్తో పాటు ఆర్టీ–పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ సమర్పించాలి. లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు షిఫ్ట్‌లలో నిర్వహించే అవకాశాలున్నాయి. బడ్జెట్ రోజు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. -
బంగారంతో ట్రేడింగ్.. గోల్డ్ ఎక్సేంజీ ఏర్పాటులో కీలక అడుగులు
న్యూఢిల్లీ: భారత్‌లో గోల్డ్ ఎక్సేంజీల ఏర్పాటుకు వీలుగా వాల్డ్ మేనేజర్స్ నిబంధనావళిని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నోటిఫై చేసింది. గోల్డ్ ఎక్సేంజీ ఏర్పాటు ప్రతిపాదనను గత ఏడాది సెప్టెంబర్‌లో సెబీ బోర్డు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గోల్డ్ ఎక్సేంజీల్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) రూపంలో బంగారం ట్రేడింగ్ జరుగుతుంది. ఈజీఆర్‌ను బాండ్‌గా పరిగణిస్తారు. సంబంధిత ఈజీఆర్‌లు ఇతర సెక్యూరిటీల మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, ఫిజికల్ డెలివరీ ఫీచర్లను కలిగి ఉంటాయి. పసిడి విషయంలో అంతర్జాతీయంగా భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో ఈ యల్లో మెటల్‌కు సంబంధించి లావాదేవీల్లో పారదర్శకను పెంపొందించడం, పటిష్ట స్పాట్ ధరల నిర్ధారణ యంత్రాంగం ఆవిష్కరణ వంటి అంశాల్లో గోల్డ్ ఎక్సేంజీ కీలక పాత్ర పోషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నోటిఫికేషన్లో ముఖ్యాంశాలు - ఈజీఆర్‌ల సృష్టికి సంబంధించి డిపాజిట్ చేసిన బంగారం కోసం ఉద్దేశించిన వాల్టింగ్ సేవలను అందించడానికి సెబీ మధ్యవర్తిగా వాల్డ్ మేనేజర్ నమోదవుతారు. మేనేజర్‌పై సెబీ పూర్తిస్థాయి నియంత్రణ ఉంటుంది. - పసిడి డిపాజిట్లను అంగీకరించడం, బంగారం నిల్వ, భద్రపరచడం, ఈజీఆర్‌ల రూపకల్పన–ఉపసంహరణ, ఫిర్యాదుల పరిష్కారం, డిపాజిటరీ రికార్డులతో భౌతిక బంగారాన్ని కాలానుగుణంగా సమన్వయం చేయడం వంటి అంశాలు వాల్ట్ మేనేజర్ బాధ్యతల్లో కొన్ని. - వాల్ట్ మేనేజర్‌గా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలకునే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు కోసం సెబీకి దరఖాస్తు చేసుకోవాలి. - దరఖాస్తుదారు భారతదేశానికి చెందినవారై కనీస నెట్‌వర్త్ రూ.50 కోట్లు కలిగిఉండాలి. - మంజూరు చేయబడిన ఏదైనా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను ‘నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో’ సస్పెండ్ చేసే రద్దు చేసే అధికారం సెబీకి ఉంటుంది. - ఒక వాల్ట్ మేనేజర్ ఈ నిబంధనలలో నిర్దేశించిన గోల్డ్ ఎక్సేంజీ వ్యాపారంతోపాటు మరైదైనా కార్యకలాపాలను నిర్వహిస్తున్న పక్షంలో రెండు బిజినెస్ వ్యవహారాల పట్ల స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. తన వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేక స్థలాలను సైతం తప్పనిసరిగా కేటాయించుకోవాలి. - వాల్ట్ మేనేజర్లు వాల్టింగ్ సేవలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఎలక్ట్రానిక్ రూపంలో రికార్డ్ చేయడానికి తగిన వ్యవస్థ (సిస్టమ్)లను కలిగి ఉండాలి. - బంగారం నిల్వ, బదిలీ, ఉపసంహరణ వివరాలు; డిపాజిట్ చేసిన బంగారం స్వచ్ఛత, పరిమాణం– బరువు, ఈజీఆర్‌ల సృష్టి, ట్రేడింగ్ వంటి అంశాలకు సంబంధించి పత్రాలను పారదర్శకంగా నిర్వహించాలి. ఆయా పత్రాలను కనీసం ఐదు సంవత్సరాలు వాల్డ్ మేనేజర్ భద్రపరచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రెగ్యులేటర్ సెబీ నిర్దేశించిన నియమావళికి (కోడ్ ఆఫ్ కాండక్ట్) కట్టుబడి ఉండాలి. - వాల్ట్‌లలో బంగారం డిపాజిట్లకు సంబంధించి, ఈజీఆర్‌లను సృష్టించాలనుకునే ఎవరైనా రిజిస్టర్డ్ వాల్ట్ మేనేజర్ వద్ద బంగారం డిపాజిట్ కోసం అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. బంగారం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించే అధికారం వాల్డ్ మేనేజర్‌కు ఉంటుంది. బంగారు కడ్డీలను తూకం వేయడం, బంగారం డిపాజిట్ సమయంలో అవసరమైన డాక్యుమెంటేషన్ వంటి కార్యకలాపాల నిర్వహణ మేనేజర్ విధివిధానంలో భాగం. - వాల్ట్ మేనేజర్ లేదా ఆ సంస్థ తరపున అధికారం పొందిన వ్యక్తి ఎవరైనా.. గుర్తింపు పొందిన రిఫైనరీ లేదా నామినేటెడ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు నిర్ధారిస్తారు. - ఈజీఆర్ సృష్టి, క్యాన్సిలేషన్‌కు సంబంధించి డిపాజిటరీతో ప్రతి వాల్ట్ మేనేజర్ లావాదేవీ నిర్వహిస్తుంది. - డిపాజిటర్ నుండి బంగారాన్ని అంగీకరించిన తర్వాత, వాల్ట్ మేనేజర్ బెనిఫిషియల్ ఓనర్‌గా డిపాజిటర్ పేరు మీద ఈజీఆర్‌ను సృష్టిసారు. ఇందుకు అనుగుణంగా డాక్యుమెంటేషన్ జరుగుతుంది. - బంగారం ఉపసంహరణకు సంబంధించి, వాల్ట్ నుండి బంగారాన్ని విత్‌డ్రా చేయాలనుకునే బెనిఫిషియల్ ఓనర్ డిపాజిటరీకి ఈ మేరకు ఒక అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి మొదట ఛార్జీల బకాయిలను వాల్డ్ మేనేజర్‌కు చెల్లించాలి. - వాల్ట్ మేనేజర్ ఖాతాలు, రికార్డులు, పత్రాలు, బంగారం డిపాజిట్ల పుస్తకాలను తనిఖీ చేసే హక్కు నియంత్రణా సంస్థ సెబీకి ఉంటుంది. సెక్యూరిటీ మార్కెట్ ప్రయోజనాలు, పారదర్శకత పరిరక్షణ సెబీ ప్రధాన ధ్యేయం. అయితే ఈ తరహా తనఖీకి 10 రోజుల ముందు వాల్డ్ మేనేజర్‌కు నోటీసు పంపడం జరుగుతుంది. - సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వాల్ట్ మేనేజర్స్ రూల్స్ పేరుతో జారీ అయిన కొత్త నిబంధనావళి డిసెంబర్ 31 నుండి అమలులోకి వచ్చింది. గోల్డ్ ఎక్సేంజీ, వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యూడీఆర్ఏ)లకు సెబీ నియంత్రణ సంస్థగా ఉంటుందని 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2021–22 బడ్జెట్‌ను సమర్పిస్తూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోల్డ్ ఎక్సేంజీ కోసం సెబీ నియంత్రకంగా ఉంటుందని మరియు కమోడిటీ మార్కెట్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బలోపేతం అవుతుందని చెప్పారు. కమోడిటీ మార్కెట్ పటిష్టత, పాదర్శకతలను పెంపొందించడానికి ఈ చర్య దోహదపడుతుందని ఆమె అన్నారు. చదవండి: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్‌లకు సెక్యూరిటీల హోదా -
సినిమాలతో చికితిపోతున్నాం.. జీఎస్టీ తీసేయండి! సినీ నిర్మాతల మండలి విజ్ఞప్తి
Movie Producers association Request Sitharaman to abolish GST on film industry: ఫిల్మ్, వినోద పరిశ్రమను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మోషన్ పిక్చర్ నిర్మాతల మండలి (ఐఎంపీపీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థికమంత్రికి ఒక లేఖ రాసింది. మహమ్మారి కరోనా సవాళ్లతో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్న ఈ రంగం పునరుద్దరణకు జీఎస్టీ మినహాయింపు కీలకమని లేఖలో వివరించింది. ఐఎంపీపీఏ ప్రెసిడెంట్ టీపీ అగర్వాత్ ఈ లేఖపై సంతకం చేశారు. ప్రస్తుతం ఫిల్మ్, వినోద పరిశ్రమపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. దాదాపు 60,000 మంది సభ్యులు ఉన్న ఈ సంఘం ఆర్థికమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రస్తుతం ఫిల్మ్, వినోద పరిశ్రమలపై విధిస్తున్న జీఎస్టీ తీవ్రంగా ఉంది. ఈ పరిశ్రమపై ఎటువంటి పెట్టుబడి పెట్టకపోగా, ఆదాయాల్లో సింహభాగం ప్రభుత్వానికి వెళుతోంది. ► ఈ పరిశ్రమలో మొత్తం పెట్టుబడిని ఇండస్ట్రీలోని వారే (నిర్మాతలే) సమకూర్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా మహమ్మారి సవాళ్లు ఇన్వెస్టర్లను తీవ్రంగా దెబ్బతీశాయి. పరిశ్రమలోకి కొత్త పెట్టుబడులు రావడానికి, ఈ రంగం పునరుద్దరణకు జీఎస్టీ, ఇతర అన్ని పన్నులను రద్దు చేయడం ఒకటే మార్గం. ►ప్రభుత్వం అనేక మల్టీప్లెక్స్‌లు, ఎగ్జిబిషన్ అవుట్లెట్లకు ‘భారీగా పన్ను మినహాయింపులు, సబ్సిడీ‘లు ఇచ్చింది. అయితే ఈ మినహాయింపులు, సబ్సిడీలు టిక్కెట్ల అమ్మకంపై ఆధారపడి ఉంటాయి. మహమ్మారి కారణంగా సినిమా హాళ్లను మూసివేసిన సందర్భంలో ఈ సబ్సిడీలు, మినహాయింపుల వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. ఫిల్మ్, వినోద రంగాలకు భారీ సబ్సిడీల ద్వారానే వేలాది మంది జీవితాల్లో వెలుగులు ఉంటాయి. ► కరోనా మహమ్మారి సవాళ్లకుతోడు కేంద్ర, రాష్ట్రాల భారీ పన్ను వసూళ్లతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ► ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రస్తుతం నెలకొని ఉంది. కనీసం ఐదు శాతం తక్కువ రేటుకు జీఎస్టీని అమలు చేయాలి. అలాగే పన్ను విధానాల్లో ఏకీకరణను ఆవిష్కరించాలి చదవండి:పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా? -
ప్రపంచ దేశాలన్ని భారత్‌ను ప్రశంసిస్తున్నాయి
-
Nirmala Sitha Raman: థర్డ్ వేవ్ ఎఫెక్ట్.... పిల్లలపై కేంద్రం ఫోకస్
కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉండటంతో ఎమర్జెన్సీ హెల్త్ సిస్టమ్ ప్రాజెక్ట్‌ని కేంద్ర ఆర్థిక మంత్రులు నిర్మల సీతారామన్, అనురాగ్ ఠాకూర్లు ప్రకటించారు. ఈ పథకానికి రికార్డు స్థాయిలో రూ. 23,220 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ కేర్‌పై ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపువచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏరియా, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పిల్లల వార్డుల ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న పిల్లల వార్డులో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం వంటి చర్యలు యుద్ధ ప్రతిపాదికన చేపట్టనున్నారు. మౌలిక సదుపాయలకు నిధులు ఈ నిధులతో 7929 కోవిడ్ హెల్త్ సెంటర్లు, 9954 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రస్తుతం కోవిడ్ కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న ఆస్పత్రుల సంఖ్యను 25 రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను 7.5 రెట్లు, ఐసోలేటెడ్ బెడ్ల సంఖ్య 42 రెట్లు, ఐసీయూ బెడ్లు 45 రెట్లు పెంచబోతున్నారు. సబ్ సెంటర్ స్థాయి నుంచి జిల్లా ఆస్పత్రి స్థాయి వరకు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తారు. వైద్య విద్యార్థుల సేవలు ఉపయోగించుకునేందుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. అంబులెన్సుల కొనుగోలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కొరత తీర్చడంతో పాటు కొత్తగా అంబులెన్సుల కొనుగోలు, టెలి మెడికేషన్, కోవిడ్ టెస్టుల పెంపు తదితర చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. చదవండి : 5 లక్షల టూరిస్టు వీసాలు ఫ్రీ -
పెట్రోధరలపై స్పందించిన నిర్మలా సీతారామన్
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి 'ధర్మసంకట్'(పెద్ద సందిగ్ధత)గా మారాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అని అన్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణం గా పౌరులపై భారం పడుతున్నట్లు ఆమె అంగీకరించారు. ప్రజలపై పడే భారాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రోల్‌పై కేంద్రానికి వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తుందని తెలిపారు. ఇప్పుడదే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్లు నిర్మల సీతారామన్ పేర్కొంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ఏకైక మార్గం కేంద్రం, రాష్ట్రాలు చర్చలు జరపడమేనని ఆమె అన్నారు. అంతకు ముందు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇంధన ధరలను తగ్గించడానికి కేంద్రం, రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలని అని అన్నారు. "కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చలు అవసరం. వీలైనంత త్వరగా పన్నులు తగ్గించడం చాలా ముఖ్యం" అని శక్తికాంత దాస్ అన్నారు. గత వారాంతాన పెట్రో ధరలు పెరిగిన తర్వాత వరుసగా ఆరు రోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్ వద్దకు చేరగా ఆర్థిక రాజధాని ముంబైలో 97 రూపాయల ఎగువకు చేరి పరుగులు పెడుతోంది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ రేట్లు రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! జియో ల్యాప్‌టాప్‌లు రాబోతున్నాయి!