Film producer
-
పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినిమా నిర్మాతలు సోమవారం సమావేశమయ్యారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేశ్, నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, ఏఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్ని వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వ ప్రసాద్, వంశీకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్‌కు వివరించామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని అభినందించడానికి అపాయింట్మెంట్ కోరామన్నారు. సినీ రంగ సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని చెప్పారు. -
సినీ నిర్మాత ఆత్మహత్య
కర్ణాటక: కన్నడ సినీ నిర్మాత సౌందర్యజగదీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మహాలక్ష్మీలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో తన నివాసంలో ఆయన ఉరివేసుకోగా కుటుంబ సభ్యులు గమనించి రాజాజీనగర సుగుణ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. సౌందర్య జగదీష్ పలు వివాదాలతో గతంలో వార్తల్లోకి ఎక్కారు. ఇరుగుపొరుగువారితో పాటు కుటుంబసభ్యులతో గొడవపెట్టుకుని వివాదంలో చిక్కుకున్నారు. ఈయనకు చెందిన జెట్లాగ్ పబ్‌లో కొద్దినెలల క్రితం కాటీర చిత్ర బృందం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పార్టీ చేసుకున్నట్లు ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో 25 రోజుల పాటు రెస్టోబార్ లైసెన్సు రద్దుచేశారు. సౌందర్యజగదీష్ రియల్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. తమ్ముడి కుమారుడు స్నేహిత్‌ను సినిమారంగానికి పరిచయం చేశారు. ఇటీవల ప్రియాంకా ఉపేంద్ర ఏర్పాటుచేసిన హోలీ కార్యక్రమంలో సౌందర్యజగదీశ్ పాల్గొన్నారు. -
సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ‘నీది నాది ఒకే కథ’, గర్ల్ ఫ్రెండు’సినిమాల నిర్మాత అట్లూరి నారాయణరావును ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దందా కేసులో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కేసులో అసలు సూత్రధారి గుధే రాంబాబు హైదరాబాద్‌లో ఎఫ్ఎంసీజీ స్థాపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) పేరిట అధిక వడ్డీలు ఆశ చూపి వందలాది మంది నుంచి రూ.540 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. బాధితుల ఒత్తిళ్ల నేపథ్యంలో రాంబాబు ఓ చార్టెట్ అకౌంటెంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, తన పలుకుబడితో కేసు లేకుండా చేస్తానని, ఇందుకు అన్ని ఖర్చులకు గానూ రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసారాల తర్వాత రూ.2 కోట్లకు అంగీకరించిన నారాయణరావు అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు, రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. ఆభరణాలను పాతబస్తీలో కరిగించి రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. నారాయణరావును అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు అదనపు విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత బంగారం రికవరీ చేయాలని భావిస్తున్నారు. -
సినీ నిర్మాత కోసం.. సీసీఎస్ వేట! అసలేం జరిగిందంటే?
సాక్షి, హైదరాబాద్: విజయవాడలో చాక్లెట్ల వ్యాపారంతో మొదలు పెట్టి, హైదరాబాద్‌లో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దందా స్థాపించి, మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) దందాలోకి దిగి, డిపాజిట్ల పేరుతో వందల మంది నుంచి రూ.540 కోట్లు వసూలు చేసిన కేసులో తెలుగు సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు నిందితుడిగా మారారు. ఈ స్కామ్ సూత్రధారి రాంబాబు విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నారాయణరావును మూడో నిందితుడిగా చేర్చిన సీసీఎస్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బుధవారం ఈ కేసులో అరెస్టు అయిన రాంబాబు, పెనుమత్స కృష్ణం రాజులను తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి గురువారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఎంసీజీ దందా చేసేందుకు రాంబాబు రాధారామ్ ఏజెన్సీస్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఇద్దరు నిందితులు తమ వ్యాపార విస్తరణ కోసమంటూ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. వీరికి 6 నుంచి 13 శాతం వడ్డీతో డబ్బు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఓ దశలో వ్యాపారంలో వచ్చే లాభాలు పంచడానికి, వడ్డీలు చెల్లించడానికి సరిపోలేదు. దీంతో తమ వద్ద కొత్తగా పెట్టుబడి పెట్టే వారి సొమ్మును పాత ఇన్వెస్టర్లకు చెల్లించడం మొదలెట్టారు. చివరకు చెల్లింపులు చేయలేక డిపాజిటర్లను మోసం చేశారు. తమ కోసం బాధితులు తిరుగుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశారనే విషయం తెలియడంతో రాంబాబు తన కంపెనీ చార్టెట్ అకౌంటెంట్ ద్వారా అట్లూరి నారాయణరావును సంప్రదించాడు. సినీ నిర్మాతగా ఉన్న అతను తనకు రాజకీయాలతో పాటు పోలీసు విభాగంలో చాలా పలుకుబడి ఉందని, అది వినియోగించి కేసు లేకుండా చేస్తానని రాంబాబుకు హామీ ఇచ్చాడు. ఇందుకుగాను రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసాల తర్వాత రూ.2 కోట్లకు అంగీకరించిన నారాయణ రావు అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. ఆపై కొన్ని ప్రయత్నాలు చేసినా నిందితులకు కేసు విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోయాడు. దీంతో ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి బయటపడదామని రాంబాబుకు సలహా ఇచ్చాడు. అతడు అంగీకరించడంతో ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా ఈ కథ నడపాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడతో పాటు నగరంలోనే ఈ స్కామ్ మొత్తం జరిగింది. బాధితులు సైతం ఇక్కడి వారే ఉన్నారు. అయితే నారాయణరావు మాత్రం ఖమ్మం కోర్టులో అక్కడి న్యాయవాదితో ఐపీ దాఖలు చేయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఓపక్క ఈ పనులు చేస్తూనే మరోపక్క రాంబాబు నుంచి వీలైనంత మొత్తం వసూలు చేసుకోవాలని భావించాడు. అతడి నుంచి రూ.కోటి విలువైన బంగారు ఆఖరణాలు తీసుకున్న నారాయణరావు వాటిని పాతబస్తీలో కరిగించి, రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. నిందితులను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు లోతుగా విచారించడంతో అట్లూరి నారాయణ రావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసులో ఇతడిని మూడో నిందితుడిగా చేర్చిన అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. -
దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం
తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) అనారోగ్య కారణాలతో కొంత సమయం క్రితం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయం దాటిన తర్వాత తుది శ్వాస విడిచారు. దీంతో దిల్ రాజుకు పలువురు సినీ ప్రముఖులు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి కాగా తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన ఆయన పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటు రావడంతో మరణించారు. వీరికి కూతురు హన్షిత ఉంది. తర్వాత ఆయన 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. -
ప్రేయసినీ చంపేశాడు!
హైదరాబాద్: పద్మారావునగర్‌లోని ఇంటిపై కన్నేసి, దాన్ని కాజేయడం కోసం యజమాని అయిన సినీ నిర్మాత అంజిరెడ్డిని కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేసి అరెస్టైన రాజేష్ గణేష్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతగాడు 2019లో డబ్బు కోసమే తన ప్రేయసి మౌనికను హత్య చేసి కటకటాల్లోకి చేరాడు. నార్త్‌జోన్‌లో ఉన్న తుకారాంగేట్ ఠాణా పరిధిలో నమోదైన ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. శనివారం డీసీపీ చందన దీప్తిని కలిసిన హతురాలి కుటుంబీకులు ఆ కేసు విచారణ త్వరగా ముగిసేలా చూడాలని, రాజేష్ నుంచి తమకు రక్షణ కలి్పంచాలని విజ్ఞప్తి చేశారు. చెన్నై నుంచి వచ్చి అక్వేరియం దుకాణం ఏర్పాటు... రాజేష్ కుటుంబం కొన్నేళ్ల క్రితం చెన్నై నుంచి నగరానికి వలస వచ్చింది. గతంలో పార్శిగుట్ట శ్రీనివాసకాలనీలో నివసించింది. ఈ ప్రాంతంలోనే రాజేష్ అక్వేరియం దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతడికి 2014లో మహేంద్రహిల్స్‌లోని బాలమ్రాయ్ సొసైటీకి చెందిన ఆదిమూలం మౌనికతో పరిచయం ఏర్పడింది. ఈమెకు తండ్రి లేదని, తల్లి, సోదరి మాత్రమే ఉన్నారని తెలుసుకున్న రాజేష్ ప్రేమ పేరుతో దగ్గర కావడంతో పాటు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. మౌనిక ఇంటికి వెళ్తూ ఆమె కుటుంబీకులకు దగ్గరయ్యాడు. తర్వాత తన వ్యాపార విస్తరణకు సహాయం చేయాలంటూ మౌనిక తల్లి పుష్పను కోరాడు. తన చిన్న కుమార్తె కాబోయే భర్త అనే ఉద్దేశంతో సహాయం చేయడానికి అంగీకరించిన ఆమె తన పెద్ద కుమార్తె వివాహం సమయానికి తిరిగి ఇవ్వాలంటూ షరతు విధించారు. దీనికి రాజేష్ అంగీకరించడంతో దఫదఫాలుగా రూ.15 లక్షలు రాజేష్‌కు అందించింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వమనడంతో కక్షకట్టాడు... పుష్ప పెద్ద కుమార్తెకు 2019లో వివాహం నిశ్చయమైంది. దీంతో తమ నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా పుష్ప తన కుమార్తె మౌనిక ద్వారా రాజేష్‌ను అడిగింది. ఈ విషయంపై మౌనిక–రాజేష్ మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి. దీంతో ఆమెను హతమార్చాలని రాజేష్ పథకం వేశాడు. 2019 మే 8న మౌనికకు ఫోన్ చేసిన ఇతగాడు ఆమె తల్లి పని నిమిత్తం, సోదరి ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్తున్నారని తెలుసుకున్నాడు. దీంతో తాను లంచ్ కోసం వస్తున్నానని చెప్పాడు. అలా వచి్చన రాజేష్ కు మౌనికకు మధ్య ఘర్షణ జరిగింది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అతడు ఆమె తలపై దాడి చేసి చంపేశాడు. దీనిపై పుష్ప ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న తుకారాంగేట్ పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను ఆ రోజు మౌనిక ఇంటికి వెళ్లి భోజనం చేసి కొద్దిసేపు ఉండి వచ్చేశానంటూ చెప్పిన రాజేష్ తన ప్రమేయం లేదంటూ తప్పించుకోవాలని చూశాడు. పోస్టుమార్టం రిపోర్టులో ఎలాంటి సందేహాలు లేవని, హత్య అనడానికి ఆధారాలు కూడా లేవంటూ రాజే‹Ùను అరెస్టు చేయకుండా వదిలేశారు. మౌనిక చనిపోయిన బాధ కూడా లేని అతగాడు ఆ వెంటనే మాట్రిమోనియల్ సైట్లలో పెళ్లి కుమార్తె కావాలంటూ యాడ్స్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ చూసిన మౌనిక కుటుంబీకులకు అప్పటి వరకు అతడిపై ఉన్న అనుమానాలు బలపడ్డాయి. దీంతో ఆధారాల కోసం అన్వేíÙంచడం ప్రారంభించారు. మూడు రోజులకు దొరికిన ఆధారం... ఈ కేసులో ఆధారాల కోసం పోలీసులకు పోటీగా మౌనిక కుటుంబీకులు ప్రయత్నాలు చేశారు. పుష్ప ఇంటికి కొద్ది దూరంలో ఉన్న సీసీ కెమెరా వీరికి కీలక ఆధారం అందించింది. హత్య జరిగిన రోజు సాయంత్రం 4 గంటలకే తాను మౌనిక వద్ద నుంచి వెళ్లిపోయానని రాజేష్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం ఆ రోజు సాయంత్రం 6.30 వరకు రాజేష్ అక్కడే ఉన్నట్లు తేలింది. దీంతో పాటు ఇతర ఆధారాలను పోలీసులకు అందించారు. ఫోరెన్సిక్ రిపోర్టు సైతం మౌనిక తలపై ఆరు అంగుళాల బలమైన గాయం ఉందని, ఇది హత్యేనని తేలి్చంది. వీటి ఆధారంగా అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి రాజేష్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతగాడు బెయిల్‌పై బయటకు రాగా...ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది. రాజేష్‌కు శిక్షపడేలా చూడాలంటూ... తాజాగా నిర్మాత అంజిరెడ్డి కేసులో రాజేష్ అరెస్టు అయిన విషయం తెలుసుకున్న మౌనిక కుటుంబీకులు శనివారం నార్త్‌జోన్ డీసీపీ చందన దీప్తిని కలిశారు. మౌనికను చంపిన రాజేష్ కు వీలైనంత త్వరలో శిక్షపడేలా చూడాలని, అతడి నుంచి తమకు రక్షణ కలి్పంచాలని కోరారు. ఓ హత్య కేసులో బెయిల్‌పై బయటకు తిరుగుతూ మరో క్రూరమైన హత్య చేసిన రాజేష్ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇతడి వ్యవహారాలను పూర్తి స్థాయిలో ఆరా తీస్తామని, కోర్టుకు నివేదించడం ద్వారా కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హతురాలి కుటుంబీకులకు హామీ ఇచ్చారు. అంజిరెడ్డి హత్య కేసులో జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించిన రాజేష్ తో పాటు సుపారీ హంతకులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని గోపాలపురం పోలీసులు నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. -
పక్కా ప్లాన్‌తోనే.. ఎన్ఆర్ఐ హత్య
హైదరాబాద్: సినీ నిర్మాత, ఎన్నారై అంజిరెడ్డి హత్య కేసులో ఆరుగురు నిందితులను గోపాలపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పద్మారావునగర్‌కు చెందిన ఎన్ఆర్ఐ, సినీ నిర్మాత అంజిరెడ్డి విదేశాల్లో స్థిరపడేందుకు గాను పద్మారావునగర్‌లోని తన ఇంటిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన సమాచారంతో ఈ విషయం తెలుసుకున్న ఎస్డీ రోడ్డులోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ఆ ఇంటిని కొట్టేయాలని పథకం పన్నాడు. ఇళ్లు కొనుగోలు చేస్తానని అంజిరెడ్డికి దగ్గరై అతడిని నమ్మించాడు. ఇందులో భాగంగా రూ.3.90 కోట్లకు బేరం కుదుర్చుకున్న అతను రూ.5లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. త్వరలో మిగతా మొత్తాన్ని ఇస్తానని చెబుతూ కాలం వెల్లబుచ్చాడు. అంతేగాక అంజిరెడ్డికి అంబర్‌పేట్‌లో ఉన్న మరో స్థిరాస్తిని కూడా కొనుగోలు చేస్తానని నమ్మించాడు. సెప్టెంబర్ 22న అంజిరెడ్డి దంపతులు ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తి చేసికుందామని రాజేష్ చెప్పడంతో అంజిరెడ్డికి భార్య అమెరికా వెళ్లిపోగా ఆయన ఇక్కడే ఉండిపోయాడు. పథకం ప్రకారమే... ఇంటిని సొంతం చేసేందుకు అంజిరెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకున్న రాజేష్ అందులో భాగంగా తన వద్ద డ్రైవర్‌గా చేసే ప్రభు కుమార్, హౌస్ కీపింగ్ పనిచేసే సచ్చేంద్ర పాశ్వాన్, జయ మంగళ్ కుమార్, వివేక్‌కుమార్, రాజేష్ కుమార్‌లతో రూ.4లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకున్నాడు. గత నెల 29న సాయంత్రం అంజిరెడ్డికి ఫోన్ చేసి డబ్బు ఇస్తానని నమ్మించి ఎస్డీరోడ్డులోని డీమార్ట్ బిల్డింగ్ బేస్మెంట్–3కి రప్పించారు. అప్పటికే రూ.2 కోట్లు చెల్లించినట్లు డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకున్న రాజేష్ ఆయనను సంతకం చేయాలని బెదిరించాడు. అందుకు అంజిరెడ్డి ఒప్పుకోకపోవడంతో లిప్టులోకి తీసుకెళ్లి దాడి చేయడమేగాక ముక్కు నోరు మూసి ఊపిరి ఆడకుండా చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు మృతదేహాన్ని బేస్మెంట్లోనే పడేసి కారు ప్రమాదం జరిగిందని నమ్మించేందుకు కారును ఫిల్లర్లకు గుద్ది సీన్ క్రియేట్ చేశారు. అనంతరం మిగతా నిందితులందరూ అక్కడి నుంచి పారిపోగా రాజేష్ అంజిరెడ్డి కారు ప్రమాదంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సీసీ కెమెరాలు..డీబీఆర్ల తొలగింపు హత్యకు ముందుకు పథకం ప్రకారం డీ మార్ట్ బిల్డింగ్ బేస్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలు, డీబీఆర్‌లను తొలగించారు. వేలి ముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు వేసుకుని హత్య చేశారు. రాజేష్‌పై తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉండగా ఇప్పుడు చిలకలగూడకు మార్చారు. మేడిపల్లి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ అతడిపై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
నిర్మాత అంజిరెడ్డి కేసులో వెలుగులోకి సంచలనాలు
హైదరాబాద్: స్థిరాస్తి కొనుగోలు చేస్తామని చెప్పి నమ్మించి ఎన్నారై, సినీ నిర్మాత అంజిరెడ్డిని హత్య చేసిన కేసులో నిందితుడు రాజేష్ మొదటి నుంచి పథకం ప్రకారమే కథ అంతా నడిపించాడు. ఇల్లు కొనుగోలు చేస్తానని నమ్మించి..డబ్బు చెల్లించకుండానే ఇంటిని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఆయనను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించినట్లు తెలిసింది. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నా పూర్తి వివరాలు వెల్లడించడం లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేష్, ఆయన డ్రైవర్, ఇద్దరు బిహారీ పనిమనుషులు మొత్తం ఆరుగురి ప్రమేయం బయటపడగా మరికొంత మంది కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది? గత నెల 29వ తేదీ సాయంత్రం 5.31 నిమిషాలకు సికింద్రాబాద్ ఎస్.డి రోడ్డులోని డి–మార్ట్ భవనంలో బేస్మెంట్–3కు నిందితుడు రాజేష్ ఒక కారులో రాగా ఆయనతో పాటు అంజిరెడ్డి తన వ్యాగన్ ఆర్ కారులో వచ్చారు. ఇదే భవనంలోని మొదటి అంతస్తులో జీఆర్ కన్వెన్షన్ ఉండగా దీనికి సంబంధించిన కారు పార్కింగ్ బేస్మెంట్–3లో కొనసాగుతుంది. ఈ కన్వెన్షన్‌లో ఫంక్షన్లు అయినపుడు మాత్రమే కార్లు పార్కింగ్ చేసి ఉంటాయి. లేకుంటే పార్కింగ్ ప్రదేశం మొత్తం ఖాళీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అంజిరెడ్డిని బెదిరించి సంతకాలు చేయించుకుని అంతమొందించేందుకు మంచి ప్రదేశమని పథకం వేశారు. 5.31 నిమిషాలకు కార్లు బేస్మెంట్–3 లోపలికి వెళ్లగా దాదాపు రాత్రి 8.45 ప్రాంతంలో అంజిరెడ్డికి ప్రమాదం జరిగిందని కుమారుడు చరణ్‌కు సమాచారం వచి్చంది. దీంతో 9.15 నిమిషాలకు పోలీసులు ఈ భవనంలోని బేస్మెంట్–3కి చేరుకున్నారు. అయితే ముందుగానే సిద్ధం చేసుకున్న రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ల డ్రాప్టును ఆయన ముందుంచి సంతకాలు తీసుకునేందుకు తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో కర్రతో ఆయనను తీవ్రంగా గాయపరచడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అంజిరెడ్డి కారు ప్రమాదానికి గురై మరణించినట్లు చిత్రీకరించేందుకు ఆయన వ్యాగన్ ఆర్ కారును భవనం పిల్లర్లకు గుద్ది ప్రమాదంగా నమ్మించారు. మృతదేహాన్ని కారు పక్కన పడేసి ఏమి తెలియనట్లు ఉన్నారు. పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి..మృతదేహాన్ని అక్కడ నుంచి తొలగించాక...రాజేష్ కారులో నిందితులు బేస్మెంట్–3 నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత మూడు కార్లలో వేర్వేరు ప్రాంతాలకు పారిపోయారు. సాయంత్రం 5.31 నిమిషాల నుంచి 9.15 నిమిషాల వరకు మధ్యలో ఏమి జరిగిందనేది ఇంకా కొంత సస్పెన్షన్ కొనసాగుతోంది. హత్యకు గురైన అంజిరెడ్డి గతంలో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యహరించారు. 1993లో దొంగ అల్లుడు, చెలికాడు తదితర చిత్రాలు నిరి్మంచగా...గత కొద్ది రోజుల నుంచి ఆయన సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. -
సికింద్రాబాద్ గోపాలపురంలో అంజిరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు
-
ఇంటిపై కన్నేసి.. ఎన్నారైని చంపేసి!
హైదరాబాద్: నగరంలో ఉన్న స్థిరాస్తుల క్రయవిక్రయం పేరుతో ఓ ఎన్నారైకి చేరువయ్యాడు. ఆయన ఇంటిపై కన్నేసి సొంతం చేసుకోవాలనుకున్నాడు.. దాన్ని ఖరీదు చేసేందుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నాడు.. తన పథకాన్ని అమలు చేస్తూ అతడిని దారుణంగా చంపేశాడు.. గోపాలపురంలో ఉన్న సరోజినీదేవి రోడ్‌లోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ వ్యవహారమిది. ఈ దారుణంలో పాలు పంచుకున్న అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలతో పాటు రాజేష్‌ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పౌరసత్వం రావడంతో విక్రయాలు... పద్మారావునగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని నిర్ణయించారు. అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా సీనియర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేసిన రవి కాట్రగడ్డతో ఇప్పటికీ స్నేహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అంజిరెడ్డి తన ఆస్తుల విక్రయం విషయం ఆయనకు ఎనిమిది నెలల క్రితం చెప్పి అమెరికా వెళ్లారు. రవి ఈ అంశాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. నెల రోజుల క్రితం భార్యతో తిరిగి వచి్చన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజే‹Ùను తీసుకువచ్చారు. ఇంటిపై మక్కువను గుర్తించి.. అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్‌లోని ఇల్లు తనకు నచి్చందని, తాను ఖరీదు చేస్తానని అంజిరెడ్డితో పాటు ఆయన భార్యతోనూ నమ్మబలికాడు. 1986లో కట్టిన ఆ ఇంటిపై భార్యాభర్తలకు ఉన్న మక్కువను గుర్తించిన రాజేష్.. వారిని బుట్టలో వేసుకునేలా మాట్లాడాడు. ఆ ఇంటిని పడగొట్టనని, మరింత అందంగా తీర్చుదిద్దుతానని తరచూ చెబుతుండేవాడు. సైదాబాద్‌లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. దాన్ని ఖరీదు చేయడానికి ఓ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పాడు. తమ ఆస్తుల్ని విక్రయించిన ఇద్దరు మహిళలు ఇది ఖరీదు చేయడానికి అంగీకరించారంటూ అంజిరెడ్డితో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్ వారితో చెప్పాడు. దీంతో భార్య వెళ్లగా.. అంజిరెడ్డి ఇక్కడే ఉండిపోయారు. పథకం ప్రకారం డ్రాఫ్ట్ సిద్ధం చేసి.. ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్‌లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడు. దీనికోసం రెండు విడతల్లో ఆయనకు రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వయోవృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డి మేడ్చల్‌లోని అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఖరీదు చేయాలని భావించారు. గత నెల 29 ఉదయం పద్మారావునగర్‌కు వెళ్లిన రాజే‹Ù... అంజిరెడ్డిని తీసుకుని మేడ్చల్ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసిన భార్యతో అంజిరెడ్డి అదే విషయం చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్‌రెడ్డి ఎన్నిసార్లు ప్రయతి్నంచినా అంజిరెడ్డి ఫోన్ కలవలేదు. అంతా కలిసి హత్య చేశారు.. అంజిరెడ్డి, రాజేష్ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో జీఆర్ కన్వెన్షన్ ఉన్న డీమార్ట్ బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. బేస్మెంట్– 3లో అంజిరెడ్డి కారు పార్క్ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆపై మృతదేహాన్ని బేస్మెంట్–3లోని ఆయన కారు వద్దకు తీసుకువచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు చరణ్‌కు ఫోన్ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. హుటాహుటిన వచి్చన ఆయన బేస్మెంట్–3లో కారు పార్క్ చేసి ఉండటం, దాని పక్కనే అంజిరెడ్డి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. గోపాలపురం పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో హత్యగా తేల్చారు. రాజేష్ సహా అయిదుగురినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక సమాచారం
హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో అరెస్టైన సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వీరివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిపారు. మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడంతో బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడినట్టు చెబుతున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ సందర్భంగా ఫైనాన్షియర్ వెంకట్ నుంచి 18 మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ అందుకున్న వారు పరారీలో ఉన్నారని వారంతా ఫోన్లను స్విచాఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ నలుగురిని విచారించనున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రాథమిక వివరాలను బట్టి ఆ 18 మందిని కస్టమర్లుగా గుర్తించామని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వారితోపాటు పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దించినట్లు తెలిపారు. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకురాగా వారు కూడా ఆ అపార్ట్మెంట్లోనే పోలీసులకు చిక్కారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు -
మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. మాదాపూర్ విఠల్‌రావు నగర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పలు చిత్రాలకు ఫైనాన్షియర్ వ్యవహరించిన వెంకట్ ఆధ్వర్యంలో ఈ పార్టీ నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో వెంకట్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే.. నార్కోటిక్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సినీ నిర్మాత, ఫైనాన్షియర్ వెంకట్‌తో పాటు పలువురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢమరుకం, పూలరంగడు, లవ్లీ, ఆటోనగర్ సూర్య చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించాడు వెంకట్. వెంకట్‌తో పాటు పట్టుబడిన బాలాజీ, కె.వెంకటేశ్ర్‌రెడ్డి, డి.మురళి, మధుబాల, మేహక్‌ల నుంచి కోకైన్, ఎల్ఎస్డీ, 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన యువతులు సైతం ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కీలక విషయాలు.. ఇక వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపుతుండగా.. విచారణ వేగవంతం చేశారు అధికారులు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నిఘా పెట్టింటి నార్కోటిక్ బ్యూరో. ఈ క్రమంలోనే.. వెంకట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణను నిర్ధారించుకున్నారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి వెంకట్ డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో నిందితుడు బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇక.. వెంకట్ కు డ్రగ్స్ పెడలర్లు సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. వెంకట్ వాట్సాప్‌లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వెంకట్ ఫ్లాట్‌లో ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కోరుట్ల టెక్కీ దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్ -
మంచి లైన్ దొరికింది.. మరో సినిమా తీసి లొంగిపోతా సార్!
గతంలో ఓ సినిమా తీశాసార్! కథ బాగోలేక ప్లాపయింది.. ఇప్పుడు డ్రగ్స్ మీద మంచి లైన్ దొరికింది.. మరో సినిమా తీసి లొంగిపోతా సార్! -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత పీకేఆర్ పిళ్లై(92) కన్నుమూశారు. మాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన అనారోగ్యంతో సమస్యలతో త్రిసూర్ జిల్లా మందన్‌చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మోహన్ లాల్‌తో ఎక్కువగా సినిమాలు నిర్మించారు. (ఇది చదవండి: నాకు పునర్జన్మ నిచ్చింది ఆమెనే: విజయ్ ఆంటోని) షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్‌పై అమృతం గమ్య (1987), చిత్రం (1988), వందనం (1989), కిజక్కునరుమ్ పక్షి (1991, అహం (1992)తో సహా మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ హిట్లను అందించారు. పిళ్లై చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా చిత్రమ్. దీనికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. మోహన్‌లాల్ నటించారు. ఈ సినిమా రెండు థియేటర్లలో 300 రోజులకు పైగా ఆడిన ఘనత సాధించింది. ఈ చిత్రం తరువాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో వరుసగా అల్లుడుగారు, ప్యార్ హువా చోరీ చోరీ, రాయరు బండారు మావన మానేగే, ఎంగిరుంధో వందన్‌గా రీమేక్ చేశారు. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్ ఎంగేజ్మెంట్?) పన్నెండు సంవత్సరాల క్రితం ముంబైలోని తన వ్యాపారాన్ని వదిలేసి కేరళాకు వచ్చారు పిళ్లై. 1984లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ షిర్డీ సాయి క్రియేషన్స్‌పై వేప్రాళం అనే చిత్రాన్ని నిర్మించాడు. మొదట ఎర్నాకులం లో ఉన్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు త్రిస్సూర్ లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రమ్య, పిల్లలు రాజేష్, ప్రీతి, సోను ఉన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
సినిమా విడుదల పేరుతో మోసం చేశారు, కత్తితో బెదిరించారు: నిర్మాత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఏఎన్నార్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా ప్రతిబింబాలు పేరుతో తాను నిర్మించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ రూ.13 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ సినీ నిర్మాత జె.రాధాకృష్ణమూర్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తేదీన ఈ విషయం చర్చించేందుకు తాను రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణలకు ఫోన్ చేయగా వారు అందుబాటులోకి రాలేదన్నారు. వారి డ్రైవర్ బాలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తనను దుర్భాషలాడారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల విషయంలో, తన వద్ద తీసుకున్న డబ్బుల విషయంలో ప్రశ్నించినందుకు తనను బెదిరించారని, కత్తి తీసుకొని పొడిచేందుకు ప్రయత్నించారని వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కుర్చీలో నుంచి కిందపడేసి గాయపరిచారన్నారు. బలవంతంగా తన ఆఫీస్‌లోని పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు తీసుకొని వెళ్లారని వాటిని తిరిగి ఇవ్వలేదని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సినీ నిర్మాత జె.రాధాకృష్ణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డిస్ట్రిబ్యూటర్లు రవీంద్ర కళ్యాణ్, రామకృష్ణ, డ్రైవర్ బాలుపై ఐపీసీ సెక్షన్ 448, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగు తెరకు... ఆయన గోరింటాకు!
అభిరుచి గల మురారి... ఆద్యంతం సాహిత్య సంగీతాల్ని ప్రేమించిన మురారి... మంచి చిత్రాల నిర్మాత ‘యువచిత్ర’ మురారి వెళ్ళిపోయారు. మూడు దశాబ్దాల స్నేహంలో ఎన్నో ఘటనలు మనసులో రీళ్ళు తిరిగాయి. మురారిది కమ్యూనిస్ట్ కుటుంబం. బెజవాడలో బాగా డబ్బున్న కాట్రగడ్డ కుటుంబం. సినీ నిర్మాణానికి పంపిణీ వ్యవస్థే మూలస్తంభమైన రోజుల్లో ప్రతిష్ఠాత్మక నవయుగ ఫిల్మ్స్ అధినేతకు అన్న కొడుకు. ఆ కొంగుచాటులన్నీ దాటుకొని, కష్టపడి, ఒక్కో మెట్టూ పేర్చు కుంటూ మురారి తనదైన కీర్తి, అపకీర్తుల సౌధం కట్టుకు న్నారు. వి. మధుసూదనరావు వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడైన మురారికి అనంతరకాల అగ్ర దర్శకుడు కోదండరామి రెడ్డి సహపాఠీ. జెమినీ వాసన్, విజయా చక్రపాణి వద్ద నిర్మాణ మెలకువలు నేర్చుకున్నారు. కొట్లాడే దర్శకుడు కాబోయి, తిట్టి మరీ చెప్పి చేయించుకొనే నిర్మాతగా మారడమే తెలివైన పని అని గ్రహించారు. తనకు నచ్చిన సినిమాలే తీశారు. తనకు నచ్చినట్టే తీశారు. పంతం పట్టి రీషూట్లూ చేశారు. పారితోషికం పెంచి ఇస్తూ, పని చేయించుకున్నారు. ‘తిడతాడు.. డబ్బుతో కొడతాడు’ అనిపించుకున్నారు. సమకాలికుల్లో విలక్షణంగా నిలిచారు. బ్యానరే ఇంటిపేరైన కొద్ది నిర్మాతల్లో ఒకరయ్యారు. మద్రాస్ మెరీనా బీచ్‌లోని దేవీప్రసాద్‌రాయ్ చౌధురి ‘శ్రామిక విజయం’ శిల్పం తమ సంస్థకు చిహ్నంగా పెట్టుకో వడం మురారి పెరిగిన వాతావరణపు ఆలోచన. నవలల్ని తెరపైకి తెచ్చినా, ఇంగ్లీష్ ఇతివృత్తాల్ని తెలుగు కథలుగా మలిచినా అది ఆయన పెంచుకున్న అభిరుచి. ‘సీతామాలక్ష్మి, గోరింటాకు, త్రిశూలం, సీతారామ కల్యాణం’ వగైరా అన్నీ కలిపి తీసినవి 9 సినిమాలే! విజయ బాపినీడుతో కలసి నిర్మించిన ‘జేగంటలు’ తప్ప అన్నీ సక్సెస్‌లే. నందులతో సహా అనేక అవార్డులు తెచ్చినవే. ఆయన పాటలు అందమైన హిందోళాలు. ఎవర్గ్రీన్ హిట్లు. ఒకే నిర్మాత సినిమాల్లోని సాహిత్య విలువలపై 20 ఏళ్ళక్రితమే విశ్వవిద్యాలయ పరిశోధన జరిగింది ఒక్క ‘యువచిత్ర’ సినిమాలకే! ‘మామ’ మహదేవన్ లేకుండా సినిమా తీయనన్న మురారి, మామ పోయాక నిజంగానే సినిమా తీయలేకపోయారు. కీరవాణి సంగీతంతో కథ, సంగీత చర్చలు జరిగినా ముందుకు సాగలేదు. మూగబోయిన కృష్ణశాస్త్రిని ఆరాధిస్తూ బాంబే బ్రెడ్ టోస్ట్ చేసిచ్చినా, ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కని పాలగుమ్మి పద్మ రాజును ఆస్థాన రచయితగా పోషించినా, కనుమరుగైన మహా నటి సావిత్రితో ‘గోరింటాకు’లో పట్టుబట్టి వేషంవేయించినా, జగ్గయ్య సారథ్యంలో ‘మనస్విని’ ట్రస్ట్–అవార్డులతో మరణిం చిన ఆత్రేయను కొన్నేళ్ళు ఏటా స్మరించినా, ఎస్పీబీ – సత్యానంద్ – జంధ్యాల – ఓంకార్‌లతో గాఢంగా స్నేహిం చినా... అది మురారి మార్క్ ప్రేమ. కృష్ణశాస్త్రి మరణించాక ‘ఇది మల్లెల వేళ’ అంటూ ఎంపిక చేసిన 11 పాటల్ని ఎల్పీ రికార్డుగా హెచ్ఎంవీతో పట్టుబట్టి రిలీజ్ చేయించారు. ఆత్రేయ సాహిత్యం వెలికి రావడంలో పాత్ర పోషించారు. ప్రొడ్యూసరంటే కాంబినేషన్లు కుదిర్చే క్యాషియరనే కాలం వచ్చాక, అభిరుచి చంపుకోలేక మూడు దశాబ్దాల క్రితమే నిర్మాతగా స్వచ్ఛంద విరమణ చేశారు. సంపాదించిన డబ్బు సినిమాల్లో ‘సన్’ స్ట్రోక్‌కు ఆవిరి కారాదని తంటాలు పడ్డారు. ప్రతిభను గుర్తించి, నెత్తికెత్తుకోవడం మురారి నైజం. 22 ఏళ్ళ క్రితం ఓ సికింద్రాబాద్ కుర్రాడు సినిమా తీస్తే, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నేషనల్ అవార్డ్ వచ్చింది. వార్త చదివిన మురారి ఆ కుర్రాణ్ణి చెన్నైకి పిలిపించి, అభినందించి, ఆతిథ్య మిచ్చి మరీ పంపారు. ఆ సినిమా ‘డాలర్ డ్రీమ్స్’. ఆ సంగతి నేటికీ తలుచుకొనే అప్పటి ఆ కుర్రాడే – ఇవాళ్టి శేఖర్ కమ్ముల. హీరోయిన్లు తాళ్ళూరి రామేశ్వరి, వక్కలంక పద్మ, గౌతమి, రచయిత సత్యమూర్తి (దేవిశ్రీ ప్రసాద్ తండ్రి), కళా దర్శకుడు రాజులను మురారే తెరకు పరిచయం చేశారు. అగ్ర హీరోలు, దర్శకులతో పని చేసినా వారి కన్నా రచయితలతోనే ఆయనకు స్నేహం. డాక్టర్ జివాగో లాంటి నవలలు, వాటిని తెరకు మలి చిన తీరు గురించి మురారి చెబుతుంటే, డబ్బులు కాదు.. మనసు పెట్టినవాడే మంచి నిర్మాతనే మాటకు సాక్ష్యం అనిపిం చేది. నాటి ‘వేయిపడగలు’ నుంచి నేటి ‘అర్ధనారి’ దాకా బాగున్న ప్రతి నవల మురారి చదవాల్సిందే. చర్చించాల్సిందే. సందేహనివృత్తికి జగ్గయ్య, విఏకె రంగారావు, గొల్లపూడి, పైడి పాల, కాసల నాగభూషణం లాంటి వార్ని సంప్రతించాల్సిందే. మురారితో మాటలన్నీ పోట్లాటలే! మాట తీరే అంత. చూపులకు కోపధారి. తెలియనివాళ్ళకు తిక్క మనిషి. సన్నిహితమైతే తెలిసేది– మాటలోనే కారం కానీ మనసు నిండా మమకారమే అని! ఒక దశ దాటాక... ఆయన ప్రేమించి, గౌరవించే హీరో శోభన్‌బాబు, దర్శకుడు దాసరి లేరు. సలహా చెప్పే స్నేహశీలి ఓంకార్ ముందే వెళ్ళి పోయారు. చెన్నైగా మారిన మద్రాసులో తెలుగు చిత్రసీమ ఖాళీ అయింది. పాత మిత్రులు లేరు. కొత్తగా మిత్రులు కారు. ఊరవతల సముద్రపుటొడ్డు నివాసంలో విచిత్రమైన ఒంటరి తనం. సోషల్ మీడియాలో స్నేహాన్నీ, సాహిత్యంలో సాంత్వ ననూ వెతుక్కున్నారు. తోటలో తామరలు, ఇంట్లో కుక్కలతో సేద తీరాలనుకున్నారు. ఎఫ్బీలో నోరు చేసుకుంటూ వచ్చారు. దశాబ్దిన్నర క్రితం ‘తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర’ కళ్ళు చెదిరే ఖరీదైన గ్రంథంగా రావడంలోనూ మురారి సంపా దకత్వ అభిరుచి కనిపిస్తుంది. తెలుగు నిర్మాతల వెల్ఫేర్ ట్రస్ట్ చేపట్టిన ఆ బరువైన రచనలో బలమైన ఆయన ఇష్టానిష్టాలు, చెలరేగిన వాదాలు, వివాదాలు మరో పెద్ద కథ. తోచుబడి కావట్లేదన్నప్పుడు, తరచూ చెప్పే పాత కబుర్లనే కాగితంపై పెట్టమన్న సలహా మురారిలోని రచయితను నిద్ర లేపింది. ఎన్నో చేదునిజాలు, నాణేనికి ఒకవైపే చూపిన కొన్ని అర్ధ సత్యాలను గుదిగుచ్చిన ఆయన జ్ఞాపకాల కలబోత ‘నవ్విపోదురు గాక’ సంచలనమైంది. పదేళ్ళలో 12 ముద్రణలు జరుపుకొంది. డ్రాఫ్ట్ రీడింగ్‌లో పలువురు ప్రముఖులు సందేహించినా, ఆటో బయోగ్రఫీల్లో అది నేటికీ టాప్సెల్లర్. ఆ రచనకు ప్రేరకులం, తొలి శ్రోతలమైన ఓంకార్‌నూ, అస్మదీయుడినీ పదుగురిలో పదేపదే గుర్తుచేసుకోవడం మురారి సంస్కారం. ఆవేశభరిత మురారిది జీవితంలో, సినిమాల్లోనూ ముళ్ళ దారి. ముక్కుసూటి తత్వం, మార్చుకోలేని అభిప్రాయాలు, మాట నెగ్గించుకొనే ఆభిజాత్యంతో సహచరుల్ని దూరం చేసు కోవడం మురారి జీవలక్షణాలు. చరమాంకంలో తప్పు తెలుసుకున్నారు. ‘ఆఖర్న మోయడానికి నలుగురినైనా మిగుల్చుకో వాలయ్యా’ అనేవారు. అప్పటికే లేటైంది. ఆయన పోయారు. ఆయన దర్శక, హీరోలెవరూ రాలేదు. సంతాపాలూ చెప్ప లేదు. అవసరాలే తప్ప అభిమానాలు తక్కువైన రంగుల లోకంలోని ఆ సంగతీ మురారికి ముందే తెలుసు. ‘‘ఏవయ్యా రేపు నే పోయాక పేపర్లో రాస్తావా? చదవడానికి నేనుండను కానీ, నా గురించి ఏం రాస్తావో ఇప్పుడే చెప్పచ్చుగా!’’ అనేవారు. ఇంత తొందరగా ఆయన కోరిక నెరవేరుస్తానను కోలేదు. రాశాను... చదివి చీల్చిచెండాడడానికి ఆయన లేరు. మద్రాస్ తెలుగు సినిమా ఆఖరి అనుబంధాల్లో మరొకటి తెగిపోయింది. చిన్ననాటి నుంచి చివరి రోజుల దాకా జీవి తంతో నిత్యం సంఘర్షిస్తూ, అలసిపోయిన డియర్ మురారి గారూ... రెస్ట్ ఇన్ పీస్ ఎట్లీస్ట్ ఇన్ దిస్ లాస్ట్ జర్నీ! – రెంటాల జయదేవ -
టాలీవుడ్లో మరో విషాదం.. నిర్మాత మృతి
కొల్లిపర(గుంటూరు జిల్లా): కొల్లిపర గ్రామానికి చెందిన సినీ నిర్మాత వి.ఎస్.రామిరెడ్డి(55) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. రామిరెడ్డి నిర్మాతగా స్టూవర్టుపురం దొంగలు, శత్రువు, లేడీ బ్యాచిలర్స్ తదితర సినిమాలు తీశారు. మరియు అనే సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం రామిరెడ్డి భౌతికకాయాన్ని స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సందర్శించి, పూలమాలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్ -
అదర్ సైడ్: స్టూడెంట్ నంబర్‌వన్
‘టైమెక్కడ ఉంది’ అని చీటికిమాటికి అంటే టైమ్ చిన్నబుచ్చుకుంటుందట. ‘టైమ్ నాతోనే ఉంటుంది’ అనుకుంటే బలాన్ని ఇస్తుందట. సినీ నిర్మాత, ఇంటీరియర్ డిజైనర్, కాలమిస్ట్, పుస్తక రచయిత్రి, గృహిణిగా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్న ట్వింకిల్ ఖన్నా మరోసారి స్టూడెంట్‌గా మారబోతోంది. ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ చేయడానికి రెడీ అవుతోంది... ‘అమ్మా, నీకు ట్వింకిల్ అని ఎందుకు పేరు పెట్టారు?’ అని అడిగింది నాలుగేళ్ల కూతురు. ‘నేను లిటిల్స్టార్ని కాబట్టి’ అని జవాబు చెప్పింది ట్వింకిల్. ఇది విని కూతురు నవ్వేసింది. ఇంట్లోనే కాదు పుస్తక ప్రపంచంలో కూడా నవ్వుల వెన్నెల కురిపిస్తుంది ట్వింకిల్‌ఖన్నా. కథానాయికగా మాత్రమే కాదు కాలమిస్ట్, పుస్తక రచయిత్రిగా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ట్వింకిల్ రాసిన ‘మిసెస్ ఫన్నీబోన్స్’ పుస్తకం బెస్ట్ సెల్లర్ చార్ట్‌లో నెంబర్‌వన్‌గా నిలిచింది. ‘అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న పుస్తకం ఇది’ అని ప్రశంసించారు పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఎడిటర్ ఇన్ చీఫ్ మిలీ ఐశ్వర్య. మరో పుస్తకం ‘పైజామాస్ ఆర్ ఫర్గివింగ్’ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ‘హైయెస్ట్–సెల్లింగ్ ఫిమేల్ ఆథర్’ సింహాసనంలో తనను కూర్చోబెట్టింది. నవ్వించడం ఎంత కష్టమో, నవ్వించడం ద్వారా వచ్చే కష్టాలు కూడా అంతే కష్టమని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది ట్వింకిల్‌కు. ‘నన్ను ఉద్దేశించే రాసింది’ అని ఎంతోమంది భుజాలు తడుముకునేవారు! వినోదమాధ్యమాలు ఎన్ని పెరిగినప్పటికీ, ఇప్పటికీ పుస్తకాలు అంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టం. మనసు బాగలేనప్పుడు, ఉత్సాహం కావాలనుకున్నప్పుడు ట్వింకిల్ పుస్తకప్రపంచంలోకి వెళుతుంది. ప్రతి పుస్తకం ఒక నేస్తం అవుతుంది. తనలో కొత్త ఎనర్జీ, ఉత్సాహం వస్తాయి. ‘మహిళా రచయితలకు ఎదురయ్యే సవాలు ఏమిటి?’ అనే ప్రశ్నకు– ‘రచన గురించి ఆలోచించే క్రమంలో తనదైన ఊహాప్రపంచంలో, రకరకాల క్యారెక్టర్ల మధ్య ఉండాల్సి వస్తుంది. ఇదే సమయంలో వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఇంటిపనులు, పిల్లల బాధ్యత చూసుకోవాల్సి ఉంటుంది. రెండిటినీ సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు’ అంటుంది ట్వింకిల్. రచయిత్రిగా ట్వింకిల్ ఖన్నాకు బోలెడు పేరు వచ్చింది. ఈ దశలో ‘నాకు రాయడం వచ్చేసింది. ఏమీ నేర్చుకోనక్కర్లేదు’ అనుకుంటారు చాలామంది. అయితే ట్వింకిల్ అలా అనుకోవడం లేదు. ‘నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంటుంది. అందుకే క్రియేటివ్ రైటింగ్‌లో శిక్షణ పొందడానికి ‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లోకి స్టూడెంట్‌గా అడుగుపెట్టబోతుంది. ‘మరోసారి స్టూడెంట్‌గా మారుతున్నందుకు సంతోషంగా ఉంది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను. చిన్నప్పటిలాగే శ్రద్ధగా క్లాసులు వినబోతున్నాను. నోట్స్ రాసుకోబోతున్నాను’ అంటూ అభిమానులతో తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ట్వింకిల్. దీంతోపాటు హుషారెత్తించే, ఉత్సాహంతో జంప్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. నిజానికి ఆ వీడియోలో ట్వింకిల్‌ఖన్నా కనిపించడం లేదు. చదువు దాహంతో ఉన్న ఒక సిన్సియర్ స్టూడెంట్ కనిపిస్తుంది. ‘నేర్చుకోవాలనే తపన మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అనే మాట కాస్త గట్టిగానే వినిపిస్తుంది! -
కోలీవుడ్‌పై రెండోరోజూ కొనసాగిన ఐటీ దాడులు.. రూ. 13 కోట్లు సీజ్
సాక్షి, చెన్నై: కోలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల ఆస్తులపై ఆదాయపు పన్నుశాఖ జరిపిన దాడుల్లో రూ.13 కోట్ల కరెన్సీ పట్టుబడింది. అలాగే అనేక అక్రమ లావాదేవీలు వెలుగు చూశాయి. వివరాలు.. సూపర్‌హిట్ సినిమాలకు ఫైనా న్స్ చేసి, నిర్మించి వందలకోట్లు గడించిన తమిళ సినీరంగ ప్రముఖులు పెద్దఎత్తున ఆదాయపు పన్ను ఎగవేసినట్లు తెలిసింది. ఈ సమాచారంతో ఐటీశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 40 చోట్ల చేపట్టిన సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. చెన్నై, మదురై జిల్లాల్లోని ఫైనాన్షియర్లు అన్బుచెళియన్, జ్ఞానవేల్‌రాజా, ఎస్ఆర్ ప్రభు, నిర్మాత కలైపులి థాను సంస్థల్లో సుమారు 100 మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బడా ఫైనాన్షియర్‌గా పేరుగాంచిన అన్బుచెళియన్ గోపురం ఫిలిమ్స్ పేరున జరిపిన లావాదేవీల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అన్బుచెళియన్, అతని సోదరుడు అళగర్స్వామి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలకు అవకాశం లేకుండా అనేక చోట్ల సెన్సార్లు అమర్చి ఉండడంతో ఢిల్లీ నుంచి ముగ్గురు ప్రత్యేక అధికారులు విమానంలో హుటాహుటిన తమిళనాడుకు చేరుకున్నారు. బినామీల పేర్లతో ఇబ్బడిముబ్బడిగా ఆర్జించిన ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు. ఐదుగురు సినీ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో రూ.13 కోట్ల స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ప్రస్తుత టాలీవుడ్ కష్టాలకు కారణం డైరెక్టర్ రాజమౌళి: వర్మ -
సినీ ఇండస్ట్రీలో సమస్యలపై ఫిలిం ఛాంబర్ సమావేశం
-
నారాయణ్ దాస్ మంచి సలహాలిచ్చేవారు: నిర్మాత
‘‘నారాయణ్ దాస్‌గారు ఏ సమస్యని అయినా క్షుణ్ణంగా పరిశీలించి, ఆ సమస్య మళ్లీ రాకుండా పరిష్కరించేవారు. చాంబర్‌కు సంబంధించిన విషయాల్లో మంచి సలహాలూ సూచనలు ఇస్తూ అభివృద్ధి దిశగా ఎలా వెళ్లాలో చెబుతుండేవారు. ఆయన్నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, నిర్మాత నారాయణ్‌దాస్ నారంగ్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. చదవండి: శ్రీవిష్ణు ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో ఆయనకు సంతాప సభ జరిగింది. ‘‘చిన్న సినిమాలకు మేం ఉన్నాం అనే భరోసా కల్పించారు నారాయణ్ దాస్‌గారు. ఏ రోజూ తాను చేసిన సేవలు బయటకు చెప్పుకోలేదు. మాట ఇస్తే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అదే పద్దతి ఆయన తనయుడు సునీల్‌కు వచ్చింది’’ అని ప్రసన్నకుమార్ అన్నారు. ఇంకా దర్శకుడు వై.వి.యస్ చౌదరి, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, డీఎస్ రావు, మోహన్ వడ్లపట్ల, పద్మినీ నాగులపల్లి తదితరులు పాల్గొన్నారు. చదవండి: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్ -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్నుమూత
నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (76) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఏషియన్ మల్టీప్లెక్స్ , ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న ఆయన.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’,నాగశౌర్యతో ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’, అలాగే ధనుష్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మూవీ ఫైనాన్షియర్ గా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించిన నారాయణ దా కె నారంగ్ మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నారాయణ దాస్ నారంగ్ 1946 జులై 27న జన్మించారు. ఆయన డిస్ట్రిబూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలను విడుదల చేశారు. నిర్మాతగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియర్ గ్రూప్ అధినేత గ్లోబల్ సినిమా స్థాపకుడు, ఫైనాన్సియర్‌కూడా ఆయిన ఆయన చలనచిత్రరంగంలో అజాతశత్రువుగా పేరుగాంచారు. తెలంగాణలో పంపిణీదారునిగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలంగాణ వాణిజ్యమండలి తమ ప్రగాఢసానుభూతి తెలియజేసింది. ఈరోజు సాయంత్రం 4గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలియజేశారు. -
బిజినెస్‌మెన్‌తో ప్రముఖ నిర్మాత నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
Producer Guneet Monga Gets Engaged With Sunny Kapoor: ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది రణ్‌బీర్ కపూర్-అలియా భట్ల వివాహం. ఈ నెల 14న వీరు వివాహబంధంతో ఒక్కటి కానున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ లేడీ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. తాజాగా ఆమె ఫ్యాషన్ వ్యాపారవేత్త సన్నీ కపూర్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని గునీత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఢిల్లీలోని ఓ హెరిటేజ్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. ఈ పోస్ట్‌కు 'కొన్నిసార్లు తప్పుడు రైలు కూడా మిమ్మల్ని సరైన స్టేషన్‌కు తీసుకువెళ్తుంది. ఆ విధంగానే నా జీవిత ప్రయాణంలో నా సహచరుడు సన్నీ నాకు దొరికాడు. తన నిశ్చితార్థం రోజున అమ్మ కట్టుకున్న చీరను నేను ధరించడంతో అమ్మనాన్నల ఆశీర్వాదం పొందినట్లుగా అనిపిస్తుంది.' అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది 38 ఏళ్ల మహిళా నిర్మాత గునీత్ మోంగా. కాగా సిఖ్యా ఎంటర్టైన్మెంట్ ద్వారా గునీత్.. 'గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్' సిరీస్, 'షాహిద్', 'మసాన్', 'ది లంచ్ బాక్స్' సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యహరించింది. అలాగే గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చి విమర్శకు ప్రశంసలు పొందిన 'పాగ్లైట్'కు నిర్మాణంలో భాగం పంచుకుంది. 'పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్' అనే డాక్యుమెంటరీకి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్‌గా పనిచేసింది గునీత్. దీనికి 2019లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్‌గా అకాడమీ అవార్డును (ఆస్కార్) గెలుచుకుంది. View this post on Instagram A post shared by Guneet Monga (@guneetmonga) -
సినిమా టికెట్ ధరలపై సీఎం నిర్ణయాన్ని స్వాగతించాలి
సాక్షి, అమరావతి: పేదవారికి వినోదం భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని చిత్ర పరిశ్రమ స్వాగతించాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచి ప్రేక్షకులను ఇన్ని రోజులుగా కొందరు దోపిడీ విధానాన్ని అవలంభించారని విమర్శించారు. అటువంటి దోపిడీని అరికట్టడం కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమని తెలిపారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచిన కారణంగా అటు చిన్న సినిమాలకు, ఇటు పెద్ద సినిమాలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఖాయమని పేర్కొన్నారు. సినిమా థియేటర్లలో తినుబండారల ధరలు, పార్కింగ్ చార్జీలను నియంత్రించాలని, నాసిరకమైన తినుబండారాలు అమ్ముతున్న థియేటర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌కు కేతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
టికెట్ రేట్ల పెంపుతో చిన్న సినిమాలకు అన్యాయం: నిర్మాత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచడం వల్ల చిన్న సినిమాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రముఖ దర్శక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘టికెట్ల రేట్లు అధికంగా పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో చిన్న నిర్మాతలను నిరాశ పరిచింది. చిన్న సినిమాల కోసం ప్రత్యేకంగా ఒక షోకి అనుమతివ్వాలని కోరుతున్నా ఆ ఊసే లేదు. మల్టీప్లెక్స్‌లలో సినిమాటోగ్రఫీ యాక్ట్ 1955 ప్రకారం సీటింగ్ కెపాసిటీలో 10 శాతం కేటాయించి, టికెట్ల రేట్లను పేదవాడి కోసం కనిష్టంగా రూ.50గా నిర్ణయించాలి. కానీ అలాంటి నిబంధనలు జీవోలో లేనే లేవు. తెలంగాణలోని థియేటర్లు ఏషియన్ సునీల్, ‘దిల్’రాజు చేతుల్లోనే ఉన్నాయి. టికెట్ ధరల పెంపుతో వాళ్లిద్దరికి మాత్రమే మేలు జరుగుతోంది. చిన్న సినిమాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. పది రోజుల్లోగా చిన్న సినిమాలకు మేలు చేసే నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా’అని నట్టి కుమార్ తెలిపారు. చదవండి: ఈసారి లవర్స్ డేను ముందుగా సెలబ్రేట్ చేసుకుంటారు: తమన్ చదవండి: Manchu Lakshmi: దానికోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చిందంటున్న మంచు లక్ష్మి -
అందుకే ప్రమోషన్స్‌కు రావడం లేదట.. అగ్రనటిపై విమర్శలు
చైన్నై సినిమా: ఒక తమిళ అగ్రనటిని నిర్మాత, నటుడు కె.రాజన్ ఘాటుగా విమర్శించారు. జీఎన్ఏ ఫిలిమ్స్ పతాకంపై జయరాజ్ ఆర్. వినాయక సునీల్ కలిసి నిర్మించిన చిత్రం 'గ్రాండ్ మా'. షిజన్ లాల్ ఎస్ఎస్ దర్శకత్వం వహించిన ఇందులో సోనియ అగర్వాల్, విమలారామన్, ఛార్మిళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళం, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ శనివారం చెన్నైలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైనా కె. రాజన్ మాట్లాడుతూ.. తమిళ చిత్ర పరిశ్రమ మలయాళ చిత్ర పరిశ్రమను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను 23 రోజుల్లో పూర్తి చేసినట్లు, షూటింగ్లో ఒక్క కేరవాన్ కూడా వాడలేదని దర్శకుడు చెప్పారన్నారు. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నటీనటులందరూ విచ్చేశారని, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న ఒక నటి మాత్రం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావడం లేదన్నారు. అదేమని అడిగితే తాను వెళ్లి చిత్రం బాగుందని చెప్పి ఆ చిత్రం ఫ్లాప్ అయితే తనకు చెడ్డ పేరు వస్తుందని చెబుతోందన్నారు. రూ.5 కోట్లు తీసుకుంటున్న ఆమెకు చిత్రం ఫ్లాప్ అవుతుందని ముందుగా తెలియదా అంటూ విమర్శించారు. -
సినిమాలతో చికితిపోతున్నాం.. జీఎస్టీ తీసేయండి! సినీ నిర్మాతల మండలి విజ్ఞప్తి
Movie Producers association Request Sitharaman to abolish GST on film industry: ఫిల్మ్, వినోద పరిశ్రమను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మోషన్ పిక్చర్ నిర్మాతల మండలి (ఐఎంపీపీఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థికమంత్రికి ఒక లేఖ రాసింది. మహమ్మారి కరోనా సవాళ్లతో తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్న ఈ రంగం పునరుద్దరణకు జీఎస్టీ మినహాయింపు కీలకమని లేఖలో వివరించింది. ఐఎంపీపీఏ ప్రెసిడెంట్ టీపీ అగర్వాత్ ఈ లేఖపై సంతకం చేశారు. ప్రస్తుతం ఫిల్మ్, వినోద పరిశ్రమపై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. దాదాపు 60,000 మంది సభ్యులు ఉన్న ఈ సంఘం ఆర్థికమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రస్తుతం ఫిల్మ్, వినోద పరిశ్రమలపై విధిస్తున్న జీఎస్టీ తీవ్రంగా ఉంది. ఈ పరిశ్రమపై ఎటువంటి పెట్టుబడి పెట్టకపోగా, ఆదాయాల్లో సింహభాగం ప్రభుత్వానికి వెళుతోంది. ► ఈ పరిశ్రమలో మొత్తం పెట్టుబడిని ఇండస్ట్రీలోని వారే (నిర్మాతలే) సమకూర్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా మహమ్మారి సవాళ్లు ఇన్వెస్టర్లను తీవ్రంగా దెబ్బతీశాయి. పరిశ్రమలోకి కొత్త పెట్టుబడులు రావడానికి, ఈ రంగం పునరుద్దరణకు జీఎస్టీ, ఇతర అన్ని పన్నులను రద్దు చేయడం ఒకటే మార్గం. ►ప్రభుత్వం అనేక మల్టీప్లెక్స్‌లు, ఎగ్జిబిషన్ అవుట్లెట్లకు ‘భారీగా పన్ను మినహాయింపులు, సబ్సిడీ‘లు ఇచ్చింది. అయితే ఈ మినహాయింపులు, సబ్సిడీలు టిక్కెట్ల అమ్మకంపై ఆధారపడి ఉంటాయి. మహమ్మారి కారణంగా సినిమా హాళ్లను మూసివేసిన సందర్భంలో ఈ సబ్సిడీలు, మినహాయింపుల వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. ఫిల్మ్, వినోద రంగాలకు భారీ సబ్సిడీల ద్వారానే వేలాది మంది జీవితాల్లో వెలుగులు ఉంటాయి. ► కరోనా మహమ్మారి సవాళ్లకుతోడు కేంద్ర, రాష్ట్రాల భారీ పన్ను వసూళ్లతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ► ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రస్తుతం నెలకొని ఉంది. కనీసం ఐదు శాతం తక్కువ రేటుకు జీఎస్టీని అమలు చేయాలి. అలాగే పన్ను విధానాల్లో ఏకీకరణను ఆవిష్కరించాలి చదవండి:పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా? -
ఆన్ లైన్ మేమే అడిగాం..
-
మరో పోర్న్ యాప్ గుట్టు రట్టు..నిర్మాతపై కేసు నమోదు
సాక్షి,ముంబై: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ బీటౌన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఓవైపు విచారణ కొనసాగుతుండగానే, మరో పోర్నో రాకెట్ వెలుగులోకి వచ్చింది. అశ్లీల చిత్రాల పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారన్న కారణంతో ప్రముఖ నిర్మాత విభూ అగర్వాల్‌పై కేసు నమోదైంది. అసభ్యత, అశ్లీల కంటెంట్‌తో వీడియాలు రూపొందిస్తున్న అంశంపై ఉల్లూ యాప్ డిజిటల్ ప్రై.లి. కంపెనీ సీఈవో అయిన విభూ అగర్వాల్, కంపెనీ హెడ్ అంజలీ రైనాలపై అంబోలి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 354 కింద ఈనెల 4న కేసు ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పేర్కొన్నారు. అంధేరీలోని ఉల్లూ ఆఫీస్‌లోని స్టోర్ రూమ్‌లో 28 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని ముంబై పోలీసులు తెలిపారు. కాగా 2013లో బాత్ బాన్ గయూని సినిమా నిర్మించిన విభూ అగర్వాల్..డాన్స్ బార్ సినిమాతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లను నిర్మించారు. ఆ తర్వాత 2019లో ఉల్లూ యాప్‌ను ప్రారంభించి హిందీ, ఇంగ్లీష్,భోజ్‌పురి,తెలుగు, మరాఠీ సహా వివిధ భాషల్లో అశ్లీల కంటెంట్‌తో వీడియోలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఉల్లూ యాప్ నిర్వహణతో పాటు వీడియోల పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు విభూ అగర్వాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. Maharashtra | Police have registered a case against Vibhu Agrawal, the CEO of film production company Ullu Digital Pvt Ltd for allegedly sexually harassing a woman, under Section 354 of IPC in Mumbai. Anjali Raina, the company's country head has also been booked: Mumbai Police — ANI (@ANI) August 5, 2021 -
నిర్మాత బన్నీవాసును వేధిస్తున్న యువతి అరెస్టు
Bunny Vasu And Sunitha Boya: ప్రముఖ సినీ నిర్మాతను సోషల్ మీడియా వేదికగా మానసిక వేదనకు గురిచేస్తున్న యువతిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తనకు తాను సినీ నటిగా చెప్పుకునే సునీత బోయ గత కొంత కాలంగా మలక్‌పేట ప్రాంతంలో పుచ్చకాయలు విక్రయిస్తుంది. గతంలో ఈమెకు సినీ పరిశ్రమతో సంబంధాలు ఉండేవి. దీనిని ఆసరాగా చేసుకొని సినీ నిర్మాత బన్నివాసు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని తనను మోసం చేశాడంటూ చాలా కాలంగా ఆరోపిస్తోంది. పలుమార్లు జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి న్యూసెన్స్ చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమెపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా రెండు కేసుల్లో జైలుకు వెళ్లింది. మరో రెండు కేసుల్లో మానసిక పరిస్థితి బాగా లేదని ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి పంపించి చికిత్స నిర్వహించారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక షరా మామూలుగా నిర్మాత బన్నివాసును లక్ష్యంగా చేసుకొని గత జూన్ రెండో వారంలో బన్నివాసు కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో తీసి పోస్ట్ చేసింది. దీంతో మరోమారు ఆ కార్యాలయ మేనేజర్ అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె నిర్మాత కార్యాలయానికి వెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా మానసిక స్థితి బాగాలేనందున ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టాలీవుడ్లో మరో విషాదం.. నాగార్జున ‘సంకీర్తన’నిర్మాత మృతి
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా కారణంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మృతి చెందగా, తాజాగా అనారోగ్యంతో నిర్మాత డాక్టర్ యం.గంగయ్య రాజమండ్రిలో కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో బుధవారం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన ‘సంకీర్తన’ మూవీకి గంగయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ద్వారా గీతాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన 'సంకీర్తన' మ్యూజికల్ హిట్ గా నిలిచింది. -
ఇదే సరైన కథ అనుకున్నా: అవికా గోర్
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్, ‘ఉయ్యాల జంపాలా, లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించిన అవికా గోర్ నిర్మాతగా మారారు. ఆచార్య క్రియేషన్స్ నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లితో కలసి అవికా స్క్రీన్ క్రియేషన్స్‌పై ఓ సినిమా నిర్మించనున్నారామె. సాయి రోనక్, అవికా గోర్ జంటగా మురళీ నాగశ్రీనివాస్ గంధం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘‘కథ బాగా నచ్చింది. నిర్మాతగా నా తొలి సినిమాకు ఇదే సరైన కథ అనుకున్నాను’’ అన్నారు అవికా. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం.ఎస్. చలపతి రాజు. -
విశాల్‌కు షాక్: నష్టాన్ని అతడే భరించాలి
ముంబై: నటుడు విశాల్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘యాక్షన్’. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టైడెంట్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కించారు. గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా యాక్షన్ సినిమా వల్ల నష్టపోయిన సినీ నిర్మాతలకు హీరో విశాలే డబ్బులు చెల్లించాలని శుక్రవారం మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ జరిపింది. నష్టాలను భర్తీ చేసే విధంగా రూ. 8.29 కోట్లకు విశాల్ గ్యారెంటీ ఇవ్వాలని విశాల్‌ను న్యాయమూర్తి కోరారు. చదవండి: విశాల్ తండ్రి ఫిట్నెస్ చూస్తే షాకే! ముందుగా యాక్షన్ సినిమాను తక్కువ బడ్జెట్లో తెరకెక్కించాలని నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా కనీసం రూ.20 కోట్లు వసూలు చేయకపోతే ఆ నష్టాన్ని తను భరిస్తానని విశాల్ నిర్మాతలకు చెప్పడంతో చివరికి రూ.44 కోట్లతో యాక్షన్ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో తమిళనాడులో రూ.7.7 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో రూ. 20 కోట్లు వసూలు చేయడంలో విఫలమవడంతో నష్ట పరిహారాన్ని పూడ్చేందుకు తన తరువాత చిత్రం ‘చక్ర’ను ట్రైడెంట్ బ్యానర్‌పైనే నిర్మిస్తానని విశాల్ నిర్మాతలకు మాటిచ్చాడు. చదవండి: బీజేపీలోకి హీరో విశాల్? కానీ ప్రస్తుతం ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యాన్‌లో నిర్మించారని, చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ యాక్షన్ సినిమా నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు యాక్షన్ సినిమా వల్ల నష్టపోయిన సినీ నిర్మాతలకు హీరో విశాలే డబ్బులు చెల్లించాలని వ్యాఖ్యానించింది. అలాగే చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు అనుమతినిచ్చింది. విశాల్, శ్రద్ధా శ్రీనాథ్,రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్ ఫిర్యాదు -
నిర్మాతగా వస్తున్న కృష్ణుడు
‘వినాయకుడు’,‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాల కథానాయకుడు, ప్రముఖ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్ అని ఆయన ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో ప్రచార చిత్రాలు విడుదల చేయనున్నారు. (చదవండి : మరోసారి తమిళదర్శకుడితో మహేష్‌బాబు!) ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ ‘నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా ‘మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఉంటుంది. కొత్త కథ, కథనాలతో సినిమా తెరకెక్కించాం. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తా’అని అన్నారు. ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్ ను దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. -
కరోనాతో తెలుగు సినీ నిర్మాత మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విజృంభణ అంతకంతకూ అధికమవుతోంది. ప్రభుత్వ సడలింపులతో ఇటీవల సినిమా, సీరియల్ షూటింగ్‌లు ప్రారంభం కావడంతో పలువురు సెలబ్రిటీలు, ఇండస్ట్రీ కార్మికులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా తెలుగు సినీ నిర్మాత పోకూరి రామారావు కరోనాతో శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈతరం ఫిలింస్ అధినేత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు. కరోనా బారినపడటంతో రామారావు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఈతరం ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమాలకు రామారావు సమర్పకుడిగా వ్యహహరించేవారు. ఇక బిగ్‌బాస్-3తో పాపులర్ అయిన రవికృష్ణ, సీరియల్ నటి నవ్య స్వామి, ప్రముఖ బుల్లితెన నటులైన ప్రభాకర్, రాజశేఖర్, సాక్షి శివ ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. (చదవండి: ‘బిగ్‌బాస్-3’ ఫేం రవికృష్ణకు కరోనా..) -
గేమ్ మారిపోయింది
‘‘ఒక సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో బాగుందని టాక్ వస్తే మూడోవారం నుంచి వసూళ్లు పెరిగే రోజులు గతంలో ఉండేవి. కానీ ఈ గేమ్ మారిపోయింది. ఇప్పుడు వారాలు కాదు... త్రీ డేస్ గేమ్ అయిపోయింది. సినిమా శుక్రవారం విడుదలైతే, ఆ శుక్రవారం, శనివారం, ఆదివారం ఎంత గ్రాస్ వస్తుందో చూస్తున్నారు. ఆ తర్వాత సినిమా బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నారు’’ అని డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా అన్నారు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ వంద సినిమాల డిస్ట్రిబ్యూషన్ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఈ ప్రయాణంలోని విశేషాలను హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ నామా ఇలా చెప్పుకొచ్చారు. ► 19 ఏళ్ల వయసులో ‘హ్యారీ పోటర్’ (తెలుగులో)తో డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టాను. దాదాపు 17 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను బాగా ఆడతాయనుకున్న సినిమాలు ఆడని సందర్భాలు ఉన్నాయి. అలాగే రిలేషన్ కోసం నేను అంగీకరించిన సినిమాలు ఉన్నాయి. అయితే ఏ విషయంలోనూ తొందరపడకూడదని నా ఈ జర్నీలో నేర్చుకున్నాను. డిస్ట్రిబ్యూషన్ పరంగా థియేటర్స్ కొరతతో ఇప్పటివరకు నేను ఇబ్బంది పడింది లేదు. ► కంటెంట్ బేస్డ్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అవి హిట్ సాధిస్తే అందులో మంచి కిక్ ఉంటుంది. స్టార్ హీరోస్ సినిమాల ఓపెనింగ్స్ వసూళ్లు ఎలా ఉంటాయో అందరికీ ఎలాగూ ఓ అంచనా ఉంటుంది. ‘కుమారి 21 ఎఫ్, జార్జిరెడ్డి, 2012’ వంటి సినిమాలను మా సంస్థలో డిస్ట్రిబ్యూట్ చేశాం. ‘శ్రీమంతుడు’ వంటి ఇండస్ట్రీ కమర్షియల్ బ్లాక్బాస్టర్ను చూశాం. ► సినిమా చూశామన్న రియల్ ఫీల్ కావాలంటే థియేటర్స్‌కు వెళ్లడమే. సినిమాలకు ఇప్పుడు శాటిలైట్ మార్కెట్ ఎలా అయితే ఉంటుందో, ఓటీటీలకు కూడా అలా ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఉంటుంది. అంతే కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ థియేటర్స్‌ను ప్రభావితం చేయలేవనే అనుకుంటున్నాను. ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయితే ప్రేక్షకులు బాగానే వస్తారనే నమ్మకం ఉంది. సినిమా లవర్స్ థియేటర్స్‌కు వస్తారు. ∙కరోనా కారణంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో మార్పులేవి రావనే అనుకుంటున్నాను. రెండు, మూడు నెలల్లో షూటింగ్స్ తిరిగి ఆరంభం కావొచ్చు. నిర్మాణపరంగా దర్శకుడు సుధీర్‌వర్మతో ఓ సినిమా ఉంది. మరో రెండు,మూడు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయి. -
సీఎంను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. సమావేశానంతరం దగ్గుబాటి సురేష్ మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను సృష్టించిన విలయానికి నిరాశ్రయులైన వారిని ఆదుకోవడంలో భాగంగా సినీ పరిశ్రమ నిధులు సేకరించి వాటితో విశాఖలో బాధితులకు ఇళ్లు కట్టించినట్లు తెలిపారు. దాదాపు రూ.15 కోట్ల నిధులు వచ్చాయని, ఈ మొత్తంతో గృహ సముదాయాన్ని నిర్మించామన్నారు. ఆ ఇళ్లను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరామని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. -
ప్రముఖ నిర్మాత కన్నుమూత
-
విజయా సంస్థల అధినేత కన్నుమూత
సాక్షి, చెన్నై : ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విజయ వాహిని సంస్థల వ్యవస్థాపకుడు నాగిరెడ్డి అనంతరం విజయా ప్రొడక్షన్ పై పలు చిత్రాలను నిర్మించిన వెంకట్రామిరెడ్డి కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. శనివారం ఆయన పరిస్థితి విషమంగా మారటంతో ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతుండగా ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు బార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విజయా సంస్థల్లో 17 సంవత్సరాల అనంతరం తిరిగి సినిమా నిర్మాణాన్ని చేపట్టిన వెంకట్రామిరెడ్డి విజయా పతాకంపై బృందావనం, బైరవదీపం, కృష్ణార్జునయుద్దం చిత్రాలను నిర్మించారు. అనంతరం తమిళనంలో అజిత్ తో వీరం, విజయ్ తో భైరవ, ధనుష్ తో పడికాదవన్, విశాల్ తో తామ్రభరణి చిత్రాలను నిర్మించారు.ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ప్రతియేటా పురస్కారాలను ఆయన అందిస్తూ వచ్చారు. కాగా వెంకట్రామిరెడ్డి మృతిపై ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.సోమవారం ఉదయం నెసపాక్కంలోని విద్యుత్ దహన వాటికలో వెంకట్రామిరెడ్డికి తుదిక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. -
ప్రముఖ నిర్మాత కన్నుమూత
హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, వివాహ్, ప్రేమ్ రతన్ థన్ పాయో లాంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రాజశ్రీ ఫిలింస్ అథినేత రాజ్ కుమార్ బర్జాత్య గురువారం ఉదయం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. తండ్రి అడుగు జాడల్లో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన రాజ్ కుమార్ ఎన్నో విమర్శకుల ప్రశంసలందుకున్న ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రాజ్‌కుమార్. దాదాపు అన్ని ప్రముఖ హిందీ చానల్స్‌లోనూ రాజ్‌కుమార్ నిర్మాణంలో తెరకెక్కిన సీరియల్స్ ప్రసారమయ్యాయి. తన వారసుడిగా సూరజ్ బర్జాత్యను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాజ్‌కుమార్, తనయుడి దర్శకత్వంలో మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, వివాహ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. దాదాపు 70 సంవత్సరాలుగా సినీ రంగంతో సంబంధాలు ఉన్నా రాజ్‌కుమార్ బర్జాత్య మృతి పట్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. -
ఇళయరాజాపై హైకోర్టులో కేసు
పెరంబూరు(చెన్నై): సంగీత జ్ఞాని ఇళయరాజాకు వ్యతిరేకంగా చిత్ర నిర్మాతలు చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లేకుండా ఏ వేదికపైనా పాడరాదని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు, గత ఐదేళ్లుగా తన పాటలకు రాయల్టీని వసూలు చేస్తున్నారు. ఈ విధానానికి చెక్‌పెట్టేలా ‘పులి’ చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్, అన్బుసెల్వన్, జపజోన్స్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్ తదితర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పీటీ సెల్వకుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను సంగీతాన్ని అందించిన పాటలపై తనకే హక్కంటూ వాటిపై ఇళయరాజానే రాయల్టీ పొందడం చట్ట విరుద్ధమన్నారు. పాటల రాయల్టీలో చిత్ర నిర్మాతకు కనీసం 50 శాతం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేశామన్నారు. -
అమ్మ పోయాక నాన్న కుంగిపోయారు
‘‘నాన్న జీవితం ఎంతో ఆదర్శం. కష్టడినవాళ్లకు ప్రతిఫలం దక్కుతుందనడానికి ఆయన ఓ ఉదాహరణ’’ అన్నారు రాఘవ కుమార్తె ప్రశాంతి. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారామె. ► రాఘవగారు ఇంత సడన్ గా దూరమవుతారని ఎవరూ ఊహించలేదు? నాన్న శారీరకంగా బాగానే ఉన్నప్పటికీ అమ్మ చనిపోయాక మానసికంగా కుంగిపోయారు. మొన్న మార్చి 23న అమ్మ చనిపోయారు. అమ్మానాన్నలది 60 ఏళ్ల అనుబంధం. ‘హంసా’ (రాఘవ సతీమణి) అని పిలిచేవారు. ‘నా హంసాకి ఏమీ జరగదు. నేనున్నంత వరకూ నాతోనే ఉంటుంది’ అనే ఫీలింగ్‌తో ఉండేవారు. ► జీవితంలో చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి రాఘ వగారు. భార్యాపిల్లలను బాగా చూసుకునేవారా? నన్ను, అన్నయ్యను బాగా పెంచారు. నా వయసిప్పుడు 43. నా లైఫ్‌లో మా అమ్మ రెండు సార్లు మాత్రమే ఏడవడం చూశాను. మమ్మల్ని నాన్న అంత బాగా చూసుకున్నారు. ► 105ఏళ్ల రాఘవగారి ఆరోగ్య రహస్యం ఏంటి? అమ్మ వంటే కారణం. ► చివరి రోజుల్లో మీ నాన్నగారు ఎలా ఉండేవారు? అమ్మ పిలుస్తున్నట్లు నాన్నకు అనిపించిందని నా ఫీలింగ్. ఆయన బయటకు వెళ్లడానికి ప్రయత్నం చేసినా మేం వదల్లేదు. కాపలా కాసేవాళ్లం. అయితే మొన్నా మధ్య తెల్లవారుజాము 4.30 గంటలకు బయటకు వెళ్లారు. కింద పడిపోయారు. తలకు దెబ్బ తగిలింది. ఆస్పత్రిలో చేర్చాం. ఆ గాయంకన్నా కూడా షుగర్ లెవల్స్ కంట్రోల్ కాలేదు. ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. నాన్న లేని లోటు మాకు ఎప్పటికీ ఉంటుంది. -
జగత్’ నిర్మాత రాఘవ కన్నుమూత
ప్రముఖ నిర్మాత కోటిపల్లి రాఘవ (105) ఇక లేరు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. 1913 డిసెంబర్ 9న జన్మించిన రాఘవది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రాఘవకు ఆరుగురు తోడబుట్టినవాళ్లు. రాఘవకు చదువు అబ్బలేదు. ఇంటి నుంచి కోల్‌కతా పారిపోయారు. అక్కణ్ణుంచి మద్రాస్, హైదరాబాద్.. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు. మూకీ చిత్రాల నుంచి టాకీ వరకూ రాఘవ అన్ని మార్పులనూ చూశారు. ఆఫీస్ బాయ్‌గా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా, స్టంట్ అసిస్టెంట్‌గా, స్టంట్ మాస్టర్‌గా చేశారు. చివరికి నిర్మాతగా మారారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావు గోపాలరావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, సుమ¯Œ , భానుచందర్‌లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత రాఘవ ప్రతాప్ ఆర్ట్స్ది. ఆయన నిర్మించినవాటిలో ‘జగత్ కిలాడీలు’, ‘జగత్ జంత్రీలు’, ‘జగత్ జెట్టీలు’ సినిమాలున్నాయి. అందుకే ఆయన్ను ‘జగత్ నిర్మాత’ అనేవాళ్లు. రాఘవ పరిచయం చేసిన దాసరి, కోడి రామకృష్ణ శతాధిక చిత్రాల దర్శకులు కావడం విశేషం. నిర్మాతగా మాత్రమే కాకుండా సినిమా రంగంలో వివిధ బాధ్యతలు చేపట్టారాయన. 1975 నుంచి 1982 వరకూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఫౌండర్ మెంబర్‌గానూ, కోశాధికారిగానూ వ్యవహరించారు. 1991 నుంచి 2001 వరకూ కార్యనిర్వాహక సభ్యుడిగా చేశారు. సోలో నిర్మాతగా మారి, రాఘవ నిర్మించిన ‘తాత–మనవడు’కి నంది అవార్డు లభించింది. అలాగే, ‘సంసారం–సాగరం’ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు దక్కింది. తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు దగ్గర ఆఫీస్ బాయ్‌గా చేసిన రాఘవ తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు దక్కించుకోవడం విశేషం. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. రాఘవ భార్య హంసారాణి ఈ ఏడాది మార్చి 23న మరణించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ప్రతాప్, కుమార్తె ప్రశాంతి ఉన్నారు. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో బుధవారం రాఘవ అంత్యక్రియలు జరగనున్నాయి. రాఘవ మరణం పట్ల తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది. పలువురు సినీ రంగ ప్రముఖులు రాఘవ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
నటి బాత్రూమ్ వీడియో క్లిప్ లీక్..
సాక్షి, ముంబై: షూటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటు ఆ హీరోయిన్ను ఇబ్బందులపాలు చేసింది. సదరు నటి బాత్రూమ్ వీడియో క్లిప్‌ను స్వయంగా నిర్మాతే లీక్ చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. మూడు నెలల వేటాడిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకోగలిగారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఉపేంద్ర కుమార్ అనే నిర్మాత భోజ్‌పురీలో చిన్నా చితకా సినిమాలు, షార్ట్ఫిలింస్ తీసేవాడు. ఆ మధ్య ఓ ఔత్సాహిక హీరోయిన్ను పెట్టి షార్ట్ ఫిలిం తీశాడు. అందులో హీరోయిన్ స్నానం చేసి టవల్‌తో బయటికి వచ్చే సీన్‌ను చిత్రీకరిస్తుండగా.. పొరపాటున టవల్ జారిపోవడం, అసభ్య దృశ్యాలు కెమెరాలో రికార్డు కావడం జరిగిపోయింది. వెంటనే తేరుకున్న ఆ నటి.. పొరపాటున జరిగిన సీన్లను తొలగించాల్సిందిగా కోరింది. అందుకు సరేనన్న ఉపేంద్ర.. తర్వాత ఆ వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో లీక్ చేయటంతో వైరల్ అయ్యింది. వీడియోను గుర్తించిన స్నేహితులు..: నిర్మాత ఆ సీన్లను డిలిట్ చేసి ఉంటాడని నమ్మిన నటి షూటింగ్ తర్వాత మిన్నకుండిపోయింది. కానీ అడల్ట్ వెబ్సైట్లలో వీడియో క్లిప్ వైరల్ అవుతున్న విషయాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఆ వెంటనే జరిగిన ఘటనను వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోపే నిర్మాత ఉపేంద్ర కుమార్ బిహార్ వదిలి పారిపోయాడు. చివరకు ఆయా అడ్మిన్లతో మాట్లాడి నటి వీడియోను డిలిట్ చేయించారు సైబర్ బ్రాంచ్ పోలీసులు. మూడు నెలల గాలింపు అనంతరం ముంబైలోని బంధువుల ఇంట్లో ఉపేంద్ర జాడను కనిపెట్టి అరెస్టు చేశారు. -
ఫిల్మ్‌నగర్‌పై ‘ట్యాక్స్’ నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి సినిమా టికెట్ల రూపేణా పన్నులు వసూలు చేసి జేబులు నింపుకుంటున్న సినీ నిర్మాతలపై హైదరాబాద్ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కమిషనరేట్ దృష్టి సారించింది. కొందరు బడా నిర్మాతలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగవేస్తున్నారని తేలడంతో రంగంలోకి దిగిన జీఎస్టీ కమిషనరేట్.. వారం రోజులుగా ఓ నిర్మాతపై దృష్టిపెట్టి, పన్ను కట్టకుండా ‘రాజా’లా తిరు గుతున్న అతని వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి కేసు నమోదు చేసినట్లు సమా చారం. కొందరు బడా నిర్మాతలపైనా సెంట్ర ల్ ఎక్సైజ్ విభాగం కన్నేసినట్టు సమాచారం. 12 శాతం పన్ను కట్టాల్సిందే.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక సినిమా టికెట్లపై 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ ఎనిమిది నెలల కాలంలో జీఎస్టీ కింద కొన్ని సినీ నిర్మా ణ సంస్థలు రూపాయి కూడా పన్ను చెల్లించలేదని నగర జీఎస్టీ కమిషనరేట్ వర్గాల పరిశీలనలో తేలింది. దీంతో ఆ శాఖ అధికారులు బడా నిర్మాతలుగా పేరుగాంచిన కొందరి సంస్థలకు చెందిన ఆడిటింగ్ ఫైళ్లను పరిశీలించారు. ఇందులో ఓ నిర్మాత దాదాపు రూ.7 కోట్ల మేర పన్ను చెల్లించాల్సి ఉందని తేలింది. రూ.5 కోట్లకు మించి పన్ను ఎగవేతకు పాల్పడితే కేసు నమోదు చేసే అధికారం జీఎస్టీ కమిషనరేట్ అధికారులకు ఉన్నందున ఆయనపై కాగ్నిజబుల్ కేసు నమోదుచేశారు. దీంతో రూ.2 కోట్లు చెల్లించిన ఆ నిర్మాత మిగిలిన మొత్తం చెల్లించేందుకు గడువు కోరినట్టు సమాచారం. ఆయనకు సమయం ఇవ్వాలా? లేక కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయా లా? అనే అంశాన్ని కమిషనరేట్ అధికారులు పరిశీలిస్తున్నారని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఈ రంగంతో సంబంధం ఉన్న ఆర్టిస్టులు, మ్యూజిషియన్లు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, కలర్‌ల్యాబ్‌లు, స్టూడియోల లావాదేవీలపైనా ఓ కన్నేశామని ఆ శాఖ అధికారులంటున్నారు. నగరంలోని కొన్ని బడా రెస్టారెంట్లు, కోచింగ్ ఇనిస్టిట్యూషన్లు, ఇన్ఫ్రా కంపెనీలు కూడా పన్ను ఎగవేతకు పాల్పడు తున్నాయనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. దాదాపు 500 బడా సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసినట్టు సమాచారం. సినీ నిర్మాతపై పన్నుకు సంబంధించి కేసు నమో దు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి. -
టాలీవుడ్ నిర్మాతపై నాన్‌బెయిలబుల్ వారెంట్
సాక్షి, రాజమండ్రి: ప్రముఖ సినీ నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు కోర్టు ఆయనకు బుధవారం ఈ వారెంట్ జారీ చేసింది. ఓ ఫైనాన్షియర్‌కు రవీంద్రరెడ్డి ఇచ్చిన రూ. 50 లక్షల చెక్ బౌన్స్ అవ్వడంతో సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి రవీంద్రరెడ్డికి కోర్టు పలు సార్లు నోటీసులు పంపింది. అయితే, కోర్టు నోటీసులపై రవీంద్రరెడ్డి స్పందించకపోవడంతో ఈ రోజు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. కాగా రవీంద్ర రెడ్డి. గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, బోయపాటి డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక చిత్రాలను నిర్మించారు. -
‘బాహుబలి’పై ఐటీ దాడులు
-
‘బాహుబలి’పై ఐటీ దాడులు
హైదరాబాద్: బాహుబలి సినీ నిర్మాతలు, కార్యాలయాలపై శుక్రవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగాయి. ఆర్కా మీడియా పతాకంపై నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కార్యాలయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.2 ఉండగా, నిర్మాత శోభు యార్లగడ్డ నివాసం ఫిలింనగర్లో, మరో నిర్మాత ప్రసాద్ దేవినేని ఇల్లు జూబ్లీహిల్స్‌లో ఉంది. 25 మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి ఈ మూడు చోట్ల ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో రూ.60 కోట్ల మేర రద్దయిన పాత నోట్లను గుర్తించినట్లు సమాచారం. అలాగే సినిమాకు సంబంధించిన రశీదులు, కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నట్లు ధృవీకరించే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వివరాలను ఆర్కా మీడియా కార్యాలయ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. గంటల తరబడి ఐటీ అధికారులు ఓ బడా సినిమాకు సంబంధించిన నిర్మాతలపై దాడులు నిర్వహించడం టాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ వ్యవహారం నిర్మాతలు, దర్శకులు, హీరోల్లో చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉండగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో శోభు యార్లగడ్డ ఇక్కడ లేనట్లు సమాచారం. ప్రసాద్ దేవినేని మాత్రం మధ్యాహ్నం వరకు నగరంలో ఉండగా ఐటీ అధికారుల దాడులు తెలుసుకొని ఆయన మకాం మార్చినట్లు తెలుస్తోంది. కాగా ఎంత డబ్బును గుర్తించారు, ఏమేం పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అన్నదానిపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టుబడిన డబ్బు రూ.60 కోట్లని పైకి తెలుస్తున్నా... ఇంకా భారీ మొత్తంలోనే దొరికినట్లు సమాచారం. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కార్యాలయంలో సంచుల కొద్ది డబ్బు ఉందని గుర్తు తెలియని వ్యక్తి ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతోనే వారు ఈ దాడులు చేసినట్లు సమాచారం. -
నిర్మాత కార్యాలయంలో నగదు, ఇన్నోవా చోరీ
హైదరాబాద్: ఓ సినీ నిర్మాత కార్యాలయంలో నగదుతో పాటు ఓ ఇన్నోవా వాహనం చోరీకి గురయింది. బంజారాహిల్స్పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివీ... ఫిలింనగర్ రోడ్ నంబర్ -11లో సినీ నిర్మాత మల్కాపురం శివకుమార్‌కు చెందిన సురక్ష ఎంటర్టైన్మెంట్ సినీ కార్యాలయం ఉంది. డ్రైవర్ సురేష్‌తోపాటు శ్రీకాకుళంకు చెందిన ప్రసాద్, గుంటూరుకు చెందిన ప్రసాద్ నాయుడు అటెండర్లుగా ఏడాది కాలంగా పని చేస్తున్నారు. కాగా నిర్మాత శివకుమార్ గురువారం పని నిమిత్తం చెన్నైకి వెళ్లగా సురేష్‌తో పాటు ఆఫీస్ బాయ్‌లు ఇద్దరూ కార్యాలయంలో పడుకున్నారు. శుక్రవారం ఉదయం ఆఫీస్ మేనేజర్ రవీందర్ కార్యాలయానికి వెళ్లేసరికి లాకర్ తాళాలు విరగ్గొట్టి ఉన్నాయి. అందులో ఉండాల్సిన రూ.20 వేల నగదుతో పాటు బయట ఉన్న ఇన్నోవా కారు కనిపించలేదు. వీరి కోసం ప్రయత్నించగా సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. దీంతో రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆఫీస్‌లోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా డ్రైవర్‌తో పాటు ఆఫీస్ బాయ్‌లు చోరీకి పాల్పడిన దృశ్యాలు నమోదు అయ్యాయి. పరారీలో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
సినిమాల నిర్మాణానికి టర్కీ రాయితీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ సినీ నిర్మాణ సంస్థలను ఆకర్షించే దిశగా టర్కీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. తమ దేశంలో చిత్రీకరించే సమయంలో చేసే వ్యయాలపై దాదాపు 18% దాకా పన్ను రీఫండ్ ఇస్తున్నట్లు టర్కీ టూరిజం శాఖలో భాగమైన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రమోషన్ కోఆర్డినేటర్ ఒజ్గుర్ అయ్‌టుర్క్ తెలిపారు. అలాగే, చిత్ర నిర్మాణ సామగ్రి సత్వర కస్టమ్స్ క్లియరెన్స్, చిత్రీకరణ లొకేషన్స్ ఎంపిక మొదలైన వాటిలో తోడ్పాటునిస్తున్నట్లు వివరించారు. భారత్‌లో 8 నగరాల్లో తలపెట్టిన రోడ్ షోలలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఒజ్గుర్ ఈ అంశాలు చెప్పారు. దిల్ ధడక్‌నేదో, ఏక్ థా టైగర్ తదితర బాలీవుడ్ సినిమాలు టర్కీలో చిత్రీకరణ జరుపుకున్నాయి. మరోవైపు, గతేడాది మొత్తం 2.6 కోట్ల మంది పర్యాటకులు తమ దేశాన్ని సందర్శించగా వీరిలో 1.31 లక్షల మంది భారత టూరిస్టులు ఉన్నారని ఒజ్గుర్ తెలిపారు. దేశీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈసారి కొంత తగ్గినా.. వచ్చేసారి భారత టూరిస్టుల సంఖ్య 20 శాతం పైగా వృద్ధి చెందవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టూరిజం ద్వారా 31 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందన్నారు. -
నిర్మాత మేనల్లుడు రేప్ చేశాడు
ముంబై: బాలీవుడ్ నిర్మాత మేనల్లుడిపై రేప్ కేసు నమోదైంది. నిందితుడిపై అతని భార్య కేసు పెట్టింది. కాగా పోలీసులు వారి పేర్లను వెల్లడించలేదు. నిందితుడు తన మేనమామకు చెందిన ప్రొడక్షన్ హౌస్‌కు ఇంచార్జిగా పనిచేస్తున్నాడు. తన భర్త తన నగలన్నీ తీసుకున్నాడని, వాటిని వెనక్కు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక తనను వేధిస్తున్నాడని, తన అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా శృంగారంలో పాల్గొన్నాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెర్సోవా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసేముందు ప్రాథమిక దర్యాప్తు చేస్తామని చెప్పారు. -
ఒకే చిత్ర నిర్మాణ సంస్థలో మామాఅల్లుళ్లు
మామా అల్లుళ్లు ఒకే చిత్ర నిర్మాణ సంస్థలో నటించడం విశేషం కాక పోయినా అరుదైన విషయమే అవుతుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్‌ల విషయంలో అలాంటి అరుదైన విషయం జరగడం గమనార్హం. రజనీకాంత్ దర్శకుడు శంకర్ల కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం 2.ఓ. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్‌గా యాడ్ అవడంతో మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఈ భారీ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే నటుడు ధనుష్ హీరోగా వడచెన్నై చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. బాహుబలి చిత్రం తరహాలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నారు. విచారణై వంటి జాతీయ అవార్డును కొల్లగొట్టిన చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహించనున్న వడచెన్నై చిత్రంలో సమంత హీరోయిన్గా నటించనున్నారు. తంగమగన్ చిత్రం తరువాత ఈమె ధనుష్‌లో నటించడానికి సిద్ధమవుతున్న ఈ వడచెన్నై చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించనుందని ఆ సంస్థ నిర్వాహకుడు రాజూమహాలింగం వెల్లడించారు.ఆయన తెలుపుతూ లైకా సంస్థ ధనుష్ నటించిన తాజా చిత్రం కొడి పంపిణి హక్కుల్ని పొందిందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. అయితే ధనుష్ కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రాన్ని మేలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు, దానితో పాటు జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో ఇనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు, విజయ్‌ఆంటోని హీరోగా యమన్, కమలహాసన్ కథానాయకుడిగా ఒక చిత్రం నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. మొత్తం మీద మామ రజనీకాంత్‌లో 2, ఓ చిత్రాన్ని అల్లుడు ధనుష్‌తో వడచెన్నై చిత్రాలను లైకా సంస్థ ఏక కాలంలో నిర్మించడం అరుదైన విషయమే అవుతుంది. -
సినీ నిర్మాత గదిలో చోరీ
బంజారాహిల్స్: తన గదిలోని రూ. 5 లక్షలు నగదు, ల్యాప్‌టాప్, ఖరీదైన వాచ్ ఓ ఆటో డ్రైవర్ ఎత్తుకెళ్లాడని సినీ నిర్మాత ఒకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీ సుల కథనం ప్రకారం... మల్లాపూర్‌లో నివసించే సినీ నిర్మాత హబీబుద్దీన్ మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హబ్సీగూడలో ఆటో ఎక్కి ఫిలించాంబర్ వద్ద దిగా రు. ఆటో చార్జీ రూ.500 ఇవ్వడానికి ఫిలిం చాం బర్లోని తన గది నంబర్ 206కు ఆ ఆటో డ్రైవర్‌ను తీసుకెళ్లారు. అప్పటి కే మద్యం మత్తులో ఉన్న హబీ బుద్దీన్ ఆటో డ్రైవర్‌కు రూ. 500 ఇచ్చిన వెంట నే నిద్రపోయారు. బుధవా రం తెల్లవారుజామున లేచి చూసేసరికి సినిమా నిర్మా ణ ఖర్చుల కోసం జేబులో ఉంచుకున్న రూ. 5 లక్షల నగదుతో పాటు టేబుల్‌పై ఉంచిన రాడోవాచ్, ల్యాప్‌టాప్, ఖరీదైన సెల్‌ఫోన్ కనిపించలేదు. తాను పడుకున్న సమయంలో ఆటో డ్రైవర్ వీటిని ఎత్తుకెళ్లి ఉంటాడని హబీబుద్దీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియాంకా దత్, నాగ్ అశ్విన్‌ల వివాహ రిసెప్షన్
-
సినీ నిర్మాత అరెస్ట్
తిరువొత్తియూరు: సినిమా నిర్మాణం కోసం రూ.48 లక్షలు తీసుకుని మోసం చేసిన నిర్మాతను పోలీసులు అరెస్టు చేశారు. పుదుకోట్టై జిల్లా కె.పుదుపట్టు గ్రామానికి చెందిన సెల్వరాజ్ కుమారుడు సెంథిల్‌బాబు (31)కు చెన్నై నెర్కుండ్రంకు చెందిన గణేషన్ తాను సినీ నిర్మాతనని పరిచయం చేసుకున్నారు. సినిమా తీస్తున్నానని, అది విజయం సాధించగానే డబ్బు తిరిగి ఇస్తానని నమ్మించి రూ.48 లక్షలు తీసుకున్నాడు. నగదు తీసుకున్న గణేషన్ సినిమా విడుదల అయిన తరువాత ఒప్పందం ప్రకారం అతనికి లాభంలో వాటాను గాని అసలు కాని ఇవ్వలేదు. మోసపోయిన సెంథిల్‌బాబు చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు చేపట్టిన విచారణలో గణేషన్ మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో మంగళవారం సాయంత్రం అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచి పుళల్ జైలుకు తరలించారు. -
అవతార్ స్థాయిలో బాహుబలి
ప్రపంచ సినీ చరిత్రలో హాలీవుడ్ చిత్రం అవతార్ తరువాత అంత అద్భుత చిత్రం బాహుబలి అని దర్శకనిర్మాత లింగసామి వ్యాఖ్యానించారు.టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి తాజా అద్భుత సృష్టి బాహుబలి.తెలుగు,తమిళ భాషలలో రూపొందించిన అత్యంత భారీ చిత్రం ఇది .ప్రభాస్,రానా,అనుష్క,తమన్న,రమ్యక్రిష్ణ,సత్యరాజ్,నాజర్ తదితరులు ప్రదాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు,తమిళం హిందీ అంటూ భాషా భేదం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా విజయవిహారం చేస్తున్న నేపధ్యంలో ఈచిత్రాన్ని తమిళనాడులో విడదల చేసిన స్డూడియో గ్రీన్ సంస్థ థ్యాంక్స్ మీట్ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శక నిర్మాత లింగసామి మాట్లాడుతూ ఇది గోల్డెన్ ఇయర్ అని పేర్కోన్నారు. కారణం బాహుబలినేనన్నారు.ఈ చిత్రంలో అంత గ్రాండియర్ కనిపిస్తోందని అన్నారు.ఈ చిత్ర దర్శకుడు ఇండియాలోనే బెస్ట్ డెరైక్టర్ అని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం సినిమా పోటీనీ,అసూయను జయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.అలాంటి వాటిని అధిగమించి బాహుబలి హాలీవుడ్ చిత్రం అవతార్ స్థాయికి చేరకుందన్నారు. బాహుబలి పేరు ఇప్పుడు ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తోందని అన్నారు.సూడియోగ్రీన్ అదినేత కేఇ జ్ఞూనవేల్ రాజా మాట్లాడుతూ రాజమౌళి చేసిన మగధీర చిత్రం ఇక్కడ సరిగా పొజిషన్ కాలేదన్నారు.అ తరువాత తీసిన నాన్ఈ చిత్రం మంచి హిట్ అయ్యిందని చెప్పారు.మూడవ చిత్రం బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు.ఇది మూడు ఏళ్ళ చిత్ర టీమ్ హార్డ్ వర్క్‌కు దక్కిన ఫలితంగా పేర్కోన్నారు. తమిళంలో నటిస్తా నటుడు ప్రభాస్ మాట్లాడుతూ బాహుబలి కోసం రెండున్నర ఏళ్ల నిరంతరం శ్రమించినట్లు తెలిపారు.తాను 300 రోజులు పని చేశానని చెప్పారు.చిత్రం విడుదలైన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింపబడడం సంతోషంగా ఉందన్నారు. నటుడు సత్యరాజ్ తన కాలును తన నెత్తిపై పెట్టుకునే సన్నివేశంలో నటించడానికి చాలా టెన్షన్ పడ్డానన్నారు.తమిళంలో మంచి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ప్రభాస్ ఈ సందర్భంగా పేర్కోన్నారు.ఈ సమావేశంలో నటి రమ్యకృష్ణ,జీవీ ప్రకాశ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు. -
అవే లేకుంటే... తీపి గుర్తులు ఎక్కడివి..?
నిద్రలేని రాత్రులు ఆ నిద్రలేని రాత్రులే లేకుంటే, చెప్పుకోవడానికి తీపి గుర్తులెక్కడివి..? బహు భాషా నటిగా వరుస షూటింగ్‌లతో నిద్రలేని రాత్రులు చాలానే ఉన్నాయి. అలాంటి నిద్రలేని రాత్రులలో ముఖ్యంగా చెప్పుకోదగినవి ముచ్చటగా మూడున్నాయి. హీరోయిన్గా నాకు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ఒకటైన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో నేనే చేయాలని దర్శక నిర్మాతలు పట్టుబట్టారు. అప్పటికే వాణిశ్రీ రంగస్థలంపై 150 సార్లు విజయవంతంగా ప్రదర్శించిన క్యారక్టర్ అది. ఆ నాటకం ఆధారంగా తయారవు తున్న చిత్రం కావడంతో ఆసక్తి కలిగింది. అప్పటికే ‘ప్రయాణంలో పదనిసలు’ చిత్రానికి కేటాయించిన కాల్షీట్స్ నుంచి పదహారు రోజులు మాత్రమే సర్దగలనని చెప్పాను. సరేనన్నారు. యానాం తీరంలో గోదావరి ఒడ్డున గుడిసె సెట్లో షెడ్యూల్ మొదలైంది. అదే సమయంలో గోదావరి మరో ఒడ్డున జరుగుతున్న ‘ప్రయాణంలో పదనిసలు’ షూటింగ్లో పాల్గొనాల్సిన పరిస్థితి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు లాంచీలో తిరుగుతూ రెండు చిత్రాలకూ రాత్రింబవళ్లు పనిచేశాను. చెన్నై మహా లింగపురంలో ఇంటి నిర్మాణం పనుల్లో అమ్మ జయశ్రీ బిజీగా ఉండటంతో అమ్మమ్మ సుబ్బలక్ష్మిని తోడుగా పెట్టుకొని గడిపాను. ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’లో మాస్... ‘ప్రయాణంలో పదనిసలు’లో క్లాస్ వేషధారణ. గోదావరి రెండు తీరాల మధ్య లాంచీలో ప్రయాణించే సమయాన్నే మేకప్‌కు కేటాయించాను. లాంచీలో ఇటూ అటూ తిరుగుతూ మేకప్ మార్చుకుంటున్న సమయంలోనే నా చేతికి ఉన్న ఒక బంగారు గాజు గోదావరిలో పడి పోయింది. గోదావరి తల్లికి సమర్పించు కున్నానని సంతోషించాను. షూటింగ్ స్పాట్లో ఒక పెంకుటింట్లో బస. రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ జరిగేది. మళ్లీ ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్ కోసం వేకువన నాలుగు గంటలకే నిద్ర లేవాల్సి వచ్చేది. దాదాపు ఆ పదహారు రోజులూ నాకు నిద్రలేని రాత్రులే! ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ ఘనవిజయం ఆ కష్టాన్ని మరిపించింది. కర్ణాటకలో రామానంద్‌సాగర్ హిల్స్‌లో ‘హుళి హాలిన మేపు’ చిత్రం కోసం నాకు, ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్‌కు మధ్య డ్యూయెట్ చిత్రీకరిస్తున్నారు. ఆ షూటింగ్ పూర్తయ్యాక, మర్నాడే హైదరాబాద్‌లో హీరో కృష్ణతో ‘ముత్తైవ’ చిత్రం షూటింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. అదే సమయంలో జోరున వర్షం మొదలైంది. రాత్రివేళ ఆ వర్షంలోనే ఊటీకి, ఊటీ నుంచి కోయంబత్తూరు, కోయంబత్తూరు నుంచి చెన్నై, అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నాను. చెన్నైలో విమానం తలుపులు మూసేస్తున్న సమయంలో మైకులో అనౌన్స్ చేయించి, విమానంలోకి చేరుకోగలిగాను. హైదరాబాద్ చేరేలోగా విమానంలోనే రెడీ అయి, సకాలంలో షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నాను. మళ్లీ తెల్లారితే చెన్నై చేరుకోవాలి. నా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన కె.ఎస్.గోపాలకృష్ణన్ ‘నాయకరిన్ మగళి’ ప్రారంభోత్సవం... అందులో నేనే హీరోయిన్. పైగా నాకది నూరో చిత్రం. హైదరాబాద్‌లో షూటింగ్ ముగించుకుని, తెల్లారేసరికి చెన్నై చేరుకుని, తమిళచిత్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్లలో పాల్గొనేందుకు నిద్రలేని రాత్రులు గడిపాను. రష్యాలో 1976లో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌కు ‘సోగ్గాడు’ చిత్ర బృందమంతా హాజరయ్యాం. మొత్తం పదిరోజులకు వారం రోజులే ఉండగలనని యూనిట్ పెద్దలకు చెప్పాను. ఎన్టీఆర్ హీరోగా ‘మాదైవం’ షూటింగ్‌కు రష్యా నుంచి బయలుదేరాను. ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా రష్యా నుంచి కాబూల్, ఢిల్లీ, చెన్నైల మీదుగా హైదరాబాద్‌కు సకాలానికి చేరుకున్నాను. అలాంటి నిద్రలేని రాత్రులే ఆ రోజుల్లో నాకు క్రమశిక్షణ గల నటిగా పేరుతెచ్చాయి. - కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
అదే నిజమైతే నితిన్ లాంటి హీరో ...
ఖమ్మం : సందేశాత్మక చిత్రాలకే తాను ప్రాధన్యమిస్తానని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. సాక్షితో ఆయన ముచ్చటించారు. అవి ఆయన మాటల్లోనే.. సినిమాలో కథ, ఆ కథకు తగ్గ నటన ఉంటేనే ఆదరణ ఉం టుంది. ‘కేరింత’లో యువతకు జీవితంలో ప్రేమ ఎంత ముఖ్యమో, కెరీర్ అంతే ముఖ్యమ నే సందేశాన్ని ఇచ్చాం. ఆర్య, కొత్తబంగారులోకం, బొమ్మరిల్లు సినిమాలకు నా డైరీలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయి. పెట్టుబడి ఉంటే సరిపోదని, తగిన కథతో కూడిన సినిమాలను ఎంచుకోవడం అవసరం. తెలుగు ప్రేక్షకుల్లో నాదైన ముద్ర వేసుకున్నాను. తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో సినిమాలను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే సాయిధరమ్ తేజ హీరోగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ విడుదల చేయబోతున్నాం. సునీల్ హీరోగా మరో సినిమా చేస్తున్నాం. స్టార్ డమ్గా నిలిచిన డెరైక్టర్లు, నిర్మాతలు, హీరోలుగా నిలిచిన ఎందరో తమ కుమారులు, కుమార్తెలకు సినీరంగంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న మాటల్లో వాస్తవం లేదు. ఇందుకు లెజెండ్ డెరైక్టర్లు దాసరినారయణరావు, రాఘవేంద్రరావులు నిదర్శనం. వారు తమ కుమారులను హీరోలుగా పరిచయం చేసినా నటనలో రాణించకపోవడంతో కనుమరుగయ్యారు. ఆ ఇద్దరు ైడె రెక్టర్లు కేవలం ప్రతిభను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే నటించే సత్తా కావాలని అర్థంచేసుకోవాలి. తెలంగాణలో సినీరంగాన్ని ఎదగనివ్వడంలేదనడం అవాస్తవం. అదే నిజమైతే నితిన్ లాంటి హీరో మనకు పరిచయమై ఉండేవాడు కాదేమో. -
సినీ పరిశ్రమకు విశాఖలోనూ బంగారు భవిత
తూర్పుగానుగూడెం (రాజానగరం) : రాష్ట్రాలు రెండుగా వేరుపడినా తెలుగువారంతా ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమంతా ఒక్కటేనని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తాను నిర్మించిన ‘కేరింత’ చిత్రం ఆడియో సక్సెస్ మీట్లో భాగంగా తూర్పుగానుగూడెంలోని ఐఎస్టీఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. హైదరాబాద్ మాదిరిగానే సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు విశాఖలో కూడా ఉన్నాయన్నారు. అక్కడ కూడా సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. ‘కేరింత’ సినిమా యువతను ఆకట్టునేలా ఉంటుందన్నారు. ఇది కాలేజీ లవ్ స్టోరీల బాపతు కాదని, సత్ప్రవర్తన కలిగిన మిత్రుడుంటే సహచరుల జీవితం కూడా అదే రూటులో పయనిస్తుందన్న ప్రధానాంశంతో దీనిని తీశామని అన్నారు. తమ బ్యానర్లో ‘కేరింత’ 19వ సినిమా అన్నారు. 2016లో అల్లు అర్జున్‌తో ఒక సినిమా తీయాలనే ఆలోచన ఉందన్నారు. అలాగే ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయిధర్మతేజ హీరోగా తీస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయిందని, సునీల్ హీరోగా తీస్తున్న మరో చిత్రం షూటింగ్ దశలో ఉందన్నారు. ఈ రెండింటినీ సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. -
సినీ నిర్మాత మృతి
పెనుగొండ రూరల్ : సినీనిర్మాత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నూలి రంగయ్య (78) శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నూలి రంగయ్య నిర్మాతగా కృష్ణ హీరోగా వియ్యాల వారి కయ్యాలు, నూతనప్రసాద్ హీరోగా సమాధి కడుతున్నాం చందాలు ఇవ్వండి సినిమాలు నిర్మించారు. రంగయ్యకు ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
లాడ్జిలో పట్టుబడ్డ సినీ నిర్మాత
-
లాడ్జిలో పట్టుబడ్డ సినీ నిర్మాత
గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్లలో లాడ్జిలపై మంగళవారం పోలీసులు దాడి చేసి 17 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో సినీ నిర్మాత కొరటాల సందీప్, టీడీపీ నాయకుడు మువ్వా హరీశ్ ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే లాడ్జిలో వ్యభిచారం చేస్తున్న నలుగురు విటులు, ఇద్దరు మహిళలను పోలీసులు పట్టుకున్నారు. -
దాడికి యత్నించాడు
నిర్మాత సి.కల్యాణ్‌పై వైద్యురాలి ఫిర్యాదు పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు బంజారాహిల్స్: సినీ నిర్మాత సి.కల్యాణ్ తనను అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు తనపై చేసి దాడికి యత్నించాడని ఓ వైద్యురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సి.కల్యాణ్‌పై ఐపీసీ సెక్షన్ 354 (సి), 506, 509ల కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐ గురుస్వామి, బాధితురాలి కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లోని విమల్ అపార్ట్మెంట్స్, ప్లాట్ నెం. ఎస్-4లో డాక్టర్ తూపల్లి కవిత నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్స్ ప్లాట్ నంబర్ 41లో నిర్మాత సి.కల్యాణ్ ఉంటున్నారు. డాక్టర్ కవిత ఉంటున్న ఇంటిపై కొద్ది రోజుల క్రితం కల్యాణ్ కన్ను పడింది. ఆ ఫ్లాట్‌ను తాను చెప్పిన ధరకు విక్రయించి వెళ్లిపోవాలని మధ్యవర్తులతో హెచ్చరికలు జారీ చేయగా ఆమె పట్టించుకోలేదు. ఈ అపార్ట్మెంట్స్లోని కొంత భాగం మెట్రో రైలు పనుల్లో భాగంగా రోడ్డు విస్తరణలో పోతుండటంతో జీహెచ్ఎంసీ రూ.కోటిన్నర నష్టపరిహారం ప్రకటించింది. దీంతో ఆ డబ్బు కాజేయాలని కల్యాణ్ పథకం వేశాడు. తాను అపార్ట్మెంట్ అధ్యక్షుడినంటూ బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంక్ అకౌంట్ తెరిచి పరిహారం చెక్కు తనకు ఇవ్వాలని జీహెచ్ఎంసీకి లేఖ రాశారు. అయితే ఈ మొత్తాన్ని అపార్ట్మెంట్లోని అందరికీ సమానంగా పంపిణీ చేయాలని డాక్టర్ కవిత జీహెచ్ఎంసీకి లేఖ రాశారు. దీన్ని జీర్ణించుకోలేని కల్యాణ్ ఆమెపై కక్ష సాధింపు మొదలెట్టారు. సోమవారం సాయంత్రం అపార్ట్మెంట్ అసోసియేషన్ సమావేశం జరుగుతుండగా అక్కడికి వెళ్తున్న కవితను అడ్డగించాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కిందపడేసి కొట్టి లైంగికదాడికి యత్నించాడు. ఇక్కడి నుంచి తక్షణం వెళ్లకపోతే తన అసలు రూపాన్ని చూడాల్సి ఉంటుందని, 4 వేల మంది జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఇంటి ముందు ధర్నా చేయిస్తానని బెదిరించాడు. ఇన్ని రోజులూ చూసిన కల్యాణ్ వేరు.. రేపటి నుంచి చూసే కల్యాణ్ వేరని, హత్య చేస్తానని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్యాణ్‌ను నుంచి తనకు ప్రాణహాని ఉందని, అతడిని తక్షణం అరెస్టు చేయాలని మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చి డిమాండ్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కల్యాణ్ కోసం గాలిస్తున్నారు. -
ఆ వేంకటేశుడే రప్పించాడు
సుభాష్‌నగర్ : గ్రామంతో దాదాపుగా సంబంధాలను తెంచుకున్న తనను ఆ వేంకటేశ్వర స్వామే ఆలయ నిర్మాణానికి పురికొల్పి, తిరిగి గ్రామానికి రప్పించాడని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుల ప్రోత్సాహంతో, గ్రామ ప్రజల సహకారంతో ఆలయూన్ని నిర్మించామన్నారు. శనివారం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల ఆలయ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భగవంతుడికి అందరూ సమానులేనని, ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ కాదని పేర్కొన్నారు. స్వామి దర్శనార్థం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం నర్సింగ్‌పల్లిలో ఆలయూన్ని నిర్మించామన్నారు. గతేడాది మార్చి 12వ తేదీన ఆలయంలో వేంక టేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించామన్నారు. ఏడాది పూర్తవుతున్నందున బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారని, నాలుగు జంటలకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన దలచినవారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆలయం వద్ద ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరి సహకారంతో త్వరలో వాకింగ్ ట్రాక్‌తోపాటు వృద్ధులకోసం కుటీరం నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అంతిరెడ్డి రాజిరెడ్డి, నాగేశ్వరరావు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
నిర్మాతగా పవన్ కల్యాణ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తనున్నారు. తన పెద్ద అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రాంచరణ్ హీరోగా త్వరలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. యువ నటులు, యువ దర్శకులలోని ప్రతిభను వెలికి తీసేందుకు చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించాలని పవన్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అందులోభాగంగా పవన్ నిర్మాతగా మారబోతున్నారు. అందుకోసం ఇప్పటికే సొంత బ్యానర్ ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే వరుసగా ప్రాంతీయ భాష చిత్రాలు చేసేందుకు పవన్ కల్యాణ్ సమాయత్తమవుతున్నట్లు సమాచారం. పవన్ దర్శకుడిగా ఇప్పటికే జానీ చిత్రాన్ని నిర్మాతగా పవన్ కల్యాణ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. -
నిర్మాతగా మాధురీ దీక్షిత్..
దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరను వెలిగించిన మాధురీ దీక్షిత్ త్వరలోనే సినీ నిర్మాతగా మారనుంది. హీరోయిన్గా తెరమరుగైన తర్వాత ఆన్లైన్ డ్యాన్స్ అకాడమీ నిర్వహిస్తున్న మాధురీ తాజాగా సినీ నిర్మాణంపై దృష్టి సారించింది. త్వరలోనే సినీ నిర్మాణం ప్రారంభిస్తానని మీడియాకు వెల్లడించిన ఆమె, ఎలాంటి సినిమాలు నిర్మించనున్నారనే ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు. ప్రస్తుతం ఆమో స్క్రిప్టుల పరిశీలనలో బిజీబిజీగా గడుపుతోందని సమాచారం. -
అత్యాచారం చేశాడు
సినీ నిర్మాతపై ముంబై యువతి ఆరోపణ బళ్లారి టౌన్ : సినీ నిర్మాత, రియల్ ఎస్టేట్ యజమాని గోవర్ధనమూర్తి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ముంబైకి చెందిన 20 ఏళ్ల యువతి ఆరోపించారు. బళ్లారి నగరంలో మానవ హక్కుల అసోసియేషన్ కార్యాలయంలో ఇంటర్నేషనల్ మానవ హక్కుల ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ వీ మమత సమక్షంలో విలేకరుల సమావేశంలో ఆమె బుధవారం మాట్లాడారు. ‘ నేను గతంలో ముంబైలోని డెంటల్ క్లీనిక్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసేదాన్ని. అక్కడి జీతం చాలక పోవడంతో స్నేహితుల సహాయంతో బెంగళూరులోని రిచ్మండ్ సర్కిల్లో థోఫాజ్ బార్లో బార్ గర్ల్‌గా చేరాను. ఆ హోటల్‌కు వస్తున్న సినీ నిర్మాత గోవర్ధమూర్తి నన్ను గన్‌తో బెదిరించి నెలలో నాలుగు సార్లు అత్యాచారం చేశాడు. ఆయనకు బార్లో పని చేసే సురేష్, రితేజ్ అనే వ్యక్తులు సహకరించారు. ఈనెల 2వ తేదీన కూడా నాపై అత్యాచారం చేశాడు. భరించలేక ఈనెల 5న మానవ హక్కుల ఆర్గసైజేషన్ అధ్యక్షురాలు మమతకు ఫోన్ చేసి సమస్య చెప్పుకున్నాను. నాకు జరిగిన అన్యాయం బారుల్లో మరెవరికి జరగరాదని మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. నాపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించండి’ అని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వెళ్లి ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో మానవహక్కుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యదూరం : గోవర్ధనమూర్తి ఈ విషయంపై సినీ నిర్మాత గోవర్ధనమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణలు సత్యదూరం. నేను ఆ బారుకు స్నేహితులతో కలిసి వెళ్లే వాడిని.. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలీదు. నా పేరు ప్రతిష్టను దెబ్బతీయాలనే ఎవరో కుట్ర పన్నారు. దీనిపై కోర్టుకు వెళ్తా’ అని తెలిపారు. -
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై చీటింగ్ కేసు
హైదరాబాద్: సినిమా హక్కుల విషయమై సినీ నిర్మాత బండ్ల గణేశ్ తనను మోసం చేశారని ఓ ఫైనాన్సియర్ సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గణేశ్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ పి.మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గబ్బర్‌సింగ్ సినిమా ఆంధ్రా ఏరియా హక్కుల కోసం గుంటూరుకు చెందిన ఫైనాన్సియర్ ధర్మచరణ్ తులసీ 2011లో రూ.80 లక్షలను ఆ సినిమా నిర్మాత గణేశ్‌కు చెల్లించాడు. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం సినిమా హక్కులు ధర్మచరణ్‌కు కాకుండా మరొకరికి గణేశ్ విక్రయించి వారి వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించి సినిమా రైట్స్‌ను మరొకరికి విక్రయించినందున తన డబ్బులు తిరిగివ్వాలని బాధిత ఫైనాన్సియర్ ఎన్నిసార్లు అడిగినా గణేశ్ స్పందించలేదు. పైగా ఫైనాన్సియర్‌ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ మేరకు పోలీసులు గణేశ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 406, 506 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న గణేశ్ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ బృందం గాలింపు చేపట్టింది. -
నిర్మాత దర్శకుడినెప్పుడూ మెచ్చుకోడు
చిత్ర నిర్మాత ఎప్పుడూ మెచ్చుకోరని యువ దర్శకుడు జయం రాజా వ్యాఖ్యానించారు. టాలీవుడ్ యువ నటుడు నిఖిల్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేస్తున్న చిత్రం కార్తికేయన్. కలర్ స్వాతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఎం.చందు దర్శకత్వం వహించగా శేఖర్ చంద్ర సంగీత బాణీలందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు జయం రాజా మాట్లాడుతూ నిర్మాత తండ్రి అయినా ఆ చిత్ర దర్శకుడిని మెచ్చుకునే ప్రశ్నే ఉండదన్నారు. చిత్ర బడ్జెట్ పెంచావ్, నిర్మాణంలో జాప్యం అయ్యింది వంటి విమర్శలు దర్శకుడు భరించాల్సిందేనని చెప్పారు. అలాంటిది ఈ కార్తికేయన్ చిత్ర నిర్మాత, దర్శకుడిని అభినందించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. చిత్ర హీరో నిఖిల్ తెలుగులో పది చిత్రాలకు పైగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారని, హీరోయిన్ స్వాతి తమిళ పరిశ్రమకు సుపరిచితురాలని పేర్కొన్నారు. తన తొలి చిత్రం జయంలో కార్తికేయన్ వేలాయుధం ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఇప్పుడీ చిత్రమే కార్తికేయన్ పేరుతో రూపొందుతోందని మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు జయంరాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్, నటి తులసి, స్వాతి, నిఖిల్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. -
విశాఖ లేకపోతే చిత్ర పరిశ్రమ చెన్నైకి చెక్కేసేది!
సినీ నిర్మాత సురేష్ అరకులో షూటింగులకు అనుకూలం లొకేషన్లకు కొదవలేదు.. వనరులకూ ఢోకా లేదు వెంకటేష్ చిత్రం చిత్రీకరణ అరకు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన తర్వాత చిత్ర పరిశ్రమ విశాఖ వైపు చూస్తోందని, 90 శాతం యూనిట్ విశాఖ తరలి వస్తోందని సినీ నిర్మాత సురేష్ చెప్పారు. విశాఖ లేకపోతే చిత్ర పరిశ్రమ మళ్లీ చెన్నై చెక్కేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అరకు పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌లు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై కెమెరామన్ బి.గోపాల్‌రెడ్డి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మీనా, నదియా ప్రధానపాత్రల్లో ‘దృశ్యం’ అనే చిత్రాన్ని అరకులోయలో తెరకెక్కిస్తున్నారు. విశాఖ-అరకు ప్రధాన రహదారి కొత్తభల్లుగుడ, అరకులోయ రహదారికిరువైపులా సిల్వర్‌ఓక్ చెట్ల మధ్య రెండు రోజులుగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సురేష్ విలేకరులతో మాట్లాడారు. మళయాళంలో విజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నామని చెప్పారు. కథ కొత్తగా ఉందని, ఈ చిత్రంలో రెండు పాటలుంటాయని, ఫైట్స్ ఉండవన్నారు. విశాఖ, విజయనగరంలో కూడా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తామని వివరించారు. ఈ నెలాఖరు నాటికి షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అరకులోయ పరిసరాల్లో చెట్లు విపరీతంగా ఉండేవని, ప్రస్తుతం చెట్లు కొట్టేయడంతో బోడి కొండలు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ మొక్కలు నాటాలని, చెట్లను రక్షించాలని కోరారు. ఈ చిత్రంలో నరేష్, చలపతిరావు, రవికాల్, సప్తగిరి, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారన్నారు. విశాఖకు చెందిన బిల్డర్ అప్పారావు బాయ్స్ (బౌన్సర్లు) షూటింగ్లో పాల్గొన్నారు. -
చిత్ర విశాఖ
విస్తరిస్తున్న శిక్షణ తరగతులు నటన, దర్శకత్వ శాఖల్లో నిపుణత కోరుతున్న ఔత్సాహికులు ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: లఘు చిత్రాల హవా.. టీవీ సీరియల్స్ జోరు.. సినీ నిర్మాణ కేంద్రంగా విశాఖ ఎదుగుతున్న తీరు.. ఇవీ ప్రస్తుతం ఔత్సాహిక కళాకారులను ఊరిస్తున్న అంశాలు. ఇటీవల కాలంలో నగరంలో శిక్షణ తరగతులు విరివిగా జరుగుతున్నాయి. తమలో దాగివున్న కళాకారుడిని బయటి ప్రపంచానికి పరిచయం చెయ్యాలని, సృజనాత్మకతను ప్రదర్శించాలని, వెండి తెరపై వెలిగిపోవాలని ఎందరో తపన పడుతున్నారు. ఈ కలలు నెరవేరాలంటే ఒక్క చాన్స్ కావాలి. ఇందుకోసం ఎంతో నిపుణత, పరిణతి సాధించాలి. బంగారానికి మెరుగుపెట్టినట్టు వీరి ప్రతిభకు శిక్షణ కూడా తోడైతే మరింతగా రాణించడానికి అవకాశం ఉంటుంది. సహజసిద్ధమైన ప్రకృతి సోయగాలు, ఎత్తయిన పచ్చని కొండలు, లోయలు, అందాలొలికే అనంత సాగరం.. విశాఖ జిల్లాకు దేవుడిచ్చిన వరాలు. చూడచక్కని లొకేషన్లతో అనేక ప్రాంతాలు చిత్ర నిర్మాణానికి అనువుగా ఉంటాయి. చిత్ర పరిశ్రమకు రాజధానిగా ఎదుగుతున్న ఈ సుందర నగరంపై వర్ధమాన నటీనటుల ఆశలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో దర్శకత్వం, నటన తదితర అంశాలలో శిక్షణ అందించే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. నగరం నుంచే కాకుండా గిరిజన ప్రాంతమైన పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలవాసులు సైతం ఇక్కడ జరుగుతున్న శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. కాలానుగుణంగా కోర్సులు ప్రారంభిస్తాం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డిజిటల్ ఫిల్మ్ మేకింగ్‌పై సర్టిఫికేట్ కోర్సును అందిస్తున్నాము. త్వరలో దర్శకత్వం, నటన అంశాలపై కూడా కోర్సులను ప్రారంభించే ఆలోచన ఉంది. - ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ఉప కులపతి ప్రొడక్షన్ రంగంలో అడుగుపెడతా.. భవిష్యత్తులో ప్రొడక్షన్ రంగంలో రాణిం చాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఏయూలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. అవగాహన కోసం శిక్షణ శిబిరానికి హాజరయ్యాను. ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. - ఎం.చేతన్ వారధిగా నిలిచే సంస్థలు కావాలి విశాఖ కేంద్రంగా నిపుణులను తీర్చిదిద్దే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సినీ అవకాశాల గురించి ఆర్టిస్టులకు, స్థానిక కళాకారుల ప్రతిభ గురించి చిత్ర పరిశ్రమకు సమాచారం అందిస్తూ వారధిగా నిలిచే సంస్థలు ఏర్పాటు కావాలి. - మీగడ శివశ్రీ, దర్శకుడు అవగాహన మాత్రమే అందించగలుగుతున్నాం.. భాగ్యనగరంలో మూడు సంవత్సరాల శిక్షణలో చెప్పే విషయాలను ఇలాంటి శిబిరాల్లో కేవలం ఐదారు రోజులలో వివరించాల్సి వస్తోం ది. దీంతో వీరికి స్థూలంగా అవగాహన మాత్రమే అందించగలుగుతున్నాం. ఇది పునాదిగా ప్రతిభను మెరుగుపరచుకోవాలి. - నటరాజమూర్తి, ప్రిన్సిపాల్, మధు ఫిలిం ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ నటన, దర్శకత్వ శాఖల్లో శిక్షణ ఈ శిబిరాల్లో పాల్గొంటున్న ఔత్సాహికులు నటన, దర్శకత్వ శాఖల్లో శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగడానికి, లోతైన అధ్యయనానికి శిక్షణ సంస్థలు శాస్వత ప్రాతిపదికన ఏర్పాటైతే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రముఖ శిక్షకుడు సత్యానంద్ ఒక్కరే చాలాకాలంగా విశాఖలో నటులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా పూర్తిస్థాయిలో శిక్షణ అందించే కేంద్రాలు నగరంలో ఏర్పడలేదు. మినీ థియేటర్ నిర్మించాలి ప్రభుత్వం తరపున లఘు చిత్రాలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. మినీ థియేటర్ నిర్మించి, నగరంలో చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించాలి. తద్వారా మంచి చిత్రాలకు ఆదరణ లభిస్తుంది. - ఆచార్య పి.బాబీవర్ధన్, ఏయూ జర్నలిజం విభాగం -
సినీ నిర్మాత కోనేరు కిరణ్ అరెస్ట్
హైదరాబాద్, న్యూస్‌లైన్: బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న సినీ నిర్మాత కోనేరు కిరణ్‌కుమార్‌ను కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. కిరణ్‌కుమార్ హీరో నాగచైతన్యతో బెజవాడ సినిమా నిర్మించాడు. ఆ సినిమా నిర్మాణ ఖర్చుల కోసం ప్రసాద్ ల్యాబ్స్ ఫైనాన్స్ నుంచి రూ.కోటి రుణం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి వాయిదాలు చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో ప్రసాద్‌ల్యాబ్స్ ఫైనాన్షియర్లు కోర్టును ఆశ్రయించారు. గతంలో కోర్టు రెండుసార్లు కిరణ్‌కు నోటీసులు జారీచేసి కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాత తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో శుక్రవారం కోర్టు కిరణ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌తో పోలీసులకు ఉత్తర్వులు జారీచేసింది. మణికొండలోని కిరణ్ ఇంటి ముందు నిఘావేసిన పోలీసులు.. శనివారం అతనిని అరెస్ట్‌చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం అపోలో ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కిరణ్ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
కేఆర్ ప్యానల్ విజయకేతనం
తమిళ సినిమా, న్యూస్‌లైన్: తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో ముక్కోణపు పోరులో కేఆర్ ప్యానల్ విజయకేతనం ఎగురవేసింది. ఈ ప్యానల్ కొంతకాలంగా గతంలో బాధ్యతలు చేపట్టిన వర్గంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ విషయమై న్యాయం కోరుతూ పోలీసులు, న్యాయస్థానం వరకు వెళ్లింది. ఇప్పుడు గెలుపొందడంతో న్యాయం గెలిచిందనే సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమిళ నిర్మాతల మండలి ఎన్నికలు శనివారం ఉత్కంఠభరిత వాతావరణంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగాయి. మూడు ప్యానళ్లు పోటీపడిన ఈ ఎన్నికలను విశ్రాంతి న్యాయమూర్తులు ఎస్.జగదీశన్, కె.వెంకట్రామన్ సమక్షంలో నిర్వహించారు. గుర్తింపు కార్డులు ఉన్న సభ్యులనే ఓటింగ్‌కు అనుమతించారు. ఈ ఎన్నికల్లో కేఆర్, కలైపులి ఎస్.థాను, శివశక్తి పాండియన్ ప్యానళ్లు పోటీ పడ్డాయి. స్థానిక నందనంలోని వైఎంసీఈ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల కేంద్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉదయం 10.30 గంటలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కమలహాసన్, నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, రాధారవి, మన్సూర్ అలీఖా న్, శశికుమార్, ఎస్వీ.శేఖర్, నటి కుష్భు, దేవయాని, నిరోషా తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కేఆర్, కలై పులి ఎస్.థాను, ఉపాధ్యక్ష బరిలో ఉన్న టీజీ.త్యాగరాజన్, సుభాష్ చంద్రబోస్, పవిత్రన్, కదిరేశన్, పట్టియల్ శేఖర్, కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న శివశక్తి పాండియన్, టి.శివ, కేఈ.జ్ఞానవేల్‌రాజా, సంగిలి మురుగన్, పీఎల్ తేనప్పన్ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అదేవిధంగా ఎస్ఏ.చంద్రశేఖరన్, పుష్పా కందస్వామి, ఆర్కే.సెల్వమణి, ఏఎల్ అళగప్పన్, తంగర్‌బచ్చన్, మనోజ్‌కుమార్, కోవై తంబి, ఖాజామైద్దీన్, చిత్రా లక్ష్మి, హెచ్.మురళి, జాగువర్ తంగం, ఆర్వీ.ఉదయ్‌కుమార్, నాజర్, పీసీ అన్భళగన్, ఎ.శేఖర్, కరుణాస్, ఎడిటర్ మోహన్, జీఆర్ కరుణాకరరాజన్, అగస్థ్యన్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు ప్రచార దుస్తులు ధరించి రావడం సభ్యుల మధ్య గొడవకు దారి తీసింది. ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు) మొరాయించడంతో ఓటింగ్ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. చెదురుమొదురు ఘర్షణలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.