![Malayalam film producer and distributor PKR Pillai Passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/17/pkr-pillai.jpg.webp?itok=lOce0c_S)
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నిర్మాత పీకేఆర్ పిళ్లై(92) కన్నుమూశారు. మాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన అనారోగ్యంతో సమస్యలతో త్రిసూర్ జిల్లా మందన్‌చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మోహన్ లాల్‌తో ఎక్కువగా సినిమాలు నిర్మించారు.
(ఇది చదవండి: నాకు పునర్జన్మ నిచ్చింది ఆమెనే: విజయ్ ఆంటోని)
షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానర్‌పై అమృతం గమ్య (1987), చిత్రం (1988), వందనం (1989), కిజక్కునరుమ్ పక్షి (1991, అహం (1992)తో సహా మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించారు. పిళ్లై చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా చిత్రమ్. దీనికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. మోహన్‌లాల్ నటించారు. ఈ సినిమా రెండు థియేటర్లలో 300 రోజులకు పైగా ఆడిన ఘనత సాధించింది. ఈ చిత్రం తరువాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో వరుసగా అల్లుడుగారు, ప్యార్ హువా చోరీ చోరీ, రాయరు బండారు మావన మానేగే, ఎంగిరుంధో వందన్‌గా రీమేక్ చేశారు.
(ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్‌తేజ్ ఎంగేజ్‌మెంట్?)
పన్నెండు సంవత్సరాల క్రితం ముంబైలోని తన వ్యాపారాన్ని వదిలేసి కేరళాకు వచ్చారు పిళ్లై. 1984లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. సొంత చిత్ర నిర్మాణ సంస్థ షిర్డీ సాయి క్రియేషన్స్‌పై వేప్రాళం అనే చిత్రాన్ని నిర్మించాడు. మొదట ఎర్నాకులం లో ఉన్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు త్రిస్సూర్ లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రమ్య, పిల్లలు రాజేష్, ప్రీతి, సోను ఉన్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment