IMPPA Plea To finance Minister Nirmala SithaRaman Over GST - Sakshi
Sakshi News home page

కష్టాల్లో ఉన్నాం... జీఎస్‌టీ తీసేయండి! సినీ నిర్మాతల మండలి విజ్ఞప్తి

Published Thu, Nov 25 2021 8:33 AM | Last Updated on Thu, Nov 25 2021 9:36 AM

IMPPA Plea To finance Minister Nirmala SeethaRaman Over GST - Sakshi

Movie Producers association Request Sitharaman to abolish GST on film industry: ఫిల్మ్, వినోద పరిశ్రమను వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) నుంచి మినహాయించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మోషన్‌ పిక్చర్‌ నిర్మాతల మండలి (ఐఎంపీపీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థికమంత్రికి ఒక లేఖ రాసింది. మహమ్మారి కరోనా సవాళ్లతో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్న ఈ రంగం పునరుద్దరణకు  జీఎస్‌టీ మినహాయింపు కీలకమని లేఖలో వివరించింది. ఐఎంపీపీఏ ప్రెసిడెంట్‌ టీపీ అగర్వాత్‌ ఈ లేఖపై సంతకం చేశారు.  ప్రస్తుతం   ఫిల్మ్, వినోద పరిశ్రమపై 18 శాతం జీఎస్‌టీ అమలవుతోంది. దాదాపు 60,000 మంది సభ్యులు ఉన్న ఈ సంఘం ఆర్థికమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 

► ప్రస్తుతం ఫిల్మ్, వినోద పరిశ్రమలపై  విధిస్తున్న జీఎస్‌టీ తీవ్రంగా ఉంది. ఈ పరిశ్రమపై ఎటువంటి పెట్టుబడి పెట్టకపోగా, ఆదాయాల్లో సింహభాగం ప్రభుత్వానికి వెళుతోంది.  

► ఈ పరిశ్రమలో మొత్తం పెట్టుబడిని ఇండస్ట్రీలోని వారే (నిర్మాతలే) సమకూర్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా మహమ్మారి సవాళ్లు ఇన్వెస్టర్లను తీవ్రంగా దెబ్బతీశాయి. పరిశ్రమలోకి కొత్త పెట్టుబడులు రావడానికి, ఈ రంగం పునరుద్దరణకు జీఎస్‌టీ, ఇతర అన్ని పన్నులను రద్దు చేయడం ఒకటే మార్గం.  

►ప్రభుత్వం అనేక మల్టీప్లెక్స్‌లు, ఎగ్జిబిషన్‌ అవుట్‌లెట్‌లకు ‘భారీగా పన్ను మినహాయింపులు, సబ్సిడీ‘లు ఇచ్చింది. అయితే ఈ మినహాయింపులు, సబ్సిడీలు టిక్కెట్‌ల అమ్మకంపై ఆధారపడి ఉంటాయి. మహమ్మారి కారణంగా సినిమా హాళ్లను మూసివేసిన సందర్భంలో ఈ సబ్సిడీలు, మినహాయింపుల వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. ఫిల్మ్, వినోద రంగాలకు భారీ సబ్సిడీల ద్వారానే వేలాది మంది జీవితాల్లో వెలుగులు ఉంటాయి.  

► కరోనా మహమ్మారి సవాళ్లకుతోడు కేంద్ర, రాష్ట్రాల భారీ పన్ను వసూళ్లతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  

► ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రస్తుతం నెలకొని ఉంది. కనీసం ఐదు శాతం తక్కువ రేటుకు జీఎస్‌టీని అమలు చేయాలి. అలాగే పన్ను విధానాల్లో ఏకీకరణను ఆవిష్కరించాలి

చదవండి:పెట్రోల్-డీజిల్ జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement