
అల్లు అర్జున్, సమంత మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై జంటగా కనిపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్, సమంత తొలిసారిగా జోడీ కట్టారు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలోని ప్రత్యేక గీతం ‘ఊ అంటావా...’లో అల్లు అర్జున్, సమంత కలిసి కొన్ని డ్యాన్స్ స్టెప్పులేశారు. తాజాగా ఈ జోడీ మరోసారి రిపీట్ కానుందట.
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు మెయిన్ హీరోయిన్స్, మరో ముగ్గురు అమ్మాయిలు కీలక పాత్రల్లో నటించనున్నారట.
ఈ మెయిన్ హీరోయిన్స్‌లోని ఒక రోల్ కోసం సమంతను తీసుకోవాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. మరి... అల్లు అర్జున్, సమంతల జోడీ మరోసారి స్క్రీన్‌పై రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘తేరీ’ (తెలుగులో ‘పోలీసోడు’), ‘మెర్సెల్’ (అదిరింది) చిత్రాల్లో సమంత ఓ హీరోయిన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.