మలయాళంలో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌.. ఎల్‌ ఎంపురాన్‌ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే? | Mohanlal's L2: Empuraan Movie First Day Box Office Collection | Sakshi
Sakshi News home page

L2: Empuraan Movie: తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మోహన్‌లాల్‌ సినిమా.. ఎంతంటే?

Published Fri, Mar 28 2025 12:30 PM | Last Updated on Fri, Mar 28 2025 12:45 PM

Mohanlal's L2: Empuraan Movie First Day Box Office Collection

మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ (Lucifer Movie) ఒకటి. 2019లో వచ్చిన ఈ మలయాళ చిత్రం ఘనవిజయం సాధించింది. రూ.30 కోట్లతో తీస్తే రూ.125 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘L2: ఎంపురాన్‌’ (L2: Empuraan Movie) తెరకెక్కించారు. తొలి భాగాన్ని రూపొందించిన పృథ్వీరాజ్‌ ఈ సినిమాకు సైతం దర్శకుడిగా పని చేశాడు. అలాగే కథలోనూ కీలక పాత్రలో కనిపించాడు. లూసిఫర్‌ అంటే దైవదూత అని అర్థం కాగా ఎంపురాన్‌ అంటే రాజు కంటే ఎక్కువ.. దేవుడి కంటే తక్కువ అని అర్థం.

తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే?
L2: ఎంపురాన్‌ మూవీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వస్తున్నప్పటికీ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ అదిరిపోయాయి. కేవలం భారత్‌లోనే రూ.22 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టింది. మలయాళంలో ఈ రేంజ్‌ వసూళ్లు అందుకున్న తొలి చిత్రంగా ఎంపురాన్‌ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు 'ద గోట్‌ లైఫ్‌' పేరిట ఉంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హీరోగా నటించిన ఈ సినిమా దేశంలో రూ.8.95 కోట్ల (నెట్‌) వసూలు చేసింది. ఇకపోతే ఎంపురాన్‌ సినిమా విదేశాల్లోనూ అదరగొడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ భారీ ఓపెనింగ్స్‌ వచ్చినట్లు భోగట్టా!

ఆ రికార్డు బ్రేక్‌ చేస్తుందా?
2019 వరకు మలయాళంలో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలే లేవు. లూసిఫర్‌ సినిమా ఈ సంకెళ్లను తెంచుకుని రూ.100 కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మంజుమ్మల్‌ బాయ్స్‌ రూ.200 కోట్లు రాబట్టిన ఏకైక మలయాళ మూవీగా రికార్డుకెక్కింది. మరి ఈ రికార్డును ఎంపురాన్‌ బ్రేక్‌ చేస్తుందేమో చూడాలి!

 

 

చదవండి: Robinhood: ‘రాబిన్‌హుడ్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement